
రాంచీ : జార్ఖండ్‌లో అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత, అతని భార్య హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. ధన్‌బాద్‌కు చెందిన జార్ఖండ్ ముక్తీమోర్చా (జేఎంఎం) నేత శంకర్ రావాణీ, అతని భార్య బాలికదేవీని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆదివారం తెల్లవారుజామున వారి ఇంటి పెద్ద శబ్ధాలు రావడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమీప వ్యక్తులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న స్థానిక ఎస్పీ ఎస్‌క సిన్హా.. పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఓ తుఫాకితో పాటు పదునైనా కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
రాజకీయ, లేదా వ్యాపార ప్రత్యర్థులే ఈ హత్యలకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేత హత్యపై స్థానిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసకోకుండా శంకర్ నివాసం వద్ద పెద్ద ఎత్తున బంధోబస్తును ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ధన్‌బాద్ పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment