Two Doctors And Several Died In Jharkhand Dhanbad Nursing Home Fire Accident - Sakshi
Sakshi News home page

Fire Accident: ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. డాక్టర్ దంపతులు సహా ఐదుగురు మృతి

Published Sat, Jan 28 2023 10:47 AM | Last Updated on Sat, Jan 28 2023 11:42 AM

Jharkhand Dhanbad nursing home Fire Accident Several Dead - Sakshi

రాంచీ: జార్ఖండ్ ధన్‌బాద్‌లోని ఓ ప్రైవేటు నర్సింగ్‌ హోంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం 2 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నర్సింగ్ హోం యజమాని డా.వికాస్ హజ్రా, అతని భార్య డా.ప్రేమ హజ్రా ఈ ప్రమాదంలో మరణించారు. వీరి బంధువు సోహన్ కుమారితో పాటు పనిమనిషి తారా దేవి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఐదో వ్యక్తిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఈ డాక్టర్‌ దంపతులు ఇంట్లోనే నర్సింగ్ హోం నడుపుతున్నారు. అయితే స్టోర్ రూంలో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో దట్టమైన పొగలు కమ్ముకుని ఊపిరాడక ఐదుగురూ చనిపోయినట్లు తెలుస్తోంది. మరొకరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
చదవండి: బొగ్గు గనిలో దొంగతనానికి వెళ్లిన నలుగురు.. ఊపిరాడక..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement