nursing home
-
ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. డాక్టర్ దంపతులు సహా ఐదుగురు మృతి
ధన్‌బాద్: జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్‌లోని ఓ నర్సింగ్ హోంలో శనివారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో డాక్టర్ దంపతులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ధన్‌బాద్‌లోని బ్యాంక్ మోర్ ఏరియాలో డాక్టర్ వికాస్ హజ్రాకు చెందిన నర్సింగ్ హోం ఉంది. ఆయన కుటుంబంతోపాటు అందులోనే నివాసం ఉంటారు. ఆస్పత్రి స్టోర్‌రూంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక మంటలు మొదలయ్యాయి. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న డాక్టర్ వికాస్ హజ్రా(64), భార్య డాక్టర్ ప్రేమ హజ్రా(58), బంధువు సోహన్ కుమారి, పనిమనిషి తారాదేవి దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక చనిపోయారు. మృతి చెందిన ఐదో వ్యక్తిని గుర్తించాల్సి ఉందని అధికారులు చెప్పారు. ఘటనలో డాక్టర్ దంపతుల పెంపుడు కుక్క కూడా చనిపోయింది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. డాక్టర్ దంపతులు సహా ఐదుగురు మృతి
రాంచీ: జార్ఖండ్ ధన్‌బాద్‌లోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం 2 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నర్సింగ్ హోం యజమాని డా.వికాస్ హజ్రా, అతని భార్య డా.ప్రేమ హజ్రా ఈ ప్రమాదంలో మరణించారు. వీరి బంధువు సోహన్ కుమారితో పాటు పనిమనిషి తారా దేవి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఐదో వ్యక్తిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ డాక్టర్ దంపతులు ఇంట్లోనే నర్సింగ్ హోం నడుపుతున్నారు. అయితే స్టోర్ రూంలో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో దట్టమైన పొగలు కమ్ముకుని ఊపిరాడక ఐదుగురూ చనిపోయినట్లు తెలుస్తోంది. మరొకరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. చదవండి: బొగ్గు గనిలో దొంగతనానికి వెళ్లిన నలుగురు.. ఊపిరాడక.. -
విమానయానం, ఆక్సిజన్ ప్లాంట్లకూ రుణ హామీ..
ముంబై: అత్యవసర రుణ హామీ పథకం(ఈసీఎల్ జీఎస్) కింద ఇంకా రూ.45,000 కోట్ల మంజూరీకి బ్యాంకింగ్‌కు అవకాశం ఉందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సునిల్ మెహతా ప్రకటించారు. ఈ పథకానికి కేంద్రం రూ.3,00,000 కోట్లు కేటాయించింది. ఇందులో ఇప్పటికే రూ.2.54 లక్షల కోట్లను బ్యాంకింగ్ మంజూరీ చేసిందని ఆయన తెలిపారు. ఈ పథకం వర్తించే విభాగాల జాబితాను పెంచినట్లు ఆర్థికశాఖ చేసిన ప్రకటన అనంతరం మెహతా తాజా ప్రకటన చేశారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్‌లకు ఈ రాయితీ వడ్డీ (7.5 శాతం) రుణాలను అందజేయవచ్చని ఆర్థికశాఖ తాజాగా ప్రకటించింది. అలాగే పౌర విమానయానం విభాగానికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్న ట్లు తెలిపింది. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభం! ఆర్బీఐ ఈనెలారంభంలో ఇచ్చిన నిర్దేశాలకు అనుగుణంగా రూ.25 కోట్ల వరకూ రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను బ్యాంకులు ప్రారంభించినట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి. బ్యాంక్ బోర్డులు సంబంధిత నిర్ణయాన్ని ఆమోదించి, ఈ పథకం వర్తించే వారికి తెలియజేస్తున్నట్లు సమాచారం. చదవండి: రూ.50 వేలు దాటేసిన బంగారం ధర -
నర్సింగ్.. హోంలోనే..
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతున్నా ఆసుపత్రులకు రోగుల తాకిడి మాత్రం తగ్గుతోంది. గత నెల 27వ తేదీ నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 57,142... సరిగ్గా నెలకు అంటే ఈ నెల 26వ తేదీ నాటికి కేసుల సంఖ్య రెండింతలు అంటే 1,14,486 పెరిగాయి. గత నెల 27వ తేదీ నాటికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పడకల సంఖ్య 4,497. సరిగ్గా నెలకు వాటి సంఖ్య రెట్టింపు అంటే 9,136 పెరిగాయి. నెల రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపయ్యాయి. సాపేక్షంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలూ రెండింతలు పెరిగాయి. ఆసుపత్రుల సంఖ్య మూడింతలయ్యాయి. అయితే ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య మాత్రం తగ్గిందని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి తాజాగా సమగ్ర నివేదిక సమర్పించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కొన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పడకలకు ఇంకా డిమాండ్ కొనసాగుతోంది. గచ్చిబౌలిలో ఉన్న ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో ఉన్న 94 ఆక్సిజన్ బెడ్లన్నీ నిండిపోయాయి. సికింద్రాబాద్‌లో ఉన్న మరో ప్రముఖ ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్లు 71 ఉంటే, 70 నిండిపోయాయి. అందులో 35 ఐసీయూ పడకలుంటే 30 నిండిపోయాయి. 21 శాతం తగ్గిన ఇన్‌పేషెంట్లు... రాష్ట్రంలో నెల క్రితం 55 ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు జరగ్గా, ఇప్పుడు ఆ సంఖ్య 171 ఆసుపత్రులకు పెరిగింది. పడకల సంఖ్యను రెట్టింపు చేసింది. కేసులు పెరుగుతున్నా, పడకలున్నా ఆసుపత్రుల్లో చేరేవారు తక్కువయ్యారు. గత నెల 27వ తేదీ నాటి లెక్క ప్రకారం... మొత్తం ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలు 4,497 ఉంటే, 3,032 పడకలు కరోనా రోగులతో నిండిపోయాయి. ఇంకా 1,465 పడకలు అంటే 32.57 శాతం మాత్రమే ఖాళీగా ఉన్నాయి. కానీ, ఈ నెల 26వ తేదీ నాటి లెక్క ప్రకారం మొత్తం ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలు 9,136 ఉండగా, 4,246 నిండిపోయాయి. ఇంకా 4,890 ఖాళీగా ఉన్నాయి. అంటే సగానికి మించి ఏకంగా 53.52 శాతం ఖాళీగా ఉన్నాయి. అంటే అప్పటితో పోలిస్తే ఖాళీగా ఉన్న పడకల శాతం 20.95 శాతానికి పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారి శాతం పెరిగింది. హైదరాబాద్‌ను మినహాయిస్తే జిల్లాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. నెల క్రితం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 73.45 శాతం పడకలు ఖాళీగా ఉండగా, ఇప్పుడు 68 శాతమే ఉన్నాయి. ఇళ్లలోనే చికిత్స పొందేవారు 14% పెరుగుదల... ఇళ్లలో చికిత్స పొందే బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత నెల 27న యాక్టివ్ కేసులు 13,753 ఉండగా, అందులో ఇళ్లలో చికిత్స పొందినవారు 8,479 మంది(61 శాతం) ఉన్నారు. ఈ నెల 26వ తేదీ నాటి లెక్క ప్రకారం 27,600 యాక్టివ్ కేసులుంటే, వాటిల్లో 20,866 మంది(75 శాతం) ఇళ్లలో చికిత్స పొందుతున్నారు. నెల రోజుల్లో ఇళ్లలోనే ఉంటూ చికిత్స పొందేవారు 14 శాతం పెరిగారు. ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా బాధితులు ఎందుకు వెళ్లడం లేదన్న దానిపైనా ఆ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఆ కారణాలేంటంటే? ► ప్రైవేట్ ఆసుపత్రులపై జనంలో ఒకరకమైన ఏవగింపు పెరిగింది. 10–20–25 లక్షల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తుండటం. అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొనడం ► బీమా వర్తించదని చెప్పడం... డబ్బులు చెల్లించనిదే శవాలు కూడా అప్పగించకపోవడం ► ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యానికి ఖర్చు పెద్దగా ఉండదని, అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లొద్దని సర్కారు చేసిన ప్రచారం ఫలించడం ► నెల క్రితం కరోనా వచ్చిందంటే గజగజ వణికిపోయి ఆసుపత్రులకు పరుగులు పెట్టిన బాధితులు ఇప్పుడు చైతన్యవంతులవడం. సాధారణ లక్షణాలుంటే.. తెలిసిన డాక్టర్లను టెలి కన్సల్టేషన్ లేదా టెలి మెడిసిన్‌తో చికిత్స పొందుతుండటం ► మొదట్లో కరోనా అంటే జిల్లాల్లోని డాక్టర్లు కూడా భయపడిపోయారు. కానీ, ఇప్పుడు వారు కూడా కరోనా చికిత్సను నేరుగా లేదా టెలి కన్సల్టేషన్ పద్ధతిలో చికిత్స చేస్తుండటం. ► సీరియస్‌గా ఉండే కేసులు మాత్రమే ఆసుపత్రుల వరకు వెళ్తున్నాయి. కొందరైతే జ్వరం, దగ్గు వంటి కరోనా లక్షణాలు ఉంటే వెంటనే యాంటీబయోటిక్స్ సహా విటమిన్ మాత్రలు వాడుతున్నారు. -
నెలలు నిండకుండానే కాన్పు చేయడంతో..
సాక్షి, పశ్చిమగోదావరి(పాలకొల్లు) : పాలకొల్లు సూర్య నర్సింగ్ హోంలో వైద్యురాలు పీపీఆర్ లక్ష్మీకుమారి నిర్లక్ష్యం కారణంగా గర్భిణి చల్లా ధనలక్ష్మి మృతి చెందిన సంఘటనపై ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వై.సుబ్రహ్మణ్యేశ్వరి ఆదివారం ఏలూరులో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. స్పందన కార్యక్రమంలో మృతురాలు తండ్రి చల్లా సత్యనారాయణ కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు స్వయంగా ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటనపై విచారణ చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నరసాపురం మండలం చిట్టవరం గ్రామ మాజీ సర్పంచ్ చల్లా సత్యనారాయణ ఎకైక కుమార్తె చల్లా ధనలక్ష్మి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వైద్య పరీక్షల కోసం పాలకొల్లులో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు రాగా ఈ ఏడాది మే 31న పట్టణంలోని సూర్య నర్సింగ్ హోమ్‌లో వైద్యురాలు పీపీఆర్ లక్ష్మీకుమారి సలహా మేరకు ఆసుపత్రిలో ఉంచాలని చెప్పడంతో అదే రోజు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే నెలలు నిండకుండానే కాన్పు చేసే ప్రయత్నం చేయడంతో ధనలక్ష్మి మృతిచెందింది. దీనిపై ఆమె తండ్రి సత్యనారాయణ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో గతనెల 23న జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రసూతి వైద్యనిపుణురాలు డా.ఎం పద్మ పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో విచారణ నిర్వహించారు. ధనలక్ష్మి మృతికి సూర్య నర్సింగ్ హోం డాక్టర్ పీపీఆర్ లక్ష్మీకుమారి నిర్లక్ష్యం కారణంగా నిర్ధారించి ఏపీపీఎంసీఈ చట్టం ప్రకారం 6 నెలల పాటు ఆసుపత్రి గుర్తింపును రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరి పేర్కొన్నారు. నా పరిస్థితి ఎవరికీ రాకూడదు నాకు ఒకే ఒక కుమార్తె. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాను. చదువులో మెరిట్‌గా నిలిచేది. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తుంది. ఎంతో ఆరోగ్యంతో ఉండేది. కేవలం పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చూపించాను. అయితే డాక్టర్ పీపీఆర్ లక్ష్మీకుమారి నిర్లక్ష్యంగా వైద్యం చేసింది. ప్రాణాలు బలిగొంది. అధికారులు చర్యలు తీసుకోవడంతో న్యాయం జరిగింది. ఇటువంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. –చల్లా సత్యనారాయణ, మృతురాలి తండ్రి -
తల్లి గర్భంలో చావుగంట!
కోడుమూరులో మూడేళ్ల క్రితం ఓ నర్సింగ్ హోమ్‌పై అధికారులు దాడులు నిర్వహించి లింగనిర్ధారణ చేస్తుండగా పట్టుకున్నారు. ఆ తర్వాత స్కానింగ్ యంత్రాన్ని సీజ్ చేశారు. కానీ ఆ మిషన్ పక్కనే మరో మిషన్‌ను అనధికారికంగా తెచ్చుకుని అక్కడి వైద్యులు స్కానింగ్ చేస్తూ ఆపై అబార్షన్లు చేస్తున్నారు. కర్నూలు ఎన్ఆర్ పేటలోని ఓ స్కానింగ్ కేంద్రంలోనే ఓ మహిళా వైద్యురాలు ఇదే విధంగా అనధికార స్కానింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రస్తుతం అధికారికంగా 230కి పైగా స్కానింగ్ యంత్రాలు పనిచేస్తున్నాయి. అనధికారికంగా 450కి పైగా నడుస్తున్నాయని అంచనా. అనుమతి తీసుకున్న కేంద్రాల కంటే అనుమతి లేని కేంద్రాల్లోనే లింగనిర్ధారణ అధికంగా జరుగుతోంది. కర్నూలు కొత్తబస్టాండ్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ఎన్ఆర్ పేట, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న పలు క్లినిక్‌లు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, గూడూరు, డోన్, నంద్యాల, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తేలితే చాలు అధిక శాతం అబార్షన్‌కు సిద్ధమవుతున్నారు. ఇరువర్గాల సమ్మతి మేరకు జరుగుతున్న ఈ తంతులో అటు గర్భిణి కుటుంబసభ్యులు, ఇటు వైద్యవర్గాలు విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఇద్దరికీ శిక్ష పడుతుందని భావించి గుట్టుగా లింగనిర్ధారణ, అబార్షన్లు చేస్తున్నారు. తగ్గుతున్న స్త్రీ, పురుషుల నిష్పత్తి.. జిల్లాలో పురుషులు, మహిళల నిష్పత్తిలోభారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. 1000 మంది పురుషులకు ప్రస్తుతం జిల్లాలో 932 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం డోన్‌లో 889, ప్యాపిలిలో 894, గడివేములలో 899, శ్రీశైలంలో 892 మాత్రమే స్త్రీలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. దీంతో పాటు ఆదోని డివిజన్‌లోనూ 1000 మంది పురుషులకు అధిక శాతం మండలాల్లో 900 నుంచి 910లోపే స్త్రీలు ఉన్నారు. దీన్ని బట్టి జిల్లాలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం అవుతోంది. ఆర్ఎంపీలకు భారీగా కమీషన్లు స్కానింగ్ కేంద్రాలు, క్లినిక్‌లు, ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రధాన పాత్ర వహించేది ఆర్‌ఎంపీలేనన్న విషయం బహిరంగ రహస్యం. ఏ మాత్రం పేరులేని ఈ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయంటే ఆర్ఎంపీలకు వారు ఇస్తున్న భారీ కమీషన్లే కారణంగా చెప్పుకోవచ్చు. అధికంగా ఆదోని, తెలంగాణ రాష్ట్రంలోని పలు మండలాల నుంచి నిరక్షరాస్యులైన గర్భిణిలకు మాయమాటలు చెప్పి ఆర్ఎంపీలు కర్నూలుకు తీసుకొస్తున్నారు. ఈ మేరకు లింగనిర్ధారణకు స్కానింగ్ చేయించడానికి గర్భిణిని తీసుకొస్తే రూ.4వేల నుంచి రూ.6వేలను వైద్యులు వసూలు చేస్తారు. అందులో ఆర్ఎంపీ కమీషన్ రూ.2000 ముట్టచెబుతున్నారు. పీసీపీఎన్డీటీ చట్టం అంటే లెక్కేలేదు వరకట్న చట్టం, ధూమపాన నిషేధ చట్లాల్లాగే జిల్లాలో లింగనిర్ధారణ, భ్రూణహత్యలను నివారించేందుకు ఉద్దేశించిన పీసీ పీఎన్డీటీ చట్టం అభాసుపాలవుతోంది. ఈ చట్టం ఉన్నట్లు ఆయా స్కానింగ్ కేంద్రాల్లో పోస్టర్లు అతికించి, లోపల మాత్రం యదేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ చట్టం ఏర్పడి పాతికేళ్లు అవుతోంది. దీనిని ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా ఉంటుంది. కానీ జిల్లాలో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు ఈ శిక్షలు అమలు కాలేదు. ఒక్కరు కూడా జైలు గడప కాదు కదా కోర్టు మెట్లు కూడా ఎక్కలేదు. దీన్ని బట్టి జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ శాఖలో లెప్రసి కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి గతంలో పీసీపీఎన్డీటీ యాక్ట్ బాధ్యతలు చూసేవారు. ఆయనపై ఆరోపణలు రావడంతో ఇటీవల ఆయనను లెప్రసి కార్యాలయానికి పంపించారు. ఏమైందో ఏమో మళ్లీ ఆయనను తిరిగి వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి తెచ్చుకున్నారు. దాడులు ముమ్మరం చేస్తాంజిల్లాలో లింగనిర్ధారణ, భ్రూణహత్యల (అబార్షన్లు)పై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయమై ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాం. త్వరలో స్కానింగ్ సెంటర్లు, క్లినిక్‌లు, ప్రైవేటు ఆసుపత్రులపై మూకుమ్మడి దాడులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. – డాక్టర్ జేవీవీఆర్‌కె ప్రసాద్, డీఎంహెచ్‌వో -
మత్తు మందు ఇచ్చి అబార్షన్
చంచల్‌గూడ : మాదన్నపేట పోలీసు స్టేషన్లో తెరమరుగైన కేసు ఎట్టకేలకు హైకోర్టు ప్రమేయంతో వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేసిన వ్యక్తి, ఓ వైద్యుడితో కలిసి కుట్రపూరితంగా తనకు అబార్షన్ చేయించాడని పోలీసులను ఆశ్రయించిన మహిళకు ఆరు నెలల తరువాత హైకోర్టు ద్వారా న్యాయం జరిగింది. అబార్షన్ కుట్రలో భాగస్వాములైన ఇద్దరు వైద్యులు, సహాయకురాలిని గత నెలలో అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు తాజాగా మరో ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. సైదాబాద్ పీఎస్ పరిధిలోని గాయత్రి నర్సింగ్ హోమ్‌లో అబార్షన్లకు పాల్పడుతున్నారని ఇటీవల ఓ యువకుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో నగరపోలీస్ కమిషనర్ కమిషనర్ సుల్తాన్‌బజార్ ఏసీపీ చేతనకు విచారణ బాధ్యతలు అప్పగించారు. దీనిపై ఆమె లోతుగా దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. నల్గొండకు చెందిన మహిళ మాదన్నపేట పీఎస్ పరిధిలోని పూలతోటలో ఉంటూ అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని వివాహం చేసుకుని గర్భం దాల్చింది. ఈ క్రమంలో సదరు యువకుడు అతని తల్లిదండ్రులు, సోదరి ఆమెను గాయత్రి నర్సింగ్‌లో తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. తనకు సెలైన్ బాటిల్ మత్తుమందు కలిపి మత్తులోకి జారుకోగానే అబార్షన్ చేసినట్లు బాధితురాలు తెలిపినట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాధితురాలి భర్త, అత్తమామ, వదినలను గత నెల 31న అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. కేసుకు సంబంధించి పూర్తి నివేదికను మంగళవారం హైకోర్టులో సమర్పించినట్లు ఆమె పేర్కొన్నారు. డిసెంబరులోనే ఫిర్యాదు...! అబార్షన్‌పై బాధితురాలు గత ఏడాది డిసెంబరు 12న మాదన్నపేట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. వైద్యుడు కిరణ్కుమార్సింగ్, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి వదిలేసినట్లు సమాచారం. దీంతో తనకు న్యాయం జరగ దని భావించిన బాధితురాలు నల్గొండ వెళ్లిపోయింది. ఓ యువకుడు అబార్షన్లపై సం బం« దించి హైకోర్టు వేసిన పిటిషన్‌తో తెరమరుగైన కేసు ఏసీపీ దర్యాప్తుతో వెలుగులోకి వచ్చింది. -
ఏడో తరగతే అయినా అబార్షన్లు..
సైదాబాద్: చట్ట వ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ çబ్రూణహత్యలకు పాల్పడుతున్న గాయత్రి నర్సింగ్‌హోం నిర్వాహకులను సైదాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్ప్పెక్టర్ కాట్న సత్తయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఐఎస్‌సదన్ డివిజన్, సింగరేణి కాలనీలోని గాయత్రి నర్సింగ్‌హోంలో చట్ట వ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ, ఆడ పిల్లేనని తేలితే అబార్షన్లు చేస్తున్నారని ఆరోపిస్తూ అంబర్‌పేటకు చెందిన సందీప్‌యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై గత మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం వైద్యులపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఈ నెల 5న సైదాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సైదాబాద్ పోలీసులు సుమోటో కేసుగా నమోదు చేసి గాయత్రి నర్సింగ్‌హోంలో జరుగుతున్న కార్యకలపాలపై విచారణ జరిపారు. అందులో సూపర్వైజర్గా పని చేస్తున్న సర్వారి ఉన్నిసా ఏడో తరగతే అయినా అబార్షన్లు చేస్తున్నట్లు గుర్తించారు. నర్సింగ్‌హోం నిర్వాహకులు డాక్టర్ రచనాసింగ్ ఠాకూర్, డాక్టర్ కిరణ్‌కుమార్ పర్యవేక్షణలోనే ఇవి జరుగుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా కోర్టు 15 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ వివరించారు. -
తగ్గని ఎయిడ్స్
కోలార్ జిల్లాలో ఫలితాలనివ్వని ప్రచారం కోలారు: జిల్లాలో ఎయిడ్స్ రోగుల సంఖ్య తగ్గు ముఖం పట్టడం లేదు. ఎయిడ్స్ వ్యాధిపై జిల్లా ఆరోగ్య శాఖ జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ కోట్లు ఖర్చు చేస్తున్నా ఏటా ఎయిడ్స్ వ్యాధిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 2014 జనవరి నుంచి అక్టోబర్ వరకు జిల్లాలో 541 మంది హెచ్ఐవీ వైరస్ సోకిన వారిని గుర్తించడం జరిగింది. గత సంవత్సరంలో ఎయి డ్స్కు బలైన వారి సంఖ్య 97కు చేరింది. దశాబ్ద కాలంలో జిల్లాలో ఎయిడ్స్ వ్యాధికి గురై 855 మంది మరణించారు. హెచ్ఐవీ వైరస్ సామాన్యులలో 1.77 శాతం ఉంటే గర్భిణీలలో 0.12 శాతం ఉంది. కోలారు ఎస్ఎన్ఆర్ జిల్లాస్పత్రిలో 2002లో మొట్టమొదటి సారిగా ఐసిటిసి కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లాలో 14 ఐసిటిసి కేంద్రాలు పని చేస్తున్నాయి. 5 ప్రైవేట్ నర్సింగ్ హోంలలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్లో భాగంగా ఐసిటిసి కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఐసిటిసి కేంద్రాలలో 2002 నుంచి 2014 అక్టోబర్ వరకు 6186 మందికి హెచ్ఐవీ సోకినట్లు గుర్తించారు. ఇందులో 396 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు. 748 మంది ఎయిడ్స్‌కు బలయ్యా రు. గర్భిణులకు యశస్విని పథకం కింద రిజిష్టరు చేయించి ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలలో హెచ్ఐవీ సోకిన వారికి బిడ్డకు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డ్యాప్కో అధికారి డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ సౌలభ్యం ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలోను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఎయిడ్స్‌ను గుర్తించిన వారిలో 20 నుంచి 35 ఏళ్ల యువకుల్లోనే అధికంగా ఉంది. దీనిని బట్టి హెచ్ఐవీ గురించి జరుగుతున్న జాగృతి కార్యక్రమాలు యువకులను జాగృతం చేయడం లేదని చెప్పవచ్చు. లారీ, ట్రక్కు డ్రైవర్లలో వైరస్‌లను అధికంగా గుర్తిస్తున్నారు. కోలారులో పరిశ్రమలు అధికంగా వస్తుం డడం వల్ల ఈ ప్రాంతంలో హెచ్ఐవీపై మరింత జాగృ తం చేయాల్సిన అవసరం ఉంది. యువ సముదాయానికి దీని గురించి విస్తృత అవగాహన కల్పించాల్సి ఉంది. -
ఎనస్తటిస్ట్‌ల కొరతతో ఎన్ని కష్టాలో!
=అరకొరగా మత్తు మందు వైద్యులు =నగరంలో 400 ఆస్పత్రులకు 125 మందే గతి =సర్జన్లు, రోగులకు తప్పని నిరీక్షణ విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్ : నగర ఆస్పత్రులను ఎనస్తటిస్ట్‌ల(మత్తు మందు వైద్యులు) కొరత తీవ్రంగా వేధిస్తోంది. కేజీహెచ్‌తోపాటు సుమారు 400కుపైగా చిన్నాపెద్దా ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్‌లు ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లో ఉన్నాయి. వీటిలో రోజుకు 800 నుంచి 1000 శస్త్ర చికిత్సల వరకు జరుగుతుంటాయి, ఇంత పెద్ద మొత్తంలో ఆపరేషన్లు నిర్వహించేందుకు అవసరమైన సర్జన్లు అందుబాటులో ఉన్నా వాటికి సారథ్యం వహించే ఎన స్తటిస్ట్లు మాత్రం అరకొరగానే ఉన్నారు. నగరం మొత్తమ్మీద వీరి సంఖ్య 125కి మించి లేదంటే నమ్మశక్యం కానప్పటికీ ముమ్మాటికి ఇదే నిజమంటున్నారు నగర ఎనస్తటిస్ట్‌ల సంఘం కార్యదర్శి డాక్టర్ కె.కూర్మనాథ్. ప్రపంచ ఎనస్తటిస్ట్‌ల దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడారు. నగరంలోని ఆస్పత్రుల్లో, కేజీహెచ్‌లో ఎనస్తటిస్ట్‌ల కొరత తీవ్ర సమస్యగా మారిందని ఆయన వెల్లడించారు. ఒక ఆస్పత్రిలో రోగికి ఆపరేషన్ జరుగుతుండగా అదే సమయంలో మరో మూడు ఆస్పత్రుల్లో అదే ఎనస్తటిస్ట్ రాక కోసం సర్జన్లు, రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి నగరంలో ఉందన్నారు. నగరంలోని ప్రయివేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌ల్లో ఆపరేషన్ల అవసరాలు తీరాలంటే ఇప్పుడున్న ఎనస్తటిస్ట్లకు అదనంగా మరో 30 శాతం వరకు అయినా పెరగాల్సి ఉంటుందని చెప్పారు. కేజీహెచ్‌లోనూ అదే పరిస్థితి కేజీహెచ్ లో కూడా ఎనస్తటిస్ట్‌ల కొరత తీవ్రంగా ఉంది. ఇక్కడ ఎమర్జెన్సీ సర్జరీలతో కలుపుకొని రోజుకు వంద వరకు ఆపరేషన్లు జరుగుతుంటాయి. ఆస్పత్రులో ఉన్న పది ఆపరేషన్ థియేటర్లో మొత్తం 32 ఆపరేషన్ టేబుళ్లు ఉండగా, కేవలం 34 మంది ఎనస్తటిస్ట్లే ఇక్కడ ఉండడం విశేషం. ఒక్కో వైద్యుడు రోజుకు సగటున 3 నుంచి 4 ఆపరేషన్లకు హాజరు కావల్సి వస్తోంది. రాత్రి వేళల్లో ఎమర్జెనీ ఆపరేషన్లపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. 30 ఏళ్ల క్రితం కేజీహెచ్‌లో ఉన్న నాలుగు ఎనస్తషీయా యూనిట్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎనస్తటిస్ట్‌ల కొరత తీరే విధంగా ప్రభుత్వం సీట్ల సంఖ్య పెంచాలని సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.