చంచల్‌గూడ : మాదన్నపేట పోలీసు స్టేషన్‌లో తెరమరుగైన కేసు ఎట్టకేలకు హైకోర్టు ప్రమేయంతో వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేసిన వ్యక్తి, ఓ వైద్యుడితో కలిసి కుట్రపూరితంగా తనకు అబార్షన్ చేయించాడని పోలీసులను ఆశ్రయించిన మహిళకు ఆరు నెలల తరువాత హైకోర్టు ద్వారా న్యాయం జరిగింది. అబార్షన్ కుట్రలో భాగస్వాములైన ఇద్దరు వైద్యులు, సహాయకురాలిని గత నెలలో అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు తాజాగా మరో ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. సైదాబాద్ పీఎస్ పరిధిలోని గాయత్రి నర్సింగ్ హోమ్‌లో అబార్షన్‌లకు పాల్పడుతున్నారని ఇటీవల ఓ యువకుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో నగరపోలీస్ కమిషనర్ కమిషనర్ సుల్తాన్‌బజార్ ఏసీపీ చేతనకు విచారణ బాధ్యతలు అప్పగించారు.
దీనిపై ఆమె లోతుగా దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. నల్గొండకు చెందిన మహిళ మాదన్నపేట పీఎస్ పరిధిలోని పూలతోటలో ఉంటూ అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని వివాహం చేసుకుని గర్భం దాల్చింది. ఈ క్రమంలో సదరు యువకుడు అతని తల్లిదండ్రులు, సోదరి ఆమెను గాయత్రి నర్సింగ్‌లో తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. తనకు సెలైన్ బాటిల్ మత్తుమందు కలిపి మత్తులోకి జారుకోగానే అబార్షన్ చేసినట్లు బాధితురాలు తెలిపినట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాధితురాలి భర్త, అత్తమామ, వదినలను గత నెల 31న అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. కేసుకు సంబంధించి పూర్తి నివేదికను మంగళవారం హైకోర్టులో సమర్పించినట్లు ఆమె పేర్కొన్నారు.
డిసెంబరులోనే ఫిర్యాదు...!
అబార్షన్‌పై బాధితురాలు గత ఏడాది డిసెంబరు 12న మాదన్నపేట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. వైద్యుడు కిరణ్‌కుమార్‌సింగ్, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి వదిలేసినట్లు సమాచారం. దీంతో తనకు న్యాయం జరగ దని భావించిన బాధితురాలు నల్గొండ వెళ్లిపోయింది. ఓ యువకుడు అబార్షన్‌లపై సం బం« దించి హైకోర్టు వేసిన పిటిషన్‌తో తెరమరుగైన కేసు ఏసీపీ దర్యాప్తుతో వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment