సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కారం కేసులో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వి.కె.యాదవ్, గుంతకల్లు రైల్వే డివిజన్ పర్సనల్ ఆఫీసర్ బలరామయ్య గురువారం హైకోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేర కు కారుణ్య కోటా కింద పిటిషనర్ పి.ప్రతాప్‌కు ఉద్యోగ నియామకం చేశామని కోర్టు కు చెప్పారు. దీంతో ఈ విచారణను ముగి స్తున్నట్లు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్ కుమార్ కైత్, జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ప్రకటించింది. రేణిగుంటలో తన తండ్రి రైల్వేలో పనిచేస్తూ మరణించారని, రెండో భార్య కుమారుడిన న్న కారణంతో కారుణ్య నియామకం చేసేందుకు అధికారులు అంగీకరించడం లేదని ప్రతాప్ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీంతో ఆయనకు ఉద్యోగం ఇవ్వా లని గత ఏడాది హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టుకు రైల్వే జీఎం
Published Fri, Jan 26 2018 2:45 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment