సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన బోగస్ ఓట్లపై హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది. బోగస్ ఓట్లపై గతంలో మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. 32 వేల 574 బూతుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి, 52 లక్షల 67వేల 636 బోగస్ ఓట్లు ఉన్నాయని గుర్తించినట్లు పిటీషన్‌లో పేర్కొన్నారు. 34 లక్షల17వేల ఓట్లు వేరు వేరు చోట్ల రిపీట్ అయ్యాయని తెలిపారు. 18 లక్షల 5 వేల ఓట్లు తెలంగాణ, ఏపీలో రిపీట్ అయ్యాయని వెల్లడించారు. ఏపీలో కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగించారని కోర్టుకు తెలిపారు.
2014లో ఓటు హక్కు వినియోగించుకున్న 17లక్షల ఓటర్లను తొలగించారని, ఒక్క కడపలోనే లక్ష మందికి పైగా ఓట్లను తొలగించారని పిటీషనర్ పేర్కొన్నారు. ఓటర్ల నమోదు ఆధార్ లింకుతో, బయోమెట్రిక్ విధానాన్ని అనుసరించాలని కోరారు. గత విచారణలో పిటీషనర్ లేవనెత్తిన అంశాలపై కౌంటర్ దాఖలు చెయ్యాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు అదేశించింది. హైకోర్టు నేడు ఈ పటీషన్‌పై మరోమారు విచారణ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment