త్వరలోనే రెండు హైకోర్టులు ఏర్పాటు | trs mps announced that two high courts very soon | Sakshi
Sakshi News home page

త్వరలోనే రెండు హైకోర్టులు ఏర్పాటు

Published Sun, Sep 7 2014 1:12 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM

trs mps announced that two high courts very soon

కేంద్ర న్యాయశాఖ మంత్రి హామీ ఇచ్చారని టీఆర్‌ఎస్ ఎంపీల వెల్లడి


 సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత హైకోర్టు భవనంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులను ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ వెల్లడించారు. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో కేంద్ర న్యాయశాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులు ఏర్పాటుచేయాలని కేసీఆర్ కోరినట్టు భేటీ అనంతరం టీఆర్ ఎస్ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. అవసరమైన అన్ని భవనాలు, వసతులు ఉన్నాయని, ఏపీ హైకోర్టుకు వాటిని కేటాయించేందుకు సుముఖంగా ఉన్నావుని కేసీఆర్ కేంద్ర వుంత్రికి వివరించినట్టు వారు వెల్లడించారు. కొద్దిరోజుల్లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ ఉన్నందున, కొత్త ప్రధాన న్యాయమూర్తి వచ్చాక ఈ అంశాన్ని ఆయున దృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement