gaythri
-
కుటుంబమంతా చూసేలా ఉంటుంది
‘‘గంధర్వ’ యూత్‌ఫుల్ సినిమా కాదు. కుటుంబమంతా కలిసి చూసే చిత్రం. శ్రీకాంత్, జగపతిబాబుగార్లు ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు చేశారు. ఈ జనరేష¯Œ లో ‘గంధర్వ’ ద్వారా నాకు మంచి అవకాశం వచ్చింది’’ అని హీరో సందీప్ మాధవ్ అన్నారు. అప్సర్ దర్శకత్వంలో సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్.సురేష్ జంటగా నటించిన చిత్రం ‘గంధర్వ’. సుభాని నిర్మించిన ఈ సినిమా ఎస్కే ఫిల్మ్స్ ద్వారా జూలై 1న రిలీజ్ కానుంది. సందీప్ మాధవ్ మాట్లాడుతూ–‘‘గంధర్వ’ కథని లాక్డౌన్లో విన్నాను. మిలటరీ వ్యక్తి కుటుంబంలో వాతావరణం ఎలా ఉంటుంది? పెళ్లి అయిన మరుసటిరోజే యుద్ధానికి వెళ్లాల్సివస్తే పరిస్థితి ఏంటి? వంటి అంశాలున్నాయి. ఈ కథ 1971లో మొదలై 2021 వరకు రన్ అవుతుంది. దర్శకుడు అప్సర్ సోదరుడే నిర్మాత సుభానిగారు.. ఎక్కడా రాజీ పడలేదు. ఎస్.కె. ఫిలిమ్స్ ద్వారా సురేష్ కొండేటిగారు మా సినిమాని విడుదల చేస్తుండటంతో జనాలకు బాగా రీచ్ అవుతోంది. రామ్‌గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్‌గార్లకు 24 గంటలు సినిమానే ప్రపంచం.. వారితో పనిచేసేటప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా. ప్రస్తుతం ‘మాస్ మహారాజ్’ అనే సినిమా చేస్తున్నా’’ అన్నారు. -
మత్తు మందు ఇచ్చి అబార్షన్
చంచల్‌గూడ : మాదన్నపేట పోలీసు స్టేషన్లో తెరమరుగైన కేసు ఎట్టకేలకు హైకోర్టు ప్రమేయంతో వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేసిన వ్యక్తి, ఓ వైద్యుడితో కలిసి కుట్రపూరితంగా తనకు అబార్షన్ చేయించాడని పోలీసులను ఆశ్రయించిన మహిళకు ఆరు నెలల తరువాత హైకోర్టు ద్వారా న్యాయం జరిగింది. అబార్షన్ కుట్రలో భాగస్వాములైన ఇద్దరు వైద్యులు, సహాయకురాలిని గత నెలలో అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు తాజాగా మరో ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. సైదాబాద్ పీఎస్ పరిధిలోని గాయత్రి నర్సింగ్ హోమ్‌లో అబార్షన్లకు పాల్పడుతున్నారని ఇటీవల ఓ యువకుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో నగరపోలీస్ కమిషనర్ కమిషనర్ సుల్తాన్‌బజార్ ఏసీపీ చేతనకు విచారణ బాధ్యతలు అప్పగించారు. దీనిపై ఆమె లోతుగా దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. నల్గొండకు చెందిన మహిళ మాదన్నపేట పీఎస్ పరిధిలోని పూలతోటలో ఉంటూ అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని వివాహం చేసుకుని గర్భం దాల్చింది. ఈ క్రమంలో సదరు యువకుడు అతని తల్లిదండ్రులు, సోదరి ఆమెను గాయత్రి నర్సింగ్‌లో తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. తనకు సెలైన్ బాటిల్ మత్తుమందు కలిపి మత్తులోకి జారుకోగానే అబార్షన్ చేసినట్లు బాధితురాలు తెలిపినట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాధితురాలి భర్త, అత్తమామ, వదినలను గత నెల 31న అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. కేసుకు సంబంధించి పూర్తి నివేదికను మంగళవారం హైకోర్టులో సమర్పించినట్లు ఆమె పేర్కొన్నారు. డిసెంబరులోనే ఫిర్యాదు...! అబార్షన్‌పై బాధితురాలు గత ఏడాది డిసెంబరు 12న మాదన్నపేట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. వైద్యుడు కిరణ్కుమార్సింగ్, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి వదిలేసినట్లు సమాచారం. దీంతో తనకు న్యాయం జరగ దని భావించిన బాధితురాలు నల్గొండ వెళ్లిపోయింది. ఓ యువకుడు అబార్షన్లపై సం బం« దించి హైకోర్టు వేసిన పిటిషన్‌తో తెరమరుగైన కేసు ఏసీపీ దర్యాప్తుతో వెలుగులోకి వచ్చింది. -
మోహన్ బాబు గాయిత్రి టీజర్
-
‘వాళ్లు దేవుళ్లయితే ఇక్కడ నేనూ దేవుణ్నే’
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గాయత్రి. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అంతేకాదు చాలా కాలం తరువాత ఆయన ఈ సినిమా పూర్తి స్థాయి ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మంచు విష్ణు, శ్రియ, నిఖిలా విమల్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఇంట్రస్టింగ్ డైలాగ్స్ తో ఆసక్తికరంగా రూపొందించిన టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. -
రాష్ట్రంలో దుశ్శాసన పాలన
–సమాజం తలదించుకునేలా చంద్రబాబు తీరు –ప్రత్యేక హోదాకు ఉద్యమించడం పాపమా? –చంద్రబాబు క్షమాపణకు మహిళానేతల డిమాండ్ – సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా – భూమన, చెవిరెడ్డి,నారాయణస్వామిలు మద్దతు తిరుపతి మంగళం: ‘ అధికారంలోకి వస్తే మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకొస్తా..మహిళలపై దాడులు జరగకుండా వీధికొక మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తానంటూ’ గొప్పలు చెప్పిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పోలీసుల ద్వారా దుశ్శాసన పాలన సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా, నగర అధ్యక్షులు గాయిత్రీదేవి, చెలికం కుసుమ ఆరోపించారు. మంగళవారం తిరుపతిలో నిర్వహించిన ప్రత్యేక హోదా బంద్‌లో పోలీసులు మహిళలపట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా బుధవారం తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కుసుమ ఆధ్వర్యంలో భారీసంఖ్యలో మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మహిళల ఆందోళనకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కళత్తూరు నారాయణస్వామి మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా పార్టీ మహిళా విభాగం జిల్లా, నగర అధ్యక్షురాళ్లు గాయిత్రీదేవి, చెలికం కుసుమ మాట్లాడుతూ సభ్యసమాజం తలదించుకునేలా మహిళ పట్ల చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఉద్యమ పోరాటాలు చేయలేరని, చేసేవారిని అణగతొక్కేందుకు మహిళలు అని కూడా చూడకుండా పోలీసుల చేత బూటు కాళ్లతో తొక్కించి, మహిళల చీరలను చింపి, తాళిబొట్టును సైతం తెంపించాడంటే మహిళల పట్ల చంద్రబాబుకు ఉన్న గౌరవం ఏపాటిదో అర్ధమవుతోందన్నారు. పోలీసులచేత పైశాచిక దాడులు చేయించిన చంద్రబాబు బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర మహిళా లోకాన్ని ఏకం చేసి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సిగ్గుచేటు సంఘటన... కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తెలుగు సంస్కతి సంప్రదాయాలకు, మహిళల కట్టుబొట్టులకు ఒకప్రత్యేక ఉందని దానిని మంటగలుపుతున్నాడని మండిపడ్డారు. మహిళల పట్ల మగ పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించి పైశాచిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసుల చేత చంద్రబాబు చేయించిన పైశాచిక దాడులు మహిళాలోకం సిగ్గుతో తలదించుకునేలా ఉందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమిస్తే దాడులు చేయించడం చంద్రబాబు చేతగానీ తనానికి నిదర్శనమన్నారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్ర అభివద్ధిని, ప్రజాసంక్షేమాన్ని చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమ పోరాటాలు చేస్తుంటే మద్దతు తెలపాల్సింది పోయి మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తారా?అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్ ఏవో అబ్దుల్ మునాఫ్‌కు మహిళా నేతలు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకురాళ్లు పుష్పలత, గీతాయాదవ్, పుష్పాచౌదరి, రమణమ్మ, లక్ష్మీరెడ్డి, శాంతారెడ్డి, శారద, మునీశ్వరమ్మ, శ్యామల, పద్మావతమ్మ, రాణెమ్మ, ప్రమీల, చిత్ర, పార్వతమ్మ, లక్ష్మి, భారతి పాల్గొన్నారు. సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా మహిళా పోలీసు బలగాలను మోహరించారు.