TCS CodeVita Season 10: IIT Delhi Student Kalash Gupta Became World Top Coder - Sakshi
Sakshi News home page

Kalash Gupta: క్వాలిఫై కావడమే కష్టం.. అలాంటిది ఏకంగా విన్నర్‌గా! 7 లక్షల ప్రైజ్‌మనీ!

Published Fri, Jun 10 2022 12:33 PM | Last Updated on Fri, Jun 10 2022 2:25 PM

Inspiration: IIT Delhi Student Kalash Gupta Became World Top Coder - Sakshi

క్వాలిఫై కావడమే కష్టం.. అలాంటిది ఏకంగా విన్నర్‌గా! 7 లక్షల ప్రైజ్‌మనీ!

అది ఆషామాషీ పోటీ కాదు. ‘వరల్డ్స్‌ లార్జెస్ట్‌ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ కాంపిటీషన్‌’గా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిన పోటీ. ఈసారి 87 దేశాల నుంచి లక్షమందికి పైగా  విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. అందులో మన కుర్రాడు కలష్‌ గుప్తా  ‘వరల్డ్స్‌ టాప్‌ కోడర్‌’ టైటిల్‌ గెలుచుకున్నాడు...

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసిఎస్‌) నిర్వహించే ప్రతిష్ఠాత్మకమైన ‘కోడ్‌ విట’లో కలష్‌గుప్తా విజేతగా నిలిచాడు. 7.76 లక్షల గ్రాండ్‌ ప్రైజ్‌ను గెలుచుకున్నాడు. ఐఐటీ–దిల్లీలో కలష్‌గుప్తా థర్డ్‌ ఇయర్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌.

‘కోడ్‌ విట’ గురించి తెలిసినప్పుడు ఆ పోటీలో ఎలాగైనా పాల్గొనాలనే ఉత్సాహం కలష్‌కు కలిగింది, ‘అందులో క్వాలిఫై కావడం కష్టం’ అన్నారు చాలామంది. ‘టఫ్‌’ అనే ప్రతికూల మాట వింటే చాలు కలష్‌లో పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ బయలుదేరుతాయి. పట్టుదల వచ్చి అదేపనిగా షేక్‌హ్యాండ్‌ ఇస్తుంది.  

‘కోడ్‌ వీట’ పోటీలో పాల్గొనడం వల్ల రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. అందులో కొన్ని...
టాప్‌కోడర్‌గా గ్లోబల్‌ ర్యాంకింగ్‌ ఇస్తారు
ఆకర్షణీయమైన ప్రైజ్‌మనీ దక్కుతుంది
ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన టాటా బ్రాండ్‌ లో ఎగ్జాయిటింగ్‌ కెరీర్‌ను ఎంచుకునే అవకాశం ఏర్పడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా చేయితిరిగిన కోడర్స్‌తో పోటీపడే అవకాశం దొరుకుతుంది

అస్సలు ఊహించలేదు.. కానీ
బరిలోకి దిగిన తరువాత ‘ఏదో ఒక ర్యాంకు వస్తుంది’ అనుకున్నాడుగానీ ఫస్ట్‌ ర్యాంక్‌ వస్తుందని అనుకోలేదు కలష్‌. అందుకే ఇది తనను ఆశ్చర్యానందాలకు గురి చేసిన విజయం. సాకెత్‌(దిల్లీ)లోని అమిటీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుకున్న కలష్‌కు కంప్యూటర్‌ సైన్స్‌ అంటే చాలా ఇష్టం. ‘ఇష్టం లేని కష్టమైన సబ్జెక్ట్‌ చదువుతున్నప్పుడే కాదు, మనకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్‌ను చదువుతున్నప్పుడు కూడా రకరకాల ఆలోచనలు, జ్ఞాపకాలు మన ముందుకు వచ్చి నిలుచుంటాయి. కొన్ని సందర్భాలలోనైతే చదువును వదిలేసి వాటితోనే ప్రయాణిస్తాం.

దీనివల్ల బయటికి మనం బాగా కష్టపడుతున్నట్లు కనిపించినప్పటికీ, ఆ కష్టం వృథా పోతుంది. అందుకే పుస్తకం పట్టుకున్న తరువాత సబ్జెక్ట్‌కు సంబంధం లేని ఆలోచనలు మన దగ్గరకు రాకుండా చూసుకోవాలి’ అంటున్న కలష్‌ జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌(జేఇఇ)లో జాతీయస్థాయిలో మూడో ర్యాంకు దక్కించుకున్నాడు.

తాజాగా ‘వరల్డ్స్‌ టాప్‌ కోడర్‌’ టైటిల్‌ గెలుచుకోవడం ద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు కలష్‌. ప్రైజ్‌మనీతో పాటు టీసిఎస్‌ రిసెర్చ్‌ అండ్‌ ఇనోవేషన్‌ సంస్థలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం లభిస్తుంది. ‘బహుమతి, ర్యాంకింగ్‌ విషయం ఎలా ఉన్నప్పటికీ  ఇలాంటి పోటీలలో పాల్గొనడం వల్ల మన బలాలు, బలహీనతలు మనమే తెలుసుకునే అవకాశం దొరుకుతుంది’ అంటున్నాడు కలష్‌.

‘ఫైనల్స్‌కు చేరుకున్న నలుగురు అభ్యర్థులు మొత్తం పది ప్రాబ్లమ్స్‌ను సాల్వ్‌ చేశారు. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు’ అంటున్నారు టీసిఎస్‌ ప్రతినిధి. ప్రోగ్రామింగ్, చెస్‌ అంటే ఇష్టపడే కలష్‌ ఒత్తిడికి గురైనప్పుడు ఫుట్‌బాల్‌ ఆడతాడు. ఇది ‘రియల్‌ స్ట్రెస్‌బస్టర్‌’గా చెబుతాడు. ప్రోగ్రామింగ్, చెస్‌ అంటే ఇష్టపడే కలష్‌ ఒత్తిడికి గురైనప్పుడు ఫుట్‌బాల్‌ ఆడతాడు. ఇది ‘రియల్‌ స్ట్రెస్‌బస్టర్‌గా చెబుతాడు.  

చదవండి: Radhika Gupta: అవమానాల నుంచి అందనంత ఎత్తుకు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement