IIT Delhi
-
విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో హైదరాబాద్‌కు దక్కని చోటు
సాక్షి, న్యూఢిల్లీ/రాయదుర్గం: దేశంలోని విద్యాసంస్థల్లో అన్ని విభాగాల్లో కలిపి ఐఐటీ–మద్రాస్ అత్యుత్తమ విద్యాసంస్థగా నిలిచింది. మొత్తం విభాగాల్లో ఐఐటీ–మద్రాస్‌కు మొదటిస్థానం దక్కడం ఇది ఐదోసారి కాగా, ఇంజనీరింగ్ విభాగంలోనూ వరుసగా ఎనిమిదోసారి నంబర్‌వన్ స్థానాన్ని నిలుపుకోవడం విశేషం. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023) నివేదికను విద్య, విదేశీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్ సోమవారం విడుదల చేశారు. బోధనా అభ్యాసం, మౌలిక వసతులు, పరిశోధన, వృత్తిపరమైన అభ్యాసం, గ్రాడ్యుయేషన్ ఫలితం, విద్యార్థులు పొందే ఉపాధి అవకాశాలు వంటి అంశాల ఆధారంగా విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, లా, మెడికల్ కాలేజీలకు ర్యాంకులను ప్రకటించారు. వీటిలో అన్ని కేటగిరీల్లో ఐఐటీ–మద్రాస్ తొలిస్థానంలో ఉండగా, ఐఐఎస్సీ–బెంగళూరు రెండో స్థానంలో, ఐఐటీ–ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఐఐటీ–హైదరాబాద్ 14వ స్థానం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) 20వ స్థానం, నిట్–వరంగల్ 53, ఉస్మానియా యూనివర్సిటీ 64, వడ్డేశ్వరంలోని కేఎల్ కాలేజ్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ 50, వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచాయి. ర్యాంకింగ్స్ కోసం 200కు పైగా యూనివర్సిటీలను సర్వేచేశారు. దరఖాస్తు చేసిన దాదాపు 8వేల సంస్థల నుంచి 2023 ర్యాంకులను ప్రకటించారు. అత్యుత్తమ వర్సిటీల విభాగంలో... ఇక అత్యుత్తమ వర్సిటీల విభాగంలో ఐఐఎస్సీ–బెంగళూరు తొలి స్థానంలో ఉండగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10వ స్థానం, ఉస్మానియా యూనివర్సిటీ 36, హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 84వ స్థానంలో నిలిచింది. ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీ 43, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ 60వ స్థానం దక్కించుకున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 8వ, నిట్–వరంగల్ 21వ స్థానంలో ఉన్నాయి. పరిశోధన విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 14వ స్థానంలో, హెచ్‌సీయూ 25వ స్థానంలో నిలిచాయి. మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం–వైజాగ్ 29వ, ఐసీఎఫ్ఏఐ–హైదరాబాద్ 40వ స్థానంలో ఉన్నాయి. ఫార్మసీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–హైదరాబాద్ తొలి స్థానంలో ఉండగా, న్యాయ విభాగంలో నల్సార్ యూనివర్సిటీ 3వ స్థానంలో ఉంది. ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. వ్యవసాయ విభాగంలో.. ఇక వ్యవసాయం, దాని అనుబంధ విభాగాల్లో గుంటూరులోని ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ 20వ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 31వ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్–హైదరాబాద్ 32వ స్థానంలో ఉన్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కోసం https://www.nirfindia.org/ వెబ్సైట్లో చూడొచ్చు. సమష్టి కృషితోనే సాధ్యం జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మంచి గుర్తింపే లక్ష్యం. సమష్టి కృషితోనే సాధ్యం. దేశంలో టాప్– 10 విశ్వవిద్యాలయాల్లో హెచ్సీయూకు మళ్లీ ర్యాంక్‌ను పొందడం ఆనందంగా ఉంది. ఉత్తమ పద్ధతులు, నాణ్యతతో కూడిన బోధన, పరిశోధనల కారణంగా ఈ ర్యాంకు సాధ్యమైంది. భవి ష్యత్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తాం. -ప్రొ. బీజే రావు, వైస్‌చాన్స్‌లర్ హెచ్‌సీయూ మానవాళి కోసం టెక్నాలజీ ఈ విజయంలో విద్యార్థులు, అధ్యాపకులతోపాటు, పూర్వ విద్యార్థుల కృషి కూడా ఉంది. మానవాళి కోసం సాంకేతిక పరిజ్ఞానం అనే నినాదంతో ఐఐటీహెచ్ ముందుకెళ్తోంది. – ప్రొ. బీఎస్ మూర్తి, ఐఐటీహెచ్ డైరెక్టర్ IIT Madras ranked best institution followed by IISC Bengaluru and IIT Delhi as per the NIRF Ranking released by the Union Ministry of Education pic.twitter.com/yAKN3uVnuU— ANI (@ANI) June 5, 2023 IISC, Bangalore ranked best university followed by JNU and Jamia Millia Islamia as per the NIRF Ranking released by the Union Ministry of Education pic.twitter.com/Jvr1OixSHz— ANI (@ANI) June 5, 2023 ఫార్మసీ విభాగంతో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి స్థానంలో నిలిచింది. జామియా హమ్దర్ద్, బిట్స్ పిలానీ రెండో, మూడో స్థానాలు సాధించాయి.న్యాయ విద్యలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, దిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ‘నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా’ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. దీనికి సంబంధించిన సమగ్ర వార్తకథనం మా ఎడ్యుకేషన్ వెబ్ సైట్లో చదవండి -
త్వరలో సెమీ కండక్టర్ల హబ్‌గా భారత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో భారత్ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. త్వరలో ప్రకటించబోయే సెమీకండక్టర్ ఫ్యాబ్, తొలి ప్యాకేజింగ్ యూనిట్లతో పాటు 2024 నాటికి 100 డిజైన్ స్టార్టప్‌లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాల ఊతంతో భారత్ సెమీకండక్టర్ల హబ్‌గా మారగలదని ఆయన పేర్కొన్నారు. చిప్‌ల తయారీ కోసం రూ. 76,000 కోట్ల ప్రోత్సాహక పథకం, విరివిగా నిపుణుల లభ్యత, నైపుణ్యాలను పెంచే శిక్షణా కార్యక్రమాలు మొదలైనవి ఇందుకు దోహదపడగలదని చంద్రశేఖర్ చెప్పారు. ఐఐటీ ఢిల్లీలో జరిగిన మూడో సెమీకాన్ఇండియా ఫ్యూచర్డిజైన్ రోడ్‌షోలో పాల్గొన్న సందర్భంగా చంద్రశేఖర్ ఈ విషయాలు వివరించారు. దేశీయంగా ఏడాదిన్నర క్రితం సెమీకండక్టర్ డిజైన్ స్టార్టప్‌లనేవి దాదాపు శూన్యమని, కానీ ప్రస్తుతం 27–30 డిజైన్, సెమీకండక్టర్ అంకుర సంస్థలు పని చేస్తున్నాయని మంత్రి తెలిపారు. 2024 నాటికి ఈ విభాగంలో 100 పైచిలుకు అంకుర సంస్థలు ఏర్పాటయ్యే దిశగా ముందుకు వెడుతున్నామన్నారు. యాపిల్, సిస్కో, శాంసంగ్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ ఆవిష్కరణలకు భారత్ కేంద్రంగా నిలవగలదని.. తయారీ రంగం ఇప్పటికే ఊపందుకుందని చంద్రశేఖర్ తెలిపారు. ఇన్‌కోర్‌లో సెకోయా పెట్టుబడులు.. రోడ్‌షో సందర్భంగా ఇన్‌కోర్ సెమీకండక్టర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సెకోయా క్యాపిటల్ ఇండియా ప్రకటించింది. ఇన్‌కోర్ ఇప్పటి వరకూ సెకోయా నుంచి 3 మిలియన్ డాలర్లు సమీకరించింది. సెమీకండక్టర్ల విభాగంలో సెకోయాకు ఈ ఏడాది ఇది రెండో పెట్టుబడి. ఈ మధ్యే మైండ్‌గ్రోవ్ అనే సంస్థలో ఇన్వెస్ట్ చేసింది. -
పశువుల వ్యాపారం చేస్తున్న ఐఐటీ అమ్మాయిలు, వందల కోట్ల టర్నోవర్‌తో..
Neetu Yadav and Kirti Jangra: ఉన్నత చదువులు చదివి సొంతంగా వ్యాపారం చేయాలని కలలు కంటూ విజయాన్ని సాధించిన వారు చాలానే ఉన్నారు. ఇందులో నీతూ యాదవ్ & కీర్తి జంగ్రా కూడా ఉన్నారు. ఢిల్లీలో ఐఐటి పూర్తి చేసి 'యానిమల్ టెక్నాలజీస్' స్థాపించి ఇప్పుడు కోట్లలో గడిస్తున్నారు. ఇంతకీ వీరి విజయ గాథ వెనుక ఉన్న అసలైన కథ ఏంటనేది ఇక్కడ ఈ కథనంలో చూసేద్దాం.. ఢిల్లీలో ఐఐటీ రూమ్మేట్స్గా కలిసిన అమ్మాయిలు తమ కలను సహకారం చేసుకోవడానికి నవంబర్ 2019లో పశువుల కోసం ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అయిన యానిమాల్ను ప్రారంభించారు. బెంగళూరులోని ఒక చిన్న అద్దె గదిలో ఉంటూ ప్రారంభమైన వీరి వ్యాపారం ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. పాడి రైతుల జీవితాలను మెరుగుపరచడానికి, పశువుల వ్యాపారం, పాడి పరిశ్రమలను మరింత లాభదాయకంగా మార్చాలనే ఉద్దేశ్యంతో యానిమల్ స్థాపించారు. ప్రతి వ్యాపారంలో ఎదురైనా ఇబ్బందులు మాదిరిగానే వీరు కూడా ప్రారంభంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ తరువాత గేదెలను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల నుండి ఎక్కువ ఆర్డర్లను పొందడం ప్రారంభించారు. (ఇదీ చదవండి: Force Citiline: ఫోర్స్ మోటార్స్ కొత్త ఎమ్‌పివి లాంచ్ - ధర ఎంతంటే?) యానిమల్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ జంతువుల సంరక్షణకు కూడా సేవలను అందిస్తుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పొందిన ఆదాయంలో సుమారు 90శాతం పశువుల వ్యాపారం నుంచి రాగా.. మిగిలిన 10 శాతం వైద్య ఖర్చులు, అసిస్టెడ్ రీప్రొడక్షన్, సేల్స్ కమీషన్ వంటి వాటిద్వారా వచ్చిందని తెలుస్తోంది. యానిమాల్ (Animall) అనేది పశువుల వ్యాపారం చేయడానికి ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్. దీని ద్వారా పశువుల అమ్మకం మాత్రమే కాకుండా కొనుగోలు కూడా ఉంటుంది. ప్రస్తుతం యానిమల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దూసుకెళ్తున్న ఈ కంపెనీలో షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్, జొమాటో వ్యవస్థాపకుడు & సీఈవో దీపిందర్ గోయెల్, అంజలి బన్సాల్, మోహిత్ కుమార్, సాహిల్ బారువాతో సహా మరో 3 మంది యానిమాల్ ఏంజెల్ పెట్టుబడిదారులుగా ఉన్నారు. (ఇదీ చదవండి: ఇంత మంచి ఆఫర్ మళ్ళీ మళ్ళీ వస్తుందా.. జీప్ కంపెనీ భారీ డిస్కౌంట్స్) 2019లో ప్రారంభమైన యానిమల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ FY22లో ఆదాయం రూ. 7.4 కోట్లుగా అంచనా వేయబడింది. అయితే ప్రస్తుతం ఇది రూ. 565 కోట్లకు పెరిగింది. రానున్న రోజుల్లో ఈ కంపెనీ మరిన్ని లాభాలను తప్పకుండా ఆర్జిస్తుందని భావిస్తున్నారు. మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
టైమ్ కాప్య్సూల్ 2047
కాలంతో పాటు నడవడం ఎంత ముఖ్యమో భవిష్యత్ దార్శనికత కూడా అంతే ముఖ్యం. టైమ్ క్యాప్య్సూల్ అనేది మన వర్తమాన,భవిష్యత్ ఆలోచనల సమ్మేళనం. ఐఐటీ, దిల్లీ శాస్త్రవేత్తలు ఇటీవల రూపొందించిన కాలనాళిక (టైమ్ క్యాప్య్సూల్) సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఇండియా @ 2047’ పై అభిప్రాయాలను సేకరించి ఇందులో భద్రపరిచారు. ఈ టైమ్ క్యాప్య్సూల్‌ను స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారుచేశారు. దీని బరువు 75 కిలోలు. ఈ కాలనాళికను 2047లో తెరుస్తారు. భవిష్యత్‌కు సంబంధించిన మన ఆశాజనకమైన అంచనాలు వాస్తవమైతే అంతకంటే సంతోషం ఏమున్నది! -
క్వాలిఫై కావడమే కష్టం.. అలాంటిది ఏకంగా విన్నర్‌గా! 7 లక్షల ప్రైజ్‌మనీ!
అది ఆషామాషీ పోటీ కాదు. ‘వరల్డ్స్ లార్జెస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాంపిటీషన్’గా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిన పోటీ. ఈసారి 87 దేశాల నుంచి లక్షమందికి పైగా విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. అందులో మన కుర్రాడు కలష్ గుప్తా ‘వరల్డ్స్ టాప్ కోడర్’ టైటిల్ గెలుచుకున్నాడు... టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసిఎస్) నిర్వహించే ప్రతిష్ఠాత్మకమైన ‘కోడ్ విట’లో కలష్‌గుప్తా విజేతగా నిలిచాడు. 7.76 లక్షల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్నాడు. ఐఐటీ–దిల్లీలో కలష్‌గుప్తా థర్డ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. ‘కోడ్ విట’ గురించి తెలిసినప్పుడు ఆ పోటీలో ఎలాగైనా పాల్గొనాలనే ఉత్సాహం కలష్‌కు కలిగింది, ‘అందులో క్వాలిఫై కావడం కష్టం’ అన్నారు చాలామంది. ‘టఫ్’ అనే ప్రతికూల మాట వింటే చాలు కలష్‌లో పాజిటివ్ వైబ్రేషన్స్ బయలుదేరుతాయి. పట్టుదల వచ్చి అదేపనిగా షేక్‌హ్యాండ్ ఇస్తుంది. ‘కోడ్ వీట’ పోటీలో పాల్గొనడం వల్ల రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. అందులో కొన్ని... ►టాప్కోడర్గా గ్లోబల్ ర్యాంకింగ్ ఇస్తారు ►ఆకర్షణీయమైన ప్రైజ్‌మనీ దక్కుతుంది ►ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన టాటా బ్రాండ్ లో ఎగ్జాయిటింగ్ కెరీర్‌ను ఎంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ►ప్రపంచవ్యాప్తంగా చేయితిరిగిన కోడర్స్తో పోటీపడే అవకాశం దొరుకుతుంది అస్సలు ఊహించలేదు.. కానీ బరిలోకి దిగిన తరువాత ‘ఏదో ఒక ర్యాంకు వస్తుంది’ అనుకున్నాడుగానీ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకోలేదు కలష్. అందుకే ఇది తనను ఆశ్చర్యానందాలకు గురి చేసిన విజయం. సాకెత్(దిల్లీ)లోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్న కలష్‌కు కంప్యూటర్ సైన్స్ అంటే చాలా ఇష్టం. ‘ఇష్టం లేని కష్టమైన సబ్జెక్ట్ చదువుతున్నప్పుడే కాదు, మనకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్‌ను చదువుతున్నప్పుడు కూడా రకరకాల ఆలోచనలు, జ్ఞాపకాలు మన ముందుకు వచ్చి నిలుచుంటాయి. కొన్ని సందర్భాలలోనైతే చదువును వదిలేసి వాటితోనే ప్రయాణిస్తాం. దీనివల్ల బయటికి మనం బాగా కష్టపడుతున్నట్లు కనిపించినప్పటికీ, ఆ కష్టం వృథా పోతుంది. అందుకే పుస్తకం పట్టుకున్న తరువాత సబ్జెక్ట్‌కు సంబంధం లేని ఆలోచనలు మన దగ్గరకు రాకుండా చూసుకోవాలి’ అంటున్న కలష్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(జేఇఇ)లో జాతీయస్థాయిలో మూడో ర్యాంకు దక్కించుకున్నాడు. తాజాగా ‘వరల్డ్స్ టాప్ కోడర్’ టైటిల్ గెలుచుకోవడం ద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు కలష్. ప్రైజ్‌మనీతో పాటు టీసిఎస్ రిసెర్చ్ అండ్ ఇనోవేషన్ సంస్థలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం లభిస్తుంది. ‘బహుమతి, ర్యాంకింగ్ విషయం ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి పోటీలలో పాల్గొనడం వల్ల మన బలాలు, బలహీనతలు మనమే తెలుసుకునే అవకాశం దొరుకుతుంది’ అంటున్నాడు కలష్. ‘ఫైనల్స్‌కు చేరుకున్న నలుగురు అభ్యర్థులు మొత్తం పది ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేశారు. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు’ అంటున్నారు టీసిఎస్ ప్రతినిధి. ప్రోగ్రామింగ్, చెస్ అంటే ఇష్టపడే కలష్ ఒత్తిడికి గురైనప్పుడు ఫుట్‌బాల్ ఆడతాడు. ఇది ‘రియల్ స్ట్రెస్‌బస్టర్’గా చెబుతాడు. ప్రోగ్రామింగ్, చెస్ అంటే ఇష్టపడే కలష్ ఒత్తిడికి గురైనప్పుడు ఫుట్‌బాల్ ఆడతాడు. ఇది ‘రియల్ స్ట్రెస్‌బస్టర్‌గా చెబుతాడు. చదవండి: Radhika Gupta: అవమానాల నుంచి అందనంత ఎత్తుకు! -
ప్రతి నెల 50 మిలియన్ల వ్యూయర్షిప్ వచ్చింది!
నిజం చెప్పాలంటే, శ్లోక్ శ్రీవాస్తవ ఇంతలా ఎప్పుడూ కృంగిపోలేదు. దిల్లీలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీవాస్తవకు ఐఐటీ,దిల్లీలో సీటు రాకపోవడం శరాఘాతంలా పరిణమించింది. తల్లిదండ్రులు ఏమీ అనకపోయినా, ధైర్యం చెప్పినా తనలో అంతులేని బాధ. అలా రెండు నెలలు...దుఃఖమయ సమయం. Forbes India 30 Under 30 in 2022: తనను తాను చీకటిగుహలో నుంచి వెలుగు వాకిట్లోకి తీసుకురావడానికి విజేతల ఆత్మకథలు చదవడం మొదలు పెట్టాడు. వాళ్లెవరూ పుట్టు విజేతలు కాదు. జీవితంలో ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నవాళ్లు. విజేతలకు సంబంధించి రకరకాల పుస్తకాలు తిరగేస్తున్నప్పుడు... ‘నీ లక్ష్యం మీద నీకు స్పష్టత ఉంటే నీ దగ్గరకు విజయం...నడిచిరావడం కాదు పరుగెత్తుకు వస్తుంది’ అనే వాక్యం తనకు బాగా నచ్చింది. ఆ సమయంలో ఆలోచించాడు ‘అసలు నా లక్ష్యం ఏమిటీ?’ అని. ఆ విషయంపై తాను ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. అభిరుచి నుంచి లక్ష్యం పుడుతుంది...అంటారు. తన అభిరుచి విషయంలో మాత్రం స్పష్టత ఉంది. తనకు గ్యాడ్జెట్స్ అంటే ఇష్టం. యూట్యూబ్ వీడియోలు రూపొందించడం అంటే ఇష్టం. వీటిలో ఏముంది ప్రత్యేకత? ప్రత్యేకత ఆవిష్కరించడమే కదా విజేత పని! ∙∙ చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో శ్లోక్కు అడ్మిషన్ దొరికింది. యూనివర్శిటీలో ఉన్న కాలంలో...ఒకవైపు చదువుపై శ్రద్ధ పెడుతూనే మరోవైపు డిజైన్, థియేటర్, కోర్స్ మేకింగ్ యూట్యూబ్ వీడియోలను చేయడం మొదలుపెట్టాడు. గ్యాడ్జెట్లను పరిచయం చేయడానికి ‘టెక్ బర్నర్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. గ్యాడ్జెట్ల పరిచయం వ్యాపార ప్రకటనల్లా కాకుండా...ఎంటర్టైనింగ్, స్టోరీ టెల్లింగ్ పద్ధతుల్లో పరిచయం చేసేవాడు. తన గ్రాడ్యుయేషన్ పూర్తయింది. అప్పుడప్పుడే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగం చేయకుండా పూర్తిస్థాయిలో సమయాన్ని చానల్‌కు కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇది వారి కుటుంబసభ్యులకు నచ్చలేదు. సర్దిచెప్పాడు. కెమెరా ముందు ఆకట్టుకునేలా ఎలా మాట్లాడాలి? నాణ్యమైన వీడియోలు ఎలా రూపొందించాలి....మొదలైన విషయాలపై మరింత శ్రద్ధ పెట్టాడు. చానల్ సూపర్‌డూపర్ హిట్ అయింది! ప్రతి నెల 50 మిలియన్ల వ్యూయర్షిప్ వచ్చింది. ఈ ఉత్సాహంలో రెండు వెబ్సైట్లు, బర్నర్ మీడియా బ్యానర్‌పై ఆన్లైన్ అప్లికేషన్లు లాంచ్ చేశాడు. ‘టెక్ బర్నర్’ అనేది అతడి పేరుకు ప్రత్యామ్నాయం అయింది. ఈ పేరుతోనే అతడిని పిలుస్తుంటారు. ‘ఉద్యోగం వద్దు అనుకున్నప్పుడు...రిస్క్ చేస్తున్నావు అని ఎంతోమంది హెచ్చరించారు. రిస్క్ అని వెనక్కి తగ్గితే ఏమీ చేయలేము అనే విషయం తెలుసు. దీనికి కారణం నేను చేస్తున్న పనిపై నాకు ఉన్న సంపూర్ణ నమ్మకం. బరిలో మంచి టాలెంట్ ఉన్న ఎంతోమంది యూట్యూబర్స్ ఉన్నారు. అయితే నాకు ఒక నమ్మకం... నాకంటూ ఎక్కడో ఒకచోట స్థానం ఉంటుందని. దానికోసం వెదికాను. విజయం సాధించాను’ అంటున్న శ్లోక్ శ్రీవాస్తవ ‘ఫోర్బ్స్’ ఇండియన్ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు. -
ఐఐటీ ఢిల్లీకి విదేశీ విరాళాలు బంద్
న్యూఢిల్లీ: లైసెన్స్ రెన్యువల్ కాని కారణంగా దేశంలోని 5,789 ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాలను అందుకునే అవకాశాన్ని కోల్పోయాయి. ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), జామియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ తదితర ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ యాక్ట్) చట్టం కింద లైసెన్స్ పునరుద్ధరణకు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేయకపోవడం, చేసుకున్న దరఖాస్తు తిరస్కరణ, తదితర కారణాలతో ఈ సంస్థల లైసెన్స్ రెన్యువల్ కాలేదని కేంద్ర హోం శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సంస్థల గత లైసెన్స్ శనివారం(జనవరి ఒకటిన) ముగిసింది. ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆక్స్‌ఫామ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, గోద్రేజ్ మెమోరియల్ ట్రస్ట్, ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ, జేఎన్‌యూలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషర్మెన్స్ కోఆపరేటివ్స్, భారతీయ సంస్కృతి పరిషద్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాల లైసెన్స్ గడువు ముగిసింది. భారత్‌లోని ఎన్జీవోలు విదేశీ విరాళాలను సమీకరించాలంటే ఎఫ్సీఆర్ఏ కింద దరఖాస్తు చేసుకుని లైసెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. శుక్రవారం నాటికి వీటి సంఖ్య 22,762కాగా శనివారం తర్వాత వీటి సంఖ్య 16,829కి తగ్గింది. -
Meesho: ‘మీ షో యాప్’ ఫౌండర్ విదిత్ ఆత్రే సక్సెస్ స్టోరీ!
Meesho is the freshest Organization to join the Unicorn Club: కిందపడ్డప్పుడు ‘అయ్యో!’ అనుకుంటారు అందరు. ‘ఎందుకు పడ్డాం?’ అని ఆలోచిస్తారు కొందరు. రెండో కోవకు చెందిన వారు కాస్త లేటయినా ఘాటైన విజయం సాధిస్తారు.... ఇందుకు ఈ ఇద్దరే ఉదాహరణ... ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్న విదిత్ ఆత్రే ‘ఫోర్ట్స్’ జాబితాలోని యువ సంపన్నుల గురించి ఆసక్తిగా తెలుసుకునేవాడు. అలాంటి విదిత్ పవర్ఫుల్ ఫోర్బ్స్ ‘30 అండర్ 30’ ఏషియా జాబితాలోకి రాడానికి ఎంతో కాలం పట్టలేదు. ఇక కాస్త వెనక్కి వెళితే... చదువు పూర్తయిన తరువాత మంచి ఉద్యోగాలే చేశాడు విదిత్. ఆ సమయంలోనే అతడికొక మంచి ఆలోచన వచ్చింది. ఆన్లైన్ మార్కెటింగ్ కోసం యాప్ మొదలుపెడితే ఎలా ఉంటుంది? అని. అయితే తన ఆలోచనకు పెద్దగా మద్దతు లభించలేదు. ‘చాలా కష్టం’ అన్నవాళ్లే ఎక్కువ. దిల్లీ కాలేజీలో తన బ్యాచ్‌మేట్ సంజీవ్ బర్నావాల్ కూడా తనతో పాటే ‘ఫోర్బ్స్’ జాబితాలో చోటు సంపాదించాడు. కాస్త వెనక్కి వెళితే...తన చదువు పూర్తి అయిన తరువాత జపాన్‌లోని సోనీ కంపెనీలో మంచి ఉద్యోగం చేశాడు సంజీవ్. ఇండియాలో ఉన్న విదిత్, జపాన్‌లో ఉన్న సంజీవ్ తమ ఆలోచనలను కలిసి పంచుకునేవారు. వారి ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చిన తరువాత బెంగళూరులో హైపర్ లోకల్ ఫ్యాషన్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ ‘ఫ్యాష్‌నియర్’తో రంగంలోకి దిగారు. తామే స్వయంగా కరపత్రాలు పంచినా, కస్టమర్ల దగ్గరకు వెళ్లి ‘మీరు కష్టపడి షాప్‌కు రావాల్సిన అవసరం లేదు. మా యాప్ విజిట్ చేస్తే చాలు’ అని చెప్పినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మొదటి ప్రయత్నం విజయవంతంగా ఫ్లాప్ అయింది. అలా అని ‘చలో బ్యాక్’ అనుకోలేదు. తమ పని గురించి సూక్ష్మంగా విశ్లేషించుకున్నారు. అప్పుడు వారికి అర్ధమైందేమిటంటే ఫ్యాషన్ మార్కెట్‌కు ఉండే ‘వైడ్‌రేంజ్ ఆప్షన్స్’ వల్ల తమ ప్రయత్నం విజయవంతం కాలేదని. ఆ సమయంలోనే వారి ఆలోచనలు చిన్నవాపారుల చుట్టూ తిరిగాయి. సాధారణంగా చిన్న వ్యాపారులకు సొంత వెబ్సైట్లు ఉండవు. అలా అని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్...లాంటి పెద్ద వేదికల దగ్గరికి వెళ్లరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఫ్యాష్‌నియర్’కు శుభం కార్డు వేసి ‘మీ షో’(మేరీ షాప్–మై షాప్) యాప్‌ను డిజైన్ చేశారు. చిన్నవ్యాపారులకు ఇదొక అద్భుతమై మార్కెట్ ప్లేస్‌గా పేరు సంపాదించుకుంది. తమ ప్రాడక్స్‌ను యాడ్ చేయడానికి, వాట్సాప్,ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సులభంగా షేర్ చేయడానికి, సులభంగా యూజ్ చేయడానికి ‘బెస్ట్’ అనిపించుకుంది మీ షో. డెలివరీ, మానిటైజ్ల ద్వారా సెల్లర్స్ నుంచి కమీషన్ తీసుకుంటుంది మీ షో. ఈ ప్లాట్ఫామ్లో ప్రతి నెల సెల్లర్స్ సంఖ్య పెరుగుతుంది. చిన్న వ్యాపారుల కోసం ఏర్పాటయిన ఈ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ పెద్ద విజయం సాధించింది. మన దేశంలోని లార్జెస్ట్ సోషల్ కామర్స్ ప్లాట్ఫామ్లో ఒకటిగా నిలిచింది. విదిత్, సంజీవ్‌లను రైజింగ్స్టార్లుగా మార్చింది. చదవండి: Men's Day 2021: పక్కా జెంటిల్మన్ ఎలా ఉండాలో తెలుసా!.. అదే జెంటిల్‌నెస్.. -
వర్సిటీలు బహుశాస్త్ర మిశ్రిత కేంద్రాలుగా అవతరించాలి
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు బహుశాస్త్ర మిశ్రిత కేంద్రాలు (మల్టీ డిసిప్లీనరీ) అవతరించాల్సిన అవసరం ఉందని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ ఆచార్య రాంగోపాలరావు పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా ప్రణాళిక బోర్డు (ఏపీ హెచ్ఈపీబీ) రెండో సమావేశం శనివారం విశాఖలో జరిగింది. ఆంధ్రా యూనివర్సిటీ, ఐఐఎం విశాఖపట్నం, ఐఐపీఈ సంయుక్తంగా ఈ సమావేశానికి ఆతిథ్యమిచ్చాయి. ముఖ్య అతిథిగా వర్చువల్ విధానం ద్వారా పాల్గొన్న ఆచార్య రాంగోపాలరావు మాట్లాడుతూ.. జ్ఞానాన్ని సంపదగా మలచుకునే ప్రయత్నం జరగాలని చెప్పారు. పేటెంట్లకు దరఖాస్తు చేయడం, అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుదల లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. విశ్వవిద్యాలయాల అచార్యులే స్టార్టప్‌లను ఆరంభించే విధంగా నూతన విధానాలను అమలు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. విద్యను అందించడం, జ్ఞానాన్ని వృద్ధి చేయడం, ఆవిష్కరణలు జరపడం లక్ష్యంగా యూనివర్సిటీలు పనిచేయాలన్నారు. ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని ప్రపంచ పౌరునిగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. విద్య వ్యాపారం కాకూడదన్న ఉద్దేశంతో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పేదరికం విద్యకు అవరోధంగా మారకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. త్వరలో విశ్వవిద్యాలయాల ఉప కులపతుల ప్రగతిని సైతం సమీక్షిస్తామన్నారు. విద్యార్థులు సాధించే ప్రగతే విశ్వవిద్యాలయానికి కొలమానంగా మారుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యను సామాన్యులకు చేరువ చేస్తున్న వ్యక్తిగా ముఖ్యమంత్రి నిలిచిపోతారని పేర్కొన్నారు. సీఎం క్రీడలకు అధిక ప్రోత్సాహం కల్పిస్తూ గత రెండేళ్లలో రూ.6.50 కోట్లను వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహకాల కింద అందించారని తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏపీ స్టేట్ రీసెర్చ్ బోర్డు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, 13 వేల గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు, డిగ్రీలో ఆంగ్ల మాధ్యమం, స్పోకెన్ ఇంగ్లిష్ ట్యుటోరియల్స్, ఇ–కంటెంట్ అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, బ్లెండెడ్ లెర్నింగ్‌ను సమర్థవంతంగా అమలు చేయడం వంటి నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఏపీ కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, ఐఐఎం విశాఖ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్, ఐఐపీఈ డైరెక్టర్ ఆచార్య వీఎస్ఆర్కే కె.ప్రసాద్ మాట్లాడారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఆచార్య కె.రామమోహన్‌రావు, ఆచార్య టి.లక్ష్మమ్మ, కార్యదర్శి ఆచార్య బి.సుధీర్ ప్రేమ్‌కుమార్, ఏయూ డీన్లు ఆచార్య కె.రమాసుధ, ఆచార్య టి.షారోన్, రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతులు పాల్గొన్నారు. -
జేఈఈ–అడ్వాన్స్డ్ టాపర్ చిరాగ్
న్యూఢిల్లీ/పుణే: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)–అడ్వాన్స్డ్ పరీక్షలో మహారాష్ట్రలోని పుణే విద్యార్థి చిరాగ్ ఫలోర్ టాపర్‌గా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన గంగుల భువన్‌రెడ్డి రెండో ర్యాంకు, బిహార్‌కు చెందిన వైభవ్‌రాజ్ మూడో ర్యాంకు సాధించారు. ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ–ఢిల్లీ సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది జేఈఈ–అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటీ–ఢిల్లీ నిర్వహించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1.6 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 1.5 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 43 వేల మందికిపైగా అర్హత సాధించారు. వీరిలో 6,707 మంది బాలికలు ఉన్నారు. మొదటి ర్యాంకు సాధించిన చిరాగ్ ఫలోర్ మొత్తం 396 మార్కులను గాను 352 మార్కులు సాధించాడు. 17వ ర్యాంకర్ కనిష్కా మిట్టల్ బాలికల్లో అగ్రస్థానంలో నిలిచారు. అమె 315 మార్కులు సాధించారు. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ అభినందనలు తెలియజేశారు. ఆయన సోమవారం ట్వీట్ చేశారు. సమీప భవిష్యత్తులో ఆత్మ నిర్భర్ భారత్ కోసం పని చేయాలని కోరారు. పరీక్షలో కోరుకున్న ర్యాంకు పొందలేకపోయిన వారికి ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాలు పొందనున్నారు. ఎంఐటీలోనే చదువు కొనసాగిస్తా: చిరాగ్ జేఈఈ–అడ్వాన్స్డ్ టెస్టులో తనకు మొదటి ర్యాంకు దక్కినప్పటికీ అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లోనే చదువు కొనసాగిస్తానని చిరాగ్ ఫలోర్ తెలిపాడు. ఈ ఏడాది మార్చి లో ఎంఐటీలో అడ్మిషన్ పొందానని, ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా క్లాస్‌లకు హాజరవుతున్నానని వెల్లడించాడు. జేఈఈ–మెయిన్‌లో 12వ ర్యాంకు పొందిన చిరాగ్ అడ్వాన్స్‌డ్‌లో ఏకంగా ఫస్టు ర్యాంకు సొంతం చేసుకోవడం విశేషం. ఐఐటీల్లో సీటు దక్కించుకోవడం చాలా కష్టమైన విషయమని చిరాగ్ వివరించాడు. ప్రతిభకు మెరుగుదిద్దే విద్యావిధానం ఉన్న ఎంఐటీలోనే చదువు కొనసాగిస్తానని పేర్కొన్నాడు. ఎంఐటీ ప్రవేశ పరీక్ష కంటే జేఈఈ టెస్టే కఠినంగా ఉంటుందని, ఈ పరీక్ష తనకు భిన్నమైన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. చిరాగ్ ఫలోర్ ఢిల్లీని ప్రగతి పబ్లిక్ స్కూల్, పుణేలోని సెయింట్ ఆర్నాల్డ్ సెంట్రల్ స్కూల్లో చదివాడు. 2019లో హంగేరీలో జరిగిన 13వ అస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ ఇంటర్నేషనల్ ఒలంపియాడ్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. 2019లో అమెరికన్ మ్యాథమెటిక్స్ పోటీలో ఫస్టు ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 2020 సంవత్సరానికి గాను బాలశక్తి పురస్కారం స్వీకరించాడు. ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. జాతీయ స్థాయిలో టాప్ 10 ర్యాంకర్లు... 1. చిరాగ్ ఫాలర్ (మహారాష్ట్ర) 2. గంగుల భువన్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్) 3. వైభవ్‌రాజ్ (బిహార్) 4. ఆర్.మహేందర్‌రాజ్ (రాజస్తాన్) 5. కేశవ్ అగర్వాల్ (హరియాణా) 6. హర్ధిక్ రాజ్‌పాల్ (తెలంగాణ) 7. వేదాంగ్ ధీరేంద్ర అస్గోవాంకర్ (మహారాష్ట్ర) 8. స్వయం శశాంక్ చూబే (మహారాష్ట్ర) 9. హర్షవర్ధన్ అగర్వాల్ (హరియాణా) 10. ధ్వనిత్ బేనీవాల్ (హరియాణా) -
కోవిడ్ చికిత్సలో టీకోప్లానిన్ అద్భుతం!
న్యూఢిల్లీ: కోవిడ్ చికిత్సలో టీకోప్లానిన్ అనే డ్రగ్‌తో మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు ఐఐటీ ఢిల్లీకి చెందిన కుసుమ స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ పరిశోధనలో స్పష్టమైంది. ఈ డ్రగ్ ఇప్పటికే క్లినికల్‌గా ఆమోదం పొందింది. కరోనా వైద్యంలో భాగంగా ఉపయోగిస్తున్న ఇతర ఔషధాల కంటే టీకోప్లానిన్ దాదాపు 20 రెట్లు ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు గుర్తించామని ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ అశోక్ పటేల్ చెప్పారు. 23 ఆమోదిత ఔషధాల మిశ్రమంతో టీకోప్లానిన్ డ్రగ్‌ను తయారుచేశారు. తాజా పరిశోధన వివరాలను అంతర్జాతీయ పత్రిక బయోలాజికల్ మాక్రోమాలిక్యూల్స్‌లో ప్రచురించారు. టీకోప్లానిన్పై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని ప్రొఫెసర్ అశోక్ పటేల్ చెప్పారు. కాగా, జలుబు నుంచి ఉపశమనం కోసం వాడే నాసల్ స్ర్పేతో కరోనాను తగ్గించవచ్చని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆస్ట్రేలియా బయోటెక్ కంపెనీ ఎనా రెస్పిరేటరీ జంతువుల మీద చేసిన ప్రయోగాల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. నాసల్ స్ప్రే వాడకంతో కరోనా వైరస్ పెరుగుదలని గణనీయంగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: గాల్లో కరోనా వ్యాప్తిపై సీసీఎంబీ శోధన) -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ప్రాథమిక ‘కీ’
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2020 పరీక్ష ప్రాథమిక ‘కీ’ మంగళవారం వెలువడనుంది. ఆదివారం నిర్వహించిన పేపర్–1, పేపర్–2 ప్రశ్నపత్రాల కాపీలను పరీక్ష నిర్వహణ సంస్థ.. ఐఐటీ– ఢిల్లీ సోమవారం వెబ్సైట్లో పొందుపరిచింది. కీ విడుదల చేశాక విద్యార్థుల నుంచి ఈ నెల 30 సాయంత్రం వరకు అభ్యంతరాలను స్వీకరించనుంది. అనంతరం అక్టోబర్ 5న తుది ‘కీ’ని, ర్యాంకుల జాబితాను విడుదల చేయనుంది. జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్సైట్ నుంచి ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్–2020కు 2.5 లక్షల మంది అర్హత సాధించగా 1.60 లక్షల మంది మాత్రమే పరీక్షకు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ► వీరిలో 96 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్–1కు 1.51 లక్షలు, పేపర్ 2కు 1.50 లక్షల మంది హాజరయ్యారు. ► అక్టోబర్ 6 నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ అ«థారిటీ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబర్ 9 వరకు మొత్తం 6 విడతల కౌన్సెలింగ్ ద్వారా మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థులు ఒకే రకమైన మార్కులతో సమానంగా ఉంటే నెగెటివ్ సమాధానాలివ్వని, ఎక్కువ పాజిటివ్ మార్కులున్న అభ్యర్థులకు మెరుగైన ర్యాంక్ ఇస్తారు.అందులోనూ సరిసమానంగా అభ్యర్థులుంటే వారిలో గణితంలో ఎక్కువ స్కోరు ఉన్నవారికి అధిక ర్యాంకు కేటాయిస్తారు. ► ఆ తర్వాత భౌతికశాస్త్రం మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ సమాన స్థాయిలోఅభ్యర్థులుంటే నిబంధనల మేరకు ర్యాంకులిస్తారు. -
జాబ్ నోటిఫికేషన్ తప్పుగా ఇచ్చిన ఐఐటీ!
సాక్షి, న్యూఢిల్లీ: నలభై ఐదు వేల రూపాయల జీతం అంటే తక్కువేమీ కాదు. వెన్ను విరిచే ప్రీ పెయిడ్ బాధ్యతలు ఏమీ లేకుంటే ఢిల్లీలోనైనా.. ‘వీధి వీధి నీదే బ్రదరూ.. ’ అని పాడుకోకుండా బతికేయొచ్చు. జీతం ఎంతో తెలిసింది కదా.. ఇప్పుడు పోస్ట్ ఏమిటో చూడండి. డాగ్ హ్యాండ్లర్. శునకం బాగోగులను చూసుకోవడం. ఒకటే శునకం. ఒకటే పోస్టు. ఢిల్లీ ఐ.ఐ.టి.లో పోస్టింగ్. బహుశా అది ఆ విద్యా ప్రాంగణంలోని ఓ అధికార నివాస గృహ జాగిలం అయి ఉండొచ్చు. వాక్–ఇన్ ఇంటర్వ్యూ కోసం ఐ.ఐ.టి. ప్రకటన ఇచ్చింది. 20–35 ఏళ్ల వయసు కలిగి, బి.ఎ. లేదా బీఎస్సీ లేదా బీకాం లేదా బీటెక్ చేసిన వారెవరైనా నేరుగా ఇంటర్వ్యూ కి వెళ్లొచ్చు. (ఇప్పుడు కాదులెండి. సెప్టెంబర్ 5 నే ఇంటర్వ్యూలు అయిపోయాయి). అయితే డాగ్ హ్యాండ్లర్ పోస్ట్‌కి ఈ డిగ్రీలు ఎందుకు అని పట్టభద్రులైన పిల్లలు ఆ నోటిఫికేషన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సెటైర్ లు వెయ్యడం మొదలు పెట్టారు. ఓ సెటైర్ వి.రామగోపాల్ రావ్ గారికి కూడా తగిలింది. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆయన. వెంటనే ట్విట్టర్లోకి వెళ్లారు. ‘మనుషులన్నాక మిస్టేక్స్ జరుగుతుంటాయి. వెటెరినరీ సైన్సెస్‌లో డిగ్రీ చేసిన వాళ్లు.. అని ఇవ్వబోయి బై మిస్టేక్ బీటెక్ లు, మిగతా డిగ్రీలు ఇచ్చాము. ఈ సంగతిని ఇక్కడితో వదిలేయండి..’ అని ట్వీట్ చేశారు. అయితే ఆయన మాత్రం వదిలేయలేదు! ‘అయినా జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే తెలియట్లేదా.. వెటెరినరీ చదివిన వాళ్లు కావాలని.. అవన్నీ మీరే చూస్కోవాలి’ అని తిరుగు మాట ఒకటి వేశారు. తప్పును పూర్తిగా ఒప్పేసుకుంటే మళ్లీ అదొక తప్పు అవుతుందనుకున్నారో ఏమో ఐ.ఐ.టి.డైరెక్టర్. చదవండి: భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తత.. అర్ధరాత్రి కాల్పులు -
ఇంట్లోనే కరోనా టెస్టులు
న్యూఢిల్లీ: కరోనా వచ్చిందో లేదో ఇంట్లోనే ఉండి నిర్ధారించుకునే సరికొత్త టెస్టింగ్ కిట్ ను ఐఐటీ ఢిల్లీ, జాతీయ రసాయన లాబొరేటరీ (ఎన్సీఎల్)లు కలసి తయారు చేస్తున్నాయి. తక్కువ సమయంలోనే ఈ కిట్ ఫలితాలను వెల్లడిస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీనికి మైక్రోసాఫ్ట్ ఇండియా వంటి దిగ్గజ సంస్థ ఆర్థిక చేయూతను అందిస్తోంది. వీరు ఎలీసా (ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసాయ్) ఆధారంగా కోవిడ్ ను నిర్ధారించే ప్రక్రియతో తయారుకానుంది. ప్రస్తుతం నిర్ధారణకు అయ్యే ఖర్చులకంటే తక్కువ ఖర్చులోనే ఇది పూర్తవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఈ కిట్లను ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఉన్న మెడ్ టెక్ జోన్ లో తయారు చేస్తున్నామని, ఓ నెలరోజుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. -
జేఈఈ కౌన్సెలింగ్ 6 రౌండ్లకు కుదింపు!
సాక్షి, అమరావతి: జాతీయ విద్యా సంస్థలైన ఐఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తదితర సంస్థల్లో 2020–21 విద్యా సంవత్సరపు ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను ఏడు నుంచి ఆరు దశలకు కుదించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ భావిస్తోంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్స్, అడ్వాన్సుడ్ పరీక్షలలో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఇప్పటివరకు ఈ సంస్థల్లో ప్రవేశాలకు ఏడు రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్–19, లాక్డౌన్ల దృష్ట్యా జేఈఈ మెయిన్స్ రెండో విడత, అడ్వాన్సుడ్ పరీక్షలు ఆలస్యమైన నేపథ్యంలో ఈ రెండు ముగిసిన అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియను ఆరు విడతలకు కుదించి సీట్లు భర్తీ చేయడమే మంచిదని జేఈఈ అడ్వాన్సును నిర్వహిస్తున్న ఐఐటీ ఢిల్లీ.. జాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీకి ప్రతిపాదించింది. దీనిపై అన్ని ఐఐటీల నుంచి ఆమోదం వచ్చాక సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డుకు పంపిస్తారు. జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్స్‌ను, జేఈఈ అడ్వాన్సును ఆగస్టు 23న నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. జేఈఈ అడ్వాన్సు ఫలితాలను వారంలో ఇవ్వాలని, అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించి ఆరు విడతల్లో పూర్తిచేస్తే అక్టోబర్ మొదటి వారం నుంచే తరగతులను ఆరంభించేందుకు అవకాశముంటుందని భావిస్తున్నారు. కోవిడ్–19 గందరగోళ పరిస్థితులు లేకపోతే సెప్టెంబర్‌లోపే తరగతులను ప్రారంభించేవారు. (1–6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంపై జీవో జారీ..) -
జేఈఈ అడ్వాన్స్ పరీక్ష తేదీ ఖరారు
న్యూఢిల్లీ: జేఈఈ– అడ్వాన్స్డ్ పరీక్ష తేదీని ఐఐటీ జాయింట్ అడ్మిషన్ బోర్డ్ ఖరారు చేసింది. దేశంలోని 23 ఐఐటీల్లో ప్రవేశాల కోసం 2020 మే 17వ తేదీన జరిగే పరీక్షను ఢిల్లీ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ–డీ) నిర్వహించనుందని ప్రకటించింది. మొట్టమొదటిసారిగా అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ రాంగోపాల్ చెప్పారు. భారత్‌లోని ఐఐటీల్లో చదువుకున్న చాలా మంది అమెరికాలో ఉన్నందునే అక్కడ నిర్వహిస్తున్నట్లు వివరించారు. జేఈఈ– అడ్వాన్స్డ్ పరీక్ష ద్వారా దేశంలోని 23 ఐఐటీల్లో ప్రవేశం కల్పించనున్నారు. జేఈఈ మెయిన్స్ నుంచి గతంలో కంటే వచ్చే ఏడాది 10 వేల మందిని ఎక్కువగా తీసుకుంటామని రాంగోపాల్ వెల్లడించారు. జేఈఈ– అడ్వాన్స్‌డ్‌కు అన్ని కేటగిరీలతో కలిపి 2 లక్షల 50 వేల మంది విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. జేఈఈ– అడ్వాన్స్డ్ పరీక్ష: మే 17, 2020 మొదటి పేపర్: ఉ.9 నుంచి మ. 12 వరకు రెండో పేపర్: మ.2.30 నుంచి సా.5.30 వరకు -
ఐఐటీల్లో అమ్మాయిలు అంతంతే!
దేశంలోని 3,000 విద్యాసంస్థల నుంచి ఏటా 15 లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. వారిలో యువతులు 30 శాతం మంది మాత్రమే. అడ్వాన్స్డ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) కోచింగ్ క్లాసుల తాలూకూ ప్రకటనల్లో అమ్మాయిల ఫొటోలు దాదాపుగా కనిపించని పరిస్థితి. ఐఐటీల్లో పరిస్థితి మరింత అన్యాయం. ఈ ఏడాది 23 ఐఐటీల్లో మొత్తం 38,705 మంది అభ్యర్థులు ప్రవేశార్హత సాధించగా అందులో బాలికలు 5,356 (13.8 శాతం) మంది మాత్రమే. అమ్మాయిల్లో టాపర్‌గా నిలిచిన షబ్నమ్ సహాయ్ 10వ ర్యాంకు సాధించింది. 2018లో టాప్ 500 మంది అభ్యర్థుల్లో అమ్మాయిల సంఖ్య 23 మించలేదు. ఉన్నత విద్యారంగంలో చోటుచేసుకున్న లింగ వివక్షకు ఇదొక ప్రబల ఉదాహరణ. బాలికలపట్ల సమాజ ధోరణులే ఇందుకు కారణమవుతున్నాయంటున్నారు శాస్త్ర సాంకేతికశాఖ కార్యదర్శి అశుతోశ్ శర్మ. కుటుంబం అబ్బాయిలను ప్రోత్సహిస్తోంది. వారు మరో ఆలోచన లేకుండా తమ ఐఐటీ కలలను సాకారం చేసుకోగలుగుతున్నారు. అమ్మాయిలకు సమర్థత ఉన్నప్పటికీ ప్రోత్సాహం కరువవుతోంది. ‘నా కూతురు భద్రంగా ఉంటుందా? ఇంటికి దూరంగా మనగలుగుతుందా? కోర్సు డిమాండ్ చేసిన విధంగా చదువు సాగించేందుకు ఆమె ఆరోగ్యం సహకరిస్తుందా?’ వంటి ఎన్నో ప్రశ్నలు తల్లిదండ్రుల్లో తలెత్తుతున్నాయి. వారిని ఆందోళనకు లోను చేస్తున్నాయి. ఐఐటీల్లో సీటు సంపాదించాలంటే విద్యార్థులు గట్టి కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అదొక ఖరీదైన వ్యవహారం. ఇంటికి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అమ్మాయిల విషయంలో ఖర్చు పెట్టేందుకు సిద్ధ్దపడని దుస్థితి. పైగా రవాణా సౌకర్యం, హాస్టల్లో ఉండాల్సి రావడం గురించి నానారకాల భయాలు. ఈ పరిస్థితుల్లో అమ్మాయిల్ని స్థానిక కళాశాలల్లో చేర్చడం ఉత్తమమని తల్లిదండ్రులు భావిస్తున్నట్లు కాన్పూర్‌లో పార్ధా కోచింగ్ సెంటర్ నడుపుతున్న మనీష్ సింగ్ చెబుతున్నారు. ఈ ఏడాది ఆయన 1,500 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. వారిలో 10 శాతం మంది మాత్రమే బాలికలు. వారెవ్వరూ ఉత్తీర్ణులు కాలేదు. సీటు లభించాలేగానీ అమ్మాయిలు అబ్బాయిల కంటే మెరుగ్గా రాణించగలుగుతున్నారంటారు ఐఐటీ ఢిల్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సుమీత్ అగర్వాల్. ప్రవేశపరీక్ష బాలికలకు ఒకింత అవరోధంగా ఉందని ఆయన చెబుతున్నారు. ఐఐటీల్లో లింగ నిష్పత్తి మెరుగుపరచాలనే ఉద్దేశంతో గతేడాది ఐఐటీ కౌన్సిల్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన బాలికలకు అదనంగా సీట్లు కేటాయించింది. దీంతో వారి శాతం 8 నుంచి 16కి పెరిగింది. ఐఐటీ ఢిల్లీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో 2016లో 70 మంది బాలికలు చేరగా ఈ ఏడాదికి ఆ సంఖ్య 190కి పెరిగిందని అగర్వాల్ తెలిపారు. ఐఐటీలు లింగ సమతౌల్యత పాటించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితి విశదపరుస్తోంది. లేకుంటే జనాభాలో 50 శాతం మంది ప్రతిభా సామర్థ్యాలను మనం కోల్పోతామంటున్నారు అగర్వాల్. మెరుగైన సమాజం కోసం సాంకేతికతను వాడుకోవాలని భావిస్తున్న మనం.. ఇందులో అన్ని తరగతుల ప్రజలను భాగస్వాముల్ని చేయాల్సి ఉందని అగర్వాల్ వంటి మేధావులు సూచిస్తున్నారు. -
క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ బాంబే, ఢిల్లీ
న్యూఢిల్లీ: క్వాక్వరెల్లి సైమండ్స్ (క్యూఎస్) వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్ బుధవారం విడుదలవ్వగా ఐఐటీ–బాంబే(152), ఐఐటీ–ఢిల్లీ(182), ఐఐఎస్సీ–బెంగళూరు(184)లకు టాప్– 200లో స్థానం లభించింది. ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–ఖరగ్‌పూర్, ఐఐటీ–కాన్పూర్, ఐఐటీ–రూర్కీలకు టాప్–400లో చోటు దక్కింది. క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్ 2020ని లండన్‌లో విడుదల చేశారు. భారత్ నుంచి ఓపీ జిందాల్ టాప్–1,000లో చోటు సంపాదించిన అత్యంత కొత్త యూనివర్సిటీగా నిలిచింది. జామియా మిలియా ఇస్లామియా, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ తదితరాలకు కూడా ర్యాంకులు దక్కాయి. -
ఇక ‘ఫేస్బుక్’ ద్వారా వ్యాపారం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలతోపాటు భారత్‌లో కూడా ‘ఈ కామర్స్ (ఆన్లైన్ షాపింగ్)’ దుమ్మురేపుతున్న విషయం తెల్సిందే. ఈ రంగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్ డీల్, పేటీఎం మాల్ సంస్థలు రాణిస్తున్నాయి. అయినప్పటికీ ఈ కంపెనీల ద్వారా ఐదు కోట్ల మంది భారతీయ వినియోగదారులు మాత్రమే తరచుగా కొనుగోళ్లు చేస్తున్నారట. అందుకని ఇప్పుడు ‘సోషల్ కామర్స్ (సామాజిక వాణిజ్యం)’ అంటే ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా సంస్థల ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించడం. ఫేస్‌బుక్‌కు దాదాపు 25 కోట్ల మంది యూజర్లు ఉండడంతో వారిని వినియోగదారులుగా చేసుకొని సరికొత్త ఆన్లైన్ వ్యాపారాన్ని నిర్వహించేందుకు ‘మీషో’ పుట్టుకొచ్చింది. ‘మేరీ షాప్’ అనే హిందీ అర్థానికి స్వల్పరూపమే మీషో. ఇందులో కోట్ల డాలర్ల పెట్టుబడులు ‘ఫేస్బుక్’ పెట్టినట్లు తెల్సింది. అయితే వాటి వివరాలను వెల్లడించేందుకు ఆ సంస్థ నిరాకరిస్తోంది. గతేడాది నాటికే మీషో 25 కోట్ల డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. ఇందులో ఫేస్‌బుక్‌తోపాటు మరి కొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. యూజర్ల డేటాను అమ్ముకున్నట్లు భారత ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లను ఎదుర్కొన్న ఫేస్బుక్, భారత్ స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం ఆ సంస్థకు లాభించే అంశం. మీషో వ్యవస్థాపకులు ఢిల్లీలోని ఐఐటీలో 2008–2012 బ్యాచ్‌మేట్లయిన 27 ఏళ్ల విదిత్ ఆత్రే, 28 ఏళ్ల సంజీవ్ బార్వల్ బెంగళూరు కేంద్రంగా మీషోను స్థాపించారు. పెద్ద పెద్ద మాల్స్ ద్వారా ఆన్లైన్ వ్యాపారాన్ని నిర్వహించిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ఇప్పుడు చిల్లర వ్యాపారులను కూడా తనలో చేర్చుకుంది. చిల్లర వ్యాపారులు తమ వస్తువులను ఈ సంస్థల ద్వారా అమ్ముకోవచ్చు. వారికంటూ ప్రత్యేకమైన నెట్‌వర్క్‌గానీ, ‘యాప్’ గానీ ఏదీ లేదు. వారినందరిని ఓ నెట్వర్క్ పరిధిలోకి తెస్తే, సోషల్ మీడియాకు వారిని లింక్ చేస్తే ఎలా ఉంటుందన్న విదిత్, సంజీవ్‌ల ఆలోచనలకు రూపమే ‘మీషో’. ఈ చిల్లర వ్యాపారులు తమ కొత్త ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలను ఫేస్బుక్లో షేర్‌చేసుకునే అవకాశం కూడా ఉందని వారన్నారు. ఇక భవిషత్తంగా ‘సోషల్ కామర్స్’దేనని వారు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. -
కొక్కొరొకోడింగ్
ఆరేళ్ల ప్రాయంలోనే కోడింగ్ నేర్చుకుని వండర్ కిడ్ అనిపించుకున్న సమైరా మెహతా.. ఎనిమిదేళ్లు వచ్చేసరికే ఓ ప్రత్యేకమైన బోర్డ్ గేమ్ రూపొందించి ఔరా అనిపించింది. తనకున్న నైపుణ్యాన్ని ఇతర పిల్లలకు కూడా అందించేందుకు గూగుల్ ‘కీనోట్ స్పీకర్’గా మారి సిలికాన్ వ్యాలీలో చిన్నారుల చురుకుదనాన్ని మేలుకొలుపుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ఇండో– అమెరికన్. ‘కోడర్‌బన్నీజ్’ సీఈఓ ఐఐటీ– ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన రాకేశ్ మెహతా (ప్రస్తుతం ఇంటెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ హెడ్– కాలిఫోర్నియా) తన ఇద్దరు పిల్లలు సమైరా, ఆదిత్లకు బాల్యం నుంచే టెక్ పాఠాలు నేర్పించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కోడింగ్‌పై పట్టు సాధించిన సమైరా ఎనిమిదేళ్ల ప్రాయంలోనే.. తోటి పిల్లలకు కోడింగ్ పాఠాలు నేర్పించేందుకు వీలుగా ‘కోడర్‌బన్నీజ్’ బోర్డ్ గేమ్‌ను రూపొందించింది. తద్వారా 2016లో థింక్ ట్యాంక్ నిర్వహించిన ‘పిచ్ఫెస్ట్’లో రెండో బహుమతి గెలుపొంది 2500 డాలర్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘కోడర్‌బన్నీజ్’ పేరు మీదుగానే ఓ సంస్థను స్థాపించి తన బోర్డ్ గేమ్‌ను అమెజాన్‌లో అమ్మడం మొదలుపెట్టింది. దీనికి అనూహ్య స్పందన లభించడంతో యంగ్ సీఈఓ సమైరా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.ప్రస్తుతం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజిన్స్– ఏఐ) కోడింగ్‌పై దృష్టి సారించిన సమైరా ప్రస్తుతం ‘కోడర్మైండ్స్’ అనే కొత్త బోర్డ్ గేమ్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఈ గేమ్ ద్వారా రోబోట్స్ తయారుచేసేందుకు అవసరమైన ప్రాథమిక అంశాలను (ఏఐ మోడల్ అభ్యాసం) సులభంగా నేర్చుకోవచ్చు. అయితే ఈ గేమ్ రూపకల్పనలో సమైరా తమ్ముడు ఆదిత్ (6) కూడా తన వంతు సహాయం చేస్తుండటం విశేషం. రియల్ లైఫ్ పవర్పఫ్ గర్ల్ సమైరా ప్రతిభకు ఫిదా అయిన దిగ్గజ సంస్థ గూగుల్ ఆమెను సిలికాన్ వ్యాలీలో తమ కీనోట్ స్పీకర్‌గా నియమించుకుంది. పిల్లలకు కోడింగ్ పాఠాలు నేర్పేందుకు ఆమె చేత వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ హెడ్‌క్వార్టర్స్ మౌంటేన్ వ్యూ (కాలిఫోర్నియా)లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ సంస్థ చీఫ్ కల్చరల్ ఆఫీసర్ స్టాసీ సలీవన్ సమైరాను కలిశారు. ఆమె వాక్చాతుర్యం, నైపుణ్యానికి ముచ్చటపడిన స్టాసీ.. ‘సమైరా ప్రతిభావంతురాలు. తొందర్లోనే గూగుల్‌లో పూర్తి స్థాయిలో ఆమె పనిచేసే అవకాశం ఉంది’ అంటూ కొనియాడారు. ఇక కార్టూన్ నెట్వర్క్ మార్కెటింగ్ విభాగం తమ చానల్ రూపొందించిన ‘యంగ్ ఇన్స్పైరింగ్ గరల్స్’ అనే కార్యక్రమంలో సమైరాకు చోటు కల్పించి.. ‘ద రియల్ పవర్పఫ్ గర్ల్’గా సమైరాను అభివర్ణించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా సమైరా ప్రతిభను గుర్తించింది. ఆసక్తే తనను నిలిపింది ‘‘సమైరా ఇండియాస్ వండర్ కిడ్ అని నా స్నేహితులు అంటూ ఉంటారు. కానీ తను కూడా అందరిలాంటిదే. కాకపోతే కోడింగ్ పట్ల ఉన్న ఆసక్తి ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. అయితే చిన్నతనంలోనే తను ఇంతటి పేరు ప్రతిష్టలు సంపాదించడం నాకు ఆనందంగా ఉన్నప్పటికీ.. కీర్తి తాలూకూ ప్రభావం తన మీద పడకూడదు అనుకుంటాను. ఒత్తిడి లేకుండా పనిచేస్తేనే సమైరా మరిన్ని విజయాలు సాధిస్తుంది’’ అని రాకేశ్ మెహతా కూతురి గురించి చెప్పారు. – సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్ డెస్క్ వంద కోట్ల మందికి నేర్పుతా ‘‘ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉంటూనే తమ పిల్లలు కోడింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలని భావిస్తున్నారు. అటువంటి వారికి కోడర్‌బన్నీజ్ వంటి నాన్– డిజిటల్ బోర్డ్ గేమ్స్ ఎంతో ఉపయోగకరం. ఈ ప్రపంచంలో ఉన్న సుమారు వంద కోట్ల మంది పిల్లలకు నా సంస్థ ద్వారా కోడింగ్ నైపుణ్యాలు నేర్పించడం నా ఉద్దేశం. నాకు తెలిసీ వాళ్లంతా కోడింగ్ చేయగలిగే సామర్థ్యం కలిగిన వారే. కాకపోతే వారి కోసం కొంచెం సమయం కేటాయించడంతో పాటుగా కోడర్‌బన్నీజ్ వంటి ఈజీ గేమ్‌ల అవసరం ఉంది. అమెజాన్ ద్వారా ఏడాదిలో వెయ్యి బాక్సుల బోర్డ్ గేమ్స్ అమ్మాను. దాని ద్వారా 35 వేల డాలర్ల ఆదాయం పొందాను. నేను ఆరేళ్ల వయసులోనే కోడింగ్ నేర్చుకున్నాను. ప్రస్తుతం కీనోట్ స్పీకర్‌గా కోడింగ్ మెళకువలు నేర్పుతున్నాను. ఈ క్రమంలో అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా, ఫేక్‌బుక్ సీఈఓలను కలవడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. కోడర్‌బన్నీజ్ ఐడియాను వారిరువురూ మెచ్చుకున్నపుడు ఎంతో గర్వంగా అన్పించింది. ప్రస్తుతం మా వెబ్సైట్లో రోబోటిక్స్, గేమ్, ఎడ్యుకేషన్ సెక్టార్లలో వివిధ అంశాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. వీటన్నింటిలో మా నాన్న పాత్ర ఎంతగానో ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడమే నా ఆశయం’’ అంటూ పదేళ్ల సమైరా తన అనుభవాలను పంచుకుంది. అంతేకాదు తన కంపెనీ పేరిట విరాళాలు సేకరించి అనాథలకు ఆశ్రయం కల్పిస్తూ పెద్ద మనసు చాటుకుంటోంది కూడా. – సమైరా (10) , ‘కోడర్‌బన్నీజ్’ సీఈఓ -
మహిళల ‘కష్టాలు’ తీర్చే బుల్లి సాధనం
న్యూఢిల్లీ: అపరిశుభ్రంగా ఉండే ప్రజా మరుగుదొడ్లు, వాష్‌రూమ్స్‌లో మహిళలు నిలబడే మూత్రవిసర్జన చేసేందుకు ఉపయోగపడే అత్యంత సురక్షితమైన చిన్న వస్తువును ఐఐటీ విద్యార్థులు తయారుచేశారు. వరల్డ్ టాయిలెట్æ డే ను పురస్కరించుకుని సోమవారం దాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చారు. వాష్‌రూమ్‌లోని టాయిలెట్ సీటుకు తగలకుండా నిలబడే మూత్రవిసర్జన చేసేలా శాన్ఫీ(శానిటేషన్ ఫర్ ఫిమేల్)ని డిజైన్ చేశారు. దీని ధర కేవలం రూ.10. ఎయిమ్స్‌లో దీని ప్రయోగపరీక్షలు గతంలోనే పూర్తయ్యాయి. స్టాండప్ ఫర్ యువర్సెల్ఫ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా లక్ష శాంపిళ్లను ఉచితంగా పంపిణీచేయనున్నారు. ‘పనిమీద బయటికొచ్చిన సందర్భాల్లో ఇకపై మహిళలు మూత్రాన్ని ఉగ్గబట్టుకోవాల్సిన పనిలేదు. గర్భిణిలు, వికలాంగులు ఇలా మహిళలందరికీ అనువుగా దీన్ని తయారుచేశాం. రైల్వేస్టేషన్లు, రైళ్లు, బస్స్టేషన్లలో పబ్లిక్ టాయిలెట్లలో వాడేందుకు వీలుగా డిజైన్ చేశాం. శాన్ఫీ పైభాగం నీటికి తడిచిపోదు. ఒకసారి మాత్రమే వాడి పడేసే ఇది పర్యావరణహితం. రుతుస్రావ సమయంలోనూ దీన్ని వాడుకోవచ్చు’ అని అర్చిత్ వివరించారు. -
ఆ ఐఐటీ దేశంలోనే టాప్
సాక్షి, న్యూఢిల్లీ : విద్యా, ఉద్యోగ కల్పనల్లో ఐఐటీ-బాంబే యూనివర్సిటీ మెరుగ్గా ఉందని క్వాక్వారెల్లి సిమండ్స్ (క్యూఎస్) ర్యాకింగ్స్ సంస్థ వెల్లడించింది. 2019 సంవత్సరానికి గాను దేశంలోని ఉన్నత విద్యా సంస్థలపై నిర్వహించిన సర్వేలో ఐఐటీ బాంబే అధిక పాయింట్లు సాధించి టాప్‌లో నిలిచిందని తెలిపింది. ఇక ఐఐఎస్సీ బెంగుళూరు సైన్స్ విభాగంలో టాప్‌లో నిలవగా... ఓవరాల్‌గా రెండో స్థానంలో ఉంది. విద్యా ప్రమాణాలు, ఉద్యోగ అవకాశమిచ్చే సంస్థల ప్రతిష్ట ఆధారంగా సర్వే నిర్వహించినట్టు క్యూఎస్ ర్యాకింగ్స్ తెలిపింది. టాప్‌టెన్ యూనివర్సిటీలకు క్యూఎస్ సర్వే ర్యాంకులు ప్రకటించింది. మూడు, నాలుగు స్థానాల్లో ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ ఉండగా.. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్ 5, 6 స్థానాల్లో ఉన్నాయి. ఇక, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏడో స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఎనిమిదో స్థానాల్లో నిలిచాయి. ఐఐటీ రూర్కే తొమ్మిదో స్థానంలో, ఐఐటీ గువాహటి పదో స్థానాల్లో ఉన్నాయి. -
6 విద్యా సంస్థలకు కిరీటం
న్యూఢిల్లీ: ఆరు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ‘ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ (ఐవోఈ)’ హోదా కల్పించింది. ఇందులో మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలుగా తీర్చిదిద్దేందుకు వీటికి స్వయం ప్రతిపత్తి కల్పించడంతోపాటు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేయనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) బెంగళూరుతోపాటు ప్రైవేటు సంస్థలైన మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలానీ, రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన జియో ఇన్స్టిట్యూట్ను కేంద్రం ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్‌గా గుర్తించింది. ఐవోఈ హోదా పొందిన ఈ మూడు ప్రభుత్వ సంస్థలకు వచ్చే ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్ల నిధులను కేంద్రం అందజేయనుంది. ప్రైవేటు సంస్థలకు మాత్రం ప్రభుత్వ నిధులు అందవు. మొత్తంగా 20 సంస్థలకు (10 ప్రభుత్వ, 10 ప్రైవేటు సంస్థలు కలిపి) ఐవోఈ హోదా ఇవ్వాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి నేతృత్వంలోని ఎంపవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ (ఈఈసీ).. తొలి దశలో 6 సంస్థలకు ఐవోఈ ప్రకటించింది. టాప్ 100లో ఒక్క వర్సిటీ లేదు ‘ఐవోఈ దేశానికి ఎంతో ముఖ్యం. దేశంలో మొత్తం 800 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 100 వర్సిటీల్లో ఒక్కటి కూడా చోటు దక్కించుకోలేదు. కనీసం టాప్ 200లో నిలవలేదు. తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఉపకరిస్తుంది’ అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. ఐఓఈ హోదా కోసం తెలంగాణకు చెందిన ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు 114 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 11 సెంట్రల్ యూనివర్సిటీలు, 27 టాప్ ఐఐటీలు, ఎన్ఐటీలు, రాష్ట్రాలకు చెందిన 27 వర్సిటీలు, పది ప్రైవేటు వర్సిటీలు, నాలుగు గ్రీన్‌ఫీల్డ్ సంస్థలు ఉన్నాయి. ఇంకా స్థాపించని సంస్థకు ఐఈవోనా? రిలయన్స్ సంస్థకు చెందిన జియో ఇన్స్టిట్యూట్ను ఇంకా స్థాపించనేలేదనీ, ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను కాదని జియో ఇన్స్టిట్యూట్కు ఐఈవో హోదా ఎలా ఇచ్చా రని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు జియో ఇన్స్టిట్యూట్ అనే విద్యా సంస్థ ఒకటి రాబోతోందని ప్రపంచానికి తెలిసిందే సోమవారమని అంటున్నారు. ‘జియో ఇన్స్టిట్యూట్కు క్యాంపస్ లేదు. వెబ్సైట్ లేదు. కానీ ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్ లేదా ప్రైవేట్ రంగంలోని అశోక వర్సిటీ, ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీ వంటి ప్రఖ్యాత సంస్థలనెన్నింటినో కాదని ఐఈవో హోదా జియోకు ఎలా దక్కింది?’ అని పలువురు విద్యావేత్తలు సహా అనేక మంది ట్వీటర్లో హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌ను ప్రశ్నించారు. అయితే జియోకు ఐఈవో హోదా ఇవ్వడాన్ని యూజీసీ సమర్థించుకుంది. గ్రీన్‌ఫీల్డ్ ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలో జియోకు ఆ హోదా ఇచ్చామనీ, ఈ కేటగిరీ కింద మొత్తం 11 సంస్థలు దరఖాస్తు చేసుకోగా జియోను అవకాశం వరించిందని యూజీసీ పేర్కొంది. -
ఆ ఐఐటీలకు అందలం..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐఎస్సీ బెంగళూర్‌లకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సోమవారం ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ (ఐఓఈ) హోదా కల్పించింది. వీటితో పాటు ప్రైవేట్ రంగంలోని మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలానీ, జియో ఇనిస్టిట్యూట్లకు కూడా ఎమినెన్స్ హోదాను వర్తింపచేసింది. ఐఓఈ హోదా కోసం జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ సహా యూజీసీకి 100కు పైగా దరఖాస్తులు అందాయి. ఆయా సంస్థలకు ఐఓఈ హోదా కల్పించినట్టు కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్వీట్ చేశారు. ఈ హోదా లభించడంతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు పూర్తి స్వయం ప్రతిపత్తి లభించినట్టు అవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సంస్థలకు ఉన్నత విద్యా సంస్థలుగా లభించే నిధులతో పాటు ఐదేళ్లలో రూ 1000 కోట్లు అదనపు నిధులు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఐఓఈ హోదా దక్కిన సంస్థలు ఇతర ఉన్నత విద్యా సంస్థలతో పోలిస్తే పూర్తి స్వతంత్రంగా వ్యవహరించే వెసులుబాటు ఉంటుంది. దేశీయ, విదేశీ విద్యార్ధులకు ఫీజుల నిర్ణయంతో పాటు కోర్సు వ్యవధి, రూపకల్పన, విదేశీ విద్యాసంస్ధలతో ఒప్పందాల వంటి అంశాల్లో ప్రభుత్వ, యూజీసీ అనుమతులు లేకుండానే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. -
ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, న్యూఢిల్లీ : ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి దక్షిణ ఢిల్లీలోని క్యాంపస్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని గ్రేటర్ కైలాష్‌లో కుటుంబంతో కలిసి ఉండే అన్షుమన్ గుప్తా (31) నిరుద్యోగి. 2010 బ్యాచ్ బీటెక్ స్టూడెంట్ అన్షుమన్ శుక్రవారం ఉదయం 11 గంటలకు క్యాంపస్ బిల్డింగ్ ఏడవ ఫ్లోర్ నుంచి దూకడంతో రక్తపు మడుగులో పడిఉన్నాడని పోలీసులు తెలిపారు. ఘటనా ప్రాంతంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు. కాగా అన్షుమన్‌ను ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే అతడు మరణించాడని డీసీపీ మిలింద్ మహదేవ్ డంబెరే తెలిపారు. నిరుద్యోగి అయిన అన్షుమన్ ఉదయాన్నే కాలేజీ స్నేహితుడిని కలిసేందుకు వెళుతున్నట్టు కుటుంబసభ్యులకు చెప్పాడని అన్నారు. అన్షుమన్ ఉద్యోగం రాలేదనే బెంగతో తీవ్ర చర్యకు పాల్పడినట్టు భావిస్తున్నామన్నారు. బాధితుడి కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నామని, పూర్తి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.