ఐఐటీ ఇష్టంలేక అంతస్తు నుంచి దూకి.. | IIT student tries to kill self | Sakshi
Sakshi News home page

ఐఐటీ ఇష్టంలేక అంతస్తు నుంచి దూకి..

Published Thu, Mar 30 2017 9:59 AM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM

ఐఐటీ ఇష్టంలేక అంతస్తు నుంచి దూకి..

ఐఐటీ ఇష్టంలేక అంతస్తు నుంచి దూకి..

న్యూఢిల్లీ: ఐఐటీ చదవడం ఇష్టం లేక ఓ విద్యార్థి తనువు చాలించేందుకు ప్రయత్నించాడు. పాఠశాల విద్యాభ్యాసం తర్వాత తనకు నచ్చిన కోర్సులో కాకుండా తల్లిదండ్రులు ఐఐటీలో చేర్పించారని, ఆ కారణంగా తాను చదవలేకపోతున్నానని తరుచూ స్నేహితులతో చెబుతుండే ఆ విద్యార్థి చివరకు ప్రాణాలు తీసుకునేందుకు నిర్ణయించుకున్నాడు. ఏకంగా తను చదువుకుంటున్నఐఐటీ ఢిల్లీ కాలేజీకి చెందిన హాస్టల్‌ నాలుగో అంతస్తు నుంచి దూకేశాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.

అతడి కాళ్లకు, తుంటి భాగం దెబ్బతిన్నదని పోలీసులు చెప్పారు. అయితే ప్రస్తుతం అతడి పరిస్ధితి నిలకడగా ఉందని చెప్పారు. ‘తీవ్ర ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించాడని అతడి స్నేహితులు మాకు చెప్పారు’ అని పోలీసులు చెప్పారు. తొలుత ఓ స్నేహితుడితో కలిసి సాధారణ స్థితిలోనే మాట్లాడేందుకు కొద్ది దూరం బాల్కనీలో నడిచిన ఆ విద్యార్థి నాలుగో అంతస్తుకు చేరుకుంటుంగా ఒక్కసారిగా పరుగెత్తి దూకేసినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement