దగ్గరవుతున్న అకడమిక్... ప్రవేశ పరీక్షలు
విద్యార్థులను వెంటాడుతున్న ఎగ్జామ్ ఫోబియో
30 శాతానికి పైగా పరీక్షల్లో తప్పుతున్నట్టు అంచనాలు
మార్కులు, ర్యాంకుల కోసం ఒత్తిడి చేస్తే కీడు
తలకు మించి అంచనాలు పెట్టొద్దు
మొబైల్, స్ట్రీట్ ఫుడ్స్ వద్దే వద్దు
సరిపడా నిద్ర అవసరం
టెలీమెడిసన్ కాల్ సెంటర్‌తో మానసిక ఉత్తేజం
విద్యార్థులు, తల్లిదండ్రులకు మానసిక వైద్యుల సూచన
సరిపడా నిద్రా అవసరమే...
విద్యార్థులు/పోటీ పరీక్షల అభ్యర్థులు ఉన్న సమయాన్ని పాఠ్యాంశాల వారీగా పక్కాగా విభజించుకోవడంలోనే సగం విజయం సిద్ధిస్తుంది. ముఖ్యమైన ఆయా సబ్జెక్టులు, టాపిక్‌ను గుర్తించి, వాటిని ప్రాధాన్య క్రమంలో చదవాలి. ఒంటరిగా కాకుండా కొంత మంది విద్యార్థులు బృందంగా చర్చించుకుంటూ సన్నద్ధం అవ్వడం మేలు. రోజుకు కనీసం 6–7 గంటలు తప్పనిసరిగా పడుకోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మార్కులు, ర్యాంక్‌ల కోసం పదే పదే వారితో మాట్లాడడం మంచిది కాదు. సబ్జెక్ట్ మీద పట్టు సాధించేలా విద్యార్థుల్లో చైతన్యం తీసుకుని రావాలి. ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి ప్రశాంత వాతావరణం తయారు చేయాలి. – డాక్టర్ కె.వి.రావిురెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, విశాఖపట్నం
మొబైల్, స్ట్రీట్ ఫుడ్స్‌కు గుడ్‌బై చెప్పాలి
కరోనా అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలోను పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి ఎదుర్కొనే ఘటనలు ఉండేవి. అయితే అప్పట్లో చిట్కాలు, మందులతో సమస్యకు పరిష్కారం లభించేది. కరోనా అనంతరం అకడమిక్ కార్యకలాపాల్లోను మొబైల్ ఫోన్ వినియోగం పెరిగింది. దీంతో పిల్లల్లో సెల్‌ఫోన్ వాడకం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితి వల్ల పరీక్షల సమయంలో ఏకాగ్రతకు భంగం వాటిల్లుతుంది. పరీక్షల సమయంలో మొబైల్‌కు దూరంగా ఉండడం మేలు. కొద్దిసేపు సేదతీరడం కోసం పిల్లలకు సెల్‌ఫోన్‌లు ఇస్తుంటారు. అలా చేయద్దు. వాకింగ్, రన్నింగ్, ఇతర క్రీడల వైపు మళ్లించడం వల్ల శారీరక శ్రమ కలిగి, ఆరోగ్యంగా ఉంటారు. ఇక.. స్ట్రీట్ ఫుడ్స్‌కు గుడ్‌బై చెప్పాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు కల్పించుకుని, తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని పెట్టాలి. దీని వల్ల త్వరగా నిద్రపోవడానికి వీలుంటుంది. – డాక్టర్ వెంకట కిరణ్, అసోసియేట్ ప్రొఫెసర్, గుంటూరు జీజీహెచ్
టెలీమెడిసన్ కాల్ సెంటర్
మానసిక ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు వైద్య శాఖ ఏర్పాటు చేసిన టెలీమెడిసన్ కాల్ సెంటర్‌ను సంప్రదించి సలహాలు, సూచనలు పొందవచ్చు. 14416/180089114416 నెంబర్‌లకు ఫోన్ చేసి కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. ఇక్కడ సుశిక్షితులైన కౌన్సెలర్‌లు అందుబాటులో ఉంటారు. విద్యార్థులు, ఇతర ప్రజలు మానసిక ఒత్తిడి, ఇతర సమస్యలు ఉన్న వారు ఉచితంగా కాల్‌సెంటర్ సేవలు పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment