ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఇంతవరకు ఎవరూ గాయపడినట్లు మాత్రం సమాచారం అందలేదు.
ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఇంతవరకు ఎవరూ గాయపడినట్లు మాత్రం సమాచారం అందలేదు. తమకు ఉదయం 11.25 గంటల సమయంలో అగ్నిప్రమాదం గురించి ఫోన్ వచ్చిందని, ఢిల్లీ ఐఐటీలోని ఓ ఆకాశహర్మ్యంలో ఈ ప్రమాదం సంభవించినట్లు చెప్పారని అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు.
ఐదు అగ్నిమాపక శకటాలను అక్కడకు పంపి, మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. దాంతో, ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చాయి. ఏదో సిలిండర్ పేలినట్లు శబ్దం తమకు వినిపించిందని ఐఐటీ క్యాంపస్కు సమీపంలో ఉన్న వాళ్లు చెప్పారు. అయితే తాము మాత్రం ఇంకా ప్రమాదానికి కారణమేంటో తెలుసుకోవాల్సి ఉందని అగ్నిమాపక దళం వారు చెబుతున్నారు.