cyllinder blast
-
సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
బెజ్జూర్(సిర్పూర్) : మండలంలోని మర్తడిలో గురువారం రాత్రి స్రవంతికి చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి దగ్దమైంది. ప్రమాదంలో ఇంట్లోని ఆహార ధాన్యాలు, బట్టలు అన్ని పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న బెజ్జూర్ ఎస్సై శివప్రసాద్, తహసీల్దార్ రఘునాధ్‌లు సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. సర్పంచ్ ఉమ్మెర పోచక్కలింగయ్య, ఎంపీటీసీ బూస సుశీలసారయ్య, కోఆప్షన్ సభ్యులు బసరాత్ ఖాన్, వార్డు మెంబర్ శంకర్ బాధితురాలిని పరామర్శించారు. బాధిత మహిíßళకు మండల కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నహీర్ అలీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్దన్, మండల శాఖ అధ్యక్షుడు దేవనపల్లి సత్యనారాయణ, నాయకులు పూల్లూరి సతీష్, జిల్లాల సుధాకర్‌గౌడ్, శంకర్, పెంటయ్య, బాపు, తిరుపతి, ఎంపీటీసీ తాళ్ళ ఇందిరా రామయ్య, నియోజక వర్గ నాయకులు రావి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 25కిలోల బియ్యం, బట్టలతో పాటు వెయ్యి రూపాయల నగదు అందజేశారు. -
కన్నతండ్రిని 36 సార్లు కత్తితో పొడిచి...
-
తండ్రిని చంపి.. సిలిండర్ పేల్చి..
అతడు గతంలో మర్చంట్ నేవీలో పనిచేసి సస్పెండయ్యాడు. ఎందుకో గానీ.. కన్న తండ్రిని గొంతు కోసం చంపేశాడు. తర్వాత ఇంట్లోని గ్యాస్ సిలిండర్‌ను పేల్చడం ద్వారా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ ప్రయత్నంలో పదిమంది పోలీసులకు గాయాలయ్యాయి. ఇదంతా తూర్పు ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలో జరిగింది. రవీందర్ మట్టా అనే పెద్దాయన తన కొడుకు రాహుల్ ప్రవర్తన బాగోలేదని అతడిని దూరం పెట్టారు. తాను నివసించే పరిసర ప్రాంతాల్లోకి కూడా రావొద్దని హెచ్చరించారు. అయితే... రాహుల్ ఎలాగోలా ఇంట్లోకి ప్రవేశించి, తన తండ్రిని గొంతుకోసి చంపేశాడు. ఆ ఘటన జరిగే సమయానికి నిందితుడి తల్లి ఇంట్లో లేరు. పోలీసులకు సమాచారం అంది, అక్కడకు వచ్చేసరికి రాహుల్ మరో ఫ్లాట్‌లోకి పారిపోయి, అందులో ఉన్న వాళ్ల మీద కూడా దాడి చేశాడు. పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. కిచెన్‌లోకి వెళ్లి, తలుపులు లోపలినుంచి వేసుకుని గ్యాస్ స్టవ్ నాబ్‌లు ఓపెన్ చేశాడు. పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లబోగా, అగ్గిపెట్టె వెలిగించాడు. దాంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దాంతో ముగ్గురు ఎస్ఐలు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఏడుగురికి స్వల్పగాయాలయ్యాయి. రాహుల్ చేతికి కాలినగాయాలయ్యాయి. -
తుపానును జయించింది.. సిలిండర్ కబళించింది!
హుద్‌హుద్ తుపాను విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసిన రోజునే పుట్టిందా పసికందు. తుపాను గాలులను, అంతటి ప్రళయాన్ని కూడా తట్టుకుని నిలబడింది. సంపూర్ణ ఆరోగ్యంతో ఈ భూమ్మీదకు వచ్చింది. కానీ.. మంగళవారం నాటి గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటనలో ఎంతోమంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కానీ ఆ ఒక్క చిన్నారి మాత్రం ప్రాణాలు వదిలేసింది. దేవీప్రసాద్, భవానీ దంపతులు విశాఖ నగరం రంగిరీజు వీధిలో ఉంటున్నారు. వారికి అక్టోబర్ 12న.. హుద్‌హుద్ తుపాను చెలరేగిన రోజున.. ఆడపిల్ల పుట్టింది. కానీ, వారి ఆనందం అంతే త్వరగా ఆవిరైపోయింది. వారి ఇంటి ఎదుటే కోట సత్యనారాయణ కుటుంబం ఉంది. ఆయన భార్య టీ పెట్టడానికి ప్రయత్నించగా గ్యాస్ పొయ్యి వెలగలేదు. వాళ్లూ వీళ్లు వచ్చి చూశారు. వాళ్లలో ఒకరు పిన్‌తో గ్యాస్ సిలిండర్ పై భాగంలో తుడవడం మొదలుపెట్టారు. అంతే.. ఒక్కసారిగా సిలిండర్ పేలింది. ఆ సమయంలో అక్కడున్న వారంతా రోడ్డుపైకి ఎగిరి పడ్డారు. సత్యనారాయణ ఇల్లంతా మంటల్లో చిక్కుకుంది. ఆ సమయంలో ఎదురింట్లో పాప ఆడుకుంటోంది. తల్లి ఇంట్లో పని చేసుకుంటూ పాపను ఇంట్లో పడుకోబెట్టింది. పేలుడు ధాటికి పాప ముక్కుల్లోంచి, నోట్లోంచి రక్తం బయటకు వచ్చింది. ఇంతలో ఇంటి పై కప్పు నుంచి ఒక పెంకు సరిగ్గా పాప ముఖంపై పడింది. ఆ మరుక్షణమే పాప ప్రాణం పోయింది!! -
ఐఐటీ భవనంలో అగ్నిప్రమాదం
ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఇంతవరకు ఎవరూ గాయపడినట్లు మాత్రం సమాచారం అందలేదు. తమకు ఉదయం 11.25 గంటల సమయంలో అగ్నిప్రమాదం గురించి ఫోన్ వచ్చిందని, ఢిల్లీ ఐఐటీలోని ఓ ఆకాశహర్మ్యంలో ఈ ప్రమాదం సంభవించినట్లు చెప్పారని అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. ఐదు అగ్నిమాపక శకటాలను అక్కడకు పంపి, మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. దాంతో, ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చాయి. ఏదో సిలిండర్ పేలినట్లు శబ్దం తమకు వినిపించిందని ఐఐటీ క్యాంపస్‌కు సమీపంలో ఉన్న వాళ్లు చెప్పారు. అయితే తాము మాత్రం ఇంకా ప్రమాదానికి కారణమేంటో తెలుసుకోవాల్సి ఉందని అగ్నిమాపక దళం వారు చెబుతున్నారు.