Neetu Yadav and Kirti Jangra: ఉన్నత చదువులు చదివి సొంతంగా వ్యాపారం చేయాలని కలలు కంటూ విజయాన్ని సాధించిన వారు చాలానే ఉన్నారు. ఇందులో నీతూ యాదవ్ & కీర్తి జంగ్రా కూడా ఉన్నారు. ఢిల్లీలో ఐఐటి పూర్తి చేసి 'యానిమల్ టెక్నాలజీస్' స్థాపించి ఇప్పుడు కోట్లలో గడిస్తున్నారు. ఇంతకీ వీరి విజయ గాథ వెనుక ఉన్న అసలైన కథ ఏంటనేది ఇక్కడ ఈ కథనంలో చూసేద్దాం..
ఢిల్లీలో ఐఐటీ రూమ్‌మేట్స్‌గా కలిసిన అమ్మాయిలు తమ కలను సహకారం చేసుకోవడానికి నవంబర్ 2019లో పశువుల కోసం ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ అయిన యానిమాల్‌ను ప్రారంభించారు. బెంగళూరులోని ఒక చిన్న అద్దె గదిలో ఉంటూ ప్రారంభమైన వీరి వ్యాపారం ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.
పాడి రైతుల జీవితాలను మెరుగుపరచడానికి, పశువుల వ్యాపారం, పాడి పరిశ్రమలను మరింత లాభదాయకంగా మార్చాలనే ఉద్దేశ్యంతో యానిమల్ స్థాపించారు. ప్రతి వ్యాపారంలో ఎదురైనా ఇబ్బందులు మాదిరిగానే వీరు కూడా ప్రారంభంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ తరువాత గేదెలను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల నుండి ఎక్కువ ఆర్డర్‌లను పొందడం ప్రారంభించారు.
(ఇదీ చదవండి: Force Citiline: ఫోర్స్ మోటార్స్ కొత్త ఎమ్‌పివి లాంచ్ - ధర ఎంతంటే?)
యానిమల్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ జంతువుల సంరక్షణకు కూడా సేవలను అందిస్తుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పొందిన ఆదాయంలో సుమారు 90శాతం పశువుల వ్యాపారం నుంచి రాగా.. మిగిలిన 10 శాతం వైద్య ఖర్చులు, అసిస్టెడ్ రీప్రొడక్షన్, సేల్స్ కమీషన్ వంటి వాటిద్వారా వచ్చిందని తెలుస్తోంది.
యానిమాల్ (Animall) అనేది పశువుల వ్యాపారం చేయడానికి ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్. దీని ద్వారా పశువుల అమ్మకం మాత్రమే కాకుండా కొనుగోలు కూడా ఉంటుంది. ప్రస్తుతం యానిమల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దూసుకెళ్తున్న ఈ కంపెనీలో షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్, జొమాటో వ్యవస్థాపకుడు & సీఈవో దీపిందర్ గోయెల్, అంజలి బన్సాల్, మోహిత్ కుమార్, సాహిల్ బారువాతో సహా మరో 3 మంది యానిమాల్ ఏంజెల్ పెట్టుబడిదారులుగా ఉన్నారు.
(ఇదీ చదవండి: ఇంత మంచి ఆఫర్ మళ్ళీ మళ్ళీ వస్తుందా.. జీప్ కంపెనీ భారీ డిస్కౌంట్స్)
2019లో ప్రారంభమైన యానిమల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ FY22లో ఆదాయం రూ. 7.4 కోట్లుగా అంచనా వేయబడింది. అయితే ప్రస్తుతం ఇది రూ. 565 కోట్లకు పెరిగింది. రానున్న రోజుల్లో ఈ కంపెనీ మరిన్ని లాభాలను తప్పకుండా ఆర్జిస్తుందని భావిస్తున్నారు. మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment