Animal
-
పుష్ప-2 రికార్డ్స్ బద్దలు కొడతా : యానిమల్ హీరో
-
christmas2024 ప్రియుడితో యానిమల్ బ్యూటీ చెట్టాపట్టాల్ (ఫొటోలు)
-
ప్రాణులు నేర్పే పాఠాలు
ప్రపంచమంతా పచ్చగా ఉందని, తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్లని అనుకుంటే పొరపాటే! రంగు రంగుల లోకంలోనే రకరకాల రాకాసి జంతు ప్రవృత్తులు ఉంటాయి. జంతుతతి నుంచి మనిషి వేరుపడి సహస్రాబ్దాలు గడచిపోయాయి. అయినా, మనుషుల్లోని జంతుప్రవృత్తి పూర్తిగా తొలగిపోలేదు. కొన్ని సందర్భాల్లో జంతువుల కంటే క్రూరంగా, దారుణంగా ప్రవర్తించే మనుషుల ఉదంతాలు వార్తలకెక్కుతుండటం మనకు తెలియనిదేమీ కాదు. ఆకుపచ్చని పచ్చికబయళ్లలో సుతిమెత్తని పచ్చిక మాత్రమే కాదు, విషపూరితమైన పసరిక పాములు కూడా ఉంటాయి. దట్టమైన అడవుల్లో పచ్చని చెట్లూ చేమలు, రంగు రంగుల పువ్వులూ పిట్టలూ పిచుకలూ, జంతువులూ మాత్రమే కాదు, ఏమరుపాటుగా దొరికితే మనుషులను పలారం చేసే క్రూరమృగాలు ఉంటాయి. కసిగా కాటు వేసే కాలసర్పాలు ఉంటాయి. కీకారణ్యాల్లో పొంచి ఉండే ప్రమాదాలన్నీ జనారణ్యంలోనూ ఉంటాయి. జనారణ్యంలో అడుగడుగునా తారసపడే చాలా మంది మనుషుల్లో జంతులక్షణాలు కనిపిస్తాయి. మనుషుల్లోని మేకపోతు గాంభీర్యాలు, గోడమీది పిల్లి వాలకాలు, గుంటనక్క తెలివితేటలు అపరిచితమైనవేమీ కాదు. మనుషుల్లోని జంతులక్షణాలను గుర్తించడం వల్లనే విష్ణుశర్మ ‘పంచతంత్రం’ రాశాడు. జంతు పాత్రల ద్వారా మనుషుల స్వభావాలను తేటతెల్లం చేస్తూ కథలు చెప్పాడు. ‘పంచతంత్రం’ కథలు చిన్నపిల్లలకు కూడా తేలికగా అర్థమవుతాయి. ఆ తర్వాత చాలాకాలానికి జార్జ్ ఆర్వెల్ ‘యానిమల్ ఫామ్’ రాశాడు. ఇది కూడా దాదాపు ‘పంచతంత్రం’లాంటి ప్రయోగమే! ‘పంచతంత్రం’ నాటికి, ‘యానిమల్ ఫామ్’ నాటికి సమాజం చాలా మారింది. ‘యానిమల్ ఫామ్’లో దోపిడీ సమాజంలో నలిగిపోతున్న మనుషుల పరిస్థితిని, శ్రమదోపిడీలో నలిగిపోయేవారి స్వేచ్ఛాభిలాషను, వారి స్వేచ్ఛకు తూట్లు పొడిచే శక్తుల కుతంత్రాలను జంతుపాత్రల ద్వారా ఆర్వెల్ చెప్పాడు. జంతువులను పాత్రలుగా చేసుకుని కథలు చెప్పడం ‘పంచతంత్రం’తోనే మొదలు కాలేదు.‘పంచతంత్రం’ దాదాపుగా క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటిది. అంతకు దాదాపు వెయ్యేళ్ల ముందే– క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దికి చెందిన గ్రీకు బానిస ఈసప్ ఇలాంటి కథలనే ఎన్నో చెప్పాడు. ప్రాచీన రోమన్ సాహిత్యంలోని ‘ఫెడ్రస్ కథలు’, గ్రీకు సాహిత్యంలోని బాబ్రియస్ కథలు ఇలాంటివే!ఫ్రెంచ్ సాహిత్యంలోని ‘లా ఫోంటేన్ ఫేబుల్స్’ కూడా ఇలాంటివే!‘లా ఫోంటేన్ ఫేబుల్స్’ రచయిత జీన్ డి లా ఫోంటేన్ ప్రాచ్య, పాశ్చాత్య దేశాల్లో ప్రచారంలో ఉన్న జంతువుల పాత్రలు ప్రధానంగా ఉన్న కథలను సేకరించి, పదిహేడో శతాబ్దిలో ఈ కథల పుస్తకాలను పన్నెండు భాగాలుగా వెలువరించాడు. జంతువులను ప్రధాన పాత్రలుగా చేసుకున్న ఈసప్ కథలు, పంచతంత్ర కథలు అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదం పొందాయి. ఇవి ఈనాటికీ తాజాగానే ఉన్నాయి. ఇప్పటి సమాజంలో సంచ రిస్తున్న మనుషుల స్వభావాలు పంచతంత్ర కథల్లోనూ, ఈసప్ కథల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. మనుషుల స్వభావాలను జంతువులకు ఆపాదించి చెప్పడం సమస్త భాషల సాహిత్యంలోనూ ఒక పురాతన కళాత్మక పద్ధతి. ఓపిక ఉన్న రచయితలు కథలు చెప్పారు. అనుభవం ఉన్నవాళ్లు సామెతలను సృష్టించారు. మన పురాణాల్లోనూ జంతువులు, పక్షులు పాత్రలుగా ఉన్న పిట్ట కథలు కనిపిస్తాయి. బైబిల్లోనూ జంతువుల గురించిన సామెతలు ఉన్నాయి. ‘సోమరీ! చీమల యొద్దకు వెళ్లుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును’– ఇది బైబిల్ సామెతల గ్రంథంలోనిది. చీమను చూసి కష్టపడటం నేర్చుకోవాలని సోమరులకు చేసే హెచ్చరిక ఇది.ప్రాచీన సాహిత్యంలో జంతుపాత్రలు ఉన్న కథలు, జంతువులపై ప్రాచుర్యంలో ఉన్న సామెతలు మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. ప్రవర్తన లోపాలను ఎత్తిచూపి, సుతిమెత్తని హెచ్చరికలు చేస్తాయి. వీటిని పూర్తిగా ఆకళింపు చేసుకుంటే చాలు, మనుషులు మనుషుల్లా తయారవడం కష్టమేమీ కాదు. వీటిని పిట్ట కథల్లా కొట్టిపారేసే అతితెలివిపరులు జంతువుల కంటే హీనంగా మిగులుతారు. కానికాలం దాపురించినప్పుడు దిక్కుతోచని గడ్డు పరిస్థితుల్లో చిక్కుకుని, నానా అవస్థలు పడతారు.మహాభారతంలోని ‘కాకి హంస’ల కథ ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక రాజ్యంలో ధనికుడైన వర్తకుడు ఉండేవాడు. ప్రతిరోజూ ఒక కాకి అతడి పెరటి గోడ మీద వాలేది. వర్తకుడి పిల్లలు దానికి తమ ఎంగిళ్లు పెట్టేవారు. ఎంగిళ్లు తిన్న కాకి వారికి బాగా మాలిమి అయింది. ఎంగిళ్లు తిని తెగబలిసిన కాకి ఒకనాడు ఏకంగా హంసలతో పందేనికి తెగబడి, భంగపడింది.ఈ కథను కురుక్షేత్రంలో శల్యుడు కర్ణుడికి చెప్పాడు. కర్ణుడికి కథలోని నీతి తలకెక్కలేదు. ఫలితం ఏమైందో మనకు తెలిసిందే! కొందరు ఇప్పటికీ ఎంగిళ్లు తిని బలిసిన కాకుల్లాగే ఎగిరెగిరి పడుతుంటారు. ఇలాంటి స్వభావం ఉన్నవాళ్లు రాజకీయ రంగంలోను, సాహితీ సాంస్కృతిక రంగాల్లోను, వివిధ రకాల వృత్తి ఉద్యోగాల్లోనూ ఉంటారు. ఎవరో పెట్టే ఎంగిలి మెతుకులు తిని బలిసి, విర్రవీగినంత కాలం కాకికి తన బలహీనత ఏమిటో ఎరుక పడనట్లే, ఇలాంటి స్వభావం ఉన్నవారికి ఎప్పటికీ ఈ కథల్లోని మర్మం అవగతం కాదు. మానవ సమాజంలో బతుకుతున్నా, వారు ఎప్పటికీ సంపూర్ణ మానవులు కాలేరు. -
వరల్డ్ యానిమల్ డే : అమ్మలా ప్రేమను పంచుతున్నారు!
జంతు సంక్షేమం. సంరక్షణకు సంబంధించి మహిళల కృషి నిన్నామొన్నటిది కాదు. దీనికి ఎంతో చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా జంతుసంరక్షణకు సంబంధించిన ఉద్యమాలు, సంస్థలలో ఎక్కువగా మహిళలే నాయకత్వ బాధ్యత వహిస్తున్నారు. మన దేశంలో జంతుసంక్షేమ విధానానికి వెన్నెముక అయిన పీసీఏ యాక్ట్‌లో అప్పటి రాజ్యసభ ఎంపీ, ప్రముఖ నృత్యకారిణి రుక్మిణీ ఆరండల్ కీలకపాత్ర పోషించింది.‘మన దేశంలో జంతువులపై క్రూరత్వాన్ని నిరో«ధించే విషయంలో మహిళా నాయకుల చొరవ, శ్రమ ఎంతో ఉంది. జంతు సంరక్షణ ఉద్యమంలో ఎన్నో వినూత్న విధానాలకు రూపకల్పన చేస్తున్నారు. నా మిత్రురాలు స్వర్ణాలీరాయ్ కోల్‌కతాలో బడులు, కాలేజీలకు వెళుతూ వ్యవసాయ రంగంలో జంతువులను ఎలా చూస్తున్నారు నుంచి జంతు సంక్షేమం వరకు ఎన్నో విషయాల గురించి అవగాహన కలిగిస్తుంది. పంజాబ్ యూనివర్శిటీలో వందలాదిమంది విద్యార్థులకు వ్యవసాయంలో భాగమైన జంతువుల సంక్షేమం గురించి ఎంతో అవగాహన కలిగించింది. ఇలాంటి వారు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు’ అని చెబుతున్నారు అలోక్పర్ణ సేన్‌గుప్తా.అలోక్పర్ణసేన్ యానిమల్ రైట్స్ అడ్వకేట్. హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్, ఇండియా మేనేజింగ్ డైరెక్టర్. వీధికుక్కల సంక్షేమం నుంచి వ్యవసాయ రంగంలో జంతు సంరక్షణ వరకు ఎన్నో అంశాలపై పనిచేస్తోంది.‘రుక్మిణీదేవి కృషి వల్లే పీసీఏ చట్టం, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అమల్లోకి వచ్చాయి. జంతుసంక్షేమానికి సంబంధించిన లక్ష్యాల కోసం మహిళలు అంబాసిడర్లుగా పనిచేస్తున్నారు. తాము పనిచేయడమే కాదు ఇతరులకు స్ఫూర్తిని ఇస్తున్నారు. జంతు సంక్షేమ ఉద్యమంలో కూడా ఎంతోమంది మహిళలు పనిచేస్తున్నారు. కొందరు ప్రముఖంగా కనిపించవచ్చు. చాలామంది తెరవెనుక నిశ్శబ్దంగా పనిచేస్తున్నారు’ అంటుంది జంతు సంక్షేమ ఉద్యమకారిణి నజరేత్. -
హైదరాబాద్‌లో జీసీసీను ప్రారంభించిన యూఎస్ కంపెనీ
జంతువుల ఆరోగ్య సంరక్షణ విభాగంలో సేవలందిస్తున్న జోయిటిస్ సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్(జీసీసీ)ను ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా అమెరికాకు చెందిన ఈ కంపెనీ ఇండియాలో తన కార్యకలాపాలు విస్తరించాలని భావిస్తోంది. ఈ సెంటర్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరై మాట్లాడారు.‘అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీలు తమ వ్యాపారాలు విస్తరించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయి. దాంతో స్థానికంగా యువతకు ఉపాధి లభిస్తోంది. జంతువుల ఆరోగ్య సంరక్షణ విభాగంలో తెలంగాణలో వ్యాపారాన్ని విస్తరించేందుకు చాలా అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో కంపెనీలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. సంస్థలకు కావాల్సిన నైపుణ్యాల కోసం స్థానిక యువతను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది’ అన్నారు.జోయిటిస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్బాగ్ మాట్లాడుతూ..‘హైదరాబాద్ జోయిటిస్ ఇండియా కేపబులిటీ సెంటర్‌కు అనువైన ప్రదేశమని భావిస్తున్నాం. భవిష్యత్తులో లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌కు హైదరాబాద్ కీలకంగా మారనుంది. కాబట్టి కంపెనీ కార్యకలాపాలు ఇక్కడ విస్తరించాలని నిర్ణయించాం. సాంకేతిక ఆవిష్కరణలతో జంతు ఆరోగ్య సంరక్షణ అందించడం కంపెనీ ముఖ్య ఉద్దేశం. జంతువులకు డయాగ్నోసిస్, వైద్యం వంటి ప్రాథమిక సేవలందిస్తున్నాం. ఈ సౌకర్యాన్ని పెంపుడు జంతువుల యజమానులు, రైతులు, జంతు సంరక్షకులు వినియోగించుకోవాలి. అంతర్జాతీయంగా ఈ వ్యాపారం ఏటా 4-6 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇండియాలో ఈ పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా మారనుంది. జంతు ఆరోగ్య సంరక్షణలో కొత్త టెక్నాలజీల ఆవిష్కరణల రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్ అండ్ డీ) కోసం పెట్టుబడిని పెంచుతున్నాం. 2023లో ఇది 613 మిలియన్లకు(రూ.5,100 కోట్లు) చేరుకుంది’ అని చెప్పారు. సమీప భవిష్యత్తులో జనరేటివ్ ఏఐ సాయంతో పరిశోధనలు చేసేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని జోయిటిస్ ఇండియా కెపబులిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ అన్నారు.ఇదీ చదవండి: ఈవీ సబ్సిడీపై కీలక వ్యాఖ్యలు.. మంత్రి స్పష్టత2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా జంతువుల ఆరోగ్య సంరక్షణ మార్కెట్ విలువ రూ.7,824.5 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 14 శాతంమేర వృద్ధి చెందింది. 2029 వరకు ఈ మార్కెట్ విలువ 1.89 బిలియన్ డాలర్ల(రూ.15,871 కోట్లు)కు చేరనుందని అంచనా. -
యానిమల్.. టైటిల్ చూస్తే తెలియట్లేదా?: బాలీవుడ్ నటుడు
నెగెటివ్ పాత్రలు ఒకప్పుడు విలన్లు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు హీరోలు కూడా తమలో నెగెటివ్ షేడ్స్ చూపిస్తున్నారు. హింస, రక్తపాతంతో చెలరేగుతున్నారు. ఇలాంటి పాత్రలను ప్రేక్షకులు సైతం ఇష్టపడుతున్నారు. యానిమల్‌లో రణ్‌బీర్ కపూర్ చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. తన కుటుంబం కోసం ఎంతదూరమైనా వెళ్తాడు. అదే సమయంలో ప్రేమించిన భార్యకు నరకం చూపిస్తాడు. ఈ కథను జనాలు ఆదరించారు. బ్లాక్‌బస్టర్ చేశారు.ఈ ధోరణిపై బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాల్లో కథ, పాత్రలను చూపిస్తారు. అంతేకానీ ఆ పాత్రలను ఆదర్శంగా తీసుకుని అలాగే మెసులుకోవాలని ఎవరూ చెప్పట్లేదు. రణ్‌బీర్ నటించిన యానిమల్ మూవీ నాకెంతో నచ్చింది. తన పర్ఫామెన్స్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది. ఈ చిత్రాన్ని ఎందుకంతలా విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ సినిమా పేరేమీ ఆదర్శ పురుష్ కాదు యానిమల్. టైటిల్‌ను బట్టి మీరే అర్థం చేసుకోవాలి. డైరెక్టర్ ఇక్కడ ఒక మృగం లాంటి వ్యక్తి గురించి చెప్తున్నాడని గ్రహించాలి' అని చెప్పుకొచ్చాడు. -
నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే: యానిమల్ నటుడు షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటుడు సిద్దాంత్ కర్నిక్ గతేడాది సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ చిత్రంలో కనిపించారు. 2023 డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సిద్ధాంత్ కర్నిక్.. ప్రభాస్ ఆదిపురుష్‌లోనూ నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హజరైన సిద్ధాంత్ తన కెరీర్లో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేంటో తెలుసుకుందాం.సిద్ధాంత్ కర్నిక్ మాట్లాడుతూ.. " అప్పడప్పుడే నా కెరీర్ ప్రారంభించా. 2005లో కేవలం 22 ఏళ్ల వయసులోనే పరిశ్రమలోకి ప్రవేశించా. ఓ సినిమా ఛాన్స్ కోసం కోఆర్డినేటర్ని కలిశా. అతను నా పోర్ట్‌ఫోలియో తీసుకుని రాత్రి 10:30 గంటలకు ఇంటికి రమ్మన్నాడు. ఆ టైమ్‌లో పిలవడం నాకు కాస్తా వింతగా అనిపించింది. అయినా అవకాశం కోసం వెళ్లక తప్పలేదు. ' అని అన్నారు. అనంతరం మాట్లాడుతూ..' అవకాశాల కోసం కొన్ని విషయాల్లో రాజీపడక తప్పదు. లేకపోతే నీకు ఎలాంటి పని ఉండదని అన్నాడు. దీంతో అతని మాటలను నేను వెంటనే గ్రహించా. ఆ సమయంలో అతను నాకు చాలా దగ్గరగా వచ్చాడు. నేను వెంటనే ఇంట్రెస్ట్ లేదని చెప్పి బయటకొచ్చేశా' అని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అతను నా సినిమా అవకాశాలను దెబ్బతీస్తాడేమోనని భయపడినట్లు వెల్లడించారు. కానీ కొన్నేళ్ల తర్వాత ఓ ఈవెంట్లో అతనే నన్ను అభినందించాడని తెలిపారు. కాగా.. సిద్ధాంత్ కర్నిక్ యానిమల్, ఆదిపురుష్ వంటి చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఫేమస్ వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ సీజన్- 2 కీలక పాత్ర పోషించాడు. 2004లో టీవీ షో రీమిక్స్‌తో కర్నిక్ తన కెరీర్ ప్రారంభించాడు. -
విశాఖ జూకు గుజరాత్ వన్యప్రాణులు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కుకు కొద్ది రోజుల్లో గుజరాత్ రాష్ట్రం నుంచి మరికొన్ని కొత్త వన్యప్రాణులు రానున్నాయి. వీటి కోసం జూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని ఇక్కడకు తీసుకురావడానికి జూ అథారిటీ ఆఫ్ ఇండియా(సీజెడ్ఏ) నుంచి అనుమతులు లభించాయి. కొన్నాళ్లుగా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు ఇతర జూ పార్కుల నుంచి జంతు మార్పిడి విధానం ద్వారా కొత్త జంతువులు, అరుదైన పక్షులను తీసుకువస్తున్నారు.రెండు నెలల కిందట కోల్‌కతా రాష్ట్రం అలీపూర్ జూ పార్కు నుంచి జంతు మార్పిడి విధానం ద్వారా జత జిరాఫీలు, ఏషియన్ వాటర్ మానిటర్ లిజర్డ్స్, స్కార్లెట్ మకావ్స్ ఇక్కడకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయా వన్యప్రాణులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. మరికొన్ని వన్యప్రాణులను గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి ఒకటి, రెండు వారాల్లో ఇక్కడకు తీసుకురానున్నారు. వాటి కోసం జూలో ఒక్కో జాతి జంతువులు, పక్షులు వేర్వేరుగా ఎన్క్లోజర్లు కూడా సిద్ధం చేశారు. ఆయా వన్యప్రాణులు చేరితే విశాఖ జూకి మరింత కొత్తదనం లభించనుంది. కొత్తగా రానున్నవి ఇవే.. గ్రీన్ వింగ్డ్ మెకావ్ రెండు జతలు, స్కార్లెట్ మెకావ్స్ రెండు జతలు, మిలటరీ మెకావ్స్ రెండు జతలు, మీడియం సల్ఫర్ క్రెస్టెడ్ కాక్టూ రెండు జతలు, స్క్వైరల్ మంకీస్ రెండు జతలు, కామన్ మార్మోసెట్స్ రెండు జతలు, మీర్కాట్ ఒక జత, రెడ్ నెక్డ్ వాల్లబీ ఒక జత కొత్తగా ఇక్కడకు తీసుకురానున్నారు.ప్రత్యేక ఎన్క్లోజర్లు సిద్ధంవిశాఖ జూకు కొత్త వన్యప్రాణులు రానున్నాయి. గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి వాటిని తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్త వన్యప్రాణుల కోసం ప్రత్యేకంగా ఎన్క్లోజర్లు సిద్ధం చేశాం. –డి.మంగమ్మ, జూ క్యూరేటర్(ఎఫ్ఏసీ), ఇందిరాగాంధీ జూ పార్కు, విశాఖపట్నం -
ఇటలీ హాలిడే టూర్లో యానిమల్ బ్యూటీ, స్టన్నింగ్ ఫోటోలు
-
రాష్ట్రపతి భవన్ లో చిరుత ?
-
గాడిద మోత గురించి ఎపుడైనా ఆలోచించారా? ఇంట్రస్టింగ్ కథనం
మన దేశంలో మహారాష్ట్రలో గాడిదలను అధిక స్థాయిలో రవాణాకు ఉపయోగిస్తున్నారు. ఇటుక బట్టీలలో ఇసుక రవాణాలో వీటి వీపు మీద 200 కేజీల వరకూ వేయడానికి వెనుకాడరు. దీని వల్ల గాడిదలు హింసకు గురవుతున్నాయి. రోగాల బారిన పడుతున్నాయి. అందుకే నాందేడ్‌కు చెందిన సిర్జనా నిజ్జర్ గాడిదల సంరక్షణ గురించి పోరాడుతోంది. గాడిద మోత నుంచి గాడిదలను తప్పించాలంటోంది. ఆమె పోరాటం గురించి...‘జనం దేనికైనా విరాళాలు ఇస్తారు గాని గాడిదలంటే ఇవ్వరు. కాని గాడిదలు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు’ అంటుంది సిర్జనా గుజ్జర్.ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివిన సిర్జనా జనం కోసం న్యాయస్థానాల్లో వాదించడం కంటే హింసకు గురవుతున్న మూగజీవాల కోసం సమాజంలో వాదించడం మేలు అనుకుంది. అందుకే ఆమె ఎఫ్.ఐ.ఏ.పి.ఓ. (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్)లో కీలకబాధ్యతలు నిర్వహిస్తోంది. వీధి శునకాలతో మొదలైన ఆమె సేవ నేడు గాడిదలకు చేరింది.నాందేడ్‌లో చూసి...మహరాష్ట్రలోని నాందేడ్ సిర్జనా తాతగారి ఊరు. కాలేజీ రోజుల్లో వేసవి సెలవుల్లో అక్కడకు వెళితే గాడిదలు విపరీతంగా కనిపించేవి. వాటిని చూసి సరదా పడదామనుకుంటుడగానే ఒళ్లంతా గాయాలతో, బరువులు మోయలేక అవస్థపడుతూ, తిండి లేక ఎముకలు తేలి ఉన్న వాటి రూ΄ాలు సిర్జనాకు ఎంతో బాధ కలిగించేవి. విద్యార్థిగా ఉండగానే వాటి కోసం చేతనైనంతలో హెల్త్ క్యాంప్స్ నిర్వహించేది. లా పూర్తయ్యాక ఇప్పుడు పూర్తి స్థాయిలో వాటి సంరక్షణ కోసం పని చేస్తోంది.మూడు జిల్లాల్లో...‘మహరాష్ట్రలోని మూడు జిల్లాలు నాందేడ్, బీడ్, లాతూర్‌లలో గాడిదల సంఖ్య ఎంత లేదన్నా 6000 ఉంటుంది. ఇవి మహరాష్ట్రలో వాన కొరత ్ర΄ాంతాలు. జనం పేదరికంలో మగ్గుతుంటారు. ఈ మూడు జిల్లాల్లోనూ ఇటుక బట్టీలు విస్తారం. వాటిలో కూలీ చేస్తే రోజుకు వంద రూ΄ాయలు వస్తాయి. ఇటుకలు మోయడానికి వీరంతా గాడిదలను ఉపయోగిస్తారు. ఇటుకలను చేరవేయడానికి వాటి వీపు మీద 60 కేజీల నుంచి 100 కేజీల వరకూ బరువు మోయిస్తారు. ఈ ప్రాంతంలో పారే ఉపనది చంద్రభాగ ఒడ్డు నుంచి ఇసుక మోయిస్తారు. శక్తికి మించి బరువు మోయడం వల్ల గాడిదలు గాయాల బారిన పడతాయి. ఒక్కోసారి వాటి కాళ్లు విరుగుతాయి. కంటి సమస్యలు వస్తాయి. వాటికి వైద్యం చేయించే శక్తి పేదలకు ఉండదు. వాటిని అలాగే వదిలేస్తారు’ అంటుంది సిర్జనా.వానలు వస్తే పస్తే‘నాందేడ్, బీడ్, లాతూర్ జిల్లాల్లో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకూ నిర్విరామంగా ఇటుక బట్టీల పని జరుగుతుంది. అన్నాళ్లు గాడిదలకు పని ఉంటుంది. కొద్దోగొ΄్పో తిండి దొరుకుతుంది. కాని ఎప్పుడైతే తొలకరి మొదలవుతుందో ఇటుక బట్టీలు మూతపడతాయి. కూలీలు గాడిదలకు తిండి భారం అని రోడ్ల మీద వదిలేస్తారు. వాటికి తిండి దొరకదు. మంచినీరు దొరకదు. రోగాలతో బాధ పడతాయి. ముసలివైతే కబేళాకు అమ్మేస్తారు. వాటి కోసం ఈ మూడు జిల్లాలో సంరక్షణాశాలలను ఏర్పాటు చేస్తున్నాం. ఎస్.పి.సి.ఏ. (సొసైటీస్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్) బలోపేతం చేస్తున్నాం. గత పదేళ్లలో గాడిదల సంఖ్య కూడా బాగా తగ్గింది. వీటి సంఖ్య కాపాడుకుంటూ వీటితో మానవీయంగా వ్యవహరించే చైతన్యాన్ని కలిగించడమే నా లక్ష్యం’ అని తెలిపింది సిర్జనా. -
సందీప్ - జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం
-
గొర్రెల స్కీమ్ లో భారీగా అవినీతి జరిగినట్లు గుర్తింపు
-
ఇలాంటి జీవి ఒకటి ఉందా?
-
అంబానీ కొడుకు నిజంగా గ్రేట్.. అడవిని సృష్టించిన కొత్త పెళ్లికొడుకు.
-
ఏడాదిలో ఆరు నెలలు.. 'గోపాలకుల వనవాసం'!
ఈ జీవిత పోరాటంలో ఒక్కొక్కరి జీవనం ఒక్కోవిధంగా కొనసాగుతూంటుంది. వాటిలో ఎన్నో మార్పులు, చేర్పులు కూడా జరుగుతూంటాయి. కొన్ని సమయాల్లో జీవించడానికి వలసలు వెళ్లాల్సివస్తుంది. కొందరైతే ఊర్లు, దేశాలు, ఏకంగా ఖండాలే దాటి వెళ్తున్నారు. అది కూడా బస్సులు, రైల్లు, విమనాల్లోనో ప్రయాణిస్తున్నారు. జీవన శైలిలో ఇది ఒకెత్తు అయితే, మరో ఎత్తు.. మూగ జీవాలకై.. గిరిజన తండా వాసులు పడే తంటాలు. ఎండనకా, వాననకా, రాళ్లనకా, ముళ్లనకా వారివి కాలినడక ప్రయాణాలు. ఇలా ఒకరోజు రెండురోజులు కాదు.. ఏకంగా ఏడాదిలో ఆరుమాసాలు. ఇంటివాకిలిపై, పిల్లాజల్లలపై మనసున్నా గానీ, ఎంచుకున్న మార్గాన్ని వీడక, మూగప్రాణుల కడుపు మేతకై ఈ ఆడపడుచుల ప్రయాణాన్ని గురించి ఓసారి చూద్దాం! రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం మద్దిమల్ల, వీర్నపల్లి గిరిజన తండాలకు చెందిన 25 కుటుంబాలు ఆరు నెలలపాటు ఇల్లు విడిచి, ఊరును వదిలి వనవాసం చేస్తూ... ఆవులను మేపుతుంటారు. స్థానికంగా గడ్డి లేకపోవడంతో ఊరు వదిలి మన్నెం(వలసపోవడం) అనివార్యమైంది. మద్దిమల్ల నుంచి అటవీమార్గంలో ఆవులను మేపుతూ.. కోరుట్ల, మెట్పల్లి, ఖానాపూర్, నిర్మల్ శివారులోకి వెళ్లి.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆవులను మేపుతారు. ఎక్కడ రాత్రి అయితే అక్కడే ఆవులతోపాటు నిద్రిస్తారు. అక్కడే వంట చేసుకుని తింటారు. ఎవరైనా పెద్ద రైతులు తమ పొలాల్లో సేంద్రియ ఎరువుల కోసం ఈ ఆవుల మందలను వారం, పది రోజులు పెట్టించుకుని డబ్బులు ఇస్తారు. ఆవుల మూత్రం, పేడ పొలాలకు సేంద్రియ ఎరువులుగా పనికి వస్తాయి. అందుకే రైతులు ఎక్కువగా ఆవుల మందలను పొలాల్లో పెట్టిస్తారు. అలా వచ్చిన డబ్బులతోనే గిరిజనులు బియ్యం కొనుక్కుని, కట్టెల పొయ్యిపై వంట చేసుకుని తింటారు. కొన్ని ఆవులను, కోడెలను ఒక్కోదాన్ని రూ.15వేల నుంచి రూ.30 వేలకు స్థానిక రైతులకు, పశువుల సంతల్లో అమ్ముతారు. కోడెలు రైతులకు ఎవుసానికి అక్కరకు వస్తుంటాయి. ఇలా ఆరు నెలలపాటు వనవాసం చేసి వర్షాకాలంలో ఇల్లు చేరుతారు. ఆవుల మందలే ఆధారం.. గిరిజనులకు ఆవుల మందలే ఆధారం. ఒకప్పుడు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఆవులు ఉండేవి. ఇప్పుడు వాటిని మేపేందుకు చెల్కలు లేక, అడవుల్లోకి వెళ్లకుండా కంచెలు వేయడంతో ఆవుల సంఖ్య తగ్గింది. మరోవైపు వన్యప్రాణుల భయం వెంటాడుతుండడంతో అడవుల్లోకి వెళ్లడం తగ్గిపోయింది. మైదాన ప్రాంతాలన్నీ పొలాలుగా మారడంతో పశుపోషణ భారమైంది. అయినా.. కొందరు గిరిజనులు ఆవులను పోషిస్తూ.. వాటితో వచ్చే ఆదాయంతో ఇల్లు కట్టడం, పిల్లలను చదివించడం, ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తుంటారు. కానీ ఇటీవల ఆవుల మందల సంఖ్య తగ్గిపోయింది. అయినా.. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఓ వంద కుటుంబాల వరకు ఆవులే ఆధారంగా ఇప్పటికీ జీవిస్తున్నాయి. ఇవి చదవండి: భవ్య రామమందిరంలోని బాలరాముడి కళ్లను వేటితో చెక్కారో తెలుసా! -
Narsingi Animal Fest Photos: నార్సింగిలో మూడో రోజు పశు సంక్రాంతి (ఫొటోలు)
-
TS: పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసు
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పీఎస్‌లో పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసు నమోదైంది. గొర్రెల పంపిణీలో అవకతకలు జరిగాయంటూ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకం అమలులో అవకతవకలు చోటుచేసుకున్నాయి. గొర్రెల పంపిణీ కోసం గుంటూరు జిల్లా నుండి అధికారులు గొర్రెలను తీసుకొచ్చారు. గొర్రెలను ఇచ్చిన వారికి బదులు ఇతరుల ఖాతాలోకి నగదు జమ అయ్యిందని, మొత్తం 2 కోట్ల రూపాయలు మోసం జరిగిందని గచ్చిబౌలిలో ఫిర్యాదు చేశారు. పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.. పలువురు అధికారులకు నోటీసులు జారీ చేశారు. -
యానిమల్ సక్సెస్ మీట్లో అలియా ధరించిన డ్రస్ ధర ఎంతంటే..?
సెలబ్రెటీలు ధరించిన డ్రస్‌లు ఎప్పడూ అత్యంత ఖరీదులోనే ఉంటాయి. వాటికి గోల్స్ అంచు లేదా డైమండ్లు పొదగబడి ఉండటం వంటివి జరుగుతాయి కూడా. అయితే కొన్ని ఖరీదైన డ్రస్‌లు చూస్తే ఏముంది ఇందుల? ఎందుకింత ఖరీదు? అనిపిస్తుంది. అలాంటి డ్రస్ అలియా వేసుకొచ్చింది. అదికూడా తన భర్త నటించిన యానిమల్ మూవీ సక్సెస్ మీట్‌కి. ఆమె భర్త రణబీర్ కపూర్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఒకరకంగా చాలా రోజుల తర్వాత బాలీవుడ్ మూవీ ఈరేంజ్‌లో దూసుకుపోతున్న సినిమా ఇది అని చెప్పొచ్చు. అదిగాక ఈ మూవీలో "జమల్ జమలు కుదు" పాట ఎంతలా వైరల్ అవుతోందో చెప్పాల్సివసరం లేదు. ఈ మేరకే ఈ సినిమా బృందం తమ మూవీ విజయోత్సవాన్ని జరుపుకుంది. ఈ వేడుకకు అలియా భట్ తన భర్త రణబీర్ కపూర్ మూవీ సక్సస్‌ని పంచుకునేందుకు మంచి గ్రాండ్ లుక్‌తో వచ్చారు. ఈ వేడుకలో ఆమె నీలిరంగు దుస్తుల్లో స్టన్నింగ్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ శాటిన్ కటౌట్ డ్రస్‌లో చాలా గ్లామరస్‌గా కనిపించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సంస్థ రసారియో కలక్షన్స్ ఈ డ్రెస్‌ని డిజైన్ చేసింది. దీని ధర ఏకంగా రూ. 1.5 లక్షలు. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ రణబీర్, అలియా జంట, రణబీర్ కపూర్, రష్మిక మందన్న, బాబీడియోల్, అనిల్‌కపూర్, డైరెక్టర్లు,తదితర బాలివుడ్ తారాగణమంతా హాజరయ్యారు. (చదవండి: జమల్ జమలు కుదు... యానిమలు!) -
జమల్ జమలు కుదు... యానిమలు!
‘యానిమల్’ సినిమాలో బాబీ డియోల్ ఎంట్రీ సాంగ్ ‘జమల్ జమలు కుదు’ సూపర్‌హిట్ అయింది. ఈ పాటలో ఒక్క ముక్క అర్థం కాకపోయినా యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాట యూత్ ఫ్రేవరెట్ రింగ్ టోన్గా మారింది. ‘జమల్ జమలు కుదు’ అనేది 1950 నాటి ఇరానీ పాట. ఇరానీ కవి బిజన్ స్మందర్ ఈ పాట రాశారు. ఖటరెహ్ మ్యూజిక్ గ్రూప్ ట్యూన్ కంపోజ్ చేసింది. తొలిసారిగా 1950లో టెహ్రాన్‌లోని ఖరజెమీ హైస్కూల్లో పాడారు. ‘జమల్ జమలు కుదు’ అంటే ఆంగ్లంలో ‘వో మై లవ్, మై స్వీట్ లవ్’ అని అర్థం. ఈ పాటలో కనిపించిన తనాజ్ దావూది సోషల్ మీడియాలో వైరల్ గర్ల్‌గా మారింది. టెహ్రాన్‌లో పుట్టి పెరిగిన తనాజ్ డ్యాన్సర్, మోడల్. ‘యానిమల్’ షూటింగ్ సమయంలో తనాజ్ ముంబైలో ఉంది. ఈ పాటకు సంబంధించిన ఓల్డ్ వెర్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘యానిమాల్ సినిమాలోని పాట కంటే ఓల్డ్ వెర్షన్ బాగా ఎంజాయ్ చేసే విధంగా ఉంది’ అంటూ స్పందిస్తున్నారు నెట్లోకవాసులు. -
Pet's Show : వింతవింత జంతువులతో కొలువుదీరిన ఈ కార్నివాల్ (ఫొటోలు)
-
‘యానిమల్’ మెషీన్ గన్ సీక్రెట్ ఇదే..
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. 2023, డిసెంబర్ ఒకటిన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి, గత రికార్డులను బద్దలు కొట్టింది. భారత్‌లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన 10 చిత్రాల జాబితాలో ‘యానిమల్’ చేరింది. రూ. 100 కోట్లతో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 835.87 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రణబీర్ ‘మెషిన్ గన్’ను ఉపయోగించే దృశ్యం ప్రేక్షకులను అమితంగా అలరిస్తోంది. ఈ మెషిన్ గన్ ఎలా తయారు చేశారనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. కొందరు ఇది నిజమైన మెషీన్ గన్ కాదని, ఇదంతా వీఎఫ్ఎక్స్తో రూపొందించిన అద్భుతం అని అంటున్నారు. అయితే దీనిలో నిజం లేదని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ మెషీన్ గన్ గురించి ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ మీడియాతో మాట్లాడుతూ ఈ మెషిన్ గన్ స్టీల్‌తో తయారు చేశామని, దీనిని తయారీకి ఐదు నెలలు పట్టిందని తెలిపారు. దీనిని తయారు చేయడానికి వందమంది శ్రమించారని, 500 కిలోల స్టీల్‌ను ఉపయోగించామని తెలిపారు. ఈ గన్ తయారు చేస్తున్నప్పుడు దీనికి సంబంధించిన సీన్ అందరినీ ఇంతలా ఆకట్టుకుంటుందని అనుకోలేదని అన్నారు. సినిమా దర్శకుడు సందీప్ ఆలోచనలకు అనుగుణంగా ఈ గన్ రూపొందించామన్నారు. మొదట సందీప్ పెద్ద మెషీన్ గన్ గురించి చెప్పారని, అంత భారీ గన్ రూపకల్పనకు నాలుగైదు నెలలు పడుతుందని చెప్పానన్నారు. మెషీన్ గన్ తయారీలో ఎంతో శ్రద్ద చూపించామని, వినూత్నంగా దానిని తీర్చిదిద్దామని తెలిపారు. ఆ మెషీన్ గన్ బరువు 500 కిలోలని సురేష్ తెలిపారు. -
మిస్ వరల్డ్ అందాల పోటీల్లోకి 'యానిమల్' బ్యూటీ షఫీనా ఎంట్రీ (ఫోటోలు)
-
ఈ తాబేలు వయసు ఎంతో చెప్పగలరా?
భూమ్మీద అత్యంత పురాతన కాలం నాటి జంతువులు ఇప్పటికీ ఇంకా బతికే ఉన్నాయంటే నమ్ముతారా?. నో ఛాన్స్ అంతరించిపోయే ఉంటాయని కచ్చితంగా చెబుతాం. అది అబద్ధం... నేనింకా బతికే ఉన్నానంటోంది ఈ తాబేలు. దీని వయసెంతో వింటే కచ్చితంగా షాకవ్వుతారు. ఎందుకంటే ఇది డైనసర్ల కాలం నుంచి ఉంది. ఒకరకరంగా చెప్పాలంటే జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల కాలం నుంచి ఉన్న జీవిగా ఈ తాబేలుని పేర్కొనవచ్చు. ఆ తాబేలు ఎక్కడ ఉంది? దానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం! ఈ తాబేలు పేరు జోనాథన్. ఇది బ్రిటన్‌లోని సెయింట్ హెలెనాలో ఉంది. ఆ ద్వీపానికి చేరుకునేటప్పటికే ఈ తాబేలు వయసు 50 ఏళ్లు. అప్పటికే పూర్తిగి పరిణితి చెంది ఉంది. అందువల్ల ఇది సుమారు 1832లో జన్మించాడని చెబుతుంటారు దీని సంరక్షకులు. లేదా అంతకంటే పెద్దవాడైనా అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పడది తన 191వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఇప్పుడూ దీన్నే చూస్తే పురాతన కాలం నాటి కొన్ని జీవులు ఇంకా బతికే ఉన్నాయని ఒప్పుకుంటారు కదూ. అయితే తాబేలు జీవిత కాలం 60 నుంచి 150 ఏళ్లు. ఐతే కొన్ని మాత్రం 200 ఏళ్ల వరకు జీవిస్తాయని చాలా మంది చెబుతుంటారు. బహుశా ఈ జోనాథన్ తాబేలు కూడా ఆ కోవకు చెందిందేనేమో!. అయితే అలాంటి తాబేలు భారత్‌లోని కొలకతాలో కూడా ఉందట. దాని పేరు అద్వైత. ఇది ఏకంగా 255 ఏళ్లు జీవించినట్లు చెబుతున్నారు. తాబేలుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు శిరచ్ఛేదం చేసిన తాబేలు చనిపోదట. తల నరికిన 23 రోజుల వరకు బతికిన సందర్భాలు కూడా ఉన్నాయట. చైనా వాళ్లు దీన్ని దీర్ఘాయువుకి చిహ్నంగా భావిస్తారట. అంతేగాదు తాబేలు మెదడును శస్త్రచికిత్స ద్వారా తొలగించిన మరణించదట. పైగా మెదడును తొలగించిన ఆరు నెలల వరకు కూడా బతికే ఉంటుందట The world’s oldest living land animal - the Seychelles giant tortoise named Jonathan - has just celebrated his 191st birthday. His age is an estimate, based on the fact that he was fully mature when he arrived on the island in 1882.pic.twitter.com/t4hpd73KsE — Massimo (@Rainmaker1973) December 4, 2023 (చదవండి: దెయ్యాలకు బోజనం పెట్టే పండుగ గురించి విన్నారా?) -
యానిమల్ ఓ బిగ్ డిజాస్టర్.. మండిపడ్డ టీమిండియా ఫాస్ట్ బౌలర్!
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో యానిమల్ మూవీ బ్లాక్‌బస్టర్‌గా కానుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సైతం తన రివ్యూను ప్రకటించారు. (ఇది చదవండి: 'నా సామిరంగ'.. వరలక్ష్మి ఎలా ఉందో చూశారా?) అయితే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ బిగ్ డిజాస్టర్ అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమా చూసి అవసరంగా మూడు గంటల టైమ్ వృథా చేశానని రాసుకొచ్చారు. సినిమా వాళ్లకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని సూచించారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించే వారిపై ప్రశంసలు కురిపించడం తనకు బాధ కలిగించిందని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. 'మనమేమీ అడవుల్లో నివసించటం లేదు. ప్రస్తుతం యుద్దాలు చేస్తూ వేటాడే సమాజంలో బతకడం లేదు. యాక్టింగ్ ఎంత గొప్పగా ఉన్నా సరే మితిమీరిన వయోలెన్స్ చూపించడం మంచిదికాదు. ఇలాంటి హింసను ప్రేరేపించే వారిని ఆదరించి ప్రశంసలు కురిపించడం బాధ కలిగించింది. లక్షల మంది సినిమాలు చూస్తారు. మీకు కూడా కనీస సామాజిక బాధ్యత ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ సినిమా వల్ల మూడు గంటల సమయం వేస్ట్ చేసుకున్నా' అని పోస్ట్ పెట్టారు. (ఇది చదవండి: కాంగ్రెస్ విజయం.. అల్లు అరవింద్ శుభాకాంక్షలు..) -
ఈ ఏడాది కలిసొచ్చింది
రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యానిమల్’. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ ఖేతని, క్రిషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 1న రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో ‘యానిమల్’ చిత్రాన్ని పంపిణీ చేసిన ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 15 కోట్ల మేరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తొలి వారాంతంలోనే ‘యానిమల్’ రూ. 35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబడుతుందని అంచనా వేస్తున్నాం. ఈ ఏడాది మాకు బాగా కలిసొచ్చింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నాలుగు, ‘దిల్’ రాజుప్రోడక్షన్స్ బ్యానర్లో మూడు సినిమాలు.. ఇలా మొత్తంగా ఏడు సినిమాలు చేస్తున్నాం. రామ్‌చరణ్‌గారి ‘గేమ్ చేంజర్’ సినిమా చిత్రీకరణ 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ మేన్ ’ను మార్చిలో రిలీజ్ చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు. -
'యానిమల్' సినిమాలో హాట్ బ్యూటీ 'త్రిప్తి డిమ్రి' ఫోటోలు వైరల్
-
క్యాచ్ ద ట్రాప్..!
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల వేట నిరోధానికి స్పెషల్ డ్రైవ్ ‘క్యాచ్ ద ట్రాప్’కార్యక్రమాన్ని రాష్ట్ర అటవీ శాఖ ప్రారంభించింది. అడవుల్లో జంతువుల వేటకు వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు, విషపదార్ధాలు, పేలుడు పదార్ధాలు వంటివి ఉపయోగించకుండా కార్యాచరణను శుక్రవారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాల పరిశీలన ద్వారా వేటగాళ్ల గుర్తింపు, పరికరాల స్వాదీనం, గత రికార్డులు, కేసుల ప్రకారం సోదాల నిర్వహణ వంటివి అమలు చేస్తోంది. వివిధ రకాల వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు ఉపయోగించి అటవీ జంతువులను చంపడం/వేటాడటాన్ని గతంలోనే నిషేధించడం తెలిసిందే. వేటకు అడ్డుకట్ట..: అడవి జంతువుల నుంచి వ్యవసాయ పంటల నష్ట నివారణకు కొందరు, అటవీ జంతువుల మాంసం వినియోగం, వ్యాపారానికి మరికొందరు సాగిస్తున్న జంతువుల వేటకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ ప్రత్యేక డ్రైవ్ లో అధికారులు వీలైనన్ని అటవీ ప్రాంతాలను పరిశీలించి వేటగాళ్లను గుర్తించడంతో పాటు వారు వాడే పరికరాలను స్వాదీనం చేసుకోవటం వంటి చర్యలను చేపడుతున్నారు. గత రికార్డులు, కేసులను పరిశీలించి అనుమానితులను సోదా చేసి వేటకు ఉపయోగించే పరికరాలను స్వాదీనం చేసుకుంటున్నారు. ముందుగా అడవిని ఆనుకుని ఉండే వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాలు, ప్రాంతాలను క్షేత్ర సా్థయిలో పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా స్వాదీనం చేసుకున్న అన్ని వేటలకు ఉపయోగించే మెటీరియల్/పరికరాలు సరిగ్గా రికార్డ్ చేయటంతో పాటు, సురక్షితమైన కస్టడీ కోసం వాటిని హైదరాబాద్‌కు రవాణా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రోత్సాహం అందించనున్నారు. వేట సమాచారం ఇస్తే రివార్డులు..: వేటకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చే ఇన్ఫార్మర్లకు తగిన రివార్డులు అందజేయనున్నారు. అయితే వారి గుర్తింపును రహస్యంగా ఉంచనున్నారు. చట్టవిరుద్ధమైన వేట, అందుకోసం ఉపయోగించే వస్తువుల సమాచారం తెలిస్తే సంబంధిత జిల్లా అటవీ అధికారికి లేదా 9803338666 నంబర్‌కు, లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004255364కు తెలియజేయవచ్చునని అటవీ శాఖ సూచించింది.. -
‘యానిమల్’ మూవీ ట్విటర్ రివ్యూ
‘అర్జున్‌రెడ్డి’సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు సందీప్‌రెడ్డి వంగ. అదే సినిమాను కబీర్‌సింగ్ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత సందీప్ చాలా గ్యాప్ తీసుకొని ‘యానిమల్’సినిమాను తెరకెక్కించాడు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ చిత్రం నేడు(డిసెంబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ చిత్రం ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. యానిమల్ మూవీ ఎలా ఉంది? స్టోరీ ఏంటి? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. యానిమల్ చిత్రానికి ఎక్స్‌లో మంచి స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని ఎక్కువ మంది చెబుతున్నారు. రణ్‌బీర్, అనిల్ కపూర్, రష్మిక, బాబీ డియోల్ల నటన అదిరిపోయిందంటున్నారు. వయోలెన్స్ ఎక్కువైందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. Big day for the Indian box office 🥵 Anticipate the cinematic magic as #AnimalMovie hits screens tomorrow, promising an exhilarating experience. 💥💥💥💥💥 Also, get ready for the much-awaited #SalaarCeaseFire trailer dropping tomorrow. Double the excitement, double the… pic.twitter.com/h0evNakiCL — Thyview (@Thyview) November 30, 2023 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో బిగ్డే ఇది. సినిమాటిక్ మ్యాజిక్ ఊహించబోతున్నాం. ఈ సినిమా అద్బుతమైన అనుభూతిని అందిస్తుందని ఆశిస్తున్నాం. ఈ రోజు డబుల్ ధమాకా. సలార్ ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతున్నది. నాకు డబుల్ ఎక్సైట్మెంట్ అంటూ ఓ నెటిజన్ ట్విట్ చేశాడు. Very good 1st half 👌👌 Ranbir like never before and Vanga has written a simply mind blowing character for him. Everything on point so far. Waiting for 2nd half #Animal — RGK 🍀 (@iamrgk_) December 1, 2023 ఫస్టాఫ్ చాలా బాగుంది. కర్బీర్ కపూర్‌ని ఇలాంటి పాత్రలో ఎప్పుడు చూడలేదు. అతనికి సందీప్ వంగ మంచి పాత్రను ఇచ్చాడు. ప్రతి పాయింట్ బాగుంది. సెకండాఫ్ కోసం ఎదురు చూస్తున్నానంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #OneWordReview...#Animal: BLOCKBUSTER Rating: ⭐️⭐⭐️⭐️½#RanbirKapoor𓃵 in a never seen before avatar his career best performance #AnimalReview#AnimalTheFilm #RanbirKapoor #Svr #AnimalOn1stDec #AnimalReview #BobbyDeol #AnilKapoor #AnimalOn1stDec #RashmikaMandanna #AnimalMovie pic.twitter.com/Kz4IXMFTSl — himesh (@himeshmankada) November 30, 2023 ఒక్కమాటలో చెప్పాలంటే.. యానిమల్ బ్లాక్ బస్టర్. ఇలాంటి పాత్రలో రణ్‌బీర్‌ని ఎప్పుడు చూడలేదు. అతని కెరీర్లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు’అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు. #Animal Blood batting fight Goosebumps 🔥🔥🔥#RanbirKapoor𓃵 #AnimalMovie #AnimalReview #AnimalTheFilm #Animal #AnimalAdvanceBooking #AnimalOn1stDec@Portalcoin $Portal #AnimalPremieres pic.twitter.com/nfAJJRtoDb — BTC6660 ll 🔥Champions Tactics (@BTC6660) December 1, 2023 Blockbuster first half.. Sandeep Reddy Vanga just hit this out of the park.. Terrific drama, Shot making, sound design, Ranbir intensity, supremely quality product from once in a generation talented director. Such a Feast to watch it on silver screen #Animal — PST (@PSTtwtz) December 1, 2023 I Really Wish #Animal to be biggest Blockbuster for Ranbir Kapoor, Bobby Deol , Sandeep Vanga ,Anil Kapoor for showing their Love &Respect towards @urstrulyMahesh Their gesture and way of receiving is so heart warming❤️ All The Best Sandeep & Ranbir#AnimalMovie #AnimalTheFilm pic.twitter.com/nWeQOFayyN — Hemanth Kiara (@ursHemanthRKO) November 30, 2023 Ranbir 🔥🔥🔥#AnimalMovie One of the best climax 😢#AnimalTheFilm #Animal #AnimalOn1stDec #AnimalAdvanceBooking #AnimalPremieres #AnimalReview #RanbirKapoor𓃵 pic.twitter.com/DXHF05TK1C — Abhishek (@Abhishek09kk) December 1, 2023 Inside reports ..everywhere positive#AnimalReview#ANIMAL : BLOCKBUSTER. Rating: 🌟🌟🌟🌟🌟½#SandeepReddyVanga immerses us into the world of #Animal, delivers a KING-SIZED ENTERTAINER… Imagine SPIRIT 🥵 #spirit #Prabhas #salaar pic.twitter.com/zcbo47vEAy — Film Royce (@film_royce) December 1, 2023 #Animal Blood batting fight Goosebumps 🔥🔥🔥#RanbirKapoor𓃵 #AnimalMovie #AnimalReview #AnimalTheFilm #Animal #AnimalAdvanceBooking #AnimalOn1stDec@Portalcoin $Portal #AnimalPremieres pic.twitter.com/nfAJJRtoDb — BTC6660 ll 🔥Champions Tactics (@BTC6660) December 1, 2023 Blockbuster first half.. Sandeep Reddy Vanga just hit this out of the park.. Terrific drama, Shot making, sound design, Ranbir intensity, supremely quality product from once in a generation talented director. Such a Feast to watch it on silver screen #Animal — PST (@PSTtwtz) December 1, 2023 -
హాట్‌టాపిక్‌గా మారిన మహేశ్ బాబు టీషర్ట్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న మహేశ్ తాజాగా యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మహేశ్ బాబు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. సింపుల్ టీ షర్ట్‌లో క్లాసీ లుక్స్‌తో కనిపించాడు. దీంతో మహేశ్ ధరించిన టీ షర్ట్ ధర ఎంత ఉంటుందబ్బా అంటూ నెటిజన్లు గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు.సాధారణంగా సెలబ్రిటీలు వేసుకున్న దుస్తులు, వస్తువుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో ఎక్కువగా ఉంటుంది. అలా మహేశ్ బాబు యానిమల్ ఈవెంట్‌కు ధరించిన టీషర్ట్ ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇది 'గివెంచి' బ్రాండ్‌కు సంబంధించినది.చూడటానికి సింపుల్‌గా ఉన్నా దీని ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఈ టీషర్ట్ ధర వందల్లో కాదు సుమారు రూ. 47వేలు మరి. ఈ విషయం తెలిసి.. సింపుల్ టీషర్ట్ ఏకంగా ఇంత కాస్ట్లీనా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. -
ప్రమోషన్స్‌లో చీరకట్టులోనే కనిపిస్తున్న రష్మిక..అదే కారణమా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలకి మించిపోయే ఫాన్ ఫాలోయింగ్‌తో రష్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటి దక్కించుకున్న ఈ బ్యూటీ ఛలో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస హిట్స్‌తో వెనక్కి తిరిగి చూసుకోలేదు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా తెలుగులోనే కాదు ఇప్పుడు బాలీవుడ్‌లోను తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఆమె నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక, రణబీర్ కపూర్ జంటగా నటించారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచారు మూవీ టీం. ఇందులో రష్మిక లేటెస్ట్ లుక్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. మొన్నా మధ్య రష్మిక తన ఇన్‌స్టాలో.. శారీలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ మీరంతా(అభిమానులను ఉద్దేశించి)నాకు చీరలపై ఉన్న ఇష్టాన్ని పెంచేశారు అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి రష్మిక ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తుంది. తాజాగా యానిమల్ ప్రమోషన్స్ అన్నింట్లో చీరల్లోనే మెస్మరైజ్ చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో వైట్ శారీలో దేవకన్యలా మెరిసిపోయింది రష్మిక. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) ఆర్గాంజా శారీలో అదరహో అనిపించే అందంతో మెరిసిపోయింది. మొన్నటికి మొన్న ఓ షోకు హాజరైన రష్మిక బ్లాక్ శారీలో తళుక్కుమంది. చూడటానికి చాలా సింపుల్‌గా కనిపించిన ఈ చీర ధర అక్షరాల 80వేల రూపాయలట. ఇక రీసెంట్గా ప్రముఖ డిజైనర్ అర్పితా ఖాన్ డిజైన్ చేసిన పింక్ చీరలోనూ వయ్యారాలు ఒలికించింది. ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ ముందుండే రష్మిక చీరకట్టులోనూ మరింత అందంగా కనిపిస్తోంది. దీంతో రష్మికకు-చీరలకు ఏందో లింక్ ఉన్నట్లుంది, త్వరలోనే రివీల్ చేస్తుందేమో చూడాల్సి ఉంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
నన్ను హీరో చేసింది తెలుగు డైరెక్టరే.. అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్‌ను యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్‌పై సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈవెంట్‌కు హాజరైన మరో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అనిల్ కూపూర్ మాట్లాడుతూ..' అందరూ బాగున్నారా? ట్రైలర్ చూశారా? నచ్చిందా? మీకు ఓ విషయం చెప్పాలి. ఒక నటుడిగా నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు సినిమానే. నాకు మొదటి చిత్రం తెలుగులోనే. 1980లో వంశవృక్షం చిత్రంలో నటించా. డైరెక్టర్ బాపు నన్ను హీరోగా టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆయన వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. దాదాపు 43 ఏళ్ల తర్వాత మళ్లీ మీ ముందుకు వస్తున్నా. ఇది ప్రత్యేకమైన ఫీలింగ్ ఇస్తోంది. సందీప్ వంగా బ్రిలియంట్ డైరెక్టర్. ఇది నా రెండో తెలుగు చిత్రం. మహేశ్ బాబుతో నాకు కుటుంబంలాంటి అనుబంధం. మీరు ఒక ఫ్యామిలీ మ్యాన్. ది గ్రేటెస్ట్, గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి సార్. మన సినిమా ఇండస్ట్రీలోని ప్రపంచానికి పరిచయం చేశారంటూ ' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో సందడి చేయనుంది. -
అప్పుడు రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా : రాజమౌళి
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.ఈ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా విచ్చేసారు. ఈ సందర్బంగా దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఎంతోమంది కొత్త కొత్త డైరెక్టర్లు వస్తారు. హిట్లు, సూపర్ హిట్ సినిమాలు తీస్తారు. చాలా పెద్ద పేరు కూడా సంపాదిస్తారు. అవి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడో ఓ సారి మాత్రమే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ మొతాన్ని షేక్ చేసే డైరెక్టర్ వస్తాడు. అతడు సినిమా అంటే ఇలాగే తీయాలన్న ఫార్ములాను కూడా షేక్ చేస్తాడు. అలాంటి డైరెక్టర్ నాకు తెలిసి నా తరంలో రాంగోపాల్ వర్మ. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా అలాంటి డైరెక్టర్. సినిమా ఇలాగే తీయాలన్న రూల్ పక్కన పెట్టి.. నేను ఇలాగే సినిమా తీస్తా అనే డైరెక్టర్ అతడు. నిన్ను చూసి చాలా గర్విస్తున్నా" అని సందీప్ ను ఉద్దేశించి రాజమౌళి అనడం విశేషం. యానిమల్ చిత్ర టీజర్ చూడగానే ఈ సినిమా నేను చూడాలని వెంటనే అనిపించింది. రాబోయే మూడు సంవత్సరాల్లో కూడా టీజర్ చూడగానే మొదటి రోజే చూడాలనిపించిన చిత్రం యానిమల్ అంటూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై దర్శక ధీరుడు ప్రశంసలు కురిపించాడు. నా ఫేవరేట్ యాక్టర్ రణ్‌బీర్ కపూర్: రాజమౌళి బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌బీర్ కపూర్ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. నా ఫేవరేట్ బాలీవుడ్ యాక్టర్ ఎవరు అంటూ నన్ను చాలా మంది అడిగితే ఏ మాత్రం ఆలోచించకుండ రణ్‌బీర్ కపూర్ అని చెప్తాను. నేను చూసిన తన సినిమాలు తక్కువే కానీ చాలా ఇంటెన్సిటీ ఉన్న నటుడు. తన 15 ఏళ్ల కెరీర్లో తన టాలెంట్ చూపించుకునేలాంటి చిత్రాలు చాలా తక్కువ వచ్చాయి. యానిమల్తో తనకు ఆ లోటు తీరుతుంది. రణ్‌బీర్ కపూర్ ఇండస్ట్రీలోనే టాప్‌లో ఉంటాడని జక్కన్న అన్నారు. -
యానిమల్ ట్రైలర్ చూసి నాకు మెంటలొచ్చేసింది: మహేష్ బాబు
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలివుడ్ సూపర్‌స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.ఈ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా విఛ్చేసారు. ఇక యానిమల్ మూవీ టీమ్ నుంచి రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ ఈవెంట్లో సందడి చేశారు. ఈ సందర్బంగా మహేష్ బాబు మాట్లాడుతూ యానిమల్ ట్రైలర్ చూసి నాకు మెంటలొచ్చేసింది. ఇంత ఒరిజనల్ ట్రైలర్ నేనెప్పుడూ చూడలేదు. డైరెక్టర్ సందీప్ అంటే నాకు చాలా ఇష్టం. తను చాలా స్పెషల్, యూనిక్ డైరెక్టర్. దేశంలోనే సందీప్ ఓ ఒరిజనల్ ఫిల్మ్ మేకర్ అన్నారు. అలానే ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ తాను రణ్‌బీర్ కపూర్‌కి చాలా పెద్ద అభిమానిని అని చెప్పడం విశేషం. ఇంతకుముందు కూడా ఈ విషయం రణ్‌బీర్‌కి చెప్పాను. కానీ అతడు దాన్ని అంత సీరియస్‌గా తీసుకున్నట్లు లేడు. ఈ స్టేజ్ పై మరోసారి చెబుతున్నాను. నేను రణ్‌బీర్‌కి వీరాభిమానిని. ఇండియాలోనే అతడు బెస్ట్ యాక్టర్. యానిమల్ చిత్రంలో తను అత్యుత్తమ నటన కనబరిచాడు. ఆల్ ద బెస్ట్ మై బ్రదర్ అని మహేష్ అన్నాడు. ఇక డిసెంబర్ 1వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. -
‘యానిమల్’ లుక్ కోసం బాబీ కఠోర సాధన.. నాలుగు నెలలు నో స్వీట్స్!
అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ విలన్‌గా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా బాబీ దేవోల్ లుక్,యాక్టింగ్‌పై ప్రేక్షకులను నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అయితే ఈ చిత్రంలోని తన పాత్ర కోసం బాబీ చాలా కష్టపడ్డాడట. రణ్‌బీర్ కంటే భారీగా కనిపించేందుకు నాలుగు నెలల పాటు కఠోర సాధన చేశాడట. బాబీ ఫిట్నెస్ ట్రైనర్ ప్రజ్వల్ శెట్టి ఈ విషయాన్ని తెలియజేశాడు. ‘యానిమల్ చిత్రంలో విలన్ పాత్ర పోషించేందుకు బాబీ చాలా కష్టపడ్డాడు. లుక్ విషయంలో దర్శకుడు సందీప్ కొన్ని సూచనలు చేస్తూ.. రణ్‌బీర్ కంటే భారీగా కనిపించాలని కండీషన్ పెట్టాడు. దీంతో బాబీ..నాలుగు నెలల పాటు కచ్చితమైన డైట్ ఫాలో అయ్యాడట. తనకు బాగా ఇష్టమైన స్వీట్స్ కూడా తినకుండా.. సాధన చేశాడు. దీంతో బాబీ డియోల్ శరీరంలోని కొవ్వు శాతం 12కి తగ్గింది. అతని బరువు 85 నుండి 90 మధ్యకు చేరింది.ట్రైనింగ్ అనంతరం బాబీ లుక్ చూసి చిత్ర యూనిట్ అంతా షాకైంది. క్లైమాక్స్ షూట్ రోజు బాబీ నన్ను సెట్‌కి పిలించుకొని అందరి ముందు అభినందించారు’అని ప్రజ్వల్ తెలిపాడు. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. -
ప్రేమ కాదు.. పగ అనేది బలమైన భావోద్వేగం
‘‘ప్రేమ, కోపం కాదు..పగ తీర్చుకోవడమే బలమైన భావోద్వేగమని ‘యానిమల్’ సినిమా ప్రయాణంలో నాకు అనిపించింది. మనతో పగను ముందుకు తీసుకువెళ్లడం అనేది చిన్న విషయం కాదు. నేను ఎందుకు ఇలా చెబుతున్నానో ‘యానిమల్’ సినిమా చూస్తే ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా, అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘యానిమల్’. తెలుగు, తమిళం, కన్నడం,మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్‌రెడ్డి వంగా చెప్పిన విశేషాలు... ► తండ్రీకొడుకుల భావోద్వేగమే ‘యానిమల్’ సినిమా ప్రధానాంశం. ఓ వ్యక్తి తన భావోద్వేగంతో కుటుంబం కోసం ఎంతదూరం వెళ్లాడు? అన్నదే ఈ సినిమా. ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలను, భావోద్వేగ సన్నివేశాలను బ్యాలెన్స్ చేశాననే అనుకుంటున్నాను. ► ‘యానిమల్’ కథను తొలిసారిగా విన్నప్పుడు కొంతమంది యాక్టర్స్‌కు కొన్ని అంశాలు నచ్చలేదనే చర్చ జరిగి ఉండొచ్చు. అయితే ‘యానిమల్’ కథ రణ్‌బీర్ కపూర్‌కు నచ్చింది. పైగా నాకు బాగా నచ్చిన నటుడు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రణ్‌బీర్ కపూర్. ► ఈ సినిమా లవ్‌స్టోరీతోనే మొదలవుతుంది. ఈ సినిమాలో హీరో పాత్రను అతని తల్లిదండ్రులు కన్నా ఎక్కువగా అర్థం చేసుకున్నది హీరోయిన్ పాత్రే అని సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు అనిపిస్తుంది. కథలో రష్మికా మందన్నా, అనిల్‌కపూర్ పాత్రలు చాలా కీలకంగా ఉంటాయి. బాబీ డియోల్‌ది విలన్ రోల్. ఆయన పాత్ర గురించి నేను ఇప్పుడే చెప్పలేను. ప్రేక్షకులు థియేటర్స్‌లో చూడాలి. నిర్మాత భూషణ్కుమార్గారు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. నా సొంత సోదరుడు ప్రణయ్ ్రపోడక్షన్ లో ఉండటం నాకు ప్లస్గానే అనిపించింది. నా సినిమా నాకంటే ఎక్కువగా మరొకరికి అర్థం కాదేమోనని నా సినిమాలకు నేనే ఎడిటింగ్ చేసుకుంటున్నాను. అలా ‘యానిమల్’ సినిమాకు ఎడిటింగ్ చేశాను. ► అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా అంటే స్టోరీ, క్యారెక్టర్స్‌లో ఇంటెన్స్ తగ్గిపోవచ్చు. సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. ఇది చిన్నపాటి మైనస్ అనుకుంటున్నాను. అయితే ‘యానిమల్’ నిడివి మూడుగంటల ఇరవై నిమిషాలు ఉండటం అనేది పెద్ద సమస్య కాదని నేను అనుకుంటున్నాను. ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమకథలా వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా మూడుగంటల ఆరు నిమిషాలైనా ప్రేక్షకులు ఆదరించారు. ‘యానిమల్’ సినిమాలో ప్రేమకథే కాదు.. కుటుంబ అంశాలను ప్రస్తావించాము. కాబట్టి నిడివి కాస్త ఎక్కువైంది. ‘అర్జున్ రెడ్డి’ కంటే కేవలం ఓ పది నిమిషాలు ఎక్కువ అంతే. ప్రేక్షకులకు ‘యానిమల్’ కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది. ► ఇండస్ట్రీపై ‘శివ’ సినిమా చూపించినంత ప్రభావం ‘అర్జున్ రెడ్డి’ సినిమా కూడా చూపించిందంటే నేను ఒప్పుకోలేను. ‘శివ’ సినిమా టైమ్‌లెస్ క్లాసిక్. ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఎంత క్లాసిక్ అనేది టైమ్ చెబుతుంది. ► ఓ దర్శకుడిగా నాకు అందరి హీరోలతో సినిమాలు చేయాలని ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత మహేశ్‌బాబుగారికి ఓ స్టోరీలైన్ చెప్పాను. రామ్‌చరణ్‌కు ఓ కథ చెప్పాను. వారు బిజీగా ఉండటం వల్ల కుదర్లేదు. అయితే ప్రభాస్‌గారితో నా తర్వాతి సినిమా ‘స్పిరిట్’ ఉంటుంది. వచ్చే ఏడాది సెప్టెంబరులో షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాం. అల్లు అర్జున్ గారితో ఓ కమిట్మెంట్ ఉంది. ∙ -
దుబాయ్‌లో యానిమల్
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. గుల్షన్ కుమార్, టి.సిరీస్ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియోస్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషణ్ కుమార్, మురాద్ ఖేతాని నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబరు 1న విడుదలవుతోంది. ఈ సినిమాలోని ‘అర్జన్ వైలీ..’ అనే పాటను దుబాయ్‌లోని ఐకానిక్ గ్లోబల్ విలేజ్‌లో అభిమానుల మధ్య ఘనంగా విడుదల చేశారు మేకర్స్. ఈ వేడుకలో రణబీర్ కపూర్, బాబీ డియోల్ పాల్గొన్నారు. వేదికపై ‘అర్జన్ వైలీ...’ పాటకు స్టార్ కాస్ట్‌తో పాటు అభిమానులు చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. -
యానిమల్ నుంచి 'నాన్న నువ్ నా ప్రాణం' ఎమోషనల్ సాంగ్ రిలీజ్
ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న సినిమా ‘యానిమల్’. సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రష్మిక మందన్న కథానాయిక. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ మొదటి పాటను కూడా విడుదల చేశారు. తాజాగా ఎమోషనల్‌గా ఉన్న రెండో సాంగ్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. 'నాన్న నువ్ నా ప్రాణం' అంటూ సాగే ఈ సాంగ్ ఎంతో ఎమోషనల్‌గా ఉంది. తండ్రీకొడుకుల రిలేషన్ షిప్ నేపథ్యంలో సాగనున్న ఈ మూవీలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ పాటను అనంత శ్రీరామ్ రచించగా.. సోను నిగమ్ అద్భుతంగా ఆలపించారు. తాజాగా విడుదలైన పాటలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్ మధ్య ఉన్న బంధాన్ని చూపించారు. దీంతో సినిమా తండ్రి – కొడుకుల మధ్య జరిగే కథలా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎక్కువగా భావోద్వేగాలకు సంబంధించిన సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. యానిమల్ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
రష్మిక మందన్న ఫేక్ వీడియో వైరల్.. ఫైర్ అయిన అమితాబ్
సోషల్ మీడియా వైరస్ లాంటింది. కోవిడ్‌కన్నా బలమైంది… ఒక్కోసారి అందులో వైరల్ అవుతున్న ఫోటోలు,వీడియోలు ఏవి నిజమో..? ఏది అబద్ధమో పసిగట్టడం కష్టం. సోషల్ మీడియాలో నకిలీ సృష్టికర్తల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలపై ఫేక్ న్యూస్, ఫేక్ ఫోటోలు, వీడియోలు ప్రచారం చేసే వారి వ్యక్తిగత జీవితానికి ఇబ్బందులు కలిగేలా కొందరు ఎంతటి చెత్తపనులు అయినా చేసేందుకు వెనకాడటం లేదు. తాజాగా నటి రష్మిక మందన్న కూడా ఈ సమస్యను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం రష్మిక మందన్న డీప్ నెక్ బ్లాక్ కలర్ డ్రెస్‌లో లిఫ్ట్ లోపల నిలబడి ఉన్న వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వారందరూ రష్మికనే అని పొరపడ్డారు. బహిరంగా ప్రదేశాల్లో రష్మిక ఇలాంటి డ్రెస్ వేయడం ఏంటి..? మరీ ఇంత హాట్‌గా ఎందుకు కనిపించారు..? అనే ప్రశ్నలు ఆమె అభిమానుల్లో కనిపించాయి.. ఆ వీడియోను చూసి వారంతా కలత చెందారు కూడా. అయితే ఈ వీడియోలో రష్మిక కాదని తెలుస్తోంది. కొందరు సోషల్ మీడియా దుండగులు ఓ డీప్ ఫేక్ వీడియోను రూపొందించి హల్ చల్ చేశారు. ఫైర్ అయిన అమితాబ్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ వీడియోపై స్పందించారు. ఇలాంటి వీడియోల మీద వ్యతిరేకత ప్రదర్శించాడు. వీడియో క్రియేట్ చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని తన ట్విటర్ ఎక్స్ ద్వారా రియాక్ట్ అయ్యారు. ఆ వీడియో నిజమని కొందరు నమ్ముతున్న సమయంలో వాస్తవికతను జర్నలిస్ట్ అభిషేక్ మొదట ఆ వీడియో షేర్ చేస్తూ.. వాస్తవాన్ని వెల్లడించారు. చెప్పాలంటే, ఈ వీడియోలో జారా పటేల్ అనే యువతి ఉన్నారని ఆయన తేల్చేశారు. అయితే కొందరు సోషల్ మీడియా ముసుగులో రష్మిక ముఖాన్ని ఆమె ముఖంలోకి మార్ఫింగ్ చేసి ఆ వీడియో వైరల్ చేశారు. ఇంతకుముందు కూడా రష్మిక మందన్న ఇలాంటి పొట్టి డ్రెస్‌లో ఉన్న ఫోటోలు, జిమ్ వీడియోలు వైరల్ అయ్యాయి. కొందరు ఒకరినొకరు పోల్చుకుని, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో రష్మికదే అని అనుకున్నారు. ఈ మేరకు అభిషేక్ సమాచారం అందించారు. రెండు వీడియోలను షేర్ చేసి క్లారిటీ ఇచ్చారు. వైరల్‌గా మారిన ఫేక్ వీడియోపై రష్మిక అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులను తగిన విధంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా చాలా మంది నటీనటులు ఇలాంటి ఫేక్ ఫోటోలు, వీడియోలతో ఇబ్బంది పడ్డారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాన్ని సద్వినియోగం చేసుకోవడం కంటే తప్పుగా వాడేవారే ఎక్కువ. ఇది ఎప్పుడు ఏ దశకు చేరుతుందో తెలియక నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. సినిమాల విషయనాకి వస్తే రష్మిక మందన్న నటించిన 'యానిమల్' విడుదలకు సిద్ధంగా ఉంది. రణబీర్ కపూర్ సరసన రష్మిక నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాలోని లిప్‌లాక్ సన్నివేశాలు వైరల్‌గా మారాయి. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి డైరెక్ట్ చేశారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విజయంతో బాలీవుడ్లో మరిన్ని ఛాన్స్‌లు దక్కించుకోవాలనే ప్లాన్‌లో ఈ బ్యూటీ ఉంది. తను నటించిన పుష్ప-2 వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా శ్రీవల్లి పాత్రలో రష్మిక అదరగొట్టిన విషయం తెలిసిందే. -
యానిమల్ డైరెక్టర్ వల్ల థియేటర్స్ యజమానులకు తిప్పలు..!
సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఈ చిత్రం డిసెంబర్1న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఈ సినిమా రన్ టైమ్ విషయంలో ఇప్పటికే సోషల్ మీడియాలో భారీగానే చర్చ జరుగుతుంది. యానిమల్ నిడివి విషయంలో వస్తున్న రూమర్స్‌ను చూసి సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండటంతో మూవీ రన్‌టైమ్ తగ్గించాలని డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డికి చాలా అభ్యర్థనలు వస్తున్నాయట. (ఇదీ చదవండి: జీవితంలో కష్టాలు వచ్చినా.. గుండె బద్దలైనా అంటూ శ్రీజ కామెంట్స్) సుమారు 3:30 గంటలు ఉన్న యానిమల్ రన్‌టైమ్ ఇప్పటికే పలు సూచనల మేరకు ఆయన 3:15 నిమిషాలకు కుదించారట. ఇక అంతకు మించి కుదించడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని ఆయన తేల్చేశాడట. కథ పరంగా తను ఏదైతే ప్రేక్షకులకు చూపించాలని డిసైడ్ అయ్యాడో దానిని కట్ చేయడం కుదరదని, రన్‌టైమ్ విషయంలో ఏ మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని సందీప్ చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇంత ఎక్కువ నిడివ గల సినిమా అంటే థియేటర్స్‌లో వేసే షోస్ టైమింగ్‌తో పాటు ఇతర ఇబ్బందులు కూడా తలెత్తుతాయని థియేటర్ యాజమాన్యం సూచిస్తుందట. 3: 15 గంటల సినిమా అంటే రెండు బ్రేక్స్ ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చను వారు అనుకుంటున్నారట. ఇంత లాంగ్ రన్‌టైమ్ సినిమాలను తమ టాకీస్‌లలో ప్రదర్శిస్తే ఆ తర్వాతి షోల టెలికాస్ట్ టైమింగ్ పరంగా, అలాగే స్పెషల్ షోస్ వేసే విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటామని థియేటర్ యజమానులు వాపోతున్నారట. యానిమల్ రన్‌టైమ్ 3:15 గంటలు అనేది నిజం అయితే సినిమాకు రెండు ఇంటర్వెల్స్ అనేది గ్యారెంటీ అని తెలుస్తోంది. డిసెంబర్1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
యూట్యూబ్‌లో మొదటి వీడియో ఏది? ఎంతమంది చూశారు?
ఈ రోజుల్లో యూట్యూబ్ అనేది వినోద ప్రపంచపు రారాజు. ఒకవైపు యూట్యూబ్ ద్వారా కోట్లాది మంది వినోదం పొందుతుండగా, మరోవైపు లక్షలాది మంది ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. నేటి రోజుల్లో యూట్యూబర్‌గా మారడం అనేది ఉద్యోగం కంటే ఉత్తమమైన ఆదాయం అందుకోగల వృత్తి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే యూట్యూబ్ ఎప్పుడు ప్రారంభమయ్యింది? దానిలో పోస్ట్ చేసిన మొదటి వీడియో ఏది? అనే ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యూట్యూబ్‌ని 2005లో స్టీవ్ చెన్, చాడ్ హర్లీ, జావేద్ కరీం ప్రారంభించారు. అయితే ఆ తర్వాత వీరు దీనిని 165 కోట్ల డాలర్లకు గూగుల్‌కు విక్రయించారు. ఈ రోజు ఈ యాప్‌కున్న క్రేజ్ ఎంతంటే ప్రతి నెలా 200 బిలియన్లకు(ఒక బిలియన్ అంటే వంద కోట్లు) పైగా వినియోగదారులు దీనిని సందర్శిస్తున్నారు. యూట్యూబ్‌లో మొదటి వీడియో 2005 సంవత్సరంలో ఏప్రిల్ 24న రాత్రి 8:27 గంటలకు అప్లోడ్ చేశారు. ఈ వీడియోను యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు జావేద్ కరీం అప్లోడ్ చేశారు. ఈ వీడియో టైటిల్ ‘మీ ఎట్ ది జూ’. ఈ 19 సెకన్ల వీడియోలో జావేద్ ఏనుగుల గురించి మాట్లాడుతూ ‘ఇప్పుడు మనం ఏనుగుల ముందున్నాం. ఏనుగులకు పొడవాటి తొండం ఉంటుంది’ అని అన్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 291 మిలియన్లకు (ఒక మిలియన్ అంటే పది లక్షలు) పైగా వీక్షణలు దక్కాయి. అదే సమయంలో 4.09 మిలియన్ల మంది ఈ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఈ వీడియోను 14 మిలియన్ల మంది లైక్ చేశారు. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఛానెల్లో ఈ వీడియో తప్ప మరో వీడియో అందుబాటులో లేదు. ఇది కూడా చదవండి: గోల్ఫ్ కోర్సుల రంధ్రాల మూసివేత ఎందుకు? -
రణ్‌బీర్- రష్మిక ఫ్లైట్ సీన్.. ఆ మూవీ నుంచి కొట్టేశారా?
రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని రూపొందించగా.. త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగులో ‘అమ్మాయి’ అనే టైటిల్‌తో ఈ పాటను విడుదల చేశారు. అయితే ప్రైవేట్ జెట్‌లో రష్మిక, రణ్‌బీర్ కపూర్ మధ్య లిప్ లాక్ సీన్స్ ఆడియన్స్‌కు అర్జున్ రెడ్డి సినిమాను గుర్తుకు తెచ్చాయి. తాజాగా ఈ ఫ్లైట్‌లో రొమాంటిక్ సీన్స్‌పై నెట్టింట చర్చ మొదలైంది. (ఇది చదవండి: 'మన దగ్గర పైసలెక్కడివిరా సేవ్ చేయడానికి'.. ఆసక్తిగా ట్రైలర్) అయితే ఈ ఫ్లైట్ సీన్ కాపీ కొట్టారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జామీ డోర్నాన్, డకోటా జాన్సన్ నటించిన 2015లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రేలోని హెలికాప్టర్ సన్నివేశంలా ఉందని అంటున్నారు. ఓ నెటిజన్ రాస్తూ.. బాలీవుడ్ ప్రస్తుతం కాపీకి బ్రాండ్‌గా మారిందని పోస్ట్ చేశారు. మరొకరు ఫిఫ్టీ షేడ్స్ కాపీ క్యాట్ అంటూ రాసుకొచ్చారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, జానీ సంగీతం అందిస్తున్నారు. బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయకుడిగా కూడా నటించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అనే ఐదు భాషల్లో ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలోకి రానుంది. (ఇది చదవండి: లియో మూవీ రిలీజ్ వివాదం.. కొనసాగుతున్న సస్పెన్స్!) View this post on Instagram A post shared by Alright (@thealrightsquad) -
పార్లమెంట్ ద్వారాలకు జంతువుల పేర్లెందుకు? గజ ద్వారం దేనికి సూచిక?
నూతన పార్లమెంట్ హౌస్‌లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్‌లోని ఆరు ద్వారాలకు జంతువుల పేర్లు పెట్టారు. వీటిలో కొన్ని మనకు కనిపించేవి. మరికొన్ని పౌరాణిక సంబంధమైనవి. 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్లమెంట్ ద్వారాలకు ఉన్న చిహ్నాలు వివిధ అంశాలను తెలియజేస్తాయి. నేటి కథనంలో ఆ ద్వారాలకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకుందాం. గజ ద్వారం నూతన పార్లమెంట్ ప్రాగణ ద్వారానికి గజ ద్వార్ అనే పేరు పెట్టారు. ఈ ద్వారం జ్ఞానం, జ్ఞాపకశక్తి, సంపద, తెలివితేటలను సూచిస్తుంది. ఈ ద్వారం భవనానికి ఉత్తరం వైపున ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశ బుధునికి సంబంధించినది. దీనిని మేధస్సుకు కేంద్రంగా పరిగణిస్తారు. ఈ ద్వారంపై ఏనుగు బొమ్మలు కనిపిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇవి శ్రేయస్సును, సంతోషాన్ని అందిస్తాయి. అశ్వ ద్వారం పార్లమెంట్‌లోని మరో ద్వారానికి అశ్వ ద్వారం అని పేరు పెట్టారు. అశ్వం అంటే గుర్రం. ఇది శక్తి, బలం, ధైర్యానికి చిహ్నం. గరుడ ద్వారం మూడవ ద్వారానికి పక్షుల రాజైన గరుడుని పేరు పెట్టారు. గరుడుని విష్ణువు వాహనంగా భావిస్తారు. త్రిమూర్తులలో రక్షకునిగా పేరొందిన విష్ణువుతో అనుబంధం కలిగిన గరుడ పక్షి.. శక్తి, కర్తవ్యాలకు చిహ్నమని చెబుతారు. గరుడ ద్వారం నూతన పార్లమెంటు భవనానికి తూర్పున ఉంది. మకర ద్వారం మకర ద్వారం అనేది పురాణాలలో పేర్కొన్న సముద్ర జీవిని గుర్తుచేస్తుంది. ఇది వివిధ జంతువుల కలయిక. మకర శిల్పాలు దక్షిణ, ఆగ్నేయాసియాలో విస్తరించిన హిందూ, బౌద్ధ స్మారక కట్టడాలలో కనిపిస్తాయి. మకరం అనేది వివిధ జీవుల కలయికతో దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. ద్వారాల వద్ద కనిపించే మకర విగ్రహాలను రక్షకులని చెబుతారు. మకర ద్వారం పాత పార్లమెంట్ హౌస్ ప్రవేశ ద్వారం వైపు కనిపిస్తుంది. శార్దూల ద్వారం ఐదవ ద్వారానికి పురాణాల్లో పేర్కొన్న శార్దూలం అనే పేరు పెట్టారు. ఇది సింహం శరీరాన్ని కలిగి ఉంటుంది. గుర్రం, ఏనుగు, చిలుక తలను కలిగి ఉంటుంది. కొత్త పార్లమెంట్ భవనం గేటు వద్ద శార్దూలం ఉండటం దేశ ప్రజల బలానికి ప్రతీక అని ప్రభుత్వ నోట్లో పేర్కొన్నారు. హంస గేట్ నూతన పార్లమెంటులోని ఆరవ ద్వారానికి హంస గేట్ అనే పేరు పెట్టారు. జ్ఞాన దేవత అయిన సరస్వతీమాత వాహనంగా హంస గుర్తింపు పొందింది. హంస మోక్షాన్ని సూచిస్తుంది. జనన, మరణ చక్రం నుండి ఆత్మ విముక్తిని సూచిస్తుంది. పార్లమెంటు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న హంస విగ్రహం స్వీయ సాక్షాత్కారానికి, జ్ఞానానికి చిహ్నం. -
'సిగ్గుండాలి కొంచెమైనా.. చేసింది చాలు.. బయటికి గెంటెయ్'
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం 'యానిమల్'. ఇప్పటికే కబీర్ సింగ్‌ను బాలీవుడ్‌కు హిట్ ఇచ్చిన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘యానిమల్’ విడుదలకు రెడీగా ఉంది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ప్రి టీజర్‌ని మేకర్స్ ఇప్పటికే విడుదల చేయగా అందుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేశారు. తెలుగులో ‘అమ్మాయి’ అనే పేరుతో సాంగ్‌ను విడుదల చేశారు. అయితే ఈ సాంగ్‌లో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కెమిస్ట్రీ ఓ రేంజ్లో ఉంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ముద్దు సీన్స్ మరింత రొమాంటిక్‌గా ఉన్నాయి. అయితే ఈ సాంగ్ ప్రారంభంలో ఫ్యామిలీ అందరిముందే ఈ జంట ముద్దు పెట్టుకోవడం హైలెట్‌గా ఉంది. ఈ సాంగ్‌లో వచ్చే సీన్లో తన ప్రేమ గురించి చెప్పమని రష్మికను 'ఏం గీత ఇలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పాలిగా.. ఈ అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఏం చేశాడో చూడు.' అని ఆమె తల్లి, సోదరుడు అడుగుతుండగానే.. పక్కన ఉన్న మరొకరు మాట్లాడుతూ.. 'సిగ్గుండాలి కొంచెమైనా? చేసింది చాలు' అనగానే.. అంతలోనే ఇద్దరు ముద్దు పెట్టుకుంటారు. ఆ తర్వాత జెట్‌లో వచ్చే ముద్దు సన్నివేశాలు అభిమానులకు ఫుల్ రొమాంటిక్ విందును అందించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఇటీవల రణబీర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అధికారిక టీజర్‌ను విడుదల చేశారు. దీనికి అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న థియేటర్లలోకి రానుంది. . -
యానిమల్ అప్డేట్.. లిప్ లాక్ పోస్టర్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం 'యానిమల్' .ఇప్పటికే కబీర్ సింగ్‌ను బాలీవుడ్‌కు హిట్ ఇచ్చిన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘యానిమల్’ విడుదలకు రెడీగా ఉంది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ప్రి టీజర్‌ని మేకర్స్ ఇప్పటికే విడుదల చేయగా అందుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజగా ఈ చిత్రం గురించి మరోక క్రేజీ సమాచారాన్ని షేర్ చేశారు. (ఇదీ చదవండి: షాండ్‌విచ్ దెబ్బకు ఆస్పత్రిపాలైన టాప్ హీరోయిన్) కొద్ది సేపటి క్రితం ఓ రొమాంటిక్ పోస్టర్‌ను వదులుతూ యానిమల్ నుంచి ఫస్ట్ సింగల్ విడుదల గురించి వివరాలు ప్రకటించారు మేకర్స్. పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతున్న ఈ సినిమా ఐదు భాషల్లో మొదటి సాంగ్‌ను అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగులో ‘అమ్మాయి’ అనే టైటిల్‌తో ఈ పాటు విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. దీనిని సందీప్ వంగాతో పాటు రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రణ్‌బీర్‌కపూర్- రష్మిక ఆకాశంలో లిప్ లాక్ చేసుకుంటున్న పోస్టర్‌ను విడుదల చేశారు. సందీప రెడ్డి మొదటి చిత్రం అయిన అర్జున్ రెడ్డి పోస్టర్‌తో ఫ్యాన్స్ పోలుస్తున్నారు. అందులో విజయ్ దేవరకొండ- షాలినీ కూడా లిప్‌లాక్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. ఇప్పుడు యానిమల్ పోస్టర్‌తో మూవీతో పాటు సాంగ్‌పై ఒక్కసారిగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, జానీ సంగీతం అందిస్తున్నారు. 2023 డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా యానిమల్ విడుదల అవుతుంది. #AnimalTheFilm pic.twitter.com/oI3ko5YnEz — Sandeep Reddy Vanga (@imvangasandeep) October 10, 2023 Hua main ❤️ Out tomorrow.. this song is 🔥🔥🔥🔥 And I personally love it in all the versions.. Hindi Kannada telugu tamil and Malayalam .. 💃🏻🥳#HuaMain #Ammayi #Neevaadi #OhBhaale #Pennaale#AnimalTheFilm@AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @thedeol @tripti_dimri23… pic.twitter.com/JH7eADNoDs — Rashmika Mandanna (@iamRashmika) October 10, 2023 -
అతి పెద్ద గుండె కలిగిన జీవి ఏది? నిముషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది?
ప్రపంచంలోని అతి చిన్న క్షీరదాలలో ఒకటైన ఎట్రుస్కాన్ ష్రూ గుండె నిముషానికి 1,500 సార్లు లేదా సెకనుకు 25 సార్లు కొట్టుకుంటుంది. మనిషి గుండె నిముషానికి 60 నుండి 100 సార్లు కొట్టుకుంటుంది. కాగా బ్లూ వేల్ గుండె భారీ పరిమాణం కలిగివుంటుంది. జీవులలో అతిపెద్ద గుండె బ్లూ వేల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ సముద్ర జీవి రెండు బస్సులకు మించిన పొడవు కలిగివుంటుంది. దాని గుండె లవ్సీట్ ఆకారంలో ఉంటుంది. అది 1,000 పౌండ్ల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. దాని గుండె నిమిషానికి కనీసం రెండుసార్లు మాత్రమే కొట్టుకుంటుంది. నీటి అడుగున ఉండే ఈ నీలి తిమింగలం ఛాతీపై జెయింట్ స్టెతస్కోప్ పెట్టిన పరిశోధకులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ప్రపంచంలోని అన్ని జీవులలో తిమింగలం అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. దాని గుండె చాలా పెద్దదిగా ఉంటుంది. శాస్త్రవేత్తలు దాని గుండె కొలతలు తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు. కెనడాలోని టొరంటోలోని రాయల్ అంటారియో మ్యూజియంలో బ్లూ వేల్ గుండెను భద్రపరిచారు. ఆ గుండె బరువు 190 కిలోలు. ఈ జీవి మొత్తం బరువులో గుండె ఒక శాతం ఉంటుంది. అంటే గుండె బరువు 400 పౌండ్లు అయితే తిమింగలం మొత్తం బరువు 40,000 పౌండ్లు. చేపల బరువు పౌండ్లలో కొలుస్తారు. మనిషి గుండె బరువు 10 ఔన్సులకు సమానం. కేజీలోకి మారిస్తే 283 గ్రాములు. తిమింగలం గుండె బరువు మనిషి గుండె కంటే 640 రెట్లు అధికం. ఇది కూడా చదవండి: అంతరిక్షంలో పొగలుకక్కే కాఫీ ఎలా తాగుతారు? -
ఆకులపై జంతువుల డీఎన్ఏ
సాక్షి, అమరావతి: జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ఏ ప్రాణి.. ఎక్కడ.. ఎలా జీవిస్తోందనే సమాచారం సేకరించేందుకు శాస్త్రవేత్తలు కొత్త పద్ధతులను అన్వేషిస్తున్నారు. ఇప్పటివరకు కెమెరా ట్రాపింగ్, లైన్ ట్రాన్‌సెక్టు్టలను ఉపయోగించి జంతువుల కదలికలను ట్రాక్ చేయడం ద్వారా వన్యప్రాణుల ఉనికిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ట్రాకింగ్ నిర్ధిష్ట ప్రాంతం, ప్రత్యేకించి డిజైన్ చేసిన ట్రయల్స్‌గా మాత్రమే ఉంటోంది. ఇందులో ఖరీదైన పరికరాల వాడకం, శ్రమతో కూడుకోవడంతో పాటు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఒక ప్రాంతంలోని అన్ని జాతులను గుర్తించడం సాధ్యపడటం లేదు. దట్టమైన వర్షారణ్యాల్లో ఈ రకమైన ట్రాకింగ్ కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ జీవ వైవిధ్య శాస్త్రవేత్తల బృందం అడవుల్లో జంతువుల డీఎన్ఏ నమూనాల సేకరణ ద్వారా జీవ వైవిధ్యాన్ని సులభంగా, తక్కువ ఖర్చుతో గుర్తించవచ్చని ఓ అధ్యయనంలో పేర్కొంది. గాలిలోకి కణాలుగా జంతు డీఎన్ఏ ఉగాండాలోని కిబలే జాతీయ పార్కులోని వర్షారణ్యంలో అంతర్జాతీయ పరిశోధన బృందం మొక్కలు, చెట్ల ఆకులపై జంతువులు డీఎన్ఏలను కనుగొంది. జంతువులు తమ డీఎన్ఏను గాలిలోకి కణాలుగా విడుదల చేస్తున్నట్టు.. అది కాస్తా అడవిలోని వృక్ష సంపదపై సన్నని మైనం పొర మాదిరిగా అల్లుకుంటున్నట్టు పరిశోధనలో తేలింది. ఆకులపైన స్వాబ్ నమూనాలను కాటన్ బడ్స్ ద్వారా సేకరించి డీఎన్ఏ సీక్వెన్సింగ్ పరీక్ష ద్వారా జాతుల వివరాలను తెలుసుకోవడంతోపాటు జీవ వైవిధ్యాన్ని మ్యాప్ చేయవచ్చని పరిశోధన బృందం చెబుతోంది. పర్యావరణంలోని మార్పులను అర్థం చేసుకుంటూ జీవ వైవిధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి, అటవీ జనాభాను పర్యవేక్షించడానికి డీఎన్ఏ పరీక్షా విధానం ఎంతగానో ఊతమిస్తోంది. కోవిడ్ తర్వాత డీఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందడం కూడా కలిసి వస్తోంది. ఆకులను శుభ్రపరచడానికి టెక్నాలజీ, ఖరీదైన పరికరాలు, ఎక్కువ శిక్షణ అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైల్డ్‌లైఫ్ అథారిటీలో పని చేసే సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర జీవ శాస్త్రవేత్తలు దీనిని సులభంగా నిర్వహించవచ్చు. వాస్తవంగా పర్యావరణంలో సేకరించే డీఎన్ఏ చాలా పెద్దస్థాయిలో జీవ వైవిధ్య పర్యవేక్షణకు దోహదపడుతుంది. వర్షాధార పరిస్థితుల్లో, అత్యంత వేడి పరిస్థితుల్లో మాత్రమే ఆకులపై డీఎన్ఏ త్వరగా క్షీణిస్తుంది తప్ప మిగిలిన సందర్భాల్లో పరిశోధనలకు అనుకూలంగా ఉండటంతో ఈ పద్ధతిపై అంచనాలు పెరుగుతున్నాయి. గంటలో 50కి పైగా జాతుల గుర్తింపు కిబలే జాతీయ పార్కు గొప్ప జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ‘ప్రైమేట్ క్యాపిటల్’ (కోతి జాతులు) నిలయంగా ఉంది. ఇందులో అంతరించిపోతున్న రెడ్ కోలోబస్ కోతి, చింపాజీలతో సహా 13 జాతులు ఇందులో ఉన్నాయి. ఇక్కడ పరిశోధకులు కేవలం ఒక గంటలో 24 కాటన్ బడ్స్ ద్వారా ఆకులపై స్వాబ్ నమూనాలను సేకరించారు. వాటి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపగా.. ఏకంగా 50 రకాల క్షీరదాలు, పక్షులు, ఒక కప్ప జాతులను గుర్తించడం గమనార్హం. ప్రతి మొక్క ఆకులపై దాదాపు 8 జంతు జాతులను కనుగొన్నారు. వీటిల్లో పెద్దవైన అంతరించిపోతున్న ఆఫ్రికన్ ఏనుగు నుంచి చిన్న జాతులైన సన్‌బర్డ్ వరకు భారీ జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించాయి. డీఎన్ఏల ద్వారా ఒక మీటరు పొడవాటి రెక్కలుండే గబ్బిలాలు, బయటకు కనిపించని పర్వత కోతులు, బూడిద, ఎరుపు వర్ణాల కోతులు, సుంచు ఎలుకలు, అనేక రకాల చిలుకలు ఉన్నట్టు గుర్తించారు. -
పాకిస్తాన్ జాతీయ జంతువు ఏది? ఏ విషప్రాణులను మింగుతుంది?
మార్ఖోర్ అనేది అడవి మేక. ఇది హిమాలయ ప్రాంతాలలో కనిపిస్తుంది. దీనికి సంబంధించి చాలా కథలు వినిపిస్తాయి. ఇది పాములకు తొలి శత్రువు అని చెబుతారు. పాములు ఎక్కడున్నాయో కనిపెట్టి, వాటిని చంపి, నమిలి మింగేస్తుందని చెబుతారు. పాకిస్తానీ గూఢచార సంస్థ ఐఎస్ఐ చిహ్నంలో మార్ఖోర్ కనిపిస్తుంది. మార్ఖోర్ పాకిస్తాన్ జాతీయ జంతువు. మార్ఖోర్ అనేది పర్షియన్ పదం. దీని అర్థం పాములను తినేది లేదా పాములను చంపేది. ఈ జంతువు తన వాడి అయిన కొమ్ములతో పాములను చంపి, వాటిని తినగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని స్థానిక జానపద కథలు చెబుతున్నాయి. పాముకాటు నుండి విషాన్ని తొలగించడంలోనూ మార్ఖోర్ సహాయపడుతుందని కూడా చెబుతారు. అయితే మార్ఖోర్.. పాములను తిన్నట్లు లేదా వాటి కొమ్ములతో పాములను చంపినట్లు ఆధారాలు ఎక్కడా కనిపించవు. అయితే పాకిస్తాన్ ప్రజలు మార్ఖోర్లు ఉండే చోట పాములు కనిపించవని నమ్ముతారు. ప్రస్తుతం మనకు సాధారణంగా మేక.. మార్ఖోర్ నుండి ఉద్భవించి ఉండవచ్చని చార్లెస్ డార్విన్ ఊహించాడు. మార్ఖోర్ చాలా శక్తివంతమైనది. 6 అడుగుల పొడవు, 240 పౌండ్ల బరువు కలిగి ఉంటుంది. దీనికి దవడ నుండి కడుపు దిగువ వరకు విస్తరించిన దట్టమైన గడ్డం ఉంటుంది. మార్ఖోర్లు ఉత్తర భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి టర్కిస్తాన్ వరకు 2,000 నుండి 11,800 అడుగుల ఎత్తయిన పర్వతాలలో నివాసం ఉంటాయి. ఇవి ప్రధానంగా శాఖాహారులు. ఇవి సాధారణంగా గుంపులుగా జీవిస్తాయి. ఒక మందలోని మార్ఖోర్ల సగటు సంఖ్య దాదాపు 9గా ఉంటుంది. కాగా వేట కారణంగా మార్ఖోర్ల జనాభా తగ్గుతోంది. వాటి ప్రత్యేకమైన కొమ్ముల కోసం వేటగాళ్లు మార్ఖోర్లను వేటాడుతారు. ఇది కూడా చదవండి: భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్ భవితవ్యం -
నాకన్నా చెడ్డవాడు లేడు!
తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన హిందీ చిత్రం ‘యానిమల్’. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్. అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ ముఖ్య పాత్రలు చేశారు. భూషణ్‌కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, మురాద్ ఖేతని నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కానుంది. గురువారం రణ్‌బీర్ బర్త్ డే సందర్భంగా ‘యానిమల్’ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘జ్యోతి... క్రిమినల్‌ను కన్నాం మనం.. (అనిల్ కపూర్), ‘మై ఫాదర్ ఈజ్ ది బెస్ట్ ఫాదర్ ఇన్ ది వరల్డ్.. డోన్ట్ ఎవర్ గో దేర్, నేను చెడును వెంటాడుతూ వెళ్లాను. నాకెక్కడా కనపడలేదు. నాలో నేను చూసుకున్నాను. నాకన్నా చెడ్డవాడు లేడు’ (రణ్‌బీర్) అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. తెలుగులోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
విజయ్- రష్మిక జోడీ.. ఆ మాత్రం ఉండాల్సిందే!
టాలీవుడ్లో విజయ్ దేవరకొండ- రష్మిక జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్‌లోనూ కలిసి నటించారు. దీంతో వీరిద్దరు టాలీవుడ్లో ఫేవరేట్ జోడీగా నిలిచారు. ఇండస్ట్రీలో విజయ్, రష్మిక గురించి ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక చేసిన ట్వీట్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: యానిమల్ టీజర్.. సందీప్ రెడ్డి వంగా ఏ మాత్రం తగ్గలేదు) ప్రస్తుతం రష్మిక, రణ్‌బీర్ కపూర్ జంటగా యానిమల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 28న రణ్‌బీర్ కపూర్ బర్త్ డే సందర్భంగా చిత్రబృందం సర్ప్రైజ్ ఇచ్చింది. యానిమల్ టీజర్ రిలీజ్ చేస్తూ మేకర్స్ ట్వీట్ చేశారు. అయితే దీనికి విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చారు. రణ్‌బీర్ కపూర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. విష్ యూ మై డార్లింగ్స్ అంటూ పోస్ట్ చేశారు. విజయ్ ట్వీట్‌కు రష్మిక మందన్నా కూడా రిప్లై ఇచ్చింది. థ్యాంక్యూ.. యూ ఆర్ ది మై బెస్ట్.. అంటూ ట్వీట్ చేసింది. అయితే ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీరు బెస్ట్ పెయిర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా..రష్మిక, రణ్‌బీర్ కపూర్ నటించిన యానిమల్ డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) కాగా.. 'అర్జున్ రెడ్డి' సినిమాతో అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి అక్కడా మంచి విజయాన్ని అందుకున్నారాయన. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో తెరకెక్కిస్తోన్న యానిమల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. Thankyouuuuuuu @TheDeverakonda 🤗❤️ You be the bestestestestttt! ❤️ https://t.co/vz9MCFhsiA — Rashmika Mandanna (@iamRashmika) September 28, 2023 -
యానిమల్ టీజర్.. సందీప్ రెడ్డి వంగా ఏ మాత్రం తగ్గలేదు
'అర్జున్ రెడ్డి' సినిమాతో అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి అక్కడా మంచి విజయాన్ని అందుకున్నారాయన. ఈ చిత్రం తర్వాత బాలీవుడ్ యువ కథానాయకుడు రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో 'యానిమల్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రీ-టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా టీజర్‌ను కూడా విడుదల చేశారు. (ఇదీ చదవండి: Chandramukhi 2 Twitter Review: ‘చంద్రముఖి 2’ మూవీ రివ్యూ) ఈరోజు రణబీర్ కపూర్ పుట్టినరోజు కావడంతో సందీప్ రెడ్డి వంగా టీజర్‌ను షేర్ చేశారు. ఇందులో రణ్‌బీర్ రగ్గడ్ లుక్‌లో, మాస్ అవతారంలో దుమ్ములేపాడు. ఈ టీజర్‌ను గమనిస్తే అనిల్ కపూర్-రణబీర్ కపూర్ మధ్య తండ్రీ కొడుకుల ఎమోషన్‌ను చూపిస్తోంది.నన్ను ఏ విషయం గురించి అడిగినా నిజాయితీగా జవాబు ఇస్తాను. కానీ, మా నాన్న గురించి మాత్రం అడగొద్దు అని హీరో చెప్పే డైలాగ్‌తో పాటు నా ఫాదర్ ఈ ప్రపంచంలోకెల్లా బెస్ట్ అనడం ఇలా అన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. టీజర్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ మెప్పిస్తుంది. (ఇదీ చదవండి: పెళ్లికి ముందు ఆ నిర్మాత ప్రేమలో స్నేహ.. నటుడి సంచలన వ్యాఖ్యలు) ఇందులో రణబీర్‌ను మూడు వేరియేషన్స్ లో ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. ఒక షాట్లో రణబీర్ పడిపోయినప్పుడు కనిపించే సీన్ హైలెట్‌గా నిలుస్తుంది. అంతేకాకుండా టీజర్ ఎండ్‌లో బాబీ డియోల్ సింపుల్‌గా ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సూపర్ అనిపించేలా ఉంది. బాలీవుడ్లో కబీర్ సింగ్ సినిమాతో రూ.300 కోట్లకు పైగా కొల్లగొట్టిన సందీప్ రెడ్డి వంగ తాజాగా ఈ చిత్రంతో మరెన్ని కోట్లు కొల్లగొట్టనున్నాడో వేచి చూడాలి. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
‘యానిమల్’లో గీతాంజలిగా రష్మికా మందన్నా
‘మీ గీతాంజలి’ అంటూ ‘యానిమల్’లో రష్మికా మందన్నా చేస్తున్న పాత్ర పేరు ప్రకటించి, శనివారం లుక్‌ని విడుదల చేసింది యూనిట్. రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యానిమల్’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం టీజర్ ఈ 28న రిలీజ్ కానుంది. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. -
అక్కడేమో క్రేజ్ లేదు.. ఇక్కడ చూస్తే ఫ్లాప్.. మిగిలింది ఆ సినిమా ఒక్కటే!
పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న కన్నడ భామ రష్మిక మందన్నా. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. అల్లు అర్జున్ సరసన నటించిన ఈ చిత్రమే కన్నడ బ్యూటీని బాలీవుడ్ వరకు తీసుకెళ్లింది. అంతవరకు బాగానే ఉన్నా బాలీవుడ్లోనే ఈ అమ్మడు పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదు. హిందీలో నటించిన తొలి చిత్రం గుడ్ బై పూర్తిగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత నటించిన మిషన్ మజ్ను కూడా పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రణ్‌బీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రం ఒకటే ఉంది. (ఇది చదవండి: పాపం గౌతమ్.. కష్టమంతా వృథా! బిగ్‌బాస్ ప్లాన్ అదేనా?) రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబిడియోల్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ప్రస్తుతానికైతే ఈ చిత్రంపైనే రష్మిక ఆశలన్నీ పెట్టుకుంది. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ కెరీర్ ఈ చిత్రం రిజల్ట్‌పైనే ఆధారపడి ఉందనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. తమిళంలో రష్మికకు పెద్దగా క్రేజ్ లేదు. ఎందుకంటే రష్మిక కోలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం సుల్తాన్ డిజాస్టర్‌గా మిగిలింంది. ఇకపోతే వారియర్స్ చిత్రం ఒకే అనిపించుకున్న అందులో రష్మిక పాత్ర గ్లామర్‌కు, సాంగ్స్‌కు మాత్రమే పరిమితం అయిందనే విమర్శలను ఎదుర్కొన్నారు. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) దీంతో హిందీ చిత్రం యానిమల్ హిట్ కాకపోతే నటి రష్మిక టాలీవుడ్‌నే నమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే తెలుగులో అల్లు అర్జున్ సరసన నటిస్తోన్న పుష్ప–2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం విడుదల తరువాత తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశముంది. కాగా.. టాలీవుడ్లో ప్రస్తుతం పుష్ప–2 తో పాటు రెయిన్ బో అనే లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్, కోలీవుడ్ కలిసి నేషనల్ క్రష్‌కు కలిసి రాకపోవడంతో టాలీవుడ్‌పైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
మానవుడికి పంది కిడ్నీ..ప్రయోగం విజయవంతం
అవయవ దానం అనేది ఓ సమస్యాత్మకంగా మారింది. దాతలు దొరకక, బ్రెయిన్ డెడ్ వ్యక్తుల నుంచి అవయవాల సేకరణ పరిమితంగానే ఉండటం తదితర కారణాల దృష్ణ్యా ప్రస్తుతం అవయవాల మార్పిడి ఓ అర్థంకానీ ప్రశ్నలా ఉంది. ఆ ప్రశ్నకు సమాధానమే కాదు ఎన్నాళ్లుగా చిక్కుముడి వీడని ప్రశ్నలా వేధిస్తున్న సమస్యకు సమాధానం దొరికిందనే కొత్త ఆశని ఇచ్చింది. ఇంతవరకు పంది కిడ్నీని మనిషికి అమర్చి చేసిన ప్రయోగాల్లో చాలా వరకు ఒకటి రెండు రోజుల వరకే పనిచేస్తే ..ఈసారి మాత్రం ఏకంగా రెండు నెలలు విజయవంతంగా పనిచేసి రికార్డు సృష్టించింది. అదికూడా బ్రెయిన్‌డెడ్ మనిషిలో విజయవంతమవ్వడం పరిశోధకులకు సరికొత్త ఆశలను రేకెత్తించింది. ఈ పరిశోధన యూఎస్‌లో విజయవంతం అయ్యింది. మానవునిలో జన్యుపరంగా మార్పు చెందిన పంది కిడ్నీ సుదీర్ఘకాలం పనిచేయడం ఇదే తొలిసారి. ఈ మేరకు డాక్టర్ మోంట్‌గోమెరీ వైద్య బృందం మాట్లాడుతూ..ఈ ప్రయోగం అవయకొరత సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుందని ఆనందంగా చెప్పారు. తాము మారిస్ మిల్లర్ అనే బ్రెయిన్ డెడ్ వ్యక్తి మృతదేహాన్ని వెంటిలేటర్‌పై ఉంచి ఈ ప్రయోగాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రెండు నెలలపాటు అతడిని వెంటిలేటర్‌పై ఉంచి మరీ ఆ పంది కిడ్నీ ఎలా పనిచేస్తుందో పరీక్షించినట్లు తెలిపారు. ఒక నెలపాటు విజయవంతంగా పనిచేసిందని ఆ తదుపరి నెమ్మదిగా మార్పులు కనిపించడం మొదలైంది. రోగనిరోధక వంటి మందుల చికిత్సతో కిడ్నీ పనితీరుని పొడిగించేలా చేశామని తెలిపారు. భవిష్యత్తులో ఇలా జంతువుల అవయవాల ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతమవుతుందనే ఆశను ధృవీకరించింది. దీనిపై మరింతగా ప్రయోగాలు చేసి కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి తెలిపిందని పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి సదరు వ్యక్తి మిల్లర్ ఆకస్మికంగా కుప్పకూలి బ్రెయిన్‌డెడ్ అయ్యారు. అయితే క్యాన్సర్ కారణంగా అతడి అవయవాలను దానం చేయడం వీలుపడలేదు. అతని సోదరి మేరి మిల్లర్ డఫీ, పిగ్ కిడ్నీ ప్రయోగం కోసం అతడి మృతదేహాన్ని దానం చేయాలనే నిర్ణయాన్ని చాలా భారంగా తీసుకుంది. జూలై 14న మిల్లర్ 58వ పుట్టిన రోజుకు కొద్దిరోజుల ముందు పంది కిడ్నీని మిల్లర్‌కి మార్పిడి చేసి పరీక్షించడం ప్రారంభించారు. జంతువులోని థైమస్ గ్రంథికి రోగనిరోధక కణాలతో పనిచేయగలిగేలా పరిశోధకులు శిక్షణ ఇచ్చారు. దీంతో మొదటి నెలంతా చాలా విజయవంతంగా ఆ కిడ్నీ పనిచేసింది. ఇక రెండో నెల నుంచి మూత్రంలో తగుదల వంటి మార్పులు ప్రారంభమయ్యాయి. వైద్యులు అందుకు అనుగుణంగా చికిత్స అందించి అది పనిచేసేలా చికిత్స అందించారు. ఈ ప్రయోగం జన్యుపరంగా మార్పు చెందని పందుల నుంచి అవయవాలను ట్రాన్స్‌ప్లాంట్ చేయగలమనే నమ్మకాన్ని అందించింది. వైద్యలు గత మూడు నెలలుగా చేసిన ఈ ప్రయోగం విజయవంతంగా ముగిసింది. ఇక మిల్లర్ మృతదేహం నుంచి పంది కిడ్నీని తొలగించి దహనసంస్కారాల నిమిత్తం అతడి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. అయితే ఇలా జంతువుల అవయవాల మార్పిడి కారణంగా శోషరస కణుపులు, జీర్ణవ్యవస్థలో ఏవైనా సమస్యలు వస్తాయా? అనేదాని గురించి మరింతగా పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. అందుకోసం జీర్ణవ్యవస్థలోని సుమారు 180 వేర్వేరు కణజాల నమూనాలను పరిశీలించాల్సి ఉందని కూడా అన్నారు. చావు అంచుల మధ్య కొట్టుమిట్లాడుతున్న వారికి అవయవదానం ..కొత్త ఊపిరి పోసి జీవితంలో రెండో అవకాశం లభించేలా చేయడమే లక్ష్యంగా ఈప్రయోగాలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. (చదవండి: చిన్నారుల్లో బ్రాంకియోలైటిస్ వస్తే...? ముఖ్యంగా అలాంటి పిల్లలు..) -
'కుంభవృష్టికి కారణం.. జంతు హింసే..'
డెహ్రాడూన్: మాంసం కోసం జంతువులను చంపడం వల్లే హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడుతున్నాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మండి డైరెక్టర్ లక్ష్మీధర్ బెహెరా అన్నారు. ఈ కారణంగానే కుంభవృష్టి వంటి విపత్తులు సంభవిస్తున్నాయని ఆయన చెప్పారు. జంతువులను చంపడం వల్లే పర్యావరణ అసమతుల్యత ఏర్పడుతుందని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాంసం కోసం జంతువులను చంపడం వల్ల పర్యావరణం ఎలా ప్రభావితమౌతుందో ప్రస్తుతం ప్రజలు చూడలేకపోతున్నారని బెహెరా చెప్పారు. కానీ త్వరలో ఈ పరిణామాలు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. ప్రసంగంలో మంచి మనుషులుగా మారడానికి ఏం చేయాలని బెహెరాను కొందరు విద్యార్థులు అడిగారు. ఇందుకు మాంసం తినడం మానేయాలని బెహెరా చెప్పారు. ఈ సందర్భంలోనే రాష్ట్రంలో విపత్తులు జంతువులను చంపడం వల్లనే వస్తున్నాయని అన్నారు. విద్యార్థుల చేత మాంసం తినడం మానేసేలా జపించాలని కోరారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాంసం తినడానికి అతి వర్షాలకు సంబంధం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల వరదలు బీభత్సం సృష్టించాయి. నదులు పొంగి ప్రవహించాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 250 మంది వరకు మరణించారు. రూ.2,913 కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వం పేర్కొంది. ఇదీ చదవండి: G20 Summit:ఢిల్లీలో భారీ భద్రత.. ట్రాక్టర్‌పై పోలీసుల పెట్రోలింగ్ -
పులిని ఫాలో చేసిన ఎలుగు, అది వెనక్కి తిరిగినంతనే శరణుకోరుతూ..
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఒక వీడియో చాలా మందిని షాక్‌కు గురిచేసింది. పులి, ఎలుగుబంటి మధ్య చోటుచేసుకున్న విచిత్రమైన సీన్ ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒక ఎలుగుబంటి పులి వెనుకగా వెళుతున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆ ఎలుగుబంటి.. పులికి దూరంగా వెళ్లేందుకు బదులు.. వెనుక కాళ్లపై దానిముందు నిలబడి శరణాగతి వేడుతున్నట్లు చూస్తుంది. కొంతసేపటి తరువాత ఆ ఎలుగుబంటి పక్కకు వెళ్లిపోతుంది. ఈ వీడియోను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే .. ‘ఈ పులి సన్యాసి అయివుండాలి లేదా ఆ ఎలుగుబంటికి కంటి చూపు తక్కువగా అయినా ఉంటుందని’ రాశారు. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘ఇది చాలా ఆసక్తికరమైన వీడియో. అడవిలో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పుతున్నది’ అని రాశారు. మరో యూజర్.. ‘ఎలుగుబంటి ఆ పులి దృష్టిని మళించడానికి ప్రయత్నించింది. తనకు తానుగా లొంగిపోతున్నట్లు తెలియజేసిందని’ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘... అయితే ఇండిగో ‘భాగో’ కానుందా?’... ‘ఇండియా vs భారత్’ తెగ నవ్విస్తున్న మీమ్స్! While people in safari wanted- fight hone de- it was an affable interaction… Tiger use their tails to communicate with each other. An upright, slowly wagging tail indicates friendliness. Bear understood the language☺️ pic.twitter.com/huDRjStLot — Susanta Nanda (@susantananda3) September 3, 2023 -
అది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రాంతం.. ఏ జీవికైనా తక్షణం మరణం తధ్యం!
ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లేముందు వందసార్లు ఆలోచించాల్సి వస్తుంటుంది. నిజానికి ఈ భూమి మీద చాలామేరకు పచ్చదనం, జీవం కనిపిస్తుండగా, ఆ ప్రాంతంలో చావు, నిశ్శబ్దం మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రదేశం భూమిపై అత్యంత విషపూరితమైన ప్రాంతంగా పేరొందింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే ఇది ఏ ఎడారిలోనే లేదు. ఫ్రాన్స్‌లోని పట్టణ ప్రాంతానికి కొంచెం దూరంలో ఉంది. ఒకప్పుడు మనుషులతో సందడిగా ఉన్న ఈ ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రదేశంగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషపూరిత ప్రదేశం ఎక్కడుంది? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషపూరిత ప్రదేశాన్ని జోన్ రోగ్ అని అంటారు. కొందరు ఈ ప్రదేశాన్ని డేంజర్ జోన్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం ఫ్రాన్స్‌లో ఉంది. గడచిన వంద సంవత్సరాలుగా ఈ ప్రదేశాన్ని ఎవరూ సందర్శించలేదు. ఇక్కడికి ఎవరినీ వెళ్లనీయకుండా ప్రభుత్వం నిషేధించింది. నిజానికి ఈ ప్రాంతపు మట్టిలోనే కాదు ఇక్కడి నీటిలోనూ పూర్తిగా విషం నిండివుంది. ఇక్కడి పదార్థం ఏదైనా మనిషి, లేదా మరో జీవి నోటిలోకి వెళితే మరణం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రదేశం విషపూరితంగా ఎలా మారింది? మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఈ ప్రదేశం జనం సందడితో ఉండేదని చెబుతారు. ఇక్కడ ఒకప్పుడు మానవ నివాసాలు ఉండేవి. అయితే ఈ ప్రదేశం ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైంది. ఇక్కడ లెక్కకు మించిన బాంబులు ప్రయోగించారు. ఈ ప్రాంతంలో రసాయన దాడులు జరిగాయి. ఇక్కడి గాలి కూడా విషపూరితమే. కొంతకాలం క్రితం ఇద్దరు జర్మన్ శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం ఇక్కడికి వెళ్లారు. ఇక్కడి మట్టిలోనే కాదు నీళ్లలో కూడా ఆర్సెనిక్ అధికమోతాదులో ఉందని తేలింది. దీనిలోని ఒక్క రేణువైనా ఏ జీవి నోటిలోకి వెళ్లినా మరణం ఖాయమని వారు తమ పరిశోధనలో గుర్తించారు. ఇది కూడా చదవండి: అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ.. -
కరీంనగర్: ముప్పుతిప్పలు పెట్టి.. ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతూ సంచరిస్తున్న ఎలుగుబంటి ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. దాన్ని పట్టుకునేందుకు అధికారులు వలలు ఏర్పాటు చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ఎయిర్ గన్‌తో అటవీశాఖ అధికారులు మత్తు ఇంజక్షన్ ఇవ్వగా.. అనంతరం రేకుర్తి సమ్మక్క గద్దెల్లోకి భల్లూకం పారిపోయింది. దీంతో అటవీశాఖ అధికారుల గాలింపు ప్రక్రియ ముమ్మరం చేసి చివరికి పట్టుకున్నారు. కాసేపట్లో అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని అడవిలో విడిచిపెట్టనున్నారు. నడిరోడ్డు పై హల్చల్ కాగా నడిరోడ్డుపై సంచరిస్తూ నగర వాసులను పరుగులు పెట్టిస్తోంది. శుక్రవారం రాత్రి బొమ్మకల్ పంచాయతీ పరిధిలోని రజ్వీ చమాన్ ప్రాంతంలో ఓ కాలనీలోకి ప్రత్యక్షమైన ఎలుగుబంటి.. శనివారం ఉదయం రేకుర్తిలో నడిరోడ్డుపై సంచరిస్తూ ప్రజలకు కనిపించింది. దీంతో ఎలుగు బంటిని చూసిన గ్రామస్థులు భయంతో పరుగులు పెట్టారు. ఎలుగుబంటి సంచరిస్తుండగా దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కాగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. మరో వైపు ఎలుగుబంటి కోసం అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎలుగుబంటి కోసం హన్మకొండ నుంచి ప్రత్యేకంగా వలలు, ఎయిర్ గన్స్, ఇతర ఎక్విప్ మెంట్ తో వచ్చారు. చదవండి: హైదరాబాద్ మెట్రో రైల్ మరో బంపర్ ఆఫర్.. -
అచ్చు శునకంలా
జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. వెర్రి వేయి విధాలు. జపాన్‌లో ఓ వ్యక్తి చేసిన పని చూస్తే ఇలాంటి సామెతలన్నీ వరుసబెట్టి గుర్తు రాక మానవు! అచ్చం కుక్కలా కనిపించేందుకు మనవాడు ఏకంగా 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. పైగా ఆ వేషంలో ఆరుబయట యథేచ్ఛగా తిరిగాడు. అలా జీవితకాల ముచ్చట నెరవేర్చుకుని మురిసిపోయాడు! జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఓ యూ ట్యూబర్. తన చానల్ పేరేమిటో తెలుసా? ఐ వాంట్ టు బీ యాన్ యానిమల్’ (జంతువులా మారాలనుకుంటున్నా). దానికి ఏకంగా 31 వేల మందికి పైగా సబ్స్రై్కబర్లున్నారు. మనవాడి జీవితకాలపు కోరికుంది. ఏమిటో తెలుసా? ఎలాగైనా కుక్కలా మారడం! దాన్ని తీర్చుకోవడానికి జపాన్‌లో సినిమాలకు, టీవీ షోలకు కాస్ట్యూమ్స్ సరఫరా చేసే జెప్పెట్ అనే ప్రముఖ స్థానిక కంపెనీని సంప్రదించాడు. తన కోరిక వివరించాడు. అచ్చం కుక్కలా కనిపించే కాస్ట్యూమ్ డిజైన్ చేసిచ్చేందుకు వాళ్లూ సరేనన్నారు. అయితే తాను కుక్కను కాదని మనుషులు కాదు కదా, కనీసం కుక్కలు గుర్తు పట్టొద్దని టోకో షరతు విధించాడు. కుక్క వేషంలో తన లుక్ అంత సహజంగా ఉండాలన్నాడు. అందుకోసమని ఏకంగా 20 లక్షల యెన్లు (రూ.12 లక్షలు) చెల్లించాడు. కంపెనీ వాళ్లు దీన్నో సవాలుగా తీసుకున్నారు. 40 రోజులు కష్టపడి మరీ టోకోకు కావాల్సిన కుక్క కాస్ట్యూమ్ తయారు చేసిచ్చారు. పార్కులో ‘డాగ్’ వాక్ ► అంతా రెడీ అయ్యాక, ఒక మంచి రోజు చూసుకుని తను తయారుచేయించుకున్న కుక్క వేషం వేసి మనవాడు తొలిసారిగా షికారుకు బయల్దేరాడు. సమీపంలోని పార్కుకు వెళ్లి సందడి చేశాడు. అచ్చం కుక్కలా దొర్లుతూ, తోటి కుక్కల దగ్గరికెళ్లి వాటిని వాసన చూస్తూ హడావుడి చేశాడు. దీన్నంతటినీ వీడియో తీయించుకోవడం మర్చిపోలేదు. దాన్ని తన యూట్యూబ్ చానళ్లో అప్లోడ్ చేస్తే చూస్తుండగానే 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చి పడ్డాయి! ‘‘నా కుక్క వేషం సూపర్‌హిట్టయింది. జీవితకాల కలా నెరవేరింది. వీడియో కూడా బంపర్ హిట్టయింది. ఎలా చూసుకున్నా కుక్క వేషం కోసం పడ్డ ప్రయాసకు తగిన ఫలితం దక్కింది’’ అంటూ టోకో సంబరపడిపోతున్నాడు. గతేడాదే చెప్పాడు ► మనోడు తన మనోగతాన్ని గతేడాదే బయట పెట్టాడు. మానవ శునకంగా మారాలనుందని డైలీ మెయిల్ వార్తా పత్రిక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘‘ఇలాంటి నా అభిరుచులు బయటికి తెలియడం నాకిష్టముండదు. ముఖ్యంగా నా సహోద్యోగులకు. ఎందుకంటే మరీ కుక్కలా మారాలనుందంటే వాళ్లకు విచిత్రంగా తోస్తుందేమో కదా! అందుకే ఇప్పుడు నా అసలు రూపం ఎలా ఉంటుందో అందరికీ చూపించదలచలేదు. ఇలా కుక్కలా మారాలనుందని నా క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా చెప్పలేదు. పిచ్చనుకుంటారేమోనని భయం’’ అన్నాడు టోకో! కుక్క వేషంలో తొలిసారి పార్కుకు వెళ్లినప్పుడు కాస్త నెర్వస్‌గా, మరికాస్త భయంగా అనిపించిందట మనవాడికి. ‘‘అయితే, అక్కడ నన్ను చూసిన మనుషులతో పాటు కనీసం కుక్కలు కూడా నేను కుక్కను కాదని పొరపాటున కూడా అనుకోలేదు. అంటే నా మిషన్ గ్రాండ్ సక్సెస్ అన్నట్టే కదా’’ అంటూ సంబరపడిపోయాడు. టోకో కోరిక మేరకు కోలీ జాతి కుక్కలాంటి కాస్ట్యూమ్ తయారు చేసిచ్చాం. అది వేసుకున్న వాళ్లు కుక్క కాదని చెప్పినా ఎవరూ నమ్మరు. అంత సహజంగా కుదిరిందది – కాస్ట్యూమ్స్ తయారీ కంపెనీ జెప్పెట్ అధికార ప్రతినిధి -
ఏపీయే స్ఫూర్తి..దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలు
-
ఒక్క సినిమా.. 35 పాటలు.. అదే అసలు సమస్య!
ఆ డైరెక్టర్ తీసింది ఒక్కటే సినిమా. కానీ దేశవ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అదే మూవీని హిందీలో రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్. వందల కోట్ల కలెక్షన్స్. దీంతో ఆ దర్శకుడు నెక్స్ట్ చిత్రం ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు తెగ ఎదురుచూశారు. ఇప్పుడేమో మరో నెలరోజుల్లో విడుదల ఉందనగా, రిలీజ్ డేట్ మార్చేశారు. ఏకంగా మూడున్నర నెలల తర్వాత థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. అసలు కారణం ఏంటో కూడా బయటపెట్టారు. 'యానిమల్' వాయిదా 'అర్జున్‌రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తీస్తున్న పాన్ ఇండియా మూవీ 'యానిమల్'. రణ్‌బీర్ కపూర్, రష్మిక హీరోహీరోయిన్లు. ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలి. ఇప్పుడేమో ఆ తేదీన రాలేకపోతున్నామని.. డిసెంబరు 1న విడుదలవుతుందని కొత్త డేట్ ప్రకటించారు. అభిమానులు కాస్త నిరుత్సాహపడిన మాట వాస్తవే.. కానీ డైరెక్టర్ చెప్పింది విని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన సినిమాపై పెట్టుకున్న నమ్మకం చూసి అంచనాలు పెంచేసుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) డైరెక్టర్ ఏం చెప్పారు? 'ఈ సినిమాలో ఏడు పాటలున్నాయి. ఐదు భాషల్లో లెక్కేస్తే మొత్తం 35 అవుతాయి. ఇన్ని సాంగ్స్ ని డిఫరెంట్ సెటప్ ప్లేసులు, డిఫరెంట్ సెటప్ సింగర్స్ తో రికార్డ్ చేయాలంటే కాస్త టైమ్ పడుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్లే ఆగస్టు 11న విడుదల చేయలేమని మాకు అర్థమైంది. ప్రీ టీజర్ కు వచ్చిన స్పందనకు ధన్యవాదాలు. హిందీలో రికార్డ్ చేసిన పాటలకు లిరికల్ గా ఎలాంటి ఔట్పుట్ వచ్చిందో ఇతర భాషల్లోనూ అలాంటి దానికోసం ప్రయత్నిస్తున్నాం. దీనికోసం టైమ్, ఎనర్జీ కేటాయించాల్సి ఉంటుంది' 'అలానే ఇతర భాషల్లో విన్నవాళ్లకు డబ్బింగ్ అనే ఫీల్ రాకూడదనేదే మా ఆలోచన. అందుకే మూవీ రిలీజ్ వాయిదా వేశాం. డిసెంబరు 1న 'యానిమల్' విడుదల చేయబోతున్నాం. ప్రేక్షకులకు వీడియో, ఆడియో పరంగా బెస్ట్ క్వాలిటీ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాను. ఓవరాల్ గా ఇది చాలా పెద్ద మూవీ. థియేటర్లలో రణ్‌బీర్ కపూర్ విశ్వరూపం చూస్తారు' అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు. సందీప్ చెప్పిన దానిబట్టి చూస్తుంటే.. పాటలు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. అందుకే వాటి విషయంలో అస్సలు తగ్గట్లేదనిపిస్తోంది. ఇక 'యానిమల్' తర్వాత డైరెక్టర్ సందీప్.. ప్రభాస్ తో కలిసి పనిచేయబోతున్నాడు. 'స్పిరిట్' అనే మూవీని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. బహుశా దీని షూటింగ్.. వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశముంది. #1stDecemberANIMALrelease@AnilKapoor #RanbirKapoor @thedeol @iamRashmika@tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPranay @MuradKhetani #KrishanKumar @anilandbhanu @VangaPictures @TSeries @rameemusic @cowvala #ShivChanana @neerajkalyan_24 @sureshsrajan pic.twitter.com/EAGLNTaEy9 — Sandeep Reddy Vanga (@imvangasandeep) July 3, 2023 (ఇదీ చదవండి: డైరెక్టర్‌తో హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. యూటర్న్ తీసుకున్న కల్పికా గణేశ్) -
డిసెంబరులో యానిమల్?
‘యానిమల్’ చిత్రం అనుకున్న సమయాని కన్నా కాస్త ఆలస్యంగా థియేటర్స్‌కు రానుంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘యానిమల్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, మురాద్ ఖేతని, అశ్విన్ వార్దే, ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్నారు. యాక్షన్, రొమాన్స్, ప్రతీకారం అంశాలతో తండ్రీకొడుకుల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కావడం లేదని, కొన్ని కారణాల వల్ల డిసెంబరులో రిలీజ్ చేసే యోచనలో చిత్రయూనిట్ ఉన్నారని బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో అనిల్‌కపూర్, బాబీ డియోల్, శక్తికపూర్ కీలక పాత్రలు పోషించారు. -
'భోళా శంకర్'కి లైన్ క్లియర్.. ఆ సినిమా వాయిదా వల్ల!
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్! ఎందుకంటే కొన్నిరోజుల ముందు విడుదలైన 'భోళా శంకర్' టీజర్ అభిమానులకు నచ్చేసింది. దీంతో సినిమా రిలీజ్ కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇలాంటి టైంలో చిత్రబృందాన్ని సంతోషపరిచే ఓ వార్త ఇప్పుడు వినిపిస్తోంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. ఇంతకీ ఏంటది? లైన్ క్లియర్ చిరు 'భోళా శంకర్' సినిమాను తొలుత ఈ ఏడాది ఏప్రిల్ లోనే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ కుదర్లేదు. దీంతో ఆగస్టు 11న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. అదే తేదీన 'అర్జున్‌రెడ్డి' ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్' విడుదల చేయాలని అనుకున్నారు. ఆగస్టు 10న సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమా విడుదలని ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు పోటీ నుంచి 'యానిమల్' తప్పుకొన్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!) 'యానిమల్' ఎప్పుడు? సినిమాకు సంబంధించిన కొన్ని వర్క్స్ ఇంకా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆగస్టు 11న 'యానిమల్'ని తీసుకురావడం కుదరదని తేలినట్లు తెలుస్తోంది. దీంతో సెప్టెంబరులో చేద్దామనుకున్నారు కానీ ఆ నెలలో షారుక్ 'జవాన్' ఉంది. దీంతో అన్నీ ఆలోచించి.. ఏకంగా 'యానిమల్'ని డిసెంబరులో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'భోళా'కు ఇది ప్లస్ పోటీలో ఉన్న మూడు సినిమాల్లో ఒకటి తప్పుకోవడం 'భోళా శంకర్' కు తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ కచ్చితంగా కలిసొస్తుందని చెప్పొచ్చు. రజినీకాంత్ 'జైలర్' సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఒకవేళ ఏదైనా అద్భుతం చేస్తే తప్ప.. చిరంజీవి కొత్త చిత్రానికి కలెక్షన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని తెలుస్తోంది. (ఇదీ చదవండి: హీరో ధనుష్‌కి రెడ్ కార్డ్.. అతడి సినిమాలపై నిషేధం?) -
నాకు గానీ.. దొరికితే..
-
మేనేజర్ మోసం.. రష్మిక షాకింగ్ నిర్ణయం!
నేషనల్ క్రష్, హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఇప్పటికే మహేశ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తో నటించి హిట్స్ కొట్టిన ఈ భామ.. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా ఉంది. రీసెంట్ గా ఈమెని తన మేనేజర్ మోసం చేశాడు. ఏకంగా రూ 80 లక్షల వరకు మోసం చేశాడని కామెంట్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే రష్మిక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: 'సలార్' కొత్త పోస్టర్లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా?) కన్నడలో హీరోయిన్ గా పరిచయమైన రష్మిక.. 'ఛలో' మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. తన క్యూట్ యాక్టింగ్ తో ప్రేక్షకులకు దగ్గరైంది. మహేశ్ తో 'సరిలేరు నీకెవ్వరు' చేసి ఓ మాదిరి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ.. అల్లు అర్జున్ 'పుష్ప'తో దేశవ్యాప్తంగా ఫేమ్ సొంతం చేసుకుంది. చెప్పాలంటే ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ మధ్య తన మేనేజర్ మోసం చేయడంతో.. ఇకపై అంతా ఒంటరిగానే మేనేజ్ చేసుకునేందుకు రష్మిక సిద్ధమైందట. అంటే తన డేట్స్ తానే చూసుకోవాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. మళ్లీ అలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు ఇలా చేసిందని సమాచారం. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగా తీస్తున్న 'యానిమల్' షూటింగ్ పూర్తి చేసింది. త్వరలో 'పుష్ప 2' సెట్ లో అడుగుపెట్టబోతున్న విషయాన్ని ఆమెనే చెప్పింది. (ఇదీ చదవండి: పాన్ ఇండియా హీరోలకు బోలెడు కష్టాలు.. ప్రభాస్ సహా వాళ్లందరూ!) -
షాకింగ్ విషయాలు: ఆవు సాధు జంతువు... అదేగానీ దాడికి దిగితే..
వరల్డ్ యానిమల్ ఫౌండేషన్ వెబ్సైట్ పలు ఆసక్తిక వివరాలు వెల్లడించింది. ప్రతీయేటా ఆవుల కారణంగా అమెరికాలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. వీరంతా ఆవుల దాడికి బలవుతున్నారని తెలియజేసింది. భారతీయులు ఆవును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. పూజలు కూడా చేస్తుంటారు. ఆవును గోమాత అని కూడా అభివర్ణిస్తుంటారు. ఆయుర్వేద పరిభాషలో ఆవు పాలు అమృతంతో సమానం. అయితే అప్పుడప్పుడు మనుషులపై జంతువుల దాడులు జరుగుతుంటాయి. ఇటువంటి సందర్భాల్లో మనుషుల మరణాలు కూడా సంభవిస్తుంటాయి. ప్రతీయేటా ఆవుల దాడుల కారణంగా వందల మంది మృత్యువు బారిన పడుతున్నారు. ఆవుల దాడుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది మరణిస్తున్నారనే వివరాలకు సంబంధించిన గణాంకాలను వరల్డ్ యానిమల్ ఫౌండేషన్ వెబ్సైట్ తెలియజేసింది. ఆ వివరాలు ఎంతో ఆశ్యర్యాన్ని కలిగిస్తున్నాయి. Tbh, Id not get close to a cow too. They have no jokes really, when they attack they do it so hard😳 One time we stopped near a fountain to drink water. And cows came and i went to car. I was getting in and one of cows attacked me but car door protected me. It was like a shield pic.twitter.com/BDmZ7ip5M9 — ヒジExodus (@siriusm46) June 17, 2023 గణాంకాలు ఏమి చెబుతున్నాయి? వరల్డ్ యానిమల్ ఫౌండేషన్ వెబ్సైట్లో ప్రచురితమైన డేటా ప్రకారం ప్రతీయేటా ఆవుల దాడుల కారణంగా అమెరికాలో 20 నుంచి 22 మంది మరణిస్తున్నారు. ఆవుల గుంపు తొక్కివేయడం కారణంగా మరణించారంటూ ప్రతీయేటా సుమారు 5 కేసులు వెలుగు చూస్తున్నాయి. లండన్‌లో ప్రతీయేటా ఆవుల దాడులలో కనీసం నలుగురు కన్నుమూస్తున్నారు. దీనిని షార్క్ దాడులతో పోల్చి చూస్తే.. షార్క్ దాడుల కారణంగా ప్రతీయేటా కనీసం ఐదుగురు మరణిస్తున్నారు. ప్రతీయేటా ఆవుల దాడులకు కనీసం 22 మంది బలవుతున్నారు. భారత్‌లో ఆవుల దాడుల సంగతేమిటి? సోషల్ మీడియాలో జంతువుల దాడులకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. వీటిలో ఆవుల దాడులకు సంబంధించిన వీడియోలు కూడా కనిపిస్తాయి. ఇటీవల ఒక ఎద్దు ఒక వృద్ధుడిపై దాడి చేసి చంపేసిన ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనికిముందు కూడా ఉత్తరప్రదేశ్‌లో ఒక మహిళపై ఆవు దాడి చేసినట్లు ఒక వీడియో ద్వారా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎద్దుల దాడులతో పోల్చి చూస్తే, ఆవుల దాడులు స్వల్పమేనని చెప్పవచ్చు. ఇది కూడా చదవండి: రైలు రిజర్వేషన్లో సరిదిద్దలేని పొరపాట్లివే.. -
ఒక అడవి జంతువి కి గ్యాంగ్ స్టార్ మధ్యలో క్రాస్ బ్రీడ్ మానస్తత్వం నది అందుకే నేను ఇలా
-
రణ్‌బీర్ 'యానిమల్' ప్రీ టీజర్.. ఆ సీన్‌పై నెటిజన్స్ ట్రోల్స్!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ నుంచి చిన్న సీన్‌ను ప్రీ టీజర్‌గా ఆదివారం విడుదల చేసింది సంగతి తెలిసిందే. ‘వైల్డ్ యానిమల్’, ‘వైలెంట్ యానిమల్’ అంటూ ‘యానిమల్’ ప్రీ టీజర్ గురించి పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు నెటిజన్స్. అయితే ఈ చిత్రం ఫుల్ టీజర్ ఈ నెల 16న విడుదల కానుందని సమాచారం. (ఇది చదవండి: నాడు అర్జున్ రెడ్డి, నేడు యానిమల్.. ఇదీ మామూలు అరాచకం కాదు ) తాజాగా ఈ చిత్రంలోని ప్రీ టీజర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ టీజర్‌లోని ఫైట్ సీన్ వైరల్ కావడంతో కొందరు నెటిజన్స్ కాపీ కొట్టారంటూ ఆరోపిస్తున్నారు. దక్షిణ కొరియా చిత్రం ఓల్డ్ బాయ్‌తో చిత్రంలోని ఫైట్ సీన్‌ను ట్విటర్లో పోస్ట్ చేస్తున్నారు. ఓల్డ్బాయ్లోని హాల్వే సీక్వెన్స్ మాదిరిగానే ఈ ఫైట్ సీన్లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ, ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఐదు భాషలలో ఆగస్ట్ 11 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని టి-సిరీస్, సినీవన్ స్టూడియోస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. (ఇది చదవండి: కమెడియన్ మృతి.. అతనికి గుండెపోటు కాదు! ) Inspired from old boy? #Animal — Dexter White (@navin_twt) June 11, 2023 Pre teaser #Animal pic.twitter.com/sBkPC61egB — R R (@RacchaRidhvik) June 11, 2023 #Animal - #RanbirKapoor𓃵 is full with RAGE but director #SandeepReddyVanga seems to copy the Oldboy action sequence for the teaser. C'mon can't you do any better, still this is a teaser so I'll keep my expectations low. The last gif is the Original. #AnimalTeaser #Bollywood pic.twitter.com/M2DNWAQRiG — Adithya Chakravarthy (@Adi7394) June 11, 2023 -
వైల్డ్ యానిమల్
రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ నుంచి చిన్న సీన్‌ను ప్రీ టీజర్‌గా ఆదివారం విడుదల చేసింది చిత్రయూనిట్. ‘వైల్డ్ యానిమల్’, ‘వైలెంట్ యానిమల్’ అంటూ ‘యానిమల్’ ప్రీ టీజర్ గురించి పోస్ట్‌లు చేస్తున్నారు నెటిజన్లు. ఫుల్ టీజర్ ఈ నెల 16న విడుదల కానుందని సమాచారం. తండ్రీ కొడుకుల భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా కథ, కథనాలు ఉంటాయట. ఓ కాలేజ్ లెక్చరర్ అయిన యువకుడు తండ్రి కోసం మాఫియాతో ఏ విధంగా పోరాడాడు? అనే కథాంశంతో ‘యానిమల్’ తెరకెక్కుతోందని ప్రచారం సాగుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్టులో విడుదల కానుంది. -
నాడు అర్జున్ రెడ్డి, నేడు యానిమల్.. ఇదీ మామూలు అరాచకం కాదు
టాలీవుడ బిగ్ హిట్ 'అర్జున్ రెడ్డి' మొదటి సినిమాతోనే దర్శకుడిగా సత్తా చాటాడు సందీప్ రెడ్డి వంగా. ఆ చిత్రంతోనే విజయ్ దేవరకొండ సన్సేషన్ స్టార్‌గా మారిపోయాడు. ఇదే సినిమా హిందీలో 'కబీర్ సింగ్'గా రీమేక్ చేసి బాలీవుడ్లో తన మార్క్ ఎంటో చూపించాడు సందీప్. తాజాగా తన నుంచి వస్తున్న 'యానిమల్' ప్రీ టీజర్‌ను విడుదుల చేశాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక నటిస్తున్నారు. ఈ కాంబినేషన్‌తోనే భారీ అంచనాలు పెంచేశాడు. (ఇదీ చదవండి: సీతగా నన్నే ఎందుకు ఎంపిక చేశారంటే: కృతి సనన్) ఇక ప్రీ టీజర్ విషయానికొస్తే.. హిందీ సాంగ్‌తో మొదలవుతుంది. విలన్స్ గుంపులు గుంపులుగా ఒకపక్క వస్తుంటే.. ఇంకోపక్క రణబీర్ వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో కనిపిస్తూ.. చేతిలో గొడ్డలి పట్టుకొని ఒక్కోక్కరిని నరకడం చూపించాడు సందీప్. ప్రీ టీజరే ఇంత భయంకరంగా ఉంటే 11న వచ్చే టీజర్ ఏ రేంజ్లో ఉంటుందో అని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఇదీ మామూలు అరాచకం కాదు భయ్యో అంటూ... ఈ సినిమాతో సందీప్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడోనని కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: టాప్ హీరోయిన్ కూతురి అన్నప్రాసన వేడుక చూశారా?) -
ప్రపంచంలోనే భయం లేని జంతువు
దాదాపు 30 కిలోమీటర్ల మేర వినిపించేంత భీకరంగా అరిచే అరుదైన జీవి తేనె కుక్క. హనీ బ్యాడ్జర్గా పిలిచే ఈ వన్య జీవులు పాపికొండలు అభయారణ్యంలో సందడి చేస్తున్నాయి. చిన్నపాటి ఎలుగు బంటిని పోలినట్టుండే తేనె కుక్కలు సుమారు రెండేళ్ల క్రితం కర్ణాటకలోని కావేరి వన్య ధామంలో కనిపించాయి. ఇటీవల పాపికొండలు అభయారణ్యంలో సైతం వీటి జాడలు ట్రాప్ కెమెరాలకు భారీగానే చిక్కాయి. బుట్టాయగూడెం: తేనె కుక్కలుగా పిలిచే అరుదైన వన్యప్రాణి హనీ బ్యాడ్జర్ (రాటిల్) పాపికొండలు అభయారణ్యంలో కనువిందు చేస్తున్నాయి. 25 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా అడవుల్లో మాత్రమే గుర్తించిన ఈ జీవులు పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలోనూ ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. వీటి ఎత్తు కేవలం 12 అంగుళాలు. తల నుంచి తెలుపు, తెలుపు గీతలతో కూడిన మందపాటి.. దట్టమైన నల్లని బొచ్చును కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. తేనె కుక్కల పంజా గోళ్లు మూడు అంగుళాల వరకు పొడవు ఉన్నాయి. చూసేందుకు చిన్నపాటి ఎలుగుబంటి.. పెద్దగా ఉండే ముంగిసలా కనిపిస్తుంది. నడకలో మాత్రం కుక్కను పోలి ఉంటుంది. వీపుపై తెల్లని ఛాయలుండే నల్లని ఈ జీవి చూసేందుకు భీతి గొలుపుతుంది. ఈ జీవులకు పౌరుషంలో మరో వన్యప్రాణి సాటిరాదు. వీటికి అడవిలో లభించే తేనె తుట్టెల్లోని తేనెటీగ లార్వాలంటే ఎంతో ఇష్టం. అందుకే వీటికి హనీ బ్యాడ్జర్ అని పేరొచ్చింది. ఇతర కీటకాలు, కుందేళ్లను కూడా తింటాయి. వీటి ఆహారంలో 25 శాతం పాములే. కలుగుల్లో ఉండే కొండ ఎలుకల్ని సైతం ఇవి ఇష్టంగా తింటాయి. వీటిని చూస్తే జంతువులకు హడల్ తేనె కుక్కలను చూడగానే నక్కలు, తోడేళ్లు, ఎలుగుబంట్లు, ఏనుగులు హడలిపోతాయి. ఇవి కనిపిస్తే వాటికి దారిచ్చి తప్పుకుని వెళ్లిపోతాయి. ఇవి చాలా ధైర్యం గల ప్రాణులు. వీటి చర్మం ఎలాస్టిక్ మాదిరిగా సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. పదునైన పళ్లు ఉంటాయి. అడవిలో ఎంత పెద్ద క్రూర జంతువుతోనైనా ధైర్యంగా పోరాడగల జంతువు ఇది. పులి, చిరుత, కొండచిలువతోనైనా పోరాడుతుంది. పాము విషం కూడా వీటిని ఏమీ చేయలేదు. ప్రపంచంలోనే భయం లేని జంతువు హనీ బ్యాడ్జర్ ఒక్కటే అని అటవీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీటి జీవిత కాలం ఏడేళ్లు మాత్రమే. వాసనను పసిగట్టి ఆహారాన్ని సేకరించడంలో స్నిపర్ డాగ్‌ను మించిన నైపుణ్యం వీటి సొంతం. అరుదైన హనీ బ్యాడ్జర్ల సంచారం పాపికొండల అటవీప్రాంతంలో ఎక్కువగా∙ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. సుమారు 1,200 పైగా హనీ బ్యాడ్జర్లు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడి ట్రాప్ కెమెరాలలో చిక్కిన జాడలను బట్టి తెలుస్తోందన్నారు. వీటి సంతతి పెరుగుతోంది అరుదైన హనీ బ్యాడ్జర్లు పాపికొండలు అభయారణ్యంలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధైర్యమైన జంతువుగా దీనికి పేరుంది. తేనెటీగల లార్వాను చాలా ఇష్టంగా తింటాయి. పులి, చిరుతతో పాటు ఎటువంటి జంతువుతోనైనా ఎదిరించి పోరాడగలవు. వీటి సంతతి 1,200కు పైగా ఉన్నట్టు అంచనా వేశాం. – దావీదు రాజునాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, ఏలూరు జిల్లా -
పశువుల వ్యాపారం చేస్తున్న ఐఐటీ అమ్మాయిలు, వందల కోట్ల టర్నోవర్‌తో..
Neetu Yadav and Kirti Jangra: ఉన్నత చదువులు చదివి సొంతంగా వ్యాపారం చేయాలని కలలు కంటూ విజయాన్ని సాధించిన వారు చాలానే ఉన్నారు. ఇందులో నీతూ యాదవ్ & కీర్తి జంగ్రా కూడా ఉన్నారు. ఢిల్లీలో ఐఐటి పూర్తి చేసి 'యానిమల్ టెక్నాలజీస్' స్థాపించి ఇప్పుడు కోట్లలో గడిస్తున్నారు. ఇంతకీ వీరి విజయ గాథ వెనుక ఉన్న అసలైన కథ ఏంటనేది ఇక్కడ ఈ కథనంలో చూసేద్దాం.. ఢిల్లీలో ఐఐటీ రూమ్మేట్స్గా కలిసిన అమ్మాయిలు తమ కలను సహకారం చేసుకోవడానికి నవంబర్ 2019లో పశువుల కోసం ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అయిన యానిమాల్ను ప్రారంభించారు. బెంగళూరులోని ఒక చిన్న అద్దె గదిలో ఉంటూ ప్రారంభమైన వీరి వ్యాపారం ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. పాడి రైతుల జీవితాలను మెరుగుపరచడానికి, పశువుల వ్యాపారం, పాడి పరిశ్రమలను మరింత లాభదాయకంగా మార్చాలనే ఉద్దేశ్యంతో యానిమల్ స్థాపించారు. ప్రతి వ్యాపారంలో ఎదురైనా ఇబ్బందులు మాదిరిగానే వీరు కూడా ప్రారంభంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ తరువాత గేదెలను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల నుండి ఎక్కువ ఆర్డర్లను పొందడం ప్రారంభించారు. (ఇదీ చదవండి: Force Citiline: ఫోర్స్ మోటార్స్ కొత్త ఎమ్‌పివి లాంచ్ - ధర ఎంతంటే?) యానిమల్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ జంతువుల సంరక్షణకు కూడా సేవలను అందిస్తుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పొందిన ఆదాయంలో సుమారు 90శాతం పశువుల వ్యాపారం నుంచి రాగా.. మిగిలిన 10 శాతం వైద్య ఖర్చులు, అసిస్టెడ్ రీప్రొడక్షన్, సేల్స్ కమీషన్ వంటి వాటిద్వారా వచ్చిందని తెలుస్తోంది. యానిమాల్ (Animall) అనేది పశువుల వ్యాపారం చేయడానికి ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్. దీని ద్వారా పశువుల అమ్మకం మాత్రమే కాకుండా కొనుగోలు కూడా ఉంటుంది. ప్రస్తుతం యానిమల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దూసుకెళ్తున్న ఈ కంపెనీలో షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్, జొమాటో వ్యవస్థాపకుడు & సీఈవో దీపిందర్ గోయెల్, అంజలి బన్సాల్, మోహిత్ కుమార్, సాహిల్ బారువాతో సహా మరో 3 మంది యానిమాల్ ఏంజెల్ పెట్టుబడిదారులుగా ఉన్నారు. (ఇదీ చదవండి: ఇంత మంచి ఆఫర్ మళ్ళీ మళ్ళీ వస్తుందా.. జీప్ కంపెనీ భారీ డిస్కౌంట్స్) 2019లో ప్రారంభమైన యానిమల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ FY22లో ఆదాయం రూ. 7.4 కోట్లుగా అంచనా వేయబడింది. అయితే ప్రస్తుతం ఇది రూ. 565 కోట్లకు పెరిగింది. రానున్న రోజుల్లో ఈ కంపెనీ మరిన్ని లాభాలను తప్పకుండా ఆర్జిస్తుందని భావిస్తున్నారు. మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
స్టార్ వార్.. ఇక బాక్సాఫీస్ బద్దలే..!
బాక్సాఫీస్ వసూళ్ల కోసం గ్యాంగ్‌వార్‌కు రంగం సిద్ధమవుతోంది. ఆల్రెడీ కొందరు స్టార్స్ వార్ డిక్లేర్ చేసి సెట్స్‌లో బిజీగా ఉన్నారు. మరికొందరు రెడీ అవుతున్నారు. ఈ బాక్సాఫీస్ గ్యాంగ్‌వార్ పై ఓ లుక్ వేద్దాం. పోలీసాఫీసర్‌గా ప్రభాస్ నటించనున్న సినిమా ‘స్పిరిట్’. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పనులు ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నాయి. ప్రభాస్ కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ‘స్పిరిట్’ ముంబైలో జరిగే గ్యాంగ్‌వార్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే సందీప్‌రెడ్డి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న హిందీ ‘యానిమల్’ కూడా ఇలాంటి తరహా చిత్రమే. రణ్‌బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న కంప్లీట్ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ఇది. తండ్రి కోసం ఓ యువకుడు గ్యాంగ్‌వార్‌లో ఎలా చిక్కుకున్నాడు? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందని బాలీవుడ్ టాక్. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక దర్శకుడు సుజిత్ తెరకెక్కించనున్న సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ టైమ్‌లో ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే ట్యాగ్‌లైన్ తెరపైకి వచ్చింది. ‘ఓజీ’ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని ప్రచారం జరిగింది. దీంతో పవన్–సుజిత్ కాంబినేషన్లోని మూవీ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమా ‘పుష్ప’. ఆల్రెడీ విడుదలైన ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో కొన్ని గ్యాంగ్‌వార్ సీన్స్ చూశాం. అలాగే ‘పుష్ప: ది రైజ్’కు కొనసాగింపుగా రానున్న ‘పుష్ప: ది రూల్’లోనూ కొన్ని గ్యాంగ్ వార్ సన్నివేశాలు ఉంటాయనుకోవచ్చు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా సీనియర్ యాక్టర్ రాజశేఖర్ సైతం ఈ వెండితెర గ్యాంగ్‌వార్‌లో భాగమయ్యారు. పవన్ సాధినేని దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న ‘మాన్స్టర్’ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే యువ హీరో సందీప్ కిషన్ టైటిల్ రోల్లో, విజయ్ సేతుపతి ఓ లీడ్ రోల్లో నటించిన ‘మైఖేల్’ కూడా గ్యాంగ్‌స్టర్ డ్రామానే. ఇంకోవైపు ‘మాస్టర్’ చిత్రం తర్వాత తమిళ ప్రముఖ హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తాజాగా మరో సినిమా రూపొందనుంది. ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌వార్‌గా ఈ సినిమా ఉంటుందనే టాక్ ఆల్రెడీ కోలీవుడ్‌లో మొదలైంది. ఈ సినిమాలో సంజయ్ దత్, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు లోకేష్ అండ్ కో. అదే విధంగా ఈ సినిమా తర్వాత కార్తీతో ‘ఖైదీ’కి సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ తీయనున్నారు లోకేష్. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగిన ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్‌గా రానున్న ‘ఖైదీ 2’ గ్యాంగ్‌వార్ ఫిల్మ్ అట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అటు కన్నడంలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కబ్జా’. ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 1960–1984 బ్యాక్‌డ్రాప్‌లోని గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ అని తెలుస్తోంది. కాగా, ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన దుల్కర్ సల్మాన్ చేస్తున్న మలయాళ చిత్రం ‘కింగ్ ఆఫ్ కోతా’. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు అభిషేక్ జోషి దర్శకుడు. దుల్కర్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలు గ్యాంగ్‌వార్ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించనున్నాయి. -
ఉక్రెయిన్ ఎంబసీలకు నెత్తుటి ప్యాకేజీలు...రష్యాపై ఫైర్
వివిధ దేశాల్లో ఉన్న ఉక్రెయిన్ రాయబార కార్యాలయాలకు రక్తసిక్తమైన నెత్తుటి ప్యాకేజీలు పంపుతోంది రష్యా. మొన్నటివరకు స్పెయిన్, మాడ్రిడ్ రాయబార కార్యాలయాలకి వరుస లెటర్ బాంబుల పంపించి బెదిరింపులకు దిగింది. ఆ తర్వాత ఇప్పుడూ కీవ్ రాయబార కార్యాలయాలకు జంతువులు కళ్లు, నెత్తుటితో కూడిన అత్యంత దుర్వాసన గలిగిన ప్యాకేజీలను పంపుతోంది రష్యా. ఈ మేరకు హంగేరి, నెదర్లాండ్స్, పోలాండ్, క్రొయేషియా, ఇటలీ, ఆస్ట్రియాలోని కీవ్ రాయబార కార్యాలయాలకు ఈ ఘోరమైన బ్లడ్ ప్యాకేజీలను రష్యా పంపినట్లు సమాచారం. అదీగాక వాటికన్లోని ఉక్రెయిన్ రాయబారి కార్యాలయం తలుపులను ధ్వసం చేసి అక్కడ మానవ మలం వదిలి వేసినట్లు ఉక్రెయిన్ మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే కజకిస్తాన్‌లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయని సమాచారం. ఇలా బీభత్సం సృష్టించి ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అన్నారు. ఇలా నెత్తుటితో కూడిన ప్యాకేజ్‌లను పంపించి రెచ్చగొట్టు చర్యలకు పాల్పడుతోందంటూ రష్యాపై మండిపడ్డారు. దౌత్యపరంగా ఉక్రెయిన్‌ని అడ్డుకోవడం సాధ్యం గాక ఇలాంటి కుట్రలకు తెగించిందని ఆరోపణలు చేశారు. రష్యా దూకుడు గురించి తెలుసునని, గెలుపు కోసం ఎలాంటి దారుణానికైనా తెగబడుతోందని అన్నారు. ఉక్రెయిన్ ఎప్పుడూ సదా అప్రమత్తంగానే ఉంటుంది. అలాగే ఈ రాయబార కార్యాలయాలు సదా ఉక్రెయిన్ గెలుపు కోసం సమర్థవంతంగా పని చేస్తూనే ఉంటాయి అని నొక్కి చెప్పారు. ఐతే రష్యా రాయబార కార్యాలయాలు ఆ ఆరోపణలన్నింటిని ఖండించింది. -
అంతరించిపోతున్న అరుదైన జీవి.. ప్రపంచంలోనే అతి చిన్న జీవాలు
దుష్టశిక్షణ..శిష్ట రక్షణ కోసం సాక్షాత్తు శ్రీమహావిష్ణువే నరుడు.. సింహం రూపాలతో నరసింహుడిగా అవతరించాడనేది పురాణ గాథ. నల్లమల అడవుల్లో మాత్రం మూషిక మొహం.. జింక దేహంతో ఓ బుల్లి ప్రాణి నరసింహుడి కంటే అంతకు ముందే అవతరించింది. ప్రపంచ జింక జాతుల్లో అతి చిన్న ప్రాణి అయిన దీనిని మూషిక జింక అంటారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల సంవత్సరాల క్రితమే పుట్టిన మూషిక జింక శరీర అమరికలో అప్పటినుంచి ఇప్పటివరకు ఎటువంటి మార్పులు జరగలేదట. అందుకే దీనిని సజీవ శిలాజంగా కూడా పరిగణిస్తారు. పెద్దదోర్నాల (ప్రకాశం): మూషిక జింక.. ప్రపంచంలోనే అతి బుల్లి జింక. ఆంగ్లంలో మౌస్ డీర్ లేదా చెవ్రోటేన్‌గా పిలిచే ఈ జీవి గుండ్రని దేహం.. చిన్న చిన్న కాళ్లతో 25 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు, 10 అంగుళాల ఎత్తు వరకు పెరుగుతుంది. నెమరు వేసుకునే జీవుల్లో పొట్టలో మూడు గదులుండే జీవి ఇదొక్కటే. ప్రపంచంలో క్రమేపీ అంతరించిపోతున్న మూగ జీవాలలో ఒకటైన మూషిక జింకలకు కొమ్ములు ఉండవు. నల్లమల అభయారణ్యంలో సంచరించే అత్యంత చిన్న జీవులు ఇవి. దక్షిణాసియా దేశాలైన భారత్, శ్రీలంక, దేశాలలోనే ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. గడ్డి పరకలు, ఆకులు, పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుని జీవిస్తాయి. బరువు తక్కువ.. భయం ఎక్కువ మూడు కిలోల వరకు బరువు పెరిగే ఈ జీవులు కొమ్ములు లేని కారణంగా పగలంతా గుబురు పొదల్లోనే దాగి ఉంటాయి. కేవలం రాత్రి పూట మాత్రమే ఆరు బయట సంచరిస్తుంటాయి. వీటి గర్భధారణ సమయం ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. వీటి జీవిత కాలం కూడా ఆరేళ్లకు మించి ఉండదు. అడవిలో సంచరించే ఏ చిన్న మాంసాహార ప్రాణులైనా వీటిని అవలీలగా వేటాడే అవకాశం ఉంటుంది. ఆకాశంలో సంచరించే గద్దలు, గరుడ పక్షులు నుంచి కూడా వీటికి ఎక్కువగా ముప్పు ఉంటుంది. అవి అవలీలగా వీటిని నోటకరుచుకుని ఆకాశంలోకి ఎగిరిపోయే ప్రమాదం ఉన్నందున పగలు చెట్ల పొదల్లోనే దాగి రాత్రి పూట మాత్రమే అడవిలో సంచరిస్తుంటాయి. నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వం అంతరించిపోతున్న వన్య ప్రాణుల జాతులను సంరక్షించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా కేంద్ర జంతు సాధికార సంస్థ అంతరించిపోతున్న ఒక్కో వన్యప్రాణి జాతిని సంరక్షించే బాధ్యతను ఒక్కో జంతు సంరక్షణ కేంద్రానికి అప్పగించింది. తిరుపతి జూ పార్క్‌కు అడవి కోడి, విశాఖపట్నం జూ పార్క్‌కు వైల్డ్‌డాగ్, హైదరాబాద్ జూ పార్కుకు మౌస్‌డీర్ సంరక్షణ బాధ్యతల్ని కేటాయించింది. ఈ నేపథ్యంలో అంతరించిపోతున్న మూషిక జింకలను సంరక్షించటంతో పాటు వాటి పునరుత్పత్తి ప్రక్రియను హైదరాబాద్ జూ పార్క్ 2010లో చేపట్టింది. నాలుగు ఆడ మూషిక జింకలు, రెండు మగ మూషిక జింకలతో హైదరాబాద్ జూ పార్క్‌లో వీటి సంరక్షణçతో పాటు పునరుత్పత్తిని ప్రారంభించారు. ఇలా ప్రారంభించిన ఐదేళ్లలోనే వాటి సంఖ్యను భారీగా పెంచగలిగారు. పునరుత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసి మూషిక జింకలను ఆమ్రాబాద్, అచ్చంపేట అడవుల్లో వదిలిపెట్టారు. రాత్రి పూట మాత్రమే సంచరిస్తాయి నల్లమల అభయారణ్యంలో వీటి సంచారం ఎక్కువగా ఉంది. మాంసాహార వన్యప్రాణులు, పక్షుల బారినుంచి కాపాడుకునేందుకు రాత్రి పూట మాత్రమే ఇవి అడవిలో సంచరిస్తుంటాయి. పగటి పూట చెట్ల పొదలోపల నివాసం ఉంటాయి. అంతరించిపోతున్న ఈ జాతిని సంరక్షించేందుకు గతంలో హైదరాబాద్ జూపార్క్ అధికారులు చర్యలు చేపట్టారు. – విశ్వేశ్వరావు, ఫారెస్ట్ రేంజి అధికారి -
టూరిస్ట్‌లపైకి అమాంతం జంప్ చేసిన పులి...నెటిజన్లు షాక్
ఇంతవరకు ఎన్నో వైరల్ వీడియోలు చూసి ఉంటాం. సింహాలు మనుషులపై అకస్మాత్తుగా దాడిచేసిన పలు ఘటనలు గురించి విన్నాం. ఎన్నో సార్లు టూరిస్టుల వాహనాలకు అడ్డంగా నుల్చుని ఉండటం లేదా కారుపైకి ఎక్కేందుకు చేయడం చూసి ఉంటాం. కానీ ఇక్కడొక పులి టూరిస్టుల వెహికల్ని చూసి ఒకేసారి చంపి తినేద్ధాం అన్నంత వేగంగా టూరిస్టులపైకి దూకేస్తుంది. ఈ ఘటన చూస్తే ఎవరికైనా ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనవుతుంది. కానీ అది టూరిస్టులపై ప్రేమతోనే అలా దూకింది. వాహనంలో ఉన్న వారందర్నీ ప్రేమగా ఆలింగనం చేసుకుంటూ అందులో ఉన్న టూరిస్టులందర్నీ చుట్టేసింది. అది చేసిన పని వింతగానూ కాస్త ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది. సింహం వాహనంలో ఉన్న వారితో ఎంత ప్రేమగా మమేకమవుతుందో చూస్తే కచ్చితంగా షాక్‌గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఆ వీడియోను చూసేయండి. New wildlife experience 😬 pic.twitter.com/1J74oTKgWW — OddIy Terrifying (@OTerrifying) November 8, 2022 (చదవండి: షాకింగ్ వీడియో: పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా కదిలిన ట్రైన్.. తర్వాత ఏం జరిగిందంటే..) -
బంగారు గనుల్లో అరుదైన 'మమ్మీ' అవశేషాలు
Miners in the Klondike gold fields of Canada's: కొంతమంది యువకులు ఉత్తర కెనడాలోని బంగారు గనుల్లో అరుదైన మమ్మీ అవశేషాలను కనుగొన్నారు. ఇది ఒక ఆడ జంతువిగా గుర్తించారు. ఇది యుఎస్ రాష్ట్రానికి అలాస్కా సరిహద్దులో ఉన్న కెనడాలోని యుకాన్ మంచు ప్రదేశంలోని బంగారు గనుల్లో జరిపిన తవ్వకాల్లో ఈ అవశేషాలను కనుగొన్నారు. ఈ మమ్మీ ప్రపంచంలో ఇప్పటివరకు కనుగొనబడని అత్యద్భుతమైన మంచు యుగం నాటి జంతువులకు సంబంధించిన మమ్మీలలో ఇది ఒకటి. సుమారు 30 వేల ఏళ్ల క్రితం అడవి గుర్రాలు సింహాలు తదితర జంతువులు ఈ ప్రాంతంలో సంచరించేవని, అవి మంచు తుఫాను కారణంగా చనిపోయి ఉండవచ్చని పాలియోంటాలజిస్ట్ గ్రాంట్ జాజులా చెప్పారు. ఐతే ఈ యువ బృందం ఈ మమ్మీకి 'నన్ చో'(పెద్ద పిల్ల) అనే పేరు పెట్టారు. ఇదిలా ఉండగా 2007లో సైబీరియాలో 'లియుబా' అనే 42 వేల ఏళ్ల నాటి ఒక మమ్మీని గుర్తించారు. ప్రస్తుతం బయటపడ్డ ఈ నన్ చో, ఈ లియుబా మమ్మీ రెండు దాదాపు ఒకే పరిమాణంలో ఉండటం గమనార్హం. (చదవండి: ఇమ్రాన్ ఖాన్ని హత్య చేసేందుకు స్కెచ్...పట్టుబడ్డ ఉద్యోగి) -
మానవాళి భవిష్యత్తు ‘గుట్టు’ నేనే..
జీవుల్లో మొక్కలు, జంతువులు పూర్తిగా వేర్వేరు. కణాల నిర్మాణం నుంచి బతికే తీరుదాకా రెండూ విభిన్నమే. కానీ మొక్కలు, జంతువుల మధ్య విభజన గీతను చెరిపేసే చిత్రమైన జీవిని శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. అది ఇటు జంతువులా ఆహారాన్ని ఆరగిస్తూనే.. మరోవైపు మొక్కల్లా శరీరంలోనే ఆహారాన్ని తయారు చేసుకుంటోందని గుర్తించారు. దాని గుట్టు తెలిస్తే మానవాళి భవిష్యత్తే మారిపోతుందని అంటున్నారు. ఆ విశేషాలేమిటో తెలుసుకుందామా.. మొక్కలకు.. జంతువులకు మధ్య.. అదో సముద్రపు నత్త (సీ స్లగ్). చూడటానికి ఆకుపై పాకుతున్న నత్తలా ఉంటుంది. కానీ దాని శరీరమే అచ్చం ఆకులా ఉంటుంది. అలా కనిపించడమే కాదు.. నిజంగానే అది సగం జంతువులా, మరో సగం మొక్కలా బతికేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికా తూర్పు తీరంలో మాత్రమే కనిపించే ఈ సముద్రపు నత్తలకు ‘ఎలిసియా క్లోరోటికా’ అని పేరుపెట్టారు. నాచు నుంచి పత్ర హరితాన్ని సంగ్రహించి.. మొక్కలు భూమి నుంచి నీరు, పోషకాలనుగ్రహించి.. సూర్యరశ్మి సాయంతో ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇందులో మొక్కల ఆకుల్లో ఉండే ‘పత్ర హరితం (క్లోరోప్లాస్ట్)’ చాలా కీలకం. ఈ క్లోరోప్లాస్ట్ కణాల వల్లే ఆకులకు ఆకుపచ్చ రంగు వస్తుంది. సాధారణంగా ‘ఎలిసియా క్లోరోటికా’ నత్తలు సముద్రాల్లో ఉండే నాచు (ఆల్గే)ను తిని బతుకుతుంటాయి. ఈ క్రమంలో నత్తలు నాచులోని క్లోరోప్లాస్ట్‌లను తమ శరీరంలో విలీనం చేసుకుంటున్నాయని.. వాటి సాయంతో ఆహారాన్ని ఉత్పత్తి (ఫొటో సింథసిస్) చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండు అంగుళాల పరిమాణంలో ఉండే ఈ సముద్ర నత్తలు తమ శరీరాన్ని కూడా ఒక ఆకు ఆకారంలోనే అభివృద్ధి చేసుకోవడం గమనార్హం. శాస్త్రవేత్తలు వీటిపై ల్యాబ్‌లో పరిశోధన చేయగా.. ఏకంగా 9 నెలల పాటు తినడానికి ఏమీ లేకున్నా బతకగలిగాయి. ఆ సమయంలో క్లోరోప్లాస్ట్‌ల సాయంతో సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. నాచు అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని తింటున్నాయని.. దానిలోని క్లోరోప్లాస్ట్‌లను సంగ్రహించి నిల్వ చేసుకుంటున్నాయని గుర్తించారు. ఆ ‘గుట్టు’ తేల్చితే ఎన్నో అద్భుతాలు ‘ఎలిసియా క్లోరోటికా’ నత్తలు క్లోరోఫిల్‌ను ఎలా సంగ్రహించగలుగుతున్నాయి, ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నాయనేది తేల్చితే..ఎన్నో అద్భుత టెక్నాలజీలను రూపొందించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సౌరశక్తిని ఉపయోగించి నేరుగా ఆహారం తయరుచేయగల సాంకేతికతను అభివృద్ధి చేయవచ్చని అంటున్నారు. అడవుల నరికివేత తగ్గిపోతుందని, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని.. పర్యావరణాన్ని కాపాడవచ్చని పేర్కొంటున్నారు. చంద్రుడు, ఇతర గ్రహాలపైకి వెళ్లే మనుషులకు ఆహారం సమస్య ఉండదని అంటున్నారు. తేల్చాల్సిన అంశాలెన్నో! ‘ఎలిసియా క్లోరోటికా’ నత్తలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. వాటి సంఖ్య చాలా తక్కువని, అంతరించిపోయే దశలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే వాటి ‘గుట్టు’ తేల్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలో కొన్ని అంశాలపై దృష్టి సారించారు. మొక్కలు, జంతువులు కణాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. అలాంటిది వీటి మధ్య జీవ, రసాయనపరంగా అనుసంధానం ఎలా కుదిరింది? మొక్కల క్లోరోప్లాస్ట్‌లను ఈ నత్తలు ఎలా వినియోగించుకో గలుగుతున్నాయి? ఏదైనా తిన్నప్పుడు కడుపులో జీర్ణమైపోతాయి. అలాంటప్పుడు ఈ నత్తల కడుపులో క్లోరోప్లాస్ట్‌లు దెబ్బతినకుండా ఎలా ఉంటున్నాయి? -
పాడిరైతుకు అభయం
కడప అగ్రిక్చర్: రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోంది. వ్యవసాయ రంగంతోపాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి చేయూతనిస్తోంది.పాడి పశువులు, ఆవులు, గొర్రెలు, మేకలు ప్రమాదవశాత్తుగానీ, అకస్మాత్తుగా గానీ మృతి చెందింతే రైతులు అర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు డాక్టర్ వైస్సార్ పశు నష్టపరిహార పథకం కింద పరిహారం అందిస్తూ రైతన్నలను ఆదుకుంటోంది. ఇటీవలే వైఎస్సార్ పశు ఆరోగ్య సేవ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చి గ్రామీణ పశువైద్యానికి పెద్దపీట వేసింది. పశువులకు అత్యవసర వైద్యం అవసరమైతే 1962కు ఫోన్ కొడితే చాలు ఇంటి ముంగిటకే పశువైద్య సేవలందుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాడి పశువులైతేనే నష్టపరిహారం రైతులకు సంబంధించి పాడి గేదెలు, ఆవులు, గొర్రెలు మేకలు ప్రమాదవశాత్తు లేదా అకస్మాత్తుగా చనిపోతే డాక్టర్ వైస్సార్ పశు నష్టపరిహారం పథకం కింద నగదు అందించి బాధితులను ప్రభుత్వం ఆదుకుంటోంది. పశువుగానీ, ఆవులు కానీ ఒక ఈత ఈనినవై ఉండాలి. ఇందులో నాటు పశువు(నాటు రకం గేదె) మృతి చెందితే రూ. 15 వేలు, చుక్క, ముర్రా జాతికి చెందిన పశువు చనిపోతే రూ. 30 వేలు ఇస్తారు. ఇది కూడా ఒక కుటుంబానికి ఒకటి నుంచి ఆరు పశువుల వరకు నష్టపరిహారం వర్తిస్తుంది. తర్వాత ఎన్ని చనిపోయినా ఈ పథకం వర్తించదు. గొర్రెలకు సంబంధించి ఇలా... ఒకే సారి మూడు గొర్రెలు చనిపోతే ఒక్కోదానికి రూ. 6 వేల చొప్పున 18 వేల రూపాయలు ఇస్తారు. ఒకటి, రెండు గొర్రెలు, మేకలు చనిపోతే మాత్రం డబ్బులు రావు. ఇందులో కూడా ఒక కుటుంబానికి 20 గెర్రెల వరకు నష్టపరిహారం వస్తుంది. తరువాత ఎన్ని చనిపోయినా ఈ పథకం వర్తించదు. ఇందులో పిడుగు, విద్యుత్ షాక్‌లతో చనిపోతే మాత్రం కచ్చితంగా పంచనామా చేయాలి. ప్రమాదంలో చనిపోతే మాత్రం ఎఫ్ఐఆర్ ఉండాలి. దీంతోపాటు పాడి గేదెలు,ఆవులు, గొర్రెలు, మేకలు చనిపోతే కచ్చితంగా ఆ గ్రామల పరిధిలోని గ్రామీణ పశువైద్యాధికారి పోస్టుమార్టం చేయాలి.అందుకు సంబంధించిన రిపోర్టు ఉండాలి. దీంతోపాటు పోస్టుమార్టం చేసిన పశువుతోగానీ, గొర్రెతో గాని డాక్డర్ ఫొటో ఉంటేనే డబ్బులు వస్తాయి. లేకుంటే రావు. సంబంధిత డబ్బులు నేరుగా బాధితుడి ఖాతాకు జమ అవుతాయి. పశు వైద్యులకు సమాచారం ఇవ్వాలి... పశువులు, ఆవులు గొర్రెలు ప్రమాదవశాత్తు లేదా అకస్మాత్తుగా చనిపోతే సంబంధిత విషయాన్ని పశుశైద్యాధికారికి తెలియజేయాలి. అయన అక్కడి నుంచే వివరాలను జియోట్యాగ్ చేయాలి. దీంతోపాటు పోస్టుమార్టం చేసి మూగజీవాల ఫొటోలు తీయాలి. పోస్టుమార్టం రిపోర్టు కూడా ఉండాలి. ఇవేవీ లేకపోతే నష్టపరిహారం రాదు. ఇది కూడా పాడిగేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. – డాక్టర్. తెలుగు. వెంకటరమణయ్య, జిల్లా పశు వైద్యాధికారి. -
ఒక వ్యక్తి జంతువులా మారడం కోసం ఏకంగా రూ.12 లక్షలు పెట్టి...
కొన్ని వింత సంఘటనలు చూసినప్పుడూ వెర్రి వేయి రకాలు అని ఎందుకంటారో కచ్చింతంగా అర్థమవుతుంది. కొంతమంది చేసే పిచ్చి పనులు చూస్తుంటే ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయా మనుషులకు అనిపిస్తుంది. వింత వింత కోరికలు ఎందుకు వస్తాయా చెప్పలేం గానీ. కొంతమంది ఆ కోరికలు తీర్చుకునే క్రమంలో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేస్తారు కూడా. అదే కోవకు చెందినవాడు జపాన్ చెందిన వ్యక్తి. అతను ఏం చేశాడో తెలుసా! వివర్లాలోకెళ్తే...జపన్కు చెందిన ఒక వ్యక్తికి జంతువులా కనిపించాలనేది అతని చిరకాల కోరిక. అంతేకాదు కుక్కల జాతికి సంబంధించిన కోలీలా మారాలనుకున్నాడు. ఐతే అతని కోరిక జెప్పెట్ అనే కంపెనీ ద్వారా తన కోరికను నెరవేర్చకున్నాడు. ఈ కంపెనీ సినిమాలకు, వాణిజ్యప్రకటనలకు, కాస్ట్యూమ్స్ అందిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జెప్పెట్ కంపెనీని ఆశ్రయించి తన కోరికను వెలిబుచ్చాడు. ఐతే ఆ కాస్ట్యూమ్స్‌కి సుమారు రూ. 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని కంపెనీ చెప్పింది. అంతేకాదు కుక్కలా ఉండే కాస్ట్యూమ్ రూపొందిచటానికి కూడా దాదాపు 40 రోజులు పడుతుందని తెలిపింది. తాను రియలిస్ట్క్ కుక్కలా ఉండాలని కోరుకుంటానని చెప్పి మరీ ఆర్డర్ ఇచ్చేశాడు. ఈ మేరకు రూ 12 లక్షలక పైగా ఖర్చుపెట్టి మరీ ఆ కాస్ట్యూమ్ని తెప్పించకుని తన కోరికను నెరవేర్చకోవడమే కాకుండా ఆ కాస్ట్యూమ్ని ధరించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పైగా ఆ వ్యక్తి కాస్ట్యూమ్ వేసుకుని నిజమైన కుక్క మాదిరి ఫోటోలకు ఫోజులు పెట్టాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: భిక్షాటనతో భార్యకు ఊహించని సర్ప్రైజ్: వీడియో వైరల్)