- కిన్నెరసాని అభయారణ్యంలో సంచరిస్తున్నట్లు గుర్తింపు
- వన్యప్రాణుల గణంకాల సర్వే
- 430 జంతువులు ఉన్నట్లు సమాచారం
పాల్వంచ రూరల్ : కిన్నెరసాని అభయారణ్యంలో ఇటీవల వన్య మృగాల సంరక్షణ విభాగం అధికారులు జంతువుల గణంకాలను సర్వేను నిర్వహించారు. గత నెల 24 నుంచి 30వ తేదీ వరకు అభయారణ్యంలో యానంబైల్ రేంజ్, చాతకొండరేంజీల పరిధిలో 20 బీట్ల అడవీలో సంచరించే వివిధ రకాల జంతువుల పాదముద్రలు, విసర్జనల ఆధారంగా ప్లగ్ మార్క్‌లతో గణంకాల సర్వేను నిర్వహించినట్లు చాతకొండ రేంజర్ సూర్యనారాయణ గురువారం తెలిపారు.
యానంబైల్ రేంజ్ పరిధిలోని 9 బీట్లలో 4 చిరుత పులులు, 1 పెద్దపులి, దుప్పులు 70, కొండగొర్రెలు 9, అడవి పందులు 35, నేమళ్లు 4, కుందేళ్లు 24, కణుజులు 5, ఎలుగుబంట్లు 2, అడవి దున్నలు 10, కొండముచ్చులు 8, చాతకొండ రేంజ్ పరిధిలోని 11 బీట్లలో రెండు పెద్ద పులులు, 11 చిరుతలు, అడవి దున్నలు 48, కొండగొర్రేలు 48, అడవి పందులు 51, దుప్పులు 66, నేమళ్లు 2, కుందేళ్లు 28, ఎలుగుబండ్లు 3 సంచరించినట్లు సర్వేలో గుర్తించినట్లు తెలిపారు.
డెహరాడూన్‌కు పంపనున్న పులి విసర్జన
అభయారణ్యంలోని పడిగాపురం అటవీ ప్రాంతంలో అటవీ సిబ్బంది చేసిన సర్వేలో లభ్యమైన పెద్దపులి విర్జనను పరీక్షల నిమిత్తం ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని డెహరాడూన్‌లో ఉన్న అటవీశాఖ అకాడమికి పంపనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
పులులు 3.. చిరుతలు 14
Published Fri, May 8 2015 5:29 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM
Advertisement
Advertisement