న్యూఢిల్లీ: ఈ సమాజంలో జంతువులకు హాని చేసే మానవ మృగాలే కాదు.. వాటికి సాయం చేసే మంచి మనుషులూ ఉన్నారు. అందుకు నిలువెత్తు సాక్ష్యమే ఈ వార్త. ఓ మాతృమూర్తి కొండముచ్చు(కొండెంగ)కు అన్నం తినిపించింది. అది బల్లపై ఒకే దగ్గర కుదురుగా కూర్చోగా ఆమె పెద్ద పెళ్లంలో అన్నం కలుపుతూ దాని ఎదుటే నిలబడింది. అనంతరం దానికి చంటిపాపలా గోరు ముద్దలు పెడుతూ తినిపించింది. ఆ జంతువు కూడా ఆమెను సతాయించకుండా బుద్ధిగా కూర్చోవడం కొసమెరుపు. (వైరల్: చిరుతను చంపి ఊరేగించారు)
"ఇంట్లో మా అమ్మ కొండముచ్చుకు అన్నం తినిపిస్తోంది" అంటూ ఓ వ్యక్తి వీడియోను షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు పది లక్షల మందికి పైగా వీక్షించారు. మూగజీవానికి, ఆ మహిళకు మధ్య ఉన్న అనుబంధానికి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. కొండెంగను ఇంట్లో మనిషిలా చూస్తూ దానికి ఆప్యాయతను అందించిన మహిళా మూర్తిని ఆకాశానికెత్తుతున్నారు. (వైద్యం కోసం ఆస్పత్రికి కొండముచ్చు)
Comments
Please login to add a commentAdd a comment