Japanese Man Turns To Dog, Spent Rs 12 Lakh To Fulfil His Dream, Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: చిరకాల కాంక్ష! ఒక వ్యక్తి జంతువులా మారడం కోసం ఏకంగా రూ.12 లక్షలు పెట్టి...

Published Wed, May 25 2022 6:13 PM | Last Updated on Wed, May 25 2022 7:03 PM

Japan Man Spent Rs 12 Lakh Fulfil His Dream Become A Dog Viral - Sakshi

కొన్ని వింత సంఘటనలు చూసినప్పుడూ వెర్రి వేయి రకాలు అని ఎందుకంటారో కచ్చింతంగా అర్థమవుతుంది. కొంతమంది చేసే పిచ్చి పనులు చూస్తుంటే ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయా మనుషులకు అనిపిస్తుంది. వింత వింత కోరికలు ఎందుకు వస్తాయా చెప్పలేం గానీ. కొంతమంది ఆ కోరికలు తీర్చుకునే క్రమంలో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేస్తారు కూడా. అదే కోవకు చెందినవాడు జపాన్‌ చెందిన వ్యక్తి. అతను ఏం చేశాడో తెలుసా!

వివర్లాలోకెళ్తే...జపన్‌కు చెందిన ఒక వ్యక్తికి జంతువులా కనిపించాలనేది అతని చిరకాల కోరిక. అంతేకాదు కుక్కల జాతికి సంబంధించిన కోలీలా మారాలనుకున్నాడు. ఐతే అతని కోరిక జెప్పెట్‌ అనే కంపెనీ ద్వారా తన కోరికను నెరవేర్చకున్నాడు. ఈ కంపెనీ సినిమాలకు, వాణిజ్యప్రకటనలకు, కాస్ట్యూమ్స్‌ అందిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జెప్పెట్‌ కంపెనీని ఆశ్రయించి తన కోరికను వెలిబుచ్చాడు.

ఐతే ఆ కాస్ట్యూమ్స్‌కి సుమారు రూ. 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని కంపెనీ చెప్పింది. అంతేకాదు కుక్కలా ఉండే కాస్ట్యూమ్‌ రూపొందిచటానికి కూడా దాదాపు 40 రోజులు పడుతుందని తెలిపింది. తాను రియలిస్ట్‌క్‌ కుక్కలా ఉండాలని కోరుకుంటానని చెప్పి మరీ ఆర్డర్‌ ఇచ్చేశాడు. ఈ మేరకు రూ 12 లక్షలక పైగా ఖర్చుపెట్టి మరీ ఆ కాస్ట్యూమ్‌ని తెప్పించకుని తన కోరికను నెరవేర్చకోవడమే కాకుండా ఆ కాస్ట్యూమ్‌ని ధరించిన ఫోటోలను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. పైగా ఆ వ్యక్తి కాస్ట్యూమ్‌ వేసుకుని నిజమైన కుక్క మాదిరి ఫోటోలకు ఫోజులు పెట్టాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. మీరు కూడా ఓ లుక్‌ వేయండి.

(చదవండి: భిక్షాటనతో భార్యకు ఊహించని సర్‌ప్రైజ్‌: వీడియో వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement