castumes
-
కరణ్ జోహార్ డెనిమ్ జాకెట్ అంత ఖరీదా? ఏకంగా..!
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కుచ్ కుచ్ హోతా హై(1998) సినిమాతో దర్శకునిగా పరిచయమయ్యి కభీ ఖుషీ కభీ గమ్ సూపర్ హిట్ సినిమాలతో మంచిపేరు సంపాదించుకున్నారు. అంతేగాదు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే వంటి అవార్డులు కూడా అందుకున్నారు. అలాగే ఫ్యాషన్ పరంగా తనదైన శైలిలో ఎప్పటికప్పుడూ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడు. దర్శకుడు కూడా హీరో రేంజ్లో ఉంటాడనేలా అతడి ఆహార్యం ఉంటుంది. అతను ఫ్యాషన్ శైలి ఏంటన్నది ధరించే దుస్తులే రేంజే చెబుతాయి. ఆయన ఇటీవల అనన్య పాండే బ్రాండ్ న్యూసిరీస్ 'కాల్ మి బే' ట్రైలర్ లాంచ్‌లో అత్యంత ఖరీదైన కాస్ట్యూమ్‌తో సరికొత్త లుక్‌లో కనిపించాడు. చెప్పాలంటే మనం ఒక లాంగ్ టూర్‌కి ప్లాన్ చేసే మొత్తం అతడి కాస్ట్యూమ్ డిజైన్‌కి ఖర్చు పెట్టాడు.కరణ్ లూయిస్ విట్టన్ బ్రాండ్‌కి చెందిన బ్లాక్ డెనిమ్ జాకెట్‌ని ధరించాడు . దీని ధర ఏకంగా రూ. 5.40 లక్షల పలుకుతుందట. ఈ జాకెట్‌కు తగ్గట్టు బ్లాక్ టీ షర్ట్, జీన్స్ ధరించడంతో ఓవరాల్ బ్లాక్ కలర్‌తో లుక్ ఇంత ఆకర్షణీయంగా ఉంటుందా అనేలా హైలెట్‌గా ఉంది కరణ్ కాస్ట్యూమ్. (చదవండి: మలేషియా ప్రధానికి స్పెషల్ మిల్లెట్ లంచ్..మెనూలో ఏం ఉన్నాయంటే..!) -
అయోధ్య రాముడుకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది వీరే!
500 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇవాళే అయోధ్యలో కన్ను పండుగగా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరగనుంది. మరికొద్దిసేపటిలో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమం కోసం దేశ నలుమూలల నుంచి ప్రముఖులు, సెలబ్రెటీలు అయోధ్యకు చేరుకున్నారు. అంతేగాదు దేశ విదేశాల నుంచి సైతం రామభక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ఆయోధ్య రాముడుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆయన ధరించే బట్టలను అందంగా డిజైన్ చేసి ఎవరూ ఇస్తారు? వాళ్లేవరూ? వంటి విశేషాలు గురించి తెలుసుకుందాం! అయోధ్యలో ఓ చిన్న టైలర్ దుకాణం బాబూ లాల్ టైలర్స్. దీన్ని ఇద్దరు అన్నదమ్ములు భగవత్, శంకర్ లాల్ నడుపుతున్నారు. వీళ్లే బాల రామయ్యకు వేసే బట్టలను అందంగా డిజైన్ చేస్తారు. మూడు దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్, శంకర్ల తండ్రి బాబూలాల్‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలు కుడుతోంది. రాముని విగ్రహానికి ఒక్కోరోజు ఒక్కోరంగుతో కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేసి కుడతారు. అలా..సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం తెలుపు, శనివారం నీలం రంగు వస్త్రాలు వేస్తారు. వాళ్లు కేవలం రాముడికి మాత్రమే గాక లక్ష్మణ, భరత, శతృఘ్న, హనుమాన్, శాలిగ్రామాలకు కూడా బట్టలు కుట్టడం జరుగుతుంది. ఈ టైలర్లు అయోధ్యలోని బడి కుటియా ప్రాంతంలో శ్రీ బాబులాల్ టైలర్ పేరుతో ఎనిమిది అడుగుల గదిలో దుకాణం నడుపుతున్నారు. ఈ అయోధ్య రామమందిరం భూమిపూజ రోజు రామునికి ఆకుపచ్చరంగు దుస్తులను కుట్టారు. ఆ తర్వాత కుంకుమ పువ్వు కలర్ దుస్తులను డిజైన్ చేశారు. అయితే ఆ సోదరులు రాముడుకి దుస్తులు కుట్టేందుకు సిల్క్‌ని వాడగా, బంగారం దారంతో కుట్టడం జరుగుతుంది. పైగా వాటిపై నవగ్రహాలు ఉండటం విశేషం. ఈ ఇరువురు సోదరులు రామ్‌లల్లా కోసం దుస్తులు కుట్టడంలో చాలా ప్రత్యేకతను చూపి తమ భక్తిని చాటుకుంటున్నారు. అంతేగాదు మా జీవితకాలంలో ఈ గొప్ప రామాలయాన్ని చూడగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందంగా చెబుతున్నారు ఆ సోదరులు. (చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!) -
ఒక వ్యక్తి జంతువులా మారడం కోసం ఏకంగా రూ.12 లక్షలు పెట్టి...
కొన్ని వింత సంఘటనలు చూసినప్పుడూ వెర్రి వేయి రకాలు అని ఎందుకంటారో కచ్చింతంగా అర్థమవుతుంది. కొంతమంది చేసే పిచ్చి పనులు చూస్తుంటే ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయా మనుషులకు అనిపిస్తుంది. వింత వింత కోరికలు ఎందుకు వస్తాయా చెప్పలేం గానీ. కొంతమంది ఆ కోరికలు తీర్చుకునే క్రమంలో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేస్తారు కూడా. అదే కోవకు చెందినవాడు జపాన్ చెందిన వ్యక్తి. అతను ఏం చేశాడో తెలుసా! వివర్లాలోకెళ్తే...జపన్కు చెందిన ఒక వ్యక్తికి జంతువులా కనిపించాలనేది అతని చిరకాల కోరిక. అంతేకాదు కుక్కల జాతికి సంబంధించిన కోలీలా మారాలనుకున్నాడు. ఐతే అతని కోరిక జెప్పెట్ అనే కంపెనీ ద్వారా తన కోరికను నెరవేర్చకున్నాడు. ఈ కంపెనీ సినిమాలకు, వాణిజ్యప్రకటనలకు, కాస్ట్యూమ్స్ అందిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జెప్పెట్ కంపెనీని ఆశ్రయించి తన కోరికను వెలిబుచ్చాడు. ఐతే ఆ కాస్ట్యూమ్స్‌కి సుమారు రూ. 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని కంపెనీ చెప్పింది. అంతేకాదు కుక్కలా ఉండే కాస్ట్యూమ్ రూపొందిచటానికి కూడా దాదాపు 40 రోజులు పడుతుందని తెలిపింది. తాను రియలిస్ట్క్ కుక్కలా ఉండాలని కోరుకుంటానని చెప్పి మరీ ఆర్డర్ ఇచ్చేశాడు. ఈ మేరకు రూ 12 లక్షలక పైగా ఖర్చుపెట్టి మరీ ఆ కాస్ట్యూమ్ని తెప్పించకుని తన కోరికను నెరవేర్చకోవడమే కాకుండా ఆ కాస్ట్యూమ్ని ధరించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పైగా ఆ వ్యక్తి కాస్ట్యూమ్ వేసుకుని నిజమైన కుక్క మాదిరి ఫోటోలకు ఫోజులు పెట్టాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: భిక్షాటనతో భార్యకు ఊహించని సర్ప్రైజ్: వీడియో వైరల్) -
స్టార్ స్టయిల్: శ్రుతి హాసన్ ధరించిన చీర, జ్యూయెలరీ ధర ఎంతో తెలుసా?
‘ఆకాశం అమ్మాౖయెయితే, నీలా ఉంటుందే.. నీలా ఉంటుందే..’ఆ అమ్మాయి ఎవరో ఈ పాటికే మీకు తెలిసిపోయే ఉంటుంది! మరి, అంతటి అందంతో పోటీపడేందుకు నిచ్చెన వేస్తున్న ఆ ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.. దేవనాగ్రి.. ఓ పండుగ రోజు అమ్మమ్మ తయారుచేసిన సంప్రదాయ దుస్తులు ధరించడంతో అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియాంకల భవిష్యత్తు ప్రణాళిక మారిపోయింది. ఒకరు ఇంజనీర్, మరొకరు డాక్టర్ కావాలనుకున్నా.. చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఆ ఆసక్తితోనే జైపూర్‌లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. తర్వాత దేశమంతటా వివిధ పండుగలకు తగ్గ దుస్తులను డిజైన్ చేయటం మొదలుపెట్టారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవనాగ్రి’అనే ఓ ఫ్యాషన్ హౌస్ ప్రారంభించారు. భారతదేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. చాలామంది సెలబ్రిటీస్ వివిధ పండుగల్లో ఈ బ్రాండ్ దుస్తుల్లో మెరిశారు. స్పెషల్ అకేషన్స్‌కు సరిపోయే డిజైన్స్ రూపొందించడంలోనూ వీరు సిద్ధ హస్తులు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి. చీర.. బ్రాండ్: దేవనాగ్రి ధర: రూ. 34,000 అమ్రపాలి జ్యూయెలరీ నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజమేరా కలసి జైపూర్‌లో ‘అమ్రపాలి’ పేరుతో మ్యూజియం స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘అమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే అమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో కూడా అమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: అమ్రపాలి జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. చదవండి: ఇవి తింటే బట్టతల ఖాయం..! గుడ్డు తెల్లసొన, చేప, చక్కెర.. -
కాస్ట్యూమ్స్‌కే కోటి రూపాయలు..?
ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్‌గా ఉన్న మహేష్ బాబు లేటెస్ట్ సినిమా బ్రహ్మోత్సవంతో మరిన్ని రికార్డ్లను టార్గెట్ చేశాడు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ సొంతం చేసుకున్న మహేష్, తొలి రోజు హయ్యస్ట్ నెంబర్ షోస్‌తో మరో రికార్డ్ కు రెడీ అవుతున్నాడు. ఇలా సినిమా రిలీజ్ విషయంలో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్న సూపర్ స్టార్, ఈ సినిమా మేకింగ్ విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. సాధారణంగా ప్రతి సినిమాలో హీరో క్యారెక్టర్‌కు 25 నుంచి 35 కాస్ట్యూమ్స్‌ను వినియోగిస్తారు. కానీ బ్రహ్మోత్సవం సినిమాలో మాత్రం మహేష్ ఏకంగా 100 రకాల కాస్ట్యూమ్స్‌లో కనిపించనున్నాడట. ఈ విషయాన్ని మహేష్ వ్యక్తిగత స్టైలిష్ట్ అక్షయ్ త్యాగి స్వయంగా తెలిపాడు. సింపుల్‌గా కనిపిస్తూనే మహేష్ గ్లామర్‌కు తగ్గట్టుగా కనిపించటం కోసం ఈ కాస్ట్యూమ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. అంతేకాదు కేవలం మహేష్ వేసుకున్న దుస్తుల కోసమే ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేశారన్న టాక్ వినిపిస్తోంది.