బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కుచ్ కుచ్ హోతా హై(1998) సినిమాతో దర్శకునిగా పరిచయమయ్యి కభీ ఖుషీ కభీ గమ్ సూపర్ హిట్ సినిమాలతో మంచిపేరు సంపాదించుకున్నారు. అంతేగాదు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే వంటి అవార్డులు కూడా అందుకున్నారు. అలాగే ఫ్యాషన్ పరంగా తనదైన శైలిలో ఎప్పటికప్పుడూ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడు. దర్శకుడు కూడా హీరో రేంజ్‌లో ఉంటాడనేలా అతడి ఆహార్యం ఉంటుంది.
అతను ఫ్యాషన్ శైలి ఏంటన్నది ధరించే దుస్తులే రేంజే చెబుతాయి. ఆయన ఇటీవల అనన్య పాండే బ్రాండ్ న్యూసిరీస్ 'కాల్ మి బే' ట్రైలర్ లాంచ్‌లో అత్యంత ఖరీదైన కాస్ట్యూమ్‌తో సరికొత్త లుక్‌లో కనిపించాడు. చెప్పాలంటే మనం ఒక లాంగ్ టూర్‌కి ప్లాన్ చేసే మొత్తం అతడి కాస్ట్యూమ్ డిజైన్‌కి ఖర్చు పెట్టాడు.
కరణ్ లూయిస్ విట్టన్ బ్రాండ్‌కి చెందిన బ్లాక్ డెనిమ్ జాకెట్‌ని ధరించాడు . దీని ధర ఏకంగా రూ. 5.40 లక్షల పలుకుతుందట. ఈ జాకెట్‌కు తగ్గట్టు బ్లాక్ టీ షర్ట్, జీన్స్ ధరించడంతో ఓవరాల్ బ్లాక్ కలర్‌తో లుక్ ఇంత ఆకర్షణీయంగా ఉంటుందా అనేలా హైలెట్‌గా ఉంది కరణ్ కాస్ట్యూమ్.
(చదవండి: మలేషియా ప్రధానికి స్పెషల్ మిల్లెట్ లంచ్..మెనూలో ఏం ఉన్నాయంటే..!)
Comments
Please login to add a commentAdd a comment