jacket
-
కరణ్ జోహార్ డెనిమ్ జాకెట్ అంత ఖరీదా? ఏకంగా..!
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కుచ్ కుచ్ హోతా హై(1998) సినిమాతో దర్శకునిగా పరిచయమయ్యి కభీ ఖుషీ కభీ గమ్ సూపర్ హిట్ సినిమాలతో మంచిపేరు సంపాదించుకున్నారు. అంతేగాదు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే వంటి అవార్డులు కూడా అందుకున్నారు. అలాగే ఫ్యాషన్ పరంగా తనదైన శైలిలో ఎప్పటికప్పుడూ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడు. దర్శకుడు కూడా హీరో రేంజ్లో ఉంటాడనేలా అతడి ఆహార్యం ఉంటుంది. అతను ఫ్యాషన్ శైలి ఏంటన్నది ధరించే దుస్తులే రేంజే చెబుతాయి. ఆయన ఇటీవల అనన్య పాండే బ్రాండ్ న్యూసిరీస్ 'కాల్ మి బే' ట్రైలర్ లాంచ్‌లో అత్యంత ఖరీదైన కాస్ట్యూమ్‌తో సరికొత్త లుక్‌లో కనిపించాడు. చెప్పాలంటే మనం ఒక లాంగ్ టూర్‌కి ప్లాన్ చేసే మొత్తం అతడి కాస్ట్యూమ్ డిజైన్‌కి ఖర్చు పెట్టాడు.కరణ్ లూయిస్ విట్టన్ బ్రాండ్‌కి చెందిన బ్లాక్ డెనిమ్ జాకెట్‌ని ధరించాడు . దీని ధర ఏకంగా రూ. 5.40 లక్షల పలుకుతుందట. ఈ జాకెట్‌కు తగ్గట్టు బ్లాక్ టీ షర్ట్, జీన్స్ ధరించడంతో ఓవరాల్ బ్లాక్ కలర్‌తో లుక్ ఇంత ఆకర్షణీయంగా ఉంటుందా అనేలా హైలెట్‌గా ఉంది కరణ్ కాస్ట్యూమ్. (చదవండి: మలేషియా ప్రధానికి స్పెషల్ మిల్లెట్ లంచ్..మెనూలో ఏం ఉన్నాయంటే..!) -
‘సద్రీ’ జాకెట్‌తో రాజ్యసభలో ప్రధాని.. ‘మోదీ లేటెస్ట్ స్టైల్ ఇది’
న్యూఢిల్లీ: బుధవారం రాజ్యసభ సమావేశంలో ప్రధాని మోదీ రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో తయారుచేసిన ‘సద్రీ’ జాకెట్‌తో కనిపించారు. లేత నీలిరంగులో హుందాగా కనిపిస్తున్న ఈ జాకెట్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) సంస్థ వారు సోమవారం బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో ప్రధానికి బహూకరించారు. ఐఓసీ వారు అన్బాటిల్డ్ కార్యక్రమంలో భాగంగా ఇలా ప్లాస్టిక్ వ్యర్థ్యాల నుంచి యూనిఫామ్‌లను తయారుచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ బాటిళ్లు, వస్తువులకు చెక్ పెట్టాలని గతంలో ప్రధాని మోదీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో తమ సంస్థ రిటైల్ కస్టమర్ అటెండెంట్లకు, ఎల్పీజీ డెలివరీ సిబ్బందికి రీసైకిల్డ్ పాలీస్టర్ (ఆర్పెట్), పత్తితో తయారైన యూనిఫామ్‌లను అందజేయనున్నట్లు ఐవోసీ తెలిపింది. ‘వాతావరణ మార్పులకు తగ్గట్లు, సుస్థిరాభివృద్ధి కృషిచేసే మోదీ లేటెస్ట్ స్టైల్ ఇది’ అంటూ పలువురు కేంద్ర మంత్రులు ట్వీట్లతో పొగిడారు. 28 వాడి పడేసిన పాలీఎథిలీన్ టెరేఫ్తాలేట్ పెట్ బాటిళ్లతో ఒక జత యూనిఫామ్ తయారుచేయొచ్చు. ‘ ఇది పర్యావరణహిత లైఫ్‌స్టైల్ మాత్రమేకాదు. అధునాతన ఫ్యాషన్ కూడా’ అంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్‌చేశారు. Pro Planet PM! PM @NarendraModi Ji wore a unique blue jacket in Parliament made from recycled plastic bottles. A LiFE lesson for all! pic.twitter.com/Mz3jWtA8kG — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) February 8, 2023 -
స్పెషల్ బ్లూ జాకెట్లో ప్రధాని మోదీ!
అందరి దృష్టిని ఆకర్షించేలా స్పెషల్ బ్లూ జాకెట్‌ని ధరించి పార్లమెంట్‌కి వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. మోదీ ధరించిన జాకెట్‌ని రీసైకిల్ చేసిన పీఈటీ బాటిళ్లతో తయారుచేసింది. బెంగళూరులో సోమవారం జరిగి ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రధాని మోదీకి ఈ స్పెషల్ జాకెట్‌ని బహుకరించింది. ఈ ఎనర్జీ వీక్ అనేది శక్తి పరివర్తన హౌస్‌గా ఎదుగుతున్న భారత్ సామర్థ్యాన్ని ప్రదర్శించేందకు ఉద్దేశించింది. ఈ మేరకు మోదీ రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నందున బుధవారం పార్లమెంట్లో ఆయన ఈ జాకెట్లో కనిపించారు. కాగా ఇండియా ఆయిల్ ఉద్యోగులు సాయుధ దళాల కోసం ఇలాంటి దుస్తులను తయారు చేసేలా దాదాపు 10 కోట్ల పీఈటీ బాటిళ్లను రీసైకిల్ చేయనున్నారు. అదీగాక ఇటీవల ప్రభుత్వం సుమారు రూ. 19 వేల కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ని ప్రారంభించింది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించేలా, కార్బన్ తీవ్రతను కూడా తగ్గించే దిశగా ఈ మిషన్‌ని ఏర్పాటు చేసింది. అలాగే బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంధన పరివర్తన నికర సున్నా లక్ష్యాలను సాధించడానికి రూ. 35 వేల కోట్లను అందించారు. అంతేగాదు ఆ బడ్జెట్లో దాదాపు ఏడు ప్రాధాన్యతల్లో హరిత వృద్ధికి స్థానం కల్పించారు కూడా. (చదవండి: సిగ్నల్ వద్ద బ్రేక్ బదులు ఎక్స్‌లేటర్ తొక్కడంతో..ఇద్దరు మృతి) -
ఎట్టకేలకు జాకెట్ ధరించిన రాహుల్..తిట్టిపోస్తున్న ప్రతిపక్షాలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పటి వరకు 125 రోజుల ప్రయాణంలో సుమారు 3,400 కిలోమీటర్లు చేసిన పాద యాత్రలో కేవలం తెల్లటి టీషర్ట్ మాత్రమే ధరించి అందర్నీ ఆశ్చర్యచకితులను చేశారు. చలికాలం సమీపించి గజగజలాడిస్తున్న ఆయన తెల్లటి టీ షర్ట్ మాత్రమే ధరించడం అందరిలో ఒకటే ఉత్సుకతను రేకెత్తించాయి. చివరికి మీడియా ముందుకు వచ్చి రాహుల్‌ని ఈవిషయమై ప్రశ్నించగా..పేదవాళ్లను, కార్మికులను ఈ ప్రశ్న ఎందుకు వేయరు అని ఎదురు ప్రశ్నించారు. తాను ముగ్గురు చిన్నారులన చూశానని వారు చలికి వణకుతూ కనిపించారే గానీ స్వెటర్లు ధరించలేదని, వారే తనకు ఆదర్శం అని చెప్పుకొచ్చారు. అంతేగాదు వారికి చలి అనిపించేంత వరకు తాను ధరించనని, అప్పటి వరకు తనకు కూడా చలిగా అనిపించదంటూ పెద్దపెద్ద మాటలు చెప్పారు. కానీ చివరికి జమ్మూలో యాత్ర ప్రవేశించగానే రాహుల్‌కి జాకెట్ ధరించక తప్పలేదు. ఈ మేరకు గురువారం రాహుల్ భారత్ జోడో యాత్ర పంజాబ్ నుంచి జమ్మూలోకి ప్రవేశించింది. చలికాలంలో సైతం టీషర్టు ధరించి ఉత్తర భారతదేశం గుండా దిగ్విజయంగా పాదయాత్ర చేసి అందర్నీ షాక్ గురిచేసిన ఆయన ఈరోజు యాత్రలో తోలిసారిగా జాకెట్లో కనిపించారు. ఉదయం నుంచి జమ్మూలోని పలు ప్రాంతాల్లో చినుకులు కురుస్తుండటం వల్ల గాంధీ చివరకు రక్షణ దుస్తులు ధరించక తప్పింది కాదు. దీంతో ఇక ఇదే అవకాశంగా ప్రతిపక్షాలు రాహుల్‌పై వ్యంగోక్తులు విసరడం, చురకలింటించడం, ప్రారంభించాయి. ఇదిలా ఉండగా, రాహుల్ జనవరి 25న జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలోని బనిహాల్‌లో జాతీయ జెండాను ఎగరువేస్తారు. ఆ తర్వాత రెండురోజలు అనంతరం జనవరి 27న అనంత్‌నాగ్ మీదుగా శ్రీనగర్‌లో ప్రవేశించనున్నారు. అదీగాక భారత్ జోడో యాత్ర సందర్భంగా కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలో నడవవద్దని భద్రతా సంస్థలు గాంధీకి సూచించినట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ జమ్మూలో ప్రవేశించగానే అక్కడి అగ్రనేత నేషనల్‌కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా ఘన స్వాగతం పలికారు. పైగా చివరి దశకు చేరుకున్న ఈ యాత్రలో పాల్గొనడానికి వందలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ యాత్ర జనవరి 30న శ్రీనగర్‌లో గ్రాండ్ ఫినాలేతో ముగుస్తుంది. (చదవండి: యూత్ ఐకాన్‌గా రాహుల్ గాంధీ.. ఆ సత్తా ఉంది: శత్రుఘ్న సిన్హా) -
చలి కాచే కోటు..
చలికాలంలో ఒక్కోసారి స్వెట్టర్లు వేసుకున్నా, చలి తగ్గినట్లుగా అనిపించదు. అలాంటి ఇబ్బందేమీ లేకుండా నిమిషాల్లోనే ఒళ్లంతా వెచ్చబరచే అరకోటు అందుబాటులోకి వచ్చింది. వేడిని నిల్వచేసుకునే కెమికల్ జెల్ నింపి రూపొందించిన ఈ వస్త్రవిశేషం ‘ఎంట్రోపీ వెస్ట్’. టీషర్ట్ లేదా చొక్కా మీదుగా దీనిని అరకోటు ధరించినట్లే సులువుగా ధరించవచ్చు. దీనికి ఎలాంటి బ్యాటరీలతోను, విద్యుత్తుతోను పనిలేదు. దీనిని యాక్టివేట్ చేసుకుంటే చాలు, నిమిషాల్లోనే 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను అందిస్తుంది. నడుస్తున్నా, కదులుతూ పనులు చేసుకుంటూ ఉన్నా, క్రమంగా వేడి తగ్గి, శరీర ఉష్ణోగ్రత వద్ద స్థిరపడుతుంది. దీని ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గినట్లు అనిపిస్తే, ఉడుకు నీళ్లలో కాసేపు నానబెట్టి, ఆ తర్వాత ఆరవేసుకుంటే చాలు. యథాతథంగా పనిచేస్తుంది. ఉడుకు నీళ్లలోని ఉష్ణోగ్రతను ఈ వస్త్రంలోని జెల్ గ్రహించి, నిల్వ చేసుకుంటుంది. లండన్‌లోని ‘పెటిట్ ప్లీ’కి చెందిన శాస్త్రవేత్తలు ఈ సరికొత్త చలివస్త్రానికి రూపకల్పన చేశారు. దీని ధర 500 పౌండ్లు (రూ.50,104). చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో
Rajkummar Rao Says He Bought A Jacket From Chor Bazaar: సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సొంతగా ఎదిగిన వారు అనేక మంది ఉన్నారు. అలా బాలీవుడ్లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న వారిలో రాజ్ కుమార్ రావు ఒకరు. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన రాజ్ కుమార్ కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'హిట్: ది ఫస్ట్ కేస్'. జులై 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి విజయంతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఆర్థిక విషయాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు రాజ్ కుమార్ రావు. 'పదో తరగతి పూర్తయిన తర్వాత ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో మా కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందిపడేది. కానీ, అదిరిపోయే డ్రెస్‌తో పార్టీకి వెళ్లాలని ఉండేది. అంతేకాకుండా ఆ పార్టీలో నా ఫ్రెండ్స్‌తో కలిసి నేను డ్యాన్స్ కూడా చేయాలి. అందుకే అప్పుడు నేను దిల్లీలోని చోర్ బజార్‌కు వెళ్లి రూ. 100 పెట్టి జాకెట్ కొనుక్కున్నా. అలాగే రూ. 15తో మెడలో చైన్ కొని పార్టీకి వెసుకుని వెళ్లా' అని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు ఈ హీరో. చదవండి: అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో వైరల్.. మరణాన్ని ముందే ఊహించిన నటుడు !.. చివరి పోస్ట్ వైరల్ అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ -
వేలంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి జాకెట్.. ఎంత ధర పలికిందంటే?
లండన్‌లో జరిగిన ఛారిటీ వేలంలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ ధరించిన ప్రత్యేక ఖాకీ జిప్-అప్ ఉన్ని జాకెట్ వేలంలో 90వేల డాలర్ల ధర పలికింది. ఈ కార్యక్రమాన్ని మే 6న టేట్ మోడరన్ వద్ద ఉక్రెయిన్ రాయబార కార్యాలయం నిర్వహించింది. బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఈ జాకెట్‌ని అధిక ధరకు కొనుగోలు చేయాలని వేలంలో పాల్గొన్నవారిని కోరారు. వేలానికి ముందు జెలెన్స్స్కీ ఈ కార్యక్రమానికి వర్చువల్ హాజరయ్యారు. కష్ట సమయాల్లో ఉక్రెయిన్‌కి అండగా ఉన్నందుకు బ్రిటన్‌కి, ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పరిణామాలను ఆయన మరింత హైలైట్ చేశారు. మరోవైపు, రష్యా ల్యాండింగ్ షిప్‌ను టీబీ2 డ్రోన్ సాయంతో స్నేక్ ఐలాండ్‌లో ముంచేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. చదవండి: Imran Khan:పీకల్లోతు కష్టాల్లో ఇమ్రాన్ ఖాన్.. ఆ వివరాలు దొరికితే ఇక జైలుకే! -
వేసవి కోసం ‘ఫ్యాన్ జాకెట్లు’
న్యూఢిల్లీ : బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్‌లో ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో గురువారంను ‘ట్రాపికల్ థర్స్డే’గా పిలుస్తున్నారు. ఒళ్లంతా కాలిపోతుందంటూ ఎక్కువ మంది స్విమ్మింగ్ పూల్స్, బీచ్‌ల వెంట పరుగులు తీస్తున్నారు. మరికొందరు వేడిని తట్టుకునే మంచు చెప్పులు, ఫ్యాన్ జాకెట్ల కోసం షాపింగ్ చేస్తున్నారు. మహాబీస్ డాట్ కామ్ ద్వారా దాదాపు (భారత్ కరెన్సీలో) ఆరు వందల రూపాయలకు ‘మహాబీస్ సమ్మర్ స్లిప్పర్స్’ను, అమెజాన్ డాట్ కో డాట్ యూకే ద్వారా 140 రూపాయలకు ‘ర్యాపిడ్ రిలీఫ్ రీ యూజబుల్ కోల్డ్ స్లిప్పర్స్’ను ప్రజలు ఎగబడి కొంటున్నారు. ఈ స్లిప్పర్స్‌ను ఇంటా బయట ఉపయోగించవచ్చు. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి ఫ్రిజ్‌లో పెట్టి కూల్ చేయాల్సి ఉంటుంది. ఎండవేటిని తట్టుకోలేక అరిపాదాల్లోని నరాలు విస్తరిస్తున్నాయని, తద్వారా అరి పాదాలు స్వెల్లింగ్ వచ్చినట్లు ఉబ్బిపోతున్నాయని, అలాంటప్పుడు ఈ కోల్డ్ స్లిప్పర్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. ఇక ‘అమెజాన్ డాట్‌కో డాట్ ఇన్ యూకే’ ద్వారానే బ్యాటరీతో నడిచే ‘మకితా ఫ్యాన్ జాకెట్‌ను దాదాపు పది వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో ముందు, వెనక భాగాల్లో ఉండే రెండు చిన్న ఫ్యాన్లు ఉండడమే కాకుండా చుట్టూరు నీటి బ్యాగ్ ఉంటుంది. రెండు ఫ్యాన్లు తిరుగుతున్నప్పుడు బ్యాగులోని నీరు ఆవిరవుతూ శరీరానికి కావాల్సినంత చల్లదనాన్ని ఇస్తుంది. బ్రిటన్‌లో ఈసారి ఏసీ యూనిట్ల అమ్మకాలు ఏకంగా 11 శాతం పెరిగాయి. మరోపక్క వాటర్ పరుపులు కూడా ఎక్కువగానే అమ్ముడు పోతున్నాయి. ఈ పరుపుల మీద ఒంటరిగా పడుకుంటేనే శరీరం ఎక్కువగా చల్లగా ఉంటుందని బెడ్ కంపెనీ స్లీప్ ఆఫీసర్ నీల్ రాబిన్సన్ సూచిస్తున్నారు. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు గడ్డకట్టిన మంచనీళ్ల బాటిళ్లను వెంట తీసుకెళుతున్నారు. ఎండకు చల్లటి మంచినీళ్లను తాగుతూ ఉండడం వల్ల ఒక్క శరీరానికే కాకుండా మెదడుకు కూడా కావాల్సినంత చల్లదనం దొరుకుతుందని వైద్యులు సూచిస్తున్నారు. -
జాకెట్’ యాడ్.. పొలిటికల్ ట్రెండ్
రాజకీయ పార్టీలు అవకాశం ఉన్నంత వరకు ప్రతీదాన్నీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి. ఇళ్లు, గోడలు, వాహనాలనే కాక మనం ధరించే డ్రస్సులను కూడా వాడుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేతలు ప్రియాంకగాంధీ, రాహుల్‌గాంధీ ఫొటోలను చీరలు, టీషర్టులపై ముద్రించి మార్కెట్లోకి వదిలారు. తాజాగా మగవాళ్లు ధరించే జాకెట్లపై కూడా మోదీ, రాహుల్ ఫొటోలు ముద్రించి అమ్ముతున్నారు. ఆయా పార్టీల, నేతల అభిమానులు వాటిని ధరించడం గర్వంగా భావిస్తున్నారు. ‘ప్రధాని మోదీ మన దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేశారు. ఆయనకు మద్దతుగానే ఈ జాకెట్లు ధరిస్తున్నాం’ అన్నాడు మోదీ ఫొటో ఉన్న జాకెట్ వేసుకున్న సరళ్‌జైన్ అనే యువకుడు. రాహుల్ గాంధీ జాకెట్ తొడుక్కున్న శరద్చంద్ర అయితే, ‘దేశ యువతకు ప్రతీక రాహుల్‌గాంధీ. ఆ యువతలో నేనూ భాగమే కాబట్టి ఆయన ఫొటో ఉన్న ఈ జాకెట్ వేసుకున్నా’ అని చెబుతున్నాడు. మన దేశంలో ఎన్నికలంటే కేవలం విధాన నిర్ణేతలను ఎన్నుకోవడం మాత్రమే కాదు. అదొక ప్రజాస్వామ్య ఉత్సవం. అదెన్నో రకాలుగా వన్నెలీనుతుంది. వివిధ వర్ణాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి వెల్లివిరుస్తోంది. ఆ ఉత్సాహానికి అవధుల్లేవు. అది రోజు రోజుకూ కొత్త పోకడలు పోతోందనడానికి ఈ నడుస్తోన్న ట్రెండే నిదర్శనం. -
‘మోదీ జాకెట్’కు గిరాకీ తగ్గింది
ఔరంగాబాద్: 2014 ఎన్నికల సందర్భంగా విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చిన మోదీ జాకెట్లకు ప్రస్తుతం గిరాకీ పూర్తిగా తగ్గిపోయిందని పలువురు వస్త్ర వ్యాపారులు అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ధరించే ఈ జాకెట్ హాఫ్ స్లీవ్‌తో ఉంటుంది. ‘మా దుకాణంలో ఒకప్పుడు రోజుకు సుమారు 35 జాకెట్లు అమ్ముడుపోయేవి. కానీ ఇప్పుడు వారానికి ఒకటి మాత్రమే అమ్ముతున్నామ’ని స్థానిక వస్త్ర వ్యాపారి ఒకరు చెప్పారు. మరో వ్యాపారి గుర్విందర్ సింగ్ మాట్లాడుతూ జీఎస్టీ, నోట్లరద్దు ప్రభావం ఇతర దుస్తులపై చూపిన విధంగానే ఈ జాకెట్ల అమ్మకాలపై కూడా పడిందని అన్నారు. గుల్మండి, తిలక్ పాత్, ఔరంగ్పురా, సరఫా, ఉస్మాపురా, సిడ్కో ప్రాంతాల్లోని పలువురు వస్త్ర వ్యాపారులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ‘మా దుకాణంలో రెడీమేడ్ వస్త్రాలతోపాటు ఈ జాకెట్లకు సంబంధించిన వస్త్రాన్ని కూడా నిల్వగా పెట్టుకున్నాం. గతేడాది నుంచి 10 జాకెట్ల కంటే ఎక్కువ అమ్మలేదు. దీనిపై నేను పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టాను. కానీ ఎటువంటి లాభం లేద’ని వస్త్ర దుకాణ వ్యాపారి రాజేంద్ర భాస్కర్ చెప్పారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ప్రజలు ఎక్కువగా ఖాదీ, లెనిన్, కాటన్ షర్టులపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని, ఇలాంటి జాకెట్లు ఎవరూ కుట్టించుకోవడం లేదని స్థానికంగా టైలర్ దిలీప్ లోఖండే అన్నారు. -
రుపే కార్డుతో జాకెట్ కొనుగోలు చేసిన ప్రధాని
అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అహ్మదాబాద్ షాపింగ్ ఫెస్టివల్లో జాకెట్‌ను కొనుగోలు చేసి తన రుపే కార్డు ద్వారా చెల్లింపులు జరిపారు. షాపింగ్ ఫెస్టివల్లో కలియతిరిగిన ప్రధాని తనకు ఇష్టమైన ఖాదీ జాకెట్లను విక్రయించే కేవీఐబీ స్టాల్ వద్ద ఆగారు. తాను నిత్యం ధరించే జాకెట్‌ను ఆ స్టాల్లో నుంచి ఒకటి ఎంపిక చేసుకుని నేరుగా రుపే డెబిట్ కార్డు ద్వారా డిజిటల్ పద్ధతిలో బిల్లు చెల్లించారు. ఏటా జరిగే వైబ్రాంట్ గుజరాత్లో భాగంగా అహ్మదాబాద్ షాపింగ్ ఫెస్టివల్‌ను గుజరాత్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారులు తమ ఉత్పత్తులతో ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. 12 రోజుల పాటు జరిగే ఈ షాపింగ్ ఫెస్టివల్లో 15,000 మంది దుకాణదారులు, విక్రేతలు, తయారీదారులు పాల్గొని తమ ఉత్పత్తులను అమ్మకానికి ఉంచుతారు. పలు ఉత్పత్తులపై 60 శాతం వరకూ డిస్కాంట్లను వారు ఆఫర్ చేస్తున్నారు. -
బైక్‌లకే బాద్ షా
‘ఆర్క్’ కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్ ట్రూమన్ ఇదేచెబుతున్నారు.. హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల్లోని హైఫై బైక్‌లకు ఇది ఏమాత్రం తీసిపోదంటున్నారు.. వాళ్లలా బలం రాకపోవచ్చు గానీ.. దీన్ని నడుపుతుంటే.. మనం కూడా సూపర్ హీరోల్లా ఫీలైపోవచ్చని చెబుతున్నారు..మార్క్ చెబుతున్నదాన్ని బట్టి ఇది ప్రపంచంలోనే అత్యాధునికమైన బైక్.. బ్రిటన్‌లోని కోవెంట్రీకి చెందిన ‘ఆర్క్’ కంపెనీలోనిఅత్యున్నత స్థాయి ఇంజనీర్ల బృందం దీన్ని తయారుచేసింది. ఈ బైక్.. దీనితోపాటు వచ్చే హెల్మెట్, జాకెట్ అన్నీ ప్రత్యేకమైనవేనట. ఇంతకీ ఏంటివీటి స్పెషాలిటీ.. ఓ లుక్కేద్దాం హెల్మెట్ ఐరన్ మ్యాన్ సినిమా చూశారా..అందులో హీరో బుర్రకు వేసుకునే హెల్మెట్ తెరపై రూట్ మ్యాప్‌లు ఇలా అన్ని వివరాలు ప్రత్యక్షమవుతుంటాయి. ఇందులో కూడా దాదాపు అలాగే ఉంటుంది. హెల్మెట్‌లో ఉండే బుల్లితెరపై బైక్ వెళ్తున్న వేగం.. వెళ్లాల్సిన ప్రదేశం తాలూకు మ్యాప్ ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు ప్రదర్శితమవుతూ ఉంటుంది. బుర్రతిప్పాల్సిన పని లేకుండా.. వెనకేం జరుగుతోందన్న విషయాన్ని ఇందులో ఉండే కెమెరా తెరపై డిస్ప్లే చేస్తుంది. జాకెట్ హ్యూమన్ మెషీన్ ఇంటర్ఫేస్(హెచ్ఎంఐ)టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. మనం అతి వేగంగాప్రయాణించినా.. డ్రైవింగ్‌లో తేడా ఉన్నా.. బ్రేక్‌లు లేదా బైక్‌లో ఏదైనా లోపాలు ఉన్నట్లు అనిపించినా.. ప్రమాద సంకేతాలుకనిపించినా.. ఇది వెంటనే వైబ్రేట్ అయి అప్రమత్తం చేస్తుంది.అంతేకాదు.. వెళ్తూవెళ్తూ మీకు నచ్చిన పాటలు వినే ఏర్పాటు కూడా ఇందులో ఉంది. బైక్ ఇది ఎలక్ట్రిక్ బైక్.. పర్యావరణ అనుకూలమైనది. తక్కువ బరువుఉండటానికిగానూ చాలా భాగాలను కార్బన్ ఫైబర్‌తో తయారుచేశారు. ఎలక్ట్రిక్ పవర్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. అత్యధిక వేగం గంటకు 193 కిలోమీటర్లు. ఒక్కసారి ఫుల్‌గా చార్జ్ చేస్తే.. 320 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చు. ఫుల్ చార్జింగ్కు 45 నిమిషాలు పడుతుంది. దీన్ని కొన్నవాళ్లకు వాళ్ల ఇంటి వద్దే ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్‌ను కంపెనీ వాళ్లు ఏర్పాటు చేస్తారు. అయితే, దీన్ని డబ్బున్న కామన్ మ్యాన్లే కొనగలరు.. బైక్ ధర రూ.80 లక్షలు! – సాక్షి సెంట్రల్ డెస్క్ -
మోదీ కుర్తాకు యువత ఫిదా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ధరించే కుర్తా–జాకెట్‌కు యువతలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దేశంలోని ఏడు ఖాదీ ఇండియా అవుట్‌లెట్లల్లో కలిపి రోజుకు 1,400కు పైగా మోదీ కుర్తా–జాకెట్లు అమ్ముడవుతున్నాయని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ(కేవీఐసీ) చైర్మన్ వీకే సక్సేనా తెలిపారు. కాగా, ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ వస్త్ర శ్రేణిని ఖాదీ ఇండియా అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరిన్ని అవుట్లెట్లలో వీటిని అమ్మేందుకు ప్రణాళికలు రూపొందిస్తుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ, కోల్కత్తా, జైపూర్, జోథ్‌పూర్, భోపాల్, ముంబై, ఎర్నాకులం ఖాదీ అవుట్లెట్లలో సగటున రోజుకు 200కు పైగా మోదీ ‘కుర్తా–జాకెట్లు’ అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఖాదీని ప్రోత్సహించాలన్న నరేంద్రమోదీ పిలుపు ఇవ్వటంతో ఈ వస్త్రాల అమ్మకాలు పెరిగినట్లు అభిప్రాయపడ్డారు. -
రవికట్టు
చీర కట్టుకుని నడుముకు వడ్డాణం పెట్టుకోవడం పాత పద్ధతి. బ్లౌజ్‌నే బెల్ట్‌గా మార్చేసి చుట్టేయడం నేటి పద్ధతి. రవికను ముడి వేసినట్టుగా... బెల్ట్‌తో పవిటను కట్టేస్తే... ఆ బెల్ట్‌కి ఎంబ్రాయిడరీ సొబగులు అద్దితే... అది ఇలా అందమైన బెల్ట్ బ్లౌజ్‌గా రూపుదిద్దుకుంటుంది. స్టైలిష్ లుక్ ►పైట చెంగుకు 8–10 ఫ్రిల్స్ పెట్టి, భుజం మీదుగా జాకెట్‌కు పిన్‌తో జత చేసి, అదే జాకెట్ బెల్ట్ పెట్టేసుకుంటే సరి. ఎలా సెట్ చేసిన ఫ్రిల్స్ అలాగే ఉంటాయి. సౌకర్యంగా ఉంటుంది. లుక్స్‌లో వచ్చిన స్టైలిష్ మార్పుకు వేడుకలో ఎక్కడా ఉన్నా బ్రైట్‌గా వెలిగిపోతారు. ►జాకెట్టు మాత్రమే కాదు బెల్ట్కూ ఎంబ్రాయిడరీ చేసి, ఇలా పైట కొంగుమీదుగా తొడిగేస్తే సరి. అలంకరణ పూర్తయినట్టే. ట్రెండ్‌లో ఉన్నారన్న కితాబులూ సొంతం అవుతాయి. ►ప్లెయిన్ శారీకి బెల్ట్ బ్లౌజ్ ప్రత్యేక ఆకర్షణ ►కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యాటర్న్ ఎంపిక చేసుకోవాలి. దానితో పాటు బ్లౌజ్‌కి సన్నని బెల్ట్నీ అదే రంగు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేయించుకోవాలి. ►చిన్న ప్రింట్లు లేదా ప్లెయిన్ శారీకి ఎంబ్రాయిడరీ బెల్ట్ బ్లౌజ్ అక్కర్లేదు. ఫ్లోరల్ ప్రింట్ బెల్ట్ బ్లౌజ్ తీసుకుంటే చాలు. ఫ్యాషన్ వేదికలైనా, సంప్రదాయ వేడుకైనా స్పెషల్‌గా కనిపిస్తారు ►లాంగ్ బ్లౌజ్‌కి బెల్ట్ హంగుగా అమరితే సాదా చీర అయినా సరికొత్త స్టైల్‌తో మెరిసిపోతుంది. –కీర్తిక, డిజైనర్, హైదరాబాద్ -
రొమ్ము కేన్సర్ గుర్తించేందుకు జాకెట్
రొమ్ము కేన్సర్ గుర్తింపునకు సంప్రదాయ మమోగ్రఫీ కంటే చౌకైన పద్ధతిని తమ సంస్థ సిద్ధం చేసిందని సీమెట్ డైరెక్టర్ జనరల్ ఎన్.ఆర్.మునిరత్నం తెలిపారు. రొమ్ము కేన్సర్‌ను గుర్తించేందుకు జాకెట్ ఆకారంలో ఉండే ఓ పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు ’సాక్షి’కి తెలిపారు. రొమ్ము కేన్సర్ గుర్తించేందుకు ఉపయోగించే మమోగ్రఫీ కోసం ప్రత్యేక యంత్రాలు అవసరమవుతాయని.. వీటి కొనుగోలు, నిర్వహణలకూ భారీగా ఖర్చు అవుతుందని చెప్పారు. దీనికంటే ఎన్నో రెట్లు తక్కువ ఖర్చుతోనే తమ జాకెట్ రొమ్ము కేన్సర్ కణతులను గుర్తించగలదని వివరించారు. కేరళలోని త్రిశూర్‌లో ఇప్పటికే 200 మందిపై పరీక్షించి కచ్చితమైన ఫలితాలు సాధించామన్నారు. కార్యక్రమంలో నార్త్ కరొలీనా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ విక్టర్ వెలియాడిస్, ఐఐసీటీ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, సీమెట్ హైదరాబాద్ డైరెక్టర్ రతీశ్ పాల్గొన్నారు. -
జాకెట్ రగడపై సిద్ధూ కామెంట్స్
సాక్షి, న్యూఢిల్లీ : రాహుల్ ధరించిన జాకెట్‌పై కాంగ్రెస్, బీజేపీల వాగ్వాదం కొనసాగుతుంటే ఈ వివాదంపై పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ రాహుల్‌ను వెనుకేసుకొచ్చారు. కీలకమైన పదవిలో ఉన్నా సాధారణ జీవితం గడిపేందుకే రాహుల్ ఇష్టపడతారని తమ పార్టీ చీఫ్‌ను సిద్ధూ సమర్ధించారు. రాహుల్ గాంధీ రూ 70,000 విలువైన జాకెట్ ధరించారని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను సిద్ధూ తోసిపుచ్చుతూ రాహుల్ జాకెట్ కొంటున్నప్పుడు వారు బిల్లును చెక్ చేశారా అని ప్రశ్నించారు. బిల్లును చూడకుండా దాని ధర వారికెలా తెలిసిందని నిలదీశారు. మరోవైపు రాహుల్ జాకెట్ రూ 70,000 విలువైనదన్న బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి తోసిపుచ్చారు. రూ 700కే ఇలాంటి జాకెట్స్‌ను తాను చూపిస్తానని ఆమె సవాల్ విసిరారు. మేఘాలయాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ధరించిన జాకెట్‌పై బీజేపీ నేతలు సెటైర్లు వేశారు. రాహుల్ ధరించిన బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ బుర్బెరీ జాకెట్ ఖరీదు బ్లూమింగ్డేల్స్ వెబ్సైట్లో రూ 68,145గా ఉండటంతో బీజేపీ నేతలు ఈ ప్రచారం చేపట్టారని చెబుతున్నారు. -
ఆ జాకెట్ 70వేలా.. 700లకే కొనిస్తా!
-
హహ్హహా.. ఆ జాకెట్ 70వేలా.. 700లకే కొనిస్తా!
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ సర్కారుపై ‘సూటు-బూటు’ సర్కారు అంటూ విమర్శలు చేసే రాహుల్ గాంధీ ఏకంగా రూ. 70వేలు ఖరీదు చేసే జాకెట్‌ను తొడుక్కున్నారని బీజేపీ చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. రాహుల్ జాకెట్ విషయంలో బీజేపీ చేస్తున్న విమర్శలను తేలికగా కొట్టిపారేసింది. ఆ జాకెట్ రూ. 70 వేలు.. రూ. 700లకు సైతం దొరుకుతుంది.. కావాలంటే ప్రధాని మోదీకి కొనిస్తామని వేలాకోళం చేసింది. రాహుల్ ఖరీదైన జాకెట్ వేసుకున్నారని బీజేపీ చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరీ ఈ మేరకు స్పందించారు. బీజేపీ ఆరోపణలపై మీడియా ప్రశ్నించగానే.. రేణుక అమాంతం నవ్వేశారు. బీజేపీ నిస్పృహకు ఈ ఆరోపణలు అద్దం పడుతున్నాయని, కొందరు వ్యక్తులు ఆన్లైన్లో వెతికి.. ఇలా రేట్లు ఊహించుకుంటున్నారని విమర్శించారు. అదే జాకెట్ రూ. 700లకే దొరుకుతుందని, కావాలంటే ప్రధాని మోదీకి పంపిస్తామని, 56 ఇంచుల ఛాతి అంటూ పేర్కొనే మోదీ కొలతలు తమకు తెలియదని ఆమె చెప్పుకొచ్చారు. మంగళవారం షిల్లాంగ్‌లో జరిగిన ఓ సంగీత కార్యక్రమానికి రాహుల్ గాంధీ ఓ ఖరీదైన జాకెట్‌ను ధరించి హాజరయ్యారు. దీన్ని తమకు అవకాశంగా మలుచుకున్న బీజేపీ మేఘాలయ విభాగం ట్విటర్లో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. దాదాపు 70 వేల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ జాకెట్ ధరించారని ట్విటర్లో ఫొటోలు పోస్ట్ చేసింది. మేఘాలయ ప్రజల గురించి పట్టించుకోకుండా, రాష్ట్రంలో ఉన్న అసమర్థ సర్కారుకు వంతపాడతారా అని రాహుల్‌ను ప్రశ్నించింది. రాహుల్ చూపిస్తున్న పక్షపాతం మేఘాలయ ప్రజలను వెక్కిరిస్తున్నట్టుగా ఉందని ధ్వజమెత్తింది. -
రాహుల్ లగ్జరీ జాకెట్‌పై విసుర్లు
షిల్లాంగ్: మేఘాలయ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ దాడి మొదలుపెట్టింది. ‘సూటు బాటు సర్కారు’ అంటూ గతంలో మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన రాహుల్‌పై ఎదురుదాడికి దిగింది. మంగళవారం షిల్లాంగ్‌లో జరిగిన సంగీత కార్యక్రమానికి ఖరీదైన జాకెట్ ధరించి ఆయన హాజరయ్యారు. దీన్ని తమకు అవకాశంగా మలుచుకుని బీజేపీ మేఘాలయ విభాగం ట్విటర్లో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. దాదాపు 70 వేల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ జాకెట్ ధరించారని ట్విటర్లో ఫొటోలు పోస్ట్ చేసింది. మేఘాలయ ప్రజల గురించి పట్టించుకోకుండా, రాష్ట్రంలో ఉన్న అసమర్థ సర్కారుకు వంతపాడతారా అని ప్రశ్నించింది. రాహుల్ చూపిస్తున్న పక్షపాతం మేఘాలయ ప్రజలను వెక్కిరిస్తున్నట్టుగా ఉందని బీజేపీ విమర్శించింది. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ. 11 లక్షల ఖరీదైన సూట్ ధరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలు మోదీపై విమర్శలకు దిగాయి. తర్వాత ఆ సూట్‌ను వేలంలో రూ. 4.31 కోట్లకు విక్రయించారు. కాగా, 60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీకి నాగాలాండ్‌తో పాటు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3న ఫలితాలు వెలువడతాయి. So @OfficeOfRG , soot(pun intended!)-boot ki sarkar with ‘black’ money fleeced from Meghalayan State exchequer by rampant corruption? Instead of singing away our woes, you could have given a report card of your inefficient govt in Meghalaya! Your indifference mocks us! pic.twitter.com/sRvj5eoyRb — BJP Meghalaya (@BJP4Meghalaya) January 30, 2018 -
ప్రధానికి 56 అంగుళాల జాకెట్!
జవాన్లపై దురాగతాలకు నిరసనగా పంపిన మాజీ జవాన్ భార్య ఫతేహాబాద్: భారత సైనికులపై దాడుల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మాజీ సైనికుడి భార్య ప్రధాని మోదీకి లేఖ రాస్తూ దానితో పాటు మహిళలు ధరించే 56 అంగుళాల జాకెట్‌ను పంపారు. తనకు 56 అంగుళాల ఛాతీ ఉందని ప్రధాని పలుమార్లు చెప్పడం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే భారత సైనికులపై దాడి చేయడానికి పాక్ జంకుతుందన్న 2014 ఎన్నికల నాటి బీజేపీ హామీనీ ఆ మహిళ ప్రస్తావించారు. తన భార్య సుమన్రాసిన ఆ లేఖను, జాకెట్‌ను మాజీ సైనికుడు ధరమ్వీర్ సింగ్ ఫతేహాబాద్ జిల్లా సైనిక్ బోర్డుకు అందజేశారు. ‘మన సైనికులను కొడుతున్న, రాళ్ల దాడికి గురవుతున్నట్లు చూపుతున్న వీడియోలు వెలుగుచూశాయి. 2014 ఎన్నికల సమయంలో.. .హేమరాజ్ లాగా మరో సైనికుడు శిరచ్ఛేదానికి గురికాడని అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మహిళలు తమ పిల్లలు, సోదరులను దేశాన్ని కాపాడటానికి సరిహద్దుల్లోకి పంపుతున్నారు. రాళ్ల దాడికి గురవడానికో, శిరచ్ఛేదనానికో కాదు. ఆ 56 అంగుళాల ఛాతీ ఎక్కడికి పోయింది?’ అని లేఖలో ప్రశ్నించారు.