
సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సొంతగా ఎదిగిన వారు అనేక మంది ఉన్నారు. అలా బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న వారిలో రాజ్ కుమార్ రావు ఒకరు. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన రాజ్ కుమార్ కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ తానేంటో నిరూపించుకున్నాడు.
Rajkummar Rao Says He Bought A Jacket From Chor Bazaar: సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సొంతగా ఎదిగిన వారు అనేక మంది ఉన్నారు. అలా బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న వారిలో రాజ్ కుమార్ రావు ఒకరు. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన రాజ్ కుమార్ కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'హిట్: ది ఫస్ట్ కేస్'. జులై 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి విజయంతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఆర్థిక విషయాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు రాజ్ కుమార్ రావు.
'పదో తరగతి పూర్తయిన తర్వాత ఫేర్‌వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో మా కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందిపడేది. కానీ, అదిరిపోయే డ్రెస్‌తో పార్టీకి వెళ్లాలని ఉండేది. అంతేకాకుండా ఆ పార్టీలో నా ఫ్రెండ్స్‌తో కలిసి నేను డ్యాన్స్ కూడా చేయాలి. అందుకే అప్పుడు నేను దిల్లీలోని చోర్ బజార్‌కు వెళ్లి రూ. 100 పెట్టి జాకెట్ కొనుక్కున్నా. అలాగే రూ. 15తో మెడలో చైన్ కొని పార్టీకి వెసుకుని వెళ్లా' అని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు ఈ హీరో.
చదవండి: అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో వైరల్..
మరణాన్ని ముందే ఊహించిన నటుడు !.. చివరి పోస్ట్ వైరల్
అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్