అప్పు చెల్లించలేదని.. ఏసీపీ కుమారుడి హత్యచేసిన స్నేహితులు |Delhi ACP Son Was Taken To A Wedding And Killed By Friends Over Money Dispute, One Arrested - Sakshi
Sakshi News home page

Delhi ACP Son Murder Case: అప్పు చెల్లించలేదని.. ఏసీపీ కుమారుడి హత్య.. స్నేహితులే తీసుకెళ్లి!

Published Sat, Jan 27 2024 3:30 PM | Last Updated on Sat, Jan 27 2024 3:49 PM

Delhi ACP Son Was Taken To A Wedding, Then Killed Over A Loan - Sakshi

న్యూఢిల్లీ: పోలీస్ ఉన్నతాధికారి కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆర్ధిక వివాదాల నేపథ్యంలో స్నేహితులే అతన్ని కుట్ర పన్ని అంతమొందించారు. పెళ్లికి తీసుకెళ్లి... తిరిగిరాని లోకాలకు పంపించారు. 

ఢిల్లీ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ యశ్‌పాల్ సింగ్‌కు 24 ఏళ్ల కుమారుడు  లక్ష్య చౌహాన్ ఉన్నాడు.ఇతడు తీస్ హజారీ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. సోమవారం తన స్నేహిలు వికాస్ భరద్వాజ్, అభిషేక్‌లతో కలిసి హర్యానాలోని సోనేపట్‌లో జరిగిన వివాహ వేడుకకు ముగ్గురు హారయ్యారు.. ఆ తర్వాత లక్ష్య చౌహాన్‌ తిరిగి ఇంటికి  రాలేదు.

కంగారు పడిన తండ్రి ఎసీపీ అధికారి యశ్‌పాల్ సింగ్ తన కుమారుడు మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లక్ష్యతో కలిసి కారులో వెళ్లిన స్నేహితుడు అభిషేక్‌నును అదుపులోకి తీసుకొచిన విచారించగా  అసలు విషయం చెప్పాడు. వికాస్‌ భరద్వాజ్‌, లక్షయ్‌, తాను ముగ్గురం కలిసి కారులో సోనెపట్‌కు వెళ్లామని, వివాహం అనంతరం అదేరోజు రాత్రి ఇంటికి బయలుదేరామని చెప్పాడు.
చదవండి: ఆర్టీసీ బస్సును ఢీకొన్న కూలీలతో వెళ్తున్న ఆటో.. ముగ్గురు దుర్మరణం

మార్గంమధ్యలో పానిపట్‌ దగ్గర మునక్‌ కాలువ వద్ద మూత్రవిసర్జన కోసం కారు ఆగినట్లు  తెలిపాడు. ఈ సందర్భంగా భరద్వాజ్‌, తాను కలిసి చౌహాన్‌ను కాలువలోకి తోసినట్లు పోలీసులకు చెప్పాడు. అనంతరం అదే కారులో వికాస్‌ తనని ఢిల్లీ సమీపంలోని నెరెలా వద్ద విడిచిపెట్టాడని తెలిపాడు. దీంతో కాలువలో గాలించి చౌహాన్‌ మృతదేహాన్ని వెలికితీశారు. పరారీలో ఉన్న భరద్వాజ్‌ కోసం పోలీసులు వెతుకున్నారు.

నిందితుడు వికాస్‌ భరద్వాస్‌ కూడా తీస్‌ హజారీ కోర్టులోనే క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. వికాస్‌ గతంలో లక్షయ్‌కు కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. తిరిగి ఇవ్వమంటే లక్షయ్‌ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో కక్ష పెంచుకున్న వికాస్‌ అతడిని హత్య చేసేందుకు పథకం పన్నాడు. మరో స్నేహితుడు అభిషేక్‌ను ఇందుకు ఉపయోగించుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై ఐపీసీ 302, 201 కింద సెక్షన్లు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement