న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన వెలుగులోకి వచ్చిన నెల రోజులు సమీపిస్తున్నా నిత్యం సంచలన విషయాలు తెరమీదకు వస్తున్నాయి. యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘోర ఈ దారుణ ఘటనలో నిందితుడి ఆఫ్తాబ్‌ను పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న అఫ్తాబ్ రోజుకో కొత్త విషయాలను చెప్పి షాక్‌లా మీద షాక్‌లు ఇస్తున్నాడు. తాజాగా మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తిని శ్రద్ధా కలిసినందుకే తనను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు.
బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా శ్రద్ధాకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడిందని, మే 17న అతన్ని గురుగ్రామ్‌లో కలవడానికి వెళ్లిందని తెలిపాడు. ఆరోజంతా అతనితోనే గడిపి మరుసటి రోజు(మే 18న) మధ్యాహ్నం మెహహ్రోలీలో ఉంటున్న తన ఫ్లాట్‌కు తిరిగి వచ్చిందని పేర్కొన్నాడు. ఈ విషయంపై ఆరోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. గొడవ పెద్దదవడంతోనే ఆమెను చంపినట్లు పేర్కొన్నాడు. అఫ్తాబ్ చెబుతుంది నిజమా? కాదా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల కోసం బంబుల్ యాప్‌కు పోలీసులు లేఖ రాశారు. అలాగే శ్రద్దా వాకర్ ఫోన్ కాల్స్, లొకేషన్ టవర్ డేటాను పరిశీలిస్తున్నారు.
చదవండి: ‘ఇండియాలోని అత్తమామలు ఐఫోన్లు గిఫ్ట్ ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారు’
అంతకుముందే విచారణలో శ్రద్ధాతో బ్రేకప్ చేసుకున్నట్లు, ఆమెతో సహజీవనం చేయడంలేదని అఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు. అప్పటి నుంచి వారు కేవలం ఫ్లాట్‌మెట్స్‌లా కలిసి ఉంటున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఆఫ్తాబ్ తీహార్ జైలులో ఉన్నాడు. మరో రెండు రోజుల్లో అతని జ్యూడిషియల్ కస్టడీ ముగియనుంది. ఇప్పటి వరకు అఫ్తాబ్ కుటుంబ సభ్యులెవరూ అతన్ని కలవడానికి జైలుకు రాలేదని అధికారులు తెలిపారు.
ఇన్ని రోజులు సెల్‌లో ఒంటరిగానే ఉండేవాడని, లేదంటే పుస్తకాలు చదవడం, కొన్నిసార్లు తోటి ఖైదీలతో చెస్ ఆట ఆడేవారని పేర్కొన్నారు. మరోవైపు డీఎన్‌ఐ అనాలసిస్, పాలిగ్రాఫ్, నార్కో టెస్ట్ రిపోర్ట్స్ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అవన్నీ ఢిల్లీ పోలీసులకు అందిచనున్నట్లు ఫోరెన్సిక్ అధికారి ఒకరు తెలిపారు.
చదవండి: పిల్లలే దూరమైతే నా బతుకెందుకు..!
Comments
Please login to add a commentAdd a comment