Shraddha
-
ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్!
ప్రముఖ నటి శ్రద్ధా ఆర్య అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 2021లో నావీ అధికారి రాహుల్ నాగల్‌ను ఈ బాలీవుడ్ భామ పెళ్లి చేసుకుంది. తొలిసారి గర్భం ధరించిన విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఇది తెలుసుకున్న బాలీవుడ్ తారలు, అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.కాగా.. ఢిల్లీకి చెందిన శ్రద్ధా ఆర్య 2006లో కల్వనిన్ కదాలి అనే తమిళ సినిమాలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ నిశ్శబ్ద్ చిత్రంలో నటించింది. తెలుగులో 2007లో కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన గొడవ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత రోమియో, కోతిమూక లాంటి టాలీవుడ్ సినిమాల్లో కనిపించింది. తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. బాలీవుడ్లో చివరిసారిగా రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ మూవీలో మెరిసింది. అంతేకాకుండా హిందీలో పలు సీరియల్స్‌తో శ్రద్ధా ఆర్య గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Shraddha Arya (@sarya12) -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
తృటిలో తప్పించుకున్నాం!
చావు నుంచి తృటిలో తప్పించుకున్నామని చెబుతున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. అసలు విషయం ఏంటంటే... ఇటీవల ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు రష్మికా మందన్నా ఓ విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ విమానంలోనే మరో హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా ఉన్నారు. అయితే విమానం టేకాఫ్ అయిన అరగంటలోపే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి ముంబైలోనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఆందోళనకరమైన ఘటనను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు రష్మికా మందన్నా. ‘చావు నుంచి మేం తృటిలో తప్పించుకున్నాం’ అనే క్యాప్షన్‌తో శ్రద్ధాదాస్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు రష్మికా మందన్నా. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. కాగా ఇదే ఘటనపై హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా స్పందించారు. ‘‘విమానంలో వందమందికిపైగా ప్రయాణికులున్నారు. మేం దాదాపు చనిపోతామనే భావన కలిగింది. కానీ, పైలెట్ సరైన నిర్ణయం తీసుకుని అత్యవసర ల్యాండింగ్ చేశారు’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు శ్రద్ధాదాస్. -
నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్
మరో ప్రముఖ హీరోయిన్ పెళ్లి చేసుకుంది. నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్ల తర్వాత వివాహం జరగడం ఇక్కడ ట్విస్ట్. ఓ అవార్డ్ విన్నింగ్ సినిమాతో చాలా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. గతేడాది తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె పెళ్లి విషయం తెలిసి అందరూ ఈమెని అభినందిస్తున్నారు. అలానే ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరీ బ్యూటీ? ఏంటా పెళ్లి కహానీ? (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) గుజరాతీ నటి శ్రద్ధా దంగర్.. 2017లో 'పప్పా తమ్నే నహీ సమ్జే' అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పలు సినిమాల్లో హీరోయిన్గా చేస్తూ వచ్చింది. 2018లో మాత్రం ఈమె యాక్ట్ చేసిన 'హెల్లరో' అనే చిత్రానికి గానూ ఈమెకు అవార్డు వచ్చింది. అలా మిగతా భాషా ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమైంది. కేవలం గుజరాతీ భాషలోనే మూవీస్ చేస్తూ వస్తున్న ఈమె.. గతేడాది తెలుగులో వచ్చిన 'మ్యాన్షన్ 24' అనే వెబ్ సిరీస్‌లో రజియా అనే పాత్రలో కనిపించింది. పెళ్లి విషయానికొస్తే శ్రద్ధా దంగర్.. 2020 జనవరిలో నటుడు ఆకాశ్ పాండ్యతో నిశ్చితార్థం చేసుకుంది. ఏమైందో ఏమో గానీ వీళ్ల పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు సరిగ్గా జనవరి చివరలోనే వివాహంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం శ్రద్ధా-ఆకాశ్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) View this post on Instagram A post shared by Tejas Thakor 🇮🇳 (@tejas_yours) -
గురు వాక్యస్య... !!!
వాగ్గేయకారులలో గమనించవలసిన ఒక గొప్ప లక్షణం– వారిలోని గురుభక్తిని. అది లేకుండా సనాతన ధర్మంలో ఏ వ్యక్తీ పరిఢవిల్లలేదు. పుస్తకజ్ఞానం ఎంత ఉన్నా గురుముఖతః నేర్చుకున్నదేదో అది మాత్రమే అభ్యున్నతికి కారణమవుతుంది. ‘శ్రద్థ’ అని మనకు ఒక మాట ఉంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం– అంటారు గీతాచార్యులు. ఆ శ్రద్ధ ఎవరికి ఉన్నదో వారికి మాత్రమే జ్ఞానం కలుగుతుంది–అని. శ్రద్ధ అన్న మాటకు శంకరభగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తూ.. ‘‘శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధ్యవధారణమ్’ సాశ్రద్ధా కథితా సద్భిర్యాయా వస్తూపలభ్యతే’’.. అంటారు. శాస్త్రం చెప్పిన విషయం తిరుగులేని సత్యం... అన్న నమ్మకం ఉండాలి. కలడుకలండనెడువాడు కలడోలేడో...’ అన్న అనుమానం దగ్గరే ఉండిపోకుండా ‘భగవంతుడు ఉన్నాడు. శాస్త్రం చెప్పిన విషయం పరమ సత్యం..అని నమ్మాలి. ఆ పైన గురువాక్యస్య.. అంటే గురువుగారి నోటివెంట ఏది వచ్చిందో అది సత్యం. గురువుగారి నోటి వెంట వచ్చినది సత్యమయ్యేట్లు చూడవలసిన కర్తవ్యం భగవంతుడు తీసుకుంటాడు. అందుకే యోగివాక్కు అంటారు. యోగి వాక్కు అంటే – గురువుగారు సత్యం చెప్పారు.. అని కాదు .. గురువుగారు చెప్పినది సత్యం... అని అన్వయం చేసుకోవాలి. అంటే అంత తిరుగులేని విశ్వాసం ఉండాలి. అందుకే గురు విషయంలో స్థాన శుశ్రూష అంటారు. మనం ఉంటున్న ఇంటిని, మనం కొలిచే దేవుడు ఉండే దేవాలయాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అలా గురువుగారుండే ప్రదేశాన్ని కూడా శిష్యులు శుభ్రం చేస్తూ గురువుగారికి సౌకర్యంగా ఉండేటట్లు చూస్తుంటారు. ఈ కంటితో చూడలేని పరబ్రహ్మం సశరీరంతో... అంటే మనలాగా కాళ్ళూచేతులతో, ఇతరత్రా మనలాగే నడిచివెడితే అదే గురువు. ‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మైశ్రీగురువేనమః’–అని. గురువే బ్రహ్మ. గురువు మనలోని జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. అందుకని సృష్టికర్త. గురుర్విష్ణుః..అంటే శ్రీమహావిష్ణువు స్థితికారుడై ఏ విధంగా ఈ సృష్టినంతటినీ నిలబెడుతున్నాడో అలా జ్ఞానాన్ని, భక్తిని పతనం కాకుండా గురువు కాపాడుతుంటాడు. అందుకని విష్ణువు. గురుర్దేవో మహేశ్వరః.. మహేశ్వరుడు ఎలా లయకారుడో అట్లా అజ్ఞానాన్ని గురువు లయం చేసి జ్ఞానాన్ని ఇచ్చి నిలబెడుతుంటాడు. అందుకే గురువు పరబ్రహ్మము. అటువంటి గురువుకు... తస్మైశ్రీగురవేనమః. ... నమస్కరించుచున్నాను. ఈ లోకంలో గురువుగారికి ప్రత్యుపకారం చేయడం కానీ, గురువుగారిని సత్కరించడం కానీ, గురువుగారికి మనం పదేపదే కృతజ్ఞతలు చెప్పడం కానీ సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి గురువు విషయంలో కృతజ్ఞత గా చెయ్యగలిగినది ఒక్కటే– రెండు చేతులు కలిపి జోడించి శిరస్సు తాటించి నమస్కరించడం మాత్రమే. అది గురువుపట్ల చెదరిపోని నమ్మకంతో చేయాలి.. అది వాగ్గేయకారులందరూ చేశారు. కాబట్టే మహాత్ములయ్యారు. -
Shradha Khapra: సలహాల అక్క
శ్రద్ధా కాప్రాను అందరూ ‘మైక్రోసాఫ్ట్ వాలీ దీదీ’ అని పిలుస్తారు. శ్రద్ధ బంగారంలాంటి మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని వదిలేసింది. ‘యువత కెరీర్ కోసం గైడెన్స్ అవసరం’ అని ‘అప్నా కాలేజ్’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. రెండేళ్లలో 40 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ జీతం కన్నా ఎన్నో రెట్ల ఆదాయం శ్రద్ధకు వస్తోంది. ఏ కోర్సు చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి లాంటి సలహాలు ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగినట్టు ఇవ్వడమే శ్రద్ధ సక్సెస్‌కు కారణం. ‘హరియాణలోని చిన్న పల్లెటూరు మాది. మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగైనా నేను ఏం చదవాలో గైడ్ చేయడం ఆయనకు తెలియదు. టీచర్లు కూడా గైడ్ చేస్తారనుకోవడం అంత కరెక్ట్ కాదు. ఇప్పటికీ కాలేజీ స్థాయి నుంచి యువతకు తమ కెరీర్ పట్ల ఎన్నో డౌట్లు ఉంటాయి. వారికి గైడెన్స్ అవసరం. ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుని గైడ్ చేయాలి. నేను కొద్దోగొప్పో చేయగలుగుతున్నాను కాబట్టే ఈ ఆదరణ’ అంటుంది శ్రద్ధా కాప్రా. ఈమెకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు ఈనాటి కాలేజీ విద్యార్థుల్లో. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌లో. వీరంతా శ్రద్ధను ‘శద్ధ్రా దీదీ’ అని,‘మైక్రోసాఫ్ట్ వాలీ దీదీ’ అని పిలుస్తారు. ఆమె చేసే వీడియోలను వారు విపరీతంగా ఫాలో అవుతారు. ఆ వీడియోల్లో ఆమె చెప్పే సలహాలను వింటారు. డాక్టర్ కాబోయి... శ్రద్ధ తన బాల్యంలో టీవీలో ఒక షో చూసేది. అందులో డాక్టర్లు తాము ఎలా క్లిష్టమైన కేసులు పరిష్కరించారో చెప్పేవారు. ఆ షో చూసి తాను డాక్టర్ కావాలనుకుని ఇంటర్లో ‘పిసిఎంబి’ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్, బయాలజీ) తీసుకుంది. కాని జూనియర్ ఇంటర్ పూర్తయ్యే సరికి డాక్టర్ కావడం చాలా కష్టమని అర్థమైంది. అందుకే మేథ్స్వైపు దృష్టి సారించింది. ‘చిన్నప్పటి నుంచి రకరకాల పోటీ పరీక్షలు ఎక్కడ జరిగినా రాసేదాన్ని. ఇంటర్ అయ్యాక ఎంట్రన్స్‌లు రాస్తే ర్యాంక్ వచ్చింది. కాని ఏ బ్రాంచ్ ఎన్నుకోవాలో తెలియలేదు. వరంగల్ ఎన్.ఐ.ఐ.టి.లో సివిల్‌కు అప్లై చేస్తే సీట్ వచ్చింది. సివిల్ ఎందుకు అప్లై చేశానో నాకే తెలియదు. అయితే దాంతో పాటు ఎన్.ఎస్.ఐ.టి. (నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ద్వారకా)లో కంప్యూటర్ సైన్స్ అప్లై చేస్తే ఆ సీటు కూడా వచ్చింది. దీనికంటే అదే మెరుగనిపించి కంప్యూటర్ సైన్స్ చదివాను’ అని తెలిపింది శ్రద్ధ. ఉద్యోగం, టీచింగ్ చదువు చివరలో ఉండగానే హైదరాబాద్ మైక్రోసాఫ్ట్‌లో ఇన్టెర్న్ వచ్చింది శ్రద్ధకు. అది పూర్తయ్యాక ఉద్యోగమూ వచ్చింది. అయితే శ్రద్ధ ఇన్టెర్న్ చేస్తున్నప్పటి నుంచే గచ్చిబౌలిలో కంప్యూటర్ కోర్సులను బోధించసాగింది. ఉద్యోగం వచ్చాక కూడా కంప్యూటర్ కోర్సులకు ఫ్యాకల్టీగా పని చేసింది. ‘ఉద్యోగంలో కంటే ఎవరి జీవితాన్నయినా తీర్చిదిద్దే బోధనే నాకు సరైందనిపించింది. అదే సమయంలో యూట్యూబ్ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులకు పాఠాలు చెప్పడం, కోర్సులు తెలియచేయడం, వారి స్కిల్స్ పెరిగేలా గైడ్ చేయడం అవసరం అనుకున్నాను. మైక్రోసాఫ్ట్‌లో నాది మంచి ఉద్యోగం. కాని ఏదైనా కొత్తగా చేయాలనుకోవడం కూడా మంచిదే అని జాబ్‌కు రిజైన్ చేశాను’ అంది శ్రద్ధ. అప్నా కాలేజ్ శ్రద్ధ ‘అప్నా కాలేజ్’ పేరుతో యూట్యూబ్ చానల్ తెరిచింది. ఇంటర్ స్థాయి నుంచి విద్యార్థులకు ఏయే కోర్సులు చదివితే ఏం ఉపయోగమో, ఏ ఉద్యోగాలకు ఇప్పుడు మార్కెట్ ఉందో, ఆ ఉద్యోగాలు రావాలంటే ఏ కోర్సులు చదవాలో తెలిపే వీడియోలు చేసి విడుదల చేయసాగింది. 2020లో ఈ చానల్ మొదలుపెడితే ఇప్పుడు 40 లక్షల మంది సబ్స్క్రయిబర్లు తయారయ్యారు. కోట్లాది వ్యూస్ ఉంటాయి. అందుకు తగ్గట్టుగా లక్షల్లో శ్రద్ధ ఆదాయం ఉంది. ‘ముప్పై ఏళ్ల క్రితం డిగ్రీల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేవారు. ఎందుకంటే డిగ్రీలు తక్కువ ఉండేవి. ఇవాళ డిగ్రీలు అందరి దగ్గరా ఉన్నాయి. కావాల్సింది స్కిల్స్. ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు ముందుకు దూసుకెళ్లవచ్చు. నా వీడియోలు ఆ మార్గంలో ఉంటాయి’ అని తెలిపింది శ్రద్ధ అలియాస్ సలహాల అక్క. -
ముంబై హత్య కేసు: విచారణలో షాకింగ్ ట్విస్ట్..శ్రద్ధా ఘటన స్ఫూర్తితోనే చేశా!
ముంబైలో శ్రద్ధావాకర్ హత్యోదంతం తరహాలో జరిగిన మరో ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ మేరకు మహారాష్ట్రలోని థానేలో 56 ఏళ్ల మనోజ్ సానే అనే వ్యక్తి ప్రియురాలు సరస్వతి వైద్యను చంపి ముక్కలు చేసి, వాసన రాకుండా కుక్కరలో ఉడకబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నిందితుడి మనోజ్ సానేని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన దర్యాప్తులో బాధితురాలి సరస్వతి వైద్య గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె అహ్మద్‌నరగ్‌లోని జాంకీబాయి ఆప్టే బాలికాశ్రమంలో పెరిగినట్లు తేలింది. ఆమె తన అంకుల్ ముంబైలో ఉంటారని అతనితోనే ఉంటానని చెప్పేదని ఆ బాలికాశ్రమంలో పనిచేసే మహిళ చెబుతోంది. సరస్వతి చివరిసారిగా రెండేళ్ల క్రితం అనాథశ్రమాన్ని సందర్శించిందని, అప్పుడు ఆమె చాలా సంతోషంగానే కనిపించిందని వెల్లడించింది. ఇక మనోజ్ సానే ఆమెను పెళ్లి చేసుకోలేదు. అతనికి ముంబైలోని బోరివాలిలో ఒక ఇల్లు ఉందని అక్కడ అతని కుటుంబ సభ్యులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కానీ అతను తన కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. మనోజ్ సాన్ బోరివలిలోని ఓ కిరాణ దుకాణంలో పనిచేసేవాడని, అక్కడకి సదరు బాధితురాలు తరుచు వచ్చేదని పోలీసులు పేర్కొన్నారు. 2014 నుంచి వీరి మధ్య స్నేహం మొదలైందని ఆ తర్వాత 2016 నుంచి మీరా రోడ్డులోని ఫ్లాట్‌కు తీసుకుని సహజీవనం ప్రారంభించినట్లు వెల్లడించారు. చాలాకాలంగా కలిసే ఉంటున్నట్లు తెలిపారు. ఐతే గత కొద్ది రోజులుగా వీరి ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు గమనించి తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో తాము నిందితుడు మనోజ్‌సానే అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. విచారణలో నిందితుడు..ఆమె నాకు కూతురు లాంటిది!.. విచారణలో మనోజ్ సాన్ చెప్పిన విషయాలు విని పోలీసులు కంగుతిన్నారు. తాను హెచ్ఐవీ బాధితుడునని, చాలా ఏళ్ల క్రితమే ఈ వ్యాధి బారిన పడినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే బాధితురాలు సరస్వతితో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. ఆమె తనకు కూతురు లాంటిదంటూ షాకింగ్ విషయాన్ని చెప్పాడు. సరస్వతి పదోతరగతి పరీక్షలు రాయాలనుకుందని, ఇందుకోసం ఆమెకు గణిత పాఠాలు చెప్పేవాడనని తెలిపాడు. ఐతే ఆమె తాను ఆలస్యంగా ఇంటికి వచ్చినా అనుమానించేదని చెప్పాడు. ఐతే జూన్ 3వ తేదిన తాను ఇంటికి వచ్చేసరికి ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో తాను కేసులో ఇరుక్కుంటానేమోనన్న భయం వేసి ఇలా చేశానని వెల్లడించాడు. తాను ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య గురించి తెలుసుకుని ఇలా చేసినట్లు పోలీసులకు వివరించాడు. ఇదిలా ఉండగా, నిందితుడి ఇంటిలో లభించిన బాధితురాలి శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, జూన్ 17 వరకు నిందితుడు తమ కస్టడిలోనే ఉంటాడని పోలీసులు వెల్లడించారు. --ఆర్ లక్ష్మీ లావణ్య, వెబ్ డెస్క్ (చదవండి: ముంబైలో నరరూప రాక్షసుడు..ప్రియురాలిని హతమార్చి.. ఆపై కుక్కర్లో..) -
తోడుంటే నడుస్తారు
ఆగినప్పుడు అడుగు ముందుకు పడటానికి తోడు కావాలి. నడిపించే సాయం కావాలి. లోకం మనల్ని కూడా నడిపిస్తుందన్న నమ్మకం కలిగించాలి. అహ్మదాబాద్‌కు చెందిన శ్రద్ధా సోపార్కర్ నడవలేని వారికి తోడు నిలుస్తుంది. వారికి ప్రోస్థెటిక్ కాళ్లు అమర్చి జీవితాల్లో మళ్లీ కదలిక తెస్తోంది. సెరిబ్రల్ పాల్సీతో బాధ పడుతున్న సొంత కూతురిని చూశాక సాటి వారి బాధ ఆమెకు అర్థమైంది. ఆమె స్పందన ఇవాళ ఎందరికో వెలుగు. శ్రద్ధా సోపార్కర్ లా చదివింది. కాని ఎప్పుడూ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఆమెకు హైజీన్ ప్రాడక్ట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. భర్త కూడా వ్యాపారస్తుడు. మొదట కొడుకు పుట్టాడు. అంతా హ్యాపీగా ఉండగా 2016లో కుమార్తె పుట్టినప్పుడు కుదుపు వచ్చింది. ‘నా కుమార్తెకు సెరిబ్రల్ పాల్సీ అని డాక్టర్లు చెప్పారు. నా కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఆ డిజార్డర్ ఉన్న పిల్లలకు వెంటనే నయం కాదు. జీవితంలో వారు పూర్తిగా నార్మల్ కాలేరు. వారికి కావలసిన థెరపీలు, సర్జరీలు చేయించాలంటే చాలా ఖర్చు కూడా. డబ్బుకు నాకు ఇబ్బంది లేదు కాబట్టి నా కుమార్తెకు కావలసిన థెరపీలు మొదలుపెట్టాను. కాని నా కుమార్తె వల్లే నాకు చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అర్థమైంది’ అంటుంది శ్రద్ధ. ► మలుపు తిప్పిన ఘటన ‘2018లో అహ్మదాబాద్‌లోని ఒక థెరపీ సెంటర్‌కు పాపను తీసుకుని వెళ్లాను. సెరిబ్రల్ పాల్సీతో బాధ పడుతున్న నాలాంటి పిల్లల తల్లులు కూడా చాలామంది వచ్చారు. అందరం భోజనానికి కూచున్నప్పుడు ఒకామె ఉత్త మజ్జిగ తాగుతూ కనిపించింది. ఎందుకు బాక్స్ తెచ్చుకోలేదు అని అడిగాను. ‘‘నేను ఇళ్లల్లో పని చేస్తాను. మా ఆయన ఆటో నడుపుతాడు. మా సంపాదన కొడుకు థెరపీలకు చాలడం లేదు. అందుకే అన్నం కూడా వండుకోలేకపోతున్నాం’’ అంది. నాకు మనసు చేదుగా అయిపోయింది. ఆమెకు కావాల్సిన సాయం చేయడం మొదలుపెట్టాను. అలాంటి తల్లులు మరికొంత మంది వచ్చారు. వారికీ చేయడం మొదలుపెట్టాను. సాయం పొందుతున్న వారు 10 మంది అయ్యేసరికి నా భర్త ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సేవ చేయి అన్నాడు. అలా మధురం చారిటబుల్ ట్రస్ట్ పెట్టి నా సేవను మొదలు పెట్టాను’ అంది శ్రద్ధ. ► చిన్నారులకు సేవ మెదడు సంబంధమైన రుగ్మతల వల్ల కదలికలు పరిమితమైన చిన్నారులకు, టీకాలు సరిగా వాడకపోవడం వల్ల అనారోగ్యం పాలైన చిన్నారులకు కావలసిన థెరపీలు, మందులు, వైద్య సహాయం ఇవన్నీ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టింది శ్రద్ధ. ఆమె తన సొంత డబ్బుల నుంచి ఇవన్నీ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆమెకు మెల్లగా సాయం అందసాగింది. ‘పేదవర్గాల తల్లిదండ్రులు తమ పిల్లలకు సెరిబ్రల్ పాల్సీ వస్తే నిస్సహాయంగా వదిలేస్తారు. అది పిల్లల స్థితిని మరింత దిగజారుస్తుంది. వారికి ప్రభుత్వం నుంచి కూడా పెద్దగా సాయం అందడం లేదు. మనలాంటి వాళ్లం స్పందించకపోతే ఎలా?’ అంటుంది శ్రద్ధ. ► ప్రోస్థెటిక్ కాళ్లు ఈ థెరపీలతో పాటు ప్రమాదవశాత్తు లేదా జన్మతః కాళ్లు కోల్పోయిన పిల్లలకు, పెద్దలకు ప్రోస్థెటిక్ కాళ్లు అమర్చాలని నిశ్చయించుకుంది శ్రద్ధ. అయితే ఇవి నాసిరకంవి కాదు. ఓట్టోబాక్ అనే జర్మన్ కంపెనీ సాయంతో నాణ్యంగా తయారైన కృత్రిమ కాళ్లు. ‘‘ఇప్పటికి 100 మందికి కృత్రిమ కాళ్లు ఇచ్చాం. నడవడం మానేసిన ఆ దురదృష్టవంతులు మేము అమర్చిన ప్రోస్థెటిక్ కాళ్లతో నడిచినప్పుడు వాళ్ల కళ్లల్లో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. ఈ కాళ్లు అమర్చాక వాహనాలు నడపొచ్చు. సైకిల్ కూడా తొక్కొచ్చు. స్నానం చేయడంలో కూడా ఇబ్బంది లేదు’’ అంది శ్రద్ధ. ఈమె ద్వారా కాళ్లు అమర్చుకున్న చిన్నారులు ఆటలు ఆడుతూ గెంతుతూ సంతోషంగా ఉండటం కూడా చూడొచ్చు. డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది. కాని స్పందించే గుణమే కావాలి. సేవకు అడుగు ముందుకేస్తే నాలుగు చేతులు తోడవుతాయి. నాలుగు కాళ్లు నడుస్తాయి. తాము నడుస్తూ నలుగురినీ నడిపించేవారే గొప్పవారు. -
శ్రద్ధా కేసు: అఫ్తాబ్ పూనావాలాపై దాడి.. జైలులో చితకబాదిన తోటి ఖైదీలు!
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై దాడి జరిగింది. శుక్రవారం సాకెత్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా జైలులోని ఇతర ఖైదీలు అతడ్ని చితకబాదారు. ఈ ఘటనలో అతను స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. అఫ్తాబ్‌పై దాడి జరిగిన విషయాన్ని అతని తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో నిందితుడ్ని కోర్టుకు తీసుకొచ్చే సమయంలో మరోసారి ఇలా దాడులు జరగకుండా పటిష్ఠ భద్రత కల్పించాలని సాకెత్ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. కాగా.. శ్రద్ధా హత్య కేసు వాదనలు పూర్తయ్యాయి. అయితే విశ్వసనీయమైన, క్లిష్ట సాక్ష్యాధారాల ద్వారా నేరారోపణ పరిస్థితులు వెల్లడయ్యాయని, కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని మార్చి 20నే ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇందుకు కౌంటర్‌గా అఫ్తాబ్ తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే శుక్రవారం అఫ్తాబ్‌ను కోర్టుకు తీసుకువచ్చారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది న్యాయస్థానం. తన ప్రేయసి శ్రద్ధవాకర్తో చాలాకాలంగా సహజీవనం చేసిన అఫ్తాబ్.. గతేడాది మేలో ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి అడవిలో పడేశాడు. కొన్ని నెలల తర్వాత వెలుగుచూసిన ఈ హత్యోదంతం దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చదవండి: మరో యువతితో ప్రేమాయణం.. ఇది తెలియడంతో హైదరాబాద్ వెళ్లి -
Shraddha Walkar Case: కీలక ఆధారంగా ఆమె వాయిస్ రికార్డు..
యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా వాకర్ హత్యకేసులో ప్రధాన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా నేరం చేశాడనేందుకు కీలక సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకి సమర్పించారు. వాటిలో కోర్టులో ప్లే చేసిన శ్రద్ధా వాయిస్ రికార్డు క్లిప్ ఈ కేసుకి కీలకంగా మారింది. ఈ మేరకు ఈ కేసుకి సంబంధించిన వాదనలు సోమవారం సాకేత్ కోర్టులో జరిగాయి. పోలీసులు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాని కోర్టులో హజరుపరిచారు. ఈ కేసు విచారణకు శ్రద్ధ తడ్రి కూడా హజరయ్యారు. కోర్టులో ఢిల్లీ పోలీసులు అతడు నేరం చేశాడని రుజువు చేసేందుకు విశ్వసనీయమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. అందుకు సంబంధించిన ఆధారాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అమిత్ ప్రసాద్, మధుకర్ పాండేలు కోర్టుకి సమర్పించారు. ఈ కేసుకి సంబంధించి నేరం చేయడానికి దారితీసిన ఆరు పరిస్థితులు, ముగ్గురు ప్రత్యక్ష సాక్ష్యలను గురించి కోర్టుకి వివరించారు. అలాగే ఆమె హత్యకు ముందు చివరిసారిగా చూసిన వారి గురించి కూడా కోర్టుకి తెలిపారు. ఈ నేరం సహజీవనం కారణంగా జరిగిందని, అతడితో రిలేషన్ షిప్లో ఉన్నంత కాలం ఆమె హింసకు గురైందని చెప్పారు. అలాగే శ్రద్ధా నవంబర్ 23, 2022న ముంబైలోని వసాయి పోలీస్టేషన్‌కి చేసిన ఫిర్యాదు కూడా ఈ హత్య కేసుకి బలమైన ఆధారమని చెప్పారు . అలాగే శ్రద్ధా ప్రాక్టో యాప్ ద్వారా వైద్యుల నుంచి కౌన్సిలింగ్ తీసుకుంటున్న విషయం గురించి పేర్కొన్నారు. ఆ ఆన్లైన్ కౌన్సిలింగ్లో వైద్యులకు అఫ్తాబ్ తనను వెంటాడి వెతికి మరీ చంపేస్తాడని చెబుతున్న ఆడియో క్లిప్‌ను సైతం కోర్టులో ప్లే చేశారు. ఆ క్లిప్‌లో ఒక రోజు అఫ్తాబ్ తన గొంతు పట్లుకున్నట్లు వైద్యులకు చెబుతున్నట్లు వినిపిపిస్తుంది. శ్రద్ధాకు సంబంధించిన మూడు డిజిల్ మొబైల్ ఫోన్లను కూడా కోర్టుకి సమర్పించారు. అలాగే శ్రద్ధా బ్యాంకు లావాదేవీలను నిర్వహించి ఫ్రిజ్, రంపం, నీళ్లు, క్లినర్, అగరబత్తులను కొన్న ఆధారాలను సైతం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. పైగా అఫ్తాబ్ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఆమె బతికే ఉందన్నట్లు ఆమె సోషల్ మీడియా ఖాతాను నిర్వహించాడని ఢిల్లీ పోలీసుల తరుఫు న్యాయవాదులు కోర్టుకి విన్నవించారు. అతను హత్య చేశాడనేందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయి కావున భారత శిక్షాస్మృతి ప్రకారం 302/201 సెక్షన్ల కింది నిందితుడిని తగిన విధంగా శిక్షించాలని న్యాయవాదులు కోర్టుని కోరారు. అదనపు సెషన్స్ జడ్జి మనీషా ఖురానా కకర్ డిల్లీ పోలీసుల తరుఫు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత వాటిపై ప్రతిస్పందించడానికి లీగల్ ఎయిడ్ కౌన్సిల్(ఎల్ఏసీ) జావేద్ హుస్సేన్‌కి కొంత సమయం ఇచ్చారు. ఈ మేరకు జడ్డి ఈ కేసుకి సంబంధించి తదుపరి వాదనల కోసం మార్చి 25కి వాయిదా వేసింది. (చదవండి: ఇందిరా గాంధీ టైంలోనే హక్కులను హరించబడ్డాయ్!: కేంద్ర మంత్రి) -
Shraddha Walkar Case: ఆ అనుభవంతోనే..
క్రైమ్: అఫ్తాబ్ పూనావాలా.. యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేసిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఏకైక, ప్రధాన నిందితుడు. మనస్పర్థలతో సహ భాగస్వామి శ్రద్ధను చంపేసి, శరీరాన్ని 35 ముక్కలు చేసి, ఫ్రిడ్జ్‌లో భద్రపర్చి ఆపై ఆ భాగాలను వివిధ చోట్ల పడేశాడతను. అయితే.. ఈ కేసులో ఇప్పుడు పోలీసులు మరో ఆసక్తికరమైన విషయాన్ని ఢిల్లీ కోర్టుకు వెల్లడించారు. ఆఫ్తాబ్ పూనావాలా శిక్షణ పొందిన చెఫ్ అని, మాంసాన్ని సైతం ఎలా భద్రపర్చాలో అతనికి తెలుసని పోలీసులు కోర్టుకు తాజాగా నివేదించారు. తాజ్ హోటల్లో అఫ్తాబ్ చెఫ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అలాగే మాంసాన్ని ఎలా భద్రపర్చడమో కూడా అతనికి తెలుసు. నేరంలో అది తనకి సాయపడిందని అఫ్తాబ్ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే.. డ్రై ఐస్, అగరబత్తీలతో పాటు శ్రద్ధను హత్య చేసిన తర్వాత నేలను శుభ్రం చేసేందుకు.. కొన్ని రసాయనాలను ఆర్డర్ చేశాడు అని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. శ్రద్ధను హత్య చేసిన వారంలోపే మరో యువతితో డేటింగ్ ప్రారంభించాడని, ఆ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌కు శ్రద్ధ రింగ్‌నే బహుకరించాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ ప్రసాద్ వాదనలు వినిపిస్తున్నారు. తాజా విచారణ సందర్భంగా.. ఆయన కేసు దర్యాప్తులో పోలీసులు తాజాగా సాధించిన పురోగతిని కోర్టుకు తెలిపారు. -
శ్రద్ధా హత్య కేసు..చార్జిషీట్లో షాకింగ్ ట్విస్ట్
యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా హత్య కేసులో ఆరు వేల పేజీల భారీ ముసాయిదా చార్జిషీట్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చార్జిషీట్లో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా తన బాయ్‌ఫ్రెండ్‌ని కలిసినందుకే హతమార్చడని పోలీసులు చార్జిషీట్లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు సుమారు 6,629 పేజీల చార్జీషీట్లో శ్రద్ధా తన స్నేహితుడిని కలుసుకోవడానికి వెళ్లిందన్న కోపంలోనే అఫ్తాబ్ ఈ దారుమైన ఘటనకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అప్తాబ్‌కి శ్రద్ధా తన స్నేహితుడిని కలవడం నచ్చలేదని, పైగా ఆ విషయమై తీవ్ర ఆందోళన చెందినట్లు నివేదికలో తెలిపారు. దీంతోనే ఆమెను అంత క్రూరంగా చంపేశాడని చార్టిషీట్లో పేర్కొనట్లు జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ మీను చౌదరి వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉండే అఫ్తాబ్ తన భాగస్వామి శ్రద్ధావాకర్ని హత్య చేసి, 36 ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఆ తదనంతరం శ్రద్ధా కనపడకపోవడం, ఆ విషయాన్ని స్నేహితులు శ్రద్ధా తండ్రికి చెప్పడంతో.. ఆయన ఫిర్యాదు మేరకు అఫ్తాబ్‌ని అరెస్టు చేసి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. (చదవండి: శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3,000 పేజీల చార్జిషీట్) -
శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3,000 పేజీల చార్జిషీట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్త సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో 3 వేల పేజీల భారీ ముసాయిదా చార్జిషీట్‌ను ఢిల్లీ పోలీసు అధికారులు, న్యాయ నిపుణులు తయారు చేశారు. ఇందులో 100 సాక్ష్యాలతో కూడిన ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ ఆధారాలున్నాయి. దీని నుంచి తుది చార్జిషీట్‌ను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉండే అఫ్తాబ్ పూనావాలా తన భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను గత మేలో గొంతు పిసికి చంపి, మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేసేందుకు ముందుగా వాటిని ఫ్రిజ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఛతర్పూర్ అటవీ ప్రాంతంలో లభించిన ఎముకలు శ్రద్ధవేనని డీఎన్ఏ నివేదికల్లో తేలింది. ఇవే కీలక ఆధారాలు కానున్నాయి. -
శ్రద్ధా కేసు: రంపంతోనే కోసినట్లు నిర్ధారణ
యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసి ఢిల్లీ శ్రద్ధా హత్య కేసులో ఇప్పటి వరకు పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె శరీర భాగాలకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)లో పోస్ట్‌మార్టం నిర్వహించడం జరిగింది. ఈ మేరకు పోస్ట్‌మార్టం నివేదికలో పలు కీలక విషయాలు వెలుగులో వచ్చాయి. నిందితుడు అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని రంపంతో ముక్కలు చేసినట్లు నివేదిక వెల్లడించింది. గత నెలలో నిర్వహించిన డీఎన్ఏ పరీక్షల్లో ఆ శరీర భాగాలు శ్రద్ధావేనని నిర్ధారించగా.. తదనంతరం వాటిని శవపరీక్షలకు పంపించారు. అలాగే ఆ ఫ్లాట్‌లో కనిపించిన రక్తపు మరకలు ఆమె రక్తంతో సరిపోలినట్లు నివేదికలో పేర్కొంది. ఈ మేరకు శ్రద్ధా తండ్రి నుంచి సేకరించిన డీఎన్ఏ నమునాను ఉపయోగించి ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా, నిందితుడు అఫ్తాబ్ పూనావాలా గతేడాది నవంబర్ నుంచి కస్టడీలోనే ఉన్నాడు. ఈ నెలాఖారులోపు ఢిల్లీ పోలీసులు ఈ కేసులో చార్జీషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. (చదవండి: శ్రద్ధా హత్య కేసు: అఫ్తాబ్‌ని తరలిస్తున్న వ్యాన్‌పై దాడి... రక్షణగా ఉన్న పోలీసులకు రివార్డు) -
శ్రద్ధా కేసు వల్లే.. నటి సూసైడ్ కేసులో సంచలన వాంగ్మూలం
ముంబై: ప్రముఖ టీవీ నటి తునిషా శర్మ మృతి దర్యాప్తు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రియుడు షీజాన్ ఖాన్ పోలీసుల ముందు కీలక వాంగ్మూలం ఇచ్చాడు. పోలీస్ కస్టడీలో భాగంగా తొలిరోజు సోమవారం(ఇవాళ) వాలివ్ పోలీసులకు తమ రిలేషన్షిప్ ముగింపునకు కారణం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసేనని చెప్పాడు. శ్రద్ధా వాకర్ ఘోర హత్యోదంతం తర్వాత.. దేశంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇద్దరికీ వయసు అంతరంతో(ఎనిమిదేళ్ల గ్యాప్) పాటు వేర్వేరు కమ్యూనిటీలనే ఆటంకాలు తప్పవని భావించా. అందుకే బలవంతంగా ఆమెకు బ్రేకప్ చెప్పా అని షీజాన్ పోలీసులకు వెల్లడించాడు. శ్రద్దా వాకర్ కేసు నాపై ఒత్తిడి పెంచింది. లేనిపోని ఇరకాటంలో పడతామనే వద్దనుకున్నా. తునిషా మతం వల్లే ఆమెకు బ్రేకప్ చెప్పాను!. అంతేకాదు.. ఇంతకు ముందు తునిషా ఆత్మహత్యాయత్నం చేసిందని ఇంటరాగేషన్‌లో షీజాన్ పోలీసులకు వెల్లడించాడు. ‘‘చనిపోవడానికి కొన్నిరోజులు ముందు కూడా ఆమె సూసైడ్ యత్నం చేసింది. ఆ సమయంలో నేనే ఆమెను రక్షించా. తునిషా తల్లికి అప్పగించి.. జాగ్రత్తగా చూసుకోవాలని ఆమెకు సూచించా.’’ అని పోలీసులకు వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 24వ తేదీ టీవీ షూటింగ్ జరుగుతున్న చోట టాయ్లెట్లో తునిషా శర్మ(20) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని విగతజీవిగా కనిపించింది. ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. బహుశా బ్రేకప్ కారణంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు టీవీ నటులు గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారు. అయితే పదిహేను రోజుల కిందట షీజాన్ ఆమెకు బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తంది. శనివారం ఉదయం ఇంటి నుంచి యధాతధంగా ముంబై వాసాయిలో జరిగే షూటింగ్‌కు వెళ్లిందామె. ఫస్ట్ షిఫ్ట్ షూట్లో షీజాన్, తునిషాలు కలిసే పాల్గొన్నారు. ఆ షూటింగ్ సమయంలోనే ఆమె సూసైడ్‌కు పాల్పడింది. దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం కింద షీజాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. తునిషా శర్మ తల్లి వనిత, షీజాన్ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. తన కూతురిని షీజాన్ వాడుకుని, వదిలేశాడంటూ ఆరోపిస్తోంది. మరో వ్యక్తితో సంబంధం కొనసాగిస్తూనే.. తునిషాతో ప్రేమాయణం నడిపాడు. మూడు నాలుగు నెలలు ఆమెను బాగా వాడుకున్నాడు. నా బిడ్డను పొగొట్టుకున్నా. నాకు న్యాయం చేయండి. షీజాన్‌ను శిక్షించండి అని కోరుతోందామె. ఇదిలా ఉంటే ఈ కేసులో లవ్ జిహాదీ కోణం తెరపైకి రాగా.. పోలీసులు మాత్రం దర్యాప్తు పూర్తయితేనే గానీ ఏం చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్ర మంత్రి గిరిష్ మహాజన్ సైతం ఇది లవ్ జిహాద్ వ్యవహారమేనని, షిండే ప్రభుత్వం లవ్ జిహాదీకి వ్యతిరేకంగా గట్టి చట్టం తేవాలంటూ కామెంట్ చేయడం తెలిసిందే. -
అవి శ్రద్ధా శరీర భాగాలే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ హత్యా ఘటనలో మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో లభ్యమైన ఎముకలు శ్రద్ధా వాకర్‌వేనని పోలీసు వర్గాలు గురువారం తెలిపాయి. హత్యారోపణలు ఎదుర్కొంటున్న అఫ్తాబ్ గది నుంచి సేకరించిన రక్తం నమూనాలు శ్రద్ధవేనని తేలింది. ఎముకలు, రక్తం నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలు శ్రద్ధా వాకర్ తండ్రి డీఎన్ఏతో సరిపోలాయని ఆ వర్గాలు వివరించాయి. డీఎన్ఏ రిపోర్టుతోపాటు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక అందిందని స్పెషల్ పోలీస్ కమిషనర్(శాంతిభద్రతలు) సాగర్‌ప్రీత్ హూడా మీడియాకు తెలిపారు. అఫ్తాబ్‌కు నిపుణులు నిర్వహించిన పాలీగ్రాఫ్ పరీక్ష నివేదిక కూడా బుధవారం పోలీసులకు అందింది. కేసు దర్యాప్తులో ఈ నివేదికలు కీలకంగా మారాయి. శ్రద్ధావాకర్‌తో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ పూనావాలా ఆమెను గొంతుపిసికి చంపిన అనంతరం శరీరాన్ని 35 భాగాలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడవేశాడు. -
అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధవే.. తేల్చిన డీఎన్ఏ రిపోర్టు
న్యూఢిల్లీ: శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. డిల్లీ మెహ్రౌలీ అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధవే అని తేలింది. ఆమె తండ్రి డీఎన్ఏతో ఈ సాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. సెంట్రల్ ఫోరెన్సిస్ సైన్స్ లాబోరేటరీ నివేదిక దీన్ని ధ్రువీకరించింది. అలాగే శ్రద్ద హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలా పాలీగ్రాఫ్ టెస్టు పూర్తి నివేదిక పోలీసులకు అందింది. దీంతో అధికారులు ఈ కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయనున్నారు. ఢిల్లీ మోహ్రాలీలో ఈ ఏడాది మేలో జరిగిన శ్రద్ధ వాకర్ హత్య కేసు ఆరు నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శ్రద్ధ బాయ్‌ఫ్రెండ్ అప్తాబే ఆమెను గొంతునులిమి చంపాడు. అనంతరం శవాన్ని 35 ముక్కలు చేసి అడవిలో పడేశాడు. పోలీసులు అడవి మొత్తం గాలించి 13 ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. డీఎన్ఏ టెస్టుతో అవి శ్రద్ధవే అని తేలింది. కోర్టు అనుమతితో ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్‌కు పాలీగ్రాఫ్‌తో పాటు నార్కో టెస్టు కూడా నిర్వహించారు అధికారులు. అతని స్టేట్మెంట్ రికార్డు చేశారు. శ్రద్ధను తానే చంపానని, కానీ చంపినందుకు ఎలాంటి పశ్చాతాపం లేదని అఫ్తాబ్ విచారణలో చెప్పాడు. చదవండి: లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్‌ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు -
ఎంత చెప్పినా ఆమె వినలేదు.. ఆ సమయంలో ఆఫ్తాబ్‌ని కలిశా: శ్రద్ధా తండ్రి
న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్యోదంతం ఎన్నో మలుపులు తిరుగుతూ పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధా వాకర్ హత్య తర్వాత తొలిసారి ఆమె తండ్రి వికాస్ వాకర్ శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఆయన నోరు విప్పారు. తన కూతుర్ని ఎలాగైతే చంపాడో అలాగే అఫ్తాబ్‌కీ పనిష్మెంట్ ఇవ్వాలని వికాస్ వాకర్ డిమాండ్ చేశారు. సరైన పద్ధతిలో విచారణ చేసి అఫ్తాబ్‌ని ఉరితీయాలని డిమాండ్ చేశారు. అఫ్తాబ్ కుటుంబ సభ్యులు, ఈ హత్యతో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే శ్రద్ధా వాకర్ బతికి ఉండేదని అభిప్రాయపడ్డారు ఆమె తండ్రి వికాస్ వాకర్. పోలీసుల దర్యాప్తు విషయంలో తాను సంతృప్తిగానే ఉన్నానని చెప్పారు. కూతురు మరణం తనను కుంగిపోయేలా చేసిందని, దీంతో అనారోగ్యానికి గురయ్యానని వెల్లడించారు. అందువల్లే మీడియాతో మాట్లాడలేకపోయానని తెలిపారు. సమాజంలో ఇబ్బందులు సృష్టిస్తున్న పలు మొబైల్ అప్లికేషన్లపై కూడా చర్యలు తీసుకోవాలని శ్రద్ధా తండ్రి డిమాండ్ చేశారు. డేటింగ్ యాప్స్‌పై నిషేధం విధించాలన్నారు. 18 ఏళ్లు నిండిన పిల్లలపై తప్పనిసరిగా కౌన్సిలింగ్ నియంత్రణ ఉండాలన్నారు. రెండేళ్లుగా శ్రద్ధాను సంప్రదించేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించానని, కానీ తాను పెద్దగా స్పందించలేదని తెలిపారు. శ్రద్ధా శరీర భాగాలు ఆ హంతకుడి ఇంట్లో ఉన్న సమయంలో అఫ్తాబ్‌ని కలిశానని ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్తాబ్‌తో వెళ్లిన తర్వాత కూతుర్ని ఇంటికి రాకుండా అన్ని దారులు మూసేశారా? అని మీడియా ప్రశ్నించగా.. కూతురు హత్య అనంతరం తమపై అందరూ అనేక నిందలు వేశారని శ్రద్ధా తండ్రి వాపోయారు. కొందరు గొడవ పడి మరీ ఇంట్లోంచి వెళ్లింది మళ్లీ ఎలా రానిస్తారంటూ ప్రశ్నలు వేశారని తెలిపారు. అయితే తన కూతురు ఇంట్లోంచి వెళ్లే ముందు ఎన్నో రకాలుగా ప్రశ్నించినా ఆమె దేనికి సమాధానమివ్వకుండా వెళ్లిపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ఈ కేసులో న్యాయం చేస్తామని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ పోలీసు అధికారులు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారని శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ చెప్పారు. కాగా, అఫ్తాబ్ అమీన్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని 14 రోజులు పొడిగించినట్లు పోలీసుల వర్గాలు తెలిపాయి. చదవండి: 15 ఏళ్ల నుంచి పరారీలో నిందితుడు.. హోటల్లో మేనేజర్‌గా అవతారం ఎత్తి.. -
మరో వ్యక్తితో శ్రద్ధా డేటింగ్.. అందుకే చంపి ముక్కలుగా చేశా: అఫ్తాబ్
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన వెలుగులోకి వచ్చిన నెల రోజులు సమీపిస్తున్నా నిత్యం సంచలన విషయాలు తెరమీదకు వస్తున్నాయి. యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘోర ఈ దారుణ ఘటనలో నిందితుడి ఆఫ్తాబ్ను పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న అఫ్తాబ్ రోజుకో కొత్త విషయాలను చెప్పి షాక్‌లా మీద షాక్‌లు ఇస్తున్నాడు. తాజాగా మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తిని శ్రద్ధా కలిసినందుకే తనను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా శ్రద్ధాకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడిందని, మే 17న అతన్ని గురుగ్రామ్‌లో కలవడానికి వెళ్లిందని తెలిపాడు. ఆరోజంతా అతనితోనే గడిపి మరుసటి రోజు(మే 18న) మధ్యాహ్నం మెహహ్రోలీలో ఉంటున్న తన ఫ్లాట్‌కు తిరిగి వచ్చిందని పేర్కొన్నాడు. ఈ విషయంపై ఆరోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. గొడవ పెద్దదవడంతోనే ఆమెను చంపినట్లు పేర్కొన్నాడు. అఫ్తాబ్ చెబుతుంది నిజమా? కాదా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల కోసం బంబుల్ యాప్‌కు పోలీసులు లేఖ రాశారు. అలాగే శ్రద్దా వాకర్ ఫోన్ కాల్స్, లొకేషన్ టవర్ డేటాను పరిశీలిస్తున్నారు. చదవండి: ‘ఇండియాలోని అత్తమామలు ఐఫోన్లు గిఫ్ట్ ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారు’ అంతకుముందే విచారణలో శ్రద్ధాతో బ్రేకప్ చేసుకున్నట్లు, ఆమెతో సహజీవనం చేయడంలేదని అఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు. అప్పటి నుంచి వారు కేవలం ఫ్లాట్మెట్స్లా కలిసి ఉంటున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఆఫ్తాబ్ తీహార్ జైలులో ఉన్నాడు. మరో రెండు రోజుల్లో అతని జ్యూడిషియల్ కస్టడీ ముగియనుంది. ఇప్పటి వరకు అఫ్తాబ్ కుటుంబ సభ్యులెవరూ అతన్ని కలవడానికి జైలుకు రాలేదని అధికారులు తెలిపారు. ఇన్ని రోజులు సెల్లో ఒంటరిగానే ఉండేవాడని, లేదంటే పుస్తకాలు చదవడం, కొన్నిసార్లు తోటి ఖైదీలతో చెస్ ఆట ఆడేవారని పేర్కొన్నారు. మరోవైపు డీఎన్ఐ అనాలసిస్, పాలిగ్రాఫ్, నార్కో టెస్ట్ రిపోర్ట్స్ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అవన్నీ ఢిల్లీ పోలీసులకు అందిచనున్నట్లు ఫోరెన్సిక్ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: పిల్లలే దూరమైతే నా బతుకెందుకు..! -
నాకు స్వర్గం గ్యారెంటీ.. అక్కడ అప్సరసలతో ఆనందిస్తా..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా పాలిగ్రాఫ్ టెస్టులో నివ్వెరపరిచే అంశాలు బయటపెట్టాడు. నమ్మి సహజీవనం చేసిన శ్రద్ధా వాకర్‌ను అత్యంత పాశవికంగా కడతేర్చినందుకు తనకు ఇసుమంతైనా పశ్చాత్తాపం లేదని కుండబద్దలు కొట్టాడు! ‘‘నన్ను ఉరితీసినా బాధ లేదు. ఎందుకంటే నేను స్వర్గానికే వెళ్తా. అక్కడ నన్నంతా ఓ హీరోలా చూస్తారు. అప్సరసలతో ఆనందిస్తా’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘శ్రద్ధను చంపేటప్పుడు గానీ, శవాన్ని ముక్కలుగా నరుకుతున్నప్పుడు గానీ ఏమాత్రం బాధగా అనిపించలేదు. అసలు ముంబైలో ఉండగానే శ్రద్ధను చంపి ముక్కలు చేయాలని భావించా’’ అని వెల్లడించాడు. అంతేకాదు, ‘‘శ్రద్ధతో సహజీవనం చేస్తూనే మరోవైపు 20 మందికి పైగా అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నా! బంబుల్ యాప్ సాయంతో వారిని ట్రాప్ చేసేవాడిని. శ్రద్ధను చంపాక ఓ సైకాలజిస్ట్‌ను ఫ్లాట్‌కు ఆహ్వానించి ఆమెతో గడిపా. శ్రద్ధ తాలూకు రింగును ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చా’’ అని వివరించాడు. ఇవన్నీ విని షాకయ్యామని పోలీసులు చెప్పుకొచ్చారు. విచారణ అనంతరం అతను ఏ చీకూచింతా లేకుండా ఇట్టే నిద్రలోకి జారిపోయేవాడని వివరించారు. పరీక్ష అనంతరం అతని ఫ్లాట్ నుంచి ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. -
శ్రద్ధ కేసు: అఫ్తాబ్ అలాంటి వాడని ఊహించలేదు!
ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు చికిత్స అందించే వైద్యురాలు. అలాంటి ఆమెకే షాకిచ్చి.. మానసిక చికిత్స తీసుకునేలా చేశాడు మెహ్రౌలీ ఘోర హత్యోదంతంలో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా. శ్రద్ధా వాకర్‌ను ముక్కలు చేసిన అనంతరం.. ఆ విడిభాగాలను ఇంట్లో ఫ్రిడ్జ్‌లో ఉంచి మరీ ఈ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేశాడు. ఈ క్రమంలో.. ఆ మానవ మృగం గురించి సదరు యువతిని ఆరా తీసిన పోలీసులు.. స్టేట్మెంట్ నమోదు చేశారు. శ్రద్ధా వాకర్ హత్య అనంతరం.. ఆఫ్తాబ్ డేటింగ్ యాప్ ద్వారా మరో యువతిని పరిచయం చేకున్నాడు. ఆమె పలుమార్లు ఇంటికి రప్పించాడు. ఆమె ఓ సైకియాట్రిస్ట్. అయితే ఆ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కనీసం శ్రద్ధా వాకర్‌తో అతని గత పరిచయ విషయం కూడా తనకు తెలియదని ఆమె వాపోయింది. ఆఫ్తాబ్ ఫ్లాట్‌కు వెళ్లిన సమయంలో అతడి ఫ్రిజ్‌లో మానవ శరీర భాగాలు ఉన్న విషయం తనకు తెలియదని సదరు యువతి వెల్లడించింది. అయితే.. హత్య జరిగిన తర్వాత రెండుసార్లు తాను అఫ్తాబ్ ఫ్లాట్‌కు వెళ్లినట్లు మాత్రం ఒప్పుకుంది. ‘‘డేటింగ్ యాప్ ద్వారా నాకు అఫ్తాబ్‌తో పరిచయం ఏర్పడింది. అతను చాలా నార్మల్‌గా కనిపించేవాడు. కాకపోతే సిగరెట్లు ఎక్కువగా కాల్చేవాడు. బాడీస్ప్రేలు, ఫర్ఫ్యూమ్ల కలెక్షన్ ఎక్కువగా ఉండేది అతని దగ్గర. వాటిల్లోంచి కొన్ని నాకు గిఫ్ట్‌గా ఇచ్చేవాడు. అలాగే మా డేటింగ్ కొన్ని నెలలపాటు సాగింది. అక్టోబర్ 12వ తేదీన ఆఫ్తాబ్ నాకు ఓ ఫ్యాన్సీ ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అది అతని మాజీ ప్రేయసిది, ఆమెను అతనే చంపేశాడనే విషయం మీరు(సిట్ పోలీసులు) చెప్పేదాకా తెలియదు. ఆమె చనిపోయినట్లుగా చెప్తున్న నెల వ్యవధిలో అతన్ని రెండుసార్లు కలిశా అని ఆమె ఒప్పుకుంది. అఫ్తాబ్ తనతో చాలా నార్మల్‌గా ఉండేవాడని, ముంబయిలోని తన ఇంటి గురించి తరచూ తనతో చెప్తుండేవాడని ఆమె పేర్కొంది. అతని ప్రవర్తన చూసి మంచివాడు అనుకున్నానే తప్ప.. అంత ఘోరం చేస్తాడని ఊహించని లేదని ఆమె తెలిపింది. అఫ్తాబ్ గురించి తెలిశాక షాక్ తిన్న ఆమె కొన్నాళ్లు మానసిక చికిత్స తీసుకుంది. డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చిన ఆమె నుంచి పోలీసులు ఇవాళ వాంగ్మూలం సేకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఒకేసారి డేటింగ్ యాప్‌ల ద్వారా పాతిక మంది దాకా యువతులను అఫ్తాబ్ సంప్రదించినట్లు తేలిందని పోలీసులు తాజాగా వెల్లడించారు. ఇదీ చదవండి: నేరం ఒప్పుకోలు.. పశ్చాత్తాపంలేని అఫ్తాబ్ -
'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా'
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు మంగళవారం పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు అధికారులు. విచారణలో శ్రద్ధను తానే చంపానని అఫ్తాబ్ అంగీకరించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) అధికారులు వెల్లడించారు. అయితే తాను ఇలా చేసినందుకు ఎలాంటి పశ్చాతాపం లేదని అతను చెప్పాడని పేర్కొన్నారు. అంతేకాదు తాను చాలా మంది అమ్మాయిలలో డేటింగ్ చేసినట్లు పాలిగ్రాఫ్ టెస్టులో అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. శ్రద్ధను హత్య చేసిన అనంతరం శవాన్ని ముక్కలు చేసి అడవిలో పడేసినట్లు వివరించాడు. పాలిగ్రాఫ్ టెస్టు సమయంలో అఫ్తాబ్ సాధారణంగానే ప్రవర్తించాడని ఫోరెన్సిక్ అధికారులు చెప్పారు. పాలిగ్రాఫ్ టెస్టుకు ముందు రోజు అఫ్తాబ్‌పై కొందరు కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అతడ్ని వాహనంలో తీసుకెళ్తుండగా.. వెంబడించారు. దీంతో పటిష్ఠ భద్రత నడుమ అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు. చాలా కాలంగా సహజీవనం చేస్తున్న శ్రద్ధను అఫ్తాబ్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె శవాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచాడు. ఆ తర్వాత రోజూ కొన్ని శరీర భాగాలు తీసుకెళ్లి అడవిలో పడేశాడు. మే 18న జరిగిన ఈ హత్యోదంతం ఆరు నెలల తర్వాత వెలుగుచూసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నవంబర్ 12న అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం అతడికి నవంబర్ 22న ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. అనంతరం కస్టడీని మరో 13 రోజులు పొడిగించింది. నార్కో టెస్టు కూడా నిర్వహించేందుకు అనుమతించింది. డిసెంబర్ 1న ఈ పరీక్ష జరగనుంది. చదవండి: లిక్కర్ స్కాం కేసు.. సిసోడియా సన్నిహితుడు అరెస్ట్ -
‘వాడు 35 ముక్కలు చేశాడు.. మేం 70 ముక్కలు చేస్తాం’
సాక్షి, ఢిల్లీ: నగరంలో సోమవారం సాయంత్రం హైడ్రామా నెలకొంది. శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాను తీసుకెళ్తున్న పోలీస్ వాహనంపై కొందరు దాడికి యత్నించారు. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. రోహిణి ప్రాంతంలోని ఎఫ్ఎస్ఐ ల్యాబ్‌లో సోమవారం సాయంత్రం అఫ్తాబ్‌కు పాలిగ్రఫీ టెస్ట్ నిర్వహించినట్లు సమాచారం. అదయ్యాక బయటకు వాహనంలో తీసుకొస్తున్న తరుణంలో.. హిందూసేన కార్యకర్తలుగా చెప్పుకుంటున్న కొందరు అడ్డగించారు. తల్వార్లతో దూసుకొచ్చిన ఆ యువకులు.. పోలీస్ వాహనంపై దాడికి యత్నించారు. ‘‘వాడు మా సోదరిని చంపి 35 ముక్కలుగా చేశాడు. మేం వాడిని చంపి 70 ముక్కలు చేస్తాం. పోలీసులు వాడికి సెక్యూరిటీ కల్పించడం ఏంటి? వాడిని మాకు అప్పగించండి.. చంపేస్తాం అంటూ నినాదాలు చేశారు వాళ్లు. మా ఆడబిడ్డలు, అక్కాచెల్లెళ్లకు భద్రత కొరవడినప్పుడు.. మేం బతికి ఉండి ఏం సాధించినట్లు అంటూ కొందరు అక్కడే ఉన్న మీడియాతో వ్యాఖ్యానించారు. ఒక్కసారిగా వచ్చిన మూకను చూసి పోలీసులు షాక్ తిన్నారు. ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. పలువురిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు. #WATCH | Police van carrying Shradhha murder accused Aftab Poonawalla attacked by at least 2 men carrying swords who claim to be from Hindu Sena, outside FSL office in Delhi pic.twitter.com/Bpx4WCvqXs — ANI (@ANI) November 28, 2022 ఇదీ చదవండి: శ్రద్ధా వాకర్ కంటే భయంకరమైన హత్య ఇది! -
శ్రద్ధా కేసు: ఐదు కత్తులు స్వాధీనం, వెలుగులోకి మరో ట్విస్ట్
న్యూఢిల్లీ: యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురిచేసిన శ్రద్ధా హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. దర్యాప్తు చేసే కొద్దీ పలు ఆసక్తికర విషయాలు బయటకీ వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు అఫ్తాబ్ అమీన్ పునావాలా తన ప్రియురాలు శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని కోయడానికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 5 నుంచి 6 అంగుళాల మధ్య ఉన్న ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాదు ఈ ఆయుధాలను ఉపయోగించాడా? లేదా అని తెలుసుకోవడం కోసం వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించినట్లు తెలిపారు. ఐతే అఫ్తాబ్ పోలీసులు విచారణలో శ్రద్ధా శరీర భాగాలను కోసి దాదాపు 300 లీటర్ల ఫ్రిజ్‌లో ఉంచి సమీపంలోని అడవిలో పడేసినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసులు మృతదేహాన్ని కోయడానికి ఉపయోగించిన ఆయుధాలు కోసం ముమ్మరంగా గాలించారు. ఐతే ఈ దర్యాప్తు సమయంలో పోలీసులకు మరో షాకింగ్ ట్విస్ట్ తగిలింది. అప్తాబ్ ఆ రోజు శ్రద్ధా వాకర్ని హత్య చేసిన తదనంతరం ఒక వైద్యురాలితో డేటింగ్ చేసినట్లు తేలింది. ఆమెకు శ్రద్ధా ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అఫ్తాబ్ తీహార్ జైలులో ఉన్నాడని, అతన్ని గట్టి భద్రత నడుమ బహు జాగ్రత్తగా ఉంచినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: చంపి ముక్కలుగా నరికేస్తానని అఫ్తాబ్ బెదిరించాడు.. వెలుగులోకి 2020 నాటి ఫిర్యాదు) -
శ్రద్ధా హత్యోదంతం.. లవ్ జిహాద్ కాదు!
హైదరాబాద్: సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యోదంతంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గురువారం స్పందించారు. ఈ కేసుకు మతం రంగు పులమడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ఇది లవ్ జిహాద్ ఘటన కాదంటూ ఉద్ఘాటించారు. ‘‘ఈ వ్యవహారాన్ని మత కోణంలో బీజేపీ చూస్తోంది. బీజేపీ రాజకీయాలు పూర్తిగా తప్పు. ఇది లవ్ జిహాద్ ఘటన కాదు. కానీ.. ఒక మహిళపై హేయనీయంగా ప్రవర్తించడం, వేధించడం.. దాడికి సంబంధించింది. ఆ కోణంలోనే ఈ కేసును చూడాలి.. అంతా ఖండించాలి కూడా’’ అని ఒవైసీ పేర్కొన్నారు. ఇక ఆజామ్‌ఘడ్‌లో ఓ వ్యక్తి తన భార్యను కిరాకతంగా చంపి.. సూట్‌కేసులో కుక్కిన ఘటనపైనా స్పందించారు ఒవైసీ. ఇలాంటి ఘటనలు బాధాకరమని, వీటికి హిందూ-ముస్లిం రంగులు పులిమి రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. శ్రద్ధా వాకర్ హత్య కేసును ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రముఖంగా ప్రస్తావించింది. ఆదివారం ఈశాన్య ఢిల్లీలో జరిగిన రోడ్ షోలో అసోంముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. మెహ్రౌలీ(శ్రద్ధా కేసు) ఘోర హత్య తనను కలిచివేసిందని అన్నారు. దేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్‌తో పాటు లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టం తేవాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ దేశానికి అఫ్తాబ్(శ్రద్ధా హత్యకేసు నిందితుడు) లాంటి వాళ్ల అవసరం లేదని, శ్రీరాముడులాంటి వ్యక్తి.. నరేంద్ర మోదీ నేతల అవసరం ఉందని అసోం సీఎం వ్యాఖ్యానించారు. -
శ్రద్ధా కేసు: ‘అఫ్తాబ్ నన్ను ముక్కలుగా నరికేస్తాడట!’
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ చేస్తున్న కొద్ది ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు శ్రద్ధా వాకర్ తన ప్రియుడు అఫ్తాబ్ అమీన్ పునావాలాపై నవంబర్ 23, 2020న మహారాష్ట్రాలోని వసాయ్‌లోని తిలుంజ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. అఫ్తాబ్ దారుణంగా కొడుతున్నాడని, చంపి ముక్కలుగా చేస్తానంటూ బెదిరిస్తున్నాడని శ్రద్ధా ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు. అతడి హింసాత్మక ప్రవర్తన గురించి అఫ్తాబ్ కుటుంబానికి కూడా తెలుసని పేర్కొన్నారు. కాగా, శ్రద్ధా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లేఖలో... అఫ్తాబ్ ఈ రోజు నన్ను ఊపిరాడకుండా చేసి చంపడానికి ప్రయత్నించాడు. నన్ను చంపి ముక్కలుగా నరికి దూరంగా విసిరేస్తానని బెదిరించాడు. అతను నన్ను కొట్టి ఆరు నెలలైంది, కానీ నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు కాబట్టి పోలీసులను ఆశ్రయించే ధైర్యం నాకు లేదు. నన్ను చంపడానికి ప్రయత్నించినట్లు అతని తల్లిదండ్రులకు కూడా తెలుసు. అలాగే మేము కలిసి ఉంటున్నట్లు కూడా అతడి తల్లిదండ్రులకు తెలుసు. ఎప్పటికైనా మేము పెళ్లి చేసుకోవాల్సిందే. మాకు అతడి తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా ఉంది. కానీ నేను ఇప్పుడూ అఫ్తాబ్‌తో కలిసి జీవించేందుకు ఇష్టపడటం లేదు. నేను ఎప్పుడైన తనకంట పడ్డ నన్ను హింసించి, చంపేసే ప్రయత్నం చేయవచ్చు లేదంటే బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉన్నందున నేను ఏవిధంగానైనా దారుణంగా గాయపడినట్లయితే దానికి కారణం అఫ్తాబేనని లేఖలో పేర్కొంది. ఐతే ఆ తర్వాత అతడి తల్లిదండ్రులు కలగజేసుకుని మాట్లాడటంతో ఆమె మా మధ్య ఎలాంటి గొడవలు లేవని లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చి, ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోరిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అఫ్తాబ్ తల్లిదండ్రులు ఢిల్లీలో ఉన్నారని వారి నుంచి కూడా స్టేమెంట్ తీసుకుంటున్నామని చెప్పారు. ఐతే శ్రద్ధా అఫ్తాబ్‌పై ఫిర్యాదు చేసిన సమయంలో తన సహోద్యోగుల్లో ఒకరైన కరణ్‌తో ఆమె ఈ దాడి గురించి చెబుతూ గాయపడిన ఫోటోను వాట్సాప్‌లో షేర్ చేసిన దానితో సరిగ్గా ఈ మేటర్ లింక్ అవుతోందని పోలీసులు చెప్పారు. ఐతే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆమెపై ఆరునెలలుగా దాడి చేసి, బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసినప్పుడూ... ఆమె అతడితో ఎంత కాలం వేరుగా ఉంది అనేదానిపై స్పష్టత లేదని చెప్పారు. ఐతే విచారణలో ఆ జంట ఢిల్లీ వెళ్లడానికి ముందు ఈ ఏడాది ప్రారంభంలో సెలవులకు హిమచల్‌ప్రదేశ్ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: శ్రద్ధ హత్య కేసు.. నేరం అంగీకరించని అఫ్తాబ్.. పోలీస్ కస్టడీ పొడిగింపు) -
శ్రద్ధా వాకర్ హత్య కేసు: సీబీఐ విచారణ దేనికి?
ఢిల్లీ: సంచలన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఇవాళ కూడా కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయి. నిందితుడు అఫ్తాబ్ కస్టడీని పొడగించింది ఢిల్లీ సాకేత్ కోర్టు. అయితే.. సీబీఐకి అప్పగించాలన్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారం హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ అభ్యర్థనను విచారణకు స్వీకరించడానికి మాకు ఒక్క మంచి కారణం కనిపించలేదు అని ఈ సందర్భంగా జస్టిస్ సతీష్ చంద్ర, జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్‌తో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఢిల్లీ పోలీసుల దర్యాప్తుపై బాధితురాలి తల్లిదండ్రులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. అలాంటిది మీకు ఎందుకు అంత ఆసక్తి?. అంటూ కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ‘మేమేం విచారణ పర్యవేక్షణ సంస్థ కాదు’ అంటూ ఘాటు కామెంట్ చేసింది. శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని ఢిల్లీ హైకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. అసలు సీబీఐ దర్యాప్తు కోరాల్సిన అవసరం ఏముందని పిటిషనర్‌ని నిలదీసింది. పోలీసులు 80 శాతం దాకా దర్యాప్తు పూర్తి చేశారని, ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 200 మంది సిబ్బంది ఇందులో భాగం అయ్యారని ఈ సందర్భంగా హైకోర్టు పిటిషనర్ తరపు న్యాయవాదికి తెలిపింది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఢిల్లీ పోలీసుల తీరును తప్పుబడుతూ.. సీబీఐకి కేసును అప్పగించాలని పిటిషనర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. శ్రద్ధా వాకర్ కేసులో దర్యాప్తు సమర్థవంతంగా జరగడం లేదని, పైగా ఆధారాల సేకరణలోనూ ఢిల్లీ పోలీసులు విఫలం అవుతున్నారని, ఇవీగాక.. దర్యాప్తులో ప్రతీ విషయం మీడియాకు చేరుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది అడ్వొకేట్ జోగిందర్ తులీ(రిటైర్డ్ ఐపీఎస్ కూడా)వాదించారు. అయితే.. కోర్టు మాత్రం సీబీఐ విచారణకు ఆదేశించేది లేదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
శ్రద్ధ హత్య కేసు.. నేరం అంగీకరించని అఫ్తాబ్.. పోలీస్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: శ్రద్ధ వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా పోలీస్ కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగించింది ఢిల్లీ కోర్టు. ఈ కేసులో ఇంకా కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని పోలీసులు కోరడంతో అంగీకరించింది. సాకెత్ కోర్టులో మంగళవారం విచారణ సందర్భంగా ఈ ఘటన క్షణికావేశంలోనే జరిగిందని అఫ్తాబ్ కోర్టుకు చెప్పాడు. విచారణ అనంతరం అఫ్తాబ్ తరఫు న్యాయవాది అవినాశ్ మాట్లాడుతూ.. అతడు ఇంకా కోర్టులో నేరాన్ని అంగీకరించలేదని పేర్కొన్నాడు. ఘటన సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు కూడా న్యాయస్థానం ఎదుట ఒప్పుకోలేదని వివరించాడు. అఫ్తాబ్ కుటుంబ సభ్యులు అతడ్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. కోర్టు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు అఫ్తాబ్‌కు ఐదు రోజుల్లో నార్కో టెస్టు నిర్వహించాలని గత సెషన్లో కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే అతను విచారణకు సహకరించడం లేదని, తప్పుడు సమాచారం ఇస్తున్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అందుకే నార్కో టెస్టుకు ముందు పాలీగ్రాఫ్ టెస్టు నిర్వహించేందుకు అనుమతించాలని కోర్టును కోరారు. శ్రద్ధ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆరు నెలల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. శ్రద్ధ బాయ్ ఫ్రెండ్ అఫ్తాబే ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని 35 ముక్కలు చేసి అడవిలో పడేశాడు. అయితే ఈ కేసులో అఫ్తాబ్ ఉపయోగించిన కత్తి, శ్రద్ధ దుస్తులు, మొబైల్ ఫోన్, ఇంకా కొన్ని శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. చదవండి: అత్యాచార బాధితురాలి నుంచి లంచం తీసుకున్న మహిళా పోలీస్.. -
శ్రద్ధా హత్య కేసు: నిజాలు నిగ్గు తేల్చేందుకు..
శ్రద్ధా వాకర్ హత్య కేసులో.. నిందితుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో నిందితుడి అతిక్రూర స్వభావం బయటపడడంతో ఆధారాలను పక్కాగా కోర్టుకు సమర్పించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో.. నిందితుడిపై పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతించాలని కోర్టు అనుమతి కోరారు. శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాపై పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సోమవారం సాకేత్ కోర్టులో ఢిల్లీ పోలీసులు పిటిషన వేశారు. ఈ కేసులో తొలుత పోలీసులను పక్కదారి పట్టించే విధంగా వ్యవహరించాడు నిందితుడు అఫ్తాబ్. అయితే చివరికి నేరం ఒప్పుకున్నప్పటికీ.. అతని సమాధానాలు పొంతన లేకుండా ఉంటున్నాయని పోలీసులు అంటున్నారు. ఇంతకు ముందు అఫ్తాబ్‌పై నార్కో అనాలసిస్ టెస్ట్ నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులకు సాకేత్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక ఇప్పుడు.. అఫ్తాబ్‌పై పాలీగ్రాఫ్ పరీక్షల నిర్వహణకు అనుమతించాలని సాకేత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలా ఉంటే మెజిస్ట్రేట్ విజయశ్రీ రాథోడ్.. అఫ్తాబ్‌పై నార్కో అనాలసిస్ పరీక్ష నిర్వహణకు అనుమతించారు. దీంతో.. పాలిగ్రాఫ్ అనుమతించే విషయంపై తేల్చాల్సిందిగా మెజిస్ట్రేట్ రాథోడ్ అభిప్రాయసేకరణకు పోలీసుల పిటిషన్‌ను పంపించారు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అవిరల్ శుక్లా. మంగళవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. మరోవైపు ఐదురోజుల కస్టడీ గడువు ముగియడంతో ఢిల్లీ పోలీసులు.. అఫ్తాబ్‌ను కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఢిల్లీ పోలీసులు కోర్టుకు ‘అఫ్తాబ్ తప్పుడు సమాచారం అందించాడని, దర్యాప్తును తప్పుదోవ పట్టించే యత్నం చేశాడ’ని కోర్టుకు నివేదిక సమర్పించారు. ఇక నిందితుడు అఫ్తాబ్‌పై థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దని దర్యాప్తు అధికారులను ఆదేశించిన న్యాయస్థానం.. నార్కో అనాలసిస్‌ను ఐదు రోజుల్లో పూర్తి చేయాలని గత గురువారం ఆదేశించింది. అయితే సోమవారం నిర్వహించాల్సిన ఈ పరీక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇక అతని తరపు న్యాయవాది ఎవరూ వాదించేందుకు ముందుకు రాకపోవడంతో.. న్యాయవాది హర్షిత్ సాగర్‌ను లీగల్ ఎయిడ్ కౌన్సెల్‌గా నియమించిన సంగతి తెలిసిందే. పాలీగ్రాఫ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే.. పాలీగ్రాఫ్ టెస్ట్.. నేర పరిశోధనలో ప్రయోగాత్మకమైన పద్ధతి. లైడిటెక్టర్ పరీక్ష అని కూడా వ్యవహరిస్తుంటారు. నిజాలను రాబట్టడం అనడం కంటే.. అబద్ధాలను గుర్తించడం అనే ట్యాగ్‌తో ఈ పరీక్షగా ఎక్కువగా పాపులర్ అయ్యింది. 1921లో కాలిఫోర్నియా యూనివర్సిటీ మెడికో జాన్ అగస్టస్ లార్సన్ ఈ విధానాన్ని కనిపెట్టారు. ఎలక్ట్రానిక్ యంత్రాల సాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. వైర్లు, ట్యూబుల్లాంటి వాటితో శరీరానికి సెన్సార్ల వంటి నిర్దిష్ట పరికరాలను జోడించి.. బీపీ, పల్స్, వివిధ భావోద్వేగాలు, శరీర కదలికలను జాగ్రత్తగా పర్యవేక్షించడం ద్వారా ఈ టెస్ట్ నిర్వహిస్తుంటారు. శరీరం ఎలా స్పందిస్తుందో నిశితంగా గమనించి ఆ వ్యక్తి చెప్పేది నిజమో అబద్ధమో అనే నిర్ధారణకు అధ్యయనం చేపట్టడం ద్వారా వస్తారు. క్రిమినల్ కేసుల దర్యాప్తుల్లో కీలకంగా వ్యహరిస్తుంటుంది ఈ పరీక్ష. కానీ, ఇదే ఫైనల్ రిజల్ట్ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. నేరస్థులు ప్రాక్టీస్ ద్వారా ఈ పరీక్ష నుంచి తప్పించుకున్న దాఖలాలు బోలెడు ఉన్నాయి. అందుకే ఈ పరీక్ష ఖచ్చితత్వంపై తరచు విమర్శలు వినిపిస్తుంటాయి. నార్కో టెస్ట్.. ఈ పరీక్షకి ముందు కొన్ని మందులు లేదంటే ఇంజెక్షన్లు ఇస్తారు. తద్వారా నిందితుడు/అనుమానితుడు అపస్మార స్థితిలోకి జారుకుంటాడు. మనస్సుపై నియంత్రణ కోల్పోతాడు. అప్పుడు అతని ద్వారా నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తారు. అయితే.. కొన్ని సందర్భాల్లో, సదరు వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకోవచ్చు. డోస్ ఎక్కువగా ఇస్తే కోమాలోకి వెళ్లిపోవడం లేదంటే చనిపోవచ్చూ కూడా. కాబట్టి, నార్కో టెస్ట్‌కు కోర్టు లేదంటే దర్యాప్తు సంస్థల అనుమతి తప్పనిసరి. అంతేకాదు.. అతను నార్కో టెస్ట్‌కు అర్హుడేనా? అనేది కూడా బాడీ టెస్ట్ ద్వారా ధృవీకరించుకుంటారు. ఫోరెన్సిక్ నిపుణులు, దర్యాప్తు అధికారులు, వైద్యులు, మనస్తత్వవేత్తల సమక్షంలో ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్ష జరిగే టైంలో వీళ్లలో ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఆ టెస్ట్ ఆపేయాల్సిందే!.. ఇక కొందరు ఈ పరీక్షలో కూడా దర్యాప్తు బృందాన్ని కూడా తప్పించుకుంటున్నారు. అందుకే ఈ పరీక్షపైనా తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి. కానీ, మన దేశంలో నార్కో టెస్ట్, పాలీగ్రాఫ్ టెస్ట్‌ల ద్వారా కేసుల దర్యాప్తులో పురోగతి సాధించిన సందర్భాలు, కేసుల చిక్కుముడులు విప్పిన దాఖలాలే ఎక్కువగా నమోదు అయ్యాయి. -
శ్రద్ధ వాకర్ హత్య కేసు.. పుర్రె, దవడ స్వాధీనం చేసుకున్న పోలీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ హత్యకు గురైన శ్రద్ధ వాకర్ శరీర భాగాల కోసం పోలీసులు మెహ్రౌలీ అడవిలో ఆదివారం వెతికారు. పుర్రె, దవడ భాగాలతో పాటు మరికొన్ని ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి శ్రద్ధవో కావో నిర్ధరించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. మిగతా శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. అలాగే మైదాన్‌గడీ కొలనులో నీటి స్థాయి తగ్గడంతో గజ ఈతగాళ్లతో అందులో వెతికించారు పోలీసులు. శ్రద్ధ శరీర భాగాలు ఏమైనా దొరుకుతాయేమోనని ప్రయత్నించారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న శరీర భాగాలు శ్రద్ధవో కావో నిర్ధరించనున్నారు అధికారులు. ఇందులో భాగంగా డీఎన్ఏ పరీక్ష కోసం ఆమె తండ్రి, తల్లి నుంచి రక్తనమూనాలు సేకరించారు. వీటి ఫలితాలు రావడానికి 15 రోజులు పడుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు శ్రద్ధవో కావో కచ్చితంగా చెప్పవచ్చని పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో నిందితుడు, శ్రద్ధ బాయ్‌ఫ్రెండ్ ఈ హత్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరక్కుండా చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రద్ధ ఫొటోలను కూడా కాల్చివేసినట్లు పేర్కొన్నారు. మరిన్ని ఆధారాల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ మెహ్రౌలీలో ఆరు నెలల క్రితం జరిగిన హత్య ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అఫ్తాబే తన ప్రేయసిని చంపేసి శరీరాన్ని 35 ముక్కలు చేశాడు. అనంతరం వాటిని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఆ తర్వాత వాటిని అడవితో పాటు ఇతర ప్రదేశాల్లో పడేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా 20 రోజుల పాటు శరీర భాగాలను పడేశాడు. చదవండి: నైట్ క్లబ్లో కాల్పుల మోత.. ఐదుగురు మృతి.. 18 మందికి గాయాలు.. -
సంచలనం సృష్టిస్తున్న శ్రద్ధా వాకర్ హత్య కేసుపై సినిమా!
ప్రియుడి ప్రేమ కోసం కన్నతల్లిదండ్రులనే కాదనుకుందా అమ్మాయి. అయినవాళ్లను కాదనుకునేంత పిచ్చిగా ప్రేమించినందుకు ఆమెకు జీవితమే లేకుండా చేశాడా ప్రియుడు. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న శ్రద్ధా వాకర్ ఉదంతమిదీ! తాజాగా శ్రద్ధా హత్యా కేసును సినిమాగా తెరకెక్కించేందుకు ముందుకు వచ్చాడు బాలీవుడ్ దర్శకనిర్మాత మనీష్ సింగ్. ఇప్పటికే సినిమా పనులు ప్రారంభమయ్యాయని ప్రకటించాడు. పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తూ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న ప్రేమపిశాచాల గురించి సినిమాలో వివరిస్తానని స్పష్టం చేశాడు. బృందావన్ ఫిలింస్ బ్యానర్‌పై సినిమా నిర్మించనున్నట్లు తెలిపాడు. ఈ చిత్రానికి హు కిల్డ్ శ్రద్ధా వాకర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమాలో శ్రద్ధా పాత్రలో ఏ హీరోయిన్ నటిస్తుందో చూడాలి! శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు గురించి.. మూడేళ్ల క్రితం శ్రద్ధా వాకర్, అఫ్తాబ్ మధ్య పరిచయం ఏర్పడింది. ప్రేమించుకున్నారు, పెద్దలు ఒప్పుకోకపోవడంతో సహజీవనం మొదలుపెట్టారు. మే 18న శ్రద్ధ-అఫ్తాబ్‌ల మధ్య గొడవ జరిగింది. ఇంకెన్నాళ్లు సహజీవనం, పెళ్లి చేసుకుందామని పట్టు పట్టింది శ్రద్ధ. కుదరదన్నాడు, గొడవ పెద్దదైంది. శ్రద్ధ గొంతు నలిమి చంపాడు. శవాన్ని మాయం చేసేందుకు పథకం వేశాడు. పెద్ద ఫ్రిడ్జ్ కొని ఇంటికి తెచ్చాడు. శ్రద్ధ శవాన్ని 35 ముక్కలుగా కోసి కవర్లలో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. రోజూ కొన్ని అవయవాలు చొప్పున ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. ఆరు నెలల తర్వాత ఈ కేసు బయటపడింది. ఈ కేసులో నిందితుడు, శ్రద్ధా ప్రియుడు అఫ్తాబ్ నేరాన్ని అంగీకరించగా అతడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. చదవండి: శ్రద్ధా హత్య కేసు, అడవిని జల్లెడ పట్టిన పోలీసులు -
శ్రద్ధ హత్య కేసు.. అడవిని జల్లెడ పట్టిన పోలీసులు.. 3 ఎముకలు స్వాధీనం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణను వేగంగా పుర్తి చేస్తున్నారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా మెహ్రౌలీ అడవిలో శ్రద్ధ శరీర భాగాల కోసం ముమ్మరంగా గాలించారు. నవంబర్ 16న మూడుసార్లు ఈ అడవినంతా జల్లెడపట్టారు. ఈ క్రమంలోనే అక్కడ ఓ పెద్ద ఎముకను గుర్తించారు. అది ఫీముర్(తొడ ఎముక) అయి ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత అడవిలోని ఇతర ప్రాంతాల్లో మరో రెండు ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి కచ్చితంగా శ్రద్ధవే అయి ఉంటాయని చెబుతున్నారు. అడవిని గాలించేందుకు నిందితుడు అఫ్తాబ్‌ను కూడా తీసుకెళ్లారు పోలీసులు. ముక్కలు ముక్కలుగా చేసిన శ్రద్ధ శరీర భాగాలను ఎక్కడ పడేశాడో చూపించమన్నారు. అతడు చెప్పిన వివరాల ప్రకారం అడవినంతా వెతికి మొత్తం మూడు ఎముకలను గుర్తించారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు తొలిసారి ఓ సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 18 తెల్లవారుజామున నిందితుడు అప్తాబ్ తన ఇంటి నుంచి ఓ బ్యాగ్ వేసుకుని, సంచిపట్టుకుని బయటకు వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ బ్యాగులో శ్రద్ధ శరీరా భాగాలు ఉండి ఉంటాయని, అప్తాబ్ వాటిని అడవిలో పడేసేందుకు తీసుకెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఢిల్లీ మొహ్రౌలీలో ఆరు నెలల క్రితం జరిగిన శ్రద్ధ హత్య ఘటన ఇటీవలే వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు, శ్రద్ధ బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. అయితే పోలీసులు ఇంకా శ్రద్ధ శీరర భాగాలన్నింటినీ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అలాగే ఆమె ఫోన్, నిందితుడు ఉపయోగించిన కత్తిని కనిపెట్టాల్సి ఉంది. చదవండి: షాకింగ్.. ఇంజనీరింగ్ కాలేజ్‌లో 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు.. -
యూపీలో మరో శ్రద్ధా వాకర్? నిందితునిపై పోలీసుల ఎన్కౌంటర్!
ప్రేమో, ఆకర్షణో! తెలిసీతెలియని వయసు ప్రభావమో! అమాయక ఆడపిల్లల జీవితమైతే అర్ధాంతరంగా ముగుస్తోంది. నమ్మినవారే నట్టేటముంచితే ఊపిరి అనంతవాయువుల్లో కలిసిపోతోంది. కన్నవారికి పుట్టెడు దుఃఖం మిగుల్చుతున్న దారుణ ఘటనలు దేశంలో తరచూ వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. శ్రద్ధా వాకర్ ఘటన మరువకముందే ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలోనూ ఓ బాలిక ‘ప్రేమ’ మోసానికి బలైంది. మృతురాలు నిధి గుప్తా (17) తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ సూఫియాన్, నిధి ఏడాదికాలంగా రిలేషన్లో ఉన్నారు. ఇంట్లో అనుమానం రాకుండా ఇన్నాళ్లూ నెట్టుకొచ్చిన ఆ అమ్మాయి వ్యవహారం గత మంగళవారం బయటపడింది. దీంతో కోపోద్రిక్తులైన ఆమె కుటుంబ సభ్యులు వారు ఉంటున్న నాలుగో ఫ్లోర్‌లోని గదికి వెళ్లారు. అక్కడ సూఫియాన్, నిధి.. ఆమె కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో నిధి అక్కడ నుంచి అపార్ట్‌మెంట్‌పైకి పరుగెత్తుకెళ్లింది. ఆమె వెంటే ఆ యువకుడు కూడా వెళ్లాడు. ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళనలో ఉన్న అమ్మాయి కుటుంబ సభ్యులకు కెవ్వుమని కేక వినిపించింది. అంతే, తమ బిడ్డ కిందపడి విగతజీవిగా మారిందని తెలుసుకోవడానికి వారికి ఎంతోసేపు పట్టలేదు. వేధించి, ప్రేమ పేరుతో.. అమాయకమైన తమ బిడ్డను సూఫియాన్ వేధింపులకు గురిచేశాడని ఆ తల్లిదండ్రులు ఆరోపించారు. లోకం తెలియని పిల్లకు మాయమాటలతో దగ్గరై ప్రేమ పేరుతో నమ్మించాడని తెలిపారు. మతం మారితేనే పెళ్లి చేసుకుంటానని గత కొన్ని రోజులుగా వేధించినట్టు తెలిసిందని చెప్తూ వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. చివరకు మాట వినడం లేదని ప్రాణాలు తీశాడని, అతన్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ఏం చెప్తున్నారంటే.. ఘటన జరిగిన అనంతరం సూఫియాన్ తప్పించుకుపోయాడని లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్ పీయూష్ మోర్దియా తెలిపారు. మైనర్‌ను నిందితుడు ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఓ మొబైల్ ఫోన్‌ను గిఫ్టుగా ఇచ్చాడని తెలిపారు. నిందితుని పట్టుకునేందుకు 9 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అతని తలపై రూ.25 వేల రివార్డును కూడా ప్రకటించామని తెలిపారు. ఎట్టకేలకు దొరికిన నిందితుడు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు సూఫియాన్ దొరికాడని కమిషనర్ తెలిపాడు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో వారు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. నిందితుని కాలులో బుల్లెట్ దిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. అతనిపై మర్డ్‌ర్ కేసుతోపాటు.. బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. -
పాపం శ్రద్ధా వాకర్.. అప్పుడు కూడా అదే టార్చర్.. 2020 ఫోటో వైరల్
శ్రద్ధా వాకర్.. ఎక్కడ చూసినా, చదివినా ప్రియుడి చేతిలో అన్యాయంగా బలైన ఈ యువతి వార్తలే కనిపిస్తున్నాయి. ఘటన వెలుగులోకి వచ్చి నేటికి వారం అవతున్నా(నవంబర్11న నిందితుడు అఫ్తాబ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు) నిత్యం సంచలన విషయాలు తెరమీదకు వస్తున్నాయి. యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘోర ఈ దారుణ ఘటనలో నిందితుడి ఆఫ్తాబ్ను పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. పోలీస్ కస్టడీలో అఫ్తాబ్ గంటకో కొత్త విషయాలను చెప్పి షాక్‌లా మీద షాక్‌లు ఇస్తున్నాడు. తాజాగా శ్రద్ధా వాకర్‌కు సంబంధించిన ఓ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2020లో తీసిన ఫోటో ఇది. దీనిని చూస్తుంటే అఫ్తాబ్ అమిన్ పునావాలాతో ఆమె రిలేషన్ ఎంత భయంకరంగా ఉందనే దానికి అద్దం పడుతోంది. ఈ ఫోటోలో శ్రద్ధా కళ్లు, ముక్కు, చెంప చుట్టూ గాయాల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అఫ్తాబ్ శ్రద్ధతో నిత్యం గొడవపడేవాడేవాడని తెలుస్తోంది. అయితే తనకు ఎన్ని దెబ్బలు తగిలినా ఈ చిత్రంలో ఆమె నవ్వుతూ ఉండటం విశేషం. చదవండి: షాకింగ్ ఘటన: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా కోసి.. తలను పాలిథిన్ సంచిలో! అంతేగాక ఆమె 2020లో క్రితం 4 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు ఓ ఆసుపత్రి అందించిన నివేదిక ద్వారా తెలిసింది. ‘2020 డిసెంబర్ 3న ప్రియుడు అఫ్తాబ్‌తో కలిసి ముంబై పరిధిలోని ఓజోన్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో చేరింది. భుజం నొప్పితో వచ్చింది. కానీ తన గాయాలకు కారణాలు వెల్లడించలేదు.’ అని ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ శివ ప్రసాద్ షిండే తెలిపారు. మరోవైపు శ్రద్ధా స్నేహితులు కూడా అఫ్తాబ్ ఆమెను ఎంత క్రూరంగా హింసించేవాడో ఒక్కొక్కరుగా బయటకొచ్చి చెబుతున్నారు. శ్రద్ధా వాకర్‌ను తన బాయ్‌ఫ్రెండ్ మానసికంగా హింసించడంతో పాటు శారీరకంగా వేధించేవాడని ఆమె స్నేహితురాలు తెలిపింది. అతనితో సంబంధాన్ని ముగించుకోవాలని ఆమె కోరుకున్నట్లు వెల్లడించింది. కానీ అఫ్తాబ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంతో శ్రద్ధకు ఎలాంటి అవకాశం లేకుండా పోయిందని వాపోయింది. ఆమె అతన్ని విడిచిపెడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని గుర్తు చేసుకుంది. చదవండి: శ్రద్ధ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు.. గంజాయి మత్తులో క్రూరంగా శ్రద్ధ తన జీవితంపై భయపడేదని, వారిద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయని మరో స్నేహితుడు రజత్ తెలిపారు. రాత్రి సమయంలో తనకు వాట్సాప్ మెసెజ్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్లమని కోరేంత వరకు గొడవలు జరిగేవని చెప్పారు. ఒకవేళ ఆఫ్తాబ్‌తోనే కలిసి ఉంటే తనను చంపేస్తాడని భయపడేదని వెల్లడించాడు. 2021లోనూ అఫ్తాబ్ శ్రద్ధాపై దాడి చేశాడని, తాము రక్షించినట్లు తెలిపారు. ఆమె మెడ, ఛాతీపై భాగంలో గాయాలు చూసినట్లు, ముక్కు కూడా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అప్పట్లోనే హెచ్చరించామన్నారు. -
'లివ్-ఇన్ రిలేషన్, పెళ్లి కాదు.. మగాళ్ల మనస్తత్వంలోనే అసలు సమస్య..'
శ్రద్ధ వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. ఆమెను 35 ముక్కలు చేసిన అత్యంత క్రూరమైన ఈ అనాగరిక చర్య సర్వత్రా చర్చనీయాంశమైంది. లివ్-ఇన్ రిలేషన్ల కారణంగానే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ గురువారం అన్నారు. చదువుకున్న అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని, లివ్ ఇన్ రిలేషన్ల జోలికి వెళ్లకుండా నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. అయితే కేంద్రమంత్రి వ్యాఖ్యలకు వివాదాస్పద రచయిత్రి తస్లీమా నజ్రీన్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్లో ఈ విషయంపై స్పందిస్తూ ఓ సందేశం రాసుకొచ్చారు. 'లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేస్తే.. అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి.. లివ్ ఇన్ రిలేషన్ల వల్లే నేరాలు జరుగుతున్నాయని మీరు చెబుతున్నారు. కానీ పెళ్లైన పురుషులు తమ భార్యలను చంపినప్పుడు.. పెళ్లిళ్ల వల్లే నేరాలు జరుగుతున్నాయి, అందుకే పెళ్లి చేసుకోవద్దు.. లివ్ ఇన్ రిలేషన్లే ఎంచుకోండి అని ఎందుకు చెప్పడం లేదు. పెళ్లిళ్లు, లివ్ ఇన్ రిలేషన్లు కాదు.. అసలు సమస్య మగాళ్ల మనస్తత్వంలోనే ఉంది.' అని నజ్రీన్ రాసుకొచ్చారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. When a man kills his girlfriend in a live-in relationship,u ask girls to get married coz live-in encourages crimes. But when men kill their wives,u don't ask girls to go for live-in relationships coz marriage encourages crimes!! Not marriage or live-in,problem is men's mentality. — taslima nasreen (@taslimanasreen) November 17, 2022 మరోవైపు కౌషల్ కిశోర్ వ్యాఖ్యలపై శివసేన నేత ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కౌషల్ కిశోర్‌ను పదవి నుంచి తప్పించాలని కోరారు. ఇలాంటి హేయమైన నేరాళ్లో మహిళలనే నిందించడం క్రూరం, నిర్దాక్షిణ్యంగా అభివర్ణించారు. చదవండి: శ్రద్ధ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు.. గంజాయి మత్తులో క్రూరంగా -
షాకింగ్ ఘటన: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా కోసి.. తలను పాలిథిన్ సంచిలో!
సెల్‌ఫోన్, సరదాలు, చెడు స్నేహాలతో కొంతమంది యువత పెడదోవ పడుతుంటే మరికొందరు వయస్సుతో సంబంధం లేకుండా ప్రేమ, సహజీవనం మోజులో పడి హద్దుమీరుతున్నారు. కొత్త అనుభూతి కోసం చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తొందరపాటు నిర్ణయాలతో బంగారు భవిష్యత్తును చేజేతులా పేకమేడల్లా కూల్చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య చేసు ఇందుకు నిదర్శనంగా నిలిచిన విషయం తెలిసిందే. గంజాయి మత్తులో ప్రియురాలిని అత్యంత క్రూరంగా హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్.. ఆమె శరీరాన్ని 35 భాగాలుగా కోశాడు. అనతంరం ఫ్రిజ్‌లో దాచి పెట్టి ఒక్కొక్క అవయమవాన్ని మెల్లగా ఢిల్లీ అంతటా పడేశాడు. గూగుల్, యూట్యూబ్ వంటి సాంకేతికతను ఉపయోగించి చేసిన తప్పును కప్పిపుచ్చకునే ప్రయత్నం చేశాడు. హత్య జరిగిన విషయం ఎక్కడా పొక్కకుండా హంతకుడు పన్నిన పన్నాగం యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేస్తోంది. 5 రోజుల పరిచయం ఈ ఘటన నుంచి తేరుకోకముందే బంగ్లాదేశ్‌లో మరో ఘోరం వెలుగు చూసింది. ప్రియుడి చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. హత్య చేయడానికి కేవలం అయిదు రోజుల క్రితమే వీరిద్దరికి పరిచయం ఏర్పడటం గమనార్హం. వివరాలు.. అబు బాకర్ అనే యువకుడు సప్నా అనే యవతితో సహజీనం చేస్తున్నాడు. వీరిద్దరూ గత నాలుగు ఏళ్లుగా గోబర్‌చాకా ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. చదవండి: అఫ్తాబ్ డ్రగ్ అడిక్ట్.. గంజాయి మత్తులోనే శ్రద్ధను హత్యచేసి.. రాత్రంతా శవం పక్కనే.. మరో యువతితో.. అబుకి కొన్ని రోజుల క్రితం కవితా రాణి అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇది నెమ్మదిగా ప్రేమకు, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈనెల 5న పని నిమిత్తం సప్నా వేరే ఊరికి వెళ్లిన సమయంలో కవితను అబూ బాకర్ తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే యువకుడికి ఇంతకుముందే మరో యువతితో సంబంధం ఉన్న విషయం కవితకు తెలియడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో ఆవేశానికి లోనైన అబూ.. యువతిని గొంతు కోసి చంపాడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. ఆమె శరీరం నుంచి తలను వేరు చేసి, చేతులను నరికి కాలువలో పడేశాడు. తలను పాలిథిన్ సంచిలో చుట్టి ఉంచి మిగిలిన మృతదేహాన్ని బాక్సులో పడేసి ఇంటి నుంచి పారిపోయాడు. ఈనెల 6న అబూ బాకర్ పనికి రాకపోవడం. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అతను పనిచేస్తున్న రవాణా సంస్థ యజమాని బకర్ అద్దె ఇంటికి ఒక వ్యక్తిని పంపాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో అబూబకర్ అదృశ్యంపై అనుమానంతో యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు షాక్ పోలీసులు వచ్చి తలుపులు తీయగా.. ఇంట్లో చూసిన దృశ్యాలకు షాక్ అయ్యారు. ఓ పెట్టెలో తల లేని యువతి మృతదేహం కనిపించింది. పక్కనే తలను పాలిథిన్‌లో చుట్టి వేరుగా ఉండటాన్ని గుర్తించారు. చేతులు మాత్రం లభించలేదు. బాధితురాలిని కాళీపాడ్ బాచర్ల కుమార్తె కవితా రాణిగా గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించడం ప్రారంభించారు. హత్య చేసిన రోజు రాత్రి అబూ బకర్ తన భాగస్వామి సప్నాతో కలిసి రూప్సా నది దాటి ఢాకాకు బయలుదేరినట్లు గుర్తించారు. నవంబర్ 6 రాత్రి నిందితుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఘాజీపూర్ జిల్లా బసాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అబు బాకర్, ప్రేయసి సప్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో అబూ బకర్ నేరాన్ని అంగీకరించాడు. గోబర్‌చాకా ప్రాంతంలోని ఇరుకైన ప్రదేశంలో పాలిథిన్‌లో చుట్టిన కవిత తెగిపోయిన చేతులను స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: Shraddha Case: అమ్మాయిలే జాగ్రత్త పడాలి! -
శ్రద్ధ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు.. గంజాయి మత్తులో క్రూరంగా
న్యూఢిల్లీ: శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణలో రోజురోజుకు షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా తాను మత్తు పదార్థాలకు బానిసైనట్లు విచారణలో చెప్పాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రద్ధ హత్య జరిగిన రోజు(మే 18) ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అనంతరం బయటకు వెళ్లిన అఫ్తాబ్ గంజాయి తాగి తిరిగి ఇంటికి వచ్చి ఆమెను గొంతునులుమి హత్య చేసినట్లు విచారణలో చెప్పుకొచ్చాడని తెలుస్తోంది. తరచూ గంజాయి తాగుతున్నందుకు శ్రద్ధ తనను తిట్టేదని అఫ్తాబ్ విచారణలో పేర్కొన్నాడు. హత్య జరిగిన రోజు ఖర్చుల విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందని వివరించాడు. డబ్బులు లేక ఇద్దరం ఇబ్బందిపడ్డామని, ముంబై నుంచి తమ లగేజ్ ఢిల్లీకి ఎలా తీసుకురావాలని రోజంతా పోట్లాడుకున్నామని తెలిపాడు. గొడవ అనంతరం గంజాయి మత్తులోనే శ్రద్ధను తాను చంపానని, కావాలని హత్య చేయలేదని అఫ్తాబ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మే 18 రాత్రి 9నుంచి 10 గంటల సమయంలో శ్రద్ధను హత్య చేసిన తర్వాత రాత్రంగా గంజాయి సిగరెట్ తాగుతూ మృతదేహం పక్కనే ఉన్నట్లు అఫ్తాబ్ వివరించాడు. హత్య అనంతరం శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలు చేసిన అఫ్తాబ్ వాటిని 300 లీటర్ల ఫ్రిజ్‌లో దాచాడు. తర్వాత శరీర భాగాలను సమీపంలోని అడవితో పాటు మరికొన్ని ప్రదేశాల్లో పడేశాడు. ఢిల్లీ మెహ్రౌలీలో జరిగిన శ్రద్ధ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిందితుడు అఫ్తాబ్ పోలీస్ కస్టడీని కోర్టు గురువారం మరో ఐదు రోజులు పొడిగించింది. నార్కో టెస్టుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో శ్రద్ధ శరీర భాగాలు ఇంకా అన్నీ దొరకలేదు. ఆమెను ముక్కలు చేసేందుకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. దీనికి ఇంకా చాలా రోజులు పడుతుందని పోలీసులు చెబుతున్నారు. చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను చంపి గుండెపోటుగా చిత్రీకరణ.. మూడు నెలల తర్వాత.. -
Shraddha Case: అమ్మాయిలే జాగ్రత్త పడాలి!
బాగా చదువుకుని, తాము చాలా ఓపెన్‌గా.. నిష్కపటంగా(ఫ్రాంక్‌గా) ఉన్నామని, భవిష్యత్తు గురించి ఎలాంటి నిర్ణయాలైనా తమంతట తాముగా తీసుకోగలమని భావించే అమ్మాయిల విషయంలోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు సహజీవనం అనేది ఎందుకు? ఒకవేళ అలాంటి బంధాలు అవసరం అనుకుంటే.. అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి!. ఒకవేళ తల్లిదండ్రులు అలాంటి వాటికి ఒప్పుకోకపోతే.. న్యాయబద్ధంగా పెళ్లి చేసుకుని కలిసి ఉండాలి... ! శ్రద్ధావాకర్ హత్యోందతాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ చేసిన పైవ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చదువుకున్న అమ్మాయిలు సహజీవనం పేరుతో తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్లడం సరికాదంటూ వ్యాఖ్యానించారాయన. ఈ వ్యాఖ్యలను శివసేన నేత ప్రియాంక చతుర్వేది ఖండించారు. తక్షణమే ఆయన్ని మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారామె. ‘‘అలా ఎందుకు చేస్తున్నారో అనే విషయంపై అమ్మాయిలే జాగ్రత్త పడాలి. చదువుకున్న అమ్మాయిలు అలాంటి బంధాలకు దూరంగా ఉండాలి. అసలు తల్లిదండ్రులు అలాంటి బంధాలకు ఒప్పుకోనప్పుడు.. పూర్తి బాధ్యత ఆ చదువుకున్న అమ్మాయిలదే అవుతుంది కూడా’’ అని మంత్రి కౌశల్ ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘‘ఈ దేశంలో పుట్టడానికి ఆడపిల్లలే కారణమని చెప్పకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. సిగ్గులేని, హృదయం లేని, క్రూరమైన వాళ్ల వల్ల అన్ని సమస్యలకు స్త్రీని నిందించే మనస్తత్వం అభివృద్ధి చెందుతూనే ఉంది అని ఆమె పేర్కొన్నారు. నారీశక్తికి కట్టుబడి ఉంటే తక్షణమే ఆయన్ని తొలగించాలంటూ ప్రధాని కార్యాలయాన్ని డిమాండ్ చేస్తూ ఆమె ట్వీట్ చేశారు. Surprised he didn’t say girls are responsible for being born into this nation. Shameless, heartless and cruel, blame-the-woman-for-all problems mentality continues to thrive. https://t.co/ILYGHjwsMX — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) November 17, 2022 ఇదీ చదవండి: అఫ్తాబ్‌పై ఆ పరీక్షలు నిర్వహిస్తారా? -
Shraddha murder case: నార్కో పరీక్షలకు కోర్టు అనుమతి
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడైన అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు నార్కో పరీక్షలు నిర్వహించడానికి గురువారం ఢిల్లీ కోర్టు అనుమతిచ్చింది. ఇందుకోసం మరో అయిదు రోజులు పోలీసు కస్టడీని పొడిగించింది. మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ శుక్లా నార్కో పరీక్షలకు నిర్వహించడానికి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అఫ్తాబ్ విచారణ జరిగినప్పుడు కోర్టు వెలుపల భారీ సంఖ్యలో నిరసనకారులు చేరుకొని వెంటనే అతనిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. దీంతో అఫ్తాబ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి తెచ్చినందుకు తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్‌ను గొంతు నులిపి హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా కోసి, ఫ్రిజ్‌లో ఉంచి కొన్ని రోజుల పాటు దాచి తర్వాత అఫ్తాబ్ ఆ ముక్కలను పారేయడం తెలిసిందే. హత్యాయుధం దొరక్కపోవడంతో పోలీసులు నార్కో పరీక్షలకు అనుమతి కోరారు. ముఖాన్ని కాల్చేసి.. పోలీసుల విచారణలో అఫ్తాబ్ అమీన్ ఒళ్లు జలదరించే విషయాలు బయటపెడుతున్నాడు. సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి ఎన్నో హేయమైన చర్యలకు దిగాడు. ఆమె ముఖం ఎవరూ గుర్తు పట్టకుండా కాల్చినట్టుగా పోలీసుల ఎదుట అంగీకరించాడు. కట్టెలా బిగుసుకుపోయిన మృతదేహం కొయ్యడానికి వీలుగా వేడినీళ్లలో బ్లీచింగ్ పౌడర్ కలిపి వేశానని, అప్పుడే శవాన్ని కొయ్యగలిగానని పోలీసులు దగ్గర చెప్పినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో నెలకి 20వేల లీటర్ల వరకు నీళ్లు ఉచితమైనా అతని ఫ్లాట్‌కి నీటి బిల్లు రూ.300 పైగా రావడానికి కారణాలను కనుగొన్నారు. మృతదేహాన్ని కోస్తున్నప్పుడు చప్పుడు బయటకు వినిపించకుండా నీళ్ల పైపులు తిప్పి ఉంచాడని, ఇంట్లో మరకలు కనిపించకుండా తరచూ ఫ్లాట్‌ని కడిగేవాడని పోలీసులు విచారణలో తేలింది. వారిద్దరి మధ్య తరచూ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గొడవలు అవుతూ ఉండేవని తెలుస్తోంది. -
శ్రద్ధ హత్యకేసు.. అఫ్తాబ్‌కు ఐదు రోజుల కస్టడీ.. ఉరితీయాలని డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు ఢిల్లీ సాకెత్ కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది. అలాగే నార్కో టెస్టు నిర్వహించేందుకు కూడా అనుమతించింది. దీంతో ఢిల్లీ పోలీసులు అతడికి కీలకమైన నార్కో టెస్టు నిర్వహించనున్నారు. అఫ్తాబ్‌ను గురువారం సాయంత్రం 4 గంటలకు కోర్టు ఎదుట వర్చువల్‌గా హాజరుపరిచారు ఢిల్లీ పోలీసులు. అతనిపా దాడి జరిగే అవకాశం ఉన్నందున భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానం కూడా ఈ కేసు సున్నితత్వాన్ని పరిగణననలోకి తీసుకుని వర్చువల్‌గా విచారించింది. ఉరితీయాలని డిమాండ్.. అయితే విచారణ సమయంలో కోర్టు రూం బయట న్యాయవాదులు పదుల సంఖ్యలో గుమికూడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అఫ్తాబ్‌కు ఉరిశిక్ష విధించాలని వారంతా డిమాండ్ చేశారు. డిల్లీ మెహ్రౌలీలో జరిగిన శ్రద్ధ వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రియుడు అఫ్తాబ్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం శరీరాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచాడు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఒక్కో భాగాన్ని వేర్వేరుగా అడవిలో, ఇతర ప్రదేశాల్లో పడేశాడు. పోలీసులు కొన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అవి శ్రద్ధవో కాదో ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అలాగే మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన కత్తిని, శ్రద్ధ మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మరో ఐదు రోజులు అఫ్తాబ్‌ను కస్టడీలో ఉంచాలని పోలీసులు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. చదవండి: మూడు నెలల క్రితం తండ్రి మృతి.. తల్లి కాల్ రికార్డు విని కూతురు షాక్ -
శ్రద్ధా హత్య కేసు : సాకేత్ కోర్టులో లాయర్ల ఆందోళన..
-
శ్రద్ధా హత్య కేసు: అంతుపట్టని మరో ట్విస్ట్....నివ్వెరపోయిన పోలీసులు
యావత్తు దేశాన్ని భయబ్రాంతులకు గురి చేసిన ఢిల్లీ మెహ్రౌలీ హత్య కేసులో విచారణ చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అప్తాబ్ పూనావాలా, శ్రద్ధ ఇద్దరూ ఢిల్లీలో ఒక ఫ్లాట్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే పోలీసులు ఫ్లాట్ విషయంలో క్లూస్ కోసం దర్యాప్తు చేస్తుండగా.. నీటిబిల్లుల విషయం వారిని ఆశ్చర్యపరిచింది. మొత్తం రూ. 300 పెండింగ్ వాటర్ బిల్ ఉండటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ. 300 బిల్ అనేది పెద్ద మొత్తం కాకపోయిన.. ప్రతినెల 20 వేల లీటర్లు నీరు ఉచితమైనప్పటికీ నీటిని ఎందుకు అధికంగా ఉపయోగించాడనే విషయం పోలీసులకు అంతు చిక్కడం లేదు. మృతదేహాన్ని కట్ చేసే శబ్ద రాకుండా ఉండేందుకు నీళ్లను అలా ఊరికే వదిలేశాడా లేక శరీరం నుంచి వచ్చే రక్తాన్ని కడగటానికి అంత పెద్ద మొత్తంలో నీరు అవసరమైందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ విషయమై ఆ ఆఫ్లాట్ ఓనర్ని కూడా విచారించగా... ఆయన కూడా ఇంత పెద్ద మొత్తంలో నీటి బిల్లులా అని ఆశ్చర్యపోయారు. తాను ఫ్లాట్‌ని వారికి నెలకు రూ.9000లకు అద్దెకు ఇచ్చానని, అగ్రిమెంట్లో ఇద్దరి పేర్లు ఉన్నాయని చెప్పారు. అలాగే అప్తాబ్ ప్రతి నెల 8, 10 తేదీ లోపే అద్దె చెల్లించేయడంతో తాను ఎప్పుడూ ఫ్లాట్‌కి వచ్చే పరిస్థితి ఏర్పడలేదన్నారు. కాగా శ్రద్ధ హత్య జరిగిన ఆరు నెలల తర్వాత ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదీ కూడా ఆమె స్నేహితులు తమతో టచ్‌లో లేదంటూ శ్రద్ధ తండ్రి వికాస్ వాకర్‌కి చెప్పడంతోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారుజ ఐతే శ్రద్ధ శరీర భాగాల్లో ఇంకా చాలా దొరకలేదని, అలాగే అడవిలో దొరికిన భాగాలు శ్రద్ధవి కాదా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు సుమారు 15 రోజులు పడుతుందని పోలీసులు చెప్పారు. హత్య అనంతరం కొనుగోలు చేసిన ఫ్రిజ్, కత్తి బలమైన సాక్ష్యాధారాలని చెబుతున్నారు. తమకు ఇప్పటి వరకు శ్రద్ధ ధరించిన దుస్తులు, మృతదేహాన్ని కోసిన కత్తి దొరకాల్సి ఉందన్నారు. పోలీసులు సాక్ష్యాధారాలను మరింత బలోపేతం చేసేందుకు లై డిటెక్టర్ పరీక్షకు సైతం అనుమతి కోరారు. (చదవండి: శ్రద్ధావాకర్ హత్యకేసులో దిమ్మ తిరిగే ట్విస్టులు.. అలా జరిగి ఉండకపోతే ‘మిస్సింగ్’ మిస్టరీగానే మిగిలేదేమో!) -
‘వాడు నాకు నచ్చలేదు.. నీకూ వద్దమ్మా !’
క్రైమ్: ఢిల్లీ మెహ్రౌలీ సంచలన కేసులో దర్యాప్తు లోతుగా వెళ్లే కొద్దీ.. పోలీసులకు షాకింగ్ విషయాలే తెలుస్తున్నాయి. పోలీసులు సైతం నివ్వెరపోయేలా ఉంటున్నాయి ఈ కేసు పరిణామాలు. ఇప్పటికీ ఆమె సెల్‌ఫోన్, కొన్ని శరీర భాగాలు ఇంకా దొరకలేదు. శ్రద్ధ ముఖాన్ని ఎవరూ గుర్తు పట్టవద్దనే ఉద్దేశంతో కాల్చేసినట్లు తాజాగా వెల్లడించాడు నిందితుడు అఫ్తాబ్. అలా.. నిలువెల్లా క్రూరత్వమే కనిపిస్తోంది ఈ వ్యవహారంలో. మరోవైపు.. శ్రద్ధా వాకర్ హత్యోదంతంలో పోలీసులు, నిందితుడిని ఇవాళ(గురువారం) కోర్టులో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఈ తరుణంలో.. అఫ్తాబ్ పూనావాలా నేరంగీకారంపై బాధితురాలి తండ్రి కన్నీటి పర్యంతం అయ్యారు. కూతురు మరణించిందనే వార్తను వికాస్ వాకర్ ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఫలితం తేలే వరకు ఆమె చనిపోయిందని తాను నమ్మబోనని వికాస్ కన్నీటి పర్యంతం అయ్యాడు. అతను(అఫ్తాబ్) నా ఎదుటే నేరం అంగీకరించాడు. పోలీసుల ఎదుట.. శ్రద్ధ ఇక లేదు అనే మాట చెప్పాడు. ఆ సమాధానంతో కుప్పకూలిపోయా. నేనింకా ఏం వినదల్చుకోలేదు. నాకు ఆ ధైర్యం కూడా రాలేదు. అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు’’ అని ఓ ఇంటర్వ్యూలో వికాస్ వాకర్ వెల్లడించారు. అఫ్తాబ్‌ను గతంలో చాలాసార్లు కలిశాను. ఆ సమయంలో మాట్లాడినప్పుడు అతను మామూలుగానే అనిపించాడు. కానీ, శ్రద్ధ కనిపించకుండా పోయినప్పటి నుంచి అనుమానం మొదలైంది. ‘‘శ్రద్ధ కనిపించకుండా పోయిందని ఆమె స్నేహితురాళ్ల ద్వారానే నాకు తెలిసింది. రెండున్నర నెలలు ఆమె కోసం వెతికాం. ఆచూకీ దొరకలేదు. అఫ్తాబ్ జాడ తెలిశాక.. ఎందుకు విషయం చెప్పలేదని అతన్ని నిలదీశాను. ‘మేమిప్పుడు కలిసి లేనప్పుడు మీకెందుకు చెప్పాలి?’ అని నామీదే కసురుకున్నాడు. రెండున్నరేళ్లుగా ప్రేమించాడు. ఎంత ప్రేమిస్తే నా కూతురు మా మాట కాదని బయటకు వచ్చేస్తుంది. కలిసి ఉన్నప్పుడు.. ఆమె బాధ్యత అతనిది కాదా?. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని పోలీసుల వద్ద ప్రస్తావించా. పోలీసులు కూడా అతని సమాధానాలు పొంతన లేకపోవడంతో.. గట్టిగా విచారించారు. లేకుంటే.. ఈ కేసులో కదలికలు వచ్చేవి కావేమో. శ్రద్ధ-అఫ్తాబ్‌ల ప్రేమ వ్యవహారం 2021 మధ్య దాకా మాకు తెలియదు. కానీ, అంతకు ముందు నుంచే ఓ స్నేహితుడిగా అతను నాకు తెలుసు. వాళ్ల ప్రేమ గురించి తెలియగానే వాడు నాకు నచ్చలేదని ఆనాడే శ్రద్ధతో చెప్పా. అతన్ని పెళ్లి చేసుకోవద్దని సూచించా. మన వర్గానికే చెందిన వ్యక్తిని చేసుకోవాలని శ్రద్ధను కోరా. కానీ, నా కూతురు మాట వినలేదు. సొంత నిర్ణయం తీసుకుంది. ఫలితం.. కన్నవాళ్లకు లేకుండా పోయింది. వాడికి(అఫ్తాబ్)కు ఉరే సరి అని కన్నీళ్లతో వికాస్ చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్యోదంతం.. అసలేం జరిగింది? -
కుటుంబంలో సహజీవనం చిచ్చు.. ముంబై నుంచి ఢిల్లీకి! ఫ్రిడ్జ్‌లో ముక్కలుగా
సాధారణంగా కొనగలిగే స్థితి ఉన్న ప్రతి ఇంట్లోనూ ఫ్రిడ్జ్ ఉంటుంది.. అలాగే ఆ ఇంట్లో కూడా! కానీ అందరి ఇళ్లలో లాగా అందులో కేవలం కూరగాయలు, పండ్లు, పాలు, నీళ్లు మాత్రమే కాదు.. ముక్కలు ముక్కలుగా చేసిన మనిషి అవయవాలు కూడా ఉన్నాయి! అంతేనా.. ఆ ఫ్రిడ్జ్ ఓనర్ ఆ అవయవాలతో పాటు తను తినే ఆహార పదార్థాలను కూడా అందులోనే పెడతాడు. అర్ధరాత్రుళ్లు నిద్రలేచి ఆ ఫ్రిడ్జ్‌ను తెరిచి అందులో ఉన్న ఆ అవయవాలను తీసుకుని.. ఢిల్లీ రోడ్లపై అంతటా విసిరేస్తాడు. ఐదు నెలల తర్వాత అసలు విషయం బయటపడటంతో పోలీసుల చేతికి చిక్కాడు ఆ వ్యక్తి. అతడి పేరు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా. తనను నమ్మి.. తల్లిదండ్రులను కూడా కాదనుకుని.. తన వెంట వచ్చిన యువతిని అత్యంత పాశవికంగా హత్య చేసిన క్రూర మనస్తత్వం ఉన్న వ్యక్తి. అతడిని పిచ్చిగా ప్రేమించి తొలుత తల్లిదండ్రులకు.. ఆ తర్వాత ఈ లోకానికి శాశ్వతంగా దూరమైన అమ్మాయి శ్రద్ధా వాకర్. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై స్పందించిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి.. ఆడ పిల్లలు తమకు దూరంగా ఉన్నా.. తమను కాదనుకుని వెళ్లిపోయినా నిరంతరం వాళ్లను గమనిస్తూనే ఉండాలంటూ తల్లిదండ్రులకు ఓ సూచన చేశారు. శ్రద్ధ ఇలా బలైపోవడంలో ఆమె తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు కూడా బాధ్యత ఉందంటూ చర్చకు తెరతీశారు. ఇంతకీ శ్రద్ధ విషయంలో ఏం జరిగింది? ఆమె నిండు నూరేళ్ల జీవితం ఇలా అర్ధంతరంగా ముగిసిపోవడానికి అసలు కారకులు ఎవరు? అమ్మాయైనా, అబ్బాయైనా ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నంత మాత్రాన పెద్దలు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టడం సబబేనా? కాస్త ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడితే గుడ్డిగా ఓ వ్యక్తిని నమ్మి జీవితాన్ని పణంగా పెట్టడం సరైందేనా? ఆఫ్తాబ్ లాంటి దుర్మార్గుల చేతుల్లో ఇంకెంత మంది శ్రద్ధలు బలైపోవాలో అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ ఘటనపై చర్చించుకుంటున్నారు. ముచ్చటైన కుటుంబం మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన వికాస్ వాకర్ తనకున్న ఎలక్ట్రానిక్స్ సర్వీస్ షాప్ ద్వారా ఆదాయం పొందుతూ కుటుంబాన్ని పోషించేవారు. ఆయనకు భార్య సుమన్,25 ఏళ్ల కూతురు శ్రద్ధ, 23 ఏళ్ల కొడుకు శ్రీజయ్ ఉన్నారు. ఉద్యోగం వెతుక్కునేందుకు 2018లో ముంబైకి వచ్చింది శ్రద్ధ. మలాద్‌లోని ఓ బహుళజాతి కంపెనీ కాల్ సెంటర్లో ఉద్యోగం సంపాదించింది. ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా కూడా అదే కాల్ సెంటర్లో పనిచేసేవాడు. చిచ్చు పెట్టిందెవరు? అలా ఒకే చోట పనిచేస్తున్న క్రమంలో డేటింగ్ యాప్ ద్వారా మరింత చేరువై ఇద్దరూ ‘ప్రేమ’లో పడ్డారు. 2019 నుంచి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. మలాద్‌లోని ఓ ఇంట్లో ఇద్దరూ కలిసే ఉండేవారు. కొన్ని నెలల తర్వాత ఈ విషయాన్ని శ్రద్ధ తన తల్లికి చెప్పింది. అలాగే కూతురి సహజీవనం గురించి తండ్రికి కూడా తెలిసింది. కూతురి నిర్ణయాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. పూర్తి వివరాలు తెలుసుకుందామని శ్రద్ధను ఓసారి పాల్ఘర్కు రమ్మన్నారు. అందరికీ ఇలాంటివి అచ్చిరావని... ఆఫ్తాబ్తో బంధం తెంచుకోమంటూ బిడ్డకు నచ్చజెప్పచూశారు. PC: Instagram ‘‘మీ దృష్టిలో నేను ఇక నుంచి చచ్చిన శవాన్ని’’ కానీ.. ఆమె వినలేదు. తను ప్రేమించిన వ్యక్తితోనే ఉంటానని.. అతడినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. ఈ క్రమంలో తల్లిదండ్రులతో గొడవపడి తన వస్తువులు తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ‘‘మీ దృష్టిలో నేను ఇక నుంచి చచ్చిన శవాన్ని’’ అంటూ వాళ్లను వీడింది. కానీ.. శ్రద్ధకు అప్పుడు తెలియదు ప్రియుడి రూపంలో చావు తనను సమీపిస్తోందని! తమ మాట వినలేదన్న కోపమో... మరీ ఎక్కువగా వాదిస్తే ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతుందేమోనన్న భయమో.. కూతురు కోరుకున్నట్లుగానే తల్లిదండ్రులు ఆమెకు దూరంగా ఉండసాగారు. అయితే, సామాజిక మాధ్యమాల్లో తనను ఫాలో అయ్యే తన స్నేహితుల ద్వారా ఎప్పటికప్పుడు శ్రద్ధ గురించి వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు. తల్లి మరణం తర్వాత ఇక శ్రద్ధ తల్లి కూతురి మీద ప్రేమ చంపుకోలేక అప్పుడప్పుడూ ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవారు. జనవరి 23, 2020లో ఆమె కన్నుమూశారు. కన్నతల్లిని కడసారి చూసేందుకు వచ్చిన శ్రద్ధ అంత్యక్రియలు ముగియగానే మళ్లీ ఆఫ్తాబ్ దగ్గరికి వెళ్లిపోయింది. కూతురి విషయాన్ని భర్తతో చర్చించిన శ్రద్ధ తల్లి.. ఆఫ్తాబ్ ప్రవర్తన గురించి ఆయనకు చెప్పారు. ఆఫ్తాబ్ తరచుగా తమ కూతురిని హింసిస్తున్నాడన్న విషయాన్ని భర్తతో పంచుకున్నారు. అతడిని వదిలేయమని చెప్పినా వినడం లేదంటూ తల్లి హృదయం ఎంతగా విలవిల్లాడుతుందో భర్తకు చెప్పుకొన్నారు. ఎంత అమాయకత్వం తల్లీ! కనీసం తల్లి మరణం తర్వాతైనా కూతురిలో మార్పు వస్తుందేమోనన్న ఆశతో శ్రద్ధతో మరోసారి ఆఫ్తాబ్ గురించి మాట్లాడాడు వికాస్. కానీ.. లాభం లేకుండా పోయింది. ఆఫ్తాబ్ తనను తిట్టినా కొట్టినా సారీ చెబుతాడంటూ తండ్రికే నచ్చజెప్పబోయింది. అంతగా అతడి ‘ప్రేమ మాయ’లో పడిపోయిందామె. కూతురి అమాయకత్వానికి మరింతగా బాధపడ్డ ఆ తండ్రి.. ఆఫ్తాబ్ నుంచి విడిపోతేనే నీ బతుకు బాగుంటుందంటూ మరోసారి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ తను వినకపోవడంతో రెండేళ్లుగా ఆమెతో మాట్లాడమే మానేశాడు ఆ మనసు విరిగిన తండ్రి. అయితే, కూతురి స్నేహితుల ద్వారా ఆమె క్షేమసమాచారాలు తెలుసుకుంటేనే ఉన్నాడు. ముంబై నుంచి ఢిల్లీకి సహజీవనం గురించి ఆఫ్తాబ్ ఇంట్లో కూడా తెలిసిపోవడంతో వాళ్లు కూడా వ్యతిరేకించారు. ఓవైపు కుటుంబాలకు దూరం.. మరోవైపు.. జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలన్న ఆశ.. ఆఫ్తాబ్తో కలిసి ఢిల్లీకి పయనమైంది శ్రద్ధ. మొదటి రోజు ఓ హోటల్లో స్టే చేశారు. మరుసటి రోజు మరో హోటల్‌కు తీసుకెళ్లాడు ఆఫ్తాబ్. మూడో రోజు ఛత్తర్‌పూర్‌లో తమ స్నేహితుల ఇంట్లో తలదాచుకున్నారు. అక్కడే ఓ ఇల్లును అద్దెకు తీసుకున్నారు. అదే శ్రద్ధను శాశ్వతంగా నిద్రపుచ్చిన చోటు! అప్పటికే ఆఫ్తాబ్ ఉద్యోగం సంపాదించాడు. శ్రద్ధ జాబ్ కోసం వెదుకులాట మొదలుపెట్టింది. ఫోన్ స్విచ్ఛాఫ్ ఆఫ్తాబ్తో కలిసి ఉన్న సమయంలో కుటుంబంలో పూర్తిగా సంబంధాలు తెంచేసుకున్న శ్రద్ధ తండ్రి, సోదరుడితో మాట్లాడటం మానేసింది. అయితే, ఆమె స్నేహితుల ద్వారా ఢిల్లీలో ఉన్నట్లు తెలుసుకున్నారు వాళ్లు! శ్రద్ధ సోదరుడు శ్రీజయ్ స్నేహితుడు లక్ష్మణ్ నాడార్ 2022 సెప్టెంబరులో ఆమెకు కాల్ చేయగా స్విచ్ఛాఫ్ వస్తోందని అతడికి చెప్పాడు. గత రెండు నెలలుగా ఇదే తంతు అని.. అక్క గురించి తెలుసుకోమంటూ సూచించాడు. తమకు శ్రద్ధ కాంటాక్ట్‌లో లేదని చెప్పాడు శ్రీజయ్. ఈ విషయం గురించి తండ్రితో చెప్పడంతో.. వికాస్ శ్రద్ధ గురించి లక్ష్మణ్‌తో మాట్లాడాడు. గతంలో తాను రెండు మూడుసార్లు శ్రద్ధతో మాట్లాడానని.. అయితే, రెండు నెలలుగా మాత్రం తనతో కాంటాక్ట్‌లో లేదని, మొబైల్ స్విచ్ఛాఫ్ వస్తోందని చెప్పాడు లక్ష్మణ్. కీడు శంకించిన తండ్రి మనసు తండ్రి మనసు ఏదో కీడు శంకించింది. వెంటనే శ్రద్ధ మిగతా ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడాడు. వాళ్ల నోటి నుంచి కూడా అదే మాట! రెణ్నెళ్లుగా స్విచ్ఛాఫ్! ఇక ఆలస్యం చేస్తే లాభం లేదనుకుని స్థానిక పోలీసులను ఆశ్రయించాడు శ్రద్ధ తండ్రి వికాస్. కూతురి మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు. ఆమె ఢిల్లీలో ఉందని తెలుసుకున్న పోలీసులు అక్కడి పోలీసులను ఆరాతీశారు. దీంతో నవంబరు 9న శ్రద్ధ తండ్రి పేర ఢిల్లీలోని మెహ్రౌలీలో గల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆఫ్తాబ్తో పాటు తన కూతురు ఛత్తర్‌పూర్‌లో సహజీవనం చేస్తోందని పోలీసులకు చెప్పాడు వికాస్. దీంతో విచారణ మొదలుపెట్టారు పోలీసులు. ముందుగా ఆఫ్తాబ్ ఫోన్‌ను ట్రాక్ చేశారు. మే 19 నుంచి అతడు ఢిల్లీలోనే ఉన్నట్లు లొకేషన్ ద్వారా ట్రేస్ చేశారు. అదే రోజు నుంచి శ్రద్ధ ఫోన్ స్విచ్ఛాఫ్ అయిన విషయాన్ని కూడా గమనించారు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు.. ఆఫ్తాబ్ ఇంటికి చేరుకుని ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. కట్టుకథ బాగానే అల్లాడు తనను నమ్మి వచ్చిన శ్రద్ధను ప్రేమ పేరిట వంచించి ఆమెను పొట్టనపెట్టుకున్న ఆఫ్తాబ్ తనకేమీ తెలియదన్నట్లు పోలీసుల ముందు ఓ కట్టుకథ అల్లాడు. శ్రద్ధతో తనకు ఓ రోజు పెద్ద గొడవ కావడంతో ఆమె ఇల్లు విడిచి పెట్టి వెళ్లిపోయిందని.. ఆమెతో మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చిందంటూ కల్లబొల్లి మాటలు చెప్పాడు. అతడి మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో ఇల్లంతా వెదికారు పోలీసులు. కానీ వాళ్లకు ఆధారాలేమీ దొరకలేదు. అయినా మరోసారి అతడిని విచారించగా ఈసారి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసుల అనుమానం బలపడింది. తమదైన శైలిలో విచారించగా.. నోరు విప్పి అసలు నిజం చెప్పాడు ఆఫ్తాబ్. నిశ్చేష్టులవడం అక్కడున్న వాళ్ల వంతైంది. శ్రద్ధ పాలిట కాళరాత్రి మే 18న శ్రద్ధ- ఆఫ్తాబ్‌ల మధ్య గొడవ జరిగింది. ఇంకెన్నాళ్లు సహజీవనం.. పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది శ్రద్ధ. ససేమిరా అన్నాడు ఆఫ్తాబ్. గొడవ పెద్దదైంది. శ్రద్ధ గొంతును గట్టిగా నులిమాడు ఆఫ్తాబ్. ఆమె ఊపిరి ఆగేంత వరకు అలా గొంతును నొక్కిపెట్టాడు. ఆ తర్వాత శవాన్ని ఎలా మాయం చేయాలా అని కుయుక్తులు పన్నాడు. ఫ్రిడ్జ్ కొని... మే 19న ఆఫ్తాబ్ స్థానిక మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడే ఓ షాపులో పెద్ద ఫ్రిడ్జ్ కొన్నాడు. ఇంటికి వచ్చి శ్రద్ధ శవాన్ని బాత్రూమ్లోకి తీసుకెళ్లి ముక్కముక్కలుగా నరికాడు. కొని తెచ్చిన పాలిథీన్ కవర్లలో వాటిని వేశాడు. ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పటికీ ఎండాకాలం కావడంతో బాడీ పార్ట్స్ నుంచి వాసన రావడం మొదలైంది. దీంతో ఆ దుర్వాసన పోగొట్టేందుకు రూమ్ ఫ్రెషనర్స్ స్ప్రే చేసేవాడు ఆఫ్తాబ్. మరీ ఇంత క్రూరంగా శ్రద్ధ శవాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆఫ్తాబ్.. అదే ఫ్రిడ్జ్‌లో మంచినీళ్లు, పాల ప్యాకెట్లు పెట్టుకునేవాడు. రోజుకు కొన్ని అవయవాలు ముక్కలు చేసేవాడు. బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినేవాడు. తెల్లవారుజామున రెండు గంటలకు నిద్రలేచి.. ఆ ముక్కలను పాలిథీన్ కవర్లలో నింపి మెహ్రౌలీ అటవీ ప్రాంతానికి చేరుకుని అక్కడక్కడా పారేసేవాడు. మళ్లీ తిరిగొచ్చి ఏమీ తెలియనట్లుగా తన రూమ్‌లో నిద్రపోయేవాడు. అలా 18 రోజుల పాటు ఇదే తంతు. జూన్ 5 వరకు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో శ్రద్ధ బాడీ పార్ట్స్‌ను పడేశాడు ఆఫ్తాబ్. ఆ సమయంలో ఇరుగుపొరుగు వారితో మాట్లాడేవాడు కాదు అతడు. పోలీసుల గాలింపు ఆఫ్తాబ్ చెప్పిన విషయంతో పోలీసులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. అతడిని తీసుకుని ఏయే చోట్ల అవయవాలు పడేశాడు ఆయా చోట్లకు వెళ్లారు పోలీసులు. కొన్నిచోట్ల మాత్రమే ఆధారాలు సేకరించగలిగారు. ఇప్పటికే హత్య జరిగి ఐదు నెలలు పూర్తైంది కాబట్టి అన్నీ సేకరించడం కాస్త కష్టంగా మారింది. నన్నెలా పట్టుకుంటారు? అంత దారుణంగా ఓ అమ్మాయిని పొట్టనబెట్టుకున్న ఆఫ్తాబ్కు తనపై తనకు నమ్మకం ఎక్కువ. పోలీసులు తన దాకా రాలేరని భావించాడు. అందుకే ఫ్రిడ్జ్‌ను అలాగే ఇంట్లో పెట్టుకున్నాడు. ఫోరెన్సిక్ టెస్టులో దీని ద్వారా ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. అయితే, శ్రద్ధ శవాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగించిన కత్తి మాత్రం ఇంకా పోలీసులకు దొరకలేదు. ప్రస్తుతం ఆఫ్తాబ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. కాబట్టి త్వరలోనే ఆ కీలకమైన ఆధారాన్ని కనిపెట్టే అవకాశం ఉంది. ఇక ఇంతటి హేయమైన నేరానికి పాల్పడ్డ ఆఫ్తాబ్.. శ్రద్ధ శవాన్ని మాయం చేయడంలో అమెరికన్ క్రైమ్ సిరీస్ డెక్స్టర్ స్ఫూర్తి అని చెప్పడం గమనార్హం. నేను నమ్మను.. నా కూతురు లేదంటే నేను నమ్మను శ్రద్ధ తండ్రి తన కూతురు లేదన్న నిజాన్ని ఇంకా నమ్మలేకపోతున్నారు. తన కూతురిని ఇంత దారుణంగా చంపినా ఆఫ్తాబ్‌లో పశ్చాత్తాపం లేదని.. నేరాన్ని అంగీకరించే సమయంలోనూ తనెంతో మామూలుగా కనిపించాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్ నివేదికలు వచ్చి.. ఆ బాడీ పార్ట్స్ తన కూతురివి అని తేలిన తర్వాతే నమ్ముతానంటూ బోరున విలపించారు. నమ్మించి నిట్టనిలువునా కూలదోసి ఆఫ్తాబ్ను నమ్మి తన ప్రాణాలు పోగొట్టుకుంది శ్రద్ధ. శ్రద్ధ మాత్రమే కాదు ఆఫ్తాబ్ లాంటి మేకవన్నె పులులను నమ్ముతున్న అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. కిరణ్ బేడి అన్నట్లుగా శ్రద్ధ తల్లిదండ్రులు మాత్రమే కాదు.. వాళ్లతో ఆఫ్తాబ్ పేరెంట్స్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందంటున్నారు ఈ ఘటన గురించి తెలిసినవారు. ఆడపిల్లలతో పాటు అబ్బాయిల తల్లిదండ్రులు కూడా.. స్వచ్ఛమైన బంధాల గురించి పిల్లలకు చిన్ననాటి నుంచే అర్థమయ్యేలా చెప్పాలని, కౌమార దశలో స్నేహితుల్లా మారి వారి అభిరుచులు తెలుసుకుంటూ.. ఆకర్షణకు, ప్రేమకు మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలిసేలా చేయాలని అంటున్నారు. (ఇన్పుట్స్: ఇండియా టుడే) చదవండి: Shraddha Murder Case: ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో రొమాన్స్ ప్రేయసిని 35 ముక్కలు చేసిన హత్యోదంతం.. ఆ ఒక్క అబద్దమే అతడ్ని పట్టించింది.. -
అయినాసరే ఆడబిడ్డల్ని గమనిస్తూ ఉండాలి: కిరణ్ బేడీ
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది శ్రద్ధా వాకర్ హత్యోదంతం. దేశ రాజధానిలో ప్రియుడి చేతిలో కిరాతకంగా హత్యకు గురైంది ఆమె. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో దాచి.. ఆపై నగరంలో అక్కడక్కడ పడేశాడు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా. ఆలస్యంగా వెలుగు చూసి వార్తల్లో ప్రముఖంగా నిలిచిన ఈ కేసుపై మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డల విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీతో ఎలాంటి సంబంధం లేదని వాళ్లు చెప్పినా సరే ఆ మాటల్ని పట్టించుకోకూడదు. వాళ్లను నిరంతరం గమనిస్తూ ఉండాలి అని తల్లిదండ్రులకు సూచించారామె. ఢిల్లీ ఉదంతంపై స్పందిస్తూ.. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ, ఆమె ఆచూకీ గురించి ఆలస్యంగా పట్టించుకున్నారు ఆమె కుటుంబ సభ్యులు. కాబట్టి, జరిగిన దారుణానికి బాధ్యత ఆ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులపై కూడా ఉంటుంది అని కిరణ్‌బేడీ తెలిపారు. శ్రద్ధ తల్లిదండ్రులు ఆమె బాగోగుల గురించి మరింత పట్టించుకుని ఉండాల్సింది. ఆమె ఉంటున్న ఫ్లాట్ చుట్టుపక్కల వాళ్లు, యజమాని సైతం బాధ్యతగా వ్యవహరించి ఉండాల్సింది. ఒకరకంగా ఈ ఘటనకు ఆమె కుటుంబమే కారణంగా అనిపిస్తోంది. అంతేకాదు.. ఇది సమాజ వైఫల్యం, స్నేహితులది కూడా అని కిరణ్‌బేడీ ఓ జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు. ఆడపిల్లను పెంచే సామాజిక బాధ్యతపై ఆమె స్పందిస్తూ.. స్వతంత్ర భావజాలం అలవర్చుకునేలా అమ్మాయిలను పెంచాలని ఆమె తల్లులకు సూచించారు. ఆపై వారు(ఆడపిల్లలు) ఎలా ఉంటారో? ఎక్కడ జీవిస్తారో? అని ఆందోళన చెందొద్దని, వారికి భరోసా ఇవ్వడం కుటుంబం యొక్క బాధ్యత అని ఆమె అభిప్రాయపడ్డారు. శ్రద్దా వాకర్ హత్య కేసు దర్యాప్తుపైనా స్పందించిన కిరణ్ బేడీ.. డేటింగ్ యాప్‌లో శ్రద్ధకు నిందితుడు అఫ్తాబ్ ఎలా దగ్గరయ్యాడు? అనే కోణంలోనూ తప్పనిసరిగా దర్యాప్తు చేపట్టాలని అధికారులకు సూచించారామె. సంబంధిత వార్త: శ్రద్ధ శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో రొమాన్స్! -
Shradha Sharma: మీ కథే.. ఆమె కథ.. పబ్లిష్ చేసుకోండిలా!
యువర్ సక్సెస్ స్టోరీ... ఎవరి విజయగాథను వారే స్వయంగా రాసుకుని, ఇక్కడ పబ్లిష్ చేసుకోవచ్చు. విజయం సాధించటంలో ఎదుర్కొన్న సవాళ్లు, ప్రతి సవాళ్లను కూడా స్వేచ్ఛగా తెలియచేసుకోవచ్చు. ఎంతోమందికి మార్గనిర్దేశం చేస్తూ, ఉత్తేజాన్ని ఇస్తూ, ఆదర్శంగా నిలిచే ప్రదేశం ఇది. అదే –యువర్ స్టోరీ. దీని ఫౌండర్ శ్రద్ధా శర్మ. ప్రపంచంలో విజయం సాధించిన వారు చాలామంది ఉంటారు. కాని అందరి విజయగాథలు తెలుసుకునే అవకాశం ఉండదు. అటువంటి వారి గురించి అందరూ తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు యువర్ స్టోరీ ఫౌండర్ అండ్ సిఈవో శ్రద్ధా శర్మ. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల విజయగాథలను ప్రతి ఇంటికి చేరువ చేయాలనే లక్ష్యంతో ‘యువర్ స్టోరీ’ అనే సామాజిక మాధ్యమాన్ని స్థాపించారు శ్రద్ధా శర్మ. ఇప్పటికి ఈ మాధ్యమం ద్వారా 70,000 విజయ గాథలను పరిచయం చేశారు. ‘‘సమాజంలో మనలో ఒకరుగా, మన చుట్టూ ఉన్నవారి విజయాలను అందరికీ తెలియచేయటానికే ఈ వేదిక ఏర్పాటు చేశాను’’ అంటారు శ్రద్ధా శర్మ. ఇదే కారణం... ‘యువర్ స్టోరీ’ అంటూ ప్రారంభించిన శ్రద్ధా శర్మ సొంత స్టోరీ కూడా ఆసక్తికరమే. శ్రద్ధా పాట్నా వాస్తవ్యురాలు. ప్రాథమిక విద్య అయ్యాక ఢిల్లీలో మంచి పేరు పొందిన ‘సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ’నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ, అహ్మదాబాద్ ‘ఎం.ఐ.సి.ఏ’ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. చదువులో ముందున్న శ్రద్ధాశర్మకు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’, ‘సి.ఎన్.బి.సి’ వంటి ప్రముఖ మీడియా సంస్థ లలో పనిచేసే అవకాశం వచ్చింది. సిఎన్‌బిసి లో ఉన్నత పదవిలో పనిచేశారు. ఆ సంస్థలో పనిచేస్తున్న రోజుల్లోనే శ్రద్ధా శర్మ ఎంతోమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో నేరుగా మాట్లాడి ఆ కథలను ప్రసారం చేశారు. అలా ఎంతోమంది సిఈవోలతో మాట్లాడే అవకాశం కలిగింది శ్రద్ధా శర్మకు. వారి విజయగాథలను నేరుగా పరిశీలించిన శ్రద్ధా శర్మకు మనసులో ఒక కొత్త ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనే 2008లో ‘యువర్ స్టోరీ’ ప్రారంభించటానికి ముఖ్య కారణం. పెద్దల ఆదరణ.. ఇందులో వ్యాపార ధోరణి లేదు. అయితే అందరికీ ఈ విషయంలో అనుమానం కలుగుతుంది. చాలామంది ‘‘మీరు డబ్బులు ఎలా సంపాదిస్తారు. బహుశ మీ వారు మీకు ఫైనాన్స్ చేస్తున్నారేమో’’ అని శ్రద్ధాను చాలామందే ప్రశ్నించారు. అంతేకాదు, ‘ఇది ఒక సంవత్సరం కంటె నిలబడదు’ అంటూ నిరుత్సాహపరిచారు కూడా. అందరి ఆలోచనలు తప్పు అని నిరూపించారు శ్రద్ధా శర్మ. ‘యువర్ స్టోరీ’ ప్రారంభించిన తొలినాళ్లలోనే ఈ మాధ్యమం ఎందరినో ఆకర్షించింది. ఇందులోని నిజాయితీ పెద్దలకు చేరింది. వెంటనే ‘రతన్ టాటా’ ఫండింగ్ చేయటానికి ముందుకు వచ్చారు. ఆయనతోపాటు టీవీ మోహన్ దాస్ పై, యూనివర్సిటీ ఆఫ్ బర్క్లీ వారు కూడా సహకరిస్తున్నారు. పన్నెండు భాషలలో విజయవంతంగా నడుస్తోంది. ప్రతి నెల 15 మిలియన్ల వ్యూస్‌తో పాటు, 20 మిలియన్ల మందికి చేరుతోంది. టీచర్ మాటలే నాకు బలం.. శ్రద్ధా గురించి ‘వన్ హూ హాస్ షాటర్డ్ ద గ్లాస్ సీలింగ్’ అని ది హిందూ రాసిన వ్యాసంతో శ్రద్ధా శర్మ ప్రపంచానికి పరిచితులయ్యారు. ‘నాస్కామ్’ అవార్డు అందుకున్నారు. లోరియల్ ఫెమినా అవార్డును, 2015లో అత్యంత ప్రభావితం చేసిన లింక్డ్ ఇన్ –500 లలో ఒకరుగా నిలిచారు. 2016లో ఇంటర్నెట్ కాటగిరీలో మోస్ట్ వ్యూడ్ సిఈవోగా నిలిచారు. ‘యువర్ స్టోరీ జర్మనీ’ ప్రారంభించి భారత్, జర్మనీల మధ్య వారధిగా నిలిచారు. ‘నేను ఒక బిహారీని, నేను చాలా వెనకబడ్డాను అనుకోకుండా అదే నీకు బలంగా భావించాలి’ అని తన టీచర్ చెప్పిన మాటలు విజయం సాధించటంలో పరుగులు తీయించాయని, గర్వంగా తలెత్తుకు తిరుగుతున్నానని శ్రద్ధా శర్మ చెబుతారు. చదవండి: అమెరికన్ వాల్స్‌పై రీతూ పెయింటింగ్స్! -
సస్పెన్స్ థ్రిల్లర్
ఎస్ఎన్ చిన్న, హేమంత్, శ్రద్ధ, చైత్ర, నందిని ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘చిన్నాతో ప్రేమగా’. పీవీఆర్ దర్శకత్వంలో ఎస్.యన్. ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బి. చండ్రాయుడు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా బి. చండ్రాయుడు మాట్లాడుతూ– ‘‘మంచి కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సీనియర్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఒక ముఖ్యమైన పాత్ర చేయడంతో పాటు మూడు పాటలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ఈ వారంలో పూర్తవుతుంది. మరో మూడు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. చిట్టిబాబు కామెడీ, ప్రియాంక క్లాసికల్ డ్యాన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ’’అన్నారు పీవీఆర్. ఈ చిత్రానికి కెమెరా: రెబాల సుధాకర్ రెడ్డి, సంగీతం: రాజ్ కిరణ్. -
కిడ్ని రాకెట్ కేసులో శ్రద్ధ ఆస్పత్రి సీజ్
-
కన్పించకుండా పోయిన శ్రద్ధా ఆస్పత్రి యాజమాన్యం
-
‘హసీనా పార్కర్' :మైండ్ బ్లోయింగ్ టీజర్
ముంబై: శ్రద్ధాకపూర్ అప్ కమింగ్ 'హసీనా పార్కర్' ట్రైలర్ రిలీజ్ అయింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పాత్రలో చాలెంజింగ్‌గా కనిపిస్తోంది. ఇప్పటికే ఫస్ట్‌లుక్, పోస్టర్లతో కట్టుకున్న ఈ మూవీ తాజా ట్రైలర్ కూడా అదే రీతిలో మైండ్ బ్లోయింగ్ లుక్ లో అదరగొడుతోంది. అటు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త అవతారంలో తనను చూడబోతున్నారని చిత్రం రిలీజ్కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ శ్రద్ధా కపూర్ ట్విట్టర్లో ట్రైలర్‌ను పోస్ట్ చేసింది. నాహిద్ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దావూద్ పాత్రలో శ్రద్ధా సోదరుడు సిద్ధాంత్ కపూర్ నటిస్తున్నాడు. ఆగస్ట్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. -
శ్రద్ధా, పర్హాన్ లకు ఏమైంది?
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రముఖ నటుడు ఫర్హాన్ అక్తర్ లపై వచ్చిన తాజా పుకార్లపై, శ్రద్ధ తండ్రి, సీనియర్ నటుడు శక్తి కపూర్ స్పందించారు. ఫర్హాన్ ఇంటినుంచి తన కూతురిని బయటకు లాక్కొచ్చేశాడన్నవార్తలను రూమర్లని కొట్టిపారేశాడు. ఇది పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ఇదే విషయంలోతనను ఫోన్ లో కూడా ప్రశ్నించారని.. ఇలాంటి వదంతులను నమ్మొద్దని పేర్కొన్నారు. తాను 35 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమలోఉన్న తను అలా ప్రవర్తించనని శక్తి స్పష్టం చేశారు. అయితే బాలీవుడ్ మూవీ ఆషికి తో యూత్ లో యమ క్రేజ్ సంపాదించిన శ్రద్ధా కపూర్, ఫర్హాన్ అక్తర్ లపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడ్డంలేదు. రాక్ 2 సినిమా మొదలు శ్రద్ధా, అక్తర్‌ల ప్రేమ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ భాగ్ మిల్కా భాగ్ నటుడితో పీకల్లోతు ప్రేమలో పడిన శ్రద్ధాకపూర్, ఏకంగా అతని నివాసానికే తన మకాం కూడా మార్చేసిందన్నది బీ టౌన్ టాక్. ఈ విషయం తెలుసుకున్న శక్తికపూర్ ఆమెను బలవంతంగా బయటకు లాక్కొచ్చేశారని వార్తలు చెలరేగాయి. వీరిద్దరి ప్రేమ వ్యవహారం నచ్చక పోవడం వల్లే ఈ సంఘటన జరిగిందన్న వాదనలు వినిపించాయి. కాగా మరో హీరోయిన్, వాజిర్ మూవీలో కలిసి నటించిన అదితిరావు, ఫర్హాన్ అక్తర్ సంబంధాలపై అప్పట్లో బాలీవుడ్ గుప్పుమంది. మరోవైపు సహజీవన వార్తలను శ్రద్ధా-ఫర్హాన్ ఇప్పటికే ఖండించిన సంగతి తెలిసిందే. -
బాలీవుడ్లో బంగారం మెరుస్తుందా ?
-
శ్రద్ధా FROM బెంగాల్
శ్రద్ధాదాస్. ఎంతో శ్రద్ధగా చేసిన బొమ్మలా ఉంటుందీ ముద్దుగుమ్మ. నటించిన సినిమాలు తక్కువే అయినా వచ్చిన గుర్తింపు ఎక్కువ. ముంబైలో పుట్టిన ఈ బెంగాలీ అమ్మాయి హైదరాబాదే తన హోం సిటీ అని చెబుతుంది. సోమాజిగూడ హరిత ప్లాజాలో ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ నిర్వహించిన ‘బయ్ జార్ గెట్ కార్’ కార్యక్రమంలో పాల్గొని విజేతకు కారును అందించింది. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో ముచ్చటించింది. ఆ వివరాలు... ..:: శిరీష చల్లపల్లి నేను బెంగాలీ... కానీ పుట్టి పెరిగిందంతా ముంబైలోనే. నా చదువంతా అక్కడే కొనసాగింది. యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో మాస్ మీడియా అండ్ జర్నలిజం చేశాను. అయితే సీరియస్ జర్నలిజం కంటే లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ అంశాలపైనే నాకు ఎక్కువ ఆసక్తి ఉండేది. అదే మోడలింగ్ వైపు దృష్టి సారించేలా చేసింది. డిగ్రీ చదివేటప్పుడు థియేటర్ వర్క్‌షాప్స్‌లో పాల్గొనేదాన్ని. ఆ అనుభవం నేను మోడలింగ్‌లో రాణించేందుకు ఉపయోగపడింది. అలా యాడ్ ఫిల్మ్స్ అవకాశాలు రావడం మొదలైంది. మూడు భాషలతో బిజీ... ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టాను. ఆ సినిమా పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టకపోయినా.. సంవత్సరంలోపే ఐదు సినిమాల ఆఫర్లు వచ్చాయి. ఇక ఆర్య-2, డార్లింగ్, నాగవల్లి, మొగుడు సినిమాల్లో నేను చేసిన రోల్స్ నాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం తెలుగు, కన్నడ, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నా. ఐ లవ్ దిస్... నా మొదటి సినిమా షూటింగ్ కోసమే మొట్టమొదటిసారి హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. ఇక్కడి స్టూడియోస్‌లో చాలా నెలలు గడిపాను. అందుకే సొంత రాష్ట్రం బెంగాల్, పుట్టి పెరిగిన ముంబై కంటే నాకు కెరీర్ ఇచ్చిన హైదరాబాద్ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. సీఫుడ్ ప్రత్యేకించి రొయ్యలు అంటే ఇష్టపడే నేను ఇక్కడి బిర్యానీ రుచి చూశాక దానికి ఫిదా అయిపోయాను. హైదరాబాదేనా ఫస్ట్హోం. ఈ నగరానికి నేను రుణపడి ఉంటాను. వేరే నగరాలతో పోలిస్తే ఇక్కడ జెన్యూన్‌నెస్ ఎక్కువ. మోసాలు తక్కువ. హైదరాబాద్‌కో ప్రత్యేక కల్చర్ ఉంది. ఐలవ్ దిస్! -
ఐటం గళ్‌గా మారిన శ్రద్ధా కపూర్