న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై దాడి జరిగింది. శుక్రవారం సాకెత్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా జైలులోని ఇతర ఖైదీలు అతడ్ని చితకబాదారు. ఈ ఘటనలో అతను స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది.
అఫ్తాబ్‌పై దాడి జరిగిన విషయాన్ని అతని తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో నిందితుడ్ని కోర్టుకు తీసుకొచ్చే సమయంలో మరోసారి ఇలా దాడులు జరగకుండా పటిష్ఠ భద్రత కల్పించాలని సాకెత్ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది.
కాగా.. శ్రద్ధా హత్య కేసు వాదనలు పూర్తయ్యాయి. అయితే విశ్వసనీయమైన, క్లిష్ట సాక్ష్యాధారాల ద్వారా నేరారోపణ పరిస్థితులు వెల్లడయ్యాయని, కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని మార్చి 20నే ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇందుకు కౌంటర్‌గా అఫ్తాబ్ తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే శుక్రవారం అఫ్తాబ్‌ను కోర్టుకు తీసుకువచ్చారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది న్యాయస్థానం.
తన ప్రేయసి శ్రద్ధవాకర్‌తో చాలాకాలంగా సహజీవనం చేసిన అఫ్తాబ్.. గతేడాది మేలో ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి అడవిలో పడేశాడు. కొన్ని నెలల తర్వాత వెలుగుచూసిన ఈ హత్యోదంతం దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
చదవండి: మరో యువతితో ప్రేమాయణం.. ఇది తెలియడంతో హైదరాబాద్ వెళ్లి
Comments
Please login to add a commentAdd a comment