jail inmates
-
శ్రద్ధా కేసు: అఫ్తాబ్ పూనావాలాపై దాడి.. జైలులో చితకబాదిన తోటి ఖైదీలు!
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై దాడి జరిగింది. శుక్రవారం సాకెత్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా జైలులోని ఇతర ఖైదీలు అతడ్ని చితకబాదారు. ఈ ఘటనలో అతను స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. అఫ్తాబ్‌పై దాడి జరిగిన విషయాన్ని అతని తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో నిందితుడ్ని కోర్టుకు తీసుకొచ్చే సమయంలో మరోసారి ఇలా దాడులు జరగకుండా పటిష్ఠ భద్రత కల్పించాలని సాకెత్ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. కాగా.. శ్రద్ధా హత్య కేసు వాదనలు పూర్తయ్యాయి. అయితే విశ్వసనీయమైన, క్లిష్ట సాక్ష్యాధారాల ద్వారా నేరారోపణ పరిస్థితులు వెల్లడయ్యాయని, కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని మార్చి 20నే ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇందుకు కౌంటర్‌గా అఫ్తాబ్ తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే శుక్రవారం అఫ్తాబ్‌ను కోర్టుకు తీసుకువచ్చారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది న్యాయస్థానం. తన ప్రేయసి శ్రద్ధవాకర్తో చాలాకాలంగా సహజీవనం చేసిన అఫ్తాబ్.. గతేడాది మేలో ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి అడవిలో పడేశాడు. కొన్ని నెలల తర్వాత వెలుగుచూసిన ఈ హత్యోదంతం దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చదవండి: మరో యువతితో ప్రేమాయణం.. ఇది తెలియడంతో హైదరాబాద్ వెళ్లి -
ఖైదీల పిల్లల కోసం ఒక హోమ్
యశోద ఉండటం వల్ల కృష్ణుడు చెరసాలలో కాకుండా ఆమె వొడిలో పెరిగాడు. మరి శిక్షలు పడ్డ ఖైదీలందరి పిల్లలకు ఈ యోగం ఉందా? ఎందుకు ఉండదు.. అమ్మను నేనున్నాను అంటుంది నిరోజ లక్ష్మి. 48 ఏళ్ల ఈ టీచరమ్మ ఒరిస్సాలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల పిల్లల కోసం భువనేశ్వర్‌లో ఒక హోమ్ నడుపుతోంది. 2003లో మొదలైన ఈ హోమ్ ఇప్పటికి 200 మందిని సాకి సంతరించి ప్రయోజకుల్ని చేసింది. కన్న తల్లిదండ్రుల మీద ఏ పిల్లలకూ ప్రేమ పోదు. కాని ఈ పిల్లలకు మాత్రం నిరోజ మాత్రమే తల్లి తండ్రి దైవం. ఆ అమ్మాయి వయసు 12 ఏళ్లు ఉంటాయి. త్వరలో పరీక్షలు ఉన్నాయట. స్కూలుకు వెళ్లను అని హోమ్‌లోనే చదువుకుంటోంది. లెక్కల బుక్కు తీసి కిందా మీదా అవుతోంది. ఆ అమ్మాయి శ్రద్ధ చూస్తే తప్పక ఏదో పెద్ద చదువు చదివేలా ఉంది. ఆ పెద్ద చదువు ఆ హోమ్‌లో కాకుండా మరెక్కడ ఉన్నా ఆ అమ్మాయి చదవలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి తండ్రి జీవితఖైదు పడి శిక్ష అనుభవిస్తున్నాడు. ఆస్తి తగాదాల్లో భాగంగా ఆవేశంలో హత్య చేశాడతడు. తల్లికి మతి స్థిమితం సరిగా ఉండదు. ‘అందుకని మా హోమ్‌కు తెచ్చాను’ అంటుంది నిరోజ లక్ష్మి. పూర్తి పేరు నిరోజ లక్ష్మి మహాపాత్ర. భువనేశ్వర్‌లోని సెంట్రల్ జైలుకు సమీపంలోనే గత 17 సంవత్సరాలుగా నడుపుతున్న హోమ్ ఉంది. దాని పేరు ‘మధుర్‌మయి ఆదర్శ శిక్షానికేతన్’. దేశంలోనే బహుశా ఖైదీల పిల్లల కోసం ప్రత్యేకంగా నడిచే ఇలాంటి హోమ్ మరొకటి లేకపోవచ్చు. పిల్లలకు యశోదై పురుషులు జైలుకెళితే తల్లులు పిల్లలను చూసుకుంటారు. కాని కొన్ని కేసుల్లో స్త్రీలు జైలుకు వస్తారు. ఆ సమయంలో పురుషులు వారిని వారి ఖర్మానికి వొదిలి మరో పెళ్లి చేసుకుంటారు. అలాంటి తల్లుల పిల్లలను ఎవరు చూసుకుంటారు. జైలులో తల్లితో పాటు 8 ఏళ్ల వరకూ పిల్లలు ఉండే వీలు ఉన్నా ఐదేళ్ల వయసున్న పిల్లల దగ్గరి నుంచి తెచ్చి తన హోమ్‌లో సంరక్షిస్తుంది 48 ఏళ్ల నిరోజ. ‘ఒరిస్సాలో 18 జైళ్లు ఉన్నాయి. వీటిలో శిక్ష అనుభవిస్తున్న వారి పిల్లల్లో ఎవరికైతే ఆలనా పాలనా ఉండదో వారిని మా హోమ్‌కు తెచ్చుకుంటాను. జైలు అధికారుల అనుమతితో ఈ హోమ్ నడుస్తుంది. తల్లిదండ్రులు చేసిన తప్పుకు పిల్లలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. అందరు పిల్లలకు మల్లే వారికి కూడా సమగ్ర పోషణ అవసరమంటుంది’ నిరోజ. 2003లో మొదలైన ఈ హోమ్‌కు ఒరిస్సాలోని ఒక స్వచ్ఛంద సంస్థ మద్దతు ఇస్తోంది. ఇప్పటి వరకూ ఈ హోమ్ నుంచి 200 మంది బాల బాలికలు చదువుకున్నారు. కొందరు ఇంజనీర్లు అయ్యారు. ఎం.సి.ఏ చదివారు. కొందరు సాంకేతిక కోర్సుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ‘ఏ సందర్భంలో చూసినా మా హోమ్‌లో 50 మంది బాల బాలికలు ఉంటారు’ అంటుంది నిరోజ. ఆమే అమ్మ ఆమే నాన్నా... నిరోజది జగత్సింగ్పూర్ జిల్లా తిర్తోల్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి టీచర్ గా కొన్ని స్కూళ్లలో పని చేసింది. ‘తల్లిదండ్రులు ఉన్న పిల్లల చదువుకు ఆటంకం లేదు. కాని జైళ్లల్లో ఉన్నవారి పిల్లల సంగతేమిటి అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ప్రభుత్వ ప్రతినిధులను, జైళ్ల శాఖను కలిసి హోమ్ ప్రతిపాదనను చేశాను. జైళ్లల్లో అకారణంగా పిల్లలు ఉండిపోవడం కన్నా ఇలా హోమ్‌లో ఉండి చదువుకోవడం మేలని వారు సహకరించారు. ఈ హోమ్ కోసం 3 ప్రభుత్వ స్కూళ్లను లింక్ చేశారు. ఇక్కడి పిల్లలు అక్కడకు వెళ్లి చదువుకోవచ్చు. ప్రతి ఆదివారం లేదా వీలున్న సమయంలో ఆ పిల్లలను తీసుకెళ్లి తల్లిదండ్రులకు చూపించి వస్తాం. వారు నిజంగా చాలా సంతోషిస్తారు’ అంటుంది నిరోజ. హోమ్‌లో పిల్లల బాగోగులు నిరోజే చూసుకుంటుంది. వారికి పాఠాలు చెబుతుంది. డాన్స్, ఆర్ట్ ఇవన్నీ ఉంటాయి. ‘పిల్లలు చాలా సంతోషం గా ఉండి తల్లిదండ్రుల బెంగను మర్చిపోతారు’ అంటుంది నిరోజ. ఆమె ఇంతటితో ఆగలేదు. భువనేశ్వర్‌లో బధిర పిల్లల కోసమే జూనియర్ కాలేజీ కూడా ఏర్పాటు చేసింది. ‘దీంట్లో ఎవరూ చేరరు’ అని ఆమె ఫ్రెండ్స్ ఆమెకు చెప్పారు. కాని ఇప్పుడా కాలేజీలో రాష్ట్ర వ్యాప్త బధిర విద్యార్థులు దఖలు అవుతున్నారు. హోమ్‌లోని పిల్లలకు నిరోజ చాలా ఇష్టం. మాకు అమ్మైనా నాన్నైనా నిరోజే అంటారు. ఇలాంటి తల్లులే ఎందరో అభాగ్య బాలలకు చల్లని ఒడిలా నిలుస్తారు. నిరోజ లాంటి వాళ్లు ప్రతి రాష్ట్రంలో ఉంటే ఖైదీల పిల్లల భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుంది. – సాక్షి ఫ్యామిలీ -
ఖైదీల వీరంగం : అధికారులపై వేటు
లక్నో : నాలుగు గోడల మధ్య బందీలుగా జైలు జీవితం గడపాల్సిన ఖైదీలు నానా హంగామా సృష్టించారు. యూపీలోని ఉన్నావ్ జైలులో కొందరు ఖైదీలు మద్యం సేవిస్తూ, బహిరంగ హెచ్చరికలు చేస్తూ..ఆయుధాలు చేపట్టిన వీడియోలు కలకలం రేపాయి. ఈ ఘటనకు సంబంధించి నలుగురు అధికారులను యూపీ ప్రభుత్వం బదిలీ చేసింది. వీడియోలో నానా రచ్చ చేసిన ఖైదీలను వేరే జైళ్లకు బదలాయించారు. బహిర్గతమైన వీడియోల్లో ఓ ఖైదీ ఏకంగా తుపాకీని చూపుతూ ‘మీరట్ జైలు లేదా ఉన్నావ్ జైలు..జైలు ఏదైనా తాను ఇలాగే ఉంటానని, జైలు లోపల వెలుపల ఎవరినైనా హతమారుస్తా’ అంటూ రెచ్చిపోయాడు. మరో ఖైదీ హిందీ సినిమాలో డైలాగ్ వల్లెవేస్తూ తనపై ఏ ఒక్కరూ చర్య తీసుకునే ధైర్యం చేయబోరని చెప్పుకొచ్చాడు. తాను దేవ్ ప్రతాప్ సింగ్‌నని చెబుతూ అధికారులకే సవాల్ విసిరాడు. తనకు జైలు అంటే కార్యాలయమేనని, ఏ జైలులో అయినా తాను దర్జాగా బతికేస్తానని ఈ ఖైదీ చెప్పడం గమనార్హం. ఖైదీల వీరంగంపై యూపీ జైళ్ల మంత్రి జై కుమార్ సింగ్ స్పందిస్తూ ఈ ఉదంతంపై డీఐజీ విచారణకు ఆదేశించారని, నలుగురు అధికారులపై శాఖాపరమైన విచారణ ప్రారంభమైందని, వారిని వేరే ప్రాంతానికి బదిలీ చేశామని చెప్పారు. వీడియోలో వీరంగం వేసిన ఇద్దరు ఖైదీలను వేరే జైళ్లకు తరలించామని వివరణ ఇచ్చారు. కాగా ఖైదీలు చూపిన తుపాకులు నిజమైనవి కావని అవి ఆటవస్తువులని జైలు అధికారులు పేర్కొన్నారు. -
ఆ నీచుణ్ని ఖైదీలు చంపేశారు
రాయ్‌పూర్: వినకూడని ఘోరమైన నేరం చేసిన ఓ యువకుడ్ని జైల్లో ఖైదీలు చంపేశారు. చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ సెంట్రల్ జైల్లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తాగినమైకంలో తల్లిపై అత్యాచారం చేసిన కోర్టులో 32 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయవాదులు అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. కోర్టు నిందితుడికి రిమాండ్ విధించడంతో దుర్గ్ సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులోనరి బరాక్ నెంబర్ 14లో ఉంచారు. కాగా అతను చేసిన నేరం గురించి జైల్లోని ఖైదీలందరికీ తెలిసింది. ఆ సమయంలో జైల్లో 120 మంది ఖైదీలు ఉన్నారు. ఆ యువకుడు చేసిన నేరాన్ని సహించలేకపోయిన ఖైదీలు బుధవారం రాత్రి అతనిపై దాడిచేసి చంపేశారు. హత్యకేసులో నిందితులుగా ఉన్న సంతోష్, దినేష్ తివారి ఈ హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఇతర ఖైదీలను విచారిస్తున్నారు. -
వారు మహాముదుర్లు గురూ..!
న్యూయార్క్: మత్తుపదార్థాల రవాణాలో వచ్చినన్ని టెక్నిక్స్ మరే ఇతర రంగంలో ఇప్పటి వరకు రాలేదు. ఎప్పటికప్పుడూ వారు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు విస్తుపోయే మార్గాలు అనుసరస్తూనే ఉంటారు. ఇక మత్తుపదార్థాలకు బానిసైనవారి పరిస్థితి కూడా అంతే.. ఎన్ని తిప్పలు పడైనా తమకు కావాల్సిన మత్తుపదార్థాలు తెప్పించుకుంటారు. వర్జినీయా జైలులో ఉంటున్న ఖైదీల విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే వారు తమకు మత్తు పదార్థాల కోసం అనుసరిస్తున్న మార్గాలు మాములువి కాదు. కనిపించేందుకు సాధారణంగానే ఉన్నా దాని లోతుల్లోకి వెళితే అవాక్కవ్వాల్సిందే. ఈ మధ్యకాలంలో వర్జినీయా జైలులో ఖైదీలంతా ఆన్ లైన్ లో విహరిస్తూ పెద్ద మొత్తంలో పేపర్లకు, ఫొటోలకు ఆర్డరిస్తున్నారు. అది కూడా మత్తుపదార్థాలకు బానిసైనవారికి ఉపశమనం కల్పించే సబాక్సన్ అనే మెడిసిన్ ఖాళీ ప్యాకెట్లు, ఆ ప్యాకెట్ ను ముద్రించిన ఫొటోల కోసం. అయితే, ఖాళీ పేపర్లు ఏం చేసుకుంటారా అని అనుకుంటున్నారా అలా అనుకుంటే మాత్రం పొరబడ్డట్లే.. ఎందుకంటే ఆ ఫొటోలు, పేపర్లు సాధారణమైనవి కాదు. పూర్తిగా డ్రగ్స్‌లో నానబెట్టినవి. సాధారణంగా తెల్లపేపర్ను డ్రగ్స్ లో నానబెడితే అది పసుపురంగులో పేరుకు పోయి కనిపిస్తుంది. కానీ, ఫొటోల్లో, ఇతర చిత్రాలతో ముద్రించిన ప్యాకెట్లపై మాత్రం అది కనిపించదు. ఈ టెక్నిక్ రహస్యాన్ని తెలిసిన డ్రగ్ బానిసలు, డ్రగ్ సప్లయ్ దారులు విరివిగా వాటిని ఉపయోగిస్తున్నారు. ఈ విషయం తెలిసిన జైలు శాఖ అధికారులు షాక్ తిన్నారు. ప్రస్తుతానికి అలాంటివాటి ఆర్డర్లను నిషేధించి నిబంధనలు కఠినం చేశారు. -
యోగాతో మంచి తండ్రి కావచ్చు
వాషింగ్టన్: యోగాతో మంచి శరీర దారుఢ్యంతోపాటు, చక్కటి మానసిక ఆరోగ్యం వస్తుందని మనకు ఇప్పటి వరకు తెలిసిన విషయమే. అయితే, యోగా ద్వారా మంచి సంరక్షక నైపుణ్యాలు పెరుగుతాయని, దానివల్ల మంచి తండ్రిగా భవిష్యత్తులో గుర్తింపు పొందే అవకాశం మెండుగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 14 గ్రూపులపై మొత్తం మూడేళ్లపాటు ఈ అధ్యయనం నిర్వహించి ఈ విషయాలను పరిశోధకులు వెల్లడించారు. వారి పరిశోధనకు ఎంచుకున్న చోటు ఓ జైలు. వాషింగ్టన్‌లోని వానాచ్చిలోగల చిలాన్ రీజినల్ జైలులోని ఖైదీలతో ఈ ప్రయోగం నిర్వహించారు. ఖైదీల్లో తండ్రులుగా ఉన్నవారినే తమ పరిశోధనకు తీసుకుని వారికి రోజూ ఓ గంటపాటు యోగా కార్యక్రమం మూడేళ్లు నిర్వహించి వారి ప్రవర్తన తీరును అంచనా వేశారు. ముందు చిన్నపిల్లల పెంపకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిచయం చేసిన తర్వాత యోగా నిర్వహించేవారు. -
రాజమండ్రి జైలు ఖైదీలకు పుష్కరభాగ్యం
రాజమండ్రి: గోదావరి మహాపుష్కరాల సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోని సుమారు 1500 మంది ఖైదీలు పుష్కర స్నానంతో పునీతులయ్యారు. ఏంటీ, వాళ్లంతా ఒకేసారి గోదావరికి వెళ్లి స్నానాలు చేశారని అనుకుంటున్నారా? కాదు.. మరెలా అంటే.. ఈ మహాపుష్కరాల సందర్భంగా అందరిలాగే ఖైదీలు కూడా గోదాట్లో స్నానం చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా జైలు అధికారులకు ఓ వినతిపత్రం ఇచ్చారు. 500 మంది మహిళా ఖైదీలతో సహా సుమారు 1500 మంది ఖైదీలు తమకు పుష్కర స్నాన పుణ్యం ప్రసాదించమంటూ అర్జీ పెట్టుకున్నారు. అయితే వీరందరికీ భద్రత కల్పించడం కష్టమనే కారణంతో జైలు అధికారులు అనుమతిని నిరాకరించారు. దాంతో అహోబిలం మఠం వారు స్పందించారు. పవిత్ర గోదావరి జలాలను తీసుకొచ్చి ఖైదీల మీద చిలకరించారు. అలా ఆ ఖైదీలంతా మహా పుష్కరాల్లో స్నానం చేసిన పుణ్య ఫలాన్ని దక్కించుకున్నారన్నమాట. కేవలం భద్రతా కారణాల రీత్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని జైలు సూపరింటెండెంట్ వరప్రసాద్ తెలిపారు. -
జైలులో ఖైదీల సరిగమలు
సప్త సర్వరాలతో కూడిన రాగాలు శ్రావ్యంగా ఆలపిస్తే.. బండరాళ్లు సైతం నాట్యం చేస్తాయంటారు. అంతేకాదు వ్యాధులనూ నయం చేయొచ్చంటారు సంగీత విద్వాంసులు! సంగీతం చేసే అద్భుతాలు ఇంకా ఎన్నెన్నో! బీహార్ జైలులోనూ అలాంటి ఓ అద్భుతమే చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని భగల్పూర్ సెంట్రల్ జైలులో పలు తీవ్ర నేరాల్లో శిక్ష అనుభవిస్తోన్న ఖైదీలు కొందరు.. సంగీతం పాఠాలతో సౌమ్యులుగా మారిపోయారట! ఎంతకీ రాని పరివర్తన సంగీతంలో ఎలా సాధ్యమైందో శుక్రవారం మీడియాకు వివరించారు జైలు సూపరింటెండెట్ నీరజ్ ఝా. 'మా జైలులో నెల రోజుల నుంచి సంగీత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆసక్తిగల కొందరు ఖైదీలు సంగీతం క్లాసులకు రోజూ హాజర్యేవారు. ప్రస్తుతం వారు హార్మోనియం, సింథసైజర్, డ్రమ్స్ వాయించడంలో ప్రావీణ్యం సాధించారు. అదేం విచిత్రమోగానీ అంతకుముందు కరుకుగా ప్రవర్తించేవాళ్లు ఈ మధ్య మృదువుగా మారారు. జైలు సిబ్బంది, తోటి ఖైదీలతో మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. ఇది మంచి మార్పు. త్వరలోనే ఖైదీలందరూ సంగీతం క్లాసులకు హాజరవుతారని, మా జైలు నందనవనంలా మారుతుందని ఆశిస్తున్నాం' అంటూ ఖైదీల పరివర్తనా క్రమాన్ని వివరించారు నీరజ్ ఝా. -
జైల్లో శృంగారం.. ప్రాథమిక హక్కు!
-
జైల్లో శృంగారం ప్రాథమిక హక్కు
చండీగఢ్: పంజాబ్, హర్యానా హైకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు (దంపతులు) వారి జీవిత భాగస్వాములతో శృంగారంలో పాల్గొనడం తప్పుకాదని, అది వారి ప్రాథమిక హక్కు అని పేర్కొంది. ఖైదీలుగా ఉన్న భార్యాభర్తలు బిడ్డకు జన్మనివ్వడానికి కూడా ఆమోదం తెలిపింది. మంగళవారం చండీగఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పాటియాల సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భార్యాభర్తలు సోనియా, జస్వీర్ సింగ్ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం విచారించింది. 16 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి హతమార్చిన కేసులో వీరికి మరణశిక్ష పడింది. కాగా జైల్లో తామిద్దరూ కలసి జీవించాలని ఉందని, బిడ్డకు జన్మనిచ్చేందుకు అనుమతివ్వాలని సోనియా, జస్వీర్ సింగ్ న్యాయస్థానాన్ని కోరారు. తామిద్దరూ కలసి జీవించడానికి ఏర్పాట్లు చేసేలా జైలు అధికారులను ఆదేశించాల్సిందిగా విన్నవించారు. తల్లిదండ్రులకు తానొక్కడే సంతానమని, తన పెళ్లయిన ఎనిమిది నెలలకే అరెస్ట్ చేశారని జస్వీర్ కోర్టుకు తెలియజేశాడు. నేరం, శిక్ష తీవ్రతను పరిశీలించాలన్న జస్వీర్ విజ్ఞప్తిని నిరాకరించిన కోర్టు.. అతని భార్యతో కలసి జీవించడానికి అనుమతిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత స్వేచ్ఛ, బిడ్డకు జన్మినిచ్చే హక్కు ఉందని న్యాయస్థానం పేర్కొంది. నిందితులు, ఖైదీలకు కూడా ఈ హక్కు వర్తిస్తుందని పేర్కొంది.