యోగాతో మంచి తండ్రి కావచ్చు | Yoga can improve a man's parenting skills | Sakshi
Sakshi News home page

యోగాతో మంచి తండ్రి కావచ్చు

Published Fri, Oct 16 2015 1:49 PM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM

Yoga can improve a man's parenting skills

వాషింగ్టన్: యోగాతో మంచి శరీర దారుఢ్యంతోపాటు, చక్కటి మానసిక ఆరోగ్యం వస్తుందని మనకు ఇప్పటి వరకు తెలిసిన విషయమే. అయితే, యోగా ద్వారా మంచి సంరక్షక నైపుణ్యాలు పెరుగుతాయని, దానివల్ల మంచి తండ్రిగా భవిష్యత్తులో గుర్తింపు పొందే అవకాశం మెండుగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

14 గ్రూపులపై మొత్తం మూడేళ్లపాటు ఈ అధ్యయనం నిర్వహించి ఈ విషయాలను పరిశోధకులు వెల్లడించారు. వారి పరిశోధనకు ఎంచుకున్న చోటు ఓ జైలు. వాషింగ్టన్లోని వానాచ్చిలోగల చిలాన్ రీజినల్ జైలులోని ఖైదీలతో ఈ ప్రయోగం నిర్వహించారు. ఖైదీల్లో తండ్రులుగా ఉన్నవారినే తమ పరిశోధనకు తీసుకుని వారికి రోజూ ఓ గంటపాటు యోగా కార్యక్రమం మూడేళ్లు నిర్వహించి వారి ప్రవర్తన తీరును అంచనా వేశారు. ముందు చిన్నపిల్లల పెంపకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిచయం చేసిన తర్వాత యోగా నిర్వహించేవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement