జైల్లో శృంగారం ప్రాథమిక హక్కు | High Court allows jail inmates to have sex with their partners | Sakshi
Sakshi News home page

జైల్లో శృంగారం ప్రాథమిక హక్కు

Published Wed, Jan 7 2015 9:38 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

జైల్లో శృంగారం ప్రాథమిక హక్కు

జైల్లో శృంగారం ప్రాథమిక హక్కు

చండీగఢ్: పంజాబ్, హర్యానా హైకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు (దంపతులు) వారి జీవిత భాగస్వాములతో శృంగారంలో పాల్గొనడం తప్పుకాదని, అది వారి ప్రాథమిక హక్కు అని పేర్కొంది. ఖైదీలుగా ఉన్న భార్యాభర్తలు బిడ్డకు జన్మనివ్వడానికి కూడా ఆమోదం తెలిపింది.  మంగళవారం చండీగఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.   

పాటియాల సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భార్యాభర్తలు సోనియా, జస్వీర్ సింగ్ వేసిన పిటిషన్ను  న్యాయస్థానం విచారించింది. 16 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి హతమార్చిన కేసులో వీరికి మరణశిక్ష పడింది. కాగా జైల్లో తామిద్దరూ కలసి జీవించాలని ఉందని, బిడ్డకు జన్మనిచ్చేందుకు అనుమతివ్వాలని సోనియా, జస్వీర్ సింగ్ న్యాయస్థానాన్ని కోరారు. తామిద్దరూ కలసి జీవించడానికి ఏర్పాట్లు చేసేలా జైలు అధికారులను ఆదేశించాల్సిందిగా విన్నవించారు. తల్లిదండ్రులకు తానొక్కడే సంతానమని, తన పెళ్లయిన ఎనిమిది నెలలకే అరెస్ట్ చేశారని జస్వీర్ కోర్టుకు తెలియజేశాడు. నేరం, శిక్ష తీవ్రతను పరిశీలించాలన్న జస్వీర్ విజ్ఞప్తిని నిరాకరించిన కోర్టు.. అతని భార్యతో కలసి జీవించడానికి అనుమతిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత స్వేచ్ఛ, బిడ్డకు జన్మినిచ్చే హక్కు ఉందని న్యాయస్థానం పేర్కొంది. నిందితులు, ఖైదీలకు కూడా ఈ హక్కు వర్తిస్తుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement