కొత్త ‍వ్యాక్సిన్‌ అభివృద్ధి.. అలోపెక్స్‌తో భారత్ బయోటెక్ జట్టు | Bharat Biotech partners with Alopexx for anti microbial vaccine | Sakshi
Sakshi News home page

కొత్త ‍వ్యాక్సిన్‌ అభివృద్ధి.. అలోపెక్స్‌తో భారత్ బయోటెక్ జట్టు

Published Wed, Sep 11 2024 4:50 PM | Last Updated on Wed, Sep 11 2024 5:56 PM

Bharat Biotech partners with Alopexx for anti microbial vaccine

భారత్‌పాటు ఇతర అల్పాదాయ దేశాలలో విస్తృత-స్పెక్ట్రమ్ యాంటీ-మైక్రోబయల్ వ్యాక్సిన్ అభివృద్ధి, వాణిజ్యీకరణ కోసం అలోపెక్స్ ఇంక్‌తో భారత్ బయోటెక్ జట్టు కట్టింది. ఇందులో భాగంగా ఇరు కంపెనీలు భారత్‌తోపాటు ఇతర లైసెన్స్ భూభాగాల్లో వ్యాక్సిన్ AV0328 అభివృద్ధి, వాణిజ్యీకరణ చేపడతాయని భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఒప్పందం ప్రకారం.. వన్‌టైమ్‌ ముందస్తు చెల్లింపు, మైలురాయి చెల్లింపులకు అలోపెక్స్‌కు అర్హత ఉంటుంది. అలాగే లైసెన్స్ పొందిన భూభాగాల్లో AV0328 వ్యాక్సిన్‌ భవిష్యత్తు అమ్మకాలపై రాయల్టీలను పొందుతుంది.

"వ్యాక్సినేషన్ ద్వారా యాంటీ-మైక్రోబయల్ రెసిస్టెన్స్‌ను తగ్గించే పరిష్కారాలను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. ఈ సహకారం ప్రపంచవ్యాప్తంగా అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి సురక్షితమైన, చవకైన, అధిక-నాణ్యత గల వ్యాక్సిన్‌లను అందించాలనే మా మిషన్‌కు అనుగుణంగా ఉంటుంది" అని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా చెప్పారు.

ఫేజ్-I ఫస్ట్-ఇన్-హ్యూమన్ ట్రయల్ పూర్తయిందని, AV0328 వ్యాక్సిన్‌ ఎటువంటి తీవ్రమైన ప్రతికూల సంఘటనలనైనా బాగా తట్టుకోగలదని కంపెనీ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement