‘వాడు 35 ముక్కలు చేశాడు.. మేం 70 ముక్కలు చేస్తాం’ | Shraddha Murder Case: Police van carrying Aftab attacked | Sakshi
Sakshi News home page

‘మా సోదరిని వాడు 35 ముక్కలు చేశాడు సార్‌.. మేం 70 ముక్కలు చేస్తాం’

Nov 28 2022 8:55 PM | Updated on Nov 28 2022 9:14 PM

Shraddha Murder Case: Police van carrying Aftab attacked - Sakshi

వాడు మా సోదరిని చంపి 35 ముక్కలుగా చేశాడు. మేం వాడిని చంపి 70 ముక్కలు చేస్తాం.

సాక్షి, ఢిల్లీ: నగరంలో సోమవారం సాయంత్రం హైడ్రామా నెలకొంది. శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలాను తీసుకెళ్తున్న పోలీస్‌ వాహనంపై కొందరు దాడికి  యత్నించారు. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. 

రోహిణి ప్రాంతంలోని ఎఫ్‌ఎస్‌ఐ ల్యాబ్‌లో సోమవారం సాయంత్రం అఫ్తాబ్‌కు పాలిగ్రఫీ టెస్ట్‌ నిర్వహించినట్లు సమాచారం. అదయ్యాక బయటకు వాహనంలో తీసుకొస్తున్న తరుణంలో.. హిందూసేన కార్యకర్తలుగా చెప్పుకుంటున్న కొందరు అడ్డగించారు. తల్వార్‌లతో దూసుకొచ్చిన ఆ యువకులు.. పోలీస్‌ వాహనంపై దాడికి యత్నించారు. 

‘‘వాడు మా సోదరిని చంపి 35 ముక్కలుగా చేశాడు. మేం వాడిని చంపి 70 ముక్కలు చేస్తాం. పోలీసులు వాడికి సెక్యూరిటీ కల్పించడం ఏంటి? వాడిని మాకు అప్పగించండి.. చంపేస్తాం అంటూ నినాదాలు చేశారు వాళ్లు.  మా ఆడబిడ్డలు, అక్కాచెల్లెళ్లకు భద్రత కొరవడినప్పుడు.. మేం బతికి ఉండి ఏం సాధించినట్లు అంటూ కొందరు అక్కడే ఉన్న మీడియాతో వ్యాఖ్యానించారు. 

ఒక్క‌సారిగా వ‌చ్చిన మూక‌ను చూసి పోలీసులు షాక్ తిన్నారు. ఎంత‌కూ వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో గాల్లోకి కాల్పులు జ‌రిపారు. ప‌లువురిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు. 

ఇదీ చదవండి: శ్రద్ధా వాకర్‌ కంటే భయంకరమైన హత్య ఇది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement