ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు చికిత్స అందించే వైద్యురాలు. అలాంటి ఆమెకే షాకిచ్చి.. మానసిక చికిత్స తీసుకునేలా చేశాడు మెహ్రౌలీ ఘోర హత్యోదంతంలో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా. శ్రద్ధా వాకర్‌ను ముక్కలు చేసిన అనంతరం.. ఆ విడిభాగాలను ఇంట్లో ఫ్రిడ్జ్‌లో ఉంచి మరీ ఈ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేశాడు. ఈ క్రమంలో.. ఆ మానవ మృగం గురించి సదరు యువతిని ఆరా తీసిన పోలీసులు.. స్టేట్‌మెంట్ నమోదు చేశారు.
శ్రద్ధా వాకర్ హత్య అనంతరం.. ఆఫ్తాబ్ డేటింగ్ యాప్ ద్వారా మరో యువతిని పరిచయం చేకున్నాడు. ఆమె పలుమార్లు ఇంటికి రప్పించాడు. ఆమె ఓ సైకియాట్రిస్ట్. అయితే ఆ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కనీసం శ్రద్ధా వాకర్‌తో అతని గత పరిచయ విషయం కూడా తనకు తెలియదని ఆమె వాపోయింది. ఆఫ్తాబ్ ఫ్లాట్‌కు వెళ్లిన సమయంలో అతడి ఫ్రిజ్‌లో మానవ శరీర భాగాలు ఉన్న విషయం తనకు తెలియదని సదరు యువతి వెల్లడించింది. అయితే.. హత్య జరిగిన తర్వాత రెండుసార్లు తాను అఫ్తాబ్ ఫ్లాట్‌కు వెళ్లినట్లు మాత్రం ఒప్పుకుంది.
‘‘డేటింగ్ యాప్ ద్వారా నాకు అఫ్తాబ్‌తో పరిచయం ఏర్పడింది. అతను చాలా నార్మల్‌గా కనిపించేవాడు. కాకపోతే సిగరెట్లు ఎక్కువగా కాల్చేవాడు. బాడీస్ప్రేలు, ఫర్‌ఫ్యూమ్‌ల కలెక్షన్ ఎక్కువగా ఉండేది అతని దగ్గర. వాటిల్లోంచి కొన్ని నాకు గిఫ్ట్‌గా ఇచ్చేవాడు. అలాగే మా డేటింగ్ కొన్ని నెలలపాటు సాగింది. అక్టోబర్ 12వ తేదీన ఆఫ్తాబ్ నాకు ఓ ఫ్యాన్సీ ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అది అతని మాజీ ప్రేయసిది, ఆమెను అతనే చంపేశాడనే విషయం మీరు(సిట్ పోలీసులు) చెప్పేదాకా తెలియదు. ఆమె చనిపోయినట్లుగా చెప్తున్న నెల వ్యవధిలో అతన్ని రెండుసార్లు కలిశా అని ఆమె ఒప్పుకుంది.
అఫ్తాబ్ తనతో చాలా నార్మల్‌గా ఉండేవాడని, ముంబయిలోని తన ఇంటి గురించి తరచూ తనతో చెప్తుండేవాడని ఆమె పేర్కొంది. అతని ప్రవర్తన చూసి మంచివాడు అనుకున్నానే తప్ప.. అంత ఘోరం చేస్తాడని ఊహించని లేదని ఆమె తెలిపింది. అఫ్తాబ్ గురించి తెలిశాక షాక్ తిన్న ఆమె కొన్నాళ్లు మానసిక చికిత్స తీసుకుంది. డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చిన ఆమె నుంచి పోలీసులు ఇవాళ వాంగ్మూలం సేకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఒకేసారి డేటింగ్ యాప్‌ల ద్వారా పాతిక మంది దాకా యువతులను అఫ్తాబ్ సంప్రదించినట్లు తేలిందని పోలీసులు తాజాగా వెల్లడించారు.
ఇదీ చదవండి: నేరం ఒప్పుకోలు.. పశ్చాత్తాపంలేని అఫ్తాబ్
Comments
Please login to add a commentAdd a comment