shocking statement
-
షాకింగ్ రిపోర్ట్..! మొబైల్ ఛార్జ్ తక్కువున్నప్పుడు ఉబర్ ఛార్జ్ ఎక్కువవుతుందా?
ఓలా, ఉబర్ వంటి ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడికెళ్లాలన్న చిటికెలో బుక్ చేసుకుని గమ్యాలను చేరుకుంటున్నారు. అయితే ఈ ట్యాక్సీ సర్వీసులలోని చెల్లింపుల గురించి కొంత సందేహాలు ఒకప్పటి నుంచి ఉన్నాయి. ఈ సమస్యపైన బెల్జియన్ వార్తాపత్రిక ఇటీవల కొన్ని నిజాలను బయటపెట్టింది. ఉబర్ క్యాబ్స్ మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్, ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు ఒక పరిశోధన ద్వారా వెల్లడించింది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపించింది. డెర్నియర్ హ్యూర్ బ్రస్సెల్స్‌లోని వారి ఆఫీస్ నుంచి సిటీ సెంటర్లోకి వెళ్లడానికి రెండు ఐఫోన్ మొబైల్స్ ద్వారా టాక్సీ బుక్ చేసింది. ఒక ఐఫోన్లో 84 శాతం ఛార్జ్ ఉన్నప్పుడు 16.6 యూరోలు (రూ. 1498), 12 శాతం బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు 17.56 యూరోలు (రూ. 1,585) చూపించింది. మొబైల్ ఛార్జ్‌లో ఉన్న తేడా ట్రిప్ ఛార్జ్‌పై ప్రభావం చూపిస్తుందని ఈ విధంగా నిరూపించింది. బ్యాటరీ లెవెల్స్ ఎలా ఉన్నా ధరల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని, మొబైల్ ఛార్జ్‌కి ధరలకు ఎటువంటి సంబంధం లేదని ఉబెర్ తిరస్కరించింది. (ఇదీ చదవండి: KTM 390 Adventure X: తక్కువ ధరలో కెటిఎమ్ బైక్ లాంచ్ - పూర్తి వివరాలు) గతంలో కూడా ఉబర్ సంస్థ మీద ఇలాంటి ఆరోపణలే వెలుగులోకి వచ్చాయి. అప్పుడు ఉబెర్ మాజీ ఎకనామిక్ రీసెర్చ్ హెడ్, కీత్ చెన్ ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్న సమయంలో యూజర్లు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సుముఖంగా ఉన్నట్లు కంపెనీ గుర్తించిదని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఉబర్ మాత్రం ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ ఆధారంగా డబ్బు వసూలు చేయడంలేదని స్పష్టం చేశారు. -
శ్రద్ధ కేసు: అఫ్తాబ్ అలాంటి వాడని ఊహించలేదు!
ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు చికిత్స అందించే వైద్యురాలు. అలాంటి ఆమెకే షాకిచ్చి.. మానసిక చికిత్స తీసుకునేలా చేశాడు మెహ్రౌలీ ఘోర హత్యోదంతంలో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా. శ్రద్ధా వాకర్‌ను ముక్కలు చేసిన అనంతరం.. ఆ విడిభాగాలను ఇంట్లో ఫ్రిడ్జ్‌లో ఉంచి మరీ ఈ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేశాడు. ఈ క్రమంలో.. ఆ మానవ మృగం గురించి సదరు యువతిని ఆరా తీసిన పోలీసులు.. స్టేట్మెంట్ నమోదు చేశారు. శ్రద్ధా వాకర్ హత్య అనంతరం.. ఆఫ్తాబ్ డేటింగ్ యాప్ ద్వారా మరో యువతిని పరిచయం చేకున్నాడు. ఆమె పలుమార్లు ఇంటికి రప్పించాడు. ఆమె ఓ సైకియాట్రిస్ట్. అయితే ఆ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కనీసం శ్రద్ధా వాకర్‌తో అతని గత పరిచయ విషయం కూడా తనకు తెలియదని ఆమె వాపోయింది. ఆఫ్తాబ్ ఫ్లాట్‌కు వెళ్లిన సమయంలో అతడి ఫ్రిజ్‌లో మానవ శరీర భాగాలు ఉన్న విషయం తనకు తెలియదని సదరు యువతి వెల్లడించింది. అయితే.. హత్య జరిగిన తర్వాత రెండుసార్లు తాను అఫ్తాబ్ ఫ్లాట్‌కు వెళ్లినట్లు మాత్రం ఒప్పుకుంది. ‘‘డేటింగ్ యాప్ ద్వారా నాకు అఫ్తాబ్‌తో పరిచయం ఏర్పడింది. అతను చాలా నార్మల్‌గా కనిపించేవాడు. కాకపోతే సిగరెట్లు ఎక్కువగా కాల్చేవాడు. బాడీస్ప్రేలు, ఫర్ఫ్యూమ్ల కలెక్షన్ ఎక్కువగా ఉండేది అతని దగ్గర. వాటిల్లోంచి కొన్ని నాకు గిఫ్ట్‌గా ఇచ్చేవాడు. అలాగే మా డేటింగ్ కొన్ని నెలలపాటు సాగింది. అక్టోబర్ 12వ తేదీన ఆఫ్తాబ్ నాకు ఓ ఫ్యాన్సీ ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అది అతని మాజీ ప్రేయసిది, ఆమెను అతనే చంపేశాడనే విషయం మీరు(సిట్ పోలీసులు) చెప్పేదాకా తెలియదు. ఆమె చనిపోయినట్లుగా చెప్తున్న నెల వ్యవధిలో అతన్ని రెండుసార్లు కలిశా అని ఆమె ఒప్పుకుంది. అఫ్తాబ్ తనతో చాలా నార్మల్‌గా ఉండేవాడని, ముంబయిలోని తన ఇంటి గురించి తరచూ తనతో చెప్తుండేవాడని ఆమె పేర్కొంది. అతని ప్రవర్తన చూసి మంచివాడు అనుకున్నానే తప్ప.. అంత ఘోరం చేస్తాడని ఊహించని లేదని ఆమె తెలిపింది. అఫ్తాబ్ గురించి తెలిశాక షాక్ తిన్న ఆమె కొన్నాళ్లు మానసిక చికిత్స తీసుకుంది. డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చిన ఆమె నుంచి పోలీసులు ఇవాళ వాంగ్మూలం సేకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఒకేసారి డేటింగ్ యాప్‌ల ద్వారా పాతిక మంది దాకా యువతులను అఫ్తాబ్ సంప్రదించినట్లు తేలిందని పోలీసులు తాజాగా వెల్లడించారు. ఇదీ చదవండి: నేరం ఒప్పుకోలు.. పశ్చాత్తాపంలేని అఫ్తాబ్ -
సింధు ట్వీట్ స్మాష్
న్యూఢిల్లీ: ఒక్క ట్వీట్‌తో భారత క్రీడాభిమానులకు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ‘డెన్మార్క్ ఓపెన్ నా చివరి టోర్నీ. నేను రిటైరయ్యా’ అని సింధు చేసిన ట్వీట్‌తో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఆ ట్వీట్‌తో పాటు కోవిడ్–19 స్థితిగతులు, దాని ప్రభావంపై ఆమె సుదీర్ఘ ప్రకటన చేసింది. దీంతో కరోనా నేపథ్యంలో నిజంగానే ఆమె ఆటకు దూరంగా వెళ్తుందేమోనని అందరూ బోల్తా పడ్డారు. కానీ ట్వీట్ చివర్లో నెగెటివిటీ, అనవసరపు విశ్రాంతి, భయం నుంచి తాను రిటైర్ అవుతున్నానని ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొంత కాలంగా అనవసరపు అనిశ్చితితో బాధపడుతున్నానని, ఇక దానికి స్వస్తి పలుకుతానంటూ ఆమె ట్వీట్‌ను మొదలుపెట్టింది. ‘ఆటలో ఇన్నాళ్లూ పోరాడాను. కానీ కంటికి కనిపించని ఈ వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియట్లేదు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ఎన్నో కథనాలు చదువుతూ ఇంటి నుంచి అడుగు బయటపెట్టేందుకు ఆలోచించా. కానీ ఈ అనిశ్చితి నుంచి రిటైరవ్వాలని నిర్ణయించుకున్నా. భయం, నెగెటివిటీ, అవాస్తవికతకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. పోరాడకుండా నేనెప్పుడూ ఓటమి ఒప్పుకోను. భారత్‌కు ప్రాతినిధ్యం వహించకుండా ఉండటం డెన్మార్క్ ఓపెన్‌తోనే ముగిస్తున్నా’ అని ఇకపై ఆడతాననే తన అభిలాషను సింధు విశ్లేషణాత్మకంగా వివరించింది. దీనిపై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ‘సింధు! నాకు మినీ షాక్ ఇచ్చావ్. కానీ నాకు నీ అకుంఠిత దీక్ష, సంకల్పంపై పూర్తి నమ్మకం ఉంది. దేశానికి ఇంకా ఎన్నో పురస్కారాలు అందిస్తావనే విశ్వాసం ఉంది’ అని రిజిజు ట్వీట్ చేశారు. -
సల్మాన్ ఖాన్ షాకింగ్ స్టేట్ మెంట్
ముంబై: బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. అతడు ఇచ్చిన షాకింగ్ స్టేట్ మెంట్ పై సోషల్ మీడియాలో పెద్దెత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. 'సుల్తాన్' సినిమాలో మల్లయోధుడిగా నటించడం ఎలా ఉందని అడగ్గా... అత్యాచారానికి గురైన మహిళలా తన పరిస్థితి ఉందని సల్మాన్ బదులిచ్చాడు. 'షూటింగ్ లో రోజుకు ఆరు గంటలు బరువులు ఎత్తడం, కుస్తీ పట్టడం చేశాను. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. బరువులు ఎత్తడం నాకు పెద్ద సమస్య కాదు. 120 కిలోల మనిషిని 10 భంగిమల్లో 10 సార్లు పైకి ఎత్తగలను. కానీ రింగ్ లో తోసుకుంటూ కింద పడడం, నిజంగా ఫైటింగ్ చేయాల్సి రావడం చాలా కష్టంగా అనిపించింది. షాట్ ముగించుకుని రింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రేప్ కు గురైన మహిళలా భావించేవాణ్ని. సరిగా నడవలేకపోయేవాడిన'ని సల్మాన్ చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై ట్విటర్ లో నెటిజన్లు మండిపడ్డారు. తనను అత్యాచార బాధితురాలితో పోల్చుకోవడంతో సల్మాన్ అన్ని కోల్పోయాడని ట్విటర్ యూజర్ బీనా వ్యాఖ్యానించారు. సల్మాన్ వాడిన పదాలు చాలా భయంకరంగా ఉన్నాయని మరొకరు కామెంట్ చేశారు. When I used to walk out of the ring, after the shoot, I used to feel like a raped woman. HORRIBLE WORDS!! #Sultan https://t.co/RX8PCB4UHs — Satyan (@MurgMakhaniRox) June 20, 2016 Fans claim Salman's quote was a metaphor. Please stop yourself. It was the most disgusting "metaphor". Stop defending his stupidities. — Shahira (@17shahira) June 20, 2016