ఓలా, ఉబర్ వంటి ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడికెళ్లాలన్న చిటికెలో బుక్ చేసుకుని గమ్యాలను చేరుకుంటున్నారు. అయితే ఈ ట్యాక్సీ సర్వీసులలోని చెల్లింపుల గురించి కొంత సందేహాలు ఒకప్పటి నుంచి ఉన్నాయి. ఈ సమస్యపైన బెల్జియన్ వార్తాపత్రిక ఇటీవల కొన్ని నిజాలను బయటపెట్టింది.
ఉబర్ క్యాబ్స్ మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్, ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు ఒక పరిశోధన ద్వారా వెల్లడించింది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపించింది. డెర్నియర్ హ్యూర్ బ్రస్సెల్స్‌లోని వారి ఆఫీస్ నుంచి సిటీ సెంటర్‌లోకి వెళ్లడానికి రెండు ఐఫోన్ మొబైల్స్ ద్వారా టాక్సీ బుక్ చేసింది.
ఒక ఐఫోన్‌లో 84 శాతం ఛార్జ్ ఉన్నప్పుడు 16.6 యూరోలు (రూ. 1498), 12 శాతం బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు 17.56 యూరోలు (రూ. 1,585) చూపించింది. మొబైల్ ఛార్జ్‌లో ఉన్న తేడా ట్రిప్ ఛార్జ్‌పై ప్రభావం చూపిస్తుందని ఈ విధంగా నిరూపించింది. బ్యాటరీ లెవెల్స్ ఎలా ఉన్నా ధరల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని, మొబైల్ ఛార్జ్‌కి ధరలకు ఎటువంటి సంబంధం లేదని ఉబెర్ తిరస్కరించింది.
(ఇదీ చదవండి: KTM 390 Adventure X: తక్కువ ధరలో కెటిఎమ్ బైక్ లాంచ్ - పూర్తి వివరాలు)
గతంలో కూడా ఉబర్ సంస్థ మీద ఇలాంటి ఆరోపణలే వెలుగులోకి వచ్చాయి. అప్పుడు ఉబెర్ మాజీ ఎకనామిక్ రీసెర్చ్ హెడ్, కీత్ చెన్ ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్న సమయంలో యూజర్లు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సుముఖంగా ఉన్నట్లు కంపెనీ గుర్తించిదని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఉబర్ మాత్రం ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ ఆధారంగా డబ్బు వసూలు చేయడంలేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment