ఫోన్ మారితే ఉబర్ ఛార్జ్ మారుతోంది - ఫోటోలు వైరల్ | iPhone vs Android Are Ola Uber Charging Different Social Media Post Viral | Sakshi
Sakshi News home page

ఫోన్ మారితే ఉబర్ ఛార్జ్ మారుతోంది - ఫోటోలు వైరల్

Published Thu, Dec 26 2024 7:11 PM | Last Updated on Thu, Dec 26 2024 8:11 PM

iPhone vs Android Are Ola Uber Charging Different Social Media Post Viral

ఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఎక్కడికెళ్లాలన్నా వెహికల్ బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకుంటున్నాము. అయితే క్యాబ్ లేదా ఆటో ఛార్జీలు మాత్రం మనం బుక్ చేసుకోవడానికి ఉపయోగించే మొబైల్ ఫోన్లను బట్టి మారుతూ ఉంటాయి. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. దీనికి సంబంధించిన ఒక ట్వీట్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. రెండు వేరువేరు మొబైల్ ఫోన్‌లలో రెండు వేర్వేరు ధరలను చూడవచ్చు. నిజానికి పికప్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ రెండూ ఒకటే. చేరుకోవడానికి పట్టే సమయం కూడా ఒకటే. కానీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో బుక్ చేస్తే.. ఉబెర్ (Uber) ఆటో రైడ్‌కు రూ.290.79 చూపించింది. యాపిల్ ఐఫోన్‌లో (Apple iPhone) అదే రైడ్‌కు రూ.342.47 చూపించింది.

దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. నా కుమార్తె ఆండ్రాయిడ్ ఫోన్‌లో కంటే.. నా యాపిల్ ఐఫోన్‌లో రైడ్ ధర ఎక్కువగా చూపిస్తోందని 'సుధీర్' అనే ఎక్స్ (Twitter) యూజర్ పేర్కొన్నాడు. బుక్ చేసుకునే టైమ్, దూరం, డిమాండ్ వంటి వాటిని బట్టి ధరలలో మార్పు ఉంటుంది. కానీ బుక్ చేసుకునే మొబైల్ ఫోన్‌ను బట్టి ఛార్జీలు ఉండవని ఉబర్ వెల్లడించింది.

మొబైల్ ఛార్జ్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ రేటు
గతంలో ఉబర్ క్యాబ్స్ మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్, ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు ఒక పరిశోధన ద్వారా వెల్లడైంది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు. డెర్నియర్ హ్యూర్ బ్రస్సెల్స్‌లోని వారి ఆఫీస్ నుంచి సిటీ సెంటర్‌లోకి వెళ్లడానికి రెండు ఐఫోన్‌ మొబైల్స్ ద్వారా టాక్సీ బుక్ చేసింది.

ఒక ఐఫోన్‌లో 84 శాతం ఛార్జ్ ఉన్నప్పుడు 16.6 యూరోలు (రూ.1,498), 12 శాతం బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు 17.56 యూరోలు (రూ.1,585) చూపించింది. మొబైల్ ఛార్జ్‌లో ఉన్న తేడా ట్రిప్‌ ఛార్జ్‌పై ప్రభావం చూపిస్తుందని ఈ విధంగా నిరూపించింది. బ్యాటరీ లెవెల్స్ ఎలా ఉన్నా ధరల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని, మొబైల్ ఛార్జ్‌కి ధరలకు ఎటువంటి సంబంధం లేదని ఉబెర్ తిరస్కరించింది.

ఇదీ చదవండి: జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతున్నాయ్!

ఈ కామర్స్ సైట్లలో..
సాధారణంగా ఒక ప్రొడక్ట్ విలువ ఒక్కో యాప్‌లో.. ఒక్కో విధంగా ఉండొచ్చు. కానీ ఒకే యాప్‌లో ఒక ప్రొడక్ట్ ధర రెండు ఫోన్‌లలో వేరువేరు చూపిస్తే? ఇదెలా సాధ్యం, ఎక్కడైనా జరుగుతుందా.. అనుకోవచ్చు. కానీ సౌరభ్ శర్మ అనే ఐఓఎస్ యూజర్.. ఐఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఓ చిన్న క్యాబిన్ సూట్‌కేస్ కొనుగోలు చేయాలని చూసారు. అయితే దాని ధర రూ.4,799 అని చూపిస్తోంది. అదే ఉత్పత్తిని ఆండ్రాయిడ్ యాప్‌లో చూస్తే.. దాని ధర 4,119 రూపాయలుగా చూపిస్తోంది. ఈ రెండింటినీ సౌరభ్ స్క్రీన్ షాట్ తీసి, తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement