Mehrauli
-
అవి శ్రద్ధా శరీర భాగాలే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ హత్యా ఘటనలో మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో లభ్యమైన ఎముకలు శ్రద్ధా వాకర్‌వేనని పోలీసు వర్గాలు గురువారం తెలిపాయి. హత్యారోపణలు ఎదుర్కొంటున్న అఫ్తాబ్ గది నుంచి సేకరించిన రక్తం నమూనాలు శ్రద్ధవేనని తేలింది. ఎముకలు, రక్తం నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలు శ్రద్ధా వాకర్ తండ్రి డీఎన్ఏతో సరిపోలాయని ఆ వర్గాలు వివరించాయి. డీఎన్ఏ రిపోర్టుతోపాటు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక అందిందని స్పెషల్ పోలీస్ కమిషనర్(శాంతిభద్రతలు) సాగర్‌ప్రీత్ హూడా మీడియాకు తెలిపారు. అఫ్తాబ్‌కు నిపుణులు నిర్వహించిన పాలీగ్రాఫ్ పరీక్ష నివేదిక కూడా బుధవారం పోలీసులకు అందింది. కేసు దర్యాప్తులో ఈ నివేదికలు కీలకంగా మారాయి. శ్రద్ధావాకర్‌తో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ పూనావాలా ఆమెను గొంతుపిసికి చంపిన అనంతరం శరీరాన్ని 35 భాగాలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడవేశాడు. -
అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధవే.. తేల్చిన డీఎన్ఏ రిపోర్టు
న్యూఢిల్లీ: శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. డిల్లీ మెహ్రౌలీ అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధవే అని తేలింది. ఆమె తండ్రి డీఎన్ఏతో ఈ సాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. సెంట్రల్ ఫోరెన్సిస్ సైన్స్ లాబోరేటరీ నివేదిక దీన్ని ధ్రువీకరించింది. అలాగే శ్రద్ద హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలా పాలీగ్రాఫ్ టెస్టు పూర్తి నివేదిక పోలీసులకు అందింది. దీంతో అధికారులు ఈ కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయనున్నారు. ఢిల్లీ మోహ్రాలీలో ఈ ఏడాది మేలో జరిగిన శ్రద్ధ వాకర్ హత్య కేసు ఆరు నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శ్రద్ధ బాయ్‌ఫ్రెండ్ అప్తాబే ఆమెను గొంతునులిమి చంపాడు. అనంతరం శవాన్ని 35 ముక్కలు చేసి అడవిలో పడేశాడు. పోలీసులు అడవి మొత్తం గాలించి 13 ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. డీఎన్ఏ టెస్టుతో అవి శ్రద్ధవే అని తేలింది. కోర్టు అనుమతితో ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్‌కు పాలీగ్రాఫ్‌తో పాటు నార్కో టెస్టు కూడా నిర్వహించారు అధికారులు. అతని స్టేట్మెంట్ రికార్డు చేశారు. శ్రద్ధను తానే చంపానని, కానీ చంపినందుకు ఎలాంటి పశ్చాతాపం లేదని అఫ్తాబ్ విచారణలో చెప్పాడు. చదవండి: లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్‌ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు -
శ్రద్ధ కేసు: అఫ్తాబ్ అలాంటి వాడని ఊహించలేదు!
ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు చికిత్స అందించే వైద్యురాలు. అలాంటి ఆమెకే షాకిచ్చి.. మానసిక చికిత్స తీసుకునేలా చేశాడు మెహ్రౌలీ ఘోర హత్యోదంతంలో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా. శ్రద్ధా వాకర్‌ను ముక్కలు చేసిన అనంతరం.. ఆ విడిభాగాలను ఇంట్లో ఫ్రిడ్జ్‌లో ఉంచి మరీ ఈ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేశాడు. ఈ క్రమంలో.. ఆ మానవ మృగం గురించి సదరు యువతిని ఆరా తీసిన పోలీసులు.. స్టేట్మెంట్ నమోదు చేశారు. శ్రద్ధా వాకర్ హత్య అనంతరం.. ఆఫ్తాబ్ డేటింగ్ యాప్ ద్వారా మరో యువతిని పరిచయం చేకున్నాడు. ఆమె పలుమార్లు ఇంటికి రప్పించాడు. ఆమె ఓ సైకియాట్రిస్ట్. అయితే ఆ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కనీసం శ్రద్ధా వాకర్‌తో అతని గత పరిచయ విషయం కూడా తనకు తెలియదని ఆమె వాపోయింది. ఆఫ్తాబ్ ఫ్లాట్‌కు వెళ్లిన సమయంలో అతడి ఫ్రిజ్‌లో మానవ శరీర భాగాలు ఉన్న విషయం తనకు తెలియదని సదరు యువతి వెల్లడించింది. అయితే.. హత్య జరిగిన తర్వాత రెండుసార్లు తాను అఫ్తాబ్ ఫ్లాట్‌కు వెళ్లినట్లు మాత్రం ఒప్పుకుంది. ‘‘డేటింగ్ యాప్ ద్వారా నాకు అఫ్తాబ్‌తో పరిచయం ఏర్పడింది. అతను చాలా నార్మల్‌గా కనిపించేవాడు. కాకపోతే సిగరెట్లు ఎక్కువగా కాల్చేవాడు. బాడీస్ప్రేలు, ఫర్ఫ్యూమ్ల కలెక్షన్ ఎక్కువగా ఉండేది అతని దగ్గర. వాటిల్లోంచి కొన్ని నాకు గిఫ్ట్‌గా ఇచ్చేవాడు. అలాగే మా డేటింగ్ కొన్ని నెలలపాటు సాగింది. అక్టోబర్ 12వ తేదీన ఆఫ్తాబ్ నాకు ఓ ఫ్యాన్సీ ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అది అతని మాజీ ప్రేయసిది, ఆమెను అతనే చంపేశాడనే విషయం మీరు(సిట్ పోలీసులు) చెప్పేదాకా తెలియదు. ఆమె చనిపోయినట్లుగా చెప్తున్న నెల వ్యవధిలో అతన్ని రెండుసార్లు కలిశా అని ఆమె ఒప్పుకుంది. అఫ్తాబ్ తనతో చాలా నార్మల్‌గా ఉండేవాడని, ముంబయిలోని తన ఇంటి గురించి తరచూ తనతో చెప్తుండేవాడని ఆమె పేర్కొంది. అతని ప్రవర్తన చూసి మంచివాడు అనుకున్నానే తప్ప.. అంత ఘోరం చేస్తాడని ఊహించని లేదని ఆమె తెలిపింది. అఫ్తాబ్ గురించి తెలిశాక షాక్ తిన్న ఆమె కొన్నాళ్లు మానసిక చికిత్స తీసుకుంది. డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చిన ఆమె నుంచి పోలీసులు ఇవాళ వాంగ్మూలం సేకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఒకేసారి డేటింగ్ యాప్‌ల ద్వారా పాతిక మంది దాకా యువతులను అఫ్తాబ్ సంప్రదించినట్లు తేలిందని పోలీసులు తాజాగా వెల్లడించారు. ఇదీ చదవండి: నేరం ఒప్పుకోలు.. పశ్చాత్తాపంలేని అఫ్తాబ్ -
‘వాడు 35 ముక్కలు చేశాడు.. మేం 70 ముక్కలు చేస్తాం’
సాక్షి, ఢిల్లీ: నగరంలో సోమవారం సాయంత్రం హైడ్రామా నెలకొంది. శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాను తీసుకెళ్తున్న పోలీస్ వాహనంపై కొందరు దాడికి యత్నించారు. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. రోహిణి ప్రాంతంలోని ఎఫ్ఎస్ఐ ల్యాబ్‌లో సోమవారం సాయంత్రం అఫ్తాబ్‌కు పాలిగ్రఫీ టెస్ట్ నిర్వహించినట్లు సమాచారం. అదయ్యాక బయటకు వాహనంలో తీసుకొస్తున్న తరుణంలో.. హిందూసేన కార్యకర్తలుగా చెప్పుకుంటున్న కొందరు అడ్డగించారు. తల్వార్లతో దూసుకొచ్చిన ఆ యువకులు.. పోలీస్ వాహనంపై దాడికి యత్నించారు. ‘‘వాడు మా సోదరిని చంపి 35 ముక్కలుగా చేశాడు. మేం వాడిని చంపి 70 ముక్కలు చేస్తాం. పోలీసులు వాడికి సెక్యూరిటీ కల్పించడం ఏంటి? వాడిని మాకు అప్పగించండి.. చంపేస్తాం అంటూ నినాదాలు చేశారు వాళ్లు. మా ఆడబిడ్డలు, అక్కాచెల్లెళ్లకు భద్రత కొరవడినప్పుడు.. మేం బతికి ఉండి ఏం సాధించినట్లు అంటూ కొందరు అక్కడే ఉన్న మీడియాతో వ్యాఖ్యానించారు. ఒక్కసారిగా వచ్చిన మూకను చూసి పోలీసులు షాక్ తిన్నారు. ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. పలువురిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు. #WATCH | Police van carrying Shradhha murder accused Aftab Poonawalla attacked by at least 2 men carrying swords who claim to be from Hindu Sena, outside FSL office in Delhi pic.twitter.com/Bpx4WCvqXs — ANI (@ANI) November 28, 2022 ఇదీ చదవండి: శ్రద్ధా వాకర్ కంటే భయంకరమైన హత్య ఇది! -
శ్రద్ధ హత్య కేసు.. అడవిని జల్లెడ పట్టిన పోలీసులు.. 3 ఎముకలు స్వాధీనం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణను వేగంగా పుర్తి చేస్తున్నారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా మెహ్రౌలీ అడవిలో శ్రద్ధ శరీర భాగాల కోసం ముమ్మరంగా గాలించారు. నవంబర్ 16న మూడుసార్లు ఈ అడవినంతా జల్లెడపట్టారు. ఈ క్రమంలోనే అక్కడ ఓ పెద్ద ఎముకను గుర్తించారు. అది ఫీముర్(తొడ ఎముక) అయి ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత అడవిలోని ఇతర ప్రాంతాల్లో మరో రెండు ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి కచ్చితంగా శ్రద్ధవే అయి ఉంటాయని చెబుతున్నారు. అడవిని గాలించేందుకు నిందితుడు అఫ్తాబ్‌ను కూడా తీసుకెళ్లారు పోలీసులు. ముక్కలు ముక్కలుగా చేసిన శ్రద్ధ శరీర భాగాలను ఎక్కడ పడేశాడో చూపించమన్నారు. అతడు చెప్పిన వివరాల ప్రకారం అడవినంతా వెతికి మొత్తం మూడు ఎముకలను గుర్తించారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు తొలిసారి ఓ సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 18 తెల్లవారుజామున నిందితుడు అప్తాబ్ తన ఇంటి నుంచి ఓ బ్యాగ్ వేసుకుని, సంచిపట్టుకుని బయటకు వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ బ్యాగులో శ్రద్ధ శరీరా భాగాలు ఉండి ఉంటాయని, అప్తాబ్ వాటిని అడవిలో పడేసేందుకు తీసుకెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఢిల్లీ మొహ్రౌలీలో ఆరు నెలల క్రితం జరిగిన శ్రద్ధ హత్య ఘటన ఇటీవలే వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు, శ్రద్ధ బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. అయితే పోలీసులు ఇంకా శ్రద్ధ శీరర భాగాలన్నింటినీ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అలాగే ఆమె ఫోన్, నిందితుడు ఉపయోగించిన కత్తిని కనిపెట్టాల్సి ఉంది. చదవండి: షాకింగ్.. ఇంజనీరింగ్ కాలేజ్‌లో 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు.. -
Shraddha Case: అమ్మాయిలే జాగ్రత్త పడాలి!
బాగా చదువుకుని, తాము చాలా ఓపెన్‌గా.. నిష్కపటంగా(ఫ్రాంక్‌గా) ఉన్నామని, భవిష్యత్తు గురించి ఎలాంటి నిర్ణయాలైనా తమంతట తాముగా తీసుకోగలమని భావించే అమ్మాయిల విషయంలోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు సహజీవనం అనేది ఎందుకు? ఒకవేళ అలాంటి బంధాలు అవసరం అనుకుంటే.. అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి!. ఒకవేళ తల్లిదండ్రులు అలాంటి వాటికి ఒప్పుకోకపోతే.. న్యాయబద్ధంగా పెళ్లి చేసుకుని కలిసి ఉండాలి... ! శ్రద్ధావాకర్ హత్యోందతాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ చేసిన పైవ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చదువుకున్న అమ్మాయిలు సహజీవనం పేరుతో తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్లడం సరికాదంటూ వ్యాఖ్యానించారాయన. ఈ వ్యాఖ్యలను శివసేన నేత ప్రియాంక చతుర్వేది ఖండించారు. తక్షణమే ఆయన్ని మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారామె. ‘‘అలా ఎందుకు చేస్తున్నారో అనే విషయంపై అమ్మాయిలే జాగ్రత్త పడాలి. చదువుకున్న అమ్మాయిలు అలాంటి బంధాలకు దూరంగా ఉండాలి. అసలు తల్లిదండ్రులు అలాంటి బంధాలకు ఒప్పుకోనప్పుడు.. పూర్తి బాధ్యత ఆ చదువుకున్న అమ్మాయిలదే అవుతుంది కూడా’’ అని మంత్రి కౌశల్ ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘‘ఈ దేశంలో పుట్టడానికి ఆడపిల్లలే కారణమని చెప్పకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. సిగ్గులేని, హృదయం లేని, క్రూరమైన వాళ్ల వల్ల అన్ని సమస్యలకు స్త్రీని నిందించే మనస్తత్వం అభివృద్ధి చెందుతూనే ఉంది అని ఆమె పేర్కొన్నారు. నారీశక్తికి కట్టుబడి ఉంటే తక్షణమే ఆయన్ని తొలగించాలంటూ ప్రధాని కార్యాలయాన్ని డిమాండ్ చేస్తూ ఆమె ట్వీట్ చేశారు. Surprised he didn’t say girls are responsible for being born into this nation. Shameless, heartless and cruel, blame-the-woman-for-all problems mentality continues to thrive. https://t.co/ILYGHjwsMX — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) November 17, 2022 ఇదీ చదవండి: అఫ్తాబ్‌పై ఆ పరీక్షలు నిర్వహిస్తారా? -
శ్రద్ధా హత్య కేసు : సాకేత్ కోర్టులో లాయర్ల ఆందోళన..
-
శ్రద్ధా హత్య కేసు: అంతుపట్టని మరో ట్విస్ట్....నివ్వెరపోయిన పోలీసులు
యావత్తు దేశాన్ని భయబ్రాంతులకు గురి చేసిన ఢిల్లీ మెహ్రౌలీ హత్య కేసులో విచారణ చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అప్తాబ్ పూనావాలా, శ్రద్ధ ఇద్దరూ ఢిల్లీలో ఒక ఫ్లాట్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే పోలీసులు ఫ్లాట్ విషయంలో క్లూస్ కోసం దర్యాప్తు చేస్తుండగా.. నీటిబిల్లుల విషయం వారిని ఆశ్చర్యపరిచింది. మొత్తం రూ. 300 పెండింగ్ వాటర్ బిల్ ఉండటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ. 300 బిల్ అనేది పెద్ద మొత్తం కాకపోయిన.. ప్రతినెల 20 వేల లీటర్లు నీరు ఉచితమైనప్పటికీ నీటిని ఎందుకు అధికంగా ఉపయోగించాడనే విషయం పోలీసులకు అంతు చిక్కడం లేదు. మృతదేహాన్ని కట్ చేసే శబ్ద రాకుండా ఉండేందుకు నీళ్లను అలా ఊరికే వదిలేశాడా లేక శరీరం నుంచి వచ్చే రక్తాన్ని కడగటానికి అంత పెద్ద మొత్తంలో నీరు అవసరమైందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ విషయమై ఆ ఆఫ్లాట్ ఓనర్ని కూడా విచారించగా... ఆయన కూడా ఇంత పెద్ద మొత్తంలో నీటి బిల్లులా అని ఆశ్చర్యపోయారు. తాను ఫ్లాట్‌ని వారికి నెలకు రూ.9000లకు అద్దెకు ఇచ్చానని, అగ్రిమెంట్లో ఇద్దరి పేర్లు ఉన్నాయని చెప్పారు. అలాగే అప్తాబ్ ప్రతి నెల 8, 10 తేదీ లోపే అద్దె చెల్లించేయడంతో తాను ఎప్పుడూ ఫ్లాట్‌కి వచ్చే పరిస్థితి ఏర్పడలేదన్నారు. కాగా శ్రద్ధ హత్య జరిగిన ఆరు నెలల తర్వాత ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదీ కూడా ఆమె స్నేహితులు తమతో టచ్‌లో లేదంటూ శ్రద్ధ తండ్రి వికాస్ వాకర్‌కి చెప్పడంతోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారుజ ఐతే శ్రద్ధ శరీర భాగాల్లో ఇంకా చాలా దొరకలేదని, అలాగే అడవిలో దొరికిన భాగాలు శ్రద్ధవి కాదా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు సుమారు 15 రోజులు పడుతుందని పోలీసులు చెప్పారు. హత్య అనంతరం కొనుగోలు చేసిన ఫ్రిజ్, కత్తి బలమైన సాక్ష్యాధారాలని చెబుతున్నారు. తమకు ఇప్పటి వరకు శ్రద్ధ ధరించిన దుస్తులు, మృతదేహాన్ని కోసిన కత్తి దొరకాల్సి ఉందన్నారు. పోలీసులు సాక్ష్యాధారాలను మరింత బలోపేతం చేసేందుకు లై డిటెక్టర్ పరీక్షకు సైతం అనుమతి కోరారు. (చదవండి: శ్రద్ధావాకర్ హత్యకేసులో దిమ్మ తిరిగే ట్విస్టులు.. అలా జరిగి ఉండకపోతే ‘మిస్సింగ్’ మిస్టరీగానే మిగిలేదేమో!) -
‘వాడు నాకు నచ్చలేదు.. నీకూ వద్దమ్మా !’
క్రైమ్: ఢిల్లీ మెహ్రౌలీ సంచలన కేసులో దర్యాప్తు లోతుగా వెళ్లే కొద్దీ.. పోలీసులకు షాకింగ్ విషయాలే తెలుస్తున్నాయి. పోలీసులు సైతం నివ్వెరపోయేలా ఉంటున్నాయి ఈ కేసు పరిణామాలు. ఇప్పటికీ ఆమె సెల్‌ఫోన్, కొన్ని శరీర భాగాలు ఇంకా దొరకలేదు. శ్రద్ధ ముఖాన్ని ఎవరూ గుర్తు పట్టవద్దనే ఉద్దేశంతో కాల్చేసినట్లు తాజాగా వెల్లడించాడు నిందితుడు అఫ్తాబ్. అలా.. నిలువెల్లా క్రూరత్వమే కనిపిస్తోంది ఈ వ్యవహారంలో. మరోవైపు.. శ్రద్ధా వాకర్ హత్యోదంతంలో పోలీసులు, నిందితుడిని ఇవాళ(గురువారం) కోర్టులో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఈ తరుణంలో.. అఫ్తాబ్ పూనావాలా నేరంగీకారంపై బాధితురాలి తండ్రి కన్నీటి పర్యంతం అయ్యారు. కూతురు మరణించిందనే వార్తను వికాస్ వాకర్ ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఫలితం తేలే వరకు ఆమె చనిపోయిందని తాను నమ్మబోనని వికాస్ కన్నీటి పర్యంతం అయ్యాడు. అతను(అఫ్తాబ్) నా ఎదుటే నేరం అంగీకరించాడు. పోలీసుల ఎదుట.. శ్రద్ధ ఇక లేదు అనే మాట చెప్పాడు. ఆ సమాధానంతో కుప్పకూలిపోయా. నేనింకా ఏం వినదల్చుకోలేదు. నాకు ఆ ధైర్యం కూడా రాలేదు. అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు’’ అని ఓ ఇంటర్వ్యూలో వికాస్ వాకర్ వెల్లడించారు. అఫ్తాబ్‌ను గతంలో చాలాసార్లు కలిశాను. ఆ సమయంలో మాట్లాడినప్పుడు అతను మామూలుగానే అనిపించాడు. కానీ, శ్రద్ధ కనిపించకుండా పోయినప్పటి నుంచి అనుమానం మొదలైంది. ‘‘శ్రద్ధ కనిపించకుండా పోయిందని ఆమె స్నేహితురాళ్ల ద్వారానే నాకు తెలిసింది. రెండున్నర నెలలు ఆమె కోసం వెతికాం. ఆచూకీ దొరకలేదు. అఫ్తాబ్ జాడ తెలిశాక.. ఎందుకు విషయం చెప్పలేదని అతన్ని నిలదీశాను. ‘మేమిప్పుడు కలిసి లేనప్పుడు మీకెందుకు చెప్పాలి?’ అని నామీదే కసురుకున్నాడు. రెండున్నరేళ్లుగా ప్రేమించాడు. ఎంత ప్రేమిస్తే నా కూతురు మా మాట కాదని బయటకు వచ్చేస్తుంది. కలిసి ఉన్నప్పుడు.. ఆమె బాధ్యత అతనిది కాదా?. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని పోలీసుల వద్ద ప్రస్తావించా. పోలీసులు కూడా అతని సమాధానాలు పొంతన లేకపోవడంతో.. గట్టిగా విచారించారు. లేకుంటే.. ఈ కేసులో కదలికలు వచ్చేవి కావేమో. శ్రద్ధ-అఫ్తాబ్‌ల ప్రేమ వ్యవహారం 2021 మధ్య దాకా మాకు తెలియదు. కానీ, అంతకు ముందు నుంచే ఓ స్నేహితుడిగా అతను నాకు తెలుసు. వాళ్ల ప్రేమ గురించి తెలియగానే వాడు నాకు నచ్చలేదని ఆనాడే శ్రద్ధతో చెప్పా. అతన్ని పెళ్లి చేసుకోవద్దని సూచించా. మన వర్గానికే చెందిన వ్యక్తిని చేసుకోవాలని శ్రద్ధను కోరా. కానీ, నా కూతురు మాట వినలేదు. సొంత నిర్ణయం తీసుకుంది. ఫలితం.. కన్నవాళ్లకు లేకుండా పోయింది. వాడికి(అఫ్తాబ్)కు ఉరే సరి అని కన్నీళ్లతో వికాస్ చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్యోదంతం.. అసలేం జరిగింది? -
ఢిల్లీ ఐరన్‌పిల్లర్... తుప్పుపట్టని చరిత్ర
ఇది ఢిల్లీ ఐరన్‌పిల్లర్... ఎత్తు 23 అడుగుల ఎనిమిది అంగుళాలు. వ్యాసం పదహారు అంగుళాలు. బరువు మూడు టన్నులకు పైమాటే. తుప్పుపట్టని భారత చరిత్రకు ప్రతీక. భారతీయ శాస్త్రనైపుణ్యానికి ప్రతిబింబం. దేశ రాజధానిలో ఇనుప స్తంభం... ఎక్కడ ఉంది? ఢిల్లీ నగరంలో మెహ్రౌలీలో ఉంది. అర్థమయ్యేలా చెప్పాలంటే కుతుబ్‌మినార్ ఆవరణలో ఉంది. ఎవరు నిలబెట్టారిక్కడ? తోమార్ రాజు అనంగ పాలుడు కావచ్చు, బానిస పాలకుడు ఇల్టుట్మిష్ కావచ్చు. ఈ కావచ్చుల వెనుక ఇంకా మరెన్నో కావచ్చులున్నాయి. దీనిని ఎవరు నిర్మించారనే ప్రశ్నకు సమాధానం ఈ స్తంభం మీదున్న శాసనాలే. సంస్కృత భాషలో బ్రాహ్మి లిపిలో ఉన్న ఈ శాసనాలను చదవడానికి అక్బర్ చేయని ప్రయత్నం లేదు. అయితే ఈ ప్రయత్నంలో సఫలమైంది బ్రిటిష్ పాలకులే. లండన్ ఆర్కియాలజిస్టుల మేధోతవ్వకం తర్వాత బయటపడిన వాస్తవం ఏమిటంటే... ఇది పదహారు వందల ఏళ్ల నాటి స్తంభం. గుప్తుల కాలం నాటిది. రెండవ చంద్రగుప్తుడు క్రీ.శ నాలుగవ శతాబ్దంలో మధ్యప్రదేశ్‌లోని విష్ణుపాద కొండల మీద స్థాపించాడని వెల్లడైంది. ఈ పిల్లర్ మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు భారతదేశంలో గుప్తుల కాలం నాటికే లోహశాస్త్రం అత్యున్నత దశకు చేరి ఉండేదని సూత్రబద్ధంగా నిర్ధారించారు. అంత పెద్ద పుస్తకాలు చదివి అంత గొప్ప సైన్స్‌ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అయినా ఏం ఫర్వాలేదు. ఈ పిల్లర్‌ని చూసి ఆ మేధోఘనులకు ఒక సెల్యూట్ చేసి, పిల్లర్ ముందు నిలండి ఫొటో తీసుకుంటే ఎప్పటికీ తుప్పు పట్టని ఓ మంచి జ్ఞాపకం మన ఆల్బమ్‌లో నిక్షిప్తమై ఉంటుంది. నిజమో! కాదో!! కానీ... ఈ పిల్లర్ చూడడానికి సన్నగా ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ పిల్లర్ మన వీపుకి తగిలేటట్లు నిలబడి రెండు చేతుల్ని వెనక్కి చాచి పిల్లర్‌ని చుట్టడానికి ప్రయత్నిస్తే చేతులు అందవు. ఈ ప్రయత్నంలో రెండు అరచేతుల్ని పట్టుకోగలిగిన వాళ్లు గొప్ప వ్యక్తులవుతారని అక్కడ ఒక సరదా నమ్మకం ఉండేది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి చేతులు అందాయని కూడా చెప్పేవారు. పర్యాటకులందరూ ప్రయత్నించి విఫలమయ్యేవాళ్లు. ఇప్పుడు ఆ ప్రయత్నం చేయడానికి కూడా వీల్లేదు. పిల్లర్ చుట్టూ కంచె కట్టేశారు. దూరంగా నిలబడి చూసి ఆనందించాల్సిందే. మధ్యప్రదేశ్‌లోనే ఎందుకు? కర్కాటక రేఖ మన దేశంలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరామ్.. మొత్తం ఎనిమిది రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఎక్యునాక్స్‌డే (పగలు– రాత్రి సమంగా ఉండేరోజు) సూర్యుడి గమనం సాగే రేఖామార్గంలో మధ్యప్రదేశ్‌లో ఉన్న విష్ణుపాద కొండల మీద ఈ ఇనుపస్తంభాన్ని స్థాపించారు. ఇది ఈ ఇనుపస్తంభ స్థాపన వెనుక ఉన్న ఖగోళ విజ్ఞానం. అంతకు మించిన లోహశాస్త్ర విజ్ఞానం కూడా ఈ పిల్లర్‌లో నిక్షిప్తమై ఉంది. బ్రిటిష్ కాలంలో ఆర్కియాలజిస్ట్ జేమ్స్ ప్రిన్సెప్ 1817లో ఈ పిల్లర్ మీద అధ్యయనం చేసి ప్రపంచానికి తెలియచేశాడు. మెటలర్జరిస్ట్ సర్ రాబర్ట్ హోడ్‌ఫీల్డ్ 1912లో రీసెర్చ్ మొదలు పెట్టాడు. అనేకమంది శాస్త్రవేత్తలు ఇందులోని శాస్త్రీయత మీద పరిశోధనలు చేసి రెండు వందల యాభైకి పైగా పేపర్లు, పుస్తకాలు వెలువరించారు. ఇది ఒక మెటలర్జికల్ వండర్ అని తేల్చేశారంతా. ఈ ఐరన్ పిల్లర్‌ని తుప్పపట్టనివ్వని లోహపు పూత మందం మిల్లీమీటరులో ఇరవయ్యో వంతు. ఈ టెక్నాలజీ మీద ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. – వాకా మంజులా రెడ్డి -
బంధువుపై తండ్రికొడుకుల లైంగిక దాడి
నిర్భయ సంఘటనతో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చట్టాలు చేస్తుంది. అయిన ఆ చట్టాలు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అపలేకపోతున్నాయి. పైగా మహిళలపై లైంగిక దాడులు రోజురోజూకు పెచ్చురిల్లుతునే ఉన్నాయి. అందుకు దేశరాజధాని హస్తినలో చోటు చేసుకున్న సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ. దగ్గర బంధువు అయిన మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో అదను చూసి తండ్రికొడుకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన దక్షిణ ఢిల్లీలోని మోహరౌలి ప్రాంతంలో చోటు చేసుకుంది. సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులకు, బంధువులుకు వెల్లడిస్తే చంపేస్తామంటూ నిందితులు బెదిరించారు. దాంతో బాధితురాలు మోహరౌలి పోలీసులకు ఆదివారం అర్థరాత్రి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి తండ్రి, ఇద్దరు కొడుకులను సోమవారం అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మోహరౌలి పోలీసులు వెల్లడించారు.