న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణను వేగంగా పుర్తి చేస్తున్నారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా మెహ్రౌలీ అడవిలో శ్రద్ధ శరీర భాగాల కోసం ముమ్మరంగా గాలించారు. నవంబర్ 16న మూడుసార్లు ఈ అడవినంతా జల్లెడపట్టారు. ఈ క్రమంలోనే అక్కడ ఓ పెద్ద ఎముకను గుర్తించారు. అది ఫీముర్(తొడ ఎముక) అయి ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత అడవిలోని ఇతర ప్రాంతాల్లో మరో రెండు ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి కచ్చితంగా శ్రద్ధవే అయి ఉంటాయని చెబుతున్నారు.
అడవిని గాలించేందుకు నిందితుడు అఫ్తాబ్‌ను కూడా తీసుకెళ్లారు పోలీసులు. ముక్కలు ముక్కలుగా చేసిన శ్రద్ధ శరీర భాగాలను ఎక్కడ పడేశాడో చూపించమన్నారు. అతడు చెప్పిన వివరాల ప్రకారం అడవినంతా వెతికి మొత్తం మూడు ఎముకలను గుర్తించారు.
మరోవైపు ఈ కేసులో పోలీసులు తొలిసారి ఓ సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 18 తెల్లవారుజామున నిందితుడు అప్తాబ్ తన ఇంటి నుంచి ఓ బ్యాగ్ వేసుకుని, సంచిపట్టుకుని బయటకు వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ బ్యాగులో శ్రద్ధ శరీరా భాగాలు ఉండి ఉంటాయని, అప్తాబ్ వాటిని అడవిలో పడేసేందుకు తీసుకెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు.
ఢిల్లీ మొహ్రౌలీలో ఆరు నెలల క్రితం జరిగిన శ్రద్ధ హత్య ఘటన ఇటీవలే వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు, శ్రద్ధ బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. అయితే పోలీసులు ఇంకా శ్రద్ధ శీరర భాగాలన్నింటినీ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అలాగే ఆమె ఫోన్, నిందితుడు ఉపయోగించిన కత్తిని కనిపెట్టాల్సి ఉంది.
చదవండి: షాకింగ్.. ఇంజనీరింగ్ కాలేజ్‌లో 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు..
Comments
Please login to add a commentAdd a comment