
న్యూఢిల్లీ: శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. డిల్లీ మెహ్రౌలీ అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధవే అని తేలింది. ఆమె తండ్రి డీఎన్‌ఏతో ఈ సాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. సెంట్రల్ ఫోరెన్సిస్ సైన్స్ లాబోరేటరీ నివేదిక దీన్ని ధ్రువీకరించింది.
అలాగే శ్రద్ద హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలా పాలీగ్రాఫ్ టెస్టు పూర్తి నివేదిక పోలీసులకు అందింది. దీంతో అధికారులు ఈ కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయనున్నారు.
ఢిల్లీ మోహ్రాలీలో ఈ ఏడాది మేలో జరిగిన శ్రద్ధ వాకర్ హత్య కేసు ఆరు నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శ్రద్ధ బాయ్‌ఫ్రెండ్ అప్తాబే ఆమెను గొంతునులిమి చంపాడు. అనంతరం శవాన్ని 35 ముక్కలు చేసి అడవిలో పడేశాడు. పోలీసులు అడవి మొత్తం గాలించి 13 ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. డీఎన్ఏ టెస్టుతో అవి శ్రద్ధవే అని తేలింది.
కోర్టు అనుమతితో ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్‌కు పాలీగ్రాఫ్‌తో పాటు నార్కో టెస్టు కూడా నిర్వహించారు అధికారులు. అతని స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. శ్రద్ధను తానే చంపానని, కానీ చంపినందుకు ఎలాంటి పశ్చాతాపం లేదని అఫ్తాబ్ విచారణలో చెప్పాడు.
చదవండి: లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్‌ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు
Comments
Please login to add a commentAdd a comment