DNA report
-
CBI: నిందితుడి డీఎన్ఏ, రక్తనమూనాలు సరిపోలాయి
కోల్‌కతా: దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైన ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీ వైద్యురాలిపై హత్యాచారం ఘటన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడి పనేనని సీబీఐ తెలిపింది. వైద్యురాలి మృతదేహంపై ఉన్న డీఎన్ఏ, రక్తనమూనాలు నిందితుని నమూనాలతో సరిపోలాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. సంజయ్ రాయ్‌కు వ్యతిరేకంగా 11 సాంకేతిక ఆధారాలను చార్జిషీటులో పొందుపర్చింది. బాధితురాలి మృతదేహం నుంచి సేకరించిన డీఎన్ఏ సంజయ్ రాయ్ డీఎన్ఏతో సరిపోలిందని తెలిపింది. అలాగే కురచ వెంట్రుకలు, పెనుగులాటలో సంజయ్ రాయ్ ఒంటిపై అయిన గాయాలు, అతని శరీరంపై, ప్యాంటుపై బాధితురాలి రక్తపు మరకలు, సీసీటీవీ ఫుటేజీ, అతని మొబైల్ ఫోన్ లొకేషన్, ఫోన్‌కాల్ వివరాలు.. ఇవన్నీ సంజయ్ రాయ్ పాత్రను నిర్ధారిస్తున్నాయని పేర్కొంది. సంజయ్ రాయ్ ఒంటిపై బలమైన గాయాలున్నాయని, వైద్యురాలు తీవ్రంగా ప్రతిఘటించినపుడు ఇవి జరిగాయని వివరించింది. పాశవిక హత్యాచారం జరిగిన ఆగస్టు 9న సంజయ్ రాయ్ ఆర్.జి.కర్ మెడికల్ కాలేజిలో మూడో అంతస్తులోని సెమినార్ హాల్ వద్ద ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజి, అతని కాల్ డేటా ధ్రువీకరిస్తోందని తెలిపింది. సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు ఆగస్టు 10న అరెస్టు చేయగా.. తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ చేపట్టిన విషయం తెలిసిందే. సెమినార్ హాల్ వైపు వెళుతున్నపుడు సంజయ్ రాయ్ మెడపై ఉన్న బ్లూటూత్ ఇయర్‌ఫోన్ నెక్‌బ్యాండ్ తర్వాత అతను తిరిగి వెళుతున్నపుడు లేదని, సంజయ్ రాయ్ ఫోన్‌తో ఇది అనుసంధానమైనట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లా»ొరేటరీ నివేదిక ఇచి్చందని స్థానిక కోర్టుకు సీబీఐ తెలిపింది. -
‘డీఎన్ఏ’నా మజాకా!
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షులు ఎదురు తిరగవచ్చు.. కానీ ఆధారాలు మాత్రం ఎప్పటికీ నిజమే చెబుతాయి’ నేర దర్యాప్తులో కీలకమైన ఈ ప్రాథమికాంశం మరోసారి నిరూపితమైంది. లంగర్‌హౌస్ పరిధిలో సోదరిపై అత్యాచారం చేసిన కామాంధుడికి పోక్సో న్యాయస్థానం మంగళవారం జీవితఖైదు విధించిన విషయం విదితమే. ఇందులో బాలిక తల్లి సాక్ష్యం చెప్పకున్నా... తమ కుమార్తెను చెప్పనీయకున్నా... డీఎన్ఏ నివేదికలు మాత్రం నేరం నిరూపించాయి. వీటితో పాటు డాక్టర్ వాంగ్మూలం ఆధారంగా పోక్సో న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చి శిక్ష విధించింది. ఈ కేసు దర్యాప్తులో కీలక భూమిక పోషించిన అప్పటి ఆసిఫ్‌నగర్, ప్రస్తుత సైబర్ క్రైమ్ ఏసీపీ ఆర్జీ శివమారుతిని కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డితో పాటు మహిళా భద్రత విభాగం అదనపు డీజీ షికా గోయల్ అభినందించారు. దారుణానికి ఒడిగట్టిన సోదరుడు.. లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు నలుగురు సంతానం. చిన్న కుమార్తె కొన్ని నెలల వయసులో ఉండగానే భర్తకు దూరమైంది. ఈమె కుమారుడు బైక్ మెకానిక్. ఏడో తరగతి చదువుతున్న సోదరిపై ఇతని కన్నుపడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దాదాపు ఏడాది పాటు ఈ దారుణం కొనసాగించాడు. 2021 మే 20న బాలికలో వస్తున్న మార్పులు గమనించిన ఆమె తల్లి లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకువెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆమె ఆరు నెలల గర్భిణి అని తేల్చారు. దీంతో బాలికను తీసుకుని నిలోఫర్ ఆస్పత్రికి వెళ్లిన ఆమె తల్లి అబార్షన్ చేయాల్సిందిగా కోరింది. కోర్టు ఉత్తర్వులు లేనిదే ఆ పని చేయలేమని వైద్యులు చెప్పడంతో బాధితురాలి తల్లి లంగర్‌హౌస్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన నాటి ఆసిఫ్‌నగర్ ఏసీపీ.. పోక్సో చట్టం కింద నమోదైన ఈ కేసును అప్పటి ఆసిఫ్‌నగర్ ఏసీపీ ఆర్జీ శివమారుతి నేతృత్వంలోని పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు కేసు దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో చార్జ్ట్ దాఖలు చేశారు. దీనికి ముందే బాలిక–ఆమె సోదరుడి నుంచి సేకరించిన నమూనాలకు డీఎన్ఏ పరీక్షలు చేయించి, సారూప్యంగా వచ్చిన ఆ నివేదికను అభియోగపత్రాలకు జత చేశారు. ఈ కేసు పోక్సో కోర్టులో విచారణలో ఉండగా సాక్షిగా హాజరైన బాధితురాలి తల్లి ఎదురు తిరిగింది. పోలీసులకు వ్యతిరకంగా సాక్ష్యం చెప్పింది. కేసు విచారణలో ఉండగానే బాలిక తల్లి తన కుమారుడికి (నిందితుడు) వివాహం చేసింది. పోలీసుల సమన్లు అందుకోకుండా చాలా రోజులు బాలిక వారికి కనిపించకుండా దూరంగా ఉంచింది. ఆ రెండింటి ఆధారంగానే జీవిత ఖైదు... ఘోరం చోటు చేసుకున్న నాటి నుంచి దాదాపు ఏడాది పాటు భరోసా కేంద్రం అధికారులు బాలిక ఆలనాపాలనా చూసుకున్నారు. డీసీపీ డి.కవిత ఈ కేసును క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఆమె తల్లి మాత్రం తన కుమారుడిని రక్షించడం కోసం బాలిక సాక్ష్యం చెప్పకుండా ప్రయతి్నంచింది. ఎట్టకేలకు బాలిక ఆచూకీ కనిపెట్టిన అధికారులు సమన్లు ఇవ్వడంతో ఆమె తల్లి పోక్సో కోర్టుకు తీసుకువచి్చంది. పోలీసుల అభియోగాలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించింది. అయినప్పటికీ పోలీసులతో పాటు భరోసా కేంద్రం అధికారులు సైతం ఈ కేసు విచారణను కొనసాగించారు. బాలిక– ఆమె సోదరుడి నమూనాలకు సంబంధించిన డీఎన్ఏ రిపోర్టులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్‌తో వాంగ్మూలం ఇప్పించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధించింది. -
అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధవే.. తేల్చిన డీఎన్ఏ రిపోర్టు
న్యూఢిల్లీ: శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. డిల్లీ మెహ్రౌలీ అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధవే అని తేలింది. ఆమె తండ్రి డీఎన్ఏతో ఈ సాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. సెంట్రల్ ఫోరెన్సిస్ సైన్స్ లాబోరేటరీ నివేదిక దీన్ని ధ్రువీకరించింది. అలాగే శ్రద్ద హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలా పాలీగ్రాఫ్ టెస్టు పూర్తి నివేదిక పోలీసులకు అందింది. దీంతో అధికారులు ఈ కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయనున్నారు. ఢిల్లీ మోహ్రాలీలో ఈ ఏడాది మేలో జరిగిన శ్రద్ధ వాకర్ హత్య కేసు ఆరు నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శ్రద్ధ బాయ్‌ఫ్రెండ్ అప్తాబే ఆమెను గొంతునులిమి చంపాడు. అనంతరం శవాన్ని 35 ముక్కలు చేసి అడవిలో పడేశాడు. పోలీసులు అడవి మొత్తం గాలించి 13 ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. డీఎన్ఏ టెస్టుతో అవి శ్రద్ధవే అని తేలింది. కోర్టు అనుమతితో ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్‌కు పాలీగ్రాఫ్‌తో పాటు నార్కో టెస్టు కూడా నిర్వహించారు అధికారులు. అతని స్టేట్మెంట్ రికార్డు చేశారు. శ్రద్ధను తానే చంపానని, కానీ చంపినందుకు ఎలాంటి పశ్చాతాపం లేదని అఫ్తాబ్ విచారణలో చెప్పాడు. చదవండి: లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్‌ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు -
Viral Video: ‘మన బిడ్డకు తండ్రి నేను కాదు.. ఇదిగో సాక్ష్యం’
మనుషుల భావోద్వేగాలతో ఆటాడుకుంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందంటూ ట్విట్టర్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. పోస్ట్ చేసిన 12 గంటల్లోనే ఏకంగా రెండు మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు. ఏకంగా 65 వేల మంది స్పందించారు. ఇంతకీ వీడియోలో ఏముందంటే .. తమ కూతురి పుట్టినరోజు సందర్భంగా ఓ వ్యక్తి గిఫ్ట్ తీసుకొచ్చి కిచెన్‌లో ఉన్న తన భార్యకిస్తాడు. గిఫ్ట్ ప్యాక్‌లో ఓ కవర్ తెరిస్తే.. అందులో మరొకటి.. అది తెరిస్తే.. ఇంకొకటి.. అలా చివరికి ఓ రెండు కాగితాలు మిగులుతాయి. ఏదో గొప్ప బహుమతి ఇస్తావనుకుంటే ఇవేంటీ అని ఆమె భర్తను ప్రశ్నిస్తుంది. సరే ఈ కాగితాల్లో ఏముంది? ఆమె ప్రశ్నకు ఆ వ్యక్తి సమాధానం వింటే షాకవడం ఖాయం. ‘అవి DNA పరీక్షా ఫలితాలు.. వాటి ప్రకారం మన బిడ్డకు తండ్రి నేను కాదు’ అని అతను చెప్పగానే ఆమె నిశ్చేష్టురాలవుతుంది. చదవండి👉పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి .. అబార్షన్‌కు హైకోర్టు నో.. ఓకే చెప్పిన సుప్రీంకోర్టు ఈ వీడియోలో నిజమెంత? అబద్దమెంత? వ్యూస్ కోసం చేశారా? లేక నిజంగానే జరిగిందా? అన్నదానిపై పరిశీలన చేశాం. ఇది రెండేళ్ల కిందటిదిగా తేలింది. వీడియో పాతదా? కొత్తదా? అన్నది పక్కనపెడితే ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని నెటిజన్లు అంటున్నారు. కోపతాపాలు పెరగడంతో విచ్చలవిడిగా విడాకులు తీసుకుంటున్నారు. అప్పటికే పుట్టిన బిడ్డల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోంది. ఇక కృత్రిమ గర్భధారణతో పుట్టిన బిడ్డల విషయంలోనూ గందరగోళం నెలకొంటోందని ఎన్నో కేసులు చెబుతున్నాయి. వీటికి తోడు అనైతిక సంబంధాలు.. వెరసి ఎంతో మానసిక వ్యధను పిల్లలు ఎదుర్కొంటున్నారు. చదవండి👉జో బైడెన్‌కు క్యాన్సరా? పొరపాటున నోరు జారారా లేక నిజమా? వైట్ హౌస్ క్లారిటీ He gifted her the DNA test resuIts on their “daughter's” birthday😬… pic.twitter.com/CKMqPZiKRr — d🦕n (@javroar) July 20, 2022 -
24 ఏళ్ల తర్వాత తెరిచిన లిఫ్ట్.. భయపెట్టిన దృశ్యం
లక్నో: ఓ ఆస్పత్రిలో దాదాపు 24 ఏళ్లుగా మూసి ఉన్న ఎలివేటర్‌ని రెండు మూడు రోజుల క్రితం తెరిచారు. అయితే అనూహ్యంగా దానిలో వారికి ఓ అస్థిపంజరం కనిపించి భయభ్రాంతులకు గురి చేసింది. విషయం పోలీసులు తెలియడంతో వారు అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్ బస్తి జిల్లా కైలీ ప్రాంతంలో 1991 సంవత్సరంలో 500 పడకలతో ఓపెక్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉన్న ఎలివేటర్ పాడు కావడంతో ఆరు సంవత్సరాల తర్వాత అనగా 1997లో మూసి వేశారు. అప్పటి నుంచి క్లోస్ చేసి ఉన్న ఈ ఎలివేటర్‌ని 24 ఏళ్ల తర్వాత అనగా ఈ ఏడాది సెప్టెంబర్ 1న తెరిచారు. ఈ క్రమంలో దానిలో వారికి ఓ అస్థిపంజరం దర్శనమిచ్చి భయభ్రాంతులకు గురి చేసింది. (చదవండి: ‘దృశ్యం’ సీన్: పోలీస్‌స్టేషన్‌లో అస్థిపంజరం) ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు ఆస్పత్రి వద్దకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ సిబ్బంది ఈ మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు. ఈ అస్థిపంజరం పురుషుడిదిగా గుర్తించారు. ఇక పోలీసులు గత 24 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నమోదైన మిస్సింగ్ పర్సన్స్ ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. (చదవండి: ముగ్గురు భార్యలు.. 3 అస్థిపంజరాలు: వీడిన మిస్టరీ) ప్రస్తుతం పోలీసులు పని చేయని లిఫ్ట్‌లోకి ఈ వ్యక్తి ఎందుకు వెళ్లాడు... అతడే లోపలికి వెళ్లాడా.. లేక ఎవరైనా అతడిని హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకువచ్చి.. దీనిలో పడేశారా.. లేక పొరపాటున సదరు వ్యక్తి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి.. ఊపిరాడక చనిపోయి ఉంటాడా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డీఎన్ఏ రిపోర్ట్ వస్తే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. (చదవండి: ఈ బుడ్డోడు సూపర్.. అస్థిపంజరంతో కలిసి) ఈ సందర్భంగా బస్తి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. దీనికి సంబంధించి ఎవరైనా రాతపూర్వక ఫిర్యాదు ఇస్తే.. మేం కేసు నమోదు చేస్తాం. ప్రస్తుతం పోలీసులు పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ మగ అస్థిపంజరం వెనక ఉన్న మిస్టరీని పరిష్కరించడానికి జిల్లాలోని 24 పోలీసు స్టేషన్ల పోలీసులు పని చేస్తున్నారు అని తెలిపారు. -
భారతీయుల డీఎన్ఏ ఒక్కటే!
‘భారతదేశంలో నివసించే హిందూ–ముస్లింల డీఎన్ఏ ఒకటేనని, పూజావిధానం ప్రాతిపదికన మనుషులను వేరుగా చూడలేమ’ని ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్న మాటలు సంచలనం కలిగించాయి. ఆరెస్సెస్ ప్రవచించే జాతీయవాదాన్ని హిందూ మతోన్మాదంగా చిత్రీకరించి, సనాతన భారతీయ విలువల్ని తూర్పారబట్టే మానసిక భావజాలంతో మనుగడ సాగిస్తున్న భారతీయ మేధావులను ఆయన ప్రకటన సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి ఉంటుంది. మనిషి శారీరక మానసిక ఆరోగ్యాలను చక్కబెట్టడానికి మన మహర్షులు అందించిన యోగాను, ప్రాణాయామ ప్రక్రియను ఒక మత ఆచారంగా తేల్చి కొన్ని వర్గాల ప్రజలకు దాన్ని దూరం చేశారు. ఈ నేపథ్యంలో మోహన్ భాగవత్ వ్యాఖ్యలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. హిందూ సమాజంలోని కుల పైత్యాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తూ హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉండే ప్రజలందరి డీఎన్ఏ ఒకటేనని, వీరందరూ అనుసరించే సంస్కృతి ఒకటేనని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తేల్చి చెప్పారు. ఈ దేశ దురదృష్టమేమో కానీ ఆయన మాటలను చాలామంది పాలకులు, మేధావులు చెవికి ఎక్కించుకోలేదు. ’భారతీయులందరూ ఒక జాతి కాదు. ఈ దేశంలో నివసించే ప్రజలందరూ అనేక దేశాల నుంచి వచ్చినవారు. ఇక్కడ జాతీయులు ఎవరూ లేరు’ అనే కొత్త వాదాన్ని బ్రిటిష్ పాలకులు ఈ దేశ విద్యావిధానంలో ప్రవేశపెట్టారు. ఈ వాదం స్వాతంత్య్రోద్యమ నాయకుల్లో గందరగోళాన్ని కలిగించింది. ఈ వాదాన్ని బలంగా నమ్మిన ప్రజలు దేశం నుంచి విడిపోయారు. బ్రిటిష్ వారు నాటిన విషబీజాల ప్రభావం భారతీయ జనత మెదళ్ల నుండి ఇంకా తొలగిపోలేదనే సత్యాన్ని గుర్తు చేయడం కోసమే మోహన్ భాగవత్ ఈ మాటలు అన్నారేమో అని అర్థం చేసుకోవచ్చు. ఆయన మాటల్లో చారిత్రక వాస్తవం ఉంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్‌లో జీవించే చాలామంది ముస్లింలు ఇస్లామిక్ పరిపాలనలో మతం మార్చుకున్న ‘సనాతన భారతీయులే’ అనేది చారిత్రక వాస్తవం. ఈ చారిత్రక సత్యాన్ని భారతీయ యువతకు బోధించి ఉంటే హిందూ ముస్లింల మధ్య ఇంత అగాథం ఏర్పడి ఉండేది కాదు. ఈ దేశంలో మతం పేరుతో జిహాదీ ఉగ్రవాదం చలామణి అయ్యేది కాదు. ఇక మతం పేరుతో మూక దాడులకు పాల్పడే వారు హిందువులకు శత్రువులని చెప్పడం ద్వారా మోహన్ భాగవత్ సనాతన భారతీయ ఆలోచనా ధోరణి ఏమిటో భారతీయుల ముందు ఉంచారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆలోచన విధానాన్ని ఆయన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ దేశ ప్రజలు మత పరంగా కాకుండా సనాతన భారతీయ జీవన విధానంతో కలిసిమెలిసి ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పిన మాటలు జాతి మొత్తానికి శిరోధార్యం. ఇక ఇస్లాం ప్రమాదంలో పడిపోతుంది అనే భ్రమలో ఈ దేశ ముస్లింలు ఉండవలసిన అవసరం లేదని, కుహనా లౌకిక వాదాన్ని నెత్తిన పెట్టుకున్న రాజ కీయ నాయకుల మాటలను నమ్మొద్దని ఆయన ముస్లిం లను కోరడం వెనుక దేశ విశాల ప్రయోజనం దాగి ఉందని అర్థం చేసుకోవాలి. ఉల్లి బాలరంగయ్య, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధి -
నటి షనయా సోదరుని హత్యకేసు.. ఆ నివేదికే కీలకం
హుబ్లీ: వర్ధమాన సినీ నటి షనయ కాత్వే తన ప్రియుడు నియాజ్‌తో కలిసి సొంత సోదరుడు రాకేష్‌ను హత్య చేసిన కేసులో ఫోరెన్సిక్ నివేదిక కోసం హుబ్లీ పోలీసులు ఎదురుచూస్తున్నారు. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే ఆగ్రహంతో షనయ, నియాజ్, అతని మిత్రులతో కలిసి హత్య చేసినట్లు కేసు నమోదైంది. గత ఏప్రిల్ 9న రాకేష్‌ను తీసుకెళ్లి హుబ్లీ రూరల్‌పోలీస్ స్టేషన్ పరిధిలో తారిహళ వంతెన వద్ద గొంతు పిసికి చంపారు. తరువాత శిక్ష నగరలో ఒక బాత్రూమ్లో మృతదేహాన్ని పెట్టారు. అల్తాఫ్, నియాజ్‌లు తల, మొండాన్ని వేరు చేసి కాల్చివేశారు. ఈ కేసులో షనయతో పాటు 8 మంది నిందితులను అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆ మృతదేహం రాకేష్‌దే అని నిర్ధారించడానికి డీఎన్ఏ నివేదిక రావాల్సి ఉంది. ఆ నివేదిక వస్తే కేసు విచారణ చకచకా పూర్తవుతుందని పోలీసులు తెలిపారు. -
నిలోఫర్‌లో చిన్నారుల తారుమారు
గన్‌ఫౌండ్రీ: అప్పుడే పుట్టిన పిల్లలు తారుమారైన ఘటనలు అప్పుడప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం. ఇదే తరహా ఘటన నిలోఫర్ ఆస్పత్రిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హబీబ్ నగర్‌కు చెందిన మహ్మద్ జాఫర్ తన భార్యకు పురిటి నొప్పులు రావడంతో బుధవారం రాత్రి నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించాడు. గురువారం మధ్యాహ్నం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.అదే సమయంలో అబ్దుల్ బాసిద్ అనే వ్యక్తి భార్య సైతం ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో అబ్దుల్ జాఫర్‌కు చెందిన చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని వార్డు బాయ్ సూచించడంతో అతడి సోదరి ఫరీదాబేగం చిన్నారిని పరీక్షల నిమిత్తం తీసుకెళ్లింది. పరీక్షల అనంతరం చిన్నారి రంగు, దుస్తులు మారిపోవడంతో జాఫర్ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో బాసిద్ చిన్నారిని సైతం వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువచ్చారని, ఈ సమయంలో చిన్నారుల తారుమారు జరిగిందని జాఫర్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇరు వర్గాలు వాగ్వివాదానికి దిగారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు చిన్నారులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఎవరి బిడ్డను వారికి అప్పగిస్తామని తెలిపారు. ( చదవండి: మిక్సీ గ్రైండర్, కటింగ్ ప్లేర్‌లో బంగారం ) -
బెయిల్ ఓకే, ఆ బిడ్డకు తండ్రెవరు! ఏం జరిగింది?
ముంబై : పొరుగింటి యువతిపై అత్యాచారం కేసులో 17 నెలల శిక్ష అనంతరం నిందితుడికి బెయిల్ లభించింది. డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా బాధితురాలి బిడ్డకు అతను తండ్రి కాదని తేలడంతో కోర్టు బెయిల్ ముంజూరు చేసింది. వివరాల ప్రకారం పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన యువతి పాఠశాలలో ఉండగానే విపరీతమైన కడపునొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా, ఆమె గర్బవతి అని తేలింది. విషయాన్ని ఆరాతీయగా, పక్కింటి వ్యక్తే తనపై రెండుసార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. దీంతో 2019 జూలై23న అతడిపై కేసు నమోదు కాగా, 17నెలల పాటు జైలు జీవితాన్ని గడిపాడు. (ప్రేయసి విషయంలో స్నేహితుల మధ్య వివాదం) ఈ కేసులో తనను కావాలనే ఇరికించారని పేర్కొంటూ రెండుసార్లు బెయిల్ దాఖలు చేశాడు. అయినప్పటికీ ప్రాసిక్యూషన్ ఈ అభ్యర్ధనను తీవ్రంగా వ్యతిరేకించింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే, నిందితుడు సాక్ష్యాలను దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపింది. తాజాగా డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా ఆ యువతి బిడ్డకు అతడు తండ్రి కాదని తేలడంతో కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, దివ్యాంగురాలు జన్మనిచ్చిన బిడ్డకు తండ్రి ఎవరనే ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. కావాలనే నిందితునిపై ఆరోపణలు చేశారా? లేక డబ్బు చేతులు మారి డీఎన్ఏ రిపోర్టులో మార్పులు చోటుచేసుకున్నాయా అని స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. (నల్గొండలో జంట హత్యల కలకలం) -
ప్రణవ్ ఎస్ఐకు పుట్టిన వాడే..
గుంటూరు: ఎస్ఐ ఎస్.జగదీష్‌పై నమోదైన కేసులో సాక్షులను బెదిరిస్తున్నాడంటూ నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన ఓ యువతి సోమవారం రూరల్ ఎస్పీ విశాల్ గున్నీకి ఫిర్యాదు చేసింది. ముప్పాళ్ళ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న జగదీష్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి శారీరకంగా అనుభవించి ఓ బిడ్డకు తల్లిని చేశాడని నరసరావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ నెల 2వ తేదీన కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీని కలసి తనకు, సాక్షులకు రక్షణకల్పించాలని కోరింది. ‘ఎస్ఐపై కేసు నమోదైనప్పటి నుంచి సాక్షులుగా ఉన్న వారికి ఫోన్ చేసి మీరు ఈ కేసులో సాక్ష్యం చెబితే మీ అంతు చూస్తానని హెచ్చరిస్తున్నాడు. ఓ టీవీ చానల్లో (సాక్షి కాదు) నా గురించి అసత్యాలతో కూడిన వీడియోలను చూపించి అసభ్యకరంగా ప్రదర్శించారు. నా మాజీ భర్త పి.సుబ్బారావును సాకుగా చూపి నా మనోభావాలను దెబ్బతీసేలా టీవీలో కథనం వచ్చింది. వారిపై కూడా విచారించి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా నా బిడ్డ ప్రణవ్ ఎస్ఐ జగదీష్‌కు పుట్టిన బిడ్డే కావాలంటే డీఎన్ఏ పరీక్షకు నేను, నాబిడ్డ సిద్ధంగా ఉన్నాం. తమకు ప్రాణరక్షణ కల్పించి ఆదుకోవాలి’ అని కోరింది. కాగా, వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారించిన ఎస్పీ ఫిర్యాదుపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు. ఎస్ఐపై ప్రస్తుతం శాఖాపరమైన విచారణ కొనసాగుతుందని ఎస్పీ విశాల్ గున్నీ వివరించారు. -
షాకింగ్: దిశ హత్యకు ముందు 9 హత్యలు
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ అత్యాచార, హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిశ హత్య కంటే ముందే నలుగురు నిందితులు మరో 9మంది మహిళలపై హత్యాచారం జరిపి, హత్య చేసినట్టుగా పోలీసుల విచారణ తేలింది. ఎన్‌కౌంటర్‌కు ముందు నిందితుల వాంగ్మూలంలో ఈ కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రధాన సూత్రధారి ఆరిఫ్ అలీ 6 హత్యలు.. చెన్నకేశవులు 3 హత్యలు చేసినట్లు అంగీకరించారని తెలుస్తోంది. ఈ హత్యలన్నీ మహబూబ్‌నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల్లోని హైవేల సమీపంలో చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారని పోలీసు వర్గాల సమాచారం. ప్రతి ఘటనలోనూ మహిళలపై అత్యాచారం, హత్య చేసి.. మృతదేహాలను దిశ మాదిరిగానే దహనం చేసినట్టు పోలీసుల ఎదుట నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో గతంలో జరిగిన హత్యలకు సంబంధించిన డీఎన్ఏ రిపోర్టులను పోలీసులు పరిశీస్తున్నారు. హైవేల పక్కన జరిగిన హత్యలపై ఆరా తీస్తున్నారు. దీని కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దిశ కేసులో ఛార్జిషీట్ వేసే సమయానికి ఈ కేసులని చేధించాలని పోలీసులు చెబుతున్నారు. అయితే డీఎన్ఏ పరిశీలనలో భాగంగా పలు పాత కేసుల్లో ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్, ల డీఎన్ఏ లతో మరిన్ని హత్య కేసుల్లో మ్యాచ్ అవుతున్నట్లు సమాచారం. దీంతో విచారణను పోలీసులు మరింత వేగవంతం చేశారు. నిందితులు చెప్పిన సమాచారం ఆధారంగా ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులు డీఎన్ఏతో గత హత్యల మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా దిశ హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురు పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌పై కేసు కోర్టులో విచారణ జరుగుతుండటంతో మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచారు. -
దిశ మాదిరిగానే మరో తొమ్మిది హత్యలు
-
యువతిని మోసగించినందుకు ఏడేళ్ల జైలు
సాక్షి, నిజామాబాద్: ప్రేమించి గర్భవతిని చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన ఒకరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం ఫ్యామిలీ కోర్టు జడ్జి సి. రత్నప్రభావతి తీర్పు చెప్పారు. దీని వివరాలను పీపీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని మిర్చి కంపౌడ్‌కు చెందిన గైక్వాడి యశోద బార్దాన్ లెబర్‌గా పని చేస్తుండగా, అదే కాలనీకి చెందిన నవబందే సునీల్ లారీ క్లీనర్‌గా పని చేసేవాడు. ఒకే కాలనీకి చెందిన వీరిద్దరూ పరిచయటం కావటంతో అది ప్రేమగా మారింది. దాంతో సునీల్ యశోదతో శారీరక సంబంధం పెట్టుకుని ఆమెను గర్భవతిని చేశాడు. అనంతరం సునీల్ యశోద వద్దకు రాకపోవడంతో ఆమె అతడికి ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. దీంతో సునీల్ నిరాకరిస్తూ ఫోన్ స్వీచ్ఛాఫ్ చేశాడు. దీంతో యశోద ఒకటి ఏప్రిల్ 2014న నగరంలోని ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సునీల్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు సునీల్‌పై ఐపీసీ 417, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్హెచ్ఓ నర్సింగ్‌యాదవ్ ఈ కేసును దర్యాప్తు చేశారు. పోలీసులు యశోదకు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా ఆమె గర్భవతని తేలటంతో సునీల్‌పై ఐపీసీ 376 సెక్షన్‌ను జత పరిచి కేసు నమోదు చేశారు. కాగా యశోద 7వ నెలలోనే ప్రసవించడంతో పుట్టిన మగబిడ్డ మృతి చెందాడు. బాబు ఎముకలను సేకరించిన పోలీసులు డీఎన్ఏ పరీక్షలకు పంపగా, బాబు సునీల్ యశోదలకే జన్మించినట్లు అక్కడి నుంచి రిపోర్టు వచ్చింది. దాంతో కేసు విచారణలో సునీల్ చేసిన నేరం రుజువు కావడంతో ముద్దాయికి మూడు సెక్షన్ల కింద ఏడేళ్ల జైలు, రూ. 600 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ శిక్షలన్ని ఏకకాలంలో అమలు చేయాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు. -
బంగారు నానోకణాలతో వ్యాధి నిర్థారణ చవక
కేన్సర్ వ్యాధి నిర్ధారణకు చవకైన కొత్త పద్ధతి ఒకదాన్ని అభివృద్ధి చేశారు క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఒకట్రెండు రకాలకు కాకుండా అన్ని రకాల కేన్సర్లకూ ఈ పద్ధతిని ఉపయోగించగలగడం ఇంకో విశేషం. కేన్సర్ నిర్ధారణకు చౌకైన, మెరుగైన పద్ధతిని ఆవిష్కరించేందుకు ఇప్పటికే పలు ప్రయత్నాలు జరుగుతుండగా అన్ని రకాల కేన్సర్లను ఒకే పద్ధతితో గుర్తించడం మాత్రం ఇప్పటివరకూ వీలు కాలేదు. ఈ నేపథ్యంలో తాము కేన్సర్ కణాల డీఎన్ఏ పోగులపై ప్రత్యేకదృష్టి పెట్టామని అందులోని మిథైల్ పరమాణువుల అమరిక ప్రత్యేక రీతిలో ఉండటాన్ని గుర్తించామని ద్రవంలో ఉంచినప్పుడు ఈ కేన్సర్ డీఎన్ఏ పోగులు ఉండ చుట్టుకుపోయే పద్ధతి కూడా ప్రత్యేకంగా ఉండటాన్ని గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అబూ సినా తెలిపారు. ఈ మార్పులను గుర్తించేందుకు తాము బంగారు నానో కణాలను ఉపయోగించామని 200 మందిపై ప్రయోగాలు చేయగా 90 శాతం కచ్చితత్వంతో కేన్సర్‌ను గుర్తించగలిగామని వివరించారు. పైగా కేవలం పది నిమిషాల్లోనే పరీక్ష ఫలితాలు వెల్లడవుతాయని కాకపోతే ప్రస్తుతానికి ఈ పరీక్ష కేన్సర్ ఉన్నట్లు మాత్రమే నిర్ధారించగలదని అది రొమ్ము కేన్సరా? లేక ఇంకో రకమైందా? మాత్రం గుర్తించలేదని వివరించారు. -
డీఎన్ఏ కలిపింది ఇద్దరినీ..
జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గతనెల 21న శిశువుల మార్పిడి జరిగిందనే అనుమానాలు నిజమయ్యాయి. 15 రోజుల అనంతరం డీఎన్ఏ రిపోర్ట్లు రావడంతో బుధవారం ఎవరి శిశువులను వారికి అప్పగించారు. ఈ ఘటనపై జాయింట్ కలెక్టర్ రాజేశం, ఆర్డీవో నరేందర్ విచారణ చేపట్టారు. బాధ్యులైన నలుగురిపై సస్పెన్షన్‌కు ఆదేశించారు. బుగ్గారం మండలం మద్దునూర్‌కు చెందిన బొంగురాల చామంతి గతనెల 19న జగిత్యాల ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో మేడిపల్లి మండలం కొండాపూర్‌కు చెందిన ఎర్ర రజిత సైతం మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. సిబ్బంది నిర్లక్ష్యంతో కవల పిల్లలంటూ ఇద్దరు శిశువులను రజిత కుటుంబసభ్యులకు అప్పగించారు. చామంతి కుటుంబ సభ్యులు తమ బిడ్డ ఏడని నిలదీయడంతో పొరపాటును గుర్తించిన సిబ్బంది.. వెంటనే రజిత వద్దనున్న రెండో బిడ్డను తీసుకొచ్చి వీరికి అందజేశారు. ఈ శిశువు తమ బిడ్డ కాదంటూ చామంతి కుటుంబ సభ్యులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో వైద్యసిబ్బంది డీఎన్ఏ రిపోర్ట్ తీసుకుంటే ఎవరి బిడ్డ అనేది తెలుస్తుందని తేల్చారు. ఈ క్రమంలో జూన్ 2న రిపోర్ట్లు వచ్చాయి. సదరు ఆస్పత్రి సిబ్బంది మళ్లీ తప్పు చేశారు. శిశువుల మార్పిడి జరగలేదని పేర్కొన్నారు. అయితే.. చామంతి, మహేందర్ దంపతులకు మొదటి నుంచీ అనుమానాలు ఉండటంతో వారు కలెక్టర్ శరత్‌ను కలసి మొర పెట్టుకున్నారు. దీంతో ఆయన సమస్య పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్‌ను విచారణ అధికారిగా నియమించారు. జేసీ సమక్షంలో మళ్లీ శాంపిల్స్ తీసుకుని పంపించడంతో మంగళవారం రిపోర్ట్లు వచ్చాయి. శిశు మార్పిడి జరిగింది వాస్తవమేనని తేలింది. ఇరువురు దంపతులను ఆసుపత్రికి పిలిపించి.. ఎవరి బిడ్డలను వారికి అందించారు. కాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డుబాయి, ఆయాతోపాటు నర్సు, సూపరింటెండెంట్లపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తల్లిదండ్రుల్లో ఆనందం మద్దునూర్‌కు చెందిన బొంగురాల మహేందర్, చామంతి దంపతులు మాట్లాడుతూ మొదటి నుంచీ శిశుమార్పిడి జరిగిందని చెబుతున్నామని, డాక్టర్లు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. 15 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే ఉన్నామని, ఉన్న పొలాన్ని కుదవపెట్టి డీఎన్ఏ రిపోర్ట్ కోసం రూ.21 వేలు ఖర్చు చేశామని పేర్కొన్నారు. మరో రూ.9 వేల వరకు శిశువు చికిత్స కోసం వెచ్చించామని తెలిపారు. డీఎన్ఏ రిపోర్ట్ కోసం ఇచ్చిన డబ్బులను ఇవ్వాలని చామంతి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. రెండు, మూడు రోజుల్లోగా ఖర్చులు ఇచ్చేలా చూస్తామని సూపరింటెండెంట్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. సూపరింటెండెంట్ సమక్షంలో శిశువులను మార్చుకుంటున్న తల్లిదండ్రులు -
ఆ గదినిండా రక్తపు మరకలే..
సాక్షి, హైదారబాద్ : నగరంలో సంచలనం కలిగించిన చిన్నారి తల కేసు విచారణలో హైదరాబాద్ పోలీసులు మరో కీలక అడుగు వేశారు. ఉప్పల్ సర్కిల్ చిలుకానగర్ డివిజన్ పరిధిలోని మైసమ్మ దేవాలయం సమీపంలో రాజశేఖర్ క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటిపై చిన్నారి తల లభించిన విషయం తెలిసిందే. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, శనివారం రాజశేఖర్ ఇంట్లో ఆధారాల కోసం దాదాపు 9గంటల తనిఖీలు నిర్వహించారు. ఈ వెతుకులాటలో ఇంటిలోని ఓగదిలో బండల గీతల మధ్య రక్త నమూనాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గది నిండా కంటికి కనిపించకుండా రక్తపు మరకలు ఉన్నట్లు క్లూస్ టీం నిర్ధారించింది. ఆ మరకలు కనిపించకుండా ఐదారు సార్లు రసాయనాలతో తుడిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే విచారణలో ఆగదిలో కోడిని కోశామని రాజశేఖర్ తెలిపినట్లు సమాచారం. అయితే క్లూస్ టీం అనుమానితుడి ఇంటి నుంచి లభించిన కొన్ని రక్త నమూనాలను సేకరించారు. ఇంటిపై దొరికిన శిశువు నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించిచారు. ఈకేసులో ఇప్పుడు ఈ నమూనాలే కీలకంగా మారాయి. మరో రెండు రోజుల్లో డీఎన్ఏ రిపోర్టు రానుంది. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు మరో 48గంటల్లో అసలు దోషులు ఎవరో నిర్ధారించే అవకాశం ఉంది. ఎలాగైనా కేసు మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు తెలుపుతున్నారు. -
ఉప్పల్ నరబలి కేసులో కీలక ఆధారాలు
-
గంటన్నరలోనే డీఎన్ఏ రిపోర్ట్!
⇔ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి అత్యాధునిక పరికరాలు ⇔ వేగంగా పరీక్షలు చేసేలా ర్యాపిడ్ హిట్ సాంకేతికత ⇔ బాంబులను నిర్వీర్యం చేసేందుకు స్పెషల్ రోబో ⇔ అనుమానితులను ప్రశ్నించేందుకు సూపర్ పాలీగ్రాఫ్ ⇔ డ్రగ్స్, పేలుడు పదార్థాలు గుర్తించేందుకు స్పెక్ట్రో మీటర్ ⇔ కాల్పుల కేసులు ఛేదించేందుకు ప్రత్యేక మైక్రోస్కోప్ ⇔ మరికొన్ని ఆధునిక పరికరాలు కూడా.. ⇔ రూ. 20 కోట్లతో కొనుగోలు చేయనున్న పోలీసు శాఖ సాక్షి, హైదరాబాద్ అత్యాచారాల కేసులు.. పిల్లల గుర్తింపు.. గుర్తు తెలియని మృతులు.. ప్రమాదాల్లో మరణించినవారు.. ఇలాంటి కేసులను సత్వరమే తేల్చేందుకు సాంకేతిక ఆధారాలు అవసరం. ముఖ్యంగా డీఎన్ఏ పరీక్ష కోసమైతే ఇప్పటివరకు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ఇలాంటి కేసుల్లో సత్వర దర్యాప్తు, విచారణకు తోడ్పడేలా కేవలం 90 నిమిషాల్లోనే డీఎన్ఏ రిపోర్టులను సిద్ధం చేసే సరికొత్త పరికరాలను రాష్ట్ర పోలీసు శాఖ సమకూర్చుకుంటోంది. అంతేకాదు బాంబు పేలుళ్లు, కాల్పుల ఘటనలు, నకిలీ నోట్లు, ఫోర్జరీల గుర్తింపు వంటి కేసుల్లోనూ తోడ్పడే అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న వేలాది కేసులకు ఈ పరికరాల సహాయంతో పరిష్కారం లభించే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం ఏటా అందజేసే ‘పోలీసు దళాల ఆధునీకరణ (మోడ్రనైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ –ఎంఓపీఎఫ్)’నిధుల కింద ఈసారి రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి రూ.20 కోట్లను కేటాయించింది. ఆ నిధులతోనే ఆధునిక పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. పెండింగ్‌లో 1,500 కేసులు రాష్ట్రంలో 1,500 పైగా లైంగిక దాడులు, అత్యాచారాల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన ఛేదించేందుకు ర్యాపిడ్ హిట్ పరికరాన్ని కొనుగోలు చేశామని పోలీస్ శాఖ వెల్లడించింది. ఈ ర్యాపిడ్ హిట్ టెక్నాలజీ ద్వారా కేవలం 90 నిమిషాల్లో డీఎన్ఏ పరీ„క్షý నిర్వహించి, ఫలితాలు వెల్లడవుతాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఇలాంటి డీఎన్ఏ టెస్ట్ పరికరం లేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటివరకు దేశంలో కాస్త అత్యాధునిక టెక్నాలజీ ఉన్న చండీగఢ్, పుణె, సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో కేసుల పరీశీలన జరుగుతోంది. ఇక నుంచి రాష్ట్ర పోలీస్ శాఖలోని ఎఫ్ఎస్ఎల్ ద్వారానే డీఎన్ఏ రిపోర్టులు పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. సూక్ష్మ పదార్థాల విశ్లేషణకు ఎక్స్‌రే.. అతి చిన్న వస్తువులు, పేలుడుకు ఉపయోగించే పౌడర్, ద్రవాలు తదితరాలను గుర్తించి విశ్లేషించేందుకు ఏడీఎక్స్–2700 ఎక్స్‌రే పరికరాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీని ద్వారా అతి తక్కువ సమయంలో వివిధ రకాలైన రసాయనిక సమ్మేళనాలను విశ్లేషించవచ్చు. కాల్పుల కేసుల కోసం కంపారిజన్ మైక్రోస్కోప్ తుపాకీ కాల్పులు జరిగిన సందర్భంలో, ఎన్కౌంటర్ల వంటి కేసుల్లో త్వరితగతిన బాలిస్టిక్ రిపోర్ట్ రూపొందించేందుకు కీలకమైన పరికరాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఫైరింగ్ సందర్భంగా గన్ క్యాట్రిడ్జ్ నుంచి బుల్లెట్ దిగిన దూరం, వేగం వంటి వాటికి సంబంధించి కచ్చితమైన నివేదిక రూపొందించేందుకు ఫోరెన్సిక్ కంపారిజన్ మైక్రోస్కోప్ అందుబాటులోకి రాబోతోంది. నేర స్థలంలోనే పక్కా రిపోర్ట్ డ్రగ్స్, పేలుడు పదార్థాలు, పేలుడుకు ఉపయోగించిన రసాయనాల మిశ్రమం వంటి వాటిని పక్కగా, వెంటనే గుర్తించేందుకు ‘హ్యాండ్ హెల్డ్ రామన్ స్ప్రెక్టో మీటర్(నానో రామన్)’పరికరం అందుబాటులోకి రాబోతోంది. నేరం జరిగిన ప్రదేశంలోనే పదార్థాల విశ్లేషణకు దీనిని వినియోగించుకోవచ్చు. అదే విధంగా ఇన్డోర్ యూనిట్లో భారీ పేలుడు పదార్థాలను గుర్తించేందుకు పోర్టబుల్ రామన్ స్ప్రెక్టో మీటర్‌ను కూడా కొనుగోలు చేయనున్నారు. కుట్రను ఛేదించేందుకు పాలీగ్రాఫ్ తీవ్రమైన నేరాలు, పేలుళ్లకు సంబంధించిన నేరాలు, వాటికి కుట్రపన్నిన వారిని ప్రశ్నించి.. నిజాలు రాబట్టేందుకు అత్యాధునిక పాలీగ్రాఫ్ టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది. ఈ పరికరాన్ని వినియోగించి ప్రశ్నించేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఉండాల్సిందే. అయినా ముందస్తు సంసిద్ధతలో భాగంగా పోలీసు శాఖ దీనిని కొనుగోలు చేస్తోంది. నకిలీ నోట్లు.. ఫోర్జరీ కేసుల కోసం సంతకాలు ఫోర్జరీ చేయడం, నకిలీ నోట్లు ముద్రించి, చలామణీ చేయడం, బార్కోడ్ ట్రేసింగ్, ఆర్ఎఫ్ఐడీ.. వంటి అంశాలను ఛేదించడంలో తోడ్పడే ‘అడ్వాన్స్డ్ వీడియో స్పెక్ట్రల్ ఎక్విప్మెంట్’అందుబాటులోకి వస్తోంది. బాంబుల నిర్వీర్యానికి రోబో బాంబులను నిర్వీర్యం చేసేందుకు రిమోట్ రోబోను రంగంలోకి దింపనున్నారు. దేశంలోనే ఇప్పటివరకు ఏ రాష్ట్ర పోలీసులు, ప్రత్యేక బలగాలు సైతం ఈ టెక్నాలజీని ఉపయోగించడం లేదు. మన రాష్ట్రంలోనే తొలిసారిగా ‘పోర్టబుల్ రేడియోగ్రఫీ రిమోట్ రోబో’ను తీసుకువస్తున్నారు. మరిన్ని టెక్నాలజీ పరికరాలు! ఆడియో వీడియో అనాలిసిస్, నేరస్థలంలో పాదముద్రలు, 3డీ లేజర్ రోబో స్క్రీనింగ్, మానవ శరీరంలో ఆల్కాహాల్, రసాయనాల గుర్తింపు కోసం 8 అత్యాధునిక పరికరాలను కూడా కొనుగోలు చేస్తున్నారు. -
ఆ అస్థికలు షీనావే.. చిక్కుల్లో ఇంద్రాణి
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. షీనా బోరా హత్యకు గురైనట్టు నిర్ధారణైంది. రాయగఢ్ అడవుల్లో పోలీసులు సేకరించిన అస్థికలు షీనా బోరావేనని డీఎన్ఏ పరీక్షల్లో తేలినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ నమూనాలు ఇంద్రాణి డీఎన్ఏతో సరిపోలినట్టు పరీక్షల్లో రుజువైందని సమాచారం. ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలసి డ్రైవర్ సాయంతో షీనా బోరాను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించిన సంగతి తెలిసిందే. ఆమె శవాన్ని రాయగఢ్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు ఇటీవల నిందితులను సంఘటనా స్థలం వద్దకు తీసుకెళ్లి అస్థికలు, పుర్రెను సేకరించారు. పరీక్షల్లో ఈ అస్థికలు షీనా బోరావేనని తేలింది. ఈ రోజు ముంబై పోలీసులు ఇంద్రాణి ముఖర్జియా, కారు డ్రైవర్ రాయ్‌లను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. మరో నిందితుడు, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాకు పోలీస్ కస్టడీ పొడగించారు.