సాక్షి, హైదారబాద్ : నగరంలో సంచలనం కలిగించిన చిన్నారి తల కేసు విచారణలో హైదరాబాద్ పోలీసులు మరో కీలక అడుగు వేశారు. ఉప్పల్ సర్కిల్ చిలుకానగర్ డివిజన్ పరిధిలోని మైసమ్మ దేవాలయం సమీపంలో రాజశేఖర్ క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటిపై చిన్నారి తల లభించిన విషయం తెలిసిందే. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, శనివారం రాజశేఖర్ ఇంట్లో ఆధారాల కోసం దాదాపు 9గంటల తనిఖీలు నిర్వహించారు. ఈ వెతుకులాటలో ఇంటిలోని ఓగదిలో బండల గీతల మధ్య రక్త నమూనాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
గది నిండా కంటికి కనిపించకుండా రక్తపు మరకలు ఉన్నట్లు క్లూస్ టీం నిర్ధారించింది. ఆ మరకలు కనిపించకుండా ఐదారు సార్లు రసాయనాలతో తుడిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే విచారణలో ఆగదిలో కోడిని కోశామని రాజశేఖర్ తెలిపినట్లు సమాచారం. అయితే క్లూస్ టీం అనుమానితుడి ఇంటి నుంచి లభించిన కొన్ని రక్త నమూనాలను సేకరించారు. ఇంటిపై దొరికిన శిశువు నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించిచారు.
ఈకేసులో ఇప్పుడు ఈ నమూనాలే కీలకంగా మారాయి. మరో రెండు రోజుల్లో డీఎన్ఏ రిపోర్టు రానుంది. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు మరో 48గంటల్లో అసలు దోషులు ఎవరో నిర్ధారించే అవకాశం ఉంది. ఎలాగైనా కేసు మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment