clues team
-
ఫలక్‌నుమా ప్రమాదానికి కారణం ఇదే!
సాక్షి, యాదాద్రి: ఫలక్‌నుమా ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక అంచనా వేస్తున్నారు రైల్వే అధికారులు. ఈ మేరకు శనివారం బీబీ నగర్‌కు చేరుకున్న క్లూస్ టీం.. దగ్ధమైన బోగీలను పరిశీలించింది. సమగ్ర దర్యాప్తునకు 12 మంది అధికారులతో కూడిన బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే పంపించగా .. ఈ టీం ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఇదిలా ఉంటే.. ఎస్-4 కోచ్ బాత్రూమ్లో ముందుగా మంటలు చెలరేగినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. అయితే దర్యాప్తు పూర్తి అయ్యాకే ప్రమాదం వెనక కారణాలపై స్పష్టత ఇస్తామని క్లూస్ టీం అంటోంది. హౌరా నుంచి సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్.. శుక్రవారం ఉదయం నల్లగొండ దాటి యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్యలో.. రెండు బోగీల నుంచి దట్టమైన పొగలు రావడం ప్రారంభమైంది. అది గమనించి కొందరు ప్రయాణికులు కేకలు వేయడంతో.. రైలు నిలిచిపోయింది. ఇక ప్రయాణికులంతా దిగిపోయి పెను ప్రమాదం తప్పింది. మంటలు క్రమంగా 6 బోగీలకు వ్యాపించగా.. 5 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే.. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తిట్టిపోస్తున్నారు. అయితే.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాద కారణాలపై సందేహాలు ఇంకా నివృత్తి కావాల్సి ఉంది. క్లూస్ టీం చెబుతున్నట్లు.. షార్ట్‌సర్క్యూటేనా, ప్రయాణికుల్లో ఎవరిదైనా నిర్లక్ష్యమా, కుట్రకోణం ఏమైనా ఉందా, రైలు నిర్వహణ సరిగా లేదా.. అనేది స్పష్టత రావాల్సి ఉంది. -
దొంగల బీభత్సం.. ఒక్కరాత్రే 11 ఇళ్లకు కన్నం
సాక్షి, నందిపేట్(నిజామాబాద్): నందిపేట మండలంలోని కుద్వాన్పూర్ మంగళవారం రాత్రి దొండలు అలజడి సృష్టించారు. ఏకంగా తాళం వేసిన 11 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. నగదు, నగలు, ఇతర సామగ్రిని దోచుకెళ్లారు. కుద్వాన్‌పూర్‌లో పలు కుటుంబాలు తమ బంధువుల ఇళ్లలో శుభకార్యాలు ఉండడంతో తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లారు. కాగా మంగళవారం అర్దరాత్రి గుర్తు తెలియని దుండగులు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బుధవారం ఉదయం తలుపులు తెరిచి ఉండడంతో చుట్టుపక్కల వారు చూసి బాధితులకు ఫోన్లలో సమాచారం అందించారు. వారి వచ్చి చూడగా ఇళ్లంతా చిందరవందరగా వస్తువులు పడి ఉన్నాయి. పోలీసులు క్లూస్‌టీంతో ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు. పోలీసులు సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ల అపహరణ బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రాల్లో రెండు 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. జాతీయ రహదారి పక్కన ఉన్న పంట భూముల్లోని 202, 203 నంబర్లు ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను ఎత్తుకెళ్లి వాటి నుంచి కాపర్ తీగ, ఆయిల్ చోరీ చేశారు. దీంతో బుధవారం ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్ పరిశీలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకెళ్లడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మరో ఆసక్తికర పరిణామం.. జిరాక్స్ తీస్తే కొంపలు అంటుకుంటాయ్..!? -
బెజవాడలో వ్యాపారి హత్య
గుణదల (విజయవాడ తూర్పు): విజయవాడలో యువ వ్యాపారి దారుణంగా హత్యకు గురయ్యారు. కారులోనే అతడి గొంతుకు తాడుబిగించి, దిండుతో ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. బుధవారం రాత్రి ఇంటివద్ద నుంచి బయటకు వెళ్లిన కరణం రాహుల్ (30) గురువారం బందరు రోడ్డులో కారులో మృతదేహంగా కనిపించారు. ఒంగోలుకు చెందిన రాహుల్ ప్రస్తుతం కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని ఒక విల్లాలో ఉంటున్నారు. జి.కొండూరులో జిక్సిన్ సిలిండర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట స్నేహితుడు కోరాడ విజయ్‌కుమార్‌తో కలిసి 2016 నుంచి గ్యాస్ సప్లయ్ వ్యాపారం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని ఎం.సి.పల్లె వద్ద సుమారు రూ.57 కోట్లతో జిక్సిన్ గ్యాస్ సిలిండర్ల పరిశ్రమను నెలకొల్పేందుకు ఇటీవల శంకుస్థాపన కూడా చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో కారులో రాహుల్ ఇంటి వద్ద నుంచి బయటకెళ్లారు. రాత్రంతా ఇంటికి రాకపోవడంతో గురువారం కుటుంబసభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఇంతలో బందరురోడ్డులో కారులో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. అనుమానం వచ్చి అక్కడకు వెళ్లిన రాహుల్ తండ్రి రాఘవరావు, భార్య పూర్ణిమ.. ఆ మృతదేహం రాహుల్‌దని గుర్తించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో రాహుల్‌ను విజయకుమార్ హత్యచేసి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం అనంతరం రాహుల్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. విజయ్‌కుమార్ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆధారాల సేకరణ డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు హత్య జరిగిన కారు నుంచి కొన్ని ఆధారాలు సేకరించాయి. రాహుల్ డ్రైవింగ్ సీటులో కూర్చుని ఉండగా, తల వెనక్కి నెట్టబడి ఉంది. కుడిచేతి భుజం వద్ద రక్తపు మరకలున్నాయి. డ్రైవర్ పక్క సీటులో నైలాన్ తాడు, రాహుల్ ముఖంపై దిండు ఉన్నాయి. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో కోరాడ విజయ్‌కుమార్, అతడి కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. కారే కీలక ఆధారం రాహుల్ ఫోర్డ్ ఎండీవర్ టాప్ ఎండ్ మోడల్ కారు వాడుతున్నారు. కారు ఎక్కడి నుంచి బయల్దేరింది.. ఎక్కడ ఆగింది.. ఎంత వేగంతో వచ్చింది.. బ్రేక్‌లు ఎప్పుడు వేసింది.. వంటి అంశాలను కారులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలుసుకునే వీలుంది. కారులో పెనుగులాట జరిగినా అందులో ఉన్న సెన్సిటివ్ సెన్సార్ల ద్వారా ఆ డేటా నిక్షిప్తం అవుతుంది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్ నుంచి ‘క్లూ’స్ టీం
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట మృతుల ఘటన ఇంకా మిస్టరీగానే మిగిలింది. దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పోలీసులను శనివారం ఆదేశించగా, కేంద్ర హోంశాఖ సైతం ఈ ఘటనపై ఆరా తీసింది. ఇదే సమయంలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసే క్రమంలో ఆదివారం హైదరాబాద్ నుంచి డైరెక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో కూడిన ‘క్లూ’స్ టీంను పంపించారు. ఆదివారం ఉదయమే వరంగల్‌కు చేరుకున్న ‘క్లూ’స్ టీం మొదట ఎంజీఎంలో మృతదేహాల నుంచి, ఆ తర్వాత గొర్రెకుంటలో ఘటన ప్రదేశమైన బావి, పక్కనే వారు నివాసం ఉండే ఇళ్ల నుంచి ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి హైదరాబాద్ నుంచి కేసు విచారణ జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. హైదరాబాద్ సిటీ ‘క్లూ’స్ టీం హై సెక్యూరిటీ మధ్య నేర స్థలంలో ఆధారాలు సేకరించింది. ఈ బృందంలో క్రైమ్ సీన్ ప్రాసెసింగ్ ఆఫీసర్లు, ఫొటో, వీడియోగ్రాఫర్‌తో పాటు ఎక్స్‌ఫర్ట్స్ ఉన్నారు. పాడుపడిన వ్యవసాయ బావితో పాటు, మృతులు నివాసం ఉండే ఇండ్లను ఉదయమే పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న బృందం ‘క్రైం సీన్ డు నాట్ క్రాస్’ అన్న రిబ్బన్ బ్యారికేడ్లను ఏర్పాటు చేసింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఫొటోగ్రఫీ, వీడియో కెమెరాల ద్వారా నేరస్థలంలో సన్నివేశాలను చిత్రీకరించారు. అక్కడ కనిపించిన భౌతిక ఆధారాలను సేకరించారు. అంతకు ముందు ఎంజీఎంలో మృతదేహాలపై ఫింగర్ప్రింట్లతో పాటు రక్తం, శరీర ద్రవాలు, జుట్టు, ఇతర కణజాలాలకు సంబంధించిన జీవ ఆధారాలను సేకరించినట్లు ఆసుపత్రివర్గాల ద్వారా తెలిసింది. -
ఇక అంతా ‘3డీ స్కానింగ్’
సాక్షి, హైదరాబాద్ : నేర, ఘటన స్థలాలను అన్ని కోణాల్లో సమగ్రంగా రికార్డు చేసే ‘3డీ స్కానర్లు’ ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ క్లూస్ టీమ్ వద్ద మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఔట్ డోర్ 3డీ స్కానర్‌ను సోమవారం చటాన్‌పల్లి వద్ద వినియోగించారు. వంతెన పై నుంచి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని దాదాపు రెండు గంటల పాటు చిత్రీకరించారు. భవిష్యత్తులో ఈ రికార్డులు అనేక విధాలుగా ఉపయుక్తంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. దేశంలోని మరే ఇతర పోలీసు విభాగం వద్ద అందుబాటులో లేని ఈ స్కానర్లను సిటీ పోలీసులు కీలక నేరాల సందర్భంలో వినియోగిస్తున్నారు. ఎలాంటి నేరం, ప్రమాదం, ఇతర ఉదంతం జరిగినా ఘటనాస్థలికి చేరుకునే పోలీసు అధికారులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నేరగాళ్లు ఏవైనా సాక్ష్యాధారాలను విడిచిపెట్టారా? నేరం ఎలా చేశారు? తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో క్రైమ్ సీన్స్‌కు వెళ్లే అధికారులు తమ దృష్టిని మృతదేహాలు, బాధితుల తరలింపు పైనే పెట్టడం అనివార్యంగా మారింది. దీంతో అనేక ఆధారాలను గుర్తించడంలో విఫలమై కేసుల దర్యాప్తు, నిందితుల గుర్తింపు ఎక్కువ కాలం పడుతోంది. ఇది అనేక సందర్భాల్లో నేరగాళ్లకు కలిసి వస్తోంది. క్రైమ్ సీన్ పరిశీలనకు తోడు ప్రతి నేర స్థలానికి సంబంధించిన మ్యాప్‌ను రూపొందించడం దర్యాప్తులో అనివార్యం. దీన్ని ఎఫ్ఐఆర్ తదితర పత్రాలతో పాటు న్యాయస్థానంలో దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్కౌంటర్లు జరిగినా మ్యాప్‌ను రూపొందించి ఇతర పత్రాలతో పాటు కోర్టుకు అందిస్తారు. పోలీసు విభాగం గతంలో ఈ మ్యాప్‌లను తెల్లకాగితాలపై చేతులతో గీసేది. దీనికి తోడుగా ఘటనాస్థలికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను జత చేసి న్యాయస్థానానికి అందించేది. అనేక సందర్భాల్లో వీటిలో పూర్తి వివరాలు పొందుపరచలేని పరిస్థితులు ఉండేవి. నేర స్థలాలు ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఇల్లు, కార్యాలయం తదితర ఇండోర్... రోడ్డు, బహిరంగ ప్రదేశం వంటి ఔట్ డోర్ క్రైమ్ సీన్స్‌ను పోలీసులు సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రెండు రకాలైన క్రైమ్సీన్స్కు వినియోగించేలా ఇండోర్, ఔట్‌డోర్ మోడ్స్‌తో కూడిన 3 డీ స్కానర్లు ఖరీదు చేశారు. 3 డీ పరిజ్ఞానంతో పని చేసే ఈ స్కానర్‌ను నేరం/ఉదంతం జరిగిన ప్రాంతంలో ఓ నిర్దిష్ట ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు. ఆ పాయింట్ కేంద్రంగా ఈ కెమెరాతో కూడిన స్కానర్ అన్ని దిక్కుల్నీ, అక్కడ ఉన్న వస్తువులు తదితరాలను చిత్రీకరిస్తుంది. కేవలం వాటి 3 డీ చిత్రాలు మాత్రమే కాకుండా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లోని ప్రాంతాలు, వస్తువులు, మృతదేహాలు పడిన ప్రాంతాల మధ్య ఎంత దూరం ఉందనేదీ ఈ స్కానర్ స్పష్టంగా నమోదు చేస్తుంది. మెమోరీ కార్డులు, సీడీలు, కంప్యూటర్లతో పాటు హార్డ్కాపీలుగానూ ఈ రికార్డుల్ని భద్రపరిచి, దర్యాప్తు అధికారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిశీలించే అవకాశం ఉంటుంది. అవసరమైన సందర్బాల్లో వీటినే న్యాయస్థానాల్లోనూ దాఖలు చేయవచ్చు. చటాన్‌పల్లి ఎన్కౌంటర్ సైట్‌ను ఈ స్కానర్‌లో రికార్డు చేసిన అధికారులు దీన్ని అవసరమైన సందర్భాల్లో వినియోగిస్తామని చెబుతున్నారు. వివిధ రకాలుగా వినియోగం... రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాటి తీరుతెన్నుల రికార్డు బాడీలీ అఫెన్సులకు సంబంధించిన నేర స్థలాల చిత్రీకరణ పారిశ్రామికవాడల్లో చోటు చేసుకునే దుర్ఘటనల నమోదు బందోబస్తు ప్లానింగ్ కోసం సభలు, సమావేశ ప్రాంతాల చిత్రీకరణ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటి తీవ్రత అంచనా బాంబు పేలుళ్ల వంటి ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు రికార్డింగ్ బహిరంగ ప్రదేశాల్లో ఎన్కౌంటర్లు జరిగితే పక్కాగా రికార్డు చేయడానికి.. -
ఎన్కౌంటర్ ప్రదేశం త్రీడీ స్కానర్‌తో చిత్రీకరణ
సాక్షి, షాద్‌నగర్ : దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసిన ప్రదేశాన్ని క్లూస్ టీం సోమవారం మధ్యాహ్నం త్రీడీ స్కానర్‌తో చిత్రీకరించింది. 8 మంది సభ్యులతో కూడిన బృందం ప్రతినిధులు చటాన్‌పల్లి బ్రిడ్డి వద్దకు చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దిశను దహనం చేసిన స్థలంతో పాటు హంతకులను ఎన్కౌంటర్ చేసిన ప్రాంతాన్ని పూర్తి త్రీడీ స్కానర్‌తో చిత్రీకరించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశ స్వభావం మారిపోయినా గుర్తించేందుకు వీలుగా క్లూస్‌టీం సభ్యులు ఆ ప్రాంతాన్ని మొత్తం స్కాన్ చేసి వీడియో చిత్రీకరణ చేయడంతో పాటుగా ఫొటోలు తీసుకున్నారు. ఎన్కౌంటర్ ఘటనాస్థలం వద్ద మరిన్ని ఆధారాలు సేకరించారు. సుమారు రెండున్నర గంటల పాటు టీం సభ్యులు ఇక్కడే ఉన్నారు. కాగా ఎన్కౌంటర్ జరిగిన చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. సుమారు 50 మంది పోలీసులు ఇక్కడ విధుల్లో ఉన్నారు. ఎన్కౌంటర్ ఘటనా స్థలానికి ఎవరూ వెళ్లకుండా జాతీయ రహదారి వద్దే జనాన్ని కట్టడి చేస్తున్నారు. -
ఘటనాస్థలికి ‘దిశ’ నిందితులు!
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసులో బుధవారం సాయంత్రం నుంచి అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. ఇప్పటికే పోలీసుల నిర్లక్ష్యం జరిగిందంటూ విమర్శలు రావడంతో నిందితులను షాద్‌నగర్ కోర్టు కస్టడీకి ఇచ్చిన విషయాన్ని లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ విషయంలో షాద్ నగర్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, డీజీపీ కార్యాలయాలు అత్యంత గోప్యత పాటిస్తున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలు, ప్రచారంపై పోలీసులు ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు. నలుగురు నిందితుల కస్టడీపై తమకు కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. మొబైల్‌ను తవ్వి తీయించారు అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చర్లపల్లి జైలు నుంచి రహస్యంగా పోలీసులు తరలించారు. తొలుత తొండుపల్లి టోల్గేట్ ప్రాంతంలో ఘటనాస్థలానికి నిందితులను తీసుకెళ్లారు. అక్కడ లారీ నిలిపిన స్థలం, మద్యం తాగిన ప్రాంతాలను పరిశీలిం చారు. దిశను ముందు చూసిందెవరు? అత్యాచారం ఆలోచన ముందు ఎవరికి వచ్చింది?.. తదితర వివరాలు తెలుసుకున్నారు. పంక్చర్ చేసిందెవరు? స్కూటీ బాగు చేయించేందుకు ఏ షాప్‌కు వెళ్లారు? దిశను ఎత్తుకెళ్లిన ప్రాంతాన్ని నిందితులు పోలీసులకు చూపించారు. అత్యా చారం జరిగిన ప్రాంతానికి సమీపంలో పాతి పెట్టిన దిశ మొబైల్‌ను నిందితులతోనే తవ్వి తీయించారు. అక్కడి నుంచి దిశ మృతదేహాన్ని క్యాబిన్లో ఎలా వేసుకుని వెళ్లారు? ఎవరెవరు సాయం చేశారు? నవీన్, శివ పెట్రోల్ కొన్న బంకులు కూడా చూపించారు. ఇక షాద్‌నగర్ వైపు వెళ్లిన తర్వాత వెనక్కి రావడం, చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద మృతదేహాన్ని దహనం చేసేవరకు జరిగిన ఉదంతాన్ని నిందితులు పోలీసులకు కళ్లకు కట్టారు. శవాన్ని ఈడ్చుకెళ్లిన దుండగులు.. చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద లారీని నిలిపిన నిందితులు మృతదేహాన్ని క్యాబిన్ నుంచి దించారు. వారే మోసుకెళ్లి బ్రిడ్జి కింద ఒక మూలకు ఈడ్చుకెళ్లినట్లు పోలీసులకు వివరించినట్లు తెలిసింది. తొండుపల్లి వద్ద ఘటనాస్థలంలోనే దిశ చనిపోయినా.. ఇంకా దిశ బతికే ఉండొచ్చన్న అనుమానంతో ఆనవాళ్లు కూడా దొరక్కుండా వెంట తెచ్చుకున్న పెట్రోల్‌తో పాటు, లారీ నుంచి డీజిల్ తీసి దహనం చేసిన విధానాన్ని చూపారు. ఆ మంటల్లోనే దిశ సిమ్ కార్డులు వేసినట్లు వివరించారు. మరోసారి లారీ పరిశీలన చటాన్‌పల్లి నుంచి నేరుగా క్లూస్ టీం షాద్‌నగర్‌లో ఉన్న లారీ వద్దకు వెళ్లి మరోసారి ఆనవాళ్లు సేకరించింది. స్థానిక ఆర్టీసీ డిపోలో నిలిపి ఉంచిన లారీ క్యాబిన్లో ఆధారాలు సేకరించింది. రక్తపు మరకలు, వెంట్రుకలు, వేలిముద్రలు, బ్లాంకెట్ పోగులు తదితర ఆనవాళ్లు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో మొత్తం 50 మంది పోలీసులు పాలుపంచుకుంటున్నట్లు వినికిడి. మొత్తం 7 బృందాలను సీపీ సజ్జనార్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. నలుగురు అదనపు ఎస్పీ స్థాయి అధికారులు ఈ బృందాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విభజించి దర్యాప్తు.. 20 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేయాలన్న గడువు విధించుకోవవడంతో.. కేసును విభజించి దర్యాప్తు చేస్తున్నారు. డీఎన్ఏ, శరీర స్రావాల విశ్లేషణ, ప్రత్యేక సాక్షుల నుంచి వివరాల సేకరణ, సాంకేతిక ఆధారాలైన సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఫుటేజీ, లారీ, వాహనాల టైర్ల మార్కుల సేకరణ, లీగల్ ప్రొసీడింగ్స్ ఇలా ప్రతి పనిని విభజించి ఆయా బృందాలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ ఏడు బృందాలకు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. కేసు వివరాలను ఎప్పటికపుడు సజ్జనార్ తెలుసుకుంటున్నారని సమాచారం. పైకోర్టుకు వెళ్లినా.. ఉరి పడాల్సిందే ఈ కేసులో ప్రత్యక్ష సాక్షుల కన్నా.. సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలే కీలకం కానున్నాయి. ఘటన జరిగిన ప్రాంతంలో మనుషుల సంచారం లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఘటనను నేరుగా చూసిన వారు లేకపోవడంతో ఈ కేసులో నిందితుల పాత్ర నిరూపించడం పోలీసులకు సవాలుగా మారింది. దిశ కేసు నేపథ్యంలో దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తుతుండటంతో తెలంగాణ పోలీసులపై ఒత్తిడి పెరిగింది. దీంతో నిందితులకు ఉరిశిక్ష పడేలా.. పైకోర్టుకు వెళ్లినా.. శిక్షలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోకుండా అత్యంత పకడ్బందీగా సాక్ష్యాలు సేకరిస్తున్నారు. వరంగల్ కేసులా కాకుండా.. వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై లైంగికదాడి, హత్య కేసులో కూడా ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. కానీ, కేసులో నిందితుడి పాత్ర నిరూపించడంలో పోలీసులు సఫలమయ్యారు. తొలుత ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించింది. అయితే నిందితుడు పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన కోర్టు.. అత్యంత అరుదైన కేసుల్లోనే ఉరి శిక్ష విధించాలంటూ.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ.. తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ‘దిశ’కేసును దర్యాప్తు చేస్తున్న బృందం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వరంగల్ పోలీసుల సలహాలు తీసుకున్నట్లు సమాచారం. దిశ కేసు అత్యంత అరుదైనది కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులు పైకోర్టుకు వెళ్లినా.. శిక్షలో మార్పు లేకుండా చూడాలన్న పట్టుదలతో పోలీసులు పనిచేస్తున్నారు. గొర్రెల కాపరి, కానిస్టేబుల్ సమయ స్ఫూర్తి.. బాధితురాలి మృతదేహం కాలిపోతుండగా చూసిన గొర్రెల కాపరి, అతడిచ్చిన సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి వెళ్లిన కానిస్టేబుల్ వెంటనే స్పందించడంతోనే పోలీసులు బాధితురాలిని గుర్తించడం సాధ్యమైంది. ఆధారాల సేకరణ కూడా వేగంగా జరిగింది. ఈ ఇద్దరూ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే దర్యాప్తు సాఫీగా సాగుతోందని చెప్పుకోవచ్చు. మాకెలాంటి ఆదేశాలు రాలేదు.. దిశ కేసు దర్యాప్తు విషయంలో గురువారం ఉదయం నుంచే రకరకాల కథనాలు, విశ్లేషణలు జరుగుతున్నా.. పోలీసులు మాత్రం తమకు కోర్టు నుంచి ఇంకా కస్టడీ ఆదేశాలు రాలేదని స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఈ విషయంలో వివరణ అడిగేందుకు మీడియా ప్రతతినిధులు ప్రయత్నించినా లాభం లేకపోయింది. -
ఇంకా మిస్టరీలే!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది... పోలీసింగ్ ప్రభావం పెరిగింది... కేసుల దర్యాప్తులో యాప్‌లు సైతం సహకరిస్తున్నాయి.. క్లూస్ టీమ్స్ పరిపుష్టంగా మారాయి.. వెరసి నగరంలో కేసులు తగ్గుతూ, శిక్షల శాతం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లోనూ మిస్టరీగా మిగిలిపోతున్న కేసులు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. గడిచిన రెండేళ్ళల్లో చోటు చేసుకున్న భారీ నేరాల్లో అనేకం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. వీటితోపాటు పాత సంచలనాత్మక కేసులు కూడా ఉన్నాయి.అలాంటి సంచలనాత్మక కేసుల్లో కీలకమైనవి... ఆ దోపిడీ ముఠా ఆచూకీ లేదు... జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం.10లో, పాతబస్తీలో గత ఏడాది జనవరిలో విరుచుకుపడిన దోపిడీ ముఠాల గుట్టు వీడలేదు. జూబ్లీహిల్స్ బాలాజీ డిస్ట్రిబ్యూటర్స్ కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్న యాదగిరి నుంచి ముగ్గురు దుండగులు గత ఏడాది జనవరి 4 ఉదయం 11.35 గంటల ప్రాంతంలో వాహనం, సెల్ఫోన్లు దోచుకుపోయారు. ఈ ఉదంతం న్యూ సిటీలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో చోటు చేసుకుంది. ఆ మరుసటి రోజే ఇదే ముఠా ఓల్డ్ సిటీలో ఉన్న బహదూర్పు ప్రాంతంలో పంజా విసిరింది. అక్కడి ప్రధాన రహదారిపై ఉన్న ఎస్బీఐ వద్దకు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దోచుకున్న ద్విచక్ర వాహనంపై ముగ్గురు దుండగులూ చేరుకున్నారు. ఇద్దరు వాహనంతో బయటే వేచి ఉండగా... మరొకరు బ్యాంకు లోపలకు వెళ్ళి నగదు లావాదేవీలు చేస్తున్న వారిని దాదాపు అర్ధగంటకు పైగా గమనించాడు. ఈ దృశ్యాలు బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. రామ్నాస్‌పురాకు చెందిన విద్యార్థి అబ్దుల్లా తన వద్ద ఉన్న రూ.70 వేల ఎస్బీఐ బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు మధ్యాహ్నం 3.40 గంటలకు వచ్చాడు. అప్పటికే బ్యాంక్‌లో డిపాజిట్లు స్వీకరించే సమయం మించిపోవడంతో బ్యాంక్ అధికారులు నగదు తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో అబ్దుల్లా డబ్బుతో తిరిగి వెళ్తున్నాడు. ఇతడి వెనుకే బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన దుండగుడు మిగిలిన ఇద్దరినీ కలిశాడు. ఈ ముగ్గురూ జూబ్లీహిల్స్‌లో దోచుకుపోయిన వాహనం పైనే అబ్దుల్లాను వెంబడించారు. అక్కడి పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే మలుపు వద్ద అబ్దుల్లా ప్రయాణిస్తున్న వాహనాలను తమ వాహనాన్ని అడ్డుపెట్టి ఆపారు. తమ వద్ద ఉన్న కత్తితో బెదిరించి నగదును లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో అబ్దుల్లా ప్రతిఘటిస్తూ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకునే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన దుండగులు తమ వాహనంపై ఫలక్‌నుమ వైపు పారిపోయారు. ఈ రెండు కేసులూ ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. ఆ చిన్నారి ఎవరో తెలియలేదు... ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో ఉన్న మైసమ్మ దేవాలయం వద్ద వెలుగులోకి వచ్చిన అత్యంత పాశవిక నరబలి కేసులో కొన్ని ప్రశ్నలు అలానే ఉండిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతంలో హతురాలు రోజుల చిన్నారి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. చిలుకానగర్ వాసి రాజశేఖర్ (35) క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. కుటుంబంతో సహా మేడారం జాతర వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఈలోపు ఆయన అత్త బాలలక్ష్మీ ఉతికిన వస్త్రాలకు ఆరేసేందుకు వారి డాబాపైన వెళ్ళారు. అక్కడ ఓ చిన్నారి తల కనిపించడంతో తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఈ విషయం రాష్ట్రం మొత్తం దావానలంగా వ్యాపించింది. ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన రాచకొండ పోలీసులు రాజశేఖరే నిందితుడిగా గుర్తించారు. అయితే ఆ చిన్నారి ఎవరు? మొండెం ఎక్కడ ఉంది? తదితర విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ఆమెను చంపింది ఎవరు? జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో అదృశ్యమైంది... రెండు రోజులకే ఎస్సార్ నగర్ లిమిట్స్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో శవమై కనిపించింది. అత్యంత దారుణంగా జరిగిన ఈ హత్య కేసులోనూ నిందితులు ఇప్పటి వరకు చిక్కలేదు. రెహ్మత్‌నగర్‌కు చెందిన నర్సమ్మ 2018 జూన్ 13న కల్లు తాగడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆమెను తీసుకురావడానికి అల్లుడు ఆనంద్‌కుమార్ ఆటోలో వెళ్లాడు. అయితే అప్పటికే నర్సమ్మ వెళ్లిపోయినట్లు తెలుసుకున్నాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఎర్రగడ్డ ఆస్పత్రి ఆవరణలో శవమై కనిపించింది. ఆమె కాళ్లకు ఉన్న వెండి కడియాల కోసం హత్య చేసిన దుండగులు వాటిని తీయడానికి కాళ్లను సైతం శరీరం నుంచి వేరు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్సార్‌నగర్ పోలీసులు ఆ రోజు నర్సమ్మ మరో మహిళతో కలిసి కల్లు కాంపౌండ్ నుంచి బయటకు వచ్చినట్లు గుర్తించారు. కొన్ని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఆధారాలను బట్టి మరో పురుషుడూ వీరికి జత కట్టినట్లు తేల్చారు. ఈ ముగ్గురూ ఎర్రగడ్డ ఆస్పత్రి ఆవరణలోకి వచ్చారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు నర్సమ్మ శవంగా కనిపించింది. ఈ కేసు మాత్రం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఫలితంగా దారుణంగా హత్య చేసిన వాళ్లు స్వేచ్ఛగా సమాజంలో విహరించేస్తున్నారు. ఆ నేపాలీల జాడెక్కడ? నార్త్‌జోన్ పరిధిలో నివసించే ఆర్మీ మాజీ ఉన్నతాధికారి ఇంట్లో దాదాపు రూ.2 కోట్ల సొత్తు చోరీ అయింది. ఈ నేరం చేసిన నేపాలీలు ఇప్పటి వరకు దొరకలేదు. ఇదిలా ఉండగా... గత నెల్లో అబిడ్స్ పరిధిలోని మరో ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసు కొలిక్కి రాలేదు. మహేష్‌నగర్ కాలనీ ఫతేసుల్తాన్ లైన్లో నివసించే సునీల్ అగర్వాల్ వ్యాపారి. ఇతడి ఇంట్లో నేపాల్‌కు చెందిన దంపతులు యజమానులు లేని సమయం చూసుకుని, పక్కా పథకం ప్రకారం మరికొందరితో కలిసి పంజా విసిరారు. ఈ కేసులో దాదాపు రూ.కోటి విలువైన సొత్తు దుండగుల పాలైంది. నేపాలీల ఆచూకీ కనిపెట్టడమూ కష్టసాధ్యంగా మారింది. ఇటీవల అబిడ్స్, నారాయణగూడ ఠాణా పరిధిల్లోనూ నేపాలీల నేరాలు చోటు చేసుకున్నాయి. వాంటెడ్‌గానే అంతరాష్ట్ర ముఠా పంజగుట్ట ఠాణా పరిధిలో చోటు చేసుకున్న దారి దోపిడీ కేసులో నిందితులుగా ఉన్న అంతరాష్ట్ర ముఠాలో అందరు సభ్యులు చిక్కలేదు. దీంతో పాటు ఆ డబ్బు కూడా రికవరీ కాలేదు. గత ఏడాది మేలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. తార్నాక ప్రాంతానికి చెందిన భార్యభర్తలు పద్మ, నర్సింగ్‌రావు బంజారాహిల్స్ రోడ్ నెం.1లో ఉన్న యాక్సిస్ బ్యాంక్‌లో రూ.2.1 లక్షలు డ్రా చేసుకుని వెళ్తుండగా నల్లరంగు పల్సర్‌పై వచ్చిన దుండగులు బ్యాగ్ లాక్కుని పారిపోయారు. దీనిపై పంజగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలితో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను «అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే దుండగులు ఇద్దరు కాదు నలుగురని తేలింది. ముందు వచ్చిన ఇద్దరూ బ్యాగ్ లాక్కుని వెళ్ళిపోగా... వారి వెనుకే మరో వాహనంపై మరో ఇద్దరు వెంట వెళ్ళినట్లు గుర్తించారు. ఇది పశ్చిమ బెంగాల్‌కు చెందిన గ్యాంగ్‌గా తేలింది. స్థానిక పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలించినప్పటికీ సూత్రధారులు దొరకలేదు. ఏ పాత్రధారిని మాత్రమే పట్టుకోగలిగారు. నరికి పారేసినా దొరకని నేరగాళ్లు మెహిదీపట్నం ప్రధాన బస్టాప్‌లో పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం.12 ఎదురుగా ఉన్న బస్‌షెల్టర్ నెం.3 వద్దకు 2010 ఆగస్టు 3 మధ్యాహ్నం టోలిచౌకి వైపు నుంచి ఓ ఇండికా కారు వచ్చి ఆగింది. తొలుత అందులో నుంచి ఓ యువతి కిందికి దిగింది. వెనక్కు వెళ్లి కారు డిక్కీ తెరిచి అందులో నుంచి సూట్‌కేస్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించింది. అయితే అది బరువుగా ఉండటంతో డ్రైవర్‌ను పిలిచి అతని సహాయంతో కిందికి దించి బస్టాప్‌లోకి చేర్చింది. అదే కారులోంచి దిగిన మరో మహిళతో కలిసి ఆ సూట్‌కేస్ పక్కనే బస్టాప్‌లో కాసేపు కూర్చుంది. అలా కాసేపు కూర్చున్న ఇద్దరూ అదే కారులో వెళ్లిపోయారు. ఆటోడ్రైవర్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సూట్‌కేస్ తెరిస్తే అందులో మహిళ శవం లభించింది. – సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలోని రామ్‌కోఠి చౌరస్తాలోని సిద్ధార్థ ఏజెన్సీస్ వద్ద 2010 డిసెంబర్ 20న ఓ మృతదేహం ‘ముక్కలుగా’ లభించింది. ఓ ప్లాస్టిక్ సంచిలో తల, కాళ్లు లేని మొండెం కనిపించింది. మృతదేహాన్ని బట్టి వయస్సు 16 నుండి 20 ఏళ్ళ మధ్య ఉంటుందని నిర్థారించారు. సర్జికల్ బ్లేడ్‌తో తల, కాళ్ళు కోసినట్లు స్పష్టమైంది. ఇది జరిగిన రెండో రోజున నారాయణగూడ ఠాణా పరిధిలో ఈ మృతదేహం కాళ్లు లభించాయి. దీని తల ఇప్పటికీ లభించకపోగా... కేసు సైతం కొలిక్కి రాలేదు. వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో 2012 జూన్ 28న మరో డెడ్‌బాడీ బయటపడింది. నిలబెట్టి ఉన్న ప్లాస్టిక్ డ్రమ్‌ను చిత్తుకాగితాలు ఏరుకునే వ్యక్తులు గుర్తించారు. తీసుకువెళ్దామనే ఉద్దేశంతో దాన్ని పరికించి చూడగా డ్రమ్ పైభాగంలో తెలిరిచి ఉన్న ప్రాంతంలో ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్‌లతో పార్సిల్ చేసి టేప్ వేసినట్లు గుర్తించారు. వీటిని తొలగించగా అందులో శవం ఉన్నట్లు బయటపడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసూ కొలిక్కి చేరలేదు. వికలాంగుడైన హతుడిది నల్లగొండ, మహబూబ్‌నగర్ అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. -
పొలాల్లో ప్రత్యక్షమైన ఏటీఎం మిషన్
సాక్షి, శ్రీకాకుళం : ఏసీ గదుల్లో, సీసీ ఫుటేజీ కనుసన్నల్లో ఉండాల్సిన ఏటీఎం మిషన్ పంట పొలాల్లో పూర్తిగా ధ్వంసమై లభించిన ఘటన పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలకు సమీపంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...పలాస మండలం లక్ష్మీపురం గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి పంటపొలాల్లో ఏటిఎం మిషన్ సోమవారం దర్శనమిచ్చింది. ఉదయం పంట పొలాలకు వచ్చిన రైతులు మిషన్‌ను గుర్తించి కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కాశీబుగ్గ సీఐ ఆర్.వేణుగోపాలరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన ఈ ఘటనపై ఎస్పీ అమ్మిరెడ్డికి సమాచారం అందించగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని రహదారులను అలెర్ట్ చేసి తనిఖీలు చేపట్టారు. అనంతరం ఘటనా స్థలానికి రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి బ్రాహ్మణతర్లా ఎస్బీఐ మేనేజర్, సిబ్బిందిని తీసుకోచ్చి పరిశీలించగా అది ఎస్బీఐ ఏటీఎం మిషన్‌గా గుర్తించారు. దీంతో పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలలో ఉన్నటువంటి 19 బ్యాంకులు, 24 ఏటీఎం మిషన్లను, పరిసర ప్రాంతాలకు చెందిన ఏటీఎంలను పరిశీలించారు. పలాసకు క్లూస్ టీమ్ రాక జాతీయ రహదారి పక్కన పంట పొలాల్లో ఉన్నటువంటి ఏటీఎం విడిభాగాలను ఎవ్వరూ తాకకుండా స్థానికులు రక్షణ కల్పించడంతో శ్రీకాకుళం నుంచి క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని వేలి ముద్రలను సేకరించారు. మిషన్‌ను వాహనంలో తీసుకొచ్చి పడివేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే శనివారం నాడు ఎచ్చెర్లలో జరిగిన ఏటీఎం చోరీలో మాయమైన క్యాష్ మిషన్ ఇదేనేమో అని అనుమానిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
కనకమ్ము మోగింది
కంచు మోగుతుందని తెలుసు.కంచు మోగినట్టు కనకమ్ము మోగదని తెలుసు.కానీ, నేరం దాగదు.దుర్భుద్ధి బయటపడకా మానదు.దొంగ బంగారం నిప్పులా కాలుతుంది.దొంగ దొరికేవరకు మోగుతూనే ఉంటుంది. డిసెంబర్ 26, 2006.ఉదయం 7 గంటలు.గుంటూరు జిల్లా నరసరావుపేట.చలి దుప్పటి కప్పుకున్న సూర్యుడు బద్దకంగా ఒళ్లు విరుచుకుంటున్నాడు. జనం వెచ్చదనాన్ని తొడుక్కోవడానికి ఇళ్ల నుంచి మెల్లగా బయటకు వస్తున్నారు. కొంతమంది చలిని ధిక్కరిస్తూ పనుల్లో పడిపోయారు.ఆ సమయంలోనే చిన్న కలకలం.గీతామందిర్ రోడ్డులో పోలీసుల వాహనాలు ‘రయ్మ’ని దూసుకుపోతున్నాయి.వెనకనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లూ దౌడు తీస్తున్నాయి.దుమ్ము రేపుకుంటూ వెళుతున్న వాహనాలను చూసి ‘ఏం జరిగిందిరా..’ అని ఆందోళనగా అడిగాడు టీ స్టాల్ యజమాని తన సర్వెంట్‌తో. ‘అదే తెలియడం లేదు ..’ వాహనాలు వెళ్లినవైపునే చూస్తూ అన్నాడు సర్వెంట్.చుట్టుపక్కల వాళ్లు ఏం జరిగిందని తెలుసుకునే లోపునే టీవీల్లో బ్రేకింగ్ న్యూస్.. ‘నరసరావుపేటలో బ్యాంకు దోపిడీ’ అని. దోపిడి ఎలా జరిగిందనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఇంతకూ ఏం జరిగింది? నరసరావుపేట గీతామందిర్ రోడ్డులోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు.డిశంబరు 22న పనివేళలు ముగియగానే సిబ్బంది ఎప్పటిలాగే తాళాలు వేసి వెళ్ళారు.23, 24, 25 తేదీలు వరుసగా సెలవులు. 26వ తేదీ ఉదయం 6:15 గంటలకు బ్యాంక్ మెసెంజర్ కమ్ స్వీపర్ వెంకటేశ్వర్లు బ్యాంకు తాళాలు తీసేందుకు వచ్చాడు.కాని బ్యాంకు మెయిన్‌డోర్ తాళాలు తీసి పక్కన పడేసి వుండటాన్ని చూసి షాక్ అయ్యాడు. వెంటనే బ్యాంకు మేనేజర్‌కు ఫోన్ చేసి ‘సార్, బ్యాంక్‌లో దొంగలు పడ్డట్టున్నారు. తాళాలు పగలగొట్టి కిందపడేసి ఉన్నాయి’ అన్నాడు. హుటాహుటిన మేనేజర్ స్థానిక పోలీసులకు సమాచారం అందించి బ్యాంకుకు చేరుకున్నాడు.సీఐ ప్రసాద్ బ్యాంకు వద్దకు చేరుకొని, బ్యాంక్ మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి ఉండటం గమనించి, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు.ఎస్పీ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. క్లూస్, డాగ్ స్వా్కడ్లకు సమాచారం చేరింది.వాళ్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించడం మొదలుపెట్టారు. బ్యాంకు లోపలంతా పరిశీలించారు. ఎక్కడా ఫైళ్లు గానీ, ఫర్నీచర్‌గానీ దెబ్బతినలేదు. బంగారం ఉంచిన లాకర్ మాత్రం ఓపెన్ చేసి ఉంది. ఆ లాకర్ని గ్యాస్ కట్టర్‌తో కట్ చేశారు నిందితులు. అందులో వున్న రూ 3.75 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దొంగిలించబడ్డాయని తేలింది. దాదాపు కిలో బంగారపు ముద్ద కిందపడి ఉండటం గమనించారు. లాకర్‌ను కట్ చేసే క్రమంలో వేడికి ఆభరణాలు కరిగి ముద్దగా మారి ఉంటాయి. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో బ్యాంకు వైపుగా వచ్చేవారు లేకపోవడంతో గుర్తించడానికి సమయం పట్టింది. నగదు పోలేదని నిర్ధారణకు రావడంతో ఇది ఎవరో తెలిసిన వ్యక్తుల పనేనని పోలీస్ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. బ్యాంకులో పనిచేసే సిబ్బంది అందరినీ విచారించారు. ఎవరినీ అనుమానించలేని విధంగా సమాధానాలు రావడంతో మిస్టరీని ఛేదించలేక పోలీసులు తలలు పట్టుకున్నారు. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులకు ఇన్సూరెన్స్ కంపెనీ అప్పటి మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించింది.రెండేళ్లు గడిచాయి. నిందితుల ఆచూకీ దొరక్కపోవడంతో కేసును 2008 నవంబరు 24న సెంట్రల్ క్రై ం స్టేషన్ (సీసీఎస్)కు బదిలీ చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. బ్యాంకు సిబ్బందిని మరోసారి విచారించారు. అందరి జీవనవిధానాన్ని పరిశీలనలో ఉంచారు. బ్యాంక్ స్వీపరు కమ్ మెసెంజర్‌గా పనిచేసే వెంకటేశ్వర్లు దగ్గర బ్యాంకు మెయిన్‌డోరు తాళాలు ఉంటాయి. ముందుగా చిన్నవెంకటేశ్వర్లను పోలీసుస్టేషన్‌కి పిలిపించారు.‘వెంకటేశ్వర్లూ.. దోపిడీకి ముందు వారం రోజులు ఏమేం జరిగిందో చెప్పు..’ అని అడిగారు. ‘సార్.. నాకేం తెలియదు. మెయిన్ డోర్ తాళాలు ఒక్కటే నా దగ్గర ఉంటాయి. రోజూ వచ్చి బ్యాంకు తలుపులు తీసి చిమ్ముతుంటాను. లోపలి తాళాలు నా దగ్గర ఉండవు.. ’ అతను చెబుతుండగానే ‘మాకుతెలుసు. దొంగతనం జరగడానికి వారం ముందు ఏమైందో అది చెప్పు’ మరోసారి రెట్టించారు. అతని దగ్గర నుంచి వస్తున్న వాసనను పసిగట్టి ‘నువ్వు మందు తాగుతావా’ అని అడిగారు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకొని ‘అప్పుడప్పుడు తాగుతాను సార్’‘దొంగతనానికి ముందు వారంలో ఎవరెవరితో కలిసి మందు తాగావు ’కొన్ని నిమిషాలు ఆలోచనలో పడ్డ వెంకటేశ్వర్లు..‘స్నేహితులతో కలిసి తాగాను సార్. గోవిందం, రాములు, ఖాజాబాబు..’ అని పేర్లు చెబుతుండగా..‘ఖాజాబాబు ఎవరు?’ అని అడిగారు.‘బ్యాంకు అప్రయిజర్ వహీద్ కొడుకు సార్’పోలీసులకు ఏదో అర్ధమైనట్టుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.‘కేసు పూర్తయ్యేవరకు స్టేషన్‌కి వస్తూ ఉండాలి’ ఆర్డర్ వేశారు పోలీసులు. అలాగే అంటూ వారి వద్ద సెలవు తీసుకున్నాడు వెంకటేశ్వర్లు. అప్పటికే అబ్దుల్ వహీద్ అతని కొడుకు ఖాజాబాబుకు సంబంధించిన ఫైల్ టేబుల్ మీద ఉంది. ఈ మధ్య కాలంలో వాళ్లు భారీగా స్థలాలు, వాహనాలు కొనుగోలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి.‘అబ్దుల్ వహీద్, ఖాజాబాబుల ఆస్తుల వివరాలే క్లూ అవనున్నాయా!’ ఫైల్ ఓపెన్ చేస్తూ అన్నాడు సీఐ.‘సార్, అతనికి సంపాదించే కొడుకులు ఉన్నారు. వారి పిత్రార్జితం ఆస్తి కూడా వచ్చిందని తెలుస్తోంది. అతన్నెలా అనుమానించగలం..’ అంటున్న సిబ్బందిని వారిస్తూ.. ‘గతంలో అతనికి పెద్దగా ఆస్తులు లేవు. కానీ ఈ రెండేళ్లలోనే అతనూ, అతని కొడుకు కొన్న ఆస్తుల వివరాలు ఇవి. ఒక సాధారణ ఉద్యోగి ఇతను. ప్రస్తుత ఖర్చు లక్షల్లో ఉంది. ఇందంతా ఎలా సాధ్యం? ఈ రెండేళ్లలో బ్యాంకు మిగతా సిబ్బంది ఆస్తులు కొన్నట్టు రుజువులు లేవు. బ్యాంకు దోపిడీ ఒక్కరితో అవదు. ఇది కొంతమంది కలిసి చేసిన పని. బంగారం మాత్రమే దోపిడీ జరిగిందంటే తెలిసినవారి పనే అయ్యుండాలి. విచారిస్తే .. వివరాలు అవే తెలుస్తాయి’ దృఢంగా అన్నాడు సీఐ.అంతే, తర్వాత పోలీసుల పని వేగవంతమైంది. అబ్దుల్ వహీద్, ఖాజాబాబులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.విచారించడం మొదలుపెట్టారు. వివరాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. బ్యాంక్ అప్రయిజర్‌గా పని చేస్తున్న వహీద్‌కు బ్యాంకులో తాకట్టుగా చాలా బంగారం వచ్చి చేరిందని అర్థమైంది. దాని మీద అతడు కన్నేశాడు. అయితే బ్యాంకులోకి అడుగుపెట్టడం చాలా కష్టమైన పని. ముఖ్యంగా మెయిన్‌డోర్‌ను ఛేదించాలి. ఛేదించాలంటే వాటి తాళాలు కావాలి. అందుకే తన కుమారుడు ఖాజాబాబును రంగంలోకి దించాడు. తండ్రి కోసం బ్యాంకుకు వస్తూ పోతున్నట్టు నటించిన ఖాజాబాబు వెంకటేశ్వర్లుతో స్నేహం చేశాడు. అతనికి మద్యం బలహీనత ఉన్నట్టు కనిపెట్టి తరచూ తాగుడులో కూచోబెట్టేవాడు. ఒకరోజు మద్యం మత్తులో వుండగా అతని వద్ద వున్న బ్యాంక్ మెయిన్ డోర్ తాళాల ముద్రలను సేకరించాడు ఖాజాబాబు. తర్వాత ఆ ముద్రలతో డూప్లికేట్ తాళాలు చేయించాడు. తండ్రితో పాటు బందువు జానీబాషా, గ్యాస్ కట్టర్ షేక్ సుబానీ, స్నేహితులైన షేక్ మౌలాలి, అబ్దుల్ ఖాదర్, పఠాన్ ములాసాఫ్లను ఈ దోపిడీలో భాగస్తులను చేసి, ప్లాన్ రచించాడు ఖాజాబాబు. డిసెంబరు 22 అర్థరాత్రి డూప్లికేట్ తాళాలతో సునాయాసంగా బ్యాంకు తలుపులు తెరిచి, లోపలకు వెళ్లారు.బ్యాంకులో బంగారం ఎక్కడ ఉంచుతారో వహీద్‌కు తెలుసు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం లాకర్ రూమ్ తాళాలను పగలగొట్టారు. అయితే, లాకర్ని తెరవడం అంత సులువు కాలేదు. గ్యాస్ కటర్ షేక్ సుభాని కటర్‌తో లాకర్ని తెరిచే ప్రయత్నం చేశాడు. ఈ కటింగ్ టైమ్‌లోనే వేడికి లాకర్లో ఉన్న బంగారం కొంత కరిగి కిందపడింది. లాకర్ని కట్ చేసి లోపలున్న బంగారం తీసి మూటగట్టారు.వచ్చిన దారినే చీకట్లో కలిసిపోయారు.దోపిడీ చేసిన బంగారంమూటను టౌన్‌లోని వరవకట్ట సమీపంలోని బావిలో పడేశారు. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.తర్వాత శని, ఆది, సోమవారం క్రిస్మస్.. ఇలా వరసగా సెలువులు అవడంతో విషయం వెలుగులోకి రాలేదు.విచారణలోనూ వీరి మీద అనుమానం ఎవరికీ రాలేదు.మూడు నెలలు ఓపిక పట్టారు.తర్వాత బంగారం మూటను బావిలో నుంచి బయటకు తీసి, కరిగించి, బిస్కెట్ల రూపంలోకి మార్చారు. వాటిని అమ్మి నగదు చేసుకున్నారు. కొంత బంగారాన్ని అందరూ కలిసి పంచుకున్నారు. దీంట్లో పెద్ద మొత్తం వహీద్, ఖాజాబాబులు సొంతం చేసుకున్నారు. పోలీసులు రికవరీలో భాగంగా బంగారంతో పాటు వారందరి స్థిర, చర ఆస్తులనూ సీజ్ చేశారు. సీసీఎస్ సీఐ విజయభాస్కరరావు దర్యాప్తులో భాగంగా ప్రత్యేకంగా ఇద్దరు కానిస్టేబుళ్ళు బి.నరశింహారావు, అబ్రహాంలను పూర్తి స్థాయిలో నిఘాకు కేటాయించారు. బ్యాంకు సిబ్బంది లావాదేవీలు గమనించడమే వీరి పని. ఎవరూ పెద్దగా ఆస్తుల కొనుగోళ్లకు దిగలేదు. కాని వహీద్ జీవన శైలి మాత్రం ఒక్కసారిగా మారింది. అదే క్లూగా తీసుకుని పై అధికారులకు తెలియచేశారు కానిస్టేబుళ్లు. దీని ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. దోపిడీకి పాల్పడింది బ్యాంకు అప్రయిజర్ వహీద్, అతని బృందమే అని నిర్ధారించారు. 2009 జూన్ 5న అప్పటి ఎస్పీ లడ్హా కేసు దర్యాప్తులో ప్రతిభను చూపిన సీఐ సి.విజయ భాస్కరరావు, కానిస్టేబుళ్ళు అబ్రహాం, నరశింహారావులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. స్వా«ధీనం చేసుకున్న రూ 3.25 కోట్ల విలువచేసే బంగారం, వాహనాలు, స్థలాలను కోర్టుకు అప్పగించి, నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుంది. ఒరిజినల్‌గా పడే కష్టంతో వచ్చే సంపాదనలో ప్రశాంతత ఉంది.ఎప్పుడైతే డూప్లికేట్ మార్గంలో దిగుతామో జీవితం నాశనమవుతుంది. – వుయ్యూరు శ్రీహరిబాబు, గుంటూరు -
ఆ గదినిండా రక్తపు మరకలే..
సాక్షి, హైదారబాద్ : నగరంలో సంచలనం కలిగించిన చిన్నారి తల కేసు విచారణలో హైదరాబాద్ పోలీసులు మరో కీలక అడుగు వేశారు. ఉప్పల్ సర్కిల్ చిలుకానగర్ డివిజన్ పరిధిలోని మైసమ్మ దేవాలయం సమీపంలో రాజశేఖర్ క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటిపై చిన్నారి తల లభించిన విషయం తెలిసిందే. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, శనివారం రాజశేఖర్ ఇంట్లో ఆధారాల కోసం దాదాపు 9గంటల తనిఖీలు నిర్వహించారు. ఈ వెతుకులాటలో ఇంటిలోని ఓగదిలో బండల గీతల మధ్య రక్త నమూనాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గది నిండా కంటికి కనిపించకుండా రక్తపు మరకలు ఉన్నట్లు క్లూస్ టీం నిర్ధారించింది. ఆ మరకలు కనిపించకుండా ఐదారు సార్లు రసాయనాలతో తుడిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే విచారణలో ఆగదిలో కోడిని కోశామని రాజశేఖర్ తెలిపినట్లు సమాచారం. అయితే క్లూస్ టీం అనుమానితుడి ఇంటి నుంచి లభించిన కొన్ని రక్త నమూనాలను సేకరించారు. ఇంటిపై దొరికిన శిశువు నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించిచారు. ఈకేసులో ఇప్పుడు ఈ నమూనాలే కీలకంగా మారాయి. మరో రెండు రోజుల్లో డీఎన్ఏ రిపోర్టు రానుంది. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు మరో 48గంటల్లో అసలు దోషులు ఎవరో నిర్ధారించే అవకాశం ఉంది. ఎలాగైనా కేసు మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు తెలుపుతున్నారు. -
కొట్టక్కిలో హత్య
♦ గణేష్ నిమజ్జనం నాటి గొడవలే కారణమా? ♦ డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలు రంగ ప్రవేశం ♦ పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యులు ప్రశాంతతకు మారుపేరైన కొట్టక్కి గ్రామం మంగళవారం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గ్రామంలో హత్యకు గురైన వ్యక్తిని చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారి పొలం పనులకు వెళ్తున్న వారికి రోడ్డు పక్కనే హత్యకు గురై కనిపించిన మృతదేహాన్ని చూసి భయకంపితులయ్యారు. పెద్ద చెరువు గట్టుపై గ్రామానికి చెందిన వ్యక్తే హత్యకు గురై ఉండడంతో ఉలిక్కి పడ్డారు. వివరాల్లోకి వెళ్తే... రామభద్రపురం(బొబ్బిలి రూరల్) : కొట్టక్కి గ్రామానికి చెందిన వాకాడ సత్యనారాయణ(30) మంగళవారం హత్యకు గురై విగతజీవిగా కనిపించడంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా భయభ్రాంతులయ్యారు. దీనికి సంబంధించి సీఐ జి.సంజీవరావు తెలిపిన వివరాలు...గ్రామానికి చెందిన సత్యనారాయణ ఈ నెల 11న తెల్లవారుజామున ఐదు గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడతో కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాల్లో వెదికారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం అదే గ్రామానికి చెందిన రైతు తన పొలానికి నీరు కట్టేందుకు వస్తూ చెరువు మదుము తీద్దామని చెరువు గట్టుపైకి వెళ్లేసరికి అక్కడ సత్యనారాయణ మృతదేహం కనిపించడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో సత్యనారాయణ భార్య మంగమ్మ వచ్చి గుర్తించి బోరుమంది. విషయం తెలిసి ఎస్ఐ డిడి.నాయుడు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గణేష్ నిమజ్జనమే కారణమా... పోలీసు ప్రాథమిక విచారణలో కొన్ని విషయాలు వెలుగు చూశాయి. గత నెల 30న గ్రామంలో గణేష్ నిమజ్జనం జరుపుతున్న సమయంలో డ్యాన్స్‌లు చేస్తుండగా వీధిలోని యువత మధ్య గొడవ చోటుచేసుకుంది. పెద్దలు సముదాయించారు. అదే సమయంలో ఒక వర్గానికి చెందిన వారు వేరో వర్గానికి చెందిన వారిలో ఒకరిని ఏదో రోజున చంపేస్తామని హెచ్చరించినట్టు తేలింది. ఈ హెచ్చరికే హత్యకు దారి తీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనేది కూడా విచారిస్తున్నారు. అయితే సత్యనారాయణ కుటుంబ సభ్యులైన తల్లి గంగమ్మ, ఆమె మరిది వాకాడ సూర్యయ్య మాత్రం గణేష్ నిమజ్జనం రోజున హెచ్చరించిన వారే చంపేశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్నే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి గణేష్ నిమజ్జనం రోజు జరిగిన గొడవకు సత్యనారాయణకు ఎటువంటి సంబంధం లేదని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఆ గొడవలో సత్యనారాయణ తమ్ముడు పాలుపంచుకున్నాడే తప్ప హతునికి సంబంధం లేదని చెబుతున్నారు. తల్లి గంగమ్మ ఇచ్చిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాయుడు కేసు నమోదు చేశారు. సీఐ సంజీవరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా ప్రదేశానికి డాగ్ స్వా్వడ్, ఆరుగురు బృందంతో కూడిన క్లూస్ టీం వచ్చింది. గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ఇదిలా ఉండగా హతుడు సత్యనారాయణ ముఖంపై తీవ్ర గాయాలున్నాయి. ముక్కు వెంబడి రక్తం కారిన చాయలు ఉండడంతో కచ్చితంగా హత్యేనని అంతా భావిస్తున్నారు. వీధిన పడిన కుటుంబం హతుడు సత్యనారాయణ గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. అలా వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నారు. హతునికి భార్య మంగమ్మతో పాటు సూర్య, రుషి అనే పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా ఇతని ఆదాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు సత్యనారాయణ హత్యకు గురవడంతో ఎలా బతికేదని రోదిస్తున్నారు. ఆ నలుగురే చంపేశారు... గణేష్ నిమజ్జనం రోజున జరిగిన గొడవలో హెచ్చరించిన గ్రామానికి చెందిన వాకాడ భాస్కరరావు, వాకాడ వెంకయ్య, వాకాడ చిన్నయ్య, జి.గురునాయుడు కక్ష కట్టి చంపేశారు. వాస్తవానికి ఆ గొడవతో సత్యనారాయణకు ఎటువంటి సంబంధం లేదు. అన్యాయంగా చంపేశారు. కఠినంగా శిక్షించాలి. –వాకాడ సూరయ్య, హతుడి చిన్నాన్న -
గొంతు కోసి, కాళ్లు నరికి..
మహిళను హత్యచేసి గోనె సంచిలో కుక్కిన దుండగుడు నంగునూరు: మహిళ గొంతు కోసి, కాళ్లు నరికి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలలో జరిగింది. గట్లమల్యాల గ్రామానికి చెందిన దండ్ల రాజు కువైట్ వెళ్లడంతో భార్య లావణ్య (28) ముగ్గురు పిల్లలతో కలసి గ్రామంలో ఉంటోంది. ఆదివారం రాత్రి బహిర్భూమికని వెళ్లిన లావణ్య.. తిరిగి రాకపోవడంతో కాలనీవాసులు చుట్టుపక్కల వెతికారు. గ్రామ శివారులో ఉన్న చెరువు వద్ద లావణ్య మృతదేహం కనిపించింది. తల, రెండు పాదాలు నరికి చెరువు గుంతలోని చెట్లపొదల్లో పడేశారు. పోలీసులు డాగ్‌స్క్వాడ్స్‌ను రప్పించగా.. చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. క్లూస్‌టీం సభ్యులు ఆనవాళ్లను సేకరించారు. కాగా, అదే గ్రామానికి చెందిన రంగు పర్శరాములుగౌడ్‌తో లావణ్యకు వివాహేతర సంబంధం ఉందని, అతడే దారుణంగా హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. పర్శరాములును కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబాన్ని ఆ దుకోవాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని తరలించకుండా పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. మృతురాలి కూతురు అంజలి, కుమారులు గణేశ్, శివను ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి హామీ ఇవ్వడం తో వారు శాంతించారు. కాగా, పర్శరాములుగౌడ్ లైంగికదాడి చేసి ఆభరణాల కోసం హత్య చేసినట్లు కేసు నమోదు చేశారు. -
రుష్యశృంగుని కొండపై క్లూస్‌టీం
శింగనమల: మండల కేంద్రానికి సమీపంలోని రుష్యశృంగుని కొండపై ఈ నెల 19వ తేదీ గురువారం రాత్రి చోటుచేసుకున్న దుర్ఘటనకు సంబంధించి సోమవారం క్లూస్‌టీం రుష్యశృంగుని ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించింది. ఇద్దరు హత్యకు గురైన ఈ కేసు మిస్టరీగా మారడంతో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి అన్ని కోణాలలో విచారణ చేస్తున్నారు. ఆ రాత్రి హత్యకు గురైన పెద్దన్న, ఈశ్వరయ్యలతో పాటు సావిత్రి అనే మహిళ, మరికొందరు ఉన్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు ఆ దిశగా బత్తలపల్లి, ధర్మవరం ప్రాంతాల్లోనూ విచారిస్తున్నట్లు తెలిసింది. -
చోరీ కేసులో కారు లభ్యం
ఓజిలి : ప్రకాశం జిల్లాలో చోరీకి గురైన స్విఫ్ట్‌కారు రాచపాళెం జాతీయ రహదారి పక్కన పోలీసులు మంగళవారం రాత్రి గుర్తించారు. ఒంగోలు పట్టణంలోని స్వాతి కల్యాణ మండలం సమీపంలో వి.దానారావుకు చెందిన కారు ఈనెల 12వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ప్రకాశం నుంచి నెల్లూరు మీదుగా చెన్నైకు వెళ్లేందుకు దుండగులు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాచపాళెం సమీపంలోకి వచ్చే సరికి కారు ఫ్యాన్బెల్టు తెగిపోవడంతో కారు రహదారికి పక్కన కాలువలోకి దుసుకెళ్లింది. ఎస్సై సాంబశిరావు రాత్రి రోడ్డు తనిఖీలు చేస్తుండగా కారు రోడ్డు పక్కకు వెళ్లడంతో అనుమానం వచ్చి చూసే సరికి దుండగులు కారును వదిలి పరారయ్యారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కారు ఎడమ వైపు అద్దం పగలకొట్టి చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో అదేరోజు మరో కారు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. చోరీకు గురైన కారుపై ఉన్న వేలిముద్రలను క్లూస్‌టీమ్ సిబ్బంది సేకరించారు. నెల్లూరులో 8, ప్రకాశంలో 8 స్విఫ్ట్ కారులు గతంలో చోరీకి గురయ్యాయని సీఐ అక్కేశ్వర్రావు తెలిపారు. చోరీకి గురైన కారును ఆయన పరిశీలించారు. బూదనం టోల్‌ప్లాజా వద్ద కారుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. -
మల్లాపురంలో దొంగల హల్చల్
నల్లగొండ: నల్గొండ జిల్లా యాదాద్రి మండలం మల్లాపురం గ్రామంలో గురువారం అర్థరాత్రి దొంగలు హల్చల్ చేశారు. స్థానికంగా నివాసముంటున్న వెంకట్‌రెడ్డి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటంతో.. పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు రంగంలోకి దిగి... వెంకట్‌రెడ్డి ఇల్లు, పక్కనే ఉన్న యాదగిరిరెడ్డి ఇంటితో పాటు సమీపంలోని ఓ దుకాణంలో కూడా దొంగలు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాంతో క్లూస్ టీం సాయంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
దోపిడీ దొంగల దాష్టీకం..
హైదరాబాద్ : ఓ ఇంటిని దోచుకునేందుకు వచ్చిన ఇద్దరు దొంగలు సొమ్ముతో పాటు ఓ బాలికను నోట్లో గుడ్డలు కుక్కి ఎత్తుకెళ్లిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నార్సింగి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కోకాపేట్ ప్రాంతంలోని గూంచా హిల్స్‌లో నివసిస్తున్న ఐటీ ఉద్యోగి మనోజ్‌రెడ్డి ఇళ్లు కట్టుకుంటూ, సమీపంలో మరో ఇంట్లో భార్య జ్యోతి, కూతురు, తన మరదలి కూతురు, పని మనిషితో సహా నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి మనోజ్, తన భార్య కుమార్తెలతో కలిసి బెడ్రూమ్లో నిద్రపోతుండగా, మరదలి కూతురు (11), మరో బాలికతో కలిసి వరండాలో పడుకుంది. శనివారం తెల్లవారు జామున నిచ్చెన సహాయంతో బాల్కానీలోకి ప్రవేశించిన ఇద్దరు దొంగలు హాల్లో ఉన్న రెండు ఆపిల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, బంగారు గొలుసును దొంగలించారు. అదే సమయంలో బాలిక మేలుకుని అరవడానికి యత్నించగా, వారు ఆమె నోట్లో గుడ్డలు కుక్కి మెయిన్ గేటు వరకు తీసుకెళ్లి పారిపోయారు. దీంతో భయాందోళనకు గురైన బాలిక గేటు పక్కనే గదిలో నిద్రిస్తున్న వాచ్‌మెన్‌ను లేపి విషయం చెప్పడంతో అతను మనోజ్‌కుమార్ సమాచారం అందించగా, వారు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ సంఘటనా పరిశీలించి వివరాలు సేకరించారు. బాలికపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారేమోనన్న అనుమానంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వారి పనేనా... గూంచా హిల్స్ గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ ప్రహరీ, గేటు, వాచ్‌మేన్ ఉడటంతో నిందితులు గోడ దూకి లోనికి ఎలా ప్రవేశించారు. మనోజ్ రెడ్డి ఇంటి మొదటి అంతస్తు బాల్కానీలోకి ఎలా వెళ్లారు అన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. బాలిక చెబుతున్న వివరాలను బట్టి తెలిసినవారే దోపిడీకి పాల్పడి ఉండవచ్చునన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తనిఖీలు పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్కాడ్ సిబ్బందికి సమాచారం అందించడంతో డాగ్ స్కాడ్ గండిపేట్ ఎక్స్‌రోడ్డు వరకు వెళ్ళి తిరిగి వచ్చాయి. నిందితులు కాలినడకన చౌరస్తా వరకు వెళ్ళి ఏదైనా వాహనం ఎక్కి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రహదారిపై ఉన్న సీసీ టీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. -
ఇన్‌కం ట్యాక్స్ అధికారులవుంటూ దోపిడీ
నాగలాపురం: ఇన్‌కం ట్యాక్స్ అధికారులమని పేర్కొని వడ్డీ వ్యాపారి ఇంట్లో దోపిడీ చేసిన సంఘటన గురువారం తెల్లవారుజామున నాగలాపురంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక బజారు వీధిలో జయరాం అనే వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున ఒక టాటా సుమో అతని ఇంటి వద్దకు వచ్చింది. సఫారీ, టై ధరించిన ఇద్దరు, పోలీసు యుూని ఫాం ధరించి చేతిలో బేడీలు పట్టుకున్న వ్యక్తి కిందకు దిగారు. మరో ఇద్దరు కూ డా వారితో వచ్చారు. తాము హైదరాబాద్ నుంచి వచ్చిన ఇన్‌కం ట్యాక్స్ అధికారులవుని చెబుతూ దొరస్వామి అన్న పేరుతో ఉన్న ఐడీ కార్డును చూపారు. వడ్డీ వ్యాపారి నిర్వహిస్తున్న కావేరి పాన్ బ్రోకర్స్ పేరుతో సర్చ్ వారంట్ తెచ్చావుని కొన్ని కాగితాలను చూపారు. దీంతో జయరాం తలుపులు తెరిచాడు. తలుపులకు గడియపెట్టి.. దుండగులు వడ్డీ వ్యాపారి జయరాం భార్య చంపా, కువూరుడు వినోద్‌ను బయుటకు రానీయుకుండా తలుపులకు గడియుపెట్టారు. ఫోన్లు లాక్కున్నారు. బీరువాలోని నాలుగు ఉంగరాలు, రెండు నెక్లెస్‌లు, జత కవ్ములు, ఒక నెత్తి చిట్టి, ఫ్రిడ్జ్పైనున్న పర్స్‌లోని రూ.5 వేలు తీసుకున్నారు. తవు సోదాలో ఏవీ దొరకలేదని పేర్కొంటూ కొన్ని కాగితాలపై జయురాం నుంచి సంతకాలు తీసుకున్నారు. అవసర మైతే హైదరాబాదుకు రావలసి ఉంటుందని తెలిపి వారు వచ్చిన వాహనంలో ఉడారుుంచారు. దీనిపై బాధితుడు జయరాం సత్యవేడు సీఐ నరసింహులుకు ఫిర్యాదు చేశాడు. సువూరు రూ.5 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకు వెళ్లారని వారు వాపోయూరు. క్లూస్ టీం పరిశీలన సంఘటనా స్థలాన్ని చిత్తూరు నుంచి వచ్చిన క్లూస్‌టీం పరిశీలించింది. వేలివుుద్రలను సేకరించింది. వడ్డీ వ్యాపారి జయురాం కుటుంబ సభ్యులను విచారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సీఐ నరసింహులు తెలిపారు. సుమో వాహనం ఏపీ రిజిష్ట్రేషన్ కలిగి ఉందని, అద్దం వెనుకవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియూ స్టిక్కర్ అతికించినట్టు స్థానికులు తెలిపారు. ఈ విచారణలో ఇంచార్జ్ ఎస్ఐ వెంకటేశులు, ఏఎస్ఐ వుల్లికార్జునయ్యు పాల్గొన్నారు. -
అంతా అనుమానాస్పదం!
సవాల్‌గా మారిన ఉన్మాది హత్యోదంతం పలు కోణాల్లో కేసు విచారిస్తున్న పోలీసులు పోలీసుల అదుపులో మృతురాలి భర్త.. రాత్రికి విడుదల కావలి అర్బన్: శుక్రవారం రాత్రి స్థానిక రాజీవ్‌నగర్ అరటితోటలో చోటుచేసుకొ న్న హత్యోదంతం పోలీసులకు సవాల్‌గా మారింది. ఉన్మాది శుక్రవారం సాయంత్రం సిమిలి నాగిరెడ్డి నివాసానికి వెళ్లి ఆధార్‌కార్డు ఇవ్వాల్సిందిగా కోరడంతో వెనుతిరిగిన సుశీలమ్మ, ఆమె కోడలు కవిత, చిన్నారులు దీక్షిత, వశిష్ట్లపై పాశవికంగా దాడిచేసిన విషయం విదితమే. కవిత అక్కడికక్కడే మృతిచెందగా సుశీ లమ్మ, చిన్నారులు నెల్లూరులో చికిత్సపొందుతున్నారు. విషయం తెలుసుకొన్న కవిత బంధువులు శనివారం నాగిరెడ్డి నివాసానికి చేరుకున్నారు. కవిత మృతికి భర్త వెంకటేశ్వరరెడ్డి, మామ నాగిరెడ్డి కారణమంటూ బంధువులు గొడవకు దిగబోగా పోలీసులు నివారించారు. ఉన్మాది అంటూ అనుమానాలు పోలీసులు ఈ కేసుపై పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కవిత భర్త వెంకటేశ్వరరెడ్డిని పోలీసులు తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అదేవిధంగా ఉన్మాద చర్యల కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. శివారు ప్రాం తాల్లో చివరిగా ఉన్న ఇంటిని ఎంపిక చేసుకొని పథకం ప్రకారం ఇంట్లోని సభ్యులందరిని హతమార్చే ఉన్మాది ఉదంతాలు గతంలో కూడా పలుచోట్ల జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. గుంటూరు జిల్లాలో గతంలో జరిగిన మాదిరిగా కావలిలో సంఘటనలు ఉన్నాయన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. ఈ ఘటనల ఆధారంగా అగంతకుడు ఒక పథకం ప్రకారం ఈ ఘాతుకాలకు పాల్పడుతున్న ట్లు తెలుస్తోంది. శివారుప్రాంతంలోని ఇంటిని టార్గెట్‌గా పెట్టుకొని పురుషులు లేని సమయంలో వచ్చి దాడికి పాల్పడుతుంటాడని చెబుతున్నారు. శుక్రవారం కావలి తూర్పు శివారు ప్రాంతంలో జరి గిన దారుణ సంఘటనలో పాల్గొంది ఒకరా లేక అంతకన్నా ఎక్కువమంది ఉన్నారా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. పోలీసులు జాగిలాలు, క్లూస్‌టీమ్ రప్పించి అగంతకుల ఆనవాళ్లను గుర్తిస్తున్నారు. శనివారం ఆ ఇంటిలోని వస్తువులను పరిశీలించారు. ఇంటి సమీపాన పడివున్న ఒక వ్యక్తి ఫ్యాంట్‌ను కూడా తీసుకొ ని పరిశీలించగా దానిపె రక్తం మరకలు, జేబులో కారం కూడా ఉన్నట్లు గుర్తిం చారు. ఆప్రాంతంలో అగంతకుడి పాదాల గుర్తులు కూడా సేకరించారు. నెల్లూరులో చికిత్సపొందుతున్న చిన్నారులు దీక్షిత, వశిష్టల పరిస్థితి మెరుగవుతుండగా సుశీలమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కవిత మృతదేహానికి స్థానిక ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఆతర్వాత భర్తను వదిలిపెట్టినట్లు తెలిసింది. -
క్లూస్‌టీమ్స్ బలోపేతం
శాస్త్రీయ ఆధారాల సేకరణపై సైబరాబాద్ పోలీసుల దృష్టి త్వరలోనే ఐదు బృందాల ఏర్పాటు త్వరితం కానున్న నేరశోధన సిటీబ్యూరో: నేరగాళ్లకు శిక్ష పడటంతో ఆధారాలు ముఖ్య భూమిక వహిస్తాయి. ఈ నేపథ్యంలోనే ఘటనా స్థలంలో వీటిని సేకరించే క్లూస్ టీమ్‌లను బలోపేతం చేయడంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దృష్టి పెట్టారు. శాస్త్రీయ ఆధారాలు పక్కాగా ఉంటే నేరగాళ్ల శిక్ష శాతం పెరుగుతుందని భావిస్తున్న కమిషనర్ ...ప్రస్తుతమున్న ఫింగర్ ప్రింట్ యూనిట్‌కు తోడుగా క్లూస్‌టీమ్‌లను రం గంలోకి దింపాలని భావిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో లా అండ్ అర్డర్ పోలీసు స్టేషన్లున్నా...ఆధారాల సేకరణకు మాత్రం ప్రత్యేకంగా క్లూస్‌టీమ్ అంటూ ఏమీ లేదు. ఉన్నా ఫింగర్ ప్రింట్ విభాగంలో సిబ్బంది కూడా చాలా తక్కువగా ఉంది. దీంతో చాలా కేసుల్లో శాస్త్రీయ ఆధారాల సేకరణ వీలుపడటం లేదు. ఇటీవల ప్రత్యక్ష సాక్షులు తదితరుల సాక్ష్యాలు న్యాయస్థానాల్లో పెద్దగా నిలవడం లేదు. చివరి నిమిషంలో వారు ఎదురు తిరుగుతుండటంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశాల్లో మాది రిగానే సైబరాబాద్‌లోనూ క్లూస్‌టీం సేవలను బాగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్న కమిషనర్ ఆనంద్... ఐదు జోన్లలోనూ ఒక్కో క్లూస్‌టీంను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేపట్టారు. ప్రత్యేక శిక్షణ... ఇప్పటికే అన్ని పోలీసు స్టేషన్లలో శాస్త్రీయ ఆధారాల సేకరణ బాధ్యతను అక్కడి ఠాణాల్లోని ఇద్దరు పోలీ సులు చూసుకుంటున్నారు. వీరు బాగానే పనిచేస్తున్నప్పటికీ....శిక్షల శాతం పెరగాలంటే ప్రత్యేకంగా క్లూస్‌టీమ్ అవసరమని సీవీ ఆనంద్ భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని తీసుకొని శిక్షణ ఇవ్వనున్నారు. శాస్త్రీయ ఆధారాల సేకరణలో ప్రావీణ్యులైన వారిచే ఓరియంటేషన్ క్లాస్‌లతో పాటు ఫిజికల్‌గా కూడా క్లాస్‌లు తీసుకోనున్నారు. క్లూస్‌టీంలో అధికారితో పాటు ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, వేలిముద్రలు...రక్తనమూనా సేకరణ నిపుణులు, పేలుడు పదార్థాలను గుర్తించేవారు ఉంటారు. ఘటనాస్థలిలో రక్తం, వేలిముద్రల సేకరణకు విదేశాల నుంచి అత్యంత ఆధునికమైన పరికరాలను కూడా తెప్పిస్తున్నారు. ఈ బృందాలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి సేవలను వినియోగించడం ద్వారా నేరగాళ్లను అరెస్టు చేసే విషయంపై మరింత దృష్టి సారిస్తామని సైబరాబాద్ క్రైమ్స్ ఓఎస్డీ నవీన్ కుమార్ పేర్కొన్నారు.. నేరగాళ్లకు శిక్ష పడేందుకే... ఘటనాస్థలిలో శాస్త్రీయ ఆధారాలను పూర్తిస్థాయిలో సేకరిస్తే, దోషులకు శిక్ష విధించే వీలుంటుంది. క్లూస్‌టీం వల్ల నేర పరిశోధన సులువవుతుంది. క్లిష్టమైన కేసులను వెం టనే ఛేదించవచ్చు. అందుకే ఈ వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
కిటికీ గ్రిల్స్ తొలగించి భారీ చోరీ
- 53 తులాల బంగారం, కిలోవెండి, రూ. 2 లక్షల నగదు అపహరణ - వివరాలు సేకరించిన ఏసీపీ రఫీక్, క్లూస్ టీం - కుటుంబీకులు ఇంట్లో నిద్రిస్తుండగానే చొరబడిన దొంగలు జవహర్‌నగర్: కుటుంబీకులు ఇంట్లో నిద్రిస్తుండగానే దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి చొరబడిన దొంగలు 53 తులాల బంగారం, కిలో వెండితో పాటు రూ. 2 లక్షల నగదు అపహరించుకుపోయారు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ డివిజన్ పరిధిలోని యాప్రాల్ తులసి గార్డెన్‌లోని డూప్లెక్స్ నంబర్ 53లో నివాసముంటున్న ఓ వ్యాపారవేత్త కంపెనీ పనిమీద శుక్రవారం ఢిల్లీకి వెళ్లాడు. ఆయన భార్య తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లోని పైగదిలో నిద్రిస్తోంది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంటి కిందిపోర్షన్ వెనక భాగంలోని కిటికీ గిల్స్ తొలగించి లోపలికి చొరబడి చోరీకి పాల్పడ్డారు. శనివారం ఉదయం ఆమె కింది పోర్షన్లో ఉన్న బెడ్రూంలోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. ఇంట్లో ఉన్న 53 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ. 2 లక్షల నగదు పాటు విలువైన సామగ్రి చోరీ అయిందని ఆమె గుర్తించింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ, క్లూస్‌టీం ఆదివారం ఆలస్యంగా సమాచారం అందుకున్న అల్వాల్ ఏసీసీ రఫీక్, సీఐ వెంకటగిరి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్ టీంను రప్పించి ఇంటి పరిసరాల్లో పరిశీలించారు. స్థానికులే చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాగా పూర్తి వివరాలు వెల్లడించేందుకు బాధితులు నిరాకరించారు. దాదాపు 100 డూప్లెక్స్ ఇళ్లు ఉన్న తులసి గార్డెన్లో సీసీ కెమెరాలు అసలే లేవు. ఈమేరకు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
హత్య చేసి.. తగలబెట్టి..
* చినరావుపల్లిలో దారుణం * రంగంలోకి దిగిన పోలీసులు * మృతుని వివరాలు సేకరణ.. * నిందితుల కోసం నాలుగు బృందాలు * సంచలనం రేకెత్తించిన సంఘటన ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండలం సంతసీతారామపురం పరిధిలోని చినరావుపల్లిలో దారుణం జరిగింది.గ్రామ సమీపంలోని జీడిమామిడి తోటల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్యచేసి దహనం చేశారు. మృతదేహం సగంసగం కాలి గుర్తించడానికి వీల్లేకుండా ఉంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. బుధవారం సాయంత్రం గ్రామంలో కాలిపోయిన గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు గ్రామ రెవెన్యూ అధికారి జరుగుళ్ల వెంకటరమణమూర్తికు తెలియజేయ గా అతని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం జేఆర్‌పురం సీఐ కె.అశోక్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్యగా నిర్ధారించారు. మృతదేహాన్ని వాహనంలో గోనె సంచిలో పెట్టి తీసుకొచ్చి బయటకు తీయకుండానే కిరోసిన్,పెట్రోల్ పోసి తగలబెట్టి ఉంటారని భావిస్తున్నారు. మృత దేహానికి నిప్పు అంటించాక నిందితులు అక్కడ నుంచి పరారై ఉంటారని చెబుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. శ్రీకాకుళం డీఎప్సీ కె.భార్గవ నాయుడు, క్లూస్ టీం కూడా సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. మృతదేహాన్ని పరిశీలించి తలపై గాయాలు ఉన్నట్టు డీఎస్పీ గుర్తించారు. క త్తితో నరికి చంపి ఉంటారని.. మృతి చెందిన వ్యక్తి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. ఈ నేర సంఘటనలో ఒకరిద్దరు కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉండి ఉంటుం ది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దారి పక్కనే.. మృతదేహాన్ని దహనం చేసిన ప్రాంతం ఆర్అండ్బీ రహదారికి అనుకొని కిలోమీటరు దూరంలో ఉంది. ఆ పక్క నుంచే కాలిబాట ఉంది. ఆర్అండ్బీ రహదారి నుంచి లావేరు మండలం బయ్యన్న పేట, మురపాక తదితర గ్రామాలకు ఈ దారి గుండా రాకపోకలు సాగి స్తారు. ఆ సమీపంలోనే షిర్డీసాయి ఆలయం కూడా ఉంది. ఎక్కడా మిస్సింగ్ కేసులు లేవు.. ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం మండలాల పోలీసుస్టేషన్ల పరిధిలో ఎక్కడ ఈ మధ్యకాలంలో అదృశ్యం కేసులు కూడా నమోదు కాలేదని డీఎస్పీచెప్పారు. మృత దేహం ఎవరిది అన్న మిస్టరీ వీడితే నిందితుల వివరాలు తెలిసే అవకాశం ఉంటుందన్నారు. వీలైనంత త్వరగా కేసును ఛేదిస్తామన్నారు. మృతుని ఆచూకీ కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దహనం జరిగిన ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇదే ప్రదేశంలో గతంలో పలువురి ఆత్మహత్య చినరావుపల్లి ప్రాంతంలోని జీడిమామిడి తోటల్లో గతంలో పలు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. వందల ఎకరాల్లో జీడిమామిడి తోటలు ఉండటం..జన సంచారం తక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కొన్నాళ్ల క్రితం ఓ ప్రేమ జంట ఇదే ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే మరో ఇద్దరు జీడి మామిడి చెట్లకు ఊరిపోసుకుని మృతిచెందారు. జన సంచారం పెద్దగా లేని కారణంగా సంఘటన జరిగి రోజులు గడిచాక విషయం బయటకు వస్తోంది. -
అది నీలి కిరోసిన్...
ముస్తఫా కేసు దర్యాప్తు ముమ్మరం ఘటనా స్థలాన్ని మళ్లీ పరిశీలించిన ‘సిట్’ సాక్షి, సిటీబ్యూరో: మెహిదీపట్నం మిలటరీ ఏరియాలో కాలిన గాయాలతో మృతి చెందిన ముస్తఫా (11) ఉదంతంపై నగర పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే దర్యాప్తు అధికారులకు ఘటనా స్థలంలో కీలక ఆధారాలు లభించాయి. మరోపక్క ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మిలటరీ ఉన్నతాధికారులు అంతర్గత విచారణను ముమ్మరం చేశారు. ఆదివారం ఘటన జరిగిన మిలటరీ సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ ఏరియాను నగర సీసీఎస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) పోలీసులతో పాటు మిలటరీ అధికారులు మరోసారి సందర్శించి వివరాలు సేకరించారు. ముస్తఫా హత్యకు గురై ఉంటే అందుకు కార ణాలేమిటి? అనే కోణంలో ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించామని ఓ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఘటన జరిగిన రోజే డాగ్‌స్క్వాడ్ ముస్తఫా మృతదేహం పడిన చోటి నుంచి మిలటరీ సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ కాంపౌండ్ లోపల ధోబీరూమ్ వద్ద ఉన్న బాత్రూం వద్దకు (ఇక్కడే ముస్తఫా ఒంటికి మంటలంటుకున్నాయి) వెళ్లింది. బాత్రూం నుంచి ముస్తఫా పడిన చోటికి, అక్కడి నుంచి బాత్రూమ్ వరకు ఇలా ఐదుసార్లు పోలీసు శునకం వెళ్లొచ్చింది. అది మరోచోటికి వెళ్లకుండా ముస్తఫా వద్దకే వచ్చి ఆగిందంటే ఘటన ప్రారంభమైన ప్రాంతంలో మరో వ్యక్తి ఉన్నాడా?.. ఉంటే అతను పారిపోయి ఉంటే అటు వైపు డాగ్ ఎందుకు వెళ్లలేదు. అనే ప్రశ్నలు పో లీసులను వేధిస్తున్నాయి. బయట నుంచే కిరోసిన్ తెచ్చారా? ముస్తఫా ఒంటిపై పడింది బ్లూ కిరోసినేనని దర్యాప్తు అధికారులు నిర్థారించారు. ఈ విషయాన్ని మిలటరీ అధికారులూ గుర్తించారు. క్లూస్ టీం కూడా ఘటన జరిగిన సమయంలో ధోబీరూమ్ పక్కనే బాత్రూమ్ ముందు పడిఉన్న (అర లీటర్ ఖాళీ మజా ప్లాస్టిక్)బాటిల్లో ఉన్న నీలి రంగు కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కిరోసిన్‌ను ఫోరెన్సీక్ ల్యాబ్‌కు కూడా పంపిచారు. అయితే ఈ కిరోసిన్ ఘటనా స్థలానికి ఎలా వచ్చింది? అనే దానిపై ఆరా తీస్తున్నారు. తెల్ల కిరోసిన్ అయితే ఎక్కడపడితే అక్కడ లభిస్తుంది. అదే నీలి రంగు (ప్రభుత్వం దీన్ని సబ్సిడీపై రేషన్‌షాపుల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తోంది) కిరోసిన్. మిలటరీ సిబ్బందికి ఈ కిరోసిన్ సరఫరా కానేకాదు. వారి క్వార్టర్స్‌లో కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లే ఉన్నాయి. ఇక సైనికుల దుస్తులు ఇస్తిరీ చేసే ధోబీరూమ్లో కూడా ఎక్కడా కిరోసిన్ ఉన్న దాఖలాలు లేవు. బొగ్గుల పెట్టేతో ఇస్తిరీ చేస్తే బొగ్గులకు నిప్పంటించేందుకు కిరోసిన్ వాడతారు. అయితే ఇక్కడ కరెంట్ పెట్టెతో ఇస్తిరీ చేస్తున్నారు కాబట్టి కిరోసిన్ అవసరం లేదు. అలాగే ధోబీ రూమ్ చుట్టుపక్కల ఎక్కడా బొగ్గులు కాని, కాలిన బొగ్గు బూడిద కాని కనిపించలేదు. అలాగే మిలటరీ సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ కాంపౌండ్‌లోని ఐదు గదులను కూడా మిలటరీ అధికారుల సహకారంతో పోలీసులు తనిఖీ చేశారు. ఆ గదులలో కూడా ఎక్కడా కిరోసిన్ పెట్టిన ఆనవాళ్లు లేవు. దీంతో ఈ నీలిరంగు కిరోసిన్ మిలటరీ ఏరియాకు బయటి నుంచే వచ్చి ఉంటుందని పోలీసుల భావిస్తున్నారు. కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెడితే ముస్తఫా మృతిపై మిస్టరీ వీడే అవకాశం ఉందంటున్నారు. ఘటన స్థలంలో కాలిపోయిన చిన్నపాటి చెట్ల ఆకులతో పాటు కిరోసిన్ పడిన ఆకులను కూడా ఫొరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఆ ఆకులపై పడింది కూడా నీలిరంగు కిరోసినేనని తేలింది. -
తీర్థయాత్రకు వెళ్తే.. ఇల్లు దోచేశారు
యలమంచిలిలో భారీ చోరీ స్వర్ణకారుడి ఇంట్లో 20 తులాల బంగారం.. రెండు కేజీల వెండి అపహరణ! తిరుమలలో ఉన్న బాధిత కుటుంబానికి సమాచారం రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ప్రొఫెషనల్ దొంగల పనేనని అనుమానాలు యలమంచిలి : తిరుమల తీర్థయాత్రకు వెళ్లిన స్వర్ణకారుడి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారం, వెండి, నగదు అపహరించుకుపోయారు. సంచలనం కలిగించిన ఈ చోరీ ఘటన ఆదివారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు, బాధితుని మామ అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో ఉలక్‌పేట వీధిలో స్వర్ణకారుడు బిల్లకుర్తి శ్రీనివాస్ కుటుంబం నివాసముంటోంది. గత గురువారం శ్రీనివాస్, భార్య శ్రీదేవి, కుమార్తె ఝాన్సీతో కలిపి కుటుంబమంతా తిరుమల తీర్థయాత్రకు వెళ్లారు. ఆదివారం ఉదయం పనిమనిషి నాగమణి వచ్చి ఇంటి ఎదుట శుభ్రం చేస్తుండగా ఇంటి ప్రధాన ద్వారానికి డోర్ కర్టెన్ పూర్తిగా వేసి ఉండటం గమనించింది. దగ్గరకు వెళ్లి చూడగా తలుపు తెరిచి ఉన్నట్టు గుర్తించింది. ఇదే విషయాన్ని చుట్టుపక్కల ఇళ్ల వారికి తెలియజేసింది. వారు వెంటనే ఫోన్ ద్వారా ఇంటి యజమాని శ్రీనివాస్‌కు సమాచారం అందజేశారు. ఇదీ దొంగతనం జరిగిన తీరు! ఈలోగా పట్టణ పోలీసులు చోరీ జరిగిన ఇంటికి చేరుకుని పరిశీలించగా ఇంట్లో పడక గదుల్లో బీరువాల తలుపులు తెరిచి ఉన్నాయి. సీక్రెట్ లాకర్లు విరగొట్టబడి ఉన్నాయి. బీరువాల్లో దుస్తులన్నీ చిందరవందరగా పడవేసి ఉన్నాయి. హాల్, వంటగదుల్లోని సామాన్లు చిందరవందర చేయబడి ఉన్నాయి. 20 తులాల బంగారం, రెండు కేజీల వెండి, రూ.15వేల నగదు అపహరించుకుపోయినట్లు కుటుంబ యజమాని శ్రీనివాస్ మామయ్య ఆరిపాక నూకేశ్వరరావు అలియాస్ జయబాబు పోలీసులకు తెలిపారు. అల్లుడి నుంచి సమాచారం రాగా తాను ఇక్కడికి వచ్చానన్నారు. రూరల్ ఎస్ఐ కంచుమోజు రామకృష్ణ చోరీ జరిగిన ఇంటిని, పరిసరాలను గమనించారు. అనంతరం సీఐ మల్లేశ్వరరావుకు సమాచారం అందజేశారు. ఆయన రూరల్ ఎస్పీకి తెలియజేయడంతో, ఆయన ఆదేశాల మేరకు క్లూస్ టీమ్ సభ్యులు హుటాహుటిన యలమంచిలి చేరుకున్నారు. రంగంలోకి క్లూస్ టీమ్ క్లూస్ టీమ్ ఏఎస్ఐ ఎస్.లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల బృందం ఉలక్పేటలో చోరీ జరిగిన ఇంటికి వెళ్లి ఆధారాలు సేకరించారు. తలుపులు, వస్తువులు, బీరువాలకు ఉన్న ఏడు రకాల వేలిముద్రలను సేకరించారు. దొంగలు ఇనుపరాడ్లతో ఇంటి ప్రధాన ద్వారా విరగ్గొట్టి లోనికి ప్రవేశించినట్టు గుర్తించారు. ప్రొఫెషనల్స్ పనే! గదుల్లో నేలపై కారంపొడి చల్లడంతో ఇది ప్రొఫెషనల్ దొంగలపనేనని పోలీసులు భావిస్తున్నారు. జిల్లాలోని సబ్బవరం, పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాల్లో ఇటీవల వరుసగా చోరీలు జరిగాయి. ఈ నేపథ్యంలో యలమంచిలిలో జరిగిన చోరీ కూడా దొంగల ముఠా సభ్యులే చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. చోరీ జరిగిన ఇంట్లో కుటుంబ సభ్యులంతా తిరుమల తీర్థయాత్రకు వెళ్లడంతో వారు సోమవారం యలమంచిలి చేరుకునే అవకాశం ఉంది. సోమవారం వారి నుంచి ఫిర్యాదు తీసుకుని కేసును దర్యాప్తు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. -
ఐదు మోటార్ సైకిళ్లు దహనం
- పావుగంట వ్యవధిలో - ఒకదాని తర్వాత ఒకటిగా.. - చిలక లూరిపేటలో అర్ధరాత్రి కలకలం - పోలీసులకు సవాల్‌గా మారిన ఘటన చిలకలూరిపేటటౌన్: అర్ధరాత్రి 12 గంటల సమయం.. చిలకలూరిపేట పట్టణ పోలీస్‌స్టేషన్ సమీప ప్రాంతం.. ఇళ్ల ముందు నిలిపిన ఐదు ద్విచక్రవాహనాలు ఒకదాని తర్వాత ఒకటిగా వేర్వేరు చోట్ల దహన మయ్యాయి. ఎవరు చేశారు? ఎందుకోసం చేశారు..? ఒక్కరి పనేనా..? అంతుచిక్కని ఇలాంటి ప్రశ్నలెన్నో.. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ వరుస ఘటనలు పట్టణంలో కలకలం రేపాయి. పోలీసులకు పెను సవాల్‌గా నిలిచాయి. పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా ఐదు ద్విచక్రవాహనాలను దహనం చేసిన ఘటన ఇళ్లలో పార్కింగ్ అవకాశం లేక వాహనాలు బయట నిలిపేవారి గుండెల్లో గుబులు పుట్టించింది. స్టేషన్ వెనుక వీధిలో ఒక మోటార్‌సైకిల్, వినాయకుడి గుడి వీధిలో రెండు, సౌదాగర్ వీధిలో ఒకటి, గుర్రాల చావిడి సమీపంలోని పాత హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ వద్ద మరో ద్విచక్రవాహనం ఆదివారం రాత్రి అగ్నికి ఆహుతయ్యాయి. వాహనాలను ఒకదాని తరువాత ఒకటి పావుగంట వ్యవధిలో తగలబెట్టినట్లు బాధితులు అందజేసిన సమాచారం బట్టి తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్ వెనుక వాహనం తగలబడుతున్న విషయం గమనించిన వాహనయజమాని భూపతి రాజేశ్వరరావు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందజేశారు. అగ్నిమాపక వాహనం వచ్చేసరికే బైక్ పూర్తిగా దహన మైంది. వినాయకస్వామి గుడి సమీపంలో, సౌదాగార్ వీధి, పాత గ్యాస్గౌడన్ వద్ద తగలబెట్టిన వాహనాలు ఎందుకు పనికిరాని పరిస్థితి. వినాయకస్వామి గుడి వీధిలో తగలబెట్టిన రెండో వాహనం మాత్రం పాక్షికంగా దహనమైంది. బాధితుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలాలకు వెళ్లి సమాచారం సేకరించారు. గుంటూరు నుంచి క్లూస్ టీమ్ ఎస్ఐ టి.మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు... ఘటన జరిగిన ప్రాంతాలన్నీ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఉండటం పోలీసులకు సవాలుగా మారింది. మద్యం మత్తులో ఆకతాయిలు చేసిన పనా.. అన్నీ ఒకరే చేశారా.. అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రెండు మూడు చోట్ల వాహనాలపై పెట్రోలు లేదా కిరోసిన్ పోసి తగలబెట్టి ఉండవచ్చుని క్లూస్ టీమ్ అనుమానం వ్యక్తం చేసింది. పాక్షికంగా వాహనం తగలబడిన చోట కేవలం పెట్రోలు ట్యాంకు పైపు లాగి దానికి నిప్పింటించినట్లు భావిస్తున్నారు.