అంతా అనుమానాస్పదం!
సవాల్‌గా మారిన ఉన్మాది హత్యోదంతం
పలు కోణాల్లో కేసు విచారిస్తున్న పోలీసులు
పోలీసుల అదుపులో మృతురాలి భర్త.. రాత్రికి విడుదల
కావలి అర్బన్: శుక్రవారం రాత్రి స్థానిక రాజీవ్‌నగర్ అరటితోటలో చోటుచేసుకొ న్న హత్యోదంతం పోలీసులకు సవాల్‌గా మారింది. ఉన్మాది శుక్రవారం సాయంత్రం సిమిలి నాగిరెడ్డి నివాసానికి వెళ్లి ఆధార్‌కార్డు ఇవ్వాల్సిందిగా కోరడంతో వెనుతిరిగిన సుశీలమ్మ, ఆమె కోడలు కవిత, చిన్నారులు దీక్షిత, వశిష్ట్‌లపై పాశవికంగా దాడిచేసిన విషయం విదితమే. కవిత అక్కడికక్కడే మృతిచెందగా సుశీ లమ్మ, చిన్నారులు నెల్లూరులో చికిత్సపొందుతున్నారు. విషయం తెలుసుకొన్న కవిత బంధువులు శనివారం నాగిరెడ్డి నివాసానికి చేరుకున్నారు. కవిత మృతికి భర్త వెంకటేశ్వరరెడ్డి, మామ నాగిరెడ్డి కారణమంటూ బంధువులు గొడవకు దిగబోగా పోలీసులు నివారించారు.
ఉన్మాది అంటూ అనుమానాలు
పోలీసులు ఈ కేసుపై పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కవిత భర్త వెంకటేశ్వరరెడ్డిని పోలీసులు తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అదేవిధంగా ఉన్మాద చర్యల కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. శివారు ప్రాం తాల్లో చివరిగా ఉన్న ఇంటిని ఎంపిక చేసుకొని పథకం ప్రకారం ఇంట్లోని సభ్యులందరిని హతమార్చే ఉన్మాది ఉదంతాలు గతంలో కూడా పలుచోట్ల జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. గుంటూరు జిల్లాలో గతంలో జరిగిన మాదిరిగా కావలిలో సంఘటనలు ఉన్నాయన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. ఈ ఘటనల ఆధారంగా అగంతకుడు ఒక పథకం ప్రకారం ఈ ఘాతుకాలకు పాల్పడుతున్న ట్లు తెలుస్తోంది. శివారుప్రాంతంలోని ఇంటిని టార్గెట్‌గా పెట్టుకొని పురుషులు లేని సమయంలో వచ్చి దాడికి పాల్పడుతుంటాడని చెబుతున్నారు.
శుక్రవారం కావలి తూర్పు శివారు ప్రాంతంలో జరి గిన దారుణ సంఘటనలో పాల్గొంది ఒకరా లేక అంతకన్నా ఎక్కువమంది ఉన్నారా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. పోలీసులు జాగిలాలు, క్లూస్‌టీమ్ రప్పించి అగంతకుల ఆనవాళ్లను గుర్తిస్తున్నారు. శనివారం ఆ ఇంటిలోని వస్తువులను పరిశీలించారు. ఇంటి సమీపాన పడివున్న ఒక వ్యక్తి ఫ్యాంట్‌ను కూడా తీసుకొ ని పరిశీలించగా దానిపె రక్తం మరకలు, జేబులో కారం కూడా ఉన్నట్లు గుర్తిం చారు.
ఆప్రాంతంలో అగంతకుడి పాదాల గుర్తులు కూడా సేకరించారు. నెల్లూరులో చికిత్సపొందుతున్న చిన్నారులు దీక్షిత, వశిష్టల పరిస్థితి మెరుగవుతుండగా సుశీలమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కవిత మృతదేహానికి స్థానిక ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఆతర్వాత భర్తను వదిలిపెట్టినట్లు తెలిసింది.