post-mortem
-
దమ్మాయిగూడ బాలిక మృతి కేసు.. పోస్టుమార్టం నివేదికలో కీలకాంశాలు
సాక్షి, మేడ్చల్: దమ్మాయిగూడ చెరువులో లభ్యమైన చిన్నారి ఇందు మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. గ్రూప్ ఆఫ్ డాక్టర్స్‌తో పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేశారు. నాలుగు పేజీల పంచనామాలో అధికారులు వివరాలు రికార్డ్ చేశారు. కాగా ఇందు పోస్టుమార్టం నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక ఊపిరితిత్తుల్లో నీరు గుర్తించిన వైద్యులు.. శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తేల్చారు. చెరువులో పడి నీరు మింగి చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే చెరువులో ఎవరైనా తోసేశారా..? తనే ఆడుకుంటూ పడిందా అనేది తేలాల్సి ఉంది. దమ్మాయిగూడలో ఉద్రిక్తత దమ్మాయిగూడ చౌరస్తాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాలిక మృతదేహంతో తల్లిదండ్రులు నిరసనకు దిగారు. పోస్టుమార్టం రిపోర్టు తమకు ఇవ్వాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందు మృతిపై స్పఫ్టత ఇవ్వాలని, చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అసలు ఏం జరిగింది? మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఇందు గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్‌కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్మాస్టర్ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో స్కూల్ హెడ్మాస్టర్, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్స్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్ స్వ్కాడ్స్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో గజ ఈతగాళ్లతో గాలించగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది. -
గుండెల నిండా దుఃఖం.. భుజంపై మేనకోడలి మృతదేహంతో..!
భోపాల్: కనీస మౌలిక సదుపాయలు అందక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్న హృదయవిదారక సంఘటనలు దేశంలో ఏదో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ద్విచక్రవాహనంపై, తోపుడు బండిపై, భుజాలపై మృతదేహాలను మోసుకుంటూ వెళ్లిన సంఘటనలు కలిచివేస్తున్నాయి. అలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని రద్దీ రోడ్డులో ఓ వ్యక్తి తన భుజాలపై మోసుకుటూ బస్టాప్‌కు వెళ్లారు. అందరితో పాటే బస్సులో మృతదేహాన్ని స్వగ్రామం చేర్చారు. ఈ హృదయవిదారక సంఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నాలుగేళ్ల చిన్నారి స్వగ్రామంలో ప్రమాదవశాత్తు మృతి చెందింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఛాతర్పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ, మృతదేహాన్ని తిరిగి ఇంటికి చేర్చేందుకు ఆసుపత్రిలో వాహనం లేదు. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు దుఃఖంలో ఉన్న ఆమె మేనమామ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. బస్టాప్ వరకు తన భుజాలపై మోసుకెళ్లాడు. రద్దీగా ఉన్న బస్‌లోనే మృతదేహంతో ఎక్కాడు. అయితే, ఆయన వద్ద బస్సు టికెట్ కొనేందుకు సైతం డబ్బులు లేకపోవటం అందరిని కలచివేసింది. మరో ప్రయాణికుడు టికెట్ కొనిచ్చాడు. ఆసుపత్రి నుంచి మృతదేహాలను తరలించేందుకు పట్టణాభివృద్ధి విభాగం ఏర్పాట్లు చేయాలని చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ లఖన్ తివారీ తెలిపారు. ఇలాంటి వాటిలోకి ఆసుపత్రి, వైద్యులను లాగొద్దని కోరారు. నాలుగు నెలల క్రితం సైతం ఛతార్పుర్ జిల్లాలో ఇలాగే నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లారు. దీంతో జిల్లాలో సదుపాయలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. బుధవారమే సింగ్రౌలి జిల్లాలో శిశువును బైక్ సైడ్ బాక్సులో తీసుకెళ్లటం సంచలనంగా మారింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. A man carried the body of his four-year-old niece on his shoulders and took a bus to his village because he could not get a hearse from a hospital, This comes nearly four months after a four-year-old girl's body was carried by her family on their shoulders. Both in Chhatarpur. pic.twitter.com/NXZUNODqUT — Anurag Dwary (@Anurag_Dwary) October 20, 2022 ఇదీ చదవండి: 75వేల మంది యువతకు ప్రధాని మోదీ దివాళీ గిఫ్ట్ -
పోస్ట్‌మార్టం చేయబోతుండగా లేచి కూర్చున్నాడు!!
Prisoner declared dead doctors wakes up: వైద్యులు కొంతమందిని కచ్చితంగా చనిపోతాడు అని నిర్ధారించిన తర్వాత కూడా బ్రతికి బట్టకట్టగలిగిన వాళ్లను చూశాం. పైగా వైద్యులు ఇది మిరాకిల్ లేదా దేవుడు చేసిన అద్భుతం అని చెబుతుండటం గురించి విన్నాం. కానీ ఒక వ్యక్తి చనిపోయాడని నిర్ధారించుకుని పోస్ట్ మార్టం చేయాలని సమయాత్తమవుతుండగా ఆ వ్యక్తి మేల్కొంటే ఎవ్వరైనా భయపడిపోవడం సహజం. అచ్చం అలాంటి సంఘటనే స్పెయిన్‌లో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...స్పెయిన్‌లో విల్లాబోనాలోని అస్టురియాస్ సెంట్రల్ పెనిటెన్షియరీలో ఉన్న గొంజాలో మోంటోయా జిమెనెజ్ అనే ఖైదీ అనారోగ్యానికి గురైయ్యాడు. దీంతో అతనిని ఓవిడోలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ మెడిసిన్‌కు తరలించారు. అయితే ఆన్-డ్యూటీ వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణుడు జిమెనెజ్ చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ మేరకు ఖైదీ చనిపోయినట్లు ప్రకటించినప్పుడు వర్తించే ప్రామాణిక ప్రియాన్ విధానంలో భాగంగా అతని కుటుంబానికి తెలియజేశారు. అంతేకాదు అతని శరీరం సైనోసిస్ సంకేతాలను చూపించిందని, ఆక్సిజన్ లేకపోవడం వల్ల చర్మం రంగు మారిందని వైద్యులు నివేదికలో పేర్కొనడం గమనార్హం. అయితే జిమెనెజ్ పోస్ట్‌మార్టం చేసేందుకు అతని శరీరంపై ప్రణాళిక బద్ధంగా నిర్వహించాల్సిన కోతల తాలుకా పెన్ గుర్తుల కూడా ఉన్నాయి. కానీ ఇంతలో జిమెనెజ్ వింతగా అరుస్తూ మేల్కొన్నాడు. దీంతో వైద్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. ఈ మేరకు ఆ వ్యక్తిని మరొక ఆస్ప్రతికి తరలించి తగిన వైద్యం అందించారు. ప్రసుత్తం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని స్పానిష్ జైలు అధికారులు తెలిపారు. (చదవండి: ఈ పార్క్‌లో మెరిసేదంతా బంగారమే!... ఔను! రూ. 87 లక్షల గోల్డ్ క్యూబ్!!) -
చివరి బస్సు
చీకటి మడుగు. చీకటి అపాయం. చీకటి పాపం.చీకటి తప్పు.సత్యాన్ని కనుగొనడానికి చివరి బస్సు బయలుదేరింది.చీకటిలో జరిగింది ‘సూర్యు’ని వెలుగుతో బయటపడింది. 07– 07– 2017.తారీఖులో చాలా ‘7’లు ఉన్నాయి.అందుకే ఆ రోజుకి ‘ఏడు’పుకి దగ్గర సంబంధం నిర్ణయించినట్టుంది విధి. పగతో రిగలిన ఓ గుండె చీకటి కాగితంపై రక్తసంతకం చేసింది.తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగిందీ సంఘటన. రాత్రి పది గంటలు.బెల్ట్‌షాప్ అనబడే ఆ మద్యం షాప్ దగ్గర జనం పలచబడ్డారు. అడపా దడపా కొనుక్కెళ్లేవారు వస్తున్నారు. తాగి వెళ్లేవారు అక్కడే కూర్చొని తాగుతున్నారు. ఒకరిద్దరు పక్కనే ఉన్న పర్మిట్ రూమ్‌లో కూర్చొని తాగి, తిని వెళుతున్నారు. షాప్‌కి కూతవేటు దూరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి తూలుకుంటూ వెళుతూ వెళుతూ కింద పడిపోయాడు.ఇలాంటి ఘటనలు ఆ షాప్ దగ్గర మామూలే! తాగి మత్తుతో పడిపోవడం, ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు లేచి ఇళ్లకి వెళ్లిపోవడం తరచూ జరుగుతుంటాయి.రోడ్డుకు ఓ వైపుగా పడి ఉన్న వ్యక్తిని చూసిన జనాలు ‘మందు ఎక్కువై ఉంటుంది’ అనుకుని వెళ్లిపోయారు. బెల్ట్ షాప్‌లోని పర్మిట్‌రూమ్‌లో పనిచేసే ఒకామె పడిపోయిన ఆ వ్యక్తిని దూరం నుంచే చూసి ఎక్కడిదక్కడ వదిలేసి పనుందని గబగబ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రి పదిన్నర దాటింది.పోలీస్‌స్టేషన్‌లో ఫోన్ మోగింది. ‘సార్, ఇక్కడి బెల్ట్ షాప్(మద్యంషాప్) దగ్గర ఓ మనిషి పడున్నాడు. అతని తల చుట్టూ రక్తం పేరుకుపోయి ఉంది’ అని సమాచారం చేరవేశాడు ఓ వ్యక్తి. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కిందపడున్న వ్యక్తిని పరిశీలించారు. తల చుట్టూ రక్తం ఇంకా పచ్చిగానే ఉంది. పక్కనే రాయి ఉంది. బహుశా మద్యం మత్తులో తూలి ఆ రాయిమీద పడుంటాడు తలకు దెబ్బతగిలింది ఆసుపత్రికి చేర్చుదాం.. అనుకున్న పోలీసులకు అచేతనంగా పడి ఉన్న ఆ వ్యక్తి శరీరం ప్రాణం లేదని స్పష్టం చేసింది. అతని వద్ద ఏమైనా ఆధారాలు ఉంటాయేమో అని వెతికారు. కానీ, ఎలాంటి ఆధారం దొరకలేదు. బెల్ట్‌షాప్ ఓనర్ని అడిగారు. తమకేమీ తెలియదని చెప్పాడు అతను. అక్కడున్న సిబ్బందీ అదే విషయం చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తి ప్రమాద సంఘటనగా కేసుగా నమోదు చేసుకొని పోలీసులు బాడీని పోస్టుమార్టంకి పంపించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. అది చూసి పోలీసులు షాక్ అయ్యారు.ఎడమ వైపు కణతిలో తుపాకీ గుండు దూసుకెళ్లడం కారణంగా ఆ వ్యక్తి మరణించాడు అని ఉంది రిపోర్ట్‌లో. పోలీసులు అలర్ట్ అయ్యారు.రాయి తగిలి ప్రమాదవశాత్తు మరణించాడని అనుకున్నారు. అలాంటిది పిస్టల్‌తో చంపేటంత ప్రొఫెషనల్స్ ఎవరై ఉంటారు? ఇది ఏదైనా ముఠాకు సంబంధించిన ఇష్యూనా? ఇంతకీ చనిపోయిన ఈ వ్యక్తి ఎవరు? ఇతని వద్ద ఫోన్ ఆధారం కూడా లేదు. నిద్రాహారాలు లేవు పోలీసులకు.విచారణ ముమ్మరమైంది. బెల్ట్‌షాప్ దగ్గర సంఘటన జరిగింది కాబట్టి అక్కడ నుంచే విచారణ మొదలుపెట్టారు పోలీసులు. బెల్ట్ షాప్ ఓనర్ని, అందులో పనిచేసే సిబ్బందినీ పిలిపించారు.అందరిదీ ఒకే మాట.. ‘ఎలా జరిగిందో, ఎవరు చేశారో మాకు తెలియదు’ అన్నారు. బెల్ట్‌షాపు పక్కనే ఉండే పర్మిట్ రూమ్‌లో పనిచేసే ఆమె వంతు వచ్చింది. బెరుకుగా చూస్తున్న ఆమెను అనుమానంగా చూశారు పోలీసులు. ‘ఏమైందో నీకు తెలుసు. విషయం చెప్పు’ గద్దించాడు ఎస్సై. ‘నాకేం తెలియదు సార్! భోజనం పెట్టమని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారికి అన్నం పెట్టాను. మాటల్లో వాళ్లు సూర్యాపేటకు వెళ్లడం గురించి మాట్లాడుకోవడం వినిపించింది. అందులో ఒకతని దగ్గర తుపాకీ ఉంది. అన్నం తిని వాళ్లు వెళ్లిపోయారు. రూమ్ అంతా శుభ్రం చేసే పనిలో పడిపోయాను. బయట చెత్త వేయడానికి వచ్చినప్పుడు ఏదో పేలిన శబ్దం చిన్నగా వచ్చింది. ఆ శబ్దం వచ్చిన వైపుగా చూస్తే ఆ దారిలో ఓ వ్యక్తి పడిపోయున్నాడు. ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్ల దగ్గర తుపాకీ ఉందని గుర్తుకు వచ్చింది. భయమేసింది. పని మానేసి ఇంటికి వెళ్లిపోయాను’ భయపడుతూనే చెప్పింది ఆమె. ‘సార్.. ఇ ఇద్దరు ఎవరో.. ఎలా పట్టుకోవడం?’ అన్నారు సిబ్బంది. ఎస్సై క్షణం సేపు ఆగి.. ‘సూర్యాపేట. ఇదే క్లూగా ఈ కేసు చేధించాలి’ దృఢంగా అన్నాడు ఎస్సై. ‘ఎస్ సర్!’ అన్నారు సిబ్బంది.హత్య జరిగింది లేట్‌నైట్. తెలిసిన వివరాల ప్రకారం ఆ వ్యక్తులిద్దరి వద్దా సొంత వాహనం లేదు. వాళ్లు సూర్యాపేటకు ఏదో పద్ధతిలో వెళ్లి ఉంటారు. హత్య చేసిన వాళ్లు ఇక్కడే ఉండరు..’ అంటూ బయల్దేరాడు ఎస్సై. అతనితో పాటూ అతని సిబ్బందీ కదిలారు. బస్‌స్టేషన్‌కు వెళ్లారు పోలీసులు.సూర్యాపేటకు వెళ్లే దారిలో ఏయే గ్రామాలు ఉన్నాయి చివరి బస్సు ఎన్ని గంటలకు వెళ్లింది? అనే దిశగా ఎంక్వైరీ మొదలుపెట్టారు. చివరి బస్సు వెళ్లిన టైమ్ వివరాలు డిపోలో తీసుకున్నారు. ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ని విచారించారు.కండక్టర్ వివరాలు చెబుతూ ‘సార్, నిన్న రాత్రి చివరి బస్సుకు పది మందికి మించి జనం లేరు. మీరు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం ఇద్దరు మగవాళ్లు సూర్యాపేటలో దిగారు. అయితే, వారితో పాటు ఒక ఆడమనిషి కూడా ఉంది. సూర్యాపేటలో దిగేవారికి టికెట్ ఆమే తీసుకుంది. రెండు టికెట్లు వాళ్లకిచ్చేసి ఆమె మద్దిరాల స్టేజ్‌మీద దిగిపోయింది’ చెప్పాడు అతను.మహబూబాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్లేదారిలో మద్దిరాల అనే గ్రామ స్టేజ్ ఉంది. ఆ ఊరు చేరుకోవాలంటే హైవే నుంచి రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి. అంత చీకట్లో ఆ ఊరికి వెళ్లిన ఆడమనిషి ఎవరు? సూర్యాపేటకు వెళ్లినవారికి ఆమె టికెట్ ఎందుకు తీసుకుంది?! ఎంక్వైరీ వేగవంతమైంది. పోలీసులు మద్దిరాల బయల్దేరారు. ఆ ఊరి వాళ్లను కలిసి, చనిపోయిన వ్యక్తి ఫొటోలు చూపించారు. ‘సార్.. ఇతనిది ఇక్కడికి దగ్గరలోనే ఉండే దంతాలపల్లి ఊరు. పేరు మల్లయ్య’ చెప్పారు ఒకరిద్దరు గ్రామస్తులు.‘ఇతని గురించి వివరాలు ఇంకేమైనా తెలుసా!’‘ఇతను చేసే పనులైతే ఏమీ లేవు. భార్య ద్వారా వచ్చిన ఆస్తిని అమ్ముకుని బలాదూర్ తిరుగుతుంటాడు. జల్సాలు ఎక్కువ. డబ్బుల కోసం ఒకరిద్దరితో గొడవలు కూడా ఉన్నాయి’ చెప్పాడు ఆ ఊరి పెద్ద. ‘రెండు నెల్ల కిందట ఈ ఊళ్లోనే ఉండే శేషమ్మ(పేరు మార్చాం)తో పెద్ద గొడవ అయ్యింది సార్. శేషమ్మ తన బావమరిది యాదగిరిని పెళ్లి చేసుకుందని ఆమెతో గొడవపడ్డాడు’ చెప్పాడు ఆ ఊళ్లో ఉండే ఇంకో అతను. పోలీసుల వరకు రాని ఆ తగాదా గురించి తెలుసుకోవడానికి శేషమ్మ ఇంటి తలుపు తట్టారు పోలీసులు.అయితే, ఇంట్లో శేషమ్మ లేదు. తాళం వేసి ఉంది. గ్రామస్తులు చెప్పిన వివరాలతో దంతాలపల్లి వెళ్లారు పోలీసులు. ఆ ఊళ్లో యాదగిరి ఇంటి తలుపు తట్టారు. ‘ఎవరూ..’ అంటూ శేషమ్మ తలుపు తీసింది. పోలీసులను చూసిన శేషమ్మ షాక్ అయ్యింది.ఆమె షాక్ నుంచి తేరుకునేలోపే శేషమ్మ చేతులకు బేడీలు వేశారు పోలీసులు. విచారణ మొదలయ్యింది. ఒక్కో విషయం వెలుగులోకి వచ్చింది.. పోలీసులు శేషమ్మ చెప్పింది వింటూ వున్నారు. మద్దిరాలకు చెందిన శేషమ్మ భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకో కూతురు ఉంది. ఒంటరిగా ఉంటున్న శేషమ్మకు దంతాలపల్లికి చెందిన యాదగిరితో పరిచయం ఏర్పడింది. మల్లయ్య బావమరిదే యాదగిరి. శేషమ్మ, యాదగిరి ఇటీవల గుళ్లో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయానికి మల్లయ్య ఊళ్లో లేడు. ఊరికి వచ్చి, విషయం తెలిసిన మల్లయ్య కోపంతో ఊగిపోయాడు. అమాయకుడైన తన బావమరిదిని శేషమ్మ వల్లో వేసుకుని పెళ్లి చేసుకున్నదని, అతని ఆస్తి కొట్టేయడానికే ఈ పన్నాగం పన్నిందని గొడవకు దిగాడు. శేషమ్మకు, మల్లయ్యకు మాటా మాటా పెరిగింది. యాదగిరి వారిస్తున్నా వినకుండా శేషమ్మను జుట్టు పట్టుకొని నడివీధిలోకి ఈడ్చుకొచ్చాడు మల్లయ్య. ఊరి జనం ముందు శేషమ్మను అరుస్తూ కొట్టాడు. ‘యాదగిరిని వదిలేయకపోతే నిన్నూ, నీ కూతురుని ఇద్దరినీ చంపేస్తా’ హెచ్చరించాడు మల్లయ్య. అవమానంతో బిక్కచచ్చిపోయింది శేషమ్మ. బయటకు ఎక్కడికెళ్లినా దారి కాచి మరీ వార్నింగ్‌లు ఇచ్చేవాడు. బిడ్డను ఒంటరిగా బయటకు పంపించాలన్నా భయంతో వణికిపోయేది శేషమ్మ. ‘మల్లయ్య అసలే మూర్ఖుడు. నన్నూ, నా బిడ్డను చంపడానికి వెనకాడడు. రోజూ ఎప్పుడు ఛస్తానో అని భయపడేకన్నా ముందు నేనే అతన్ని చంపేస్తే..’ అనే ఆలోచనకు వచ్చింది. మల్లయ్యతో పాత కక్షలు ఉన్నవారు ఆ ఊళ్లో నలుగురు ఉన్నారు. అవన్నీ భూ తగాదాలే! వెళ్లి వారిని కలిసింది శేషమ్మ. మల్లయ్య ఎక్కడెక్కడ ఒంటరిగా చిక్కుతాడో వివరాలు సేకరించింది. మల్లయ్యతో శత్రుత్వం ఉన్న ఆ నలుగురు మరో ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తం ఏడుగురు మల్లయ్య హత్యకుపథకం వేశారు. మొహబూబాబాద్లో పని ఉందని మల్లయ్య వెళ్లిన సంగతి శేషమ్మ తెలుసుకొని, మిగతావారికి సమాచారం అందించింది. తనూ టౌన్‌కి బయల్దేరింది.సాయంత్రం దాకా స్నేహితులతో తిరిగిన మల్లయ్య బెల్ట్ షాప్ వద్దకు మాత్రం ఒక్కడే వెళ్లాడు. మందు తీసుకొని, అక్కడ కూర్చొని మద్యం సేవించాడు. అతన్ని అనుసరిస్తున్న ‘ఇద్దరు’ వ్యక్తులు మందు తీసుకొని, పర్మిట్‌రూమ్‌లో చేరి, తింటూ మల్లయ్యను గమనిస్తూ ఉన్నారు. ‘పని’ పూర్తి కాగానే ముందే అనుకున్న విధంగా బస్‌స్టాప్‌కు చేరుకున్నారు ఇద్దరు. అక్కడే శేషమ్మతో పాటు మరో నలుగురు కలిశారు. ఏడుగురూ కలిసి రాత్రి చివరి బస్సుకు బయల్దేరారు. ఆ రాత్రి మద్దిరాలలో శేషమ్మ దిగింది. ఆ తర్వాత దంతాలపల్లిలో నలుగురు దిగారు. ఇద్దరు సూర్యాపేటలో దిగారు. నేరం ఏదైనా కావచ్చు. తప్పించుకోవడం సాధ్యం కాదు. జీవితంలో ఎవరైనా ఇబ్బంది పెడితే రక్షించడానికి చట్టం ఉంది. ఆ సంగతి మరిచి సొంత నిర్ణయాలు తీసుకుంటే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. – నిర్మలారెడ్డి -
2x3= జైలు
ఒక కత్తి ఎన్ని అంగుళాల పొడవు? అది గొంతు మీద ఏర్పరిచే అడ్డు గీత ఎన్ని అంగుళాల పొడవు? ఒక దురాలోచన ఎన్ని అంగుళాల పొడవు?చట్టం నుంచి పారిపోయే దూరం ఎన్ని అంగుళాల పొడవు. రెండు అంగుళాల వెడల్పు, మూడు అంగుళాల వెడల్పు ఉన్న ఒక చిన్న క్లూ నిందితుణ్ణి పట్టిచ్చింది. అంగుళం కూడా కదలనివ్వక జైల్లో కూర్చోబెట్టింది. ఇంట్లో అంగుళం అంగుళం క్షుణ్ణంగా పరిశీలించింది స్క్వాడ్ బృందం. రోజంతా పట్టింది. కానీ, ఎలాంటి ఆధారమూ దొరకలేదు. సోఫాలు జరుపుతూ ఉంటే కొన్ని విజిటింగ్ కార్డ్స్ కింద పడి కనిపించాయి. దూరంగా మరో కార్డ్ పడి ఉంది. 2004. డిసెంబర్ నెల చలి ఎక్కువగా ఉండటం వల్ల ఉదయం పది గంటల ప్రాంతంలో కూడా చల్లగా ఉంది. సూర్యుడు రాలేదు. వెలుతురు తక్కువగా ఉంది. కానీ ఇదేమీ పట్టని టెలిఫోన్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో అదే పనిగా మోగుతోంది. ఆఫీసర్ ఎత్తి ‘హలో’ అన్నాడు. అవతలి వైపు ఎవరో ‘సార్.. సార్’ అన్నారు.ఆఫీసర్ అలర్ట్ అయ్యాడు.‘కంగారు పడకుండా చెప్పండి’ ‘సార్... మరి.. మా యజమాని గారిని, వంటవాణ్ని ఎవరో చంపేశారు సార్’ కంగారుగా చెప్పాడు ఆ వ్యక్తి. ఖరీదైన ఆ అపార్ట్మెంట్ మీద ఎండ పలుచగా కాస్తూ ఉంది.ఆఫీసర్ తన సిబ్బందితో దిగాడు.సెక్యూరిటీ దగ్గరే ఫోన్ చేసిన వ్యక్తి కాచుకుని ఉన్నాడు.అతడు ఫ్లాట్ ఓనర్ దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది. పేరు అస్ఘర్.‘రండి సార్ వెళదాం’ అని లిఫ్ట్‌లో తీసుకెళ్లాడు.అడుగుపెడుతూనే తెలుస్తూ ఉంది అది ఖరీదైనవాళ్ల అపార్ట్మెంట్ అని.లోపల రెండు శవాలు పడి ఉన్నాయి. ఒకటి యజమానిది. రెండవది వంటతనిది. గొంతు కోసి పడేశారు. ఒక సూట్ కేస్ తెరిచి ఉంది. అంటే డబ్బు కాజేసి ఉండాలి. కింద కారు కూడా లేదని డ్రైవర్ చెప్పాడు. అంటే దోపిడీ దొంగల పని అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.హత్యకు గురైన వ్యక్తి పేరు రవికుమార్ (పేరు మార్చాం). పారిశ్రామికవేత్త. ఓ స్టీల్ కంపెనీ ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. భార్యాపిల్లలు ఢిల్లీలో ఉంటున్నారు. అంత విశాలంగా ఉన్న ఆ ఇంట్లో యజమాని, వంటవాడు ఇద్దరే ఉంటారని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ‘లిఫ్ట్ ఆపరేటర్, వాచ్‌మన్, డ్రైవర్లను పట్టుకురండి’ అని పోలీసులను పంపించాడు ఆఫీసర్. వాళ్లను ఎన్నివిధాలుగా ప్రశ్నించినా ఏమీ తేలలేదు.మృతదేహాలను పోస్ట్‌మార్టంకి తరలించి, ఇంటికి సీల్ వేశారు. రవికుమార్ ఇటీవలే రెండు కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ డీల్ చేశాడని తెలిసింది. ఆ డబ్బు కోసం ఎవరైనా ఈ పని చేశారా? దోపిడీ దొంగలకు ఆ సమాచారం ఎవరు ఇచ్చి ఉంటారు? ఎంత విచారించినా ఏమీ తేలలేదు. ఢిల్లీ నుంచి కుటుంబ సభ్యులు వచ్చారు. వారూ ఎవరి మీదా అనుమానం వ్యక్తం చేయలేదు. ఆరు నెలలు గడిచిపోయాయి. రవికుమార్ కుటుంబం ఢిల్లీ నుంచి హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌కి తరచూ వస్తూనే ఉంది. తమ కుటుంబ పెద్దను చంపిందెవరో తెలుసుకోమని అధికారులను కోరుతూనే ఉంది. అంతే కాదు ప్రెస్‌మీట్ కూడా పెట్టేసరికి డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి పెరిగింది.దీంతో కేసు సీసీఎస్ పోలీసుల అధీనంలోకి వెళ్లింది. కేసును ఛేదించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు సీసీఎస్ పోలీసులు. సీజ్ చేసి ఉంచిన ఘటనా స్థలిని పరిశీలించడానికి ఓ టీమ్ వెళ్లింది. పటాన్‌చెరులోని ఫ్యాక్టరీ వద్ద ఆరా తీయడానికి మరో టీమ్ బయల్దేరింది. ఇంట్లో అంగుళం అంగుళం క్షుణ్ణంగా పరిశీలించింది స్క్వాడ్ బృందం. రోజంతా పట్టింది. కానీ, ఎలాంటి ఆధారమూ దొరకలేదు. సోఫాలు జరుపుతూ ఉంటే కొన్ని విజిటింగ్ కార్డ్స్ కింద పడి కనిపించాయి. దూరంగా మరో కార్డ్ పడి ఉంది. టీమ్ మెంబర్ ఆ కార్డ్స్ చూశాడు. అన్నీ బిజినెస్ కార్డ్స్. వ్యాపారవేత్తల ఇళ్లలో అలాంటి విజిటింగ్ కార్డ్స్ సాధారణమే. టీమ్ మెంబర్ అక్కడి నుంచి వెళ్లిపోబోయి మూలన పడి ఉన్న కార్డును చేతుల్లోకి తీసుకున్నాడు. దాని మీద చందానగర్‌లోని ఓ చిన్న లాడ్జి పేరు ఉంది. సంపన్నుడైన రవి కుమార్ ఇంట్లో ఇలాంటి చీప్ లాడ్జికి చెందిన విజిటింగ్ కార్డు ఉండటమేంటి?! విజిటింగ్ కార్డ్. రెండు అంగుళాల వెడల్పు మూడు అంగుళాల పొడవు ఉన్న కార్డ్. ఈ విజిటింగ్ కార్డే ఈ కేసులో ముఖ్యమైన క్లూనా? వెంటనే చందానగర్‌లోని ఆ లాడ్జికి పోలీసు వాహనాలు బయల్దేరాయి. లాడ్జికి వెళ్లిన బృందం ఘటన జరిగిన డిసెంబర్ 23కి వారం ముందు, తర్వాత ఎవరెవరు బస చేశారో వివరాలు తీశారు.రెండు పేజీల అవతల ‘రవి స్టీల్ ఇండస్ట్రీస్ డ్రైవర్ గిరిరాజ్, అతడి స్నేహితులు’ అని ఉంది.గిరిరాజ్ ఎవరు? కూపీ లాగారు.అతడు రవి కుమార్‌కు నమ్మినబంటు. ఫ్యాక్టరీ డ్రైవర్. అతణ్ణి ఎలా అనుమానించాలి? అయినా సరే వెంటనే గిరిరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాని అతడు ఫోన్ చేసే సరికి ఢిల్లీలో ఉన్న రవికుమార్ కుటుంబీకులు హుటాహుటిన వచ్చి పోలీసులకు ఎదురు తిరిగారు. ‘ఇతను ఇక్కడే ఉండి మా మంచి చెడ్డ చూస్తున్న వ్యక్తి. ఎన్నాళ్లుగానో మా కుటుంబసభ్యుల్లో ఒకడిగా కలిసిపోయాడు. ఇతన్ని మీరెందుకు అరెస్టు చేస్తున్నారు’ అని అడిగారు. కాని పోలీసులు వినలేదు.గిరిరాజ్ నుంచి నిజం కక్కించారు. రవి స్టీల్ ఇండస్ట్రీస్‌లో డ్రైవర్‌గా పని చేసే హరియాణా వాసి గిరిరాజ్. పనుల నిమిత్తం తరచు ఇంటికి వస్తుండే గిరిరాజ్‌కు అస్ఘర్ లీవ్ పెట్టినప్పుడల్లా డ్రైవర్ బాధ్యతలను అప్పజెప్పేవాడు రవి కుమార్. యజమాని కుటుంబం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా వారికీ డ్రైవర్‌గా పని చేస్తూ పరిచయం పెంచుకున్నాడు. ఈ సమయంలోనే రవికుమార్ రియల్ ఎస్టేట్‌లో భాగంగా శంషాబాద్‌లో భూమి అమ్మి రూ. 2 కోట్లకు పైగా డబ్బు ఇంట్లో పెట్టుకోవడం గిరిరాజ్ దృష్టిలో పడింది. వెంటనే హరియాణా నుంచి నలుగురు స్నేహితులను రప్పించాడు. వీరిని చందానగర్‌లోని ఓ లాడ్జిలో ఉంచి అదును కోసం ఎదురు చూశాడు. 2004 డిసెంబర్ 22. ఆ రోజు రాత్రి పదిన్నరకు రవి కుమార్‌ని ఇంట్లో దించిన డ్రైవర్ అస్ఘర్ కారును సెల్లార్లో పార్క్ చేసి, వెళ్లిపోయాడు. 11 గంటల సమయంలో అనుచరులతో కలిసి రవికుమార్ ఫ్లాట్‌కు వచ్చాడు గిరిరాజ . తలుపు కొట్టడంతో వంట మనిషి సంపత్‌రావు ఓపెన్ చేశాడు. ఒక్కసారిగా ఐదుగురూ లోనికి ప్రవేశించడంతో షాక్‌కు లోనయ్యాడు. తేరుకునేలోపే కత్తులతో బెదిరిస్తూ దుండగులు హాల్లోకి ప్రవేశించారు. సోఫాలో రిలాక్స్డ్గా టీవీ చూస్తున్న రవికుమార్ దుండగులను చూడటంతోనే పరిగెత్తబోయాడు. కాని వారు అతని మీద దాడి చేసి గొంతు కోసేశారు. షాక్‌లో ఉన్న సంపత్ రావు కంఠాన్నీ కర్కశంగా కోసేశారు. గొంతు తెగి తీవ్రరక్త స్రావం అవుతున్న రవికుమార్‌ని దుండగులు హాల్ నుంచి బెడ్రూమ్ వరకు లాక్కువెళ్లారు. అక్కడి లెదర్ సూట్‌కేసులో 35 లక్షలు ఉన్నాయి. వాటిని తీసుకుని దోపిడి దొంగల మీద అనుమానం రావడానికి రవికుమార్కి చెందిన స్కోడా కారు కూడా తీసుకువెళ్లారు. కారును శివార్లలో విడిచిపెట్టేసి డబ్బుతో హరియాణా పారిపోయారు. గిరిరాజ్ మాత్రం ఆ డబ్బులో నుంచి రూ.10 వేలు తీసుకుని ఏమీ ఎరుగనట్లు రూమ్‌కు వెళ్లిపోయాడు. మిగిలిన డబ్బు తర్వాత తీసుకోవాలని అతని ప్లాన్. కాని చివరకు ఆ పది వేలే అతనికి మిగిలాయి. పదివేల మొత్తానికి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు గిరిరాజ్.నేరం నిరూపణ కావడంతో కోర్టు ముద్దాయిలకు జీవితఖైదు విధించింది. నమ్మిన కుటుంబాన్ని వంచించి, ఆధారాలేవీ లేవని నిబ్బరంగా ఉన్న గిరిరాజ్‌ను ఓ చిన్న విజిటింగ్ కార్డ్ పట్టించింది. నేరస్తులు ఎంత గొప్పగా పథకాలు వేసినా తప్పించుకోలేరని మరోసారి రుజువైంది. – శ్రీరంగం కామేశ్ -
శ్రీదేవి కేసు: మనం ఏమీ చేయలేం!
దుబాయ్: ప్రఖ్యాత సినీ నటి శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైకు తరలించే విషయంలో జరుగుతున్న ఆలస్యంపై దుబాయ్‌లోని భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి నిస్సహాయత వ్యక్తం చేశారు. పార్థీవదేహాన్ని అప్పగించే వరకు ఏమీ చేయలేమని ఆయన అన్నారు. వీలైనంత తొందరగా శ్రీదేవి భౌతికకాయాన్ని స్వదేశం తరలించేందుకు దుబాయ్ ప్రభుత్వ యంత్రాంగంతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. వదంతులు వద్దు శ్రీదేవి లాంటి సెలబ్రిటీ చనిపోయినప్పుడు మీడియాకు ఆసక్తి సహజమని, వదంతులు వ్యాపింపజేయడం ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆయన పేర్కొన్నారు. శ్రీదేవి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని.. వారి బాధను పంచుకుంటున్నామని ట్వీటర్ ద్వారా తెలిపారు. ఈలాంటి కేసుల్లో చట్టప్రకారం అన్ని ప్రక్రియలు పూర్తి చేయడానికి రెండుమూడు రోజులు పడుతుందన్నారు. శ్రీదేవి ఎలా చనిపోయిందనేది నిపుణులు తేలుస్తారని చెప్పారు. రీపోస్టుమార్టంకు అవకాశం? శ్రీదేవి భౌతికకాయానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించే అవకాశం లేకపోలేదని తెలుగు మహిళా న్యాయవాది అనురాధ వొబ్బిలిశెట్టి తెలిపారు. ప్రవాసుల సహజ, అసహజ మరణాల్లో న్యాయప్రక్రియ అందరికీ ఒకేలా ఉంటుందన్నారు. లోతుగా దర్యాప్తు అవసమని భావిస్తే రీపోస్టుమార్టంకు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశిస్తుందని చెప్పారు. అనుమానాలు నివృత్తి కాకుండా భౌతికకాయాన్ని స్వదేశానికి తరలించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒప్పుకోదని స్పష్టం చేశారు. -
చిరుతకు పోస్టుమార్టం
నిజామాబాద్ అగ్రికల్చర్(నిజామాబాద్ అర్బన్) : నవీపేట్ మండలంలోని అబ్బాపూర్(ఎం) గ్రామీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చిరుత పులికి జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో జిల్లా పశువైద్యాధికారి కార్యాలయంలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాదంలో పులి పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తులకు రంధ్రం పడి తీవ్ర రక్తస్రావం జరగడంతో మృతిచెందినట్లు వైద్యులు రాకేశ్, ఖాజా కైసర్, అంకిత తెలిపారు. చిరుతపులి వయసు సుమారు 5 నుంచి 6 ఏళ్లు ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం కళేబరాన్ని అటవీ రేంజ్ అధికారి రవి మోహన్ భట్, ఎఫ్డీఓ వేణుబాబుకు అప్పగించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం రిజర్వ్ ఫారెస్ట్‌లో చిరుత కళేబరాన్ని అటవీశాఖ అధికారులు దహనం చేశారు. -
శవ..శవా!
జీవితంలో ఎన్నోసార్లు గాట్లు పడతాయి. వాటిల్లో... కడుపు కోత ఉంటుంది. గుండె కోతా ఉంటుంది. ప్రతి బాధా ఒక రంపపు కోతే! మరి.. చనిపోయిన తర్వాత కూడా.. కోత తప్పకపోతే? శివ శివా! ప్రాణం లేదు కాబట్టి... పంచేంద్రియాలు శాశ్వత నిద్రలో ఉంటాయి కాబట్టి కోత తెలియదు. కానీ కోసే వ్యక్తికి ఆ బాధ తెలుస్తుంది. పోస్ట్‌మార్టమ్ అనేది.. శవాల్ని కోసి, నిజాల్ని తీసే వృత్తి. అక్కడ దైవం కనిపిస్తుందా? శవ శవా... కనిపిస్తుంది! మార్చురీలో దైవత్వాన్ని చూడగలమా?! ఈ సందేహంతో గాంధీ ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఆవరణలోకి అడుగుపెట్టినప్పుడు ఒక విధమైన వైరాగ్య భావన మనసును తాకింది. ఫేస్ మాస్క్ కట్టుకుని మార్చురీ రూమ్ వైపుగా వెళ్లాం. ఆ గదిలోపలకు చూడగానే గుండె గతుక్కుమంది. వరుసగా బల్లల మీద శవాలు! వాటికి పోస్టుమార్టం చేస్తూ డాక్టర్లు, వర్కర్లు కనిపించారు. అగ్నిప్రమాదంలో కాలిన శరీరానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న డాక్టర్ లక్ష్మణ్రావుని పలకరించాం. ఎన్నో సందేహాలను వ్యక్తం చేశాం. పోస్టుమార్టంలో నిజాలను ఎలా నిర్ధారిస్తుంటారు? లక్ష్మణ్‌రావు: ఇటీవల ప్రమాదవశాత్తు ఒకతను లారీ మీద నుంచి కిందపడి చనిపోయాడని పోలీసులు పంచనామా రాసి శవాన్ని మా దగ్గరకు తీసుకువచ్చారు. పోస్టుమార్టంలో తెలిసిన నిజమేంటంటే.. అతని గొంతు నులిమి ఎవరో లారీ నుంచి కిందకు తోసేశారని. ఈ ఆధారాల ప్రకారం పోలీసులు నిజాలను రాబడితే... అతని బావమరిదే ఈ పనిచేశాడని రుజువయ్యింది. ఇలాగే మొన్న చాందినీ జైన్ కేసు. ఆమె ఎలా చనిపోయిందో పోలీసులకు అర్థం కాలేదు. పై నుంచి పడిపోయిన కేసుగా పంచనామాలో రాసిచ్చారు. కానీ, పైనుంచి పడిపోతే ఆ బాడీ మీద ఎలాంటి గాయాలు లేవు. కొన్ని ఆనవాళ్లను బట్టి హత్య కేసుగా చెప్పాం. మేం ఏది చెప్పామో అలాగే జరిగింది. రేప్ కేసుల్లోనూ ఇలాంటివి తెలుస్తుంటాయి. శవం ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. దీని వల్ల మరో నేరం జరగకుండా, మరో నేరస్థుడు తయారుకాకుండా, నేరస్థుడికి తగిన శిక్ష పడేలా మేం సహాయపడతాం. కొన్ని వరదలు, బస్సు ప్రమాదాలు లాంటివి జరిగాయనుకోండి. అలాంటి టైమ్‌లో చాలా మంది చనిపోతుంటారు. వారి శరీరాలు ముక్కలు ముక్కలు అయిపోతుంటాయి. ఎవరి బాడీ ఎవరిదో కూడా అలాంటి సందర్భాల్లో తెలియదు. ఫలానా మనిషి అని మేం నిర్ధారణ చేస్తేనే ఆ కుటుంబానికి నష్టపరిహారం, ఇన్సూరెన్స్ వంటివి అందుతాయి. కర్మకాండలు చేసుకోగలుగుతారు. సాధారణంగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంటే బయటంతా ‘వీళ్లు శవాలను కోస్తారు’ అనుకుంటారు. కానీ, ఇక్కడ చాలా వర్క్ ఉంటుంది. ఆధారాలను ఎలా వెలికితీస్తారు, ఎలాంటి వర్క్ ఉంటుంది? ఒక వ్యక్తి విషం తీసుకొని చనిపోయాడను కోండి.. నోటి నుంచే ఆ ద్రవం కడుపులోకి వెళ్లాలి. అక్కణ్ణుంచి జీర్ణమై బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా లివర్‌కి, వ్యర్ధ పదార్థాలు కిడ్నీకి చేరుతాయి. ఈ మెకానిజమ్ కోసం.. కడుపు, బ్లడ్, లివర్, కిడ్నీ, యూరిన్,.. ఇలా చిన్న చిన్న పార్ట్స్ శరీరం నుంచి తీసి ల్యాబ్‌కి పంపిస్తాం. రేప్ కేస్ అయితే.. జనరల్ ఫిజికల్ ఎగ్జామి నేషన్ చూస్తాం. శరీరం మీద గాట్లు, బైట్స్, వెజైనల్ పార్ట్ దగ్గర సెమన్, బ్లీడింగ్ వంటివి బట్టి రేప్కేస్గా నిర్ధారిస్తాం. మంటల్లో కాలిపోతే.. పుర్రెను బట్టి ఆడా–మగ, జంతువా.. అనేది చెబుతాం. బాగా డీ కంపోజ్ అయిన, తవ్వి తీసిన శవాలు ఉంటాయి. భాగాలన్నీ సపరేట్ అయిపోయుంటాయి. అప్పుడు బోన్స్ నుంచి ఆధారాలు సేకరిస్తాం. చావు తర్వాత దేహాన్ని ఆత్మ వదిలిపోదు ఆ దరిదాపుల్లోనే ఉంటుందని కొంతమంది సైంటిస్టులు సైతం చెబుతుంటారు. మీకు అలాంటి అభిప్రాయం ఉందా? దేవుడు ఉన్నప్పుడు దెయ్యాలు, ఆత్మలు కూడా ఉంటాయి. కానీ, ఇక్కడ అలాంటివేవీ మేం చూడలేదు. కానీ, రాత్రిపూట పోస్టుమార్టం చేయం. ఒకవేళ తప్పనిపరిస్థితి వస్తే పోలీసులు, మిగతా సిబ్బంది ఉంటారు. ఇక్కడ ఉన్నంతసేపే ఇలా ఉంటుంది. ఇది దాటితే నా ప్రపంచం వేరేగా ఉంటుంది. ఇదే లైఫ్‌ని కంటిన్యూ చేయగలిగితే ఇన్నేళ్లు నేనుండేవాణ్ణి కాదేమో! ఆత్మలు ఉన్నాయంటు న్నారు. పోస్టుమార్టం చేసే ముందు ధైర్యం కోసం ఇంట్లో పూజ చేసి వస్తారా? పోస్ట్ మార్టం తర్వాత మనసు ప్రశాంతంగా ఉండటానికి ఏమైనా పద్ధతులు అవలంబిస్తారా? ఇంట్లో చేసే అన్ని పూజల్లో పాల్గొంటాను. అలాగని పూజ చేసి మార్చురీకి రావాలనే నియమం ఏమీ లేదు. సాధారణంగా ఎవరైనా చనిపోతే చూడ్డానికి వెళ్లినవారు తిరిగి నేరుగా ఇంటికి వచ్చి తలారా స్నానం చేస్తారు. అలాగే చేయాలనే నియమం పెట్టుకోం. కానీ, బంధువులో, మిత్రులో చనిపోయినప్పుడు చూసొచ్చిన తర్వాత అలా స్నానం చేయడం ఉంటుంది. ఇప్పుడు పోస్టుమార్టం చేసి వచ్చాక లంచ్ టైమ్ అవుతుంది. ఇలాగే బయటకెళ్లి బిర్యానీ తినొస్తాం. ఇది డ్యూటీ.. అంతే! అప్పట్లో కలరా అనే వ్యాధి ఎక్కువగా ఉండేది. అందుకే చనిపోయినప్పుడు వారింటికెళ్లి శవాన్ని ముట్టుకుంటే వ్యాధి వస్తుందని భయపడేవారు. అక్కణ్ణుంచే ఇంటికి రాగానే స్నానం చేయాలనే ఆలోచన వచ్చింది. దేవుడి సృష్టిలో మనిషి చాలా ఉన్నతుడు అంటారు. మీరేమనుకుంటారు? సృష్టికి మనిషి ఏ విధంగానూ మనిషి ఉపయోగపడడు. పాములు, గేదెలు వంటివి చనిపోతే వాటి చర్మమైనా పనికి వస్తుంది. కొన్ని చనిపోతే చెట్టు చేమకైనా బలాన్నిస్తాయి. మనిషి చనిపోతే దేనికీ పనికిరాడు. భూమి మీద వేస్ట్ ప్రాణి ఏదైనా ఉందంటే అది మనిషే! మీరు దేవుణ్ణి ఎంతగా నమ్ముతారు? ఏం కావాలని కోరుకుంటారు? చాలా నమ్ముతాను. వేంకటేశ్వరస్వామి అంటే అమితమైన భక్తి. చదువుకునే రోజుల నుంచి ఇప్పటి వరకు 11 సార్లు కొండమెట్లు ఎక్కి ఉంటాను. మన పని కరెక్ట్‌గా చేస్తే దేవుడి కరుణ ఉంటుందని నమ్ముతాను. అలాగని కోరుకోకుండా ఏమీ ఉండను. నా కోసం కాకుండా పిల్లలు సక్సెస్ అవ్వాలని కోరుకుం టాను. ఫోరెన్సిక్ డాక్టర్ అయ్యాక వెళ్లి థ్యాంక్స్ చెప్పుకున్నాను. చదువుకునే రోజుల్లో శ్రీరామ శ్రీరామ అని పది లక్షల సార్లు రాసి ఉంటాను. దైవభక్తి ఉన్న మీరు ఈ వృత్తిని ఎలా ఎంచుకున్నారు? ఇదీ దైవ నిర్ణయం అనుకుంటారా? మాది రామగుండం దగ్గర మేడిపల్లి గ్రామం. మా నాన్న చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేసేవాడు. నేను డాక్టర్ అవ్వాలని మా నాన్న కోరిక. ఆయన ఇష్టం మేరకే ఎంబీబిఎస్ చేశాను. ముందు పిడియాట్రీషిన్ కావాలను కున్నాను. కొన్ని కారణాల వల్ల దాన్ని ఎంచుకోలేకపోయాను. తర్వాత నా ముందు 5–6 మెడికల్ ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో ఫోరెన్సిక్ డాక్టర్ అనేది ఛాలెంజింగ్‌గా అనిపించింది. దీంతో వెంటనే ఈ డ్యూటీకి ఒప్పుకున్నాను. ఒకసారి ఒప్పుకున్నాక దీన్నీ ఇష్టపడగలగాలి. లేకపోతే ప్రతిరోజూ నరకమే చూడాల్సి ఉంటుంది. అలా పదేళ్లుగా ఫోరెన్సిక్ డాక్టర్‌గా పనిచేస్తున్నాను. దీన్ని బ్యాలెన్స్ చేసుకోలేక మాలో తాగుడికి అలవాటుపడిన వారున్నారు. మా డిపార్ట్మెంట్లో ఇప్పటికీ 30 శాతం మంది మార్చూరీకి రాకుండా బయట బయటే వేరే క్లాసులు తీసుకోవడం వంటి పనులు చూసుకొని వెళ్లిపోతుంటారు. ఎంబీబీస్ చదివేటప్పుడు ఎవ్వరూ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ కావాలని కోరుకోరు. వచ్చినా మధ్యలోనే వెళ్లిపోయిన వారున్నారు. కొందరు ఛాలెజింగ్‌గా ఎంచుకుని టాప్ పొజిషన్లకు వెళ్లిన వారున్నారు. పెద్ద పెద్ద జడ్జీలకు, ఐఎఎస్, ఐపిఎస్ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తుంటాం. వాళ్లు క్రైమ్ సీన్ తయారుచేసుకోవాలంటే మేం ఇచ్చిన ఆధారాలే ప్రాణం. అలాంటప్పుడు గర్వంగా అనిపిస్తుంది. మేం బాడీలో అనాటమీ డిసెక్షన్ చేస్తాం, పాథాలజీలో వ్యాధుల గురించి చదువుకుంటాం. మెడిసిన్‌లో ట్రీట్మెంట్ గురించి చదువుకుంటాం. ఇవన్నీ మేమే చెప్పగలం. అంతేకాదు ఒక డాక్టర్ వల్ల పేషెంట్ చనిపోతే ఏ కారణంగా చనిపోయాడో మేం తప్ప ప్రపంచంలో మరెవ్వరూ చెప్పలేరు. మెడిసిన్ ఇంత డెవలప్ అవడానికి కారణం.. డెడ్బాడీసే! శవాల అనాటమీ డిసెక్షన్ వల్లే ఎంతో తెలుసుకోగలుగుతాం. మొదటిసారి శవాన్ని పోస్టుమార్టం చేసినప్పుడు ఏమనిపించింది? దేవుణ్ణి తలుచుకున్నారా? పోస్ట్‌మార్టం రూమ్‌లో మా ప్రొఫెసర్ ‘ఈ ఫీల్డ్కి ఎందుకొచ్చావ్’ అన్నారు. ఈ డిపార్ట్మెంట్కి ఎవరొచ్చినా ఇదే మాట అడుగుతారు. చాలా సమస్యలను తట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని కోల్పోవాల్సి ఉంటుందని కూడా చెప్పారు. పోస్ట్‌మార్టం చూసిన రోజు నుంచి దాదాపు నెల రోజులు శవాలు నన్ను వెంటాడుతున్నట్టే ఉండేది. కళ్లు మూసినా, తెరిచినా శవాలు.. వాటిలోపలి అవయవాలు కనిపించేవి. ఎదురుగా ఎవరితోనైనా మాట్లాడు తున్నా వాళ్ల బాడీ పార్ట్స్ కనిపిస్తూ ఉండేవి. మా ఆవిడ అయితే ఈ జాబ్ వదిలేయమంది. ఎవరైనా చనిపోయినవారిని చూసొచ్చినప్పుడు శ్మశాన వైరాగ్యం ఆవరించి దేవుణ్ణి తలుచుకుంటారు. మీరు ప్రతిరోజూ శవాల మధ్యే గడుపుతారు... అందుకే, గుండె బండబారిపోయిందేమో అనిపిస్తుంటుంది. చాలా వరకు సున్నితత్త్వం పోతుంది. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఏది చెబితే అది చేసేటంత. అలాంటిది ఆయన చనిపోయినప్పుడు నాకు కంట్లో నీళ్లు రాలేదు. గుండె మొద్దుబారి, శూన్యం ఆవరించినట్టు అనిపించింది. ‘అంత ఇష్టమైన మనిషి కదా! ఏడుపు ఎందుకు రాలేదు’ అనుకునేవాడిని. మనిషికి ఉండాల్సిన సున్నితమైన ఫ్లేవర్ వెళ్లిపోయిందండీ! దీంతో ఆలోచనా విధానం కూడా మారింది. కాకపోతే ఏదైనా సమస్య వస్తే డీల్ చేసే ధైర్యం, తెగువ వచ్చాయి. మా మేనమామకు నేనే పోస్టుమార్టం చేయాల్సి వచ్చింది. అప్పుడనిపించింది.. ఇన్నాళ్లు ఎంత కలిసిమెలసి, ఆనందంగా గడిపాం. చనిపోయిన తర్వాత ఈ పరిస్థితి ఏంట్రా బాబూ అనిపించింది. అలాగే ఏదైనా సాధించినప్పుడు కూడా పెద్ద ఎగై్జట్‌మెంట్ అనిపించదు. ఇప్పుడు ఓ ఖరీదైన కారు కొన్నాననుకోండి... ఏమీ అనిపించిదు. అంతా రొటీన్ అయిపోయింది. ఇలాంటి ఆలోచనతో ఉన్నప్పుడు మా మిసెస్ భయపడుతుంది. ఏదైనా మాట్లాడితే...‘ అమ్మో! క్రిమినల్‌తో మాట్లాడలేం’ అంటుంది (నవ్వేస్తూ). మీ పిల్లలు, బంధుమిత్రులు మీ ఉద్యోగం గురించి చెప్పినప్పుడు వాళ్ల రెస్పాన్స్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? నాకు ఇద్దరు పిల్లలు. ఇంజనీరింగ్ చదువుతున్నారు. పిల్లలకు చిన్నతనమంతా నేను డాక్టర్‌గానే వాళ్లకు తెలుసు. మా ఆవిడ కూడా వాళ్లకు చెప్పలేదు. (నవ్వుతూ) శవాలను కోసే డాక్టర్ అని కాకుండా ఫోరెన్సిక్ డాక్టర్ అని అందమైన పదాలే వాడుతాం. మొదట్లో అయితే ఇది ఎందుకు తీసుకున్నావ్? అని అడిగినవాళ్లే ఎక్కువ. పది మందిలో మాట్లాడినప్పుడు వాళ్లేం అనుకుంటారో అని నేను కూడా అసలు విషయం చెప్పకపోయే వాడిని. ఇప్పుడు ఫోరెన్సిక్ డాక్టర్ అని గర్వంగా చెప్పుకుంటాను. పదేళ్ల క్రితం నాటికి ఇప్పటికీ జనాల మైండ్‌సెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. అప్పట్లో మాత్రం ‘వీళ్లు ఎప్పుడూ తాగి ఉంటారు. వీళ్ల దగ్గర శవాల కంపు వస్తుంది’ అనుకునేవారు. కానీ, ఇప్పుడు ఈ ఫీల్డ్కి అమ్మాయిలు కూడా వస్తున్నారు. ఇప్పుడు నలుగురు అమ్మాయిలు మా డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్లు ఇక్కడ విధులు చేసుకుంటారు. ఇంటి దగ్గర పూజలు, వ్రతాలు చేసుకుంటుంటారు. దేనికదే అనేది ఒక లైన్ గీసుకోగలుగుతున్నారు. మా ఆవిడ ఇమిటేషన్ జువెల్రీ తయారుచేస్తుంది. ఎగ్జిబిషన్స్ పెడుతుంది. ఆమె శరీరాలను అందంగా అలంకరించేందుకు తాపత్రయపడుతుంది. నేను శరీరాలలో ఆధారాలను సేకరించేందుకు తాపత్రయపడతాను. (నవ్వేస్తూ) మార్చు్చరీలో ఎప్పుడైనా బాధ కలిగి దేవుడిని తలుచుకున్న సందర్భం? నా ఫ్రెండ్ రమేష్ ఇదే ఫ్యాకల్టీ. ఇద్దరం చదువుకునేరోజుల్లో ఏడెనిమిదేళ్లు ఒకే రూంలో కలిసి ఉన్నాం. ఈ మధ్యే అతనికి యాక్సిడెంట్ అయితే మార్చూరీకి తీసుకొచ్చారు. నేనే పోస్టుమార్టం చేశాను. బాధనిపించింది. ఈ పదేళ్లలో మా ఫ్యాకల్టీలోని ఐదుగురు యాక్సిడెంట్లో మరణిస్తే ఇక్కడకు తీసుకొ చ్చారు. (చేతులు జోడిస్తూ) నేను చనిపోతే ఇక్కడకు రాకూడదు స్వామీ అని దణ్ణం పెట్టుకుంటాను. ఆడవాళ్లు కూడా ఈ శాఖను ఎంచుకోవడానికి కారణం? ధైర్యం కోసం పూజలు ఎక్కువ చేస్తుంటారా? చిన్నప్పటి నుంచి ఆంజనేయస్వామి భక్తురాలిని. ప్రతి మంగళవారం స్వామిని పూజిస్తాను. అదంతా ఇంటి వరకే పరిమితం. వరుసగా మూడు రోజులు ఈ డ్యూటీలో ఉన్నాను. ఇది నా వృత్తి. అంతవరకే చూస్తాను. మార్చూరీకి వస్తే చేస్తున్న పనే దైవం. ఇంటికి వెళితే ఇవన్నీ మర్చిపోతా. ఇంటి పనుల్లో బిజీ అయిపోతాను. ఇది ఒక వృత్తిగా ఎంచుకున్నప్పుడు శవాల మధ్య ఉంటున్నామనే భయాలు ఉండకూడదు. మెడిసిన్‌లో ప్రొఫెసర్ల ముందు ‘వైవా’ ఇవ్వాల్సి వచ్చినప్పుడు బాడీ అనాటమీ గురించి ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఇవ్వాలి. అప్పుడు ఇంటికే ఎముకలు, పుర్రె తెచ్చి అభ్యాసన చేసిన రోజులున్నా యి. పదకొండేళ్ల పాటు గ్రామీణ ప్రాంతంలో డాక్టర్‌గా విధుల్లో ఉండి నాలుగేళ్ల క్రితం ఈ డిపార్ట్మెంట్కి వచ్చాను. ఈ వృత్తి పట్ల అందరిలోనూ అవగాహన పెరుగుతోంది. ఫలితంగా ఈ డిపార్ట్మెంట్లో అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. – డాక్టర్ వాణిశ్రీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇదేనా ఫైనల్ జర్నీ.. ఇంత దానికా అంత తాపత్రయం అని ఎప్పుడైనా అనిపించిందా? చాలా సందర్భాల్లో.. కొన్నేళ్ల క్రితం ఓ రౌడీ గొడవల్లో చనిపోయాడు. ఉన్నప్పుడు వాడి హడావిడి చూసినవాడినే. వాడి శవం బల్లమీదకొచ్చింది. ఇంత దానికి ఎందుకురా బాబూ అంతమందితో అన్ని గొడవలు పెట్టుకున్నావ్. ఎందరో అమాయకులను ముంచావ్! చివరకు ఏం సాధించావు అనుకున్నాను. ఇక్కడకొచ్చాక కులం, మతం, రంగు, రూపు .. ఏమీ ఉండవు. అంతా ఒకటే! ఆధారాల కోసం శవం. మీరు ఈ రూమ్‌లోకి రాగానే ముందు బల్లమీద శవాన్ని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? ముందు ఎలా చనిపోయాడనే థాట్ ఉంటుంది. ఆడ–మగ అనే తేడా ఒకసారి ఈ రూమ్‌లోకి వచ్చాక ఉండదు. చిన్నపిల్లల శవాలు వచ్చినప్పుడు మాత్రం కొన్ని క్షణాలు ‘అరెరె’ అనిపిస్తుంది. ఎలా చనిపోయాడనేది ప్రాధమిక ఆధారాలతో పోలీసులు పంచనామా ఇస్తారు. వాళ్లు రాసిందానికి, శవం మీద కనిపించిన దానికి పోల్చి చూస్తాం. శవం క్రైమకి ఎవిడెన్స్ ఇచ్చే ఒక ఎలిమెంట్‌గా మాత్రమే అనిపిస్తుంది. శవాన్ని చాలా జాగ్రత్తగా, గౌరవంగా చూస్తాం. బాగా నీటుగా కడుగుతాం, గాయలు జాగ్రత్తగా పరిశీలిస్తాం. పని పూర్తయ్యాక జాగ్రత్తగా ప్యాక్ చేసి, పక్కన పెట్టిస్తాం. ఇలాంటివి రెగ్యులర్‌గా చేస్తుంటే జీవితమ్మీద విరక్తి పుట్టి దేవుడా! అనుకున్న సందర్భం... రోజూ చేస్తే అలాగే అనిపించేదేమో! కానీ, ఒక రోజు మార్చూరీ డ్యూటీ మరో రోజు కోర్టు పనులు ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంత గ్యాప్ వస్తుంది. కానీ, ఇక్కడ పనిచేసే తోటీ(వర్కర్స్)ల పనే ధారుణంగా ఉంటుంది. వాళ్లు శవాల ఫ్లూయిడ్స్ అన్నీ కడగాలి. కట్ చేయాలి. ఒకరో ఇద్దరో తప్ప మిగతావాళ్లంతా ఫ్యామిలీకి దూరమైపోయినవారే! ఇంటికెళితే శవాల కంపు అని పెళ్లాం, పిల్లలు అసహ్యించుకుంటే ఇక వారికి జీవితమే ఉండదు. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
దంపతుల మృతదేహాల వెలికితీత
ఇనుము వ్యాపారి పల్లపోతు శ్రీనివాసరావు, ప్రమీలారాణి దంపతులను చంపిన తీరు హృదయ విదారకంగా ఉంది. కిరాతకులు వారిని అత్యంత పాశవికంగా కడతేర్చారు. రేకుల షెడ్డులో చిన్నపాటి గుంత తీసి మృతదేహాలను అందులో కుక్కారు. ఎవరూ కనిపెట్టకుండా ఉండేందుకు బండలతో ఫ్లోరింగ్ చేశారు. ఆనవాళ్లు చెరిపేందుకు గది మొత్తం కారం చల్లారు. ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలు క్రైం: నగరానికి చెందిన పాత ఇనుము వ్యాపారి పల్లపోతు శ్రీనివాసరావు, ప్రమీలారాణి దంపతుల మృతదేహాలను గురువారం పోలీసులు వెలికితీశారు. నిందితులు పూడ్చిన మృతదేహాలను డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు, రిమ్స్ వైద్యుల సమక్షంలో బయటకు తీశారు. దంపతులను అత్యంత కిరాతకంగా హతమార్చిన హంతకులు అంతే కిరాతకంగా నాలుగు అడుగుల గుంతలో పాతి పెట్టారు. మృతదేహాలను గోనె సంచిలో కుక్కినట్లు గోతిలో కుక్కారు. ఇదంతా చేసింది ఏ పొలాల్లోనో.. చెట్ల పొదల్లోనో కాదు.. నిర్మానుష్య ప్రాంతం అంతకంటే కాదు.. పరిశ్రమలు, నివాస ప్రాంతాల నడుమ. ఒక రేకుల షెడ్డులో. హత్యలకు పాల్పడింది నగరంలోని శివప్రసాద్ కాలనీకి చెందిన లక్కే శ్రీనివాసులుగా గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారించటంతో హత్యకు సంబంధించిన పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు లక్కే శ్రీనివాసులు, అతడికి సహకరించిన అతని స్నేహితురాలు ఎనిమిరెడ్డి సుబ్బులు, అతని వద్ద లారీ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కొత్తడొంకలోనే నివాసం ఉంటున్న మరాఠీ సింధే కుమార్‌లను ఒంగోలు డీఎస్పీ జి.శ్రీనివాసరావు, ఒన్‌టౌన్ సీఐ ఎండీ ఫిరోజ్ తోపాటు డీఎస్పీ క్రైం ప్రత్యేక టీమ్‌లు స్థానిక ఎంఎస్ నగర్‌లోని కొత్తడొంకలో ఉన్న సంఘటన స్థలానికి మధ్యాహ్నం 2.45 గంటలకు తీసుకొచ్చారు. మృతదేహాలను ఎక్కడ పూడ్చి పెట్టింది నిందితుల ద్వారానే తెలుసుకున్నారు. ఫ్లోరింగ్ తవ్వించి.. ఒంగోలు తహసీల్దార్ కె.చిరంజీవితో పాటు రిమ్స్ ప్రొఫెసర్ రాజ్‌కుమార్ సమక్షంలో మృతదేహాలు ఉన్న ప్రాంతంలో తవ్వించారు. నాపరాళ్లు తొలగించి కొంచెం మట్టి తీయగానే దుర్గంధం వెదజల్లింది. మృతదేహాలను వేర్వేరు దిశల్లో కుక్కి ఉన్నాయి. దాదాపు 8 రోజులు కావడంతో మృతదేహాలు పూర్తిగా ఉబ్బి ఉన్నాయి. తహసీల్దార్ చిరంజీవి సమక్షంలో మృతదేహాలకు పోలీసులు పంచనామా నిర్వహించారు. అనంతరం ప్రొఫెసర్ రాజ్‌కుమార్ అక్కడే పోస్టుమార్టం చేశారు. పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో మృతదేహాలపై గాయాలు గుర్తించారు. శ్రీనివాసరావు గొంతులో ఒక కత్తి పోటు, ఛాతిపై మరో కత్తి పోటు ఉన్నాయి. ప్రమీలారాణి గొంతులో ఒక కత్తి పోటు, గొంతు కింద, ఛాతిపై మరో రెండు కత్తిపోట్లు ఉన్నాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను మృతురాలి తండ్రి బాపనపల్లి వెంకటేశ్వర్లుకు అప్పగించారు. -
పోస్టుమార్టం చేసేందుకు నిరాకరణ
ప్రభుత్వ వైద్యుడి నిర్వాకం జమ్మికుంట(హుజూరాబాద్): డ్యూటీలో ఉండికూడా.. శవానికి పోస్టుమార్టం చేయకుండా ముప్పుతిప్పలు పెట్టిన ఓ వైద్యుడి తీరు కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో చర్చనీయాంశమైంది. జిల్లా అధికారులు సస్పెండ్ ఉత్తర్వులు పంపిస్తేగానీ.. సదరు వైద్యుడు మెట్టు దిగలేదు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీ రాములపల్లికి చెందిన కోలె భిక్షపతి (50) ఉపాధి కోసం రాజన్న సిరిసిల్ల వేములవాడకు కుటుంబంతో సహా వెళ్లాడు. అక్కడ ఈనెల 6న మృతి చెందాడు. శవాన్ని శుక్రవారం ఉదయం గ్రామానికి తీసుకొచ్చి పరిశీలించగా.. గాయాలు కనిపించాయి. దీంతో బంధువులు ఇల్లందకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శుక్రవారం జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో పోస్టుమార్టం చేసే వైద్యుడు సుధాకర్‌రావు ఉన్నారు. పోలీసులు ఇంక్వెస్ట్ ( ముందస్తు సమాచారం) ఇవ్వకపోవడం..అప్పటికే సాయంత్రం 5.30 గంటలు కావడంతో పోస్టుమార్టం చేయలేదు. శనివారం డాక్టర్ సుధాకర్‌రావు సెలవులో ఉండగా, డాక్టర్ పవన్‌కుమార్ డ్యూటీలో ఉన్నారు. ఇల్లందకుంట ఎస్సై నరేశ్ ఆసుపత్రికి వచ్చి భిక్షపతి శవానికి పోస్టుమార్టం చేయాలని ఇంక్వెస్ట్ ఇచ్చారు. దీనికి డాక్టర్ పవన్‌కుమార్ నిరాకరించారు. శవాన్ని తీసుకొచ్చిన సమయంలో డ్యూటీలో ఉన్న వైద్యుడే పోస్టుమార్టం చేయాల్సి ఉంటుందని తెగేసి చెప్పాడు. విస్మయానికి గురైన ఎస్సై ‘డ్యూటీలో ఎవరుంటే వారే పోస్టుమార్టం చేయాలి కదా..’అని చెప్పినా వినిపించుకోలేదు. విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ అనితారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా.. వైద్యుడు ససేమిరా అన్నాడు. దీంతో ఎస్సై జిల్లా వైద్యాధికారి రాజేశం దృష్టికి తీసుకెళ్లారు. భిక్షపతి చనిపోయి మూడురోజులవుతోందని, పోస్టుమార్టం చేయడం లేదని ఫిర్యాదు చేశారు. వెంటనే వైద్యాధికారి రాజేశం అనితారెడ్డితో మాట్లాడారు. పోస్టుమార్టం చేయకుంటే పవన్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఆదేశించారు. అనితారెడ్డి సస్పెండ్ లెటర్ సిద్ధం చేసినా.. వైద్యుడు మాత్రం మెట్టు దిగలేదు. ఉద్యోగం కోల్పోతావంటూ అక్కడున్నవారంతా హెచ్చరించడంతో చివరికి పోస్టుమార్టం చేశాడు. -
శిరీష పోస్ట్‌మార్టం రిపోర్టులో సంచలనాలు
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలకంగా మారిన పోస్ట్‌మార్టం నివేదిక బహిర్గతమైంది. మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో శిరీష మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు.. గురువారం సాయంత్రం నివేదికను పోలీసులకు అందజేశారు. ఆ రిపోర్టులో పలు సంచలన అంశాలను పేర్కొన్నారు. శిరీష మెడ, పెదవి, చెంపలపై బలమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెడ భాగంలో తీవ్రమైన ఒత్తిడి కలగడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. మరిన్ని పరీక్షలు నిర్వహించిన మీదట.. శిరీషది ఆత్మహత్యా లేక హత్యా అనేదానిపై స్పష్టత వస్తుందని వైద్యులు చెప్పారు. కాగా, ప్రచారంలో ఉన్నట్లు శిరీషపై అత్యాచారం జరిగిందా? లేదా?అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే సంచలనంగా మారిన ఈ కేసులో శిరీష పోస్ట్‌మార్టం నివేదికతో ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
నిజం సమాధి కాకూడదు
నిజం భూస్థాపితం కాకూడదు. అబద్ధం శిలాఫలకం అవకూడదు. నిజమూ అబద్ధమూ... రెండూ ఒకే రూపంలో కనిపిస్తున్నప్పుడు... నిజమేదో, అబద్ధమేదో తేల్చడానికి భూమిని తవ్వి తవ్వి తియ్యాలి. ప్రతి శిలనూ కదిలించి చూడాలి. అనుమాన భూతాన్ని పట్టెయ్యాలి. అలా పట్టేసేదే... రీపోస్ట్ మార్టమ్. రేపటికి నెల.. మధుకర్ చనిపోయి! మార్చి 13న ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. మధుకర్‌ది హత్యా... ఆత్మహత్యా అన్నది ఇంకా తేలలేదు. ఇప్పటికి రెండు పోస్ట్‌మార్టమ్‌లు అయ్యాయి. మొదటి పోస్ట్ మార్టమ్‌లో ఆత్మహత్య అని సూచించేలా వివరాలు ఉన్నాయి. అయితే తల్లిదండ్రులు, బంధువులు పట్టుపట్టి, రీ పోస్ట్‌మార్టమ్ కోసం కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. అది కచ్చితంగా హత్యేనని వారి ఆరోపణ. రెండో పోస్ట్ మార్టమ్ ఏప్రిల్ 10న జరిగింది. రిపోర్ట్ రావలసి ఉంది. మధుకర్‌ది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్. అదే మండలంలోని వెంకటాపూర్ యువతి, మధుకర్ ప్రేమికులు. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసి యువతి తల్లిదండ్రులు మధుకర్‌ని హెచ్చరించారనీ, ఆ తర్వాత కొద్ది రోజులకే అతడిని హత్యచేశారని మధుకర్ కుటుంబం, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.రీ పోస్ట్మార్టమ్నంతా వీడియోలో చిత్రీకరించారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న కుమారుడి మృతదేహాన్ని చూసి ఆ తల్లి సొమ్మసిల్లిపోయింది. ఫోరెన్సిక్ నిపుణులు నమూనాలు తీసుకెళ్లారు. వారం రోజుల్లో నివేదిక హైకోర్టుకు అందుతుంది. మధుకర్‌ది హత్యా, ఆత్మహత్యా అన్నది అధికారికంగా అప్పుడు మాత్రమే వెల్లడవుతుంది. ఇంతకీ మధుకర్ మృతదేహానికి రీ పోస్ట్‌మార్టమ్ ఎందుకు అవసరమైంది? ఇంటి నుంచి బయటికి వెళ్లిన మధుకర్ మర్నాడు ఖానాపూర్ శివార్లలో శవమై కనిపించాడు. అక్కడి దృశ్యం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపించినా.. ముళ్లకంపలో మృతదేహం పడి ఉండడంతో ఇక్కడికి వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్ట్‌మార్టం చేయించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, ప్రేమ వ్యవహారం కారణంగానే మధుకర్‌ను దారుణంగా హత్య చేశారనీ, కళ్లు పీకి, మర్మాంగాలు కోసి చంపేశారని సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరగడంతో మధుకర్ తల్లిదండ్రులతో పాటు, దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నేతలు ఆందోళనకు దిగి, రీపోస్ట్‌మార్టమ్ చేయించారు. ఈ నేపథ్యంలో.. అసలు పోస్ట్‌మార్టమ్ అంటే ఏమిటో, ఎప్పుడు చేస్తారో తెలుసుకుందాం. నాలుగు రకాలు అనుమానాస్పద కేసుల్లో... ఆ వ్యక్తి మృతి చెందడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవడానికి చేసే శవ పరీక్షే పోస్ట్‌మార్టమ్. దీన్ని అటాప్సీ అని కూడా అంటారు. దీనిని నాలుగు సందర్భాలలో చేస్తారు. మెడికో–లీగల్: ఒక వ్యక్తి మరణానికి దారి తీసిన అసలు కారణాన్ని తెలుసుకోవడం కోసం చేసే సాధారణ శవపరీక్షను మెడికో లీగల్ అటాప్సీ అంటారు. ఇది ఆయా దేశాల్లో అమలులో ఉన్న చట్టాల ప్రకారం ఏదైనా అనుమానాస్పద మృతి కేసుల్లో నిర్వహిస్తారు. ఇందులో శవపరీక్ష కోసం శస్త్రాలను ఉపయోగిస్తారు. ఆకస్మిక మృతి సంభవించినప్పుడు, ప్రమాదాల వంటి సందర్భాల్లో, హింస చెలరేగి మృతి సంభవించినప్పుడు ఏ కారణంగా ప్రాణం పోయిందో ఈ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. క్లినికల్ లేదా పాథలాజికల్: రోగి ఏదైనా జబ్బుతో మృతి చెందితే... అతడు / ఆమె మృతి చెందడానికి కారణమైన జబ్బు ఏదో తెలుసుకోడానికి చేసే పరీక్ష క్లినికల్ లేదా పాథలాజికల్ అటాప్సీ. అనటామికల్ లేదా అకడమిక్ : ఇది విద్యాభ్యాసంలో భాగంగానో లేదా వైద్య విజ్ఞాన సముపార్జనలో భాగంగానో చేసే శవపరీక్ష. వర్చువల్ లేదా మెడికల్ ఇమేజింగ్ : ఇందులో కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శవపరీక్ష నిర్వహిస్తారు. అంటే ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి అధునాతన వైద్య పరీక్షలతో చేస్తారు. నేరాలు జరిగినప్పుడు మృతి స్వభావాన్ని తెలుసుకోవడం కోసం పైన పేర్కొన్న అటాప్సీలలో ప్రధానంగా మొదట పేర్కొన్న తరహా శవపరీక్షను నిర్వహిస్తారు. ఒక కేసులో మృతి చెందడానికి వివరించిన కారణం సహేతుకంగా అనిపించనప్పుడు, దానిపై అనుమానాలు చెలరేగినప్పుడు మళ్లీ తిరిగి శవపరీక్ష (రీ పోస్ట్‌మార్టమ్) నిర్వహిస్తారు. రీ పోస్ట్ మార్టమ్ ఎలా చేస్తారు? అయితే మృతి చెందిన వెంటనే శరీర భాగాలు శిథిలం కావడం, కుళ్లడం మొదలవుతాయి. ఇది మృతి చెందిన తర్వాత కాల వ్యవధిని బట్టి దశలవారీగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మృతి సంభవించిన సమయం మొదలుకొని... అప్పటికి ఎంతమేరకు శవం శిథిలమై ఉంటుందన్న అంచనా వేసుకుని, దానిని బట్టి మిగతా శవపరీక్షలు నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో శరీరం చాలావరకు శిథిలమైనా ఏదైనా ఒక లోపలి అవయవం (ఇంటర్నల్ ఆర్గాన్) దొరికినా దానికి రీ–పోస్ట్‌మార్టమ్ నిర్వహించి, తగిన వైద్యపరీక్షలతో మృతుడు ఏ కారణం వల్ల మరణించాడో తెలుసుకోడానికి తగినంత పరిజ్ఞానం అందుబాటులో ఉంది. ఫోరెన్సిక్ నిపుణులు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే శవదహనం జరిగాక భౌతికకాయం ఉండదు కాబట్టి మొదట నిర్వహించిన పోస్ట్‌మార్టమ్ (అర్లియర్ పోస్ట్‌మార్టమ్ ఫైండింగ్స్) ఆధారంగా, ఆ సమయంలో తీసిన ఫొటోల ఆధారంగా నిపుణులు తమ అభిప్రాయాలను ఇస్తారు. రీ పోస్ట్‌మార్టమ్ – కొన్ని కేసులు ఎయిర్ హోస్టెస్ రీతూ 2015 ఏప్రిల్‌లో హైదరాబాద్ రామాంతపూర్‌లో నివాసం ఉండే మాజీ ఎయిర్ హోస్టెస్ రీతు (28) అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె భర్త సచిన్ రీతు తల్లిదండ్రులకు ఫోన్ చేసి రీతు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పగా వారొచ్చి ఇంట్లో చూసేసరికే ఆమె మృతి చెంది ఉంది. ఈ మృతి అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. విచారణలో టివి రిమోట్ కోసం చిన్నపాటి జగడం అయ్యిందని, తాను ఆమెను చెంప దెబ్బ కొట్టడం తప్ప వేరే ఏమీ చేయలేదని, బయటికి వెళ్లి సిగరెట్ తాగి వచ్చేలోగా ఆమె అపస్మారకంగా పడి ఉందని భర్త సచిన్ తెలిపాడు. రీతు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ చేయగా అందులో ‘కాజ్ ఆఫ్ డెత్’ (మృతికి కారణం) ఏమిటన్నది తేలలేదు. దీనిని రీతు బంధువులు అనుమానించారు. ‘కాజ్ ఆఫ్ డెత్’ తేలడానికి రీ పోస్ట్‌మార్టమ్ నిర్వహించాల్సిందేనని వారు పట్టుబట్టారు. వారి విన్నపం ప్రకారం పన్నెండు మంది వైద్యుల సమక్షంలో రీతు మృతదేహానికి రీపోస్ట్‌మార్టం జరిగింది. మరోవైపు ‘లోతైన విచారణ’ జరుపగా భర్త సచిన్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఆ రోజు రాత్రి మద్యం తాగి స్నేహితునితో ఇంటికి రాగా అతడి ముందు భార్య తనని అవమానించిందని దానివల్ల చేయి చేసుకున్నానని, దాంతో స్నేహితుడిని బయటకు పంపి ఆమె ముక్కుపై దిండు అదిమి చంపేశానని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పెళ్లయ్యి రెండేళ్లు కాకమునుపే జరిగిన ఈ హత్య రీ పోస్ట్‌మార్టమ్ నివేదిక వల్లే నిందితుడిని పట్టుకోగలిగింది. ఆశ్రమ భక్తురాలు సంగీత యేడాదిన్నర కిందటి సంఘటన ఇది! సంగీత అనే 24 ఏళ్ల అమ్మాయి విషయం. 2015లో చనిపోయింది. ఆమె మరణం కలకలమే రేపింది. తమిళనాడులోని తిరుచ్చి సంగీత స్వస్థలం. అయితే సంగీత కర్ణాటకలోని బెంగుళూరు దగ్గరున్న బిదాడిలో ఉండేది. అక్కడి నిత్యానంద ధ్యానపీఠంలో. తన 20వ యేటనే ఆ ఆశ్రమానికి వెళ్లింది. నాలుగేళ్లుగా ఆశ్రమంలోనే జీవనం సాగిస్తున్న సంగీత 2015, జనవరిలో హఠాత్తుగా చనిపోయింది. ‘మీ అమ్మాయి చనిపోయింది’ అని ఆశ్రమం వాళ్లు సంగీత తల్లిదండ్రులకు కబురు పంపారు. ఆ వార్త విని హతాశులయ్యారు వాళ్లు. హుటాహుటిన బిదాడికి చేరుకున్నారు. కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయిందని ఆశ్రమం అధికారులు చెప్పారు. పోస్ట్‌మార్టమ్‌లో కూడా అనుమానాస్పద అనవాళ్లు ఏమీ తేలలేదు. విషాదంతోనే కూతురి భౌతికకాయాన్ని తీసుకొని సొంతూరు తిరుచ్చి దగ్గర్లోని నవలూరు కుట్టపాట్టుకి బయలుదేరారు. శవాన్ని ఖననం చేశారు. అయినా వాళ్ల మనసుల్లో ఎక్కడో అనుమానం.. తమ బిడ్డది సహజ మరణం కాదని. అందుకే రీపోస్ట్‌మార్టమ్ కోసం కర్ణాటకలోని రామనగరం జిల్లా సూపరింటిండెంట్‌కు పిటిషన్ పెట్టుకున్నారు. సమ్మతించి రీపోస్ట్‌మార్టమ్ కోసం ఆదేశాలు జారీ చేశారు. దాంతో కర్ణాటకలోని పోలీస్ టీమ్ తిరుచ్చి చేరుకుంది. సంగీత తండ్రి, స్థానిక రెవెన్యూ ఆఫీసర్, స్థానిక పోలీసుల సమక్షంలో సంగీత డెడ్ బాడీని బయటకు తీశారు. అక్కడి మహాత్మాగాంధీ మెమోరియల్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు చెందిన ఇద్దరు డాక్టర్లు రీపోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. టీనేజ్ అమ్మాయి ఫెమి రెండున్నరేళ్ల క్రితం కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాలోని రైల్వేట్రాక్ మీదకు ఓ శవం కొట్టుకొచ్చినట్టు పోలీసులకు సమాచారం అందింది. అది ఓ అమ్మాయి మృతదేహం. ఆనవాళ్లు పట్టలేనంతగా శరీరం ఉబ్బిపోయింది. పోస్టుమార్టమ్‌లో ఆ అమ్మాయి వయసు 14 ఏళ్లు అని, విషం సేవించడం వల్ల మరణించిందని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఖనన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. రెండు నెలల తర్వాత ఆ మృతదేహాన్ని వెలికి తీసి, రీ పోస్టుమార్టమ్ నిర్వహించారు. ఆమె మృతదేహం నుంచి కొన్ని శాంపిల్స్ సేకరించడంతో పాటు డిఎన్ఎ టెస్ట్ కూడా చేశారు. నిజానిజాలు రాబట్టిన పోలీసులు వాస్తవాలను బయటపెట్టారు. మొదట ఇరింజలకుడ పోలీస్ స్టేషన్లో 14 ఏళ్ల అమ్మాయి తప్పిపోయిందని కేసు ఫైల్ అయినట్టు గుర్తించారు. ఆ అమ్మాయి పేరు ఫెమి. ఆమె తండ్రి పేరు బెన్నీ. మరణించిన అమ్మాయే బెన్నీ కూతురు ఫెమి అని డిఎన్ఎ నివేదికలో నిర్ధారించారు. బెన్నీ మొదటి భార్య కూతురు ఫెమి. భార్యాభర్తలు రెండేళ్ల క్రితం విడిపోయారు. చట్టబద్ధంగా ఫెమి తండ్రి దగ్గరే ఉంటోంది. తమకు అడ్డుగా ఉందని భావించి ప్రియురాలు వినీతతో కలిసి పళ్లరసంలో స్లీపింగ్ పిల్స్ కలిపి తాగించి కన్నతండ్రే ఈ హత్య చేశాడని, ఆ తర్వాత తెల్లవారుజామున సముద్రంలో విసిరేశారని, ఫెమీ శరీరం థియేటర్ వెనకాల గల రైల్వే ట్రాక్ మీదకు కొట్టుకొచ్చిందనే నిజాన్ని తేల్చి, చిక్కుముడిని విప్పారు. దోషులకు జైలు శిక్ష విధించారు. బీటెక్ విద్యార్థిని శ్రీయా ప్రసాద్ హైదరాబాద్‌లోని నేరెడ్మెట్ వాయుపురి కాలనీకి చెందిన టి.శ్రీయాప్రసాద్ విశాఖపట్టణం గీతం వర్శిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదివేది. కిందటేడాది ఫిబ్రవరి 12న ఆమె అక్కడే చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటో తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టమ్ నివేదికలో శ్రీయా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మరణించినట్లు తెలిపారు. అయితే అదే రోజు సాయంత్రం 5:30 గంటల సమయంలో స్నేహితురాలితో ఆమె ఫేస్బుక్ చాటింగ్ చేసినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో వారికి కూతురి మరణం పట్ల అనుమానాలు తలెత్తాయి. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదని, ఆమె మృతిపట్ల అనుమానాలు ఉన్నాయని, వాస్తవాలు వెలికితీయాలంటూ శ్రీయా తల్లి యావన్ ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు మార్చి 4న మృతదేహాన్ని వెలికి తీసి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, రీ పోస్ట్‌మార్టమ్ చేయాలన్న స్పష్టత కోర్టు ఆదేశాల్లో లేదని, మృతదేహం వెలికితీతను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించి అక్కణ్ణుంచి వెళ్లిపోయారు. తర్వాత మార్చ్ 12న కోర్టు ఉత్తర్వులతో శ్రీయా ప్రసాద్ మృతదేహం వెలికి తీసి రీ–పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. 12 మంది నిపుణులు, అధికారుల సమక్షంలో ఈ వెలికితీత కార్యక్రమాన్ని నిర్వహించారు. మృతదేహం అంతర అవయవాల నమూనాలను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపారు. -
ఖననం చేసిన మృతదేహం వెలికితీత
చాగల్లు : ప్రేమ పేరుతో వంచనకు గురై తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి అనుమానం వ్యక్తం చేయడంతో ఖననం చేసిన మృతదేహాన్ని పోలీసులు శనివారం వెలికి తీయించి పోస్ట్‌మార్టం చేయిం చారు. వివరాలిలా ఉన్నాయి.. చా గల్లు మండలం ఊనగట్ల గ్రామానికి చెందిన తొర్లపాటి విమల (19) ఈనెల 23న ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే రోజు ఆమెను గ్రామంలోని శ్శశానంలో ఖననం చేశారు. విమల ఇటీవల ఇంటర్ పరీక్షలు రాసింది. 22 న రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో తల్లి సుభద్ర మందలిం చింది. మరునాడు ఉదయం తల్లి పనికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో చీరతో ఊరేసుకుని విమల ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ నెల 24న ఆమె పుస్తకాల్లో సూసైట్‌నోట్ కనిపిం చింది. దీనిలో గ్రామానికి చెందిన నూతంగి జయంత్, విమల ప్రేమిం చుకున్నారని, విమలను జయంత్ మోసం చేసి మరో యువతిని పెళ్లిచేసుకున్నట్టు ఉంది. దీంతో తల్లి సుభ్రద శనివారం చాగల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖననం చేసిన విమల మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి తహసీల్దార్ ఎం.మెరికమ్మ సమక్షంలో శవపంచనామా చే శారు. అనంతరం నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇన్చార్జ్ ఎస్సై భగవాన్‌ప్రసాద్ ఆధ్వర్యంలో ఏఎస్సై ఎం.ధనరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ప్రేమ పేరుతో వంచించాడు తన కుమార్తె విమలను అల్లారుముద్దుగా పెంచుకున్నానని, ప్రేమ పేరుతో జయంత్ వంచించి, శారీరకంగా అనుభవించి మోసం చేశాడని సుభద్ర ఆరోపించింది. జయంత్ మరో యువతిని వివాహం చేసుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని కన్నీరుమున్నీరుగా విలపించింది. -
కూతురు మృతిపై తల్లి ఫిర్యాదు
► 44 రోజుల తరువాత మృతదేహం వెలికితీత తిరువళ్లూరు: కూతురు మృతిలో మిస్టరీ ఉందని ముఖ్యమంత్రి ప్రత్యేక సెల్‌కు తల్లి చేసిన ఫిర్యాదు మేరకు దాదాపు 44 రోజుల తరువాత మృతదేహాన్ని వెలికితీసి శవరీక్ష నిర్వహించిన సంఘటన తిరువళ్లూరు జిల్లా వేపంబట్టులో సోమవారం సాయంత్రం కలకలం సృస్టించింది. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు ప్రాంతానికి చెందిన యాయుద్దీన్ కుమారుడు కార్తికేయన్(35) ఆరోగ్యశాఖలో పని చేస్తున్నాడు. ఇతనికి పళ్లికారనై ప్రాంతానికి చెందిన మహాలక్ష్మీ(32)కి 2014 మేలో వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. ఈ నేపథ్యంలో గత జనవరి 21న మహాలక్ష్మీ మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులకు కార్తికేయన్ సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అయితే తన కుమార్తె మృతిలో మిస్టరీ ఉన్నట్టు ఆమె తల్లి అంజలదేవి ముఖ్యమంత్రి ప్రత్యేక సెల్‌కు ఫిబ్రవరి20న పిర్యాదు చేసింది. తన కుమార్తె మృతిలో ఉన్న మిస్టరీ కోసం పోస్టుమార్టం నిర్వహించాలని కోరగా, సంబంధిత ఫిర్యాదును సెవ్వాపేట పోలీసులకు బదిలీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందుకున్న సమాచారంతో మహాలక్ష్మి మృతిని అనుమానంగా భావించి కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే సోమవారం ఆర్డీవో దివ్యశ్రీ,, డీఎస్పీ ఈశ్వరన్ నేతృత్వంలో శవాన్ని వెలికి తీశారు. అనంతరం డాక్టర్ శోభన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మహిళ మృతదేహాన్ని దాదాపు 44 రోజుల తరువాత వెలికి తీయడంతో పాటు పోస్టుమార్టం నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శవపరీక్ష వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపడంతో పాటు తప్పు జరిగినట్టు నిర్ధారణ జరిగితే సంబంధం ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో దివ్యశ్రీ, డీఎస్పీ ఈశ్వరన్ స్పష్టం చేశారు. -
పోస్టుమార్టం కోసం 14కి.మీ. నడక
- చెరువులో పడి బాలిక మృతి - కొద్ది దూరం మోసుకొని.. ఆ తరువాత బైక్‌పై ఆస్పత్రికి మృతదేహం తరలింపు పాడేరు: ఆ గిరిజన పల్లెల్లో వైద్యానికే కాదు పోస్ట్‌మార్టం కోసమూ కష్టాలు తప్పడంలేదు. అయిన వారు చనిపోరుున బాధను దిగమింగుకుంటూ కిలోమీటర్ల కొద్దీ దూరం మృతదేహాన్ని మోసుకొచ్చిన తీరు చూపరులకు కంట తడిపెట్టించింది. విశాఖ జిల్లా పాడేరు మండలం వంజంగి పంచాయతీ పోతురాజుమెట్టలో కొర్ర సంధ్య అనే ఐదేళ్ల చిన్నారి శుక్రవారం సాయంత్రం పూలుకోయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు పంట చెరువులో పడిపోరుుంది. కొన ఊపిరితో ఉన్న బాలికలను బైటకు తీశారు. 108 ద్వారా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మారుమూలన ఉన్న ఈ గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో వాహనం రాలేదు. సకాలంలో వైద్యం అందక కొద్ది సేపటికే బాలిక తుది శ్వాస విడిచింది. ప్రమాదవశాత్తు మృతి చెందినందున బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల్సి వచ్చింది. మరో మార్గంలేక బాలిక మేనమామ సుమారు 14 కి.మీ. దూరంలో ఉన్న పాడేరు ఏరియా ఆస్పత్రికి శనివారం ఉదయం మృతదేహం మోసుకుంటూ బయలు దేరాడు. ఇది తెలిసిన మరో బంధువు బైక్ తీసుకురావడంతో చివరలో బైక్‌పై తెచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆస్పత్రికి వెళ్లి బాలిక కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. -
పూడ్చిపెట్టిన మృతదేహానికి.. 15 నెలల తర్వాత పోస్టుమార్టం
తిర్మలగిరి(హాలియా) : సుమారు 15 నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన యువతి మృతదేహానికి సోమవారం హాలియా పోలీసులు రీ-పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఉదంతం తిర్మలగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. హాలియా ఎస్ఐ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం పూర్వ అనుముల మండలం శ్రీరాంపురం గ్రామపంచాయతీ పరిధిలో గల జానారెడ్డి కాలనీకి చెందిన జటావత్ చందా పెద్దకుమార్తె అనసూర్య 2015 ఆగస్టు నెలలో వాటర్‌ట్యాంకుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు హైదరాబాద్‌లో డిగ్రీ చదివే రోజుల్లో ఇదే గ్రామానికి చెందిన కేతావత్ రమేష్‌ను ప్రేమించింది. పెళ్లి చేసుకుందామని కూడా నిర్ణయించుకున్నారు. కాగా ఇది తెలియని మృతురాలి తండ్రి చందు మాచర్ల ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహం చేసేందుకు నిర్ణయించాడు. దాంతో రమేష్ అతడికి ఫోన్ చేసి తాను, అనసూర్య ప్రేమించుకుంటున్నామని తెలపడంతో సదరు యువకుడు విరమించుకున్నాడు. అనంతరం 2015 జూన్‌లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో వివాహం నిశ్చయించగా దానిని కూడా చెడగొట్టాడు. అనంతరం అనసూర్య, రమేష్‌కు పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయిం చారు. కానీ రమేష్ పెళ్లి చేసుకునేందుకు జాప్యం చేశాడు. ఇది అవమానంగా భావించిన అనసూర్య 2015 ఆగస్టు 28న ట్యాంకుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కొన్ని రోజుల తర్వాత మృతురాలి బ్యాగులో దొరికిన ఆధారాల ప్రకారం తన కూతురు రమేష్ వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి చందా గత నెల 28న హాలియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పూడ్చిపెట్టిన మృతదేహానికి సోమవారం హాలియా పోలీ సులు, స్థానిక తహసీల్దార్ వేణుమాధవరావు, వైద్యులు కలిసి రీ పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హాలియా ఎస్ఐ వెంకట్ తెలిపారు. -
ప్రదీప్ మృత దేహానికి నేడు పోస్ట్ మార్టం
-
అమ్మా.. నాన్న పోదాం..పా..!
పలువురి హృదయాలను ద్రవింపజేసిన చిన్నారి పిలుపు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం తాళ్లగడ్డకు చెందిన చేపలు పట్టే యువకుడు ఏకాలపు శ్రీను (27) సోమవారం రాత్రి బంగారు గడ్డకు చెందిన ఇమ్రాన్ చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. శ్రీను మృతదేహానికి పోస్టుమార్టం చేయించేందుకు పోలీసులు ఇచ్చే పంచనామా రిపోర్టు కోసం అతడి కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం వన్‌టౌన్ పోలీ స్టేషన్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో శ్రీను భార్య భాగ్యలక్ష్మి చిన్నారులైన ఇద్దరు ఆడపిల్లలు పల్లవి, నిత్యలను పట్టుకుని వేపచెట్టు కింద కూర్చొని కన్నీరు పెట్టుకుంటోంది. ఈ క్రమంలో శ్రీను పెద్ద కుమార్తె అమ్మా నాన్న పోదాం.. పా..అమ్మా.. అని అనడం అక్కడున్న వారందరి హృదయాలను ద్రవింపజేసింది. - మిర్యాలగూడ టౌన్ -
కానిస్టేబుల్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
విశాఖపట్నం: గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అబూ బరాక్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. ఆర్డీవో వెంకటేశ్వర్లు సమక్షంలో అధికారులు శవపంచనామా నిర్వహించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 24 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. మావోల ఎదురుదాడిలో గాయపడ్డ మరో కానిస్టేబుల్ డి.సతీష్‌కు విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో ఆపరేషన్ పూర్తి అయింది. కాలులో ఉన్న బుట్టెట్ను వైద్యులు తొలగించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ సతీష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. -
కేజీబీవీ విద్యార్ధిని రమ్య ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్లు
-రమ్య ఆత్మహత్యపై మూడు రోజులు అయినా వీడని మిస్టరీ -పోస్టుమార్టం ఆధారంగా దర్యాప్తు చేయడానికి సిద్దమవుతున్న పోలీసులు శ్రీకాకుళం జిల్లా : లావేరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికలు విద్యాలయంలో ఈనెల21వ తేదీ రాత్రి వాటర్ ట్యాంకులో దూకి పాఠశాల విద్యార్ధిని బి రమ్య ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన వార్త తెలిసిందే. అయితే రమ్య ఆత్మహత్య ఎందుకు చేసుకుందన్న కారణాలు మూడు రోజులు కావస్తున్నా నేటికి తెలియరాకుండా మిస్టరీగానే ఉన్నాయి. ఇంటి వద్ద గాని, పాఠశాలల్లో గాని రమ్యకు ఏసమస్యలు లేవని రమ్య తల్లిదండ్రులు, పాఠశాల ప్రత్యేకాధికారి చెబుతున్నారు. ఏ కారణాలు లేకుండా, ఏసమస్యలే లేకుండా రమ్య ఊరికే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలో రమ్య బాగా చదువుతుందని చెబుతున్నారు కూడ. బాగా చదువుకునే విద్యార్దిని ఒకే సారి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందన్న ప్రశ్నలు కూడ వ్యక్తమవుతున్నాయి. దసరా సెలవులుకు రమ్య ఇంటికి వెళ్లి వచ్చిన తరువాతనే అమెలో కొంత మార్పు వచ్చిందని తెలుస్తుంది. రమ్య ఆత్మహత్య చేసుకొని మృతి చెంది మూడు రోజులు కావస్తున్నా కార ణాలు ఎవరికి అంతుపట్టడం లేదు. ఏది ఏమైనా రమ్య ఆత్మహత్య కారణాలు తెలియరాకపోవడం పోలీసులుకు సవాల్‌గానే మారింది. - రమ్య పోస్టుమార్టం ఆధారంగా కారణాలుపై పోలీసులు దర్యాప్తు రమ్య ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు అంతుపట్టక పోవడంతో పోస్టుమార్టం రిపోర్టు ఆదారంగా కేసును దర్యాప్తు చేసి కారణాలును కనుగొనడానికి పోలీసులు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. రమ్యకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా లేకా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది పోస్టు మార్టం రిపోర్టులో తెలుస్తుందని, దాని ఆధారంగా కారణాలును తెలుసుకోవచ్చునని పోలీసులు బావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈనెల 26 వ తేదీన రమ్య పోస్టుమార్టం రిపోర్టు వస్తుందని అప్పుడు వరకూ వేచి చూసి అప్పుడు ఆత్మహత్య కారణాలుపై దర్యాప్తు చేయాలని పోలీసులు బావిస్తున్నట్లు తెలుస్తుంది. పోస్టు మార్టం ఆదారంగా అయినా రమ్య ఆత్మహత్యకు కారణాలు తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే. -
నిఘా నీడలో పోస్టుమార్టం
సాక్షి, చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్ మృతదేహానికి ఎట్టకేలకు శనివారం పోస్టుమార్టం జరిగింది. ఈ ప్రక్రియ ఐదుగురు వైద్యులతో కూడిన బృందం తో పాటు తిరువళ్లూరు మెజిస్ట్రేట్ తమిళ్ సెల్వి సమక్షంలో జరిగింది. పూర్తిగా వీడియో చిత్రీకరణ చేశారు. ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో నిందితుడిగా పట్టుబడ్డ రామ్‌కుమార్ గత నెల పుళల్ కేంద్ర కారాగారంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తనయుడి మృతిలో అనుమానం ఉందంటూ రామ్‌కుమార్ తండ్రి పరమశివం కోర్టు మెట్లు ఎక్కడంతో పోస్టుమార్టం వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మృత దేహాన్ని చెన్నై రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పది రోజులకు పైగా ఉంచాల్సి వచ్చింది. ఎట్టకేలకు పరమశివం తరఫు వాదనల్ని కోర్టు పక్కన పెట్టడంతో పోస్టుమార్టం నిర్వహణకు తగ్గ చర్యలు చేపట్టారు. కోర్టు ఆదేశాల మేరకు ఐదుగురు వైద్యులతో కూడిన బృందం రంగంలోకి దిగింది. ఆ మేరకు శనివారం నిఘా నీడలో రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. నిఘానీడలో: రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహణ సమాచారంతో అందరి దృష్టి రాయపేట ప్రభుత్వ ఆసుపత్రి మీద పడింది. దీంతో ఆ పరిసరాల్లో క ట్టుదిట్టమైన భ ద్రతా ఏర్పాట్లు చేశారు. పది గంటల సమయంలో తిరువళ్లువర్ మెజిస్ట్రేట్ తమిళ్ సెల్వం సమక్షంలో రామ్‌కుమార్ మృతదేహాన్ని పరమశివం గుర్తించారు. ఈ సమయంలో వీసీకే నేత తిరుమావళవన్, న్యాయవాది రామ్రాజ్ అక్కడే ఉన్నారు. తదుపరి మెజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. గొంతు, చాతి మీద గాయాలు ఉండడాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలో ఆ గాయాలకు గల కారణాలను ప్రత్యేకంగా పరిశీలించే విధంగా వైద్య బృందానికి ఆదేశాల్ని మెజిస్ట్రేట్ జారీ చేశారు. పదిన్నర గంటల సమయంలో ఎయిమ్స్ వైద్యుడు డాక్టర్ కదిర్ కె.గుప్తా, రాయపేట, కీల్పాకం, స్టాన్లీ ఆసుపత్రులు వైద్యులు వినోద్, సెల్వకుమార్, మణి గండన్, రాజులతో కూడిన బృందం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. గంటన్నర పాటు సాగిన ఈ ప్రక్రియను రెండు కెమెరాల ద్వారా పూర్తిగా వీడియో చిత్రీకరించారు. వాగ్వివాదం: మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ముందుగా వైద్యులతో రామ్‌కుమార్ తరఫు న్యాయవాదులు వాగ్యుద్దానికి దిగారు. కోర్టు తమకు కల్పించిన అవకాశం మేరకు పోస్టుమార్టం నివేదిక నకలు, వీడియో దృశ్యాలు, ఫొటోలను తమకు పోస్టుమార్టం పూర్తయిన గంటన్నరలోపు ఇవ్వాల్సిందిగా వైద్యులకు సూచించారు. ఇందుకు వైద్య బృందం నిరాకరించడంతో వాగ్యుద్ధం చోటు చేసుకుంది. చివరకు వీసీకే నేత తిరుమావళవన్ జోక్యం చేసుకుని, రాత్రిలోపు తమకు సమర్పించాలని సూచించారు. లేని పక్షంలో మృతదేహాన్ని తీసుకోబోమని స్పష్టం చేశారు. అవసరం అయితే, రీ పోస్టుమార్టం చేయొచ్చని సూచించారు. తమకు అన్ని ప్రక్రియల్ని త్వరితగతిన ముగించి నకలు పత్రాలను చేతికిచ్చినప్పుడే మృతదేహానికి తీసుకుంటామని తేల్చారు. దీంతో పోస్టుమార్టం అనంతరం మృతదేహం మళ్లీ మార్చురీకి పరిమితమైంది. -
చెరువులో వ్యక్తి మృతదేహం
రంగారెడ్డి జిల్లా మెడ్చల్ మండలం ఎల్లన్‌పేట చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలి ఆడటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు జారిపడ్డాడా లేక ఎవరైన హత్యచేసి చెరువులో పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒకటిలోగా పోస్టుమార్టం నిర్వహించండి
టీనగర్: స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్‌కుమార్ మృతదేహం పోస్టుమార్టం అక్టోబరు ఒకటవ తేదీలోగా నిర్వహించి, ఈనెల 30వ తేదీ వరకు మృతదేహాన్ని భద్రపరచాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. స్వాతి హత్య కేసులో అరెస్టయి పుళల్ జైల్లో ఉంచిన రామ్‌కుమార్ ఈనెల 18న విద్యుత్ వైరును కొరికి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే. అతని మృతదేహానికి ఆరు రోజులుగా పోస్టుమార్టం నిర్వహించకుండా రాయపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఇలావుండగా రామ్‌కుమార్ మృతిపై అనుమానం ఉన్నట్లు, పోస్టుమార్టంలో తమ తరఫు వైద్యుని అనుమంతించాలని కోరుతూ రామ్‌కుమార్ తండ్రి పరమశివన్ దాఖలు చేసిన కేసులో ముగ్గురు న్యాయమూర్తులు విభిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఉత్తర్వుల్లో పోస్టుమార్టంకు నలుగురు ప్రభుత్వ వైద్యులు, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఒకరిని నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇందులో రామ్‌కుమార్ తండ్రి తరఫు కోర్కెను ముగ్గురు న్యాయమూర్తుల తీర్పులో నెరవేరని కారణంగా శుక్రవారం ఐదుగురు న్యాయమూర్తులు ఈ కేసును విచారించాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి విన్నవించారు. ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు న్యాయమూర్తుల ఉత్తర్వుల తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. అంతవరకు పోస్టుమార్టంను నిలిపివేయాలని రామ్‌కుమార్ తరఫు వాదనను ముందుంచారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి బదులిస్తూ ఇదివరకే కేసులో ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తులను సంప్రదించాల్సిందిగా సూచించారు. దీంతో రామ్‌కుమార్ తండ్రి తరషు లాయర్లు న్యాయమూర్తి కృపాకరన్‌కు అప్పీల్ చేశారు. ఆ సమయంలో రామ్‌కుమార్ తరఫున ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులపై నమ్మకం లేదని తెలిపారు. అందుకు న్యాయమూర్తి అనేక కేసుల్లో ఎయిమ్స్ వైద్యులు వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన విషయం మరువలేమని తెలిపారు. అనంతరం ఆయన జోక్యం చేసుకుంటూ ఈ కేసులో రాజకీయ పక్షాలు తలదూర్చుతున్నాయని, ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. అనంతరం రామ్‌కుమార్ తండ్రి వద్ద అభిప్రాయాన్ని సేకరించేందుకు పిలిపించారు. అందుకు శంకరసుబ్బు తమరు అతని కోసమే వాదిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం తరఫున ఏ సమాధానం ఇస్తున్నారని ప్రశ్నించారు. అందుకు ప్రభుత్వ న్యాయవాది బదులిస్తూ రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం చేయనందున మిగతా పోస్టుమార్టం పనులు స్తంభించిపోయినట్లు పేర్కొన్నారు. ఇదివరకే రామ్‌కుమార్ తండ్రి తరపు ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించడాన్ని, అందుకాయన సుప్రీంకోర్టును సంప్రదించాల్సిందిగా సూచించినట్లు పేర్కొన్నారు. దీన్ని విన్న న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తిని కలిసి తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు. తర్వాత ఆయన ప్రధాన న్యాయమూర్తితో సమాలోచన జరిపిన రామ్‌కుమార్ మృతదేహాన్ని ఈ నెల 30వ తేదీ వరకు మార్చురీలో భద్రపరచాలని, అక్టోబర్ ఒకటవ తేదీలోగా పోస్టుమార్టం చేయాలని ఉత్తర్వులిచ్చారు. -
పోస్టుమార్టంకు అనుమతి
ప్రైవేటు వైద్యుడికి అనుమతి నిరాకరణ ఎయిమ్స్ వైద్యుడ్ని నియమించుకోవచ్చు హైకోర్టు ఆదేశం సాక్షి, చెన్నై : రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు తగ్గ అనుమతిని మద్రాసు హైకోర్టు జారీ చేసింది. అయితే, రామ్‌కుమార్ తండ్రి పరమశివం విజ్ఞప్తిని కోర్టు తోసి పుచ్చింది. ఈనెల 27లోపు పోస్టుమార్టం నిర్వహించే విధంగా గురువారం న్యాయమూర్తి కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్ పుళల్ కేంద్ర కారాగారంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇది ముమ్మాటికి హత్యేనంటూ రామ్‌కమార్ తండ్రి పరమ శివం, న్యాయవాది రామరాజ్ ఆరోపించే పనిలో పడ్డారు. అలాగే, పోస్టుమార్టం ప్రైవేటు వైద్యుడి పర్యవేక్షణలో నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని, కేసు విచారణ సీబీఐకు అప్పగించాలని పట్టుబడుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ సమయంలో ఇద్దరు న్యాయమూర్తుల మధ్య వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం కావడంతో చివరకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌కు మార్చారు. ఆ మేరకు న్యాయమూర్తి కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్ గురువారం పిటిషన్‌ను విచారించింది. వాదన అనంతరం ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడ్ని అనుమతించబోమని బెంచ్ స్పష్టం చేసింది. అయితే, ఢిల్లీ ఎయిమ్స్ ఆసుప్రతి వైద్యుడి పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించుకోవచ్చని సూచించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నలుగురు, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడితో కలిసి పోస్టుమార్టంను ఈనెల 27లోపు నిర్వహించాలని, ఈ ప్రక్రియ పూర్తిగా వీడియో చిత్రీకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, దీనిని పిటిషనర్ వ్యతిరేకిస్తూ శుక్రవారం అప్పీలుకు వెళ్లేందుకు నిర్ణయించారు. ఇదిలా ఉండగా, టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ మీడియాతో మాట్లాడుతూ రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరపడంలో జరుగుతున్న జాప్యం, ఈ మరణం వెనుక మిస్టరీని బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆందోళనకు నిర్ణయించామని ప్రకటించారు. -
చెరువులో పడి గుర్తుతెలియని మహిళ మృతి
వర్ని మండలం రద్రూరు శివారులో ఉన్న చెరువులో పడి ఓ గుర్తుతెలియని మహిళ మృతిచెందింది. మహిళ వయసు సుమారు 40 సంవత్సరాలు ఉండవచ్చు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
నడుం విరగగొట్టి.. సంచిలో కుక్కి!
-
నడుం విరగగొట్టి.. సంచిలో కుక్కి!
ఒడిశాలో మృతదేహాన్ని తరలించిన తీరు బాలాసోర్: ఒడిశాలో మరో అమానవీయ ఘటన జరిగింది. బాలాసోర్ జిల్లాలో సోరో పట్టణం. 80ఏళ్ల అవ్వ సాలామణి బారిక్ బుధవారం రైలు ఢీకొని చనిపోయింది. ఆమె మృతదేహం స్థానిక ఆరోగ్య కేంద్రం వద్ద గంటల తరబడి పడిఉంది. పోస్ట్‌మార్టమ్ కోసం 30 కి.మీ. దూరంలోని జిల్లా ఆస్పత్రికి తరలించాలి. రైల్లో పంపాలని నిర్ణయించారు. ఆరోగ్య కేంద్రం నుంచి స్టేషన్ రెండు కి.మీ. దూరం ఉంది. తరలించే పని ఆస్పత్రి కార్మికులకు అప్పజెప్పారు. ముగ్గురు కార్మికుల్లో ఒకరు మృతదేహంపై నిలబడి నడుము వద్ద కాళ్లతో తొక్కుతూ ఎముకలు విరగగొట్టాడు. మిగతా ఇద్దరూ మృతదేహాన్ని మడతపెట్టి ఒక సంచిలో మూటగట్టి వెదురుబొంగు కు కట్టి దాన్ని భుజాన మోస్తూ బయల్దేరారు. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో శుక్రవారం సంచలనం సృష్టించింది. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం.. రైల్వే, బాలాసోర్ జిల్లా అధికారులను వివరణ అడిగింది. కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. అంబులెన్స్‌ల కొరత వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని.. అన్ని జిల్లాల్లో అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని కేంద్రమంత్రి మేనకాగాంధీ పేర్కొన్నారు. -
గాంధీ మార్చురీలో శవాలను మార్చేశారు
గాంధీ ఆస్పత్రి: శవాలను మార్చేసి పోస్టుమార్టం నిర్వహించి ఆనక చేసిన తప్పిదాన్ని తెలుసుకుని సదరు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించిన ఘటన గాంధీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. నాలుగు రోజులుగా బతిమాలుతున్నా పోస్టుమార్టం చేయకుండా తిప్పించి, ఇప్పుడు తప్పు చేసి మృతదేహాన్ని అప్పగిస్తారా అంటూ మృతుని బంధువులు వారితో వాగ్వాదానికి దిగారు. గాంధీ మార్చురీలో మంగళవారం చోటు చేసుకున్న సంఘటన వివరాల్లోకి వెళితే..మహబూబ్‌నగర్‌కు చెందిన ఎండీ గౌస్ కొద్దిరోజుల క్రితం ఇంట్లో కాలుజారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను నాలుగు రోజుల క్రితం మృతిచెందాడు. మెడికో లీగల్ కేసు కావడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి బాక్స్ నంబర్ 18లో భధ్రపరిచారు. హహబూబ్‌నగర్ పోలీసులు వచ్చి పంచనామా చేస్తేనే పోస్టుమార్టం చేస్తామనడంతో గౌస్ కుటుంబసభ్యులు నాలుగురోజులుగా మార్చురీ వద్దే పడిగాపులు పడుతున్నారు. ఇదిలా ఉండగా గాంధీనగర్ ఠాణా పరిధిలో సోమవారం లభించిన గుర్తుతెలియని మృతదేహాన్ని మార్చురీలోని బాక్స్ నంబర్ 16లో ఉంచారు. రికార్డులో మాత్రం బాక్స్ నంబర్ 18గా నమోదు చేశారు. మంగళవారం ఉదయం గాంధీనగర్ పోలీసులు పంచనామా చేసి నివేదిక ఇవ్వడంతో 18వ నెంబర్ బాక్స్‌లోని గౌస్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత తప్పును గుర్తించిన మార్చురీ సిబ్బంది పోస్టుమార్టం చేసేశాం మృతదేహం తీసుకెళ్లాలని గౌస్ కుటుంబ సభ్యులకు సూచించారు. నాలుగు రోజులుగా తిప్పించి పోలీసులు రాకుండానే పోస్టుమార్టం నిర్వహించడం వెనుక ఎదో మతలబు ఉందన్న అనుమానంతో వారు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంగీకరించకుండా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో మార్చురీ సిబ్బంది, పోలీసులు, వైద్యులు నచ్చజెప్పడంతో గౌస్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంగీకరించారు. -
ఆ రాత్రి వచ్చింది?
పట్టుకోండి చూద్దాం ‘‘ఇంత అన్యాయం చేసి పోతావనుకోలేదయ్యా....’’ బిగ్గరగా రోదిస్తున్నాడు రమణయ్య. అందరూ రమణయ్యను జాలిగా చూస్తున్నారు. ‘‘ఎవరండీ ఆయన?’’ ‘‘రమణయ్య అని ఈ ఇంట్లో పనిమనిషి. గత పాతిక సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నాడు. రాజావారికి అన్నీ తానై చూస్తున్నాడు... ఎంత గొప్ప అనుబంధమో...’’ రాజావారి అసలు పేరు... రాజారావు. అందరూ గౌరవంగా ‘రాజావారు’ అని పిలుస్తుంటారు. రాజావారిది పెద్ద చెయ్యి. దానధర్మాలు ఎక్కువగా చేస్తుంటారు. ఇది నచ్చని ఆయన భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. సంవత్సరాలు గడిచిపోయాయి గానీ ఆమె తిరిగి రాలేదు. అలా ఒంటరైన రాజావారికి రమణయ్య చేదోడువాదోడు అయ్యాడు. ‘‘పాపం... రమణయ్యను చూడండి.... భార్యాపిల్లలు కూడా అంతగా తల్లడిల్లిపోరు...’’ అని ఎవరో సానుభూతిగా అంటున్నారు. ఒకరోజు... బంధువు చనిపోయాడంటూ రమణయ్య ఏదో ఊరు వెళ్లాడు. మరుసటి రోజు తిరిగి వచ్చాడు. ఉదయం పదిదాటినా... ఇంటి తలుపులు తెరుచుకోలేదు. రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా సరే... ఉదయం నాలుగింటికల్లా లేచి, వ్యాయామాలు చేసి, ఇంటి ముందు వసారాలో పేపర్ చదువుతూ కూర్చోవడం రాజావారి అలవాటు. ఆరోజు మాత్రం తలుపులు ఇంకా మూసే ఉన్నాయి. తలుపులు దబదబా బాదాడు రమణయ్య. ఎంతసేపటికీ అవి తెరుచుకోలేదు. రమణయ్య ఇరుగు, పొరుగు వాళ్ల దగ్గరికి పరుగెత్తి.... ‘‘ఎంత గట్టిగా తలుపులు బాదినా మా అయ్యగారు... తీయడం లేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు. నాకేదో భయంగా ఉంది’’ అని బిగ్గరగా ఏడ్వడం మొదలు పెట్టాడు. ‘‘ఏమైందో చూద్దాం పదా’’ అని ఇరుగుపొరుగు రాజావారి ఇంటికి చేరుకున్నారు. ‘‘రాజావారు... రాజావారు’’ అని గట్టిగా తలుపులు బాదడం మొదలుపెట్టారు. అందరికీ అనుమానం వచ్చింది. ‘కచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది’ అనుకున్నారు అందరు. అందరూ కలిసి తలుపులను బద్దలు కొట్టి లోనికి వెళ్లారు. ఒక చిన్న టేబుల్ ముందు కుర్చీలో కళ్లు మూసుకొని కనిపిస్తున్నారు రాజావారు. టేబుల్ మీద ఒక హాఫ్‌బాటిల్ మందు, ప్లాస్కు, ఖాళీ అయిన ఒక గ్లాస్ కనిపిస్తుంది. రాజావారిని కదిలించి చూశారు. అనుమానించినట్లే... ఆయన చనిపోయి ఉన్నారు. ‘‘రెండు పెగ్గులకు మించి తాగినట్లు కనిపించడం లేదు. ఈ మాత్రం దానికే...’’ అని ఎవరో ఆశ్చర్యపడ్డారు. ‘‘రాజావారి శక్తి గురించి నాకు తెలుసు. ఇలా కూర్చొని అలా ఫుల్‌బాటిల్ తాగేయగలరు. అలాంటి వ్యక్తి ఆఫ్ట్రాల్ రెండు పెగ్గులకు చనిపోవడం ఏమిటి? ఏదో జరిగింది...’’ ‘‘అనుమానం ఎందుకు? ఇది ఖచ్చితంగా హత్యే’’ ‘‘వేసిన తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి... పని మనిషి రమణయ్య ఊరికెళ్లాడు. బయటి వ్యక్తి ఇంట్లోకి వచ్చిన ఆనవాళ్లు కూడా ఏవీ కనిపించడం లేదు... ఇది హత్యేనంటావా?’’ ‘‘అలా అయితే ఆత్మహత్య అని చెప్పడానికి కూడా ఏ ఆధారం కనిపించడం లేదు కదా...’’ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో రాజావారిపై విషప్రయోగం జరిగిందనే విషయం తెలిసింది. దర్యాప్తు తరువాత... పోలీసులు పనిమనిషి రమణయ్యను అరెస్ట్ చేసి నిజం కక్కించారు. రాజావారు మందు తాగిన ఆ రాత్రి రమణయ్య ఊళ్లోనే లేడు. ఇంట్లో కూడా ఎవరూ లేరు. బయట నుంచి ఎవరూ రాలేదు. మరి విషప్రయోగం ఎలా జరిగింది? ఊరికి వెళ్లేముందు... విషం కలిపిన నీళ్లను డీప్ ఫ్రిజ్‌లో పెట్టాడు రమణయ్య. విషయం తెలియని రాజావారు... ఫ్రిజ్ నుంచి ఆ విషంతో కూడిన ఐస్‌క్యూబ్‌లను తీసుకొని మందు గ్లాస్లో వేసుకున్నారు. తాగి చనిపోయారు. తనను అనుమానించకుండా ఉండడానికి ఆరోజు ఊళ్లో లేకుండా జాగ్రత్తపడ్డాడు రమణయ్య. -
ఆయనొద్దు.. ఈయనొద్దు!
► బదిలీలపై టీడీపీ నేతల పోస్టుమార్టం ► ఒత్తిళ్లతో జిల్లా అధికారుల బేజారు ► కొత్త స్థానాల్లో చేరని పలువురు ఉద్యోగులు ► యథాస్థానాల కోసం నేతల పట్టు ► మరోసారి బదిలీలు తప్పవనే చర్చ సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో మరోసారి బదిలీలు చేపట్టాల్సి రానుందా? బదిలీలు చేయాల్సిందేనంటూ అధికార పార్టీ నేతల నుంచి మళ్లీ ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయా? ఈ నేపథ్యంలోనే బదిలీ అయిన పలువురు ఉద్యోగులు ఆయా స్థానాల్లో బాధ్యతలు చేపట్టలేదా? అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో మరోసారి బదిలీల ఫైళ్లను దులపనున్నారా? అనే వరుస ప్రశ్నలకు నిజమేననే సమాధానం వస్తోంది. ఒకవైపు రెవెన్యూలో కీలక సంస్కరణలు అమలవుతున్న సందర్భంలో పలువురు తహశీల్దార్లు విధుల్లో చేరేందుకు విముఖత చూపుతుండటంతో పాలన అస్తవ్యస్తంగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం చందంగా అధికార పార్టీలోని నేతల నుంచే వద్దని ఒకరు.. చేయాల్సిందేనని మరొకరు ఒత్తిళ్లు తెస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు మరోసారి బదిలీలకు సిద్ధమవుతున్నట్లు చర్చ జరుగుతోంది. చేరమంటే చేరం.. ► జిల్లాలో మొత్తం 16 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. అయితే, ఇందులో పలువురు ఇంకా బదిలీ జరిగిన ప్రాంతంలో బాధ్యతలు తీసుకోలేదు. ప్రధానంగా ఆళ్లగడ్డ తహసీల్దార్‌ను రుద్రవరానికి బదిలీ చేశారు. అయితే, ఈయన ఇప్పటివరకు విధుల్లో చేరలేదు. అహోబిలం ఆలయం విషయంలో స్థానికంగా ఉన్న ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య ఉన్న ఆధిప్యత పోరులో భాగంగా బదిలీ జరిగింది. ఈ నేపథ్యంలో మరో అధికార పార్టీ నేత బదిలీ చేసిన చోట బాధ్యతలు తీసుకోవద్దని, మళ్లీ ఇక్కడికే పోస్టింగ్ ఇప్పిస్తానని చెబుతున్నట్టు సమాచారం. ► కల్లూరు తహసీల్దారును బీ-సెక్షన్ సూపరిండెంటుగా బదిలీ చేశారు. ఈయన కూడా విధుల్లో చేరలేదు. ఏదో ఒక మండలానికి తహసీల్దారుగా వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు కొద్ది మంది అధికార పార్టీ నేతలు పైరవీ చేస్తున్నారని తెలిసింది. ► సి.బెళగల్ తహశీల్దారును బనగానపల్లెకు మార్చారు. ఈయన కూడా విధుల్లో చేరలేదు. కోడుమూరు నియోజకవర్గంలో కొద్దిరోజుల క్రితం పార్టీ మారిన నేత ఈ బదిలీ వెనుక ఉన్నారని సమాచారం. దీంతో మరో అధికార పార్టీ నేత ఈయనను ఇక్కడే ఉంచేందుకు పావులు కదపడం ప్రారంభించారు. ఈ విధంగా పలువురు తహసీల్దార్లు బదిలీ జరిగిన చోటకు వెళ్లకుండా నచ్చిన చోటనే ఉండేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అవకాశం లేకున్నా... ప్రభుత్వం విడుదల చేసిన బదిలీ ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఏ ఒక్క తహసీల్దారునూ బదిలీ చేసే అవకాశం లేదు. అయితే, పరిపాలన సౌలభ్యం పేరుతో అధికార పార్టీ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు కొద్ది మందిని బదిలీ చేశారు. ఇప్పుడు అధికార పార్టీ నేతల్లోనే ఎక్కడికక్కడ మరో వర్గం బదిలీ జరగకుండా ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎవరి మాట వినాలనే విషయంలో జిల్లా ఉన్నతాధికారులకూ అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా కొంత మంది వివిధ ఆరోపణలతో పోస్టింగులు కూడా దక్కించుకోలేదు. వీరు కూడా ఇప్పుడు పోస్టింగుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తం మీద మరోసారి జిల్లాలో బదిలీల ప్రక్రియకు తెరలేవనుందన్నమాట. -
బడి ఉన్నా.. బతికేదానివే!
► ఆడుకుంటుండగా మెడకు చుట్టుకున్న తువ్వాలు ► విషాదం మిగిల్చిన ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి ► కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ఆదివారం.. బడికి సెలవు. అమ్మానాన్నలతో పాటు చిట్టి చెల్లెళ్లను చూసేందుకు ఇంటికొచ్చింది ఆ చదువుల తల్లి. ఉదయమే నాన్న ఆటో నడిపేందుకు వెళ్లిపోగా, అమ్మ పూలమ్మేందుకు వెళ్లింది. ఇంటి పట్టునే ఇద్దరు చెల్లెళ్లతో కలసి ఆడుకుంటున్న ఆ బాలిక ఆదే వారితో ఆఖరి ఆట అవుతుందని ఊహించి ఉండదు. పొరపాటున తువ్వాలు మెడకు చుట్టుకోవడంతో ఊపిరి ఆగిపోయింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. - తాడిపత్రి రూరల్ తాడిపత్రి రూరల్ మండలం భోగసముద్రం గ్రామానికి చెందిన రామాంజనమ్మ, వీరశేఖర్‌గౌడ్ దంపతుల పెద్దకుమార్తె తేజస్విని(12) ప్రమాదవశాత్తు తువ్వాళు మెడకు చుట్టుకుని మరణించింది. పైన పేర్కొన్న దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా, తేజస్విని కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లి ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివేది. మిగిలిన ఇద్దరు పిల్లలు గీతాంజలి(9) స్వగ్రామంలోనే ఐదో తరగతి చదువుతుండగా, కావేశ్వరి(6) రెండో తరగతి చదువుతోంది. పిల్లలను బాగా చదివించాలని.. వీరశేఖర్‌గౌడ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండగా, రామాంజనమ్మ పూలు అమ్మి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. తాము పడే కష్టం పిల్లలకు వద్దనుకున్నారు. ఎన్ని ఇబ్బందులైనా వారిని బాగా చదివించాలని ఆశించారు. చదువులో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న పెద్ద కుమార్తెను చూసి వారు మురిసిపోయేవారు. పెద్ద పెద్ద చదువులు చదివి, మంచి స్థాయికి ఎదిగాక వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉంటారని భావించారు. బతికించుకోవాలని... అప్పటి వరకు తమతో ఆడుకున్న అక్క ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయింది. భయంతో మిగిలిన ఇద్దరు పిల్లలు పరుగున వెళ్లి అమ్మతో చెప్పారు. వెంటనే ఆమె ఇంటికి చేరుకుని ఆగమేఘాల మీద బిడ్డను బతికించుకుందామని తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బిడ్డ ఇక లేదని చెప్పడంతో ఆమె అక్కడికక్కడే స్పృహతప్పింది. కాసేపటికి తేరుకున్నాక విగతజీవిగా మారిన బిడ్డ గుండెలపై పడి ‘బిడ్డా.. ఎంత పనైందే తల్లీ. బడి ఉన్నా నువ్వు బతికేదానికి కదా? అంటూ రామాంజనమ్మ నోటి వెంట వచ్చిన ఒక్కో మాట అందరినీ కదిలించింది. మృతదేహానికి పోస్టుమార్టం సమాచారం తెలిసిన వెంటనే రూరల్ ఎస్ఐ నారాయణరెడ్డి తమ సిబ్బందితో ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని ఆరా తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. -
పెళ్లైన రెండు నెలలకే..
యువకుడి ఆత్మహత్య ముత్తుకూరు : వివాహమైన రెండు నెలలకే ఓ యువకుడు ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన ముత్తుకూరులో బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్సై శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారం.. స్థానిక చలివేంద్ర రోడ్డులోని పాత దళితవాడకు చెందిన దుంపల నరసింహులుకు గురుకుల పాఠశాల వద్ద కట్టెల దుకాణం ఉంది. పెద్ద కొడుకు శంకర్ (29) వరగలి వద్ద రొయ్యల పెంపకం చేస్తున్నాడు. అర్ధరాత్రి శంకర్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కట్టెల దుకాణానికి వచ్చి అక్కడ ఉన్న పూరింట్లో చీరెతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం కట్టెల దుకాణం వద్దకు వచ్చిన నరసింహులు పూరిల్లు కొయ్యకు కొడుకు శంకర్ ఉరేసుకుని ఉండాటాన్ని గమనించగా అప్పటికే మృతి చెందాడు. మృత దేహాన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. మృతుడి జేబులోని లభించిన ఉత్తరాన్ని పోలీసులకు అందజేశాడు. కొందరి వేధింపు వల్లే.. అయితే శంకర్ కొందరి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పోర్టుకు చెందిన ఓ ఉద్యోగి, చిల్లకూరుకు చెందిన పోలీసు అధికారి, వరగలి మాజీ సర్పంచ్, మరో ఆరుగురు గతంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో వీరంతా తనను తీవ్ర మనోవేదనకు గురి చేశారని, తన ఆత్మహత్యకు వీరే కారణమని అందులో పేర్కొన్నాడు. దీనిపై విచారణ జరుపుతామని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
భర్త చేతిలో భార్య హతం
► మూడు నెలల క్రితమే వివాహం ► కాలూర్‌తిమ్మన్‌దొడ్డి శివారులో ఘటన ► నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు గట్టు : వారికి మూడు నెలలక్రితమే వివాహమైంది.. దైవ దర్శనానికి తీసుకెళ్లి అంతలోనే గొడవపడి కట్టుకున్న భార్యనే భర్త దారుణంగా చంపేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరించబోయాడు.. చివరకు అతడిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మూడునెలల క్రితం కర్ణాటక రాష్ర్టంలోని మాన్వితండాకు చెందిన మాణిక్యమ్మ (23) కు గట్టు మండలంలోని మల్లాపురంతండా వాసి రంగనాయక్తో వివాహమైంది. అప్పటి నుంచి దంపతులు రాయచూర్ జిల్లా మట్మారి-మరిసెపాడు దగ్గర కట్టె (వంట చెరుకు) లను సేకరించి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, మూడు రోజుల క్రితమే ఇద్దరూ స్వగ్రామానికి వచ్చి కుటుంబ విషయమై గొడవపడ్డారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ధరూర్ మండలంలోని పాగుంట స్వామి దైవ దర్శనానికి బైక్‌పై వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో కాలూర్‌తిమ్మన్‌దొడ్డి శివారులోకి చేరుకోగానే ఆపి భార్యను బండరాయితో మోది చంపేశాడు. అక్కడి నుంచి కాలూర్తిమ్మన్దొడ్డికి తీసుకెళ్లి ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని గ్రామస్తులకు చెప్పగా వారు నమ్మలేదు. చివరకు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో అసలు విషయం బయటపడింది. సంఘటన స్థలాన్ని గద్వాల డీఎస్పీ బాలకోటి, అలంపూర్ సీఐ వెంకటేశ్వర్లు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. -
ఆశ తీరకుండానే.. అనంతలోకాలకు!
► పొలం దున్నడానికి వెళ్లి యువకుడి మృత్యువాత ► పెద్దగూడెంలో విషాదఛాయలు ఆ యువకుడు కొన్నేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. నాలుగురోజుల క్రితమే సొంతంగా ట్రాక్టర్ కొన్నాడు.. మొదటి కిరాయిగా ఓ పొలంలో వాహనంతో దున్నడానికి వెళ్లి ప్రమాదవశాత్తు దాని కిందే పడి అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు.. ఈ సంఘటతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. వనపర్తి రూరల్ : మండలంలోని పెద్దగూడేనికి చెందిన ముష్టి కొండన్న (29) వృత్తిరీత్యా డ్రైవర్. ఈయనకు భార్య రాధతోపాటు మూడేళ్ల కుతూరు ఉంది. కొన్నేళ్లుగా వేరేవారి ట్రాక్టర్‌పై పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కాగా, నాలుగు రోజుల క్రితమే ప్రైవేట్ ఫైనాన్స లో రూ.7.5 లక్షలు అప్పు తీసుకుని సొంతంగా ట్రాక్టర్ కొన్నాడు. మొదటి కిరాయిగా ఆదివారం ఉదయం శివారులోని ఓ రైతు పొలంలో దుక్కి దున్నడానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు అక్కడ రాయిపై నుంచి వాహనం ఎక్కడంతో దాని టైర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకుని బోరుమన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు. హుటాహుటిన అనంతరం వనపర్తి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. బాధిత కుటుంబాన్ని ఎంపీపీ శంకర్‌నాయక్, సర్పంచ్ జానకీకొండన్న, ఎంపీటీసీ సభ్యుడు నరసింహగౌడ్ తదితరులు పరామర్శించారు. -
ఉలిక్కిపడ్డ బుక్కరాయసముద్రం
దారుణం ► వివాదంలో ఉన్న భూమి దున్నేందుకు ప్రయత్నం ► అభ్యంతరం తెలిపిన చిన్నాన్నను వేటకొడవలితో నరికి చంపిన వైనం ► ఆపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన నిందితుడు ఆస్తి.. బంధాలు, బంధుత్వాలను విడదీస్తుంది. విధ్వేషాలను పెంచుతుంది. కక్షలకు ఆజ్యం పోస్తుంది. అవసరమైతే ప్రాణాలు తీస్తుంది. ఈ విషయం మరోసారి రుజువైంది. చిన్నాన్ననే వేటకొడవలితో నరికి చంపి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు వరుసకు కొడుకయ్యే ఓ వ్యక్తి. ఈ సంఘటనతో ఊరు ఉలిక్కిపడింది. రెండు కుటుంబాల మధ్య తలెత్తిన కక్షలకు ఓ నిండు ప్రాణం బలైపోవడం సంచలనం సృష్టించింది. - బుక్కరాయసముద్రం బుక్కరాయసముద్రానికి చెందిన బసన్న(65)ను అతని అన్న కుమారుడైన వెంకటేశ్ విచక్షణారహితంగా వేటకొడవలితో చంపడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దేవరకొండ గ్రామ సర్వే నంబర్ 376లో ఎనిమిదెకరాల పొలం ఉండగా, పై రెండు కుటుంబాల మధ్య మూడేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. ఈ విషయంగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పొలాన్ని చూసేందుకు వెళ్లగా... సోమవారం ఉదయమే బసన్న తన మనవుడు వాసుతో కలసి బైక్‌లో పొలం చూసేందుకు వెళ్లారు. అప్పటికే అక్కడ వెంకటేశ్ తన భార్య ఎర్రమ్మతో కలసి ట్రాక్టర్‌తో దున్నుతుండడాన్ని గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి ప్రశ్నించారు. వివాదంలో ఉండగానే పొలాన్ని ఎలా దున్నుతావంటూ నిలదీశారు. ఈ విషయంగా మారి మధ్య మాటామాటా పెరిగింది. రేయ్.. నువ్విక్కడి నుంచి వెళ్లిపో... బసన్న మనవడు వాసుని ‘రేయ్ నువ్విక్కడి నుంచి వెళ్లిపో.. అంటూ వెంకటేశ్ గట్టిగా అరిచాడు. ఆ తరువాత తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో బసన్నపై విచక్షణారహితంగా దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తరువాత భార్య ఎర్రమ్మను ఇంటికి పంపేసి, నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు వెంకటేశ్. బోరుమన్న కుటుంబ సభ్యులు విషయం తెలిసిన వెంటనే బసన్న కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల వారు భారీగా పొలం వద్దకు చేరుకున్నారు. పొలంలోనే రక్తపు మడుగులో పడి ఉన్న బసన్నను చూసి అతని గుండెలపై పడి కుటుంబ సభ్యులు రోదించారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. రంగంలోకి పోలీసులు ఇన్చార్జ్ ఎస్ఐ శివ, ఏఎస్ఐలు వెంకటేశ్వర్లు, భాస్కర్, సిబ్బంది నేర స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రేమ జంట ఆత్మహత్య
నల్లమలలో అనుమానాస్పదస్థితిలో మృతి ఇద్దరూ సమీప బంధువులు. వరుసకు బావ మరదలు అవుతారు. వారి మధ్య ప్రేమ చిగురించింది. అయితే అప్పటికే యువకుడికి మరో యువతితో పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. అయినా బావ మరదలు ప్రేమను చంపుకోలేక ఒక్కటవ్వాలనుకున్నారు. ఇద్దరూ నెల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. పెద్దలు వారిని పిలిపించి పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినా మార్పు రాలేదు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి శుక్రవారం నల్లమలలో విగత జీవులుగా కనిపించారు. ఆత్మహత్యకు పాల్పడ్డారా.. ఎవరైనా చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. - మహానంది మహానందిలోని ఈశ్వర్‌నగర్‌కు చెందిన నాసరి అశోక్(25)కు వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా జీవనోపాధి పొందుతున్నాడు. అహోబిలం గ్రామానికి చెందిన అశోక్ మేనత్త కుమార్తె రజిత(18) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. వరుసకు బావమరదులు కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నెల క్రి తం పెళ్లి చేసుకోవాలని ఇంటి నుంచి వారు వెళ్లిపోయారు. అనంతరం విషయం తెలుసుకున్న పెద్దలు, పోలీసులు వారిని పిలిపించి అశోక్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి నచ్చచెప్పారు. అయితే వారు ప్రేమను చంపుకోలేక మూడు రోజుల క్రితం మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం తాము నల్లమల అడవిలోని ఎంసీ ఫారం కాశిరెడ్డినాయన ఆశ్రమం సమీపంలోని తెలుగుగంగ కాల్వ వద్ద ఉన్నామని, ఆత్మహత్యకు పాల్పడుతున్నామని అశోక్ తన పెద్దనాన్న కుమారుడు సుంకన్నకు ఫోన్ చేశాడు. వెంటనే సుంకన్న విషయాన్ని కుటుంబీకులకు చెప్పడంతో కొందరు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే రజిత, అశోక్ శవాలై కనిపించారు. శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయినట్లుగా ఉంది. కాగా ఇద్దరు బతికిఉన్నప్పుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటే మంటలు తాళలేక ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో పడి ఉండాలి. ఇద్దరి మృతదేహాలు పక్కపక్కనే ఉండటంతో ఎవరైనా చంపేసి మృతదేహాలను తగులబెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, మహానంది ఎస్ఐ పెద్దయ్య నాయుడు, ఎస్ఐ గోపాల్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రజిత తల్లిదండ్రులు వీరభద్రుడు, వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులకు క్షోభ కలిగించవద్దు ఆకాశమంత పందిళ్లు వేసి పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే విడాకులకు దారి తీస్తున్న ఈ రోజుల్లో ప్రేమ పట్ల ఆకర్షితులై యువతీ యువకులు ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. యువతీ, యువకులు ప్రేమ కోసం మంచి భవిష్యత్తును నాశనం చేసుకోకూడదు. పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చాలి. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలుసుకోవాలి.పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే అనుమానాలు వీడుతాయన్నారు. హరినాథరెడ్డి, డీఎస్పీ, నంద్యాల -
ప్రేమజంట ఆత్మహత్య
► పెళ్లికి అడ్డుపడిన పెద్దలు ► మనస్తాపంతో అఘాయిత్యం పెద్దపల్లి/ఓదెల : వారిద్దరు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. మూడుముళ్లు ఏడడుగుల బంధంతో ఏకమవ్వాలని ఆశపడ్డారు. కానీ వారి ప్రేమ.. పెళ్లికి కులం అడ్డొచ్చింది. అబ్బారుు కుటుంబసభ్యులు ససేమిరా అన్నారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికులు కలిసి బతకలేకపోరుునా.. కలిసే చనిపోదామని నిర్ణరుుంచుకున్నారు. కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని తాగి మరణంలోనూ ఏకమయ్యూరు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓదెల మండలం కొలనూర్‌కు చెందిన కేశెట్టి కృష్ణమూర్తి అలియూస్ కిట్టు(28), మద్దెల మౌనిక(23) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారం రోజుల క్రితం ఈ జంట కొలనూర్ నుంచి వెళ్లి వేములవాడ మండలం అగ్రహారంలో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా కిట్టు బంధువులు అడ్డుకున్నారు. దీంతో పెళ్లి అక్కడే ఆగింది. తనకు న్యాయం చేయాల్సిందిగా మౌనిక గురువారం కొలనూర్‌లోని కిట్టు ఇంటి ముందు దీక్షకు దిగింది. పొత్కపల్లి ఎస్సై శంకరయ్య జంటకు కౌన్సెలింగ్ నిర్వహించి పెళ్లి జరిపేందుకు హామీ ఇచ్చారు. మళ్లీ కిట్టు తల్లిదండ్రులు నిరాకరించడంతో ఇక తాము కలిసి జీవించలేమని మనస్తాపం చెందారు. శనివారం గ్రామం నుంచి బైక్‌పై బయల్దేరి పెద్దపల్లికి చేరుకున్నారు. పట్టణంలో కూల్డ్రింక్తోపాటు క్రిమిసంహారక మందు కొనుగోలు చేశారు. అనంతరం స్థానిక రైల్వే ఓవర్‌బ్రిడ్జి సమీపంలోని ఓ రియల్ వెంచర్లో గల షెడ్ ఆవరణలో కూల్‌డ్రింగ్‌లో విషయం కలుపుకొని తాగి మృతి చెందారు. రాఘవాపూర్ గ్రామస్తులు మృతహదేహాలను చూసి పెద్దపల్లి పోలీసులకు సమాచారం అందించారు. మృతుల వద్ద లభించిన ఆధారాలతో కొలనూర్‌కు చెందిన కిట్టు, మౌనికగా గుర్తించారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. స్థానిక సివిల్ అసుపత్రికి పోస్టుమార్టం చేసిన అనంతరం బంధువులకు మృతదేహాలను అప్పగించారు. కొలనూర్‌లో కిట్టు, మౌనికలకు బంధువులు వేర్వేరుగా అంత్యక్రియలు నిర్వహించారు. కిట్టు తండ్రి కేశెట్టి రాజయ్య, మౌనిక తండ్రి మద్దెల వెంకటయ్య నుంచి ఫిర్యాదు తీసుకున్న ఎస్సై రాజ్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అందరితో కలివిడిగా స్నేహంగా ఉండే కిట్టు, మౌనిక ఆత్మహత్యతో వారి బంధుమిత్రులు, స్నేహితులు విషాదంలో మునిగారు. డిగ్రీ పూర్తి చదివిన ఒక్కగానొక్క కూతురు మద్దెల మౌనిక ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లితండ్రులు మద్దెల వెంకటయ్య, లక్ష్మి తల్లిడిల్లుతున్నారు. కేశెట్టి రాజయ్య దంపతుల చిన్నకుమారుడు కిట్టు. చిన్పప్పటినుంచి కష్టపడి కుటుంబానికి అండగా ఉండే కిట్టు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. -
కన్న పేగును చిదిమేసింది
► జల్సాలకు అడ్డుగా ఉన్నాడని... గొంతుకు తాడు బిగించి హతం ► పోస్టుమార్టంతో వెలుగులోకి నిందితురాలి అరెస్టు ప్రాపంచిక సుఖాలు మనిషిని మృగంగా మారుస్తాయనడానికి ఇదొక నిదర్శనం. జల్సాలకు అలవాటు పడ్డ ఆమెకు కన్న పేగు అడ్డుగా మారింది. కర్కశంగా గొంతుకు తాడు బిగించి చిన్నారిని హత్య చేసింది. ఈ సంఘటన చిత్తూరులో ఆలస్యంగా శుక్రవారం పోస్టుమార్టంతో వెలుగులోకి వచ్చింది. చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని దుర్గానగర్‌కు చెందిన రేఖ (20) బెంగళూరు చెందిన ఒక యువకుడిని 2013లో పెళ్లి చేసుకుంది. వారికి యశ్వంత్ అనే తొమ్మిది నెలల కుమారుడు ఉన్నాడు. ఆమె ప్రవర్తన సరిగా లేకపోవడంతో కొంత కాలం క్రితం ఆ యువకుడు భార్యను వదిలేశాడు. ఆమె పుట్టినిల్లు చిత్తూరుకు చేరుకుంది. ఇక్కడ ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో జల్సా జీవితానికి అలవాటు పడ్డ రేఖకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. మార్చి 9న ఇంట్లో పిల్లాడు ఏడుస్తుండగా కోపం వచ్చి గొంతుకు తాడును బి గించి చంపేసింది. తాను వచ్చి చూసే సరికి పిల్లాడు గుక్కపెట్టి ఏడ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని చుట్టుపక్కల వారిని నమ్మించింది. బిడ్డను తీసుకుని నగరంలోని బౌండి వీధిలో ఉన్న తన చిన్నాన్న చినబాబు ఇంట్లో వదిలి పారిపోయింది. బిడ్డ మృతి చెందిందని గుర్తించిన చినబాబు అదే రోజు అంత్యక్రియలు సైతం చేశాడు. అనంతరం బిడ్డ మృతిపై అనుమానం ఉందని చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ ప్రసాద్ రెవెన్యూ అధికారుల సమక్షంలో బిడ్డ మృతదేహానికి పోస్టుమార్టం చేసి మళ్లీ అంత్యక్రియలు చేశారు. బిడ్డ గొంతుకు తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే చనిపోయినట్లు రెండు రోజుల క్రితం పోస్టుమార్టం నివేదిక వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే నిందితురాలు రేఖను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె పోలీసుల ఎదుట అసలు విషయం ఒప్పుకుంది. ఆమెపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. -
వీధికుక్కకు పోస్టుమార్టం పూర్తి
► మెదడు భాగాలు విశ్లేషణ కోసం ఇన్స్టిట్యూట్కు ► కళేబరం జంతు పరిరక్షణ బృందానికి అప్పగింత ► కేసు దర్యాప్తులో ఉంది: ఇన్స్పెక్టర్ నరేందర్ గౌడ్ పెద్దఅంబర్‌పేట: హయత్‌నగర్‌లోని భాగ్యలత కాలనీలో వెంకటేశం, మల్లేష్‌ల చేతిలో ‘హత్య’కు గురైన వీధికుక్క కళేబరానికి పోస్టుమార్టం పూర్తయింది. ఈ ఉదంతంపై జంతు ప్రేమికురాలు ప్రియాంక ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భాగ్యలత కాలనీ పాతరోడ్డుకు చెందిన వెంకటేశం భార్యను ఓ వీధికుక్క కరిచింది. దీంతో ఆగ్రహం చెందిన ఆయన కుమారుడు మల్లేష్‌తో కలిసి సోమవారం మధ్యాహ్నం దాన్ని చంపారు. ఆ కళేబరాన్ని వీరు పట్టుకుని వెళ్తుండగా స్థానికంగా ఉండే ప్రియాంక గమనించారు. ఆమె ఈ విషయాన్ని జంతు పరిరక్షణ బృందమైన బ్లూక్రాస్కు తెలిపారు. దీంతో బ్లూక్రాస్ ప్రతినిధి ప్రవళిక కళేబరాన్ని హయత్‌నగర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. దాన్ని చంపిన వారిపై కేసు నమోదు చేయాలని ఇన్స్పెక్టర్ జె.నరేందర్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. వెంకటేశం, మల్లేష్‌లపై పోలీసులు ఐపీసీలోని 428 (ఉద్దేశపూర్వకంగా దుందుడుకు స్వభావంతో జంతువును చంపడం), ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ యాక్ట్-1950 లోని సెక్షన్ 11, యానియల్ బర్త్ కంట్రోల్ రూల్స్-2011 కింద కేసు నమోదు చేసి కళేబరాన్ని భద్రపరిచారు. ఆ వీధికుక్కకు వాక్సినేషన్ వేశారని, అది కరిచినా ఎలాంటి ప్రమాదం లేదని, దాన్ని ఎందుకు చంపాల్సి వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సమయంలో ప్రవళిక వాదించారు. వెంకటేశం, మల్లేష్లతో పాటు కొందరు స్థానికులు సైతం ఆ కుక్కకు పిచ్చిపట్టిందని, వరుసగా అనేక మందిని కరుస్తోందని ఆరోపించారు. దీంతో కుక్క కళేబరానికి పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించాలని హయత్‌నగర్ పోలీసులు నిర్ణయించారు. కళేబరాన్ని పోలీసుస్టేషన్లోనే భద్రపరిచిన అధికారులు మంగళవారం ఉదయం హయత్‌నగర్‌లోని వెటర్నరీ ఆస్పత్రిలో డాక్టర్ ఆనంద్‌రెడ్డి ద్వారా పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించారు. తలపై దెబ్బ తగలడం వల్లే కుక్క మరణించిందని వైద్యులు ధ్రువీకరించినట్లు ఇన్స్పెక్టర్ నరేందర్‌గౌడ్ తెలిపారు. అయితే దానికి ర్యాబిస్ వ్యాధి ఉందా? లేదా? దానికి పిచ్చిపట్టిందా? లేదా? అనేవి నిర్ధారించడం కోసం మెదడు నుంచి ఓ పొరను సేకరించిన వైద్యులు దాన్ని విశ్లేషణ నిమిత్తం రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పంపారు. ‘పోస్టుమార్టం అనంతరం శునక కళేబరాన్ని ఖననం చేస్తామని కోరడంతో జంతు పరిరక్షణ బృందానికే అప్పగించాం. వెంకటేశం, మల్లేష్‌లపై నమోదైన కేసు దర్యాప్తులో ఉంది. వెలుగులోకి వచ్చిన వివరాలు, నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని ఇన్స్పెక్టర్ నరేందర్ గౌడ్ ‘సాక్షి’కి తెలిపారు. -
ఆగిన చిరునవ్వులు...
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు అకాల మృత్యువాతపడ్డారు. మణికొండలో సెల్లార్లో పడుకొని ఉన్న బాలికను గుర్తు తెలియని వాహనం బలిగొంది. మరో ఘటనలో కారు ఢీకొని ఏడాది బాలుడు చనిపోయాడు. వచ్చీ రాని మాటలతో చిరునవ్వులు చిందిస్తూ తమను అలరించే కన్నబిడ్డల అకాల మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించారు. వారిని చూసి స్థానికులు కంటతడిపెట్టారు. సెల్లార్లో నిద్రిస్తుండగా.. గచ్చిబౌలి: సెల్లార్లో పడుకొని ఉన్న చిన్నారిని గుర్తు తెలి యని వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటన రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పొట్ట కూటికోసం వచ్చి తమ బిడ్డను పోగొట్టుకున్నామని చిన్నారి తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. సీఐ దుర్గప్రసాద్ కథనం ప్రకారం... మధ్యప్రదేశ్‌కు చెందిన సురేం దర్కౌర్, అంచులా దంపతులు కొన్ని నెలల క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చారు. మణికొండ చిత్రపురి కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఇద్దరూ కూలీ పని చేస్తున్నారు. సోమవారం ఉదయం 9.30కి తమ ఏడాది కుమార్తె పవిత్రను సెల్లార్లో పడుకోబెట్టి పనులకు వెళ్లారు. పది గంటలకు పాప వద్దకు వచ్చి చూడగా రక్తపు మడుగులో కొట్టుకుంటోంది. వెంటనే గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. పాపను సెల్లార్లో ఓ వాహనం ఢీకొట్టడంతో చనిపోయిందని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. పాపను వాహనం ఢీకొట్టినట్లు చూశారా అని చిత్రపురి కాలనీకి చెందిన ఓ వ్యక్తి బాధితులను ప్రశ్నిం చాడు. నష్ట పరిహారం ఇస్తామని, పాప ఎలా చనిపోయిందో తమకు తెలియదని పోలీసులకు చెప్పాలని వారిపై ఒత్తిడి తెచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతోనే చిన్నారి పవిత్ర మృతి చెందిందని, త్వరలోనే ఆ వాహనాన్ని గుర్తిస్తామని స్పష్టం చేశారు. మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం చేయించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. శుభకార్యానికి వెళ్లొస్తుండగా... యాకుత్‌పురా: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తున్న ఏడాది వయసు బాలుడు మృతి చెందాడు. ఆదివారం రాత్రి చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ రావు తెలిసిన వివరాల ప్రకారం... గౌలిపురా మీర్‌కా దయారా ప్రాంతానికి చెందిన ఎం.ఎ.ముక్తార్, సఫియా బేగం దంపతులకు కుమారుడు నదీం (1) సంతానం. ఆదివారం రాత్రి బండ్లగూడలోని సిటీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ జరిగిన బంధువుల శుభకార్యానికి ముక్తార్ దంపతులు కుమారుడిని తీసుకొని బైక్‌పై వెళ్లారు. అర్ధరాత్రి 12.30కి ఇంటికి తిరిగి వస్తుండగా బండ్లగూడ అన్మోల్ గార్డెన్ ఫంక్షన్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురూ కిందపడిపోయారు. ముక్తార్, సఫియా బేగంతో పాటు చిన్నారి నదీంకు గాయాలయ్యాయి. నదీం తలకు తీవ్ర గాయం కావడంతో ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బంజారాహిల్స్‌లోని రెయిన్బో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు కారు (టీఎస్ 15 ఈసీ 0459) ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వరకట్నం వేధింపులకు వివాహిత బలి
అమ్మా.. లేమ్మా..! తండ్రి ఎక్కడున్నాడో తెలియుదు. తల్లి అకాల వురణంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. తల్లి మరణించిన విషయం తెలియని చిన్నారులు అవ్మూ లేమ్మా.. అంటూ తల్లి మృతదేహంపై వద్ద విలపించడం చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. ఇక నుంచి పిల్లలకు దిక్కెవరని బంధువులు బోరున విలపించారు. శ్రీకాళహస్తి: ఎన్ని చట్టాలు చేసినా వరకట్నం వేధింపులు తగ్గడం లేదు. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట వివాహితలు కట్న పిశాచానికి బలి అవుతూనే ఉన్నారు. పోలీసులు నామమాత్రంగా చర్యలు తీసుకుంటుండడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన తిరుపతిలో ఒక వివాహిత వరకట్నం వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనను మరువక ముందే శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో మరో యువతి బలవర్మణానికి పాల్పడింది. డీఎస్పీ వెంకట కిశోర్ కథనం మేరకు... ఎన్టీఆర్ నగర్‌కు చెందిన షేక్ చోతి అలియూన్ చిన్ని(24)కి అదే ప్రాంతంలో నివాసముంటున్న తన మేనవూవు కువూరుడు కాలేషాతో 2010లో పెద్దలు పెళ్లి చేశారు. కాలేషా పెరుుంటర్గా పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. వీరికి జాన్, బహుఉద్దీన్ పిల్లలు ఉన్నారు. మూడేళ్ల క్రితం కాలేషా ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. అతని కోసం గాలించినా ఫలితం లేదు. చోతి అప్పటి నుంచి కాలేషా తల్లిదండ్రులు వుహబూబ్ బాష, రమిజాబితోనే ఉంటోంది. ఈ క్రమంలో వారు ఆమెను వూనసికంగా వేధిస్తున్నారు. అంతేగాక అదనపు కట్నం తీసుకురావాలని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారు. భర్త ఆచూకీ తెలియకపోవడం, ఇంట్లో అత్తామామల వేధింపులు ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెందిన చోతి శుక్రవారం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటకిశోర్, సీఐ అక్కడికి చేరుకుని వుృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఏరియూ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రేమించి మూడు నెలల ముచ్చట చేశాడు..
► చలివిడి చేసి అత్తారింటికి పంపితే శవమై వచ్చింది ► ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకే చంపేశారు ► కూతురు మృతిపై న్యాయం చేయాలని రోదిస్తున్న తల్లి గుడివాడ : పెళ్లి చేసుకుని మూడు నెలల ముచ్చట తీరకముందే తన బిడ్డను చంపేశారు. అత్తారింటికి వెళ్లాలంటే చలివిడి చేసి పంపాను.. ఇంటికెళ్లి అరగంట గడవక ముందే శమైందని కబురు వచ్చింది. నా బిడ్డను నిలువునా బలి తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుడివాడ ఏరియా ఆస్పత్రి ఎదుట ఆ తల్లి రోదిస్తున్న తీరు అందరినీ కంట తడి పెట్టింది. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడ గ్రామంలో వివాహిత మృతి చెందిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అత్తారింటికి వెళ్లిన అరగంటకే అస్వస్థత గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామానికి చెందిన కొణతం ఆంజనేయులు కుమారుడు కొణతం లీలా శోభన్‌కుమార్ అదే గ్రామానికి చెందిన కట్టా మాణిక్యం కుమారై కృష్ణకుమారిలు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే శోభన్‌కుమార్‌కు తల్లిదండ్రులు వేరొక యువతితో పెళ్లికి సిద్ధం చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 5న శోభన్ తన ప్రియురాలు కృష్ణకుమారిని తీసుకెళ్లి ద్వారకాతిరుమలలో వివాహం చేసుకున్నాడు. అయితే శోభన్‌కుమార్ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో కృష్ణకుమారి తల్లి ఇంటి వద్ద వీరిద్దరూ కాపురం చేసుకుంటున్నారు. శోభన్ నూడిల్స్ వ్యాపారం చేస్తుంటాడు. కాగా ఇటీవల అతను తన తల్లిదండ్రులకు చేరువయ్యాడు. ప్రస్తుతం మంచి రోజులు అయిపోతున్నం దున కోడలిని ఇంటికి తీసుకొచ్చి గుమ్మాలు దాటించాలని శోభన్ తల్లిదండ్రులు కోరారు. దీంతో కృష్ణకుమారి తల్లి గురువారం ఉదయం చలివిడి చేసి అత్తారింటికి పంపించింది. ఇంట్లోకి వెళ్లాక అక్కడ పానకం ఇచ్చారని తాగిన వెంటనే పడిపోయిందని తల్లి మాణిక్యం ఆరోపిస్తోంది. తన ఇల్లు మార్గమధ్యంలోనే ఉన్నా తనకు చెప్పకుండానే అస్వస్థతకు గురైన తన కూతురును గుడ్లవల్లేరు ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యమంలోనే చనిపోయిందని పేర్కొన్నారు. తన కూతురంటే ఇష్టం లేకే వారు చంపేశారని, తనకు భర్త లేకపోయినా ఇద్దరు బిడ్డల్ని చూసుకుని బ్రతుకుతున్నానని నా ఇంటి దీపాన్ని ఆర్పేసారని తల్లి మాణిక్యం రోదించింది. బుధవారం కేసు నమోదు చేయటంతో కృష్ణకుమారి మృతదేహాన్ని గుడివాడ ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకువచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తన కూతురు మృతిపై తనకు న్యాయం చేయాలని వచ్చిన వారందరినీ ఆమె వేడుకుంటోంది. -
ఆదుకుంటాడనుకుంటే...
మునగపాక: ఈ ఏడాదితో బీటెక్చదువు పూర్తవు తుంది... కుటుంబానికి అండగా నిలుస్తాడని భావిస్తే కొడుకు శవంగా మారి ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జగన్నాథపురం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని వాడ్రాపల్లికి చెందిన కాకి రమణబాబు, కనకమహాలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ(నాని) మృతి చెందాడు. ఇతను విశాఖలోని నరవలో ఉన్న విశాఖ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఆ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతదేహాలకు బొబ్బిలి ఆస్పత్రిలో పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించి, గురువారం సాయంత్రం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. లక్ష్మీనారాయణ మృతదేహానికి వాడ్రాపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు గ్రామస్తులు, ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కుమారుడు మృతి చెందడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. విధి తమతో ఆడుకుందని, ఒక వైపు ఆటో నడుపుతూ, మరో వైపు చేపలవేట సాగిస్తూ కష్టపడి కొడుకుని చదివించానని లక్ష్మీనారాయణ తండ్రి రమణబాబు బోరున విలపిస్తూ తెలిపాడు. పెళ్లికి వెళ్లిన కొడుకు చివరిగా నాన్నా నా అకౌంట్లో రూ.10 వేలు వేయమని కోరాడని ఇంకా వేయకుండా కానరాని లోకాలకు వెళ్లిపోయాడని లక్ష్మీనారాయణ తండ్రి బోరున విలపించాడు. -
తల్లీకూతుళ్లపై కన్నేసిన దుర్మార్గుడు
► రుణం ఇప్పిస్తానంటూ తల్లితో వివాహేతర సంబంధం ► ఆపై కుమార్తెపై కన్నేసిన దుర్మార్గుడు ► వద్దన్నందుకు తల్లినే కాటికి పంపిన హంతకుడు ► తరువాత కుమార్తెను లాడ్జిలో బంధించి చిత్రహింసలు ► ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కి... హిందూపురం అర్బన్ : ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమె కూతురిపై కన్నేసిన కామాంధుడు అది కాస్తా బెడిసి కొట్టడంతో ఉన్మాదిగా మారాడు. తల్లిని మట్టుబెట్టి.. కూతురినీ హింసించాడు. అంతటితో ఆగక ఆమెనూ అంతమొందించేందుకు ప్రయత్నించి చివరకు హిందూపురం పోలీసులకు చిక్కాడు. అనంతపురం అశోక్‌నగర్‌కు చెందిన మాబున్నీ(47) భర్త చనిపోయాడు. ఆమె పెద్దకుమార్తె అనంతపురంలోని హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతుండగా, రెండో కుమార్తె బత్తలపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. ఒంటరిగా నివసిస్తున్న మాబున్నీకు బ్యాంక్ రుణాలు ఇప్పిస్తానంటూ రామకృష్ణ అలియాస్ బాబు పరిచయమయ్యాడు. వారి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ చదువుతున్న పెద్ద కుమార్తెపై కన్నేసిన అతను, మాబున్నీపై ఒత్తిడి పెంచాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఈ విషయమై ఆమెతో ఈ నెల 15న రాత్రి గొడవపడి, కర్రతో తలపై బలంగా కొట్టి, రక్తపు మడుగులో పడి ఉన్న మాబున్నీను పట్టించుకోకుండా ఇంటికి తాళం వేసుకుని అనంతపురానికి చేరుకున్నాడు. హాస్టల్ల్ ఉంటున్న ఆమె కుమార్తె వద్దకు చేరుకుని మీ అమ్మకు సీరియస్‌గా ఉండడంతో బెంగళూరు ఆస్పత్రిలో చేర్పించినట్లు నమ్మబలికి అదే రాత్రి ఆమెను హిందూపురానికి పిలుచుకెళ్లాడు. ఉదయాన్నే బెంగళూరుకు వెళ్తామని చెప్పి సాయితేజ లాడ్జిలో గది తీసుకున్నాడు. రిజిస్టర్ బుక్‌లో ‘బాబు, రొద్దం’ అని తప్పుడు చిరునామా రాయించాడు. ఆ రాత్రే సదరు యువతిని అతను శారీరకంగా హింసించి గాయపర్చాడు. ‘నా మాట వినకపోవడంతో మీ అమ్మను చంపేశా. ఇప్పుడు నీకూ అదే గతి పడుతుంది’ అంటూ బెదిరించాడు. దీంతో ఆమె తిరగబడింది. నేరం ఎక్కడ బయటపడుతుందోనని ఆమెను బాత్రూంలోకి తీసుకెళ్లి చున్నీతో గొంతు బిగించాడు. ఊపిరాడకఅపస్మారస్థితిలో పడిపోయిన ఆమెను చనిపోయిందని భావించి గదికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. మరుసటి రోజు సాయంత్రం దాకా గది తలుపులు తెరవకపోవడంతో అనుమానంతో లాడ్జి నిర్వాహకులు తలుపులు తీసి చూడగా యువతి బాత్రూంలో ఆపస్మారకస్థితిలో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు. ఆమె కోలుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. పోలీసుల అదుపులో నిందితుడు నిందితుడు రామకృష్ణ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు తాళం వేసి ఉన్న ఇంటిలో యువతి తల్లి మాబున్నీ మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. యువతి తల్లి గురించి అన్ని వివరాలు సేకరించారు. మాబున్నీ ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు రంగంలోకి దిగి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలకు వెళ్లి పరిశీలించారు. నిర్జీవంగా పడి ఉన్న మాబున్నీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ కేసులో నిందితుడు రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
అదృశ్యమైన యువకుడు.. శవమై తేలాడు!
► ప్రేమ వ్యవహారమే కారణం : పోలీసులు ► సుంకేసుల బ్యారేజీ నుంచిమృతదేహం వెలికితీత శాంతినగర్ : ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రెండురోజుల క్రితం బయటకు వెళ్లిన అతను చివరకు సుంకేసుల బ్యారేజీలో శవమై తేలాడు. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన రమ, చంద్రారెడ్డి దంపతులకు కుమారుడు పవన్‌రెడ్డి (21), కూతురు ఉన్నారు. సుమారు పదేళ్లక్రితం బతుకుదెరువు నిమిత్తం వడ్డేపల్లి మండలం శాంతినగర్‌కు వలస వచ్చారు. ఆరేళ్లక్రితం మనస్పర్థలు రావడంతో భర్త స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుమారుడు స్థానికంగా పాలకేంద్రం, వస్త్ర దుకాణాల్లో పనిచేస్తూ తల్లిని పోషిస్తూ వచ్చాడు. రెండేళ్లక్రితం స్థానిక మీసేవా సెంటర్లో ఆధార్ నమోదు ఆపరేటర్‌గా చేరాడు. ఆమె ఈనెల 14న సొంత పనిమీద ఖమ్మంలోని అక్క వద్దకు చేరుకుంది. ఎప్పటిలాగే ఈనెల 16వ తేదీ రాత్రి వరకు అతను అక్కడ పనిచేసి బయటకు వెళ్లి మంగళవారం ఉదయం వరకు తిరిగిరాలేదు. దీంతో మీసేవా నిర్వాహకుడు రవి ఇరుగుపొరుగు వారిని విచారించాడు. చివరకు రాజోలికి చెందిన జాలర్లు సుంకేసుల బ్యారేజి సమీపంలో పవన్‌రెడ్డి మృతదేహం కనిపించిందని సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పుట్టి, జాలర్ల సాయంతో వెలికితీశారు. ప్రేమ వ్యవహారం వల్లే ఆదివారం సాయంత్రం అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. కాగా కాళ్లకు చెప్పులు, వాచ్, ఏటీఎం కార్డు జేబులోనే ఉండటం, ఒడ్డున బైక్ హ్యాండిల్లాక్ వేసి ఉండటం పలు అనుమానాలకు దారితీసింది. ఈ మేరకు ఎస్ఐ జయశంకర్ కేసు దర్యాప్తు చేపట్టి అనంతరం మృతదేహాన్ని అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. -
నా బిడ్డది ఆత్మహత్య కాదు హత్యే!
సత్తెనపల్లి: నా బిడ్డది ఆత్మహత్య కాదని, హత్య చేశారని ఆదివారం మృతిచెందిన పఠాన్ అస్మా తండ్రి పఠాన్ అబుజర్, కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెదకూరపాడు గ్రామానికి చెందిన వివాహిత పఠాన్ అస్మా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పత్రికల్లో రావడంపై వారు అనుమానం వ్యక్తం చేశారు. ఏరియా వైద్యశాల వద్ద సోమవారం మృతురాలి తండ్రి పఠాన్ అబుజర్, సోదరుడు ఫిరోజ్, బంధువులు విలేకరులతో మాట్లాడారు. సుభానీయే హత్య చేశాడు! ఈ నెల 7న గ్రామానికి చెందిన షేక్ సుభానీ తమ కుమార్తె అస్మాను ట్రాప్ చేసి తీసుకెళ్లాడని, అస్మా ఆచూకీ కోసం ఎక్కడ వెతికినా కనిపించలేదన్నారు. పది రోజులైనా రాకపోవడంతో పెళ్లి చేసుకొని ఉంటాడనుకున్నామని, చివరకు పెదమక్కెన గ్రామ సమీపంలోని బావిలో ఆదివారం శవమై కనిపించిందన్నారు. పోస్టుమార్టం జరగకుండానే పోలీసులు ఆత్మహత్య అని ఎలా నిర్థారించారో తెలియడం లేదన్నారు. అస్మాను హత్య చేసిన వారిపై కఠినచర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ వెంకట్రావును అస్మా మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మృతదేహంతో ధర్నా పెదకూరపాడు : అస్మాది ఆత్మహత్య కాదు హత్య అంటూ మృతురాలి తల్లిండ్రులు అబుజార్, ముంతాజ్, బంధువులు, ముస్లిం పెద్దలు సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి పెదకూరపాడు కాలచక్రరోడ్డుపై ధర్నా చేశారు. అస్మా మృతిపై పూర్తి విచారణ జరిపి నిందితులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. జిల్లా రూరల్ ఎస్పీ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి ఎస్ఐ వెంకటప్రసాద్ బాధితులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. రాత్రి 10 గంటల వరకూ ధర్నా కొనసాగింది. -
అత్తింటి వారే హత్యచేశారు..!
► పెళ్లయిన నాలుగునెలలకే నూరేళ్లు నిండాయి ► అదనపు కట్నం కోసం వేధించారు ► నమ్మకంగా తీసుకువెళ్లి మాత్రలు మింగించి చంపారు ► పోలీసులకు మృతురాలి తల్లి ఫిర్యాదు తెనాలిరూరల్ : తమ కుమార్తెను అత్తింటి వారే హత్య చేశారని పట్టణంలోని గాంధీనగర్‌లో బుధవారం రాత్రి హత్యకు గురైన దివ్యహరిణి తల్లి వరలక్ష్మి ఆరోపించారు. పెళ్లయిన నాలుగునెలలకే పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. విజయవాడ సింగ్ నగర్‌కు చెందిన దంపతులు రామిశెట్టి గోపాలరావు, వరలక్ష్మి దంపతుల కుమార్తె దివ్యహరిణి(19)కి పట్టణానికి చెందిన పర్చూరి వంశీకృష్ణకు గత డిసెంబర్ 24న వివాహమైంది. కులాలు వేరైనా, మ్యారేజ్ బ్యూరో ద్వారా సంబంధం కుదిరింది. రూ.మూడు లక్షల నగదు, ఆరు తులాల బంగారం కట్నం కింద ఇచ్చినట్టు దివ్య హరిణి బంధువులు చెబుతున్నారు. కోటి ఆశలతో అత్తింటికి వచ్చిన దివ్యకు వారం రోజుల్లోనే కష్టాలు మొదలయ్యాయి. పుట్టింటి నుంచి మరో రూ.నాలుగు లక్షలు కట్నం కింద తీసుకురావాలంటూ వేధింపులు మొదలయ్యాయి. ఈ నాలుగు నెలల కాలంలోనే దివ్యహరిణి పలుమార్లు పుట్టింటికి వెళ్లగా, పెద్దలు రాజీ కుదిర్చి పంపారు. వారం రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన దివ్యహరిణిని భర్త వంశీకృష్ణ, అతని బావ రవిచంద్ర బుధవారం సాయంత్రం విజయవాడకు వెళ్లి తిరిగి ఇక్కడకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రాత్రి ఆమె ఇంట్లో మృతి చెంది పడి ఉంది. భర్త, అతని కుటుంబ సభ్యులు కలసి తనతో ఏవో మాత్రలు మింగించారని బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తమకు ఫోను చేసి చెప్పిందని, తాము వచ్చేసరికి మృతి చెంది ఉందని మృతురాలి తల్లి వరలక్షి తెలిపారు. తమ కుమార్తెను భర్త, అత్త లక్ష్మి, మామ రఘురామయ్య, ఆడపడుచు కొర్రపాటి సుధారాణి, ఆమె భర్త కొర్రపాటి రవిచంద్ర కలసి హత్య చేశారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ఓఎస్డీ ఎస్.ఆర్.వెంకటేశ్వరనాయక్, టూటౌన్, తాలూకా సీఐలు బి.కళ్యాణ్‌రాజు, యు. రవిచంద్ర పరిశీలించారు. ఆర్ఐ సూర్యనారాయణమూర్తి శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మార్చురీల్లో ‘అవినీతి గద్దలు’
► విషాద సమయాల్లో చేతివాటం.. పోస్టుమార్టం వద్ద కాసుల బేరం మృతుల బంధువులను పీక్కుతింటున్నవైనం ► బాధితులకు భారంగా మారిన శవపంచనామా సిరిసిల్ల మార్చురీ సాక్షిగా డబ్బుల వసూళ్లు అవినీతి గద్దలు శవాలనూ వదలడం లేదు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నా, రోడ్డు ప్రమాదాలు, అనుమానాస్పద మృతి ఘటనలు జరిగిన సందర్భా ల్లో చట్టరీ త్యా పోస్టుమార్టం తప్పనిసరి. ఇలాంటి సందర్భా ల్లో శవాలపై పేలాలు ఏరుకున్నట్లు అవినీతిపరులు చేతివాటాన్ని పదర్శిస్తున్నారు. సిరిసిల్ల డివిజన్లోని తొమ్మిది మండలాల్లో జరిగే సంఘటనకు సంబంధించి సిరిసిల్ల ప్రాం తీయ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతుంది. మార్చురీ సాక్షిగా శవాలను చుట్టే చాపలు అ మ్మే వ్యాపారుల నుంచి ఆస్పత్రి సిబ్బంది, పోస్టుమార్టం నివేదిక రాసే పోలీసులు, చివరికి ఫొటోగ్రాఫర్లు సైతం అడ్డగోలుగా డ బ్బులు దండుకుంటూ విషాద సమయాల్లో బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు. సిరిసిల్ల మార్చురీ వద్ద జరిగే అవినీతి దందాపై కథనమిదీ.. ఇల్లంతకుంట మండలం ముస్కాన్‌పేటకు చెందిన రైతు సామ మోహన్‌రెడ్డి(50) అప్పుల బాధతో ఇటీవల క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘అప్పులోళ్లూ నన్ను క్షమించండి’ అంటూ సూసైడ్ నోటు కూడా రాశాడు. బ్యాంకు అప్పు చెల్లించేందుకు తన బైక్‌ను అమ్మి కిస్తీ చెల్లించాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మోహన్‌రెడ్డి కుటుంబం శవపంచనామా, పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రిలో రూ.3 వేలు చెల్లించాల్సి వచ్చింది. మోహన్‌రెడ్డి బంధువులు తెలిసిన వాళ్లు ఆ డబ్బులు సర్దుబాటు చేశారు. కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన రైతు మారుపాక శంకర్(40) పంట ఎండిపోయి, ఆర్థికంగా చితికిపోయి పురుగుల మందు తాగి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. కులం చిట్టీలో డబ్బులు చెల్లించా ల్సి రావడంతో మానసిక వేదనకు గురైన శంకర్ పంట చేతికొచ్చే ఆశ లేక.. చేసిన అ ప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య చే సుకున్నాడు. శంకర్ శవానికి సిరిసిల్ల ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసేందుకు రూ.4 వేలు ఖర్చు అయ్యాయి. నిజానికి శంకర్ కుటుంబం పుట్టెడు అప్పుల్లో ఉంది. కరువు పరిస్థితుల్లో ఊరిలో అప్పు దొరకని దుస్థితి. సిరిసిల్ల : సిరిసిల్ల డివిజన్లోని తొమ్మిది మండలాల పరిధిలోని 202 గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగిన సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి శవాలను తరలిస్తారు. నెలకు 60 నుంచి 100 పోస్టుమార్టం కేసులు సిరిసిల్లలో జరుగుతున్నారు. పోస్టుమార్టం చేసే పక్రియలో మార్చురీ సిబ్బంది చేతివాటం మృతుల బంధువులను మరింత బాధిస్తోంది. బాధితుల నుంచి నెలకు రూ.లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు. ప్రధానంగా ఆస్పత్రి సిబ్బందితోపాటు ప్రైవేటు వ్యక్తులు మార్చురీ వద్ద ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో శవాని రూ.వెయ్యి వరకు గుంజుతున్నారు. పోస్టుమార్టం గదిలో వాసన ఉంటుందని మందు(లిక్కర్) తాగందే పోస్టుమార్టం చేయరాదంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. శవపంచనామా నిర్వహించే పోలీసులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. తాము ఎఫ్ఐఆర్లో నమోదు చేసే వివరాల ఆధారంగానే మీకు ప్రభుత్వసాయం అందుతుందని డబ్బులు నొక్కేస్తున్నారు. ఒక్కో శవ పంచనామాకు రూ.1500 నుంచి రూ.3 వేల వరకు గుంజుతున్నారు. శవాలను చుట్టే చాపలు అమ్మే వ్యాపారులు సైతం రూ.500 తగ్గకుండా వసూలు చేస్తున్నారు. శవాలను ఫొటోలు తీసే ఫొటో గ్రాఫర్ సైతం ఈ కేసులో నేను కోర్టుకు హాజరు కావాల్సి వస్తుందని ఫొటోలకు రూ.500 గుంజుతున్నారు. ఇలాఅన్ని స్థాయిల్లోనూ అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అసహాయ స్థితిలో కుటుంబ సభ్యులు విషాదంలో ఉంటే అవినీతి రాబంధులు అందినకాడికి దండుకుంటున్నాయి. పోలీసు అధికారులు శవపంచనామాలో వసూళ్లపై దృష్టిసారించాల్సి అవసరం ఉంది. ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటాం పోస్టుమార్టం చేసేందుకు ఎవరైనా డబ్బులు అడితే ఫిర్యాదు చేయండి. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. బయట జరిగే తతంగంతో మాకు సంబంధం లేదు. ప్రైవేటు వ్యక్తులు వసూలు చేసినట్లు తెలిసింది. కానీ ఇప్పు డు ఎవరూ ఉండవద్దని చెప్పాం. శవాలను భద్రపరిచేందుకు ఒక్క ఫ్రీజర్ ఉంది. మరో ఫ్రీజర్‌ను తెప్పిస్తున్నాం. పోస్టుమార్టంలో మా వాళ్లు ఎవరు డబ్బులు తీసుకున్నా చర్య తీసుకుంటాం. - గూడూరి రవీందర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
కట్టలు తెగిన ఆగ్రహం
► గుత్తిలో తల్లీ, ఇద్దరు బిడ్డల ► ఆత్మ‘హత్య’లపై బంధువుల ఆందోళన ► భార్యా పిల్లలను భర్త, అతని కుటుంబ సభ్యులే చంపి ఆత్మహత్యగా ► చిత్రీకరించినట్లు ఆరోపణ ► నిందితులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ ► ప్రభుత్వాస్పత్రి మార్చురీ ఎదుట ► బైఠాయింపు, ధర్నా, ఆస్పత్రి గేట్లు మూసివేత గుత్తి: గుత్తి ప్రభుత్వాస్పత్రి పరిసరాలు ఆందోళనలతో దద్దరిల్లాయి. తల్లీ, ఇద్దరు పిల్లల ఆత్మ‘హత్య’ల నేపథ్యంలో మృతురాలి పుట్టింటి వారు, బంధువులు ఆందోళనకు దిగారు. గుత్తికి చెందిన నేత్రావతి, ఆమె ఇద్దరు పిల్లలు మురారి, ముఖేశ్‌ను కుటుంబ యజమాని రఘుబాబు, అతని కుటుంబ సభ్యులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ వారు స్థానిక ప్రభుత్వాస్పత్రి ప్రధాన గేట్లను మూసివేసి ధర్నాకు దిగారు. అంతకు ముందు మార్చురీ ఎదుట భైటాయించి నిరసన తెలిపారు. నేత్రావతి చాలా ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాద న్నారు. పైగా పిల్లలంటే ఆమెకు వల్లమాలిన ప్రేమ అన్నారు. వివాహేతర సంబంధం కోసం రఘుబాబే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిప్పులు చెరిగారు. రఘుబాబు సహా అతని ఉంపుడుగత్తెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల మద్దతు: నేత్రావతి, ఆమె ఇద్దరు పిల్లల మరణానికి కారణమైన రఘుబాబును తక్షణం అరెస్టు చేయాలని కోరుతూ బెంగళూరు నుంచి వచ్చిన ఆమె తల్లి అన్నపూర్ణమ్మ, పెద్దమ్మ వెంకటలక్ష్మమ్మ, సోదరులు అశోక్, చంద్రశేఖర్, అక్క భారతి, చెల్లెళ్లు అశ్వని, ఆశా, శాలిని, శేకమ్మ, మేనమామలు కిరణ్, నారాయణస్వామి సహా మరో 50 మంది బంధువులు ఆందోళనకు దిగిన విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు వారికి మద్దతుగా నిలిచారు. ఎమ్మార్పీఎస్, ఐద్వా నాయకులు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్ఐ రామాంజనే యులు తమ సిబ్బందితో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడారు. ధర్నా విరమించాలని కోరగా వారు ససేమిరా అన్నారు. డీవైఎస్పీ, తహశీల్దార్ సమక్షంలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. పెళ్లి సమయంలో తీసుకున్న రూ.4 లక్షల కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రఘుబాబు ఉంచుకున్న మహిళపైనా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. తహశీల్దార్ హరిప్రసాద్, ఆస్పత్రి సూపరిండెంట్ మాధవకృష్ణ, ఎస్ఐ రామాంజనేయులు, ఎమ్మార్సీఎస్ మండల శాఖ అధ్యక్షులు అంజిన్ ప్రసాద్, ఐద్వా నాయకురాళ్లు రేణుక, సునీత, మదార్బీ, సీపీఎం మండల శాఖ అధ్యక్షులు శ్రీరాములు, న్యాయవాది రాజశేఖర్, కేవీపీఎస్ అధ్యక్షులు మల్లికార్జున సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించడానికి అంగీకరించడంతో ధర్నా విరమించారు. మృతదేహాలకు పోస్టుమార్టం: నేత్రావతి, ఆమె పిల్లలు మురారి, ముఖేశ్ మృతదేహాలకు బుధవారం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం చెట్నేపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. రఘుబాబు కుటుంబ సభ్యుల అరెస్టు: నేత్రావ తి, ఇద్దరు పిల్లల మృతి కేసులో భర్త రఘుబాబు, అత్త శాంతకుమారి, బావ ప్రసాద్, అక్క చాముండి, ఆడబిడ్డ ఉమను ఎస్ఐలు చాంద్‌బాషా, రామాంజనేయులు అరెస్టు చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
అలీనగర్‌పై చిరుత పంజా
► మేక ల మందపై దాడి ► నాలుగు మేకలు మృతి జన్నారం(ఆదిలాబాద్) : భయం గుప్పిట్లో బతుకుతున్న జన్నారం మండలంలోని అలీనగర్‌పై చిరుతపులి పంజా విసిరింది. దీంతో వారి భయానికి మరింత ఆందోళన తోడైంది. చిరుతపులి అడవిలోనుంచి అలీనగర్ గ్రామానికి వచ్చింది. ఇళ్ల పక్కనే ఉన్న మేకల మందపై దాడి చేసింది. నాలుగు మేకలను హతమార్చింది. ఈ సంఘటన ఆ గ్రామ గిరిజనులకు తీవ్ర భ యూందోళనలకు గురిచేసింది. ప్రత్యక్ష సాక్షి, బాధితుడు పెంద్రం కృష్ణ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నారు. తెల్లవారుజామున... పెంద్రం కృష్ణ ఆదివారం రాత్రి తన ఇంటి పక్కన గల దొడ్లోకి మేకలను తోలి, బయ ట పందిరి కింద పడుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయం లో మేకల అరుపులు వినిపించాయి. చప్పుడు విని లేచి చార్జింగ్ టార్చ్లైట్తో చూసేసరికి చిరుతపులి ఓ మేక తలను నోటితో కరిచి రక్తం తాగుతోంది. దీంతో కృష్ణ గట్టిగా కేకలు వేశాడు. కేకలు విని చిరుత మేకను వదిలి పారిపోయింది. అతడు కూడా చిరుతను తరుముతూ కొంత దూరం వెళ్లాడు. వచ్చి తన తల్లి దృపదబారుు తో పాటు అందరినీ నిద్ర లేపాడు. అప్పటికే పెంద్రం బొజ్జుబాయికి చెందిన రెండు మేకలు, కృష్ణకు చెందిన రెండు మేకలను చిరుత చంపివేసింది. తెల్లారే వరకు గూడెం వాసులు మేల్కొనే ఉన్నారు. ఈ విషయం తెల్లవారి ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. అనంతరం పశు వైద్యాధికారితో పోస్టుమార్టం నిర్వహించారు. బీట్ అధికారి భూమన్న వివరాలను నమోదు చేసుకున్నారు. ఇదివరకే పులి వస్తుందని భయం గుప్పిట్లో బతుకుతున్న గిరిజనులకు చిరుత దాడి మరింత ఆందోళనలకు గురిచేస్తోం ది. తమకు అడవి జంతువులతో ప్రాణభయం ఉందని, ఈ విషయంలో శాశ్వత పరి ష్కారం చూపించాలని గిరిజన పెద్దలు మాణిక్‌రావు, పార్వతిరావు కోరుతున్నారు. -
అంత్యక్రియలను ఆపి...పోస్ట్‌మార్టానికి మృతదేహం
మెట్పల్లి : ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు జరపడానికి శ్మశానానికి తరలిస్తుండగా పోలీసులు ఆపి ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించిన సంఘటన శుక్రవారం పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, స్థానిక శివాజీనగర్‌కు చెందిన గోల్కొండ శంకర్(40) ఓ మేస్త్రీ కింద కూలీ పని చేస్తున్నాడు. అతనికి భార్య వనిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా అర్థిక ఇబ్బందులతో శంకర్ మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలోనే అనారోగ్యానికి గురైన శంకర్ మనస్తాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఈ విషయం పోలీసులకు తెలుపకుండా కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని ఇంటి నుంచి శ్మశానానికి తరలిస్తుండగా సమాచారమందుకున్న పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. ఆ తర్వాత శవాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించి తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
విద్యార్థి తల లభ్యం
పుటాన్‌దొడ్డిలో కలకలం ఇటిక్యాల : అనుమానాస్పదంగా మృతి చెందిన డిగ్రీ విద్యార్థి నరేష్ మృతి మిస్టరీగా మారింది. ఇటిక్యాల మండలం పుటాన్దొడ్డికి చెందిన డిగ్రీ విద్యార్థి నరేష్ చేతులు, తల లేకుండా గత సోమవారం రాత్రి వేముల గ్రామ రైల్వేగేట్ 112 సమీపంలో రైల్వేపట్టాల మధ్య కనిపించడం సంచలనం సృష్టించింది. రైల్వే పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకొని శవానికి పంచ నామా నిర్వహించి చేతులు దులుపుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున రైతు కేశవరెడ్డి వేముల శివారులోని తనపొలాన్ని ట్రాక్టర్‌తో చదును చేస్తుండగా నరేష్ తల లభించింది. దీంతో నరేష్‌ది హత్యేనని పలువురు అంటున్నారు. విషయం తెలియడంతో విద్యార్థి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని గుర్తించి, గద్వాల రైల్వే పోలీసులకు తెలిపారు. వారు తలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాలకు తీసుకెళ్లారు. -
ప్రియురాలిని పంపించాల్సిందే
► మృతదేహంతో బంధువుల ఆందోళన ► ఆరిలోవ పోలీస్‌స్టేషన్ ఎదుట మూడు గంటలపాటు ఉద్రిక్తం ఆరిలోవ : ‘‘ప్రియురాలి చేతిలో మోసపోవడం వల్లే పార్థసారథి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి చివరి కోరిక మేరకు ప్రియురాలి సమక్షంలోనే దహన సంస్కారాలు నిర్వహిస్తాం. పోలీసుల అదుపులో ఉన్న యువతిని మా వెంట పంపించండి’’... అంటూ ఆరిలోవ పోలీస్ స్టేషన్ ఎదుట మృతుని బంధువులు మంగళవారం సాయంత్రం ఆందోళన చేశారు. వందలాది మంది స్థానికులు స్టేషన్‌ను ముట్టడించడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది. చివరకు ఆరిలోవ పోలీసులతో పాటు తూర్పు ఏసీపీ రమణబాబు, పీఎం పాలెం, ఆనందపురం సీఐలు, ఎస్‌లు, సిబ్బంది రావాల్సి వచ్చింది. అయినప్పటికీ మూడు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే... పెదవాల్తేరు ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోయిన ఆరిలోవ ప్రాంతం పాండురంగాపురానికి చెందిన యలమల పార్థసారథి(24) సోమవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. తన మృతికి ప్రేమ వైఫల్యమే కారణమని, ప్రేమించిన అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయించి రూ 1.50 లక్షలు తీసుకొని మోసం చేసిందని, దానికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొంటున్నట్లు సూసైడ్ లేఖలో రాశాడు. నా మృతదేహాన్ని ప్రేమించిన అమ్మాయి సమక్షంలో దహనం చేయాలని కోరుతూ ఆ లేఖలో రాశాడు. లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు మంగళవారం ఆ ఆమ్మాయిని అదుపులోకి తీసుకొని ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఉంచారు. అదుపు చేయలేకపోయిన పోలీసులు : పోస్టుమార్టం అనంతరం మృతదే హాన్ని దహన సంస్కారాల కోసం మృతుడి బంధువులు, స్థానికులు ఆరిలోవ తీసుకొస్తూ పోలీస్ స్టేషన్ ముందు మృతదే హం ఉన్న వ్యాన్‌ను నిలిపేశారు. స్టేషన్లో ఉన్న ఆ అమ్మాయిని దహన సంస్కారాల వద్దకు తీసుకెళ్తామని, మాతో ఆ అమ్మాయిని పంపించాలని పోలీసులను కోరారు. పోలీసులు ససేమిరా అనడంతో ఆందోళనకు దిగారు. అధిక సంఖ్యలో మృతుడి బంధువులు రావడంతో పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు. దీంతో సీఐ ధనుంజయనాయుడు ఇచ్చిన సమాచారంతో ఈస్ట్ ఏసీపీ రమణబాబు, పీఎంపాలెం, ఆనందపురం సీఐలు అప్పలరాజు, పార్థసార థి, ఎస్.ఐలు, కానిస్టేబుళ్లు సుమారు 100 మంది వరకు స్టేషన్‌కు చేరుకొన్నారు. అయినా స్టేషన్ నుంచి ఆందోళనకారులు వెళ్లలేదు. రాత్రి కావడంతో మృతదేహానికి దహన సంస్కారాలు జరపలేదు. బంధువులు మాట్లాడుతూ పార్థసారథిని ప్రేమించిన అమ్మాయిని పంపిస్తేనే మృతదేహానికి దహనసంస్కారాలు చేస్తామని భీష్మించారు. దీంతో ఏసీపీ రమణబాబు మృతుడి బంధువులను పిలిచి స్టేషన్ లోపల మాట్లాడారు. మృతుడికి తగిన న్యాయం చేస్తామని, ముందు దహన సంస్కారాలు జరిపించండని నచ్చజెప్పారు. శాంతించిన మృతుడి బంధువులు స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకొన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి స్టేషన్ ముందు సాగిన ఈ డ్రామా సుమారు రాత్రి 9 గంటలకు సద్దుమనిగింది. మృతుడికి పుట్టినరోజు : ఇదిలా ఉండగా మృతుడు పార్థసారథికి మంగళవారం పుట్టిన రోజు కావడం విశేషం. మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ ముందు నిలిపి మృతుడి స్నేహితులు, బంధువులు కేక్ కట్‌చేశారు. స్టేషన్లో ఉన్న పార్థసారథి ప్రియురాలిని పోలీసులు బయటకు తీసుకురావాలని నినాదాలు చేశారు. ఎంతో సరదాగా పుట్టిన రోజు చేసుకోవాల్సిన రోజే అంత్యక్రియలు జరపాల్సి వస్తోందంటూ మృతుడి పిన్ని కనకదుర్గ స్టేషన్ వద్ద బోరున విలపించింది. -
మృతదేహం కోసం హైడ్రామా..
► ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ మృతి ► మృతదేహం తమకంటే తమకని కుటుంబ సభ్యుల ఆందోళన ► పోలీసుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు ఆదిలాబాద్ క్రైం : ఆదిలాబాద్ పట్టణంలోని పాత హౌసింగ్‌బోర్డు కాలనీలో శనివారం ఆత్మహత్యాయత్నం చేసిన మేకల రాజేశ్వరి (35) రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 1 గంటకు మృతి చెందింది. కాగా ఉదయం రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె మృతదేహం కోసం హైడ్రామా నెలకొంది. ఆమె తల్లిదండ్రులు, భర్తతరపు వారు మృతదేహం మాకంటే మాకు కావాలని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పినా వినకుండా గొడవకు దిగారు. పోలీసులతో కూడా వాగ్వాదం పెట్టుకున్నారు. వీరి ఆందోళనతో 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మృతదేహాన్ని పోస్టుమార్టం గది నుంచి బయటకు తీయలేదు. దీంతో శాంతిభద్రతల దృష్ట్యా ఇరువురి కుటుంబ సభ్యులకు కాకుండా పోలీసులే అంత్యక్రియలు చేసేందుకు నిర్ణయించారు. పోలీసు బందోబస్తు మధ్య పట్టణంలోని తిర్పెల్లి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అక్రమ సంబంధంపై నిలదీసినందుకే.. తన భర్త సాగర్ వేరే మహిళతో ఉన్న అక్రమ సంబంధంపై నిలదీసినందుకే మా కూతురును వేధింపులకు గురిచేసే వాడని ఆమె తల్లిదండ్రులు అంకుశ్, లక్ష్మి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తరచూ గొడపడుతూ మానసికంగా హింసించేవాడని, అది తట్టుకోలేకే రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన రాజేశ్వరి, మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన సాగర్‌తో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు వైష్ణవి, వికాస్, శైలజ ఉన్నారు. సాగర్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. గతేడాదే ఉద్యోగ రిత్యా సాగర్ ఆదిలాబాద్ బదిలీపై వచ్చి పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉంటున్నారు. తరచూ గొడవలు జరగడంతో రాజేశ్వరి మానసిక వేదనకు గురై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుందని సీఐ తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సాగర్‌పై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. -
పోలీసుల 'పచ్చ'పాతం
అధికారానికి తలొగ్గారు! ► మున్సిపల్ ఉద్యోగి ఆత్మహత్య కేసులో టీడీపీ నేత పేరు చేర్చని పోలీసులు ► మున్సిపల్ ఆఫీసు ఎదుట ఉద్యోగులు, ఆవాజ్ కమిటీ రాస్తారోకో ► గంటన్నరసేపు స్తంభించిన ట్రాఫిక్ కమిషనర్ హామీతో ఆందోళన విరమణ ఈమె పేరు షారాబాను. నంద్యాల మున్సిపాలిటీలో కాంట్రాక్టు వాటర్ వాల్వు ఆపరేటర్ హుసేన్‌సాబ్ భార్య. గుండలవిసేలా రోదిస్తున్న ఈమె కన్నీటి వెనుక అధికార పార్టీ నేత అహంకారం దాగుంది. టీడీపీ కౌన్సిలర్ భర్త అయిన ఆయన.. ఆ చిరుద్యోగిపై ఉరిమిన చూపునకు ఈమె జీవితంఅంధకారమైంది. ఓ మనిషి ప్రాణం తీసిన ఆ నేత విషయంలో పోలీసుల ‘పచ్చ’పాత ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. నంద్యాల: బాధితుల పక్షాన నిలబడి న్యాయం అందించాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారు. మున్సిపల్ కాంట్రాక్ట్ వాల్వ్ ఆపరేటర్ హుసేన్‌బాషా ఆత్మహత్యకు కారకుడైన ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ నేత జేవీసీ ప్రసాద్ పేరును కేసు నుంచి పోలీసులు తప్పించారు. విచారణలో తేలితే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పి, చేతులు దులుపుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆవాజ్ కమిటీ, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట గంట సేపు ఆందోళన చేశాయి. నూనెపల్లె ట్యాంకు వద్ద వాల్వ్ ఆపరేటర్‌గా హుసేన్‌బాషా పని చేస్తున్నాడు. ఈనెల 22వ తేదీ రాత్రి 9గంటల సమయంలో టీడీపీ నాయకుడు, కౌన్సిలర్ జేవీసీ హారిక భర్త ప్రసాద్ అక్కడికి వెళ్లి ‘నీటిని సక్రమంగా సరఫరా చేయడం లేదు.. అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నావు.. నీ అంతు చూస్తా.. అంటూ దుర్భాషలాడాడు. భార్య సమక్షంలో దూషించడంతో మనస్థాపానికి గురైన హుసేన్‌బాషా గురువారం మధ్యాహ్నం ట్యాంకు వద్ద ఉన్న ఫాగింగ్‌కు వినియోగించే కెమికల్స్‌ను తాగి భార్యకు ఫోన్ చేసి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నాడు. అయితే రాత్రి వాంతులు అధికమై ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. విచారణలో తేలాకే కేసు: కాంట్రాక్ట్ వాల్వ్ ఆపరేటర్ హుసేన్‌బాషా ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేవీసీ ప్రసాద్‌పై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేయలేదు. గురువారం సాయంత్రం హుసేన్‌బాషా, అతని భార్య షారాబాను పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేశామని, ఎవరి పేర్లు చేర్చలేదని సీఐ వెంకటరమణ తెలిపారు. ఆధారాలు లభ్యమైతే జేవీసీ ప్రసాద్‌పై కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ విషయంపై జేవీసీ ప్రసాద్ మాట్లాడుతూ హుసేన్ బాషా ఆత్మహత్యకు తాను కారణం కాదని, రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మృతదేహంతో ఆందోళన కర్నూలులో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులు శుక్రవారం సాయంత్రం నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే సమాచారం అందుకున్న కాంట్రాక్ట్ కార్మికుల సంఘం కార్యదర్శి భాస్కరాచారి, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, ఆవాజ్ కమిటీ అధ్యక్షుడు ముర్తుజా, డివిజన్ కార్యదర్శి అమ్జాద్‌బాషా సిద్ధిఖీ, సీపీఎం నాయకులు తోటమద్దులు, మస్తాన్‌వలి, మరికొందరు ముస్లిం మైనార్టీ నేతలు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నా రు. మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేశారు. జేవీసీ ప్రసాద్‌ను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. హుసేన్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని, అతని భార్యకు ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు గంటకు పైగా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. టూటౌన్ సీఐ గుణశేఖర్ బాబు, ఎస్ఐ మోహన్‌రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళనలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కోలా కల్యాణ్, మరికొందరు ఎమ్మార్పీఎస్ నేతలు కూడా జత కావడంతో ఆందోళన ఉధృతమైంది. కమిషనర్ సత్యనారాయణరావు, పోలీస్ అధికారులు చర్చలు జరిపారు. జేవీసీ ప్రసాద్‌పై చర్యలు తీసుకొనేలా చూస్తామని, ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని హామీనిచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. -
పెళ్లి ఇంట విషాదం
► రోడ్డు ప్రమాదంలో ► ఇద్దరు మహిళల మృతి మరో ఇద్దరికి ► తీవ్ర గాయూలుపరిస్థితి విషమం శ్రీకాళహస్తి రూరల్ : నెల్లూరులోని నవాబుపేటలోని బంగ్లాతోటకు చెందిన శ్రీరాములు, పద్మజ దంపతుల కువూర్తె సమతకు బుధవారం రాత్రి తిరుచానూరులోని సింధూర కల్యాణ వుండపంలో పెళ్లి జరిగింది. కొత్త దంపతులు తిరిగింపులకు వస్తారని, తగిన ఏర్పాట్లు చేసేం దుకు గురువారం తెల్లవారుజావుున శ్రీరాములు, పద్మజ, శ్రీరాములు పెద్దవ్ము సంపూర్ణమ్మ, పిన్ని అనసూయుమ్మ కారులో నెల్లూరుకు బయులుదేరారు. కారును శ్రీరములు నడిపాడు. శ్రీకాళహస్తి వుండలం పూతలపట్టు- నాయుుడుపేట రోడ్డులోని తొండవునాడు వులుపు వద్ద వుుందు వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే సమయం లో ఎదురుగా వురో వాహనం వచ్చిం ది. దాన్ని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని పంటపొలాల్లోకి బోల్తా పడింది. పద్మజ(40), సంపూర్ణమ్మ(56) అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీరాములు(45), అనసూయుమ్మ(54) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సవూచారంతో ఎస్ఐ శ్రీకాంత్ అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడిన శ్రీరాములు, అనసూయమ్మను 108లో శ్రీకాళహస్తి ఏరియూ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషవుంగా ఉండడంతో తిరుపతి రుయూకు తరలించారు. పద్మజ, సంపూర్ణవ్ము మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియూ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అప్పటి వరకు కుటుంబ సభ్యు లు, బంధువులతో ఆ ఇళ్లు కళకళలాడింది. కుమార్తె పెళ్లిని ఘనంగా చేశారు. తిరిగింపులకు వచ్చే కొత్త దంపతులు, బంధువులకు మర్యాదలు చేయాలని ఇంటికి బయలుదేరిన వారిని విధి వెం టాడింది. రోడ్డు ప్రమాదంలో పెళ్లి కు మార్తె తల్లి, అవ్వ మృతిచెందారు. పెళ్లి కుమార్తె తండ్రి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆమెది ఆత్మహత్య కాదు.. హత్యే
► టాకీ గూడ గ్రామస్తుల పిర్యాధు ► సోమవారం తోషంలో అనుమానాస్పదంగా మృతి చెందిన వివాహిత ► పోస్టుమార్టం రిపోర్టు తర్వాతే నిర్ధారణ : పోలీసులు గుడిహత్నూర్ : మండలంలోని తోషం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగిన సంఘటన మండలంలో సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే..మండలంలోని తోషం గ్రామానికి చెందిన శివాజీ బోంమ్డేకు 15 సంవత్సరాల క్రితం టాకీగూడ గ్రామానికి చెందిన శైలు (40)తో వివాహం జరిగింది. కట్న కానుకలతోపాటు సంప్రదాయబద్ధంగా వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు అమూల్, కుమార్తె తనూజ. ఆదిలాబాద్‌లో 8వ తరగతి చదువుకుంటున్నారు. కాగా సోమవారం శైలు ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త శివాజీని అదుపులోకి తీసుకున్నారు. కాగా గత కొన్ని సంవత్సరాల నుంచి శైలు భర్త వేధింపులు భరిస్తూ వస్తోందని టాకీగూడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడూ మూడీగా ఉండే శివాజీ సోమవారం సుమారు 4 గంటల ప్రాంతంలో శైలుతో గొడవ పడ్డాడు. అప్పటికే ఇంట్లో ఉన్న కుమారుడు అమూల్ వీరు గొడవ పడ్తుంటే చూడలేక ఎప్పటిలాగే ఇంటి పైకప్పుపైకి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత చూస్తే తల్లి కదలలేని స్థితిలో కన్పించింది. అయితే సైకోగా మారిన శివాజీయే శైలును చంపాడని ఆరోపించారు. తాడుతో గొంతు నులుమి హత్య చేసి ఆతర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడన్నారు. భర్త వేంధిపులు ఎప్పటినుంచే ఉన్నా కేవలం పిల్లల కోసం బతుకుందని ఆత్మహత్య చేసుకునేదే ఉంటే గదిలో తలుపులు బిగించుకొని చేసేదని తెలిపారు. గతంలో సైతం అనేక సార్లు శివాజీ వేధిస్తుంటే కాలనీ వాసులు అడ్డుపడేందుకు ప్రయత్నిస్తే శివాజీ వారికి ఎదురుతిరిగే వాడని దీంతో వారు ఏమీ చేయలేక ఉండిపోయారన్నారు. ఇలాంటి సైకోతో పిల్లలకూ ప్రమాదం ఉందని.. బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా మృతురాలి తల్లి వందన, అన్న సూర్యకాంత్ ఫిర్యాధు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్యా లేక హత్యా అనే విషయం పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాతే తెలిసే అవకాశం ఉందని ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. -
వలసకూలీ దుర్మరణం
► వలసకూలీ దుర్మరణంతో వీధిన పడిన కుటుంబం ► కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు, బంధువులు ► గోపాల్ పేటలో విషాదఛాయలు గోపాల్పేట : పొట్ట చేతపట్టుకుని బతుకుదెరువు కోసం నగరానికి వలస వె ళ్లి న ఓ కుటుంబం పెద్ద దిక్కును కో ల్పో యి వీధిన పడింది.. రోడ్డు ప్రమాదం లో కుటుంబ యజమాని దుర్మరం చెం దడంతో వారు కన్నీరు మున్నీరయ్యా రు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. గోపాల్‌పేటలోని ఈ దమ్మగడ్డకాలనీకి చెందిన దాసర్ల బా బు (32) కు భార్య అలివేలతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడాది క్రితం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదుకు వలస వెళ్లాడు. అప్పటి నుంచి నగరంలోని సంతోష్‌నగర్‌లో నివాసముంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భార్యాభర్తలు కూలి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం అక్కడ నా లుగు లైన్ల రోడ్డు డివైడర్ పనుల్లో నిమగ్నమైన భర్తను లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడిక్కడే చనిపోయాడు. విష యం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని బోరుమన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యా దు చేయడంతో లారీ డ్రైవర్‌పై కేసు దర్యాప్తు జరుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీం తో వారు రాత్రి స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
ఆత్మహత్య కాదు హత్యే!
► వేముల నాగమణి మృతికి ప్రియుడే కారణం ► కొట్టి చంపి, చీరతో ఉరి వేశాడని పోలీసుల వెల్లడి ► సమాధి నుంచి వెలికి తీసి మృతదేహానికి పోస్టుమార్టం పిడుగురాళ్ల : ఓ మహిళను ప్రియుడే హత్య చేసి సాధారణ ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పించుకునే ప్రయత్నం చేసిన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని లెనిన్‌నగర్‌కు చెందిన వేముల నాగమణి (23) ఈ నెల 11వ తేదీ చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు నమ్మి ఖననం చేశారు. అయితే మృతురాలి స్నేహితురాలు ఇచ్చిన సమాచారంతో తీగలాగగా డొంక కదిలింది. చండ్రపాలేనికి చెందిన శంకర్ అనే వ్యక్తితో నాగమణికి సంబంధం ఉందని తెలపడంతో అతనిపై అనుమానాలు రేకెత్తాయి. దీంతో మృతురాలి అక్క వేముల పుష్పలత పట్టణ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. అనుమానితుడైన శంకర్‌ను పోలీసులు విచారణ చేయగా అసలు విషయాన్ని బయటకు కక్కాడు. దీంతో నాగమణి మృతదేహాన్ని గురువారం వెలికితీసి గురజాల వైద్యుడు సతీష్ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఎస్.లక్ష్మయ్య, సీఐ శ్రీధర్‌రెడ్డి సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. చీటీపాటలు నిర్వహించే వేముల నాగమణి రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి చేరుకుంది. అదే సమయంలో ఆమె ప్రియుడు శంకర్ ఇంటికి వ చ్చాడు. అయితే తను చెప్పినట్లుగా నాగమణి వినడంలేదన్న అక్కసుతో నాగమణి మెడ వెనుక వైపు బలంగా కొట్టడంతో మంచంపై పడిపోయింది. ముఖంపై నీళ్లు చల్లినా స్పృహ లేకుండా ఉండటంతో వెంటనే గూట్లో ఉన్న చీరతో మెడకు చుట్టి ఇంటి దూలానికి కట్టి తలుపు దగ్గరకు వేసి అక్కడి నుంచి శంకర్ ఉడాయించాడు. ఇరుగు పొరుగువారు నాగమణి ఇంట్లో నుంచి చపాతీలు కాలుతున్న వాసన వస్తుండటంతో వెళ్లి చూశారు. నాగమణి చనిపోయిన దృశ్యం కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు కూడా నాగమణి ఆత్మహత్య చేసుకుందని భావించారు. మృతురాలి స్నేహితురాలు తెలిపిన వివరాలతో అసలు విషయం బయటకు వచ్చింది. సీఐ వై.శ్రీధర్‌రెడ్డి కేసును విచారణ చేస్తున్నారు. నిందితుడు శంకర్‌ను అరెస్టు చేశారు. -
అంతా అనుమానాస్పదం!
సవాల్‌గా మారిన ఉన్మాది హత్యోదంతం పలు కోణాల్లో కేసు విచారిస్తున్న పోలీసులు పోలీసుల అదుపులో మృతురాలి భర్త.. రాత్రికి విడుదల కావలి అర్బన్: శుక్రవారం రాత్రి స్థానిక రాజీవ్‌నగర్ అరటితోటలో చోటుచేసుకొ న్న హత్యోదంతం పోలీసులకు సవాల్‌గా మారింది. ఉన్మాది శుక్రవారం సాయంత్రం సిమిలి నాగిరెడ్డి నివాసానికి వెళ్లి ఆధార్‌కార్డు ఇవ్వాల్సిందిగా కోరడంతో వెనుతిరిగిన సుశీలమ్మ, ఆమె కోడలు కవిత, చిన్నారులు దీక్షిత, వశిష్ట్లపై పాశవికంగా దాడిచేసిన విషయం విదితమే. కవిత అక్కడికక్కడే మృతిచెందగా సుశీ లమ్మ, చిన్నారులు నెల్లూరులో చికిత్సపొందుతున్నారు. విషయం తెలుసుకొన్న కవిత బంధువులు శనివారం నాగిరెడ్డి నివాసానికి చేరుకున్నారు. కవిత మృతికి భర్త వెంకటేశ్వరరెడ్డి, మామ నాగిరెడ్డి కారణమంటూ బంధువులు గొడవకు దిగబోగా పోలీసులు నివారించారు. ఉన్మాది అంటూ అనుమానాలు పోలీసులు ఈ కేసుపై పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కవిత భర్త వెంకటేశ్వరరెడ్డిని పోలీసులు తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అదేవిధంగా ఉన్మాద చర్యల కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. శివారు ప్రాం తాల్లో చివరిగా ఉన్న ఇంటిని ఎంపిక చేసుకొని పథకం ప్రకారం ఇంట్లోని సభ్యులందరిని హతమార్చే ఉన్మాది ఉదంతాలు గతంలో కూడా పలుచోట్ల జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. గుంటూరు జిల్లాలో గతంలో జరిగిన మాదిరిగా కావలిలో సంఘటనలు ఉన్నాయన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. ఈ ఘటనల ఆధారంగా అగంతకుడు ఒక పథకం ప్రకారం ఈ ఘాతుకాలకు పాల్పడుతున్న ట్లు తెలుస్తోంది. శివారుప్రాంతంలోని ఇంటిని టార్గెట్‌గా పెట్టుకొని పురుషులు లేని సమయంలో వచ్చి దాడికి పాల్పడుతుంటాడని చెబుతున్నారు. శుక్రవారం కావలి తూర్పు శివారు ప్రాంతంలో జరి గిన దారుణ సంఘటనలో పాల్గొంది ఒకరా లేక అంతకన్నా ఎక్కువమంది ఉన్నారా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. పోలీసులు జాగిలాలు, క్లూస్‌టీమ్ రప్పించి అగంతకుల ఆనవాళ్లను గుర్తిస్తున్నారు. శనివారం ఆ ఇంటిలోని వస్తువులను పరిశీలించారు. ఇంటి సమీపాన పడివున్న ఒక వ్యక్తి ఫ్యాంట్‌ను కూడా తీసుకొ ని పరిశీలించగా దానిపె రక్తం మరకలు, జేబులో కారం కూడా ఉన్నట్లు గుర్తిం చారు. ఆప్రాంతంలో అగంతకుడి పాదాల గుర్తులు కూడా సేకరించారు. నెల్లూరులో చికిత్సపొందుతున్న చిన్నారులు దీక్షిత, వశిష్టల పరిస్థితి మెరుగవుతుండగా సుశీలమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కవిత మృతదేహానికి స్థానిక ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఆతర్వాత భర్తను వదిలిపెట్టినట్లు తెలిసింది. -
నర్సింగాపురంలో ఉద్రిక్తత
దళిత యువకుడి మరణం పరిస్థితికి కారణం పోలీసుల బందోబస్తు కొత్తకోట : కొత్తకోట మండలం నర్సింగాపురం గ్రామంలో ఓ దళిత యువకుడి మరణం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీసు బలగాలను మోహరించారు. గత ఏడాది ఆగస్టు 15న గ్రామానికి చెందిన బాలకృష(్ణ32) అనే దళిత యువకుడు ఓ ప్రేమజంటకు సహకరించాడన్న ఆరోపణలతో ఆతనిపై అమ్మాయి సంబంధీకులు గ్రామంలో స్తంభానికి కట్టేసి దాడి చేశారు. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకుని అతన్ని విడిపించారు. దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే మూడు నెలల పాటు వైద్యం పొందిన బాలకృష్ణ హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడని శవాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. అయితే తన అన్న మరణంపై అనుమానాలున్నాయని, గతంలో జరిగిన దాడి వల్లే ఊపిరితిత్తులు దెబ్బతిని మరణించాడని తమ్ముడు తిరుపతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శవాన్ని సాయంత్రం పోస్టుమార్టం కోసం వనపర్తికి తరలించారు. అనంతరం రాత్రి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈనేపథ్యంలోనే పలు దళిత సంఘాల నాయకులు బాలకృష్ణ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశాయి. గతంలో దాడి చేసిన వారిపై నమోదు చేసిన హత్యాయత్నం చేసును హత్య కేసుగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిజానిజాలు వెలికి తీసి బాధ్యులను శిక్షించాలని కొత్తకోట అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఇజ్రయిల్, నాయకులు కె.భరత్‌భూషన్, మిషేక్, పి.ప్రశాంత్, మన్నెం, జె.ఆర్.కుమార్, దావీద్, నారాయణ డిమాండ్ చేశారు. -
ఆరు నెలల తర్వాత పోస్ట్‌మార్టం
కొండమోడు గ్రామానికి చెందిన కరీం మృతి పై అనుమానాలు భ ర్తను హత్య చేశారని భార్య పోలీసులకు ఫిర్యాదు మృతదేహం వెలికితీత పిడుగురాళ్ళ రూరల్ చనిపోయిన వ్యక్తి శవాన్ని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు వెలికితీసి శుక్రవారం పోస్ట్‌మార్టం చేసిన ఘటన రాజుపాలెం వుండలం కొండమోడు గ్రావుంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గతేడాది సెప్టెంబర్ 3న కొండమోడు గ్రామానికి చెందిన కరీం పిడుగురాళ్ల వెళుతున్నానని చెప్పి మరుసటి రోజు శవమై కన్పించాడు. బంధువులు ముస్లింల శ్మశానవాటికలో ఖననం చేశారు. తన భర్తను హత్య చేశారని ఆరోపిస్తూ కరీం భార్య షహీనా పోలీసులు చుట్టూ తిరుగుతోంది. ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు రెండు రోజుల క్రితం పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం పిడుగురాళ్ళ రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, రాజుపాలెం తహశీల్దార్ సీహెచ్ విజయు జ్యోతికువూరి, గుంటూరు ఫోరెన్సిక్ ల్యాబ్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ కృష్ణవుూర్తి, గురజాల మెడికల్ ఆఫీసర్ సతీష్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. పంచనావూ నిర్వహించి పోస్టువూర్టం చేశారు. ప్రజా సంఘాల నేతల ఆగ్రహం పోర్ట్‌మార్టం చేసే విధానంపై ప్రజా సంఘాల నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా హక్కుల సంఘం వేదిక రాష్ట్ర సెక్రటరీ, డిఫెన్స్ లాయుర్ పాపారావు, ప్రజా హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మీసాల ప్రభుదాసు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం పోస్టువూర్టం నిర్వహించేందుకు వుుగ్గురు పైన డాక్టర్లు ఉండాలన్నారు. ఒక్క వైద్యుడితో ఎలా నిర్వహిస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు డాక్టర్లను పిలిపించారు. మధ్యాహ్నం వరకూ కనిపించని మృతదేహం జాడ మధ్యాహ్నం 2 గంటల వరకు కరీం వుృతదేహం జాడ కనిపించలేదు. ఇటీవల శ్మశానవాటికకు మెరక తోలించడంతో సమస్య ఎదురైంది. పొక్లెయిన్‌తో తవ్వించి జాడ కనుగొన్నారు. కరీం భార్య షహీనా నుంచి అధికారులు స్టేట్మెంటు నమోదు చేశారు. తన భర్తను ఎవరో హత్య చేశారని ఆమె తెలిపింది. కొండమోడులోని ఓ పెస్టిసైడ్ కంపెనీలో 10 సంవత్సరాలుగా గువుస్తాగా పని చేస్తున్నాడని, గతేడాది జనవరి 15న యుజవూనితో గొడవ పడి వచ్చాడని తెలిపింది. తర్వాత షాపు యజమాని సెప్టెంబర్ 2న ఇంటి వద్దకు వచ్చి వేరే కంపెనీలో పని చేయువద్దని, చేస్తే సహించేది లేదంటూ హెచ్చరించారని షహీనా ఫిర్యాదు చేసింది. వుూడవ తేదీ రాత్రి 9.30 గంటల సవుయుంలో ఓ ఫోన్ కాల్ వచ్చిందని, వెంటనే వస్తానని చెప్పి వెళ్ళిన భర్త మర్నాడు పిడుగురాళ్లలోని ఓవర్‌బ్రిడ్జి వద్ద చనిపోరుు ఉన్నాడని తహశీల్దార్‌కు తెలిపింది. అనంతరం రెండవ వైద్యాధికారి, గురజాల మెడికల్ ఆఫీసర్ సతీష్ సంఘటనా స్థలానికి హాజురు కావటంతో సాయుంత్రం 6 గంటల సవుయుంలో గొరుు్యలో నుంచి కరీం మృతదేహాన్ని తీసి మరలా పోస్టుమార్టం నిర్వహించారు. నివేదికలను పోలీసు అధికారులకు అందజేస్తావున్నారు. సీఐ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కేసును త్వరలో ఛేదిస్తామన్నారు. ప్రజా సంఘాల నాయుకులు వూట్లాడుతూ కరీం మృతి వెనుక రాజకీయు కోణాలు ఉన్నాయుని, సిట్టింగ్ జడ్జితో పోస్టువూర్టం నిర్వహించాలని వారు కోరారు. కార్యక్రవుంలో రాజుపాలెం, పిడుగురాళ్ళ, వూచవరం ఎస్ఐలు, రెవెన్యూ, వైద్య సిబ్బంది పలువురు పాల్గొన్నారు. -
వారి పోస్టుమార్టం నివేదికలను ఎయిమ్స్‌కు పంపండి
♦ పోస్టుమార్టం వీడియో ఫుటేజీని కూడా.. ♦ పోలీసులకు హైకోర్టు ఆదేశం ♦ వాటిని విశ్లేషించి నివేదిక ఇవ్వాలని ఎయిమ్స్ డెరైక్టర్‌కు ఆదేశం ♦ విచారణ నాలుగు వారాలకు వాయిదా సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా, గోవిందరావుపేట మండల పరిధిలో గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన శ్రుతి అలియాస్ మైత్రి, విద్యాసాగర్‌రెడ్డి అలియాస్ సూర్యంలకు నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలను, వీడియో ఫుటేజీని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)కు పంపాలని హైకోర్టు మంగళవారం పోలీసులను ఆదేశించింది. పోస్టుమార్టం నివేదికలను, వీడియో ఫుటేజీని పరిశీలించి అభిప్రాయం తెలుపుతూ ఓ నివేదిక ఇవ్వాలని ఎయిమ్స్ డెరైక్టర్‌ను ఆదేశించింది. ఇందుకు మూడు వారాల గడువునిచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రుతి, విద్యాసాగర్రెడ్డిలది బూటకపు ఎన్కౌంటరని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సివిల్ లిబర్టీస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దానిని మరోసారి విచారించింది. ఉద్దేశపూర్వకంగానే కాల్చివేత ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిలను చిత్రహింసలకు గురి చేసి కాల్చి చంపారన్నారు. పోస్టుమార్టం సమయంలో మృతుల కుటుంబీకులను కూడా అనుమతించలేదని తెలిపారు. మృతుల కుటుంబీకులు ఫిర్యాదు చేయడానికి ముందే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, మృతుల పోస్టుమార్టం నివేదికలను కోరింది. దీంతో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాటిని ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం బుల్లెట్ గాయాలతోనే చనిపోయినట్లు, అవి ఎదురు కాల్పుల వల్ల చోటు చేసుకున్నట్లు పోస్టుమార్టం నివేదికల్లో ఉందని తెలిపారు. దీనికి రఘునాథ్ స్పందిస్తూ, ఈ పోస్టుమార్టం నివేదికలతో తాము విభేదిస్తున్నామని, డాక్టర్లు పోలీసులకు అనుకూలంగా నివేదికలు ఇచ్చినట్లు తమకు అనుమానంగా ఉందన్నారు. అందువల్ల ఈ నివేదికలను నిపుణులు విశ్లేషణకు పంపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌కు పంపాలని తాము కోరుతున్నామన్నారు. అదనపు ఏజీ స్పందిస్తూ, హైదరాబాద్‌లో నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రులు ఉన్నాయని, అక్కడ కూడా ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నారని తెలిపారు. అయితే ధర్మాసనం పిటిషనర్ కోరిన విధంగానే ఎయిమ్స్‌కు పోస్టుమార్టం నివేదికలు, వీడియో ఫుటేజీ పంపుతామంటూ ఆ మేర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ నివేదికలు, వీడియో ఫుటేజీ అందుకున్న తరువాత మూడు వారాలలోపు వాటి విశ్లేషణకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని ఎయిమ్స్ డెరైక్టర్‌ను ఆదేశిస్తూ కోర్టువిచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
ముదురుతున్న మెడికోల ఆత్మహత్య వివాదం
చెన్నై:తమిళనాడులోని విల్లుపురంలో ముగ్గురు మెడికోలు మోనీషా, శరణ్య, ప్రియాంక ఆత్మహత్యలపై వివాదం రగులుతోంది. ఆగమేఘాలమీద పోస్ట్‌మార్టం నిర్వహించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. చనిపోయిన బంధువుల అంగీకారం లేనిదే మృతదేహాలకు పోస్ట్‌మార్టం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ బాధితురాలి తండ్రి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండానే పోస్ట్‌మార్టం ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు తమ బిడ్డలను చంపి బావిలో పడేశారని, న్యాయ విచారణ జరిపించి నిజాలను నిగ్గుదేల్చాలని మోనీషా తండ్రి తమిళరసన్ డిమాండ్ చేశారు. తమ బిడ్డలను హత్యచేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కళాశాలలో వసతులు సరిగా లేవని చనిపోయిన విద్యార్థినులు యాజమాన్యంతో పోరాడినట్టు లేఖలో రాశారు. విచక్షణారహితంగా వసూలు కాలేజీ అధిక ఫీజులు వసూలు చేస్తోందని, ఎలాంటి బిల్లులు లేకుండా సుమారు ఆరు లక్షల దాకా వసూలు చేశారని ఆరోపించారు. ఇంత చేసినా తాము నేర్చుకుంది శూన్యమని వాపోయారు. అధిక ఫీజులు కట్టాలంటూ వేధించారని రాశారు. దీంతో ఉద్రికత్త రాజుకుంది. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. అయితే ఈ కేసులో ఇప్పటికే నలుగురిని విచారించి కేసులు నమోదు చేశామని జిల్లా కలెక్టర్ లక్ష్మి ప్రకటించారు. తదుపరి విచారణ కొనసాగుతుందని, విద్యార్థుల ఇతర డిమాండ్లను పరీశీలిస్తున్నామని తెలిపారు. శరణ్య మృతదేహానికి మాత్రమే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నామని, బాధితుల ఆందోళనతో మిగిలినని ఆపివేశామన్నారు. అటు హైకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరపించాలని డిఎంకె డిమాండ్ చేసింది. ముగ్గురు విద్యార్థినుల అనుమానాస్పద వెనుక వున్న వాస్తవాలను వెల్లడి చేయాలని డిఎంకె చీఫ్ కరుణానిధి డిమాండ్ చేశారు. అలాగే బాధితులకు, కాలేజీ యాజమాన్యం, ప్రభుతం తగిన పరిహారం చెల్లించాలన్నారు. కాగా ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో ముగ్గురు వైద్య విద్యార్థినుల అనుమానాస్పద మరణం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చనిపోయేముందు వారు రాసిన లేఖ ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థినులు చనిపోయినట్టు వారి బంధువులు ఆరోపిస్తున్నారు. అటు ఇది ముమ్మాటికే హత్యలే అని వాదిస్తున్న వారి సంఖ్యకూడా క్రమేపీ పెరుగుతోంది. -
పోస్టుమార్టంలోనూ నిర్లక్ష్యం జరిగిందా ?
నర్సంపేట : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూడుచెక్కలపల్లి గిరిజన ఆశ్రవు పాఠశాలకు చెందిన విద్యార్థుల అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తు తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యో.. ఆత్మహత్యో తేల్చేందుకు కీలకమైన పోస్టుమార్టంను హడావుడిగా నిర్వహించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట శివారులోని గుట్టల్లో డిసెంబర్ 27న లభ్యమైన భూమిక, ప్రియాంక మృతదేహాలకు నర్సంపేటకు చెందిన వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. బాలికల మృతదేహాలను గుర్తించలేని స్థితిలో ఉండగా అనుభవజ్ఞులైన వైద్యులతోగాని, ఫోరెన్సిక్ ప్రొఫెసర్లతోగానీ పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉండగా స్థానిక వైద్యులతో మమ అనిపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి హడావుడిగా బంధువులకు మృతదేహాలను అప్పగించారు. దీంతో వారం రోజులు కావొస్తున్నా వాస్తవ విషయాలు పోలీసులకు లభించకపోవడంతో శనివారం కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ నాగమోహన్‌రావుకు సంఘటన స్థలాన్ని చూపించి, నర్సంపేటకు పిలిపించి పోస్టుమార్టం రిపోర్ట్‌ను పోలీసులు చూపించినట్లు తెలిసింది. సంఘటన వెలుగులోకి వచ్చిన రోజే ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించి పోస్టువూర్టం నిర్వహిస్తే మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉండేది. అలా చేయుకపోవడంతో ప్రస్తుతం బాలికల అనుమానాస్పద మృతి పోలీసులకు తలనొప్పిగా మారింది. ఆ నలుగురిపై ఆరోపణలు పర్వతగిరి : పోలీసులకు అంతుచిక్కని భూమిక, ప్రియూంక అనుమానాస్పద మృతి కేసులో ప్రధానంగా నలుగురిపైనే ఆరోపణలు వస్తున్నాయి. మొదటి నుంచి ఆటోడ్రైవర్ జేరిపోతుల రాముపై అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. మూడుచెక్కలపల్లి ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలలో వంట మనిషి రాజమ్మ కుమారుడు వినోద్‌పై కూడా బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడు ప్రియాంక ఇంటికి వచ్చిన సమయంలో ప్రియాంక నాన్న కిషన్ సెల్‌కు ఫోన్ చేసి మీ గోత్రం ఏమిటని అడిగినట్లు తెలిపారు. గోత్రంతో నీకేం పని అంటూ ప్రశ్నించి ఫోన్ కట్ చేసినట్లు చెబుతున్నారు. కాల్ లిస్ట్‌లో అతడు ఫోన్ చేసినట్లు తేలింది. కాగా చివరి ఫోన్ రాజమ్మ సెల్ నుంచి రాగా ఆమె కొడుకు వినోద్ మాట్లాడి ఉండవచ్చనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా గతంలో చెడు ప్రవర్తన వల్ల అనిల్ అనే టీచర్‌ను తొలగించారని, అతడికి రాజమ్మ దగ్గరి మనిషి కావడం వల్లే అతడిపై ఆరోపణలు వస్తున్నాయి. జేరిపోతుల రాము, రాజమ్మ, ఆమె కుమారుడు వినోద్, అనిల్‌పై బాలికల కుటుంబసభ్యులు ఎక్కువ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం భూమిక, ప్రియాంక అనుమానాస్పద మృతిపై నర్సంపేట సీఐ బోనాల కిషన్ వారి కుటుంబసభ్యులను శనివారం కలిశారు. కుటుంబసభ్యులు ఎలాంటి అనుమానాలు ఉన్నా తమకు తెలియజేయాలని కోరారు. కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదిక, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. బాలికల మృతిపై ఐటీడీఏ పీఓ విచారణ నల్లబెల్లి : మూడు చెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు బానోత్ ప్రియూంక, భూమిక అనుమానాస్పద మృతిపై ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ పాఠశాలను శనివారం సందర్శించి విచారణ చేపట్టారు. ఉపాధ్యాయులు, విద్యార్థినులతో సమావేశమయ్యూరు. వర్కర్ రాజమ్మ, గతంలో పనిచేసిన సీఆర్టీల వ్యక్తిత్వం, వ్యవహార శైలి, ఇతర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓ విలేకరులతో మాట్లాడుతూ బాలికల భద్రత కోసం పాఠశాల ప్రహరీ రెండు ఫీట్లు పెంచడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. కాగా బాలికల మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల నాయకులు పీఓ కు వినతిపత్రం అందజేశారు. అణగారిన వర్గాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు పరికి కొర్నేల్, తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక డివిజన్ అధ్యక్షుడు బట్టు సాంబయ్య, జేఏసీ డివిజన్ అధికార ప్రతినిధి ఆకుల సాంబరావు, బహుజన ఐక్య వేదిక మండల అధ్యక్షుడు మామిండ్ల ఐలయ్య పాల్గొన్నారు. కేఎంసీ ప్రొఫెసర్ విచారణ చెన్నారావుపేట : మండలంలోని ఖాదర్‌పేట శివారు నల్లగుట్టపై విద్యార్థినుల మృతి విషయమై కాకతీయ మెడికల్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ నాగమోహన్‌రావు శనివారం విచారణ జరిపారు. ముందు మృతదేహాలు ఉన్న స్థలాన్ని సందర్శించారు. పోలీస్‌స్టేషన్‌లో మృతి ఫొటోలు, రికార్డులను పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫోరెన్సిక్ నివేదికతో విచారణ ముమ్మరం చేస్తామని చెప్పారు. సీఐ బోనాల కిషన్, ఎస్సై పులి వెంకట్‌గౌడ్, హెచ్‌సీలు కనకచంద్రం, ప్రభాకర్, నరేష్, వుస్తాన్, దామోదర్, శివ పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి * టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి డిమాండ్ పర్వతగిరి : బాలికలు భూమిక, ప్రియూంక మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీడీఎల్పీ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ తమ పిల్లలు తప్పిపోయూరని తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. పైగా వారిపైనే అక్రమంగా కేసు నమోదు చేశారని తెలిపారు. ఎర్రబెల్లితో టీడీపీ నాయకులు మాడ్గుల రాజు, జాటోత్ శ్రీనివాస్ ఉన్నా రు. కాగా మృతుల కుటుంబసభ్యులు తమ పిల్లల మృతదేహాలను కుక్క లు పీక్కు తిన్నాయని రోదిస్తూ చెబుతుండగా ఎర్రబెల్లి కన్నీరు పెట్టారు. బాలికల మృతిపై స్పష్టత ఇవ్వాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య పర్వతగిరి : గిరిజన బాలికల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇ వ్వాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య అ న్నారు. మండలంలోని నారా యణపురం శివారు కంబాలకుంట తండాకు చెందిన బాలి కలు భూమిక, ప్రియాంక కుటుంబసభ్యులను ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థినుల మృతిపై హాస్టల్ సిబ్బంది, జిల్లా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. 15రోజులు ఇంట్లో జ్వరంతో ఉన్న విద్యార్థులను హాస్టల్లో ఉన్నట్లు హాజరు వేయడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు. కేసు విచారణలో సమగ్ర దర్యాప్తు చేయూలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనతో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు రాజ్‌కుమార్‌గౌడ్, అప్పం కిషన్, కుమార్‌గౌడ్, కేదారి గౌడ్, కోల రమేష్, కేదారి యాదవ్, దొంతి కమలాకర్‌రెడ్డి, అక్కల అనిల్, మదాసి సుధాకర్, మండల నాయకులు సైదులు, వడ్లకొండ వీరభద్రయ్య, జంగ మురళి, వీరమల్లు ఉన్నారు. కలెక్టర్‌గారూ... కరుణించరూ.. పర్వతగిరి : కూతుళ్లను పోగొట్టుకుని దిక్కుతోచని స్థితిలో ఉన్న బానోత్ భూమిక, బానోత్ ప్రియాంక తల్లిదండ్రులపై ఎవ్వరూ కనికరం చూపించటం లేదు. రెక్కాడితేగాని డొక్కాడని ఈ కుటుంబంలో పిల్లల మృతి విషాదాన్ని నింపింది. 40 రోజులుగా జీవచ్ఛవాలుగా కాలం వెల్లదీస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన రాష్ర్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అచ్యుతరావు బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున తక్షణ సాయం కింద అందజేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకపోయింది. బాధిత కుటుంబాలను జిల్లా యంత్రాంగం సంగతి అటుంచితే కనీసం మండల స్థాయి అధికారులు పలకరించిన పాపానపోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజనులని ప్రభుత్వం, అధికారులు, జిల్లా నాయకులు పట్టించుకోవటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
లాఫింగ్ క్రైమ్స్
చెవి కొరికి జైలుకెళ్లింది ఒకరు ‘కుక్కకూ’ పోస్టుమార్టం తప్పని వైనం హైటెక్ సిటీలోనూ పశువుల దొంగలు ‘జుట్టు కత్తిరింపు’ పైనా కేసు నమోదు ‘‘కుక్క మనిషిని కరిస్తే విషయం... మనిషి కుక్కను కరిస్తే విశేషం’’ రాజధాని నగరంలో హత్యలు, హత్యాయత్నాలు, బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలు, భారీ చోరీలు వంటి సంచలనాత్మక నేరాలు నమోదవుతూనే ఉంటాయి. వీటిని నిత్యం చూస్తూనే ఉంటాం కూడా. వీటితో పాటు అంతగా ప్రాచుర్యానికి నోచుకోని వెరైటీ క్రైమ్ కూడా నమోదు చేసుకోవాల్సిన పరిస్థితులు పోలీసులక ఉత్పన్నమవుతుంటాయి. విధుల్లో భాగమనుకుంటూ ఇష్టంతో చేసినా... ఇదెక్కడి గోలరా బాబూ అనుకుంటూ కష్టంగా భావించినా ఈ తరహా కేసుల్నీ పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది చోటు చేసుకున్న వాటిలో ఈ కోవలోకి వచ్చే కేసుల్ని ఒక్కసారి పరిశీలిస్తే... - సాక్షి, సిటీబ్యూరో కుక్కల కట్టడీ తప్పలేదు.. బోనాలు, గణేష్ వంటి పండుగలు వస్తున్నాయంటే పోలీసులు రౌడీషీటర్లు, అసాంఘికశక్తులతో పాటు అనుమానితుల విషయంలో అప్రమత్తంగా ఉండటం తెలిసిందే. అయితే ఈసారి బక్రీద్ పండుగ నేపథ్యంలో దక్షిణ మండల పోలీసులు వీరితో పాటు గ్రామసింహాల (శునకాలు) పైనా కన్నేసి ఉంచారు. అనేక ప్రాంతాల్లో రోడ్లపై పడే జంతు వ్యర్థాలను కుక్కలు తింటాయి. కొన్ని శునకాలు వాటిని లాక్కువెళ్లి కొంత భాగం తిని, మిగిలింది వదిలేస్తుంటాయి. అదే సమయంలో గణేష్ ఉత్సవాలు సైతం జరుగుతుండటంతో ఇలా శునకాలు జంతు వ్యర్థాలను ఆ మండపాల వద్దకు తీసుకువెళ్లి వదిలేసే ప్రమాదం ఉందని పోలీసులు భావించారు. అదే జరిగితే శాంతిభద్రతల సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో కుక్కల్నీ కట్టడి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పగబట్టి జుట్టు కత్తిరించింది... వ్యక్తిగత కక్షలు, పగలు, ప్రతీకారాల కోసం కిడ్నాప్‌లు, హత్యలు, హత్యాయత్నాలతో పాటు ఆస్తుల ధ్వంసం, దగ్ధం తదితరాలు చేయడం నిత్యం జరుగుతూనే ఉంటాయి. సికింద్రాబాద్‌లోని బౌద్ధనగర్‌కు చెందిన పార్వతి మాత్రం... వ్యక్తిగత కక్షల నేపథ్యంలో సినీ ఫక్కీలో దాడి చేసి శ్రీవల్లి అనే మహిళ జుట్టు కత్తిరించేసింది. పార్వతి మరో ముగ్గురు మహిళలతో కలిసి బైక్‌లపై శ్రీవల్లి ఇంటిపై దాడి చేసింది. పథకం ప్రకారం ముగ్గురు మహిళలూ ఆమె చేతులు గట్టిగా పట్టుకోగా... పార్వతి తన వెంట తెచ్చుకున్న కత్తెరతో శ్రీవల్లి జుట్టు కత్తిరించేసింది. ‘పని’ పూర్తయ్యాక అంతే వేగంగా బైక్‌లపై ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదుతో చిలకలగూడ పోలీసులు దాడి, జుట్టు కత్తిరింపుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరుడికి పోలీసుల ‘ట్రీట్మెంట్’... అనేక కేసుల దర్యాప్తులో పోలీసులు అనుమానితులు, నిందితుల్ని అదుపులోకి తీసుకుంటారు. నిజం చెప్పించడంతో పాటు రికవరీల కోసమూ వీరికి తమదైన శైలిలో ‘ట్రీట్మెంట్’ ఇస్తుంటారు. చిలకలగూడ పోలీసులకు మాత్రం ఓ చోరుడికి తమ పర్యవేక్షణలో ‘ఎనిమా ట్రీట్మెంట్’ ఇప్పించాల్సిన పరిస్థితి దాపురించింది. మైలార్‌గడ్డకు చెందిన ప్రమీల సీతాఫల్మండి రైల్వే ట్రాక్ పక్కన వాకింగ్ చేస్తుండగా వికాస్ అనే చోరుడు ఆమె మెడలోని గొలుసు స్నాచింగ్ చేశాడు. అనంతరం పోలీసులకు చిక్కిన అతగాడు ఆ గొలుసును మింగేశాడు. దీంతో అతడిని గాంధీ ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు తమ పర్యవేక్షణలో ఎనిమా చికిత్స చేయించారు. ఎట్టకేలకు గొలుసు ‘బయటకు రావడం’తో ఊపిరిపీల్చుకుని నిందితుడిని జైలుకు పంపారు. ఇదో ‘భారీ’ దొంగల ముఠా... కేజీల బంగారం ఎత్తుకుపోలేదు... వందల సంఖ్యలో వజ్రాలూ దోచేయలేదు... రూ.కోట్లలో నగదునూ కొల్లగొట్టలేదు... అయినప్పటికీ ఆ గ్యాంగ్‌లోని వారు మాత్రం ‘భారీ’ చోరులుగానే రికార్డులకెక్కారు. షేక్ అబ్దుల్ కరీం, మహ్మద్ ముజాహిద్ ఏకంగా క్రేన్లు వినియోగించి భూగర్భంలో వేసే కేబుళ్లను చోరీ చేస్తూ సైదాబాద్ పోలీసులకు చిక్కారు. చార్మినార్, బంజారాహిల్స్, మాదాపూర్, సైదాబాద్ ప్రాంతాల్లో డీసీఎం వ్యాన్లలో సంచరిస్తూ కనిపించిన కేబుల్ వైర్ డ్రమ్ముల్ని ఎంపిక చేసుకునే వారు. అదును చూసుకుని క్రేన్‌తో సహా వచ్చి వాటిని తస్కరించుకుపోయేవారు. సైదాబాద్ లక్మీనగర్ సబ్-స్టేషన్ పరిధిలో ఏకంగా 13 టన్నుల కేబుల్ వైర్ డ్రమ్ముల్ని ఎత్తుకుపోయారు. ఎట్టకేలకు సైదాబాద్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లారు. పోలీసులు వీరి వద్ద నుంచి చోరీ సొత్తుతో పాటు అందుకు వినియోగించిన హైడ్రాలిక్ క్రేన్నూ స్వాధీనం చేసుకున్నారు. రెండో‘సారీ’... చోరీ... పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదనే విషయం ఆ దొంగకు బాగా తలకెక్కినట్లుంది. అయితే అతడి పశ్చాత్తాపంలోనూ ఓ చిన్న మెలిక ఉంది. నేరాలు మానడానికి బదులు ఆ ఇంటి వారికి ‘లిఖితపూర్వకంగా’ క్షమాపణలు చెప్పి ఉన్నదంతా ఊడ్చుకుపోయాడు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని బీఎన్‌రెడ్డి కాలనీలో వ్యాపారి ప్రదీప్ దంపతులు ఉంటున్నారు. అక్టోబర్‌లో వీరింట్లోకి జోరబడిన దొంగ బీరువాలోని విలువైన వస్తువులు ‘సర్దేశాడు’. వెళ్తూ వెళ్తూ గోడపై ‘సారీ’ అంటూ రాసిపోయాడు. నవంబర్‌లో మళ్లీ అదే ఇంట్లో చేతివాటం చూపించిన నేరగాడు మొదటిసారి రాసిన చోటే మళ్లీ ‘సారీ’ రాసి ఉడాయించాడు. చేతి రాతను సరిచూసిన పోలీసులు రెండు చోరీలు ఒకే దొంగ పనిగా తేల్చారు. ‘లైక్స్’ కోసం యత్నించి జైల్లో ‘ల్యాండ్’... పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి... అంటే ఇదేనేమో. ఫతేదర్వాజా ప్రాంతానికి చెందిన ఫజల్ షేక్ జూకు వెళ్లి, జంతువులకు అతి దగ్గరగా ఫొటోలు దిగాలని ఆశపడ్డాడు. వీటిని ఫేస్బుక్లో పెట్టి ఎక్కువ లైక్స్ పొందాలని ప్రయత్నించాడు. ఇతడు అనుసరించిన పంథా బెడిసికొట్టడంతో నేరుగా జైల్లో ‘ల్యాండ్’ అయ్యాడు. ఇతగాడు జంతువులకు దగ్గర నుంచి ఫొటోలు దిగటంతో ఆగకుండా మరో అడుగు ముందుకు వేసి తాబేళ్ల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. ఓ తాబేలు పైకి ఎక్కి నిల్చుని మరీ ఫొటోలు దిగాడు. ఈ ఫొటోలతో గుర్తింపు పొందేందుకు వాటిని ఫేస్‌బుక్‌లోని అప్లోడ్ చేసి ‘బుక్కైపోయాడు’. ఇవి ఫేస్‌బుక్‌తో ఆగకుండా ఇతర సోషల్‌మీడియాలతో పాటు మీడియాలోనూ హల్చల్ చేయడంతో జూ అధికారులు బహదూర్‌పుర ఠాణా తలుపుతట్టారు. సీన్ కట్ చేస్తే ఫజల్ షేక్ జైలుకు చేరాడు. వేధింపుల కోసం ‘చోరీలు’... డబ్బు సంపాదించడానికో, అవసరాలు తీర్చుకోవడానికో సెల్ఫోన్లు చోరీ చేసే వాళ్లను తరచుగా చూస్తూనే ఉంటాం. బాలానగర్‌కు చెందిన బ్రహ్మయ్య నైజం దీనికి విరుద్ధం. భార్యపై ఉన్న కోపంతో మహిళల్ని వేధించడానికే ఇతడు సెల్ఫోన్లు చేరీ చేస్తూ చిక్కాడు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇతగాడు ఫిరోజ్‌గూడలో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో ఒంటరిగా మిగిలి మహిళలపై కక్ష కట్టాడు. బాలానగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ... ఇళ్లల్లో సెల్ఫోన్లు చోరీ చేయడం ప్రారంభించాడు. ఆ ఫోన్లలో ఉన్న మహిళల నెంబర్లకు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడి వేధించేవాడు. ఇలా రెచ్చిపోతున్న ఈ బ్రహ్మయ్య ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులకు చిక్కి జైలుకెళ్లాడు. -
రంగనాథ్ భౌతికకాయానికి పోస్టుమార్టం పూర్తి
-
రాజయ్య కుటుంబాన్ని సంపేయండి
నా బిడ్డను చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు సారిక తల్లి లలిత పోచమ్మమైదాన్ : సారికతో పాటు ఆమె కుమారుల మృతదేహాలకు వరంగల్ ఎంజీఎంలో గురువారం పోస్టుమార్టం జరిగింది. ఈ సందర్భంగా కన్నీరుమున్నీరుగా విలపిస్తూ సారిక తల్లి లలిత పలు విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘నా బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదు.... రాజయ్య కుటుంబ సభ్యులే చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు. రెండు కాన్పులు నేనే వెళ్లదీశాను. ఇద్దరు కవలలు కడుపులో ఉన్న సమయంలో నా బిడ్డకు సరిగా అన్నం కూడా పెట్టలే... మా బిడ్డ అత్త మాధవి వంట గదికి తాళం వేసుకుని వెళ్లేది. దీంతో బిడ్డ పస్తులు ఉండడం చూడలేక పక్కింటోళ్లే అన్నం పెట్టేటోళ్లు.. నా బిడ్డ లండన్‌లో ఉన్నప్పుడు, హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసిన సమయంలో అత్త, మామలకే మొత్తం డబ్బులు ఇచ్చేది. నా మొగుడు బాగుంటే చాలు అమ్మా... నాకు డబ్బులు ఎందుకు అని చెప్పేది. రాజ య్య ఎంపీగా ఉండి సైతం నా బిడ్డను పట్టించుకోలే... నా బిడ్డను అనిల్, మాధవి చిత్రహింసలు పెడుతుంటే పట్టించుకునే వారు కాదు.. రాజయ్య కు టుంబంను సంపేయండి... వారిని కఠినంగా శిక్షంచాలి. నా బిడ్డ పడ్డ క్షోభ మరే బిడ్డ పడవద్దు... ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే... ఇంక ఎక్కడ జరగవు. నా ఇంటి నుంచే బియ్యం, పప్పులు, ఉప్పులు పంపేదాన్ని... బతుకమ్మ పండగకు వచ్చింది.... దస రా అయ్యాక వెళ్లింది.. ఏమైనా బాధ ఉంటే చెప్పమ్మా అంటే.. నా హక్కులు నేనే సాధిస్తా అని చెప్పింది. ఇం టిని మరో రెండు నెలల్లో ఇస్తారు కావచ్చు అని చెప్పింది నా బిడ్డ.... మళ్లీ ఎన్నికలు వచ్చాయి కదా ఎట్ల ఉంటదో... ఇస్తానంటాడో ఇవ్వనంటారో తెలి యదు.... పిల్లలకు ఫీజులు సైతం కట్టలేని పరిస్థితి ఉందని చెప్పడంతో నాది పేద కుటుంబమే అయినా బిడ్డ ఇబ్బంది పడొద్దని రూ.5వేలు ఇచ్చి పంపాను. నా భర్త లేవలేని స్థితిలో ఉన్నారు. నా మనువళ్లు ఎంతో ముద్దుగా ఉండేవారు... పండగకు వచ్చినప్పుడు అమ్మమ్మ అంటూ నా చుట్టూ తిరుగుతూ అడుకున్నారు. నాకు అందరు ఆడపిల్లలే.... మనుమలనే కొడుకుల్లా భావించి అల్లాడుముద్దుగా చూసుకునేదాన్ని.. ఇప్పుడు మంటలు మాడిపోయారు..’ అం టూ లలిత రోదిస్తూ వెల్లడించింది. ‘సారికను చిత్రహింసలకు గురిచేశారు’ ఎంజీఎం : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుటుంబ సభ్యులు సారికను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా హత్య చేశారని మహిళా సంఘాల నేతలు సదాలక్ష్మి, ఇంద్ర, సారమ్మ ఆరోపించారు. సారిక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన సమయంలో రూ.20 లక్షల నగదుతో పాటు 10 తులాల బంగారాన్ని రాజయ్య కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఆమె ఉద్యోగం చేస్తూ డబ్బు తెచ్చిన సమయంలో ఓ విధంగా, డబ్బులు ఇవ్వకుండా మరో విధంగా చూస్తూ చిత్రహింసలు పెట్టారని పేర్కొన్నారు. ఈ మేరకు రాజయ్య కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. -
వ్యక్తి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని మదన్‌పల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్టుకు గురువారం మృతదేహం వేలాడుతూ కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగి చాలా రోజులు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృత దేహం పూర్తిగా కుళ్లి పోయిందని.. కేవలం అస్తి పంజరం మాత్రమే మిగిలిందని తెలిపారు. మృతుడు గ్రామానికి చెందిన టి. వెంకటేశ్(45)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
పోస్టుమార్టంకు తీసుకెళితే లేచి కూర్చున్నాడు!
ముంబయి: ఒకసారి వ్యక్తి చనిపోయాక తిరిగి లేవడం అంటూ జరగదు. అలా జరిగితే సంతోషపడటమేమోగానీ అవాక్కయ్యి భయంలోకి కూరుకుపోవడం ఖాయం. ముంబయిలో ఇలాంటి విచిత్ర ఘటనే చోటు చేసుకుంది. చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించిన ఓ వ్యక్తికి మరికాసేపట్లో పోస్టుమార్టం నిర్వహిస్తారనగా అతడు లేచి కూర్చున్నాడు. దీంతో పోస్టుమార్టం నిర్వహించేవారు, వైద్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. సులోచన శెట్టి మార్గ్ లో ఉన్న సెయింట్ బస్టాప్ వద్ద ఓ వ్యక్తి(42) అపస్మారక స్థితిలోకి పడిపోయి ఉన్నాడని కొందరు వ్యక్తులు పోలీసులకు చెప్పడంతో వారు అతడిని ప్రభుత్వ సియోన్ ఆస్పత్రి(లోకమాన్య తిలక్ ఆస్పత్రి)కి తరలించారు. ఆ వ్యక్తిని పరీక్షించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహన్ రోహెకర్ అతడు చనిపోయినట్లు నిర్ధారించాడు. పోస్టుమార్టానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేశారు. రికార్డుల్లో కూడా అతడు చనిపోయినట్లు చేర్చారు. అనంతరం పోస్టు మార్టానికి తరలించగా అందులో ఆ వ్యక్తి తిరిగి స్పృహలోకి వచ్చి లేచి కూర్చున్నాడు. దీంతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. తాను చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం ఆ వైద్యుడు చేశారు. ప్రభుత్వ వైద్యులు ఎంతటి నిర్లక్ష్యంతో ఉంటారో ఈ సంఘటనే ఉదాహరణ అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
భానుప్రీతి మృతి కేసులో కీలక సమాచారం
-
భానుప్రీతి మృతి కేసులో కీలక సమాచారం
విజయవాడలోని మేరీ స్టెల్లా విద్యార్థిని భాను ప్రీతి అనుమానాస్పద మృతి కేసులో కీలక సమాచారం లభ్యమైంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన భానుప్రీతి చేతి రాతతో ఉన్న మూడు పేర్లు, నాలుగు ఫోన్ నంబర్లు ఉన్న పేపర్ ఒకదాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది డస్ట్‌బిన్‌లో దొరికింది. అయితే రూంలో మరో ముగ్గురు కూడా ఉంటారు. దాంతో ఈ ఫోన్ నంబర్లున్న కాగితాన్ని భానుప్రీతే రాసిందా, మరెవరైనా రాశారా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, ఆ ఫోన్ నెంబర్లు ఎవరివన్న సమాచారాన్ని ఇంకా బయటపెట్టలేదు. ఆమె తన తెలుగు పుస్తకంలో రాసుకున్న ఒక వాక్యాన్ని కూడా పోలీసులు గుర్తించారు. వీటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక మరో వైపు మంగళవారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో భానుప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కాలేజి యాజమాన్యం, పోలీసులు దీన్ని ఆత్మహత్యగా చెబుతున్నా, తమ కూతురు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇందులో ఏదో కుట్ర ఉందని ఆమె తండ్రి సుబ్బారావు అంటున్నారు. దీనిపై సీఐడీ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. -
మునికోటి భౌతికకాయానికి పోస్టుమార్టం పూర్తి
చెన్నై: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఒంటికి నిప్పంటించుకొని మృతిచెందిన బెంగళూరు ముని కామకోటి అలియాస్ బీఎంకే కోటి(41) భౌతికకాయానికి పోస్టుమార్టంపూర్తయింది. కాసేపట్లో మునికోటి భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులకు వైద్యులు అప్పగించనున్నారు. తీవ్రగాయాలతో చెన్నై కేఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మునికోటి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం కోటి అంత్యక్రియలను తిరుపతిలో నిర్వహించనున్నారు. మరో బాధితుడు శేషాద్రిని కేఎంసీ ఆస్పత్రిలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పరామర్శించారు. బాధితుడికి అవసరమైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. -
గాంధీలో నిలిచిన పోస్ట్ మార్టంలు
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి ఆర్ఎంవో నరహరిపై చర్యలు తీసుకోవాలని ఆ ఆసుపత్రి మార్చురీ వైద్యులు మంగళవారం ప్రభుత్వ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. నరహరి వైఖరికి నిరసనగా విధులు బహిష్కరిస్తున్నట్లు వారు ప్రకటించారు. అనంతరం ఆసుపత్రిలో వారు ఆందోళనకు దిగారు. దాంతో మార్చురీలో పోస్టుమార్టంలు నిలిచిపోయాయి. ఈ అంశంపై చర్చకు రావాలని గాంధీ ఆసుపత్ర సూపరింటెండెంట్... మార్చురీ వైద్యులకు సమాచారం అందించారు. దీంతో సూపరింటెండెంట్‌తో మార్చురీ వైద్యులు చర్చలు జరుపుతున్నారు. -
గాంధీలో నిలిచిన పోస్ట్ మార్టంలు
-
ఆగమేఘాలపై పోస్టుమార్టం
తిరుపతి: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన 20 మంది ఎర్రకూలీల మృతదేహాలకు బుధవారం తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. 19 మృతదేహాలను అధికారులు గుర్తించారు. 7 మృతదేహాలను బుధవారం రాత్రి వారి బంధువులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో తమిళనాడు యంత్రాంగం సైతం తిరుపతికి వచ్చింది. తిరువళ్లూర్ కలెక్టర్ వీరరాఘవరావు, నార్త్ జోన్ ఐజీ మంజునాథ తదితర అధికారులున్నారు. మృతదేహాలను తరలించేందుకు తమిళనాడు ప్రభుత్వమే వాహనాలను సమకూర్చింది. కాగా, ఏపీ డీజీపీ రాముడు బుధవారం రాత్రి ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. తమిళనాడు నుంచి వచ్చిన మృతుల బంధువులు మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కూలీనాలీ చేసుకొని తమవారు ఇంటికి తిరిగి వస్తారనుకుంటే, పోలీసులు వారిని పొట్టన పెట్టుకుంటారని ఊహించలేదని వాపోయారు. -
పూడ్చిన మృతదేహాలకు పోస్టుమార్టం
రామకృష్ణాపూర్: అవయవదానం ఘటనలో ఒకరి తర్వాత మరొకరు మృతి చెందగా, నాడు పూడ్చిపెట్టిన మృతదేహాలకు మంగళవారం వైద్యులు పోస్టుమార్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్లో అక్కకు కాలేయంలో కొంత భాగం ఇచ్చిన చెల్లెలు మృత్యువాత పడగా, శస్త్ర చికిత్స తర్వాత అక్క కూడా మృతి చెందిన సంఘటన తెలిసిందే. రాబర్ట్ డేవిడ్ పెద్ద కూతురు దయారాణికి లివర్ ప్లాంటేషనఖ చేయాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో వారి చిన్నకూతురు నిర్మలారాణి కాలేయంలో కొంత భాగం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. గతేడాది డిసెంబర్లో 65 శాతం లివర్ సేకరించి దయారాణికి అమర్చారు. అయితే అదే నెల 29న నిర్మలారాణి మృతిచెందగా.. ఫిబ్రవరి 6న దయారాణి చనిపోయింది. -
‘బుల్లితెర నటి దీప్తిది ఆత్మహత్యే’
-
‘బుల్లితెర నటి దీప్తిది ఆత్మహత్యే’
హైదరాబాద్: బుల్లితెర నటి దీప్తి అలియాస్ రామలక్ష్మిది ఆత్మహత్యగా తేలింది. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసిన గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆమెది ఆత్మహత్యేనని ప్రాథమికంగా తేల్చినట్లు సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. హైదరాబాద్ ఫతేనగర్‌లోని ఠాకూర్ ఆర్డీ కాంప్లెక్స్‌లోని తన ప్లాట్‌లో దీప్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పోస్టుమార్టం నివేదికలో ఆమె ఉరివేసుకొని చనిపోయినట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. వారం రోజుల కిందట దీప్తి ఫోన్ చేసి తాను ఇక్కడ ఉండలేకపోతున్నానని, ఇంటికి వచ్చేస్తానంటూ తమతో చెప్పిందని దీప్తి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. కాగా, దీప్తి చనిపోయే ముందు వరకు లాప్టాప్ ఉపయోగించినట్లు తెలిసింది. దానికి పాస్వర్డ్ ఉండటంతో పోలీసులు ఓపెన్ చేయలేకపోయారు. లాప్టాప్ ద్వారా దీప్తికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
సాయిసింధు మృతదేహానికి పోస్టుమార్టం
నెల్లూరు: అమెరికాలో మృతిచెందిన సాయి సింధు మృతదేహానికి డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె మృతిపై అన్ని కోణాల్లో విచారించి కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇటీవల అమెరికాలో నెల్లూరుకు చెందిన సాయి సింధు అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింన సంగతి తెలిసిందే. అదనపు కట్నం కోసమే అల్లుడు...తమ కుమార్తెను హత్య చేశాడని సింధు తల్లిదండ్రులు ఆరోపించడంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. -
ఇక బీఎంసీ ఆస్పత్రుల్లో పోస్ట్‌మార్టం
సాక్షి, ముంబై: మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఆస్పత్రుల్లో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు అనుమతినివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకవేళ రోగీ చనిపోతే పోస్టుమార్టం కోసం ఇతర ఆస్పత్రుల చుట్టు తిరగాల్సిన పని లేదు. అదే ఆస్పత్రిలో పోస్టుమార్టం పనులు పూర్తి చేసి శవాన్ని బంధువులకు అప్పగించనున్నారు. దీంతో ఇటు మృతుని బంధువులు, అటు విధినిర్వహణలో ఉన్న పోలీసుల శ్రమ పూర్తిగా తగ్గనుంది. బీఎంసీతోపాటు ఇతర కార్పొరేషన్లు, అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్టుమార్టం చేసే సౌకర్యం లేదు. కొన్ని అస్పత్రుల్లో ఈ సౌకర్యం ఉన్నప్పటికీ అనేక సందర్భాలలో సమయాభావం, సిబ్బంది కొరత వల్ల అక్కడ శవాలు క్యూలో ఉంటాయి. దీంతో వైద్యులకు పని భారం ఎక్కువై మరసటి రోజు శవ పరీక్ష చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చాలా వరకు ఆస్పత్రుల్లో శవ పరీక్ష పనులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే జరుగుతాయి. దీంతో మృతుల బంధువులు గంటలకొద్దీ ఆస్పత్రుల్లో పడిగాపులు పడాల్సి ఉంటుంది. హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు జరిగితే ఇదే పరిస్థితి పోలీసులకు కూడా ఎదురైతుంది. బీఎంసీ ఆస్పత్రుల్లో శవ పరీక్ష నిర్వహించేందుకు సంబంధించిన సర్క్యులర్ రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. -
గిరిధర్ భౌతికకాయూనికి పోస్టుమార్టం
అనంతపురం రూరల్ : ప్రభుత్వ సర్వజనాస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గిరిధర్ భౌతికకాయూనికి పోస్టుమార్టం పూర్తీ అయ్యింది. శనివారం ఉదయమే కావాల్సిన పోస్టుమార్టం ఇక్వెస్ట్, రిక్వెస్ట్ ఆలస్యంగా ఇవ్వడంతో జాప్యం జరిగింది. పోస్టుమార్టంను డాక్టర్ మహేష్ చేశారు. అంతకుముందు టూటౌన్ పోలీసులతో డాక్టర్ గిరిధర్ సోదరుడు విజయ్‌కుమార్, బంధువులు ఏకీభవించలేదు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఉన్నత భావాలు కల్గిన వ్యక్తి అన్నారు. మృతిపై తమకు అనుమానాలున్నాయని తెలిపారు. వాస్తవంగా ఉరి వేసుకున్న కొక్కి వద్ద కనీసం పగుళ్లు కూడా రాలేదన్నారు. స్పందించిన టూటౌన్ సీఐ మన్సూరుద్దీన్ మొదట ఆత్మహత్యగా కేసు నమోదు చేశామని, మీకేమైనా అభ్యంతరాలుంటే పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత చూసుకోవాలని నచ్చజెప్పారు. తరలి వచ్చిన విద్యార్థులు తమ వైద్యుడు మృతి చెందారని తెలియడంతో మెడిసన్ విద్యార్థులు వందల సంఖ్యలో మార్చురీకి తరలివచ్చారు. సార్‌ను...చివరిసారిగా చూస్తున్నామంటూ పలువురు విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. ఏమైనా సమస్యలుంటే ఒకటికి రెండు సార్లు చెప్పేవారని, అటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని పేర్కొన్నారు. మంచి వ్యక్తిని కోల్పోయాం : వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గిరిధర్ మంచి వైద్యుడని, అటువంటి వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడం బాధకరమని వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.నీరజ పేర్కొన్నారు. వైద్య కళాశాల ఆడిటోరియంలో సంతాప సభ శనివారం నిర్వహించారు. ప్రిన్సిపాల్‌తో పాటు సూపరింటెండెంట్ డాక్టర్ కె.ఎస్.ఎస్.వెంకటేశ్వరరావు, చిన్ని పిల్లల విభాగాధిపతి డాక్టర్ మల్లేశ్వరి, ఫోరెన్సిక్ హెచ్‌డీఓ డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు గిరిధర్‌కు నివాళులర్పించారు. ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.బాబు పాల్గొన్నారు. -
పాతకక్షలే ప్రాణం తీశాయా..?
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా కేంద్రంలోని వీరన్నపేటకు చెందిన సోహైల్(26)సోమవారం రాత్రి దారుణహత్యకు గురైన విషయం విదితమే. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కాగా, సోహైల్ హ త్యకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో జిల్లా కేంద్రంలోని రామయ్యబౌళిలో నివాసం ఉంటున్న రౌడీషీటర్ కాలేబాబా వద్ద సోహైల్ కారుడ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో కాలెబాబా భార్యతో సోహైల్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఇద్దరు కలిసి భర్తను హతమార్చేందుకు భార్య ఫథకం పన్నింది. దీన్ని అమలుచేసేందుకు ఓ రాత్రి ఇంట్లో ఉన్న భర్త కాలెబాబాను ప్రియుడు సోహైల్‌తో కలిసి అతిదారుణంగా గొడ్డలితో నరికి హత్యచేశారు. ఈమేరకు కాలెబాబా గతకొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన మృతుడి స్నేహితులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేపట్టారు. కాలెబాబా హత్యకేసులో ప్రధాన నిందితులుగా మృతుడి భార్య, ప్రియుడు సోహైల్‌ను పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో బెయిల్‌పై విడుదలైన సోహైల్‌ను చంపేందుకు కాలెబాబా అనుచ రులు సమయం కోసం వేచిచూశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సోహైల్ టీడీగుట్ట ప్రాంతంలో ఒంటరిగా కనిపించడంతో కొందరు పదునైన ఆయుధాలతో అతనిపై విచక్షణరహితంగా దాడిచేసి గొంతుకోసి చంపారు. పోలీసులు సంఘటనస్థలాన్ని పరిశీలించారు. పాతకక్షల కారణంగానే గతంలో హత్యకు గురైన కాలేబాబా అనుచరులు సోహైల్‌ను మట్టుబెట్టి ఉంటారని అనుమానం వ్యక్తంచేస్తూ పోలీసులు ఆ కోణంలో పరిశోధనలు మొదలుపెట్టారు. కొందరు అనుమానితులను తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
పథకం ప్రకారమే హత్య..!
* స్వప్నశ్రీ హత్యతో ఉలిక్కిపడిన * మోమిన్‌కలాన్ గ్రామస్తులు * ధారూరు పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు.? ధారూరు: గృహిణి స్వప్నశ్రీ హత్యతో మండల పరిధిలోని మోమిన్‌కలాన్ గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో గ్రామానికి చెందిన రాజుగుప్త ఆమెను మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ సమీపంలో హత్య చేశాడు. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండల కేంద్రానికి చెందిన నందారం మిడిదొడ్డి రాజేందర్, మురళమ్మ దంపతుల రెండో కూతురు స్వప్నశ్రీ(32)ని 17ఏళ్ల క్రితం మోమిన్‌కలాన్‌కు చెందిన రాజుగుప్తా వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు వినీత, భరత్‌లు ఉన్నారు. రాజుగుప్త కిరాణావ్యాపారం చేస్తూ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం స్వప్నశ్రీ ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేసి అనంతరం మానేసి ఇంట్లోనే ఉండేది. కొంతకాలంగా రాజుగుప్తా వివాహేతర సంబంధాలు నెరుపుతున్నాడు. తనకు తెలియకుండా రహస్యంగా స్వప్నశ్రీ సెల్‌ఫోన్ మాట్లాడుతోందని.. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని అతడు అనుమానించాడు. దీంతో దంపతులు గొడవపడుతున్నారు. ఇరువర్గాల పెద్దలు సముదాయించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో స్వప్నశ్రీ గ్రామంలోనే మామ(రాజుగుప్తా తండ్రి)తో కలిసి వేరుగా ఉంటోంది. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం స్వప్నశ్రీ వేరొకరితో సన్నిహితంగా ఉండగా రాజుగుప్తా రెడ్‌హ్యాండెడ్‌గా చూశాడు. దీంతో ఎలాగైనా భార్యను చంపేయాలని అతడు పథకం వేశాడు. ఈక్రమంలో ఆయన సోమవారం రాత్రి పరిగిలో మద్యం తాగి వచ్చాడు. తండ్రి ఇంటికి వెళ్లి స్వప్నశ్రీని పుట్టింటికి తీసుకెళ్తానని నమ్మించాడు. తన ఇండికా కారు(ఏపీ 22జే 1332)లో ఎక్కించుకుని రాత్రి 9:30 గంటలకు బయలుదేరాడు. వాహనంలోనే భార్యను చంపిన ఆయన మార్గమధ్యలో బొంరాస్‌పేట్ సమీపంలో సంగయ్యగుట్ట శివాలయం వద్ద కారు నిలిపివేశాడు. మృతదేహాన్ని పడేసి పెట్రోల్‌తో నిప్పంటించాడు. అనంతరం తన అన్నదమ్ములతో పాటు అత్తగారింటి బంధువులకు ఫోన్ చేసి స్వప్నశ్రీ హత్య విషయం చెప్పాడు. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పిన రాజుగుప్తా అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారీ అయ్యాడు. మంగళవారం మహబూబ్‌నగర్ పోలీసులు స్వప్నశ్రీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించడంతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా బుధవారం రాత్రి నిందితుడు రాజుగుప్తా తన కారులో వచ్చి ధారూరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది. కాగా తల్లి హత్యకు గురవడం.. తండ్రి జైలు పాలుకానున్న నేపథ్యంలో దంపతుల పిల్లలు వినీత, భరత్‌లు అనాథలయ్యారు. పచ్చని కుటుంబంలో వివాహేతర సంబంధాలు నిప్పుపెట్టాయని గ్రామస్తులు తెలిపారు. -
గిరిజ మృతదేహం వెలికితీత
ఇబ్రహీంపట్నం/మంచాల: చిన్నారి గిరిజ మృతి చెందింది. మూడు రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ మంగళవారం రాత్రి ముగిసింది. రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామ సమీపంలోని బోరుబావి నుంచి ఐదేళ్ల చిన్నారి గిరిజ మృతదేహాన్ని రాత్రి 8:15 నిమిషాల ప్రాంతంలో రెస్క్యూటీం బయటకు తీసింది. 56 గంటలపాటు గా కొనసాగిన ఈ ఆపరేషన్ అనంతరం గిరిజ మృతదేహం బయటకు రాగలింది. చిన్నారి మృతిని అధికారికంగా సోమవారం మధ్యాహ్నమే ధ్రువీకరించినా.. మృతదేహం వెలికితీతకు మరింత సమయం పట్టింది. 45 అడుగుల లోతులో కూరుకుపోయి న గిరిజ మృతదేహం ఉబ్బిపోవడం వెలికితీతకు అవరోధం అయింది. చివరకు గిరిజ మృతదేహాన్ని కేసింగ్ పైపుల ద్వారా లాగారు. 50 శాతం శరీర భాగాలను మాత్రమే వెలికితీశారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
అత్తను చంపి.. భార్యను బెదిరించి...
* నాటు తుపాకీతో పరారైన హంతకుడు * పోగుళ్లను జల్లెడ పట్టిన పోలీసులు బేస్తవారిపేట : అత్తను నాటు తుపాకీతో చంపి.. దానితోనే భార్యను బెదిరించి పరారైన వ్యక్తి ఉదంతం ఇది. మండలంలోని పోగుళ్లలో అత్త తిరుమలమ్మ(55)ను అల్లుడు అల్లూరయ్య ఆదివారం రాత్రి తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. సంఘటన స్థలాన్ని గిద్దలూరు సీఐ నిమ్మగడ్డ రామారావు తన సిబ్బందితో కలిసి సోమవారం పరిశీలించారు. గ్రామస్తులు, మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎస్సై వి.నాగశ్రీను ఆధ్వర్యంలో తిరుమలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమె మృతదేహాన్ని సీఐ పరిశీలించారు. పోగుళ్లలో నాటు తుపాకీతో హత్య జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మార్కాపురం ఓఎస్డీ సమైజాన్‌రావు ఆదేశాల మేరకు స్పెషల్‌పార్టీ పోలీసులు గ్రామాన్ని జల్లెడ పట్టారు. కుమారునికి కొత్త దుస్తులు తేలేదనే.. గ్రామంలో ఆదివారం పోలేరమ్మ జాతరతో పాటు హంతకుడు అల్లూరయ్య కొడుకు పురిటి స్నానం చేయించారు. ఈ సందర్భంగా అల్లూరయ్య పూటుగా మద్యం తాగాడు. తన కొడుకుకు నూతన దుస్తులు తీసుకురాలేదని అత్తింటి వారితో గొడవకు దిగాడు. గొడవ పెద్దదవుతుండటంతో అత్త ఇంటికి ఎదురుగా ఉన్న తన ఇంట్లో అల్లూరయ్యను పెట్టి తాళం వేశారు. అక్కడ దాచి ఉంచిన నాటు తుపాకీతో ఎదురు దబ్బల తలుపు సందులోంచి కాల్చాడు. అత్త తిరుమలమ్మ కడుపులో తుపాకీ గుండు దిగబడి బయటకు వచ్చింది. ఆమె పక్కనే ఉన్న మనుమడు కళ్యాణ్ చేతులకు గాయాలయ్యా యి. తీవ్రంగా గాయపడిన తిరుమలమ్మను మంచంపై పడుకోబెట్టి రోడ్డుపైకి తీసుకొచ్చేలోపే ఆమె మృతి చెందింది. సంఘటన జరిగిన వెంటనే అల్లూరయ్య తన ఇంటి తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. భార్యాబిడ్డపై గురిపెట్టి అరిస్తే చంపేస్తానని బెదిరించి తుపాకీతో సహా పరారయ్యాడు. -
ఆ పది గంటల్లో ఏం జరిగింది?
కోరుట్ల: పది నెలల క్రితం కోరుట్ల ఠాణాలో సాన చంద్రయ్య అనుమానస్పద మృతి వ్యవహారం లో పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారింది. వారం రోజులుగా చంద్రయ్య మృతి ఉదంతం పై సీఐడీ అధికారులు విచారణ వేగవంతం చేశా రు. ఈక్రమంలో చంద్రయ్య పోస్టుమార్టం నిర్వహించిన కరీంనగర్ ప్రభుత్వ వైద్యులు ఇటీవల పోస్టుమార్టం నివేదిక అందజేసినట్లు సమాచా రం. ఈ నివేదికలో ఏముందన్న విషయంలో పూర్తిస్థాయి స్పష్టత రాకున్నప్పటికీ.. చంద్రయ్య చనిపోయాడని పోలీసులు చెప్పిన సమయాని కి, వాస్తవంగా చ నిపోయిన సమయానికి మధ్య పదిగంటల తేడా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలి సింది. దీంతో చంద్రయ్య మృతి ఉదంతంలో మానవహక్కుల సంఘం ప్రతినిధులు వ్యక్తం చేసిన అనుమానాలు మరింత బలపడుతున్నా రు. ఈ అనుమానాలు నిజమైతే.. ఈ సంఘటన కుబాధ్యులైన పోలీసు అధికారుల చుట్టూ ఉచ్చు బిగిసే అకాశముందనే వాదనలు వినవస్తున్నా యి. ధర్మపురి కో-ఆపరేటివ్ బ్యాంకు చోరీ కేసు లో నిందితుడైన సాన చంద్రయ్య జనవరి 19వ తేదీన రాత్రి 9.45 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ పైనుంచి దూకగా తీవ్రగాయ్యాయని పోలీసులు చెప్పారు. వెంటనే చంద్రయ్యను స్థానిక ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లామని, పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించామని చెప్పుకొచ్చారు. కరీం నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించిన అనంత రం..అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలో చంద్ర య్య చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే పోలీసులు చెప్పిన సమయానికి, పోస్టుమార్టం పరీక్షల అనంతరం వైద్యులు నిర్ధారించి న సమయానికి మధ్య సుమారు పది గంటల తేడా ఉన్నట్లు సమాచారం. అంటే చంద్రయ్య జనవ రి 19న మధ్యాహ్నం 3గంటల సమయంలోనే మృతి చెందాడా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు చంద్రయ్య మృతదేహంపై కొట్టిన దెబ్బలు ఉన్నట్లు వైద్యులు పోస్టుమార్టం సమయంలో వెల్లడించడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి.దీంతోపాటు పోలీసులు చెబుతున్న సమయానికి.. పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నట్లుగా చెప్పిన సమయానికి మధ్యకాలంలో ఏం జరిగి ఉం టుందన్న విషయంలో మిస్టరీ నెలకొంది. -
తాళికట్టిన వాడే కడతేర్చాడు
సిద్దిపేట అర్బన్ : జీవితాంతం తోడుంటానని ఏడడుగులు నడిచి మూడు ముళ్లు వేసిన భర్త భార్య పాలిట యముడయ్యాడు. గుట్టు చప్పుడు కాకుండా భార్యను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడో ప్రబుద్ధుడు. చివరు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హంతకుడైన భర్తను టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట మండలం నారాయణరావుపేట గ్రామానికి చెందిన పంది నర్సయ్య కుమార్తె లావణ్యకు సిద్దిపేటలోని బోయిగల్లికి చెందిన పెద్దపల్లి రాంచంద్రంతో 11 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా కొంత కాలంగా లావణ్యను అదనపు కట్నం కోసం భర్త రాంచంద్రం తరచూ వేధింపులకు గురిచేసేవాడు. ఇదే విషయమై పంచాయితీ నిర్వహించిన కుల పెద్దలు ఇరువురికీ నచ్చజెప్పారు. అయితే జూన్ ఒకటో తేదీ తెల్లవారుజామున లావణ్య అలియాస్ వరలక్ష్మి మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తమ కూతురును అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు పంది నర్సయ్య, పోచవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోస్టుమార్టం రిపోర్ట్‌లో లావణ్యను గొంతు నులిమి చంపినట్లు వైద్యులు నివేదిక ఇచ్చారు. దీంతో పోలీసులు అనుమానంతో భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో టూటౌన్ సీఐ సైదులు, ఎస్ఐ వరప్రసాద్ సిబ్బంది ఉన్నారు. -
ఆరుబయటే పోస్టుమార్టం
మెదక్ రూరల్ :పేరుకే డివిజన్లో పెద్దాస్పత్రి. ఇక్కడ పోస్టుమార్టం చేయడానికి కనీస వసతులు లేవు. ముఖ్యంగా గదులు సమస్య వేధిస్తోంది. దీంతో ఆస్పత్రికి వచ్చిన మృతదేహాలకు ఆరుబయటే పోస్టుమార్టం నిర్వహించాల్సి వస్తోంది. ఒక వేళ అనాథ మృతదేహాలు వస్తే వాటిని భద్రపరిచేందుకు ఫ్రీజర్లు కూడా లేవు. దీంతో సచ్చినా కష్టాలు తప్పడం లేదు. మెదక్ ఏరియా ఆస్పత్రికి మెదక్, చిన్నశంకరంపేట, పాపన్నపేట, కొల్చారం, చేగుంట, కౌడిపల్లితో పాటు పలు పీహెచ్‌సీల నుంచి ప్రజలు చికిత్సల నిమిత్తంతో పాటు ప్రమాదాల్లో మరణిస్తే పోస్టుమార్టం కోసం ఇక్కడికి రావాల్సిందే. కానరాని సౌకర్యాలు... మెదక్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం కోసం ఓ గదిని కేటాయించారు. కానీ అది చాలా ఇరుకుగా ఉంది. కనీసం అందులోకి గాలి, వెలుతురు కూడా రాని పరిస్థితి. మరో ఇరుకు గదిలో శవాలను భద్రపరిచే ఒక ఫ్రీజర్ ఉంది. అది దశాబ్దాల క్రితం చెడిపోవడంతో అది కూడా మూలన పడింది. దీంతో గత్యంతరం లేక ఆరు బయటనే మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తున్నారు. కనీసం నీటి సౌకర్యం కూడా లేక పోవడంతో బయట నుంచి బకెట్లలో నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. పోస్టుమార్టం మృతదేహాలను బద్రపరిచేందుకు కావాల్సిన ఫ్రీజర్ల, (మార్చురీ) యూనిట్ లేదు. పోస్టుమార్టం చేయాలి అంటే రెండు పెద్ద సైజు బెంచీలతో పాటు విశాలమైన గది ఉండాలి. అదే గదిలో కనీసం 3 నుంచి 4 మృతదేహాలను భద్ర పరిచేందుకు ఫ్రీజర్లు అందుబాటులో ఉండాలి. గదిలో మృతదేహం వాసన రాకుండా ఉండేందుకు వాడే రసాయనాలను అందుబాటులో ఉంచుకోవాలి. అయితే ఏరియా ఆస్పత్రిలో ఇటువంటి సౌకర్యాలు ఏవీ లేవు. దీంతో అనాథ మృతదేహాలను రోజుల తరబడి ఓ గదిలో ఉంచ డంతో కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించేందుకు అన్నిసౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఈ సమస్యను గతంలోనే ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకెళ్లడం జరిగిందన్నారు. నిధులు మంజూరైతే విశాలమైన గదితో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. -
గర్భిణి మృతిపై ఆందోళన
- వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకుల ఆరోపణ - ఆస్పత్రిలో ఫర్నీచర్ ధ్వంసం - వికారాబాద్‌లో ఘటన వికారాబాద్ రూరల్: ఓ మహిళ బాబుకు జన్మనిచ్చి మృతి చెందింది. డాక్టర్ నిర్లక్ష్యంతోనే యువతి మృతిచెందిందని కుటుంబీకులు ఆరోపిస్తూ ఆస్పత్రిలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ సంఘటనవికారాబాద్ పట్టణంలో శనివారం వెలుగుచూసింది. మృతురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. బంట్వారం మండలం మోత్కుపల్లి గ్రామానికి చెందిన ముష్టి ప్రభావతి(21), గురుదాస్ దంపతులకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం గర్భం దాల్చిన ప్రభావతి వికారాబాద్‌లోని హృదయ ఆస్పత్రిలో చూయించుకుంటోంది. గురువారం మధ్యాహ్నం పురుటినొప్పులు రావడంతో ఆమె ను కుటుంబీకులు అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ ఆశాజ్యోతి మధ్యాహ్నం 3 గంటలకు సిజేరియన్ చేయడంతో బాబు జన్మించాడు. కొద్దిసేపటికి ప్రభావతికి రక్తస్రావం అవడంతో కడుపులో తీవ్ర నొప్పిగా ఉందని అమ్మమ్మ రుక్కమ్మకు చెప్పింది. ఈ విషయాన్ని రుక్కమ్మ డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా వైద్యులు స్పందించలేదని కుటుంబీకులు చెబుతున్నారు. రాత్రి 9 గంటల తర్వాత డాక్టర్ వచ్చి ప్రభావతి పరిస్థితి విషమించిందని చెప్పారు. వైద్యురాలి భర్త డాక్టర్ మధుసూధన్‌రెడ్డి ఓ ప్రైవేట్ వాహనంలో ప్రభావతితో పాటు రుక్కమ్మను తీసుకొని హైదరాబాద్‌లోని పెద్దాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే ప్రభావతి మృతి చెందిందని నిర్ధారించారు. శుక్రవారం సాయంత్రం మృతదేహాన్ని వికారాబాద్‌లోని హృదయ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మృతురాలి బంధువులు ప్రభావతి మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే ప్రభావతి చనిపోయిందని ఆరోపించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించే యత్నం చేశారు. తమకు న్యాయం జరగాలని భీష్మించారు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో పోలీసులు మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి భర్త గురుదాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కూతురు మృతి చెందడంతో మనోవేదనకు గురైన ప్రభావతి తండ్రి మల్లయ్యకు మూర్ఛతో పడిపోయాడు. ఆయనను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా పసికందుకు గుండె కుడివైపు ఉండడంతో నిలోఫర్‌కు తరలించారు. పోస్టుమార్టంకు నిరాకరించిన డాక్టర్లు.. ప్రభావతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్యులు నిరాకరించారు. తమకు అనుభవం లేదని ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
బాలికపై గ్యాంగ్ రేప్, హత్య
భువనేశ్వర్: ఒడిశాలోని గంజాం జిల్లాలో మరో బాలిక కామాంధుల అకృత్యానికి బలైంది. బాలిసాహి గ్రామానికి చెందిన ఓ బాలిక(17) గురువారం తండ్రితో కలిసి పొలానికి వెళ్లింది. తిరిగి ఇంటికి ఒంటరిగా వస్తుండగా ఆమెను మామిడి తోటలోకి లాక్కెళ్లిన దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు కిరాతకంగా హతమార్చారు. ఆ తర్వాత బాలిక శవంపై పెద్దపెద్ద బండరాళ్లు వేసి పైశాచికత్వాన్ని చాటుకున్నారు. బాలిక హత్యకు ముందు సామూహిక అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టమ్ నివేదికలో వెల్లడైందని, ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు శనివారం పోలీసులు తెలిపారు. -
‘చావు’కొచ్చింది !
►ప్రకాశం బ్యారేజీ, కృష్ణాతీరంలో తేలుతున్న మృతదేహాలు ►బయటకు తీసింది మొదలు భద్రపరిచే వరకు ‘భారం’ ►గుర్తుతెలియని మృతదేహాలతో నానా ఇక్కట్లు.. ►జేబులు గుల్లవుతున్నాయని తాడేపల్లి పోలీసుల గగ్గోలు తాడేపల్లి రూరల్: మృతదేహం అంటేనే తాడేపల్లి పోలీసులు ఠారెత్తిపోతున్నారు. కృష్ణానదిలో తేలే ప్రతి మృతదేహాన్ని బయటకు తీసింది మొదలు పంచనామా, పోస్టుమార్టం, అనంతరం బంధువులు వచ్చేవరకు భద్రపరచడం ఇవన్నీ పోలీసులకు తలకు మించిన భారంగా పరిణమిస్తున్నాయి. వీటి కోసం శాఖా పరంగా ఎలాంటి నిధులు లేకపోవడంతో చేతి చమురు వదిలించుకుంటున్నారు. ఈ డ్యూటీ అంటేనే భయపడిపోతున్నారు. కృష్ణాతీరం, ప్రకాశం బ్యారేజి, కనకదుర్గ వారధి ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఆత్మహత్యలు, అనుమానాస్పద మృతులు పెరిగాయి. వీటికి తోడు రోడ్డు ప్రమాదంలో మృతులకు, ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారికి కూడా పోలీసులే పోస్టుమార్టం చేయించాల్సి వస్తోంది. ఏడాదిలో తాడేపల్లి పోలీసులు 70కి పైగా మృత దేహాలకు పంచనామా జరిపి, పోస్టుమార్టం చేయించాల్సి వచ్చింది. ఈ సమయంలో కానిస్టేబుళ్లు ఎదుర్కొంటున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా గుర్తుతెలియని మృతదేహాలతోనే వారు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ►ఈ నెలలో ఇప్పటివరకు తాడేపల్లి పోలీసులు 18 మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు. పంచనామాలు, పోస్టుమార్టాలు రోజువారీ విధులకు ఆటంకం కలిగించడంతోపాటు కానిస్టేబుళ్ల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ►గుర్తు తెలియని మృతదేహాలతోనే పోలీసులు ఇబ్బందుల పాలవుతున్నారు.కుళ్లిన మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీసే సమయంలో పోలీసుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ►దుర్వాసన తట్టుకోలేక ఆ మృతదేహాలను బయటకు తెచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా ‘మందు’ పోయించకుండా పని జరగదు. దీని కోసం పోలీసులు తమ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ►కృష్ణా నది ఇసుక తిన్నెల్లో నుంచి మృతదేహాలను రోడ్డుపైకి తెచ్చి మార్చురీకి తరలించేందుకు ఏ వాహనదారుడు ముందుకు రావడం లేదు. పోలీసులు బెదిరించి తీసుకు వచ్చినా, నాలుగొందలో ఐదు వందలో వదిలించుకోవాల్సి వస్తోంది. ►ఇక మృతదేహం ఉందని తెలియగానే కేసు దర్యాప్తునకు వచ్చే అధికారులకు మర్యాద చేయడం కూడా పోలీసులకు అదనపు భారంగా మారింది. ►ఇలా అన్నీ పూర్తి చేసి ఒక్కో మృతదేహాన్ని మార్చురీకి తరలించాలంటే సుమారు రెండు వేల రూపాయల వరకు ఖర్చవుతోంది. వీటి కోసం నిధులు ఏమీ లేకపోవడంతో ఈ భారం కానిస్టేబుళ్లపైనే పడుతోంది. ►గుర్తు తెలియని మృతదేహాలను భద్రపరచడం పోలీసులకు తలకు మించిన పని అవుతోంది. ►కృష్ణానదిలో ఆత్మహత్య చేసుకునేవారు ఎక్కువగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉంటున్నారు. కుటుంబీకులు, బంధువుల కోసం ఇలాంటి మృతదేహాలను ఎక్కువ రోజులు భద్రపరచాల్సి వస్తోంది. దీని కోసం ఏసీ మార్చురీ రూములు అవసరం అలాంటి సౌకర్యాలు ఏమీ లేవు. ►తాడేపల్లి పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాలను మంగళగిరి పంపిస్తుంటారు. అక్కడ పోస్టుమార్టం గదిలో తలుపులు ఊడిపోయి, కిటికీలకు చెక్కలు ఊలిపోయి, ఎలుకలు, పందికొక్కులే కాక, నక్కలు, కుక్కలు యథేచ్ఛగా మృతదేహాలను భక్షించేందుకు అనువుగా ఉంటుంది. పోనీ, దగ్గరలో ఉన్న విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి పంపిద్దామంటే ‘సరిహద్దు’ సమస్య. ►ఇక మిగిలింది గుంటూరు ప్రభుత్వాసుపత్రే. అక్కడకు పంపించాలంటే మరో మూడు వేలు అదనపు ఖర్చు అవుతుంది. దీంతో మృతదేహాల తరలింపు డ్యూటీలంటే నే పోలీసులు భయపడిపోతున్నారు. -
తండ్రీకొడుకుల మృతదేహాలు లభ్యం
పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం తరలింపు కేసు దర్యాప్తు ప్రారంభం జుజ్జూరులో విషాదం ఇబ్రహీంపట్నం : స్థానిక ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో గురువారం దూకి గల్లంతైన తండ్రీకొడుకుల మృతదేహాలను ఇబ్రహీంపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన మహేశ్వర హనుమాన్‌ప్రసాద్ (35)కు భార్య శ్రీలక్ష్మితో విభేదా లు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కుమారులు శివభార్గవ్(9), గోపీచంద్(7)తో కలిసి గురువారం ఇబ్రహీంపట్నం వచ్చి కూలింగ్ కెనాల్లో దూకి గల్లంతయ్యారు. వీరితో పాటు దూకిన హనుమాన్‌ప్రసాద్ అమ్మమ్మ పులిపాటి పుష్పావతి (70)ని స్థానికులు కాపాడి 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె కోలుకుం టోంది. శివభార్గవ్, గోపిచంద్‌ల మృతదేహాలు గురువారం అర్ధరాత్రి ఎన్టీటీపీఎస్‌లోకి కొట్టుకు రాగా పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఉద యం హనుమాన్ ప్రసాద్ మృతదేహం కూడా అక్కడ కనిపించింది. ఎన్టీటీపీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై లక్ష్మీనారాయణ సిబ్బందితో వచ్చి ముగ్గురి మృతదేహాలను పరిశీలించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకుని, విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతులకు స్వగ్రామంలో అంత్యక్రియలు జుజ్జూరు(వీరులపాడు) : కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకు న్న మహేశ్వర వెంకట్ హనుమాన్ ప్రసాద్, కుమారులు శివభార్గవ్, గోపిచంద్ మృతదేహాను శుక్రవారం స్వగ్రామం జుజ్జూరు తీసుకువచ్చారు. మృతదేహాలను ఇంటి కి తీసుకురాగానే బంధువులు తీవ్రంగా రో దిం చారు. హనుమాన్ ప్రసాద్‌తోపాటు ఇద్దరు పిల్లలను కడసారి చూసేందుకు గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. హనుమాన్ ప్రసాద్ తండ్రి వెంకటరత్నం ముగ్గురి మృతదేహాలకు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రీకొడుకుల ఆత్మహత్య ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఘటన జరిగిందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. -
సచ్చినా కష్టమే..
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా వ్యాప్తంగా నిర్మల్, భైంసా, మంచిర్యాల ఏరి యా ఆస్పత్రులతోపాటు ఖానాపూర్, ఉట్నూర్, సిర్పూర్ (టి), బెల్లంపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్‌లలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ), ముథోల్, లక్సెట్టిపేట, చెన్నూర్, బోథ్ ప్రభుత్వ సివిల్ ఆస్పత్రుల్లో పోస్టుమార్టం జరుగుతాయి. పోస్టుమార్టం చేసేందుకు ఒక సివిల్ సర్జన్, ముగ్గురు ఎంఎన్‌వోలు అవసరం. వీరు షిఫ్ట్వైస్గా విధులు నిర్వర్తించాలి. ప్రస్తుతం ఏరియా ఆస్పత్రుల్లో 26 మంది సివిల్ సర్జన్లు, 17 మంది ఎంఎన్‌వోలు ఉన్నారు. సీహెచ్‌సీల్లో 24 మంది సివిల్ సర్జన్లు, 20 మంది ఎంఎన్‌వోలు, సివిల్ ఆస్పత్రుల్లో 11 మంది మెడికల్ ఆఫీసర్లు, 13 మంది ఎంఎన్‌వోలు పనిచేస్తున్నారు. ఈ ఆస్పత్రులు వైద్య విధాన పరిషత్ కిందకి వస్తాయి. అయితే వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న 72 పీహెచ్‌సీల్లో ఎక్కడా కూడా పోస్టుమార్టం నిర్వహించడం లేదు. పీహెచ్‌సీల్లో పోస్టుమార్టం చేసే వెసులుబాటు ప్రభుత్వం కల్పించకపోవడంతో ఈ ప్రాంతాల్లో చనిపోయిన వారిని ఏరియా ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. పీహెచ్‌సీల్లో పోస్టుమార్టం గదులు ఏర్పాటు చేయాలని, అందుకు కావాల్సిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. కానరాని సౌకర్యాలు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం గదిలో మూడు ఫ్రీజర్లు ఉండగా ఒకటి మూలనపడింది. గది చుట్టూ పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు, చెత్తచెదారం ఉంది. పోస్టుమార్టం గదుల్లో మృతదేహాన్ని భద్రపరిచేందుకు కావాల్సిన ఫ్రీజర్లు(మార్చురీ యూనిట్) కనిపించడం లేదు. పోస్టుమార్టం గదుల్లో నీటిసౌకర్యం, రెండు పెద్ద బెంచిలతోపాటు, ఒక విశాలమైన హాల్ ఉండాలి. మూడు మృతదేహాలను ఉంచే సామర్థ్యం గల ఫ్రీజర్లు అందుబాటులో ఉంచాలి. గదిని ఎప్పుడు శుభ్రం చేసేందుకు కెమికల్స్ ఉపయోగించాలి. పోస్టుమార్టం చేసే సమయంలో ఉప్పు, బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉండాలి. మృతదేహం వాసన రాకుండా ఉండేందుకు ముందస్తుగా సెంట్ చల్లాలి. అయితే ప్రస్తుతం పోస్టుమార్టం చేస్తున్న చాలా ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేవు. మృతదేహాలను పడుకోబెట్టేందుకు గద్దెలు (బెంచీ), శవాలను భద్రపరిచే ఫ్రీజర్లు, ఇతర పరికరాలు కానరావడం లేదు. శవాలను భద్రపరిచే ఫ్రీజర్లు లేకపోవడంతో అనాథ శవాలు వచ్చినప్పుడు రోజుల తరబడి ఉంచడం ద్వారా కుళ్లిపోతున్నాయి. ఒక రిమ్స్ ఆస్పత్రిలో తప్ప ఎక్కడ కూడా ఫ్రీజర్లు లేవని తెలుస్తోంది. పోస్టుమార్టం గది అంటేనే భయపడేలా కనిపిస్తున్నాయి. రిమ్స్ ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదితోపాటు, ఇతర ఆస్పత్రుల్లో పిచ్చిమొక్కలు పెరిగి, చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. పోస్టుమార్టం చేసేందుకు ఉపయోగించే సుత్తె, కత్తెర, ఇతర చిన్న పరికరాలు కూడా పాతవే వాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గదిలోపల పోస్టుమార్టం తర్వాత శుభ్రపర్చకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. నిర్మల్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం గదిలోపల సౌకర్యాలు లేక ఆరుబయటే పోస్టుమార్టం చేస్తున్నారు. కొన్ని సమయాల్లో ఇక్కడి సిబ్బంది పోస్టుమార్టం గదులకు తాళం వేసి వెళ్లిపోవడంతో వైద్యులు, సిబ్బంది కోసం గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా కేసుల్లో పోస్టుమార్టం ఒకరోజులో చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో బాధిత బంధువులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సౌకర్యాలు కల్పిస్తాం.. - బసవేశ్వరీ, డీఎంహెచ్‌వో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పోస్టుమార్టం గదుల్లో లేని సౌకర్యాలపై దృష్టిపెట్టాం. ఫ్రీజర్లు లేని ఆస్పత్రులను గుర్తించి వాటి ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటాం. మృతదేహం వచ్చిన వెంటనే పోస్టుమార్టం నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో పోస్టుమార్టం నిర్వహించే వెసులుబాటు లేదు. అన్ని ఏరియా, సివిల్ ఆస్పత్రుల్లో మెడికల్ ఆఫీసర్లు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. -
ఆత్మహత్యలపై వీడని సస్పెన్స్
రెండు కుటుంబాల్లో విషాదం పెనుగంచిప్రోలు/మక్కపేట : స్నేహితురాళ్లు ఆత్మహత్య చేసుకుని రెండు రోజులు గడుస్తున్నా ఈఘటన వెనుక ఉన్న మిస్టరీ వీడలేదు. వత్సవాయి మం డలం మక్కపేట గ్రామంలో ఆదివారం పురుగు మం దు తాగి ఆత్మహత్య చేసుకున్న పెనుగంచిప్రోలుకు చెందిన సిరిపురపు సునీత మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని సాయంత్రం స్వగ్రామంలోని తుఫాన్ కాలనీలోని ఆమె ఇంటికి తీసుకువచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. ఆమెను చూ సేందుకు బంధువులు, గ్రామస్తులే కాక, స్నేహితులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సునీత సోదరుడు గోపి పూణేలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సోదరి మరణించి న విషయం తెలుసుకుని హుటాహుటిన ఇక్కడకు వ చ్చాడు. ఆమె మృ తదేహం చూసి గుండెలవిసేలా రోదించాడు. ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సునీతకు రెండు నెలల క్రితమే వివాహమైంది. హైదరాబాద్‌లో ఉంటున్న భర్త, అత్తింటివారు ఇక్కడకు వచ్చారు. సునీత మృతదేహాన్ని చూ సి భోరున విలపించారు. మక్కపేట గ్రామానికి చెం దిన ధారావతు అరుణ మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం జగ్గయ్యపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టమ్ అనంతరం సాయంత్రం గ్రామానికి తీసుకువచ్చారు. కుమార్తె మరణాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. అరుణ సోదరుడు ఆర్మీలో పనిచేస్తున్నాడు. సోదరి మరణవార్త విని వేరే రాష్ట్రం నుంచి వచ్చాడు. అరుణ మృతదేహాన్ని చూసి భోరున విలపించాడు. వీరిద్దరి ఆత్మహత్యలపై కుటుంబసభ్యులు గానీ, బంధువులు గానీ, స్నేహితు లు గానీ ఏ విషయం చెప్పలేక పోతున్నారు. పోలీ సులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. -
ఏడాది తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం
హైకోర్టు ఆదేశాలతో కదిలిన కర్ణాటక పోలీసులు మదనపల్లెక్రైం: మదనపల్లెకు చెందిన ఓ వ్యక్తి కర్ణాటక ప్రాంతంలో ఆత్మహత్య చేసుకోగా కేసు నమోదు చేయని పోలీసులపై మృతుడి తల్లి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు పోలీసులకు అక్షింతలు వేయడంతో ఏడాది తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తల్లి కథనం మేరకు.. మదనపల్లె పట్టణం విజయనగర్‌కాలనీలో నివాసముంటున్న వెంకటస్వామి, లక్ష్మీదేవి దంపతుల కుమారులు మోహన్‌కుమార్(25), మంజునాథ్ కర్ణాటక రాష్ట్రం బాగేపల్లె వద్ద నర్సరీని నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం మోహన్‌కుమార్‌కు బెంగళూరుకు చెందిన వెంకటస్వామి, వెంకటమ్మ దంపతుల కుమార్తె మాలినితో పెళ్లి చేశారు. మోహన్‌కుమార్, మాలిని మదనపల్లె విజయనగర్‌కాలనీలో కాపురం ఉండేవారు. పెళ్లి జరిగిన 11 నెలలకే దంపతులిద్దరూ ఘర్షణ పడ్డారు. మనస్తాపానికి గురైన మాలిని పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించి కొద్దిరోజులు పుట్టింటిలో ఉండి రమ్మని అత్మమామలు, భర్త బెంగళూరుకు పంపారు. నెల రోజులైనా భార్య కాపురానికి రాకపోవడంతో గత ఏడాది ఆగస్టు 25న మోహన్‌కుమార్ భార్య పుట్టింటికి వెళ్లాడు. అక్కడ భార్య మాలినితో పాటు బావమరిది శ్రీనివాసులు, అత్తమామలు వెంకటస్వామి, వెంకటమ్మ, మాలిని అక్క, బావలు తదితరులు కలిసి మోహన్‌కుమార్‌ను దుర్భాషలాడారు. దాడిచేసి కొట్టారు. నీ భార్యను కాపురానికి పంపేది లేదని, మరోసారి వస్తే చంపేస్తామని బెదిరించి ఇంట్లోంచి గెంటేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మోహన్‌కుమార్ బాగేపల్లెలోని చెరువువద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తమ్ముడు మంజునాథ్ అపస్మారకస్థితిలో పడిఉన్న అన్నను స్థానికుల సాయంతో బాగేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అక్కడి వైద్యులు బెంగళూరుకు రెఫర్ చేశారు. బెంగళూరు ఆస్పత్రిలో మోహన్‌కుమార్ మృతి చెందాడు. కోడలు, వారి కుటుంబసభ్యులు దాడిచేసి కొట్టడంవల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మోహన్‌కుమార్ తల్లిదండ్రులు చెప్పినా కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేయకుండా మృతదేహాన్ని అప్పగించి పంపేశారు. అక్కడి పోలీసులు కన్నడలో మాట్లాడుతుండడంతో ఏమీ అర్థంకాక మృతదేహాన్ని మదనపల్లెకు తీసుకొచ్చి అంత్యక్రియలు చేసినట్టు మృతుడి తల్లి పేర్కొన్నారు. తర్వాత మదనపల్లె రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగింది కర్ణాటకలో అయినందున అక్కడి పోలీసులకే ఫిర్యాదు చేయాలని ఈ కేసును రెఫర్ చేశారు. అయినా అక్కడి పోలీసులు కదల్లేదు. దీంతో మృతుడి తల్లి లక్ష్మీదేవి హైకోర్టును ఆశ్రయించారు. కేసును పరిశీలించిన హైకోర్టు వెంటనే నిందితులపై కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని కర్ణాటక పోలీసులకు అక్షింతలు వేసింది. దీంతో శుక్రవారం బాగేపల్లె ఎస్ఐ మునిరెడ్డి, ఏఎస్ఐ మదనపల్లెకు వచ్చి తహశీల్దారు సమక్షంలో మోహన్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: సుధీర్ గుప్తా
సునంద కేసుపై ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ సుధీర్ గుప్తా న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ భార్య, సునందా పుష్కర్ మృతిపై పోస్ట్ మార్టమ్ నివేదికలో మార్పుచేయాలంటూ తనపై ఒత్తిడి జరిగిందన్న మాటకు తాను కట్టుబడి ఉన్నానని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం అధిపతి సుధీర్ గుప్తా గురువారం మరోసారి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను ఎయిమ్స్ ప్రతినిధులు ఖండించిన మరుసటి రోజు పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, పోస్ట్‌మార్టమ్‌పై తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. ‘నేను చెప్పిన మాటలకు కట్టుబడే ఉన్నా. నాపై ఏ ఒత్తిడీ లేదని వారికెలా తెలుసు? అలా వివరణ ఇవ్వడానికి వారెవరు? అలా చెప్పడానికి హడావుడిగా విలేకరుల సమావేశం పెట్టాల్సిన అవసరం ఏమిటి?‘ అంటూ సుధీర్ గుప్తా ప్రశ్నలు సంధించారు. గురువారం ఢిల్లీలోని తన నివాసంవద్ద మీడియా సమావేశంలో కూడా సుధీర్ గుప్తా ఇదే స్పందన వ్యక్తం చేశారు. సునందా మృతిపైనేకాక ఇతర కేసుల్లోనూ వైద్యసూత్రాలకు అనుగుణంగానే పోస్ట్‌మార్టమ్ నివేదికలను ఖరారు చేశానని, జీవితంలో ఎప్పుడూ ఒత్తిళ్లకూ లొంగలేదని గుప్తా అన్నారు. గతంలో తానిచ్చిన నివేదికలన్నీ సాధికారమైనవేనన్నారు. సుధీర్ గుప్తా రూపొందించిన పోస్ట్‌మార్టమ్ నివేదికలో సునంద రెండు చేతులమీద 12కు పైగా గాయాలున్నట్టు పేర్కొన్నారు. ఆమె మెడపై బలంగా నొక్కినట్టు ఒరిపిడి జరిగినట్టు తెలుస్తోందని వివరించారు. ఎడమ అరచేతిపై లోతైన పంటి గాయం కూడా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. వీటికి సంబంధించిన నమూనాలను భద్రపరిచినట్టు కూడా తెలుస్తోంది. ఈ నివేదిక వ్యవహారం వివాదాస్పదం అవుతుందనే తనపై ఒత్తిడి వచ్చినట్టు గుప్తా ఆరోపించారు. -
సునంద మృతిపై మళ్లీ వివాదం
పోస్ట్ మార్టమ్ నివేదికలో మార్పుకు ఒత్తిడి వచ్చిందని ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ సుధీర్ ఆరోపణ * ఆయన ఆరోపణలకు ఆధారాలు లేవన్న ఎయిమ్స్ ప్రతినిధులు * తాజా ఆరోపణలపై తక్షణ నివేదికకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఆదేశం * అవసరమైతే, సుధీర్ గుప్తా, శశిథరూర్‌లను ప్రశ్నిస్తామన్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భార్య సునందా పుష్కర్ మృతి మళ్లీ వివాదాస్పదంగా మారింది. ఆమెది సహజ మరణమేనంటూ నివేదిక ఇవ్వాలని తమపై ఒత్తిడి జరిగిందని, పోస్ట్ మార్టమ్ నివేదికలో మార్పుకోసం ఒత్తిడి చేశారని అఖిల వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా చేసిన తాజా ఆరోపణ సంచలనం రేపింది. సునంద మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించిన ముగ్గురు సభ్యుల బృందానికి నేతృత్వం వహించిన సుధీర్ గుప్తా చేసిన తాజా ఆరోపణపై తక్షణ నివేదికకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఎయిమ్స్ డెరైక్టర్‌ను ఆదేశించారు. అయితే, సుధీర్ గుప్తా ఆరోపణలను ఎయిమ్స్ ప్రతినిధులు అమిత్ గుప్తా, నీరజా భాట్లా బుధవారం నిర్ద్వంద్వంగా ఖండించారు. పోస్ట్ మార్టమ్ నివేదికలో మార్పుకోసం సుధీర్ గుప్తాపై బయటనుంచి ఒత్తిడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వారు స్పష్టంచేశారు. సర్వీస్‌కు సంబంధించిన అంశంగా సుధీర్ గుప్తా తన ఆరోపణను అఫిడవిట్ రూపంలో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)కు నివేదించినట్టు వార్తలు వెలువడిన మరుసటి రోజునే ఎయిమ్స్ ఆయన ఆరోపణలను ఖండించింది. మరో వైపు, మంత్రి హర్షవర్ధన్‌కు కూడా సుధీర్ గుప్తా లేఖ రాశారు. ఫోరెన్సిక్ విభాగం అధిపతి పదవినుంచి తనను తప్పించేందుకు కుట్ర జరిగిందని, సునంద మృతిపై, అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థి నిటో తానియా అనుమానాస్పద మృతిపై తానిచ్చిన పోస్ట్‌మార్టమ్ నివేదికలకు ముడిపెడుతూ కుట్రపన్నారని గుప్తా ఆరోపించారు. పోస్ట్ మార్టమ్ విషయంలో వృత్తిపరమైన నిబద్ధతతో, నైతిక బాధ్యతతో తాను వ్యవహరించిన తీరు.. స్వార్థశక్తులకు రుచించలేదని గుప్తా తన లేఖలో ఆరోపించారు. కాగా, తన ఆరోపణలపై బుధవారం మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ విషయమై తాను మీడియాతో మాట్లాడబోనని స్పష్టంచేశారు. కాగా,..డాక్టర్ గుప్తా ఆరోపణలగురించి తెలియదని, తనవరకూ వచ్చినపుడు ఆయన ఆరోపణలను కూడా పరిశీలిస్తానని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. ఈ కేసులో అవసరమైతే, సుధీర్ గుప్తాను, థరూర్‌ను పోలీసులు ప్రశ్నిస్తారని, డాక్టర్ గుప్తా క్యాట్‌లో దాఖలుచేసినట్టు చెబుతున్న అఫిడవిట్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటామని బస్సీ చెప్పారు.ఇక సునంద అనుమానాస్పద మృతిపై ఒకవైపు పోలీసు దర్యాప్తు కొనసాగుతుండగానే, ఆమె మృతికి దారితీసిన పరిస్థితులు, కారణాలపై కచ్చితమైన నిర్ధార ణకు రావాలంటూ శశి థరూర్ కూడా కోరారు. థరూర్ భార్య సునంద గత జనవరిలో, ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన భర్త థరూర్‌కు, పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్‌కు మధ్య సంబంధాలపై సోషల్ వెబ్సైట్ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేసిన సునంద ,..ఆ మరుసటిరోజునే మరణించ డంతో ఆమె మృతిపై పలు అనుమానాలు తలెత్తాయి. అయితే, మితిమీరిన స్థాయిలో వ్యాధినిరోధక మందులు తీసుకోవడంవల్లనే ఆమె మరణించినట్టు జనవరి 20న ఎయిమ్స్ తన పోస్ట్‌మార్టమ్ నివేదికలో పేర్కొంది. అయితే, ఇంతకాలం మౌనంగా ఉండి, ఇప్పుడు సుధీర్ ఆరోపణలు చేయటం చర్చనీయాంశమైంది. సునంద కేసుపై రాజ్‌నాథ్ కు వివరణ.. సునందా పుష్కర్ మృతిపై ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ సుధీర్ గుప్తా చేసిన తాజా ఆరోపణల నేపథ్యంలో, ఆమె మృతిపై దర్యాప్తుగురించి, ఢిల్లీపోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ బుధవారం కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించినట్టు తెలిసింది. దర్యాప్తులో ఇప్పటివరకూ బయటపడ్డ అంశాలను, దర్యాప్తు త్వరగా ముగించేందుకు తీసుకున్న చర్యలను కూడా బస్సీ మంత్రికి వివరించినట్టు భావిస్తున్నారు. -
పడిగాపులు
తమ వాళ్ల కడచూపు కోసం రాయపేట మార్చురీ వద్ద ఆప్తులు, కుటుంబాలు పడిగాపులు కాస్తున్నాయి. మృత దేహాలను గుర్తించడం, పోస్టుమార్టం, సమగ్ర విచారణ అనంతరం అప్పగించడంలో జాప్యం నెలకొంటోంది. దీంతో మార్చురీ వద్ద ఆప్తులు, కుటుంబీకులు తీవ్ర ఆవేదనలో మునిగి ఉన్నాయి. సాక్షి, చెన్నై:మౌళివాకం ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను రాయపేట మార్చురీకి తరలిస్తున్నారు. మంగళవారం ఉదయానికి 27 మృతదేహాలను ఆ మార్చురీకి తరలించారు. అయితే, కొన్ని మృతదేహాలు ఛిద్రమై ఉండడంతో గుర్తించడం కష్టతరంగా మారుతోంది. తమ వాళ్ల కోసం మార్చురీ వద్దకు పరుగులు తీస్తున్న వాళ్లకు ఆ మృతదేహాలను చూపిస్తున్నారు. అయితే, గుర్తించడం కష్టతరం అవుతుండడంతో కొన్ని మృతదేహాల ఆచూకీ, వివరాలు కనుగొనడంలో ఆటంకం ఏర్పడుతోంది. అదే సమయంలో తమ వాళ్లు మరణించారన్న సమాచారం ఉన్నా, వారి మృతదేహాలు రాయపేటలో ఉన్నాయా? కేఎంసీలో ఉన్నాయా? లేదా రామచంద్ర ఆస్పత్రిలో ఉన్నాయా? అన్నది తేల్చుకునేందుకు అక్కడక్కడ పరుగులు పెట్టే వాళ్లూ ఉన్నారు. ఇక, తమ వాళ్ల మృతదేహాలు మార్చురీలో ఉండటంతో పరిశీలన, పోస్టుమార్టం ఎప్పుడు పూర్తి అవుతుందో, ఎప్పుడు అప్పగిస్తారో తెలియక రాయపేట మార్చురీ వద్ద తీవ్ర మనో వేదనతో పడిగాపులు కాస్తున్న కుటుంబాలు అనేకం. మరి కొందరికి మృతదేహాలు చూసే అవకాశం దక్కడం లేదు. ఆంధ్ర రాష్ట్రం విజయనగరం, శ్రీకాకుళంవాసులే కాకుండా, తమిళనాడుకు చెందిన బాధితులు సైతం ఇక్కడ మృత దేహాల కోసం వేచి ఉన్నారు. సుమారు పదిహేనుకు పైగా కుటుంబాలు ఇక్కడ తమ వాళ్ల కడచూపు కోసం ఎదురు చూపుల్లో ఉన్నాయి. మృత దేహాలను స్వగ్రామాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరుపుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఆర్థిక కష్టాలు : అనేక తెలుగు కుటుంబాలు చేతిలో చిల్లిగవ్వ లేకుండా మార్చురీ వద్ద తీవ్ర మనోవేదనలో మునిగి ఉన్నాయి. వేతనం రోజునే ప్రమాదం జరిగిన దృష్ట్యా, చేసిన కష్టానికి ప్రతి ఫలం లేక కొందరు, తెచ్చుకున్న డబ్బులు సంఘటనా స్థలానికి, ఆస్పత్రికి అంటూ అక్కడా..ఇక్కడ తిరగడంతో అయిపోయూయి. ఇలా అనేక కుటుంబాలు చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా కన్నీటి పర్యంతమవుతున్నారు. హెల్ప్‌లైన్ వద్ద ఇచ్చే అన్నం, నీళ్ల ప్యాకెట్లతో కడుపు నింపుకుంటూ మృత దేహాలను తమ స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు బరువెక్కిన గుండెతో చెట్ట నీడన కూర్చుని ఉన్నారు. దుర్గంధం : మార్చురీ వద్ద బాధిత కుటుంబాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఇటు తమిళనాడు అధికారులు, అటు ఆంధ్రా నుంచి వచ్చిన రెస్క్యూ టీం అధికారి, విజయనగరం హౌసింగ్ విభాగం డెప్యూటీ ఇంజనీర్ మురళీ మోహన్ తమకు అందిన సమాచారాన్ని బాధిత కుటుంబాలకు అందజేస్తున్నారు. అయితే, ఆ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన పరిసరాలు, మార్చురీ మార్గాలు ఉద యాన్నే దుర్గంధంగా మారాయి. దీంతో అక్కడ ఆగమేఘాలపై బ్లీచింగ్, క్రిమి సంహారక మందులు చల్లారు. హెల్ప్‌లైన్ అధికారులతో పాటుగా, అక్కడున్న బాధిత కుటుంబాలకు మాస్కులు అందజేశారు. గుర్తించ లేనివి : పన్నెండు మృత దేహాలు గుర్తించలేని రీతిలో చితికిపోయినట్టు మార్చురీ వర్గాలు, వైద్య బృందాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఆ మృతదేహాలను బాధిత బంధువులు పరిశీలిస్తున్నారు. కొన్నింటిని గుర్తించినా, ఎక్కడో మెలిక పెడుతుండడంతో, అనుమానంతో తదుపరి ఆ మృత దేహం కోసం ఎవరైనా వస్తారా? అన్న ఎదురు చూపుల్లో మార్చురీ వర్గాలు ఉన్నాయి. 27 మృతదేహాల్లో 18 పురుషులు, 9 మహిళలవి. ఇప్పటి వరకు ఒడిశాకు చెందిన నాలుగు, విల్లుపురానికి చెందిన రెండు, అంబత్తూరు, విజయనగరానికి చెందిన ఓ మృత దేహాన్ని ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు అప్పగించారు. గుర్తించని 12 మృతదేహాల్లో ఐదు స్త్రీలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మృతదేహాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులతో అంబులెన్స్‌లలో పంపిస్తున్నారు. ఎదురు చూస్తున్నాం మా బంధువు పద్మ ఈ ప్రమాదంలో మరణించింది. ఆమెను గుర్తించాం. అయితే, పోస్టుమార్టం అనంతరం మృత దేహం అప్పగిస్తామన్నారు. నేను ఒరగడంలో పనిచేస్తుంటాను. బంధువులు అప్పన్న, పద్మలు ప్రమాదం జరిగిన చోట రెండు నెలలుగా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పన్న ప్రమాదం నుంచి బయట పడ్డాడు. పద్మ మరణించడంతో ఆమె మృత దేహం కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ఇస్తారో...ఎప్పుడు మా ఊరెళ్లాలో తెలియడం లేదు. - సూర్యనారాయణ, నర్సన్న పేట మండలం, శ్రీకాకుళం మరదలు చనిపోయింది అమ్మ, నాన్నతో పాటుగా మరదలు దుర్గా ప్రమాదం జరిగిన భవనంలో పనిచేశారు. దుర్గా మరణించినట్టు అధికారులు చెప్పారు. అయితే, అమ్మ నాన్నలు అప్పలరాము, లక్ష్మిల జాడ ఇంకా తెలియలేదు. దుర్గా మృత దేహాన్ని మార్చురీలో గుర్తించాను. ఇంకా, అమ్మనాన్నల జాడ తెలియలేదు. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఇక్కడ తిరుగుతున్నాను. అన్ని ఏర్పాట్లు చేశాం శ్రీకాకుళం, విజయనగరం బాధితుల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. మృత దేహాలు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చే ప్రతి కుటుంబానికి, బంధువులకు వాటిని చూపించి గుర్తు పట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక మృత దేహాలు గుర్తించాల్సి ఉంది. ఇక్కడికి వచ్చే తెలుగు బాధితుల కుటుంబాలకు పూర్తి సమాచారాన్ని అందజేస్తున్నారు. ఆహారం అందిస్తున్నాం. మృత దేహాల్ని అంబులెన్స్‌లో స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేశాం. బాధిత కుటుంబాలకు ఖర్చులకు గాను రూ.రెండు వేలు ఇచ్చి పంపుతున్నాం. పది మంది మృత దేహాలు ఆంధ్రాకు చెందిన వారివి గుర్తించాల్సి ఉంది. విజయ నగరానికి చెందిన సింహమ్మ మృత దేహాన్ని వారి స్వగ్రామానికి పంపించాం. మిగిలిన వారిని గుర్తించి, పోస్టుమార్టం అనంతరం స్వగ్రామాలకు పంపుతాం. - మురళీ మోహన్ విజయనగరం డీఈ. హౌసింగ్ విభాగం ఇంజనీర్ -
'మార్చురీలో ఉన్న చిన్నారిని ఎలుకలు తిన్నాయి'
బెంగళూరు: తన కుమారుడి మృత దేహం ఎలుకల పాలు కావడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఓ మాతృమూర్తి లోకాయుక్తను ఆశ్రయించిన సంఘటన బుధవారం జరిగింది. వివరాలు... అరసికెరెకు చెందిన జగదీష్, యోగమ్మ దంపతులు రెండు నెలల కుమారుడు ఇటీల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన చిన్నారి చనిపోయాడని స్థానిక పోలీస్ స్టేషన్లో యోగమ్మ ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా పోస్ట్‌మార్టం కోసం శిశువు మృతదేహాన్ని హాసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్’ లోని మార్చురీలో ఉంచారు. అయితే శిశువు కళ్లు, చెవులతో పాటు మొహం లోని కొన్ని భాగాలు ఎలుకలు తిన్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై లోకాయుక్తలో బుధవారం బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో.. ‘నాతో పాటు నా భర్తకూడా వికలాంగుడు. ఇకపై నేను గర్భం దాల్చలేను. వైద్యుల నిర్లక్ష్యం వల్ల వంశోద్ధారకుడిని కోల్పాయాం. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా సరైన స్పందనలేదు. పైగా నా కుమారుడి ముఖాన్ని ఆఖరు సారిగా చూసుకుందామన్నా వీలు లేకుండా పోయిం ది. అందువల్ల ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుండి.’ అని పేర్కొన్నారు. కేసు విచారణకు స్వీకరించిన లోకాయుక్త ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. -
పుట్టిన రోజే.. చివరి రోజు
- బాలుడి ఉసురు తీసిన ఆర్టీసీ బస్సు కొమరోలు : పుట్టిన రోజునాడే ఆ బాలుడికి చివరి రోజైంది. తిరునాళ్లకు తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆ బాలుడిని ఆర్టీసీ బస్సు బలి తీసుకుంది. ఈ సంఘటన మండలంలోని బావాపురంలో సోమవారం జరిగింది. వివరాలు.. బావాపురం గ్రామానికి చెందిన ముత్తుముల భాస్కర్‌రెడ్డి కుమార్తె కవితను రాచర్ల మండలం అనుమలవీడుకు చెందిన సైనికుడు శివభాస్కర్‌రెడ్డికిచ్చి వివాహం జరిపించారు. వీరికి భద్రినాథ్‌రెడ్డి, చరణ్‌రెడ్డిలు కుమారులు. ఈ నేపథ్యంలో తాత, అవ్వ ఊరైన బావాపురంలో శ్రీ రామస్వామి తిరునాళ్లకు రెండు రోజుల క్రితం మనువళ్లు తల్లితో కలిసి వచ్చారు. సోమవారం చరణ్‌రెడ్డి పుట్టిన రోజు కావటంతో ఇంట్లో సందడిగా ఉంది. చుట్టుపక్కల ఉన్న చిన్నారులను చరణ్ ఉదయాన్నే కలిసి సాయంత్రం తన పుట్టినరోజు వేడుకలకు రావాలని పిలిచాడు. అనంతరం ఇంట్లో టిఫిన్ చేస్తున్నాడు. టిఫిన్ ఇంకా కావాలని అడుగటంతో తెచ్చేందుకు తల్లి కవిత ఇంట్లోకి వెళ్లింది. ఇంట్లో నుంచి తిరిగి వచ్చేసరికి రోడ్డుపై చరణ్‌రెడ్డి (3) మృతదేహమై కనిపించాడు. దూరంగా ఉన్న గ్రామస్తులు విషయాన్ని గమనించి పిల్లవాడిని తొక్కించి వెళ్లిపోతున్న గిద్దలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. తల్లి కవిత, అమ్మమ్మ భాగ్యలక్ష్మి, తాత భాస్కర్‌రెడ్డి దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ఎస్సై రామానాయక్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శవపంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం చరణ్‌రెడ్డి స్వగ్రామం అనుమలవీడులో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి తాత ముత్తుముల భాస్కర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం
మార్కాపురం : పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలకు స్థానిక ఏరియా ఆస్పత్రిలో పటిష్ట బందోబస్తు నడుమ వైద్యులు ఎస్.రవీంద్రారెడ్డి, లతలు శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని మురారికురవ వద్ద పోలీసుల కాల్పుల్లో నెల్లూరు జిల్లా సంగం మండలం కొడవలూరు గ్రామానికి చెందిన జానా చెన్నయ్య కుమారుడు జానాబాబూరావు(49), మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం మాదావవానిపల్లెకు చెందిన మంది ఈదెయ్య కుమార్తె భారతి అలియాస్ నాగమణి (40), మెదక్ జిల్లా కొండపాక మండలం ఉద్దంచెరువు గ్రామానికి చెందిన పడిగె మల్లయ్య కుమార్తె కవిత అలియాస్ విమల(30)లు మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి 11గంటల సమయంలో మృతదేహాలను ఒక ట్రక్కులో ఉంచి ప్లాస్టిక్ పట్టల్లో చుట్టి ఆస్పత్రికి తీసుకొచ్చారు. చనిపోయి మూడు రోజులు కావటంతో మృతదేహాల నుంచి దుర్వాసన వెదజల్లింది. శరీరాలు పోలీసుల తూటాలతో జల్లెడగా మారాయి. రక్తం గడ్డకట్టింది. గుర్తు పట్టలేని విధంగా మృతదేహాలు ఉన్నాయి. కవిత మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు శంబవ్వ, మల్లయ్యలు భోరున విలపించారు. అక్క నాగమణి మృతదేహాన్ని చూసి తమ్ముడు హనుమన్న కన్నీటి పర్యంతమయ్యాడు. మార్కాపురం డీఎస్పీ జి.రామాంజనేయులు, సీఐ శివ రామకృష్ణారెడ్డి, యర్రగొండపాలెం సీఐ పాపారావు, పట్టణ ఎస్సై రాంబాబుల నేతృత్వంలో ప్రత్యేక సాయుధ పోలీసులు ఏరియా వైద్యశాలలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. జానా బాబూరావు పెద్ద భార్య మార్చురీ గదికి వచ్చినప్పటికీ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించింది. దీంతో నాగమణి తమ్ముడు హనుమన్నే జానా బాబూరావు మృతదేహాన్ని కూడా తీసుకెళ్లాడు. బుల్లెట్ వెలికితీత కవిత మృతదేహం నుంచి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు ఒక బుల్లెట్‌ను వెలికి తీశారు. సంఘటన స్థలం నుంచి తప్పించుకెళ్లిన మావోయిస్టు విక్రమ్ అలియాస్ శ్రీనివాస్ కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ జి.రామాంజనేయులు తెలిపారు. మళ్లీ వస్తానని వెళ్లి శవమయ్యావా బిడ్డా : కవిత తల్లిదండ్రులు 15 ఏళ్ల కిందట మళ్లీ వస్తానని బయటకు వెళ్లి శవమై వచ్చావా బిడ్డా.. అని కవిత తల్లిదండ్రులు శంబవ్వ, మల్లయ్యలు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ఏ రోజుకైనా ఇంటికి వస్తే పెళ్లి చేద్దామని ఎదురు చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, విలేకరులు, గ్రామ పెద్దలు వచ్చి మీ కూతురు పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయిందని చెప్పటంతో నోట మాట రాలేదని విలపించారు. తమ ఆరుగురు కుమార్తెల్లో కవిత నాలుగో కుమార్తెని తెలిపారు. అక్కను చూసి పదేళ్లయింది : నాగమణి తమ్ముడు హనుమన్న తమది నిరుపేద కుటుంబమని, అమ్రాబాద్ మండలం మాధవవానిపల్లె సర్పంచ్‌గా ఇటీవలే ఎన్నికయ్యానని, అక్కను చూసి పదేళ్లయిందని నాగమణి తమ్ముడు బయ్యన్న తెలిపాడు. పోలీసుల సమాచారం మేరకు హూటాహుటిన మార్కాపురం వచ్చినట్లు చెప్పారు. ఇంతటి ఘోరం జరుగుతుందని ఊహించలేదన్నారు. బూటకపు ఎన్కౌంటర్: కళ్యాణరావు విరసం నేత జి.కళ్యాణరావు, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు, పొటికలపూడి జయరామ్‌లు మాట్లాడుతూ మావోయిస్టులది బూటకపు ఎన్కౌంటరని ఆరోపించారు. సంఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమరవీరుల బంధుమిత్రుల సంఘ సభ్యులు, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు వైద్యశాలకు వచ్చి మృతుల బంధువులను ఓదార్చారు. -
ఓటమిపై ‘పోస్టుమార్టం’
చెన్నై, సాక్షి ప్రతినిధి : మూడు దశాబ్దాలుగా అన్నాడీఎంకే లేదా డీఎంకే పార్టీల పొత్తుతో నెట్టుకుని వస్తున్న కాంగ్రెస్ పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు దూరం పెట్టేశాయి. జాతీయ స్థాయిలో అప్రతిష్టపాలైన కాంగ్రెస్‌తో జత కట్టేందుకు మరేపార్టీ సాహసించలేదు. దీంతో విధిలేక ఒంటరి పోరుకు దిగిన కాంగ్రెస్ మొత్తం 40 స్థానాల్లో ఘోరంగా ఓడిపోయింది. దాదాపు అన్నిచోట్ల డిపాజిట్లు గల్లంతయ్యూయి. రాళ్లు ఏరివేస్తాం: జ్ఞానదేశికన్ పార్టీ ఓటమికి కారణాలు ఏమిటో అందరికీ తెలుసని, బలమైన కూట మిని ఏర్పాటు చేసుకోలేక పోయామని జ్ఞానదేశికన్ పేర్కొన్నారు. అయితే పార్టీలోని అంతర్గత శత్రువుల వల్లే ఎక్కువ నష్టం చేకూరిందన్నారు. ఇటువంటి అనసవర రాళ్లను ఏరివేసి పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం వర్గాన్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పదవులపై నాకు మోహం లేదు, అధిష్టానం ఆదేశిస్తే తప్పుకునేందుకు సిద్ధమని చెప్పారు. పార్టీలో సమస్యలుంటే చర్చించి పరిష్కరించుకోవాలి అంతేగానీ పత్రికలకు ఎక్కకూడదని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఇక ఏ పార్టీతో కాంగ్రెస్‌కు పొత్తు వద్దని, ఒంటరిపోరుతోనే బల నిరూపణ చేసుకోవాలని పలువురు కార్యకర్తలు సూచించారు. కన్యాకుమారి స్థానం నుంచి పోటీచేసి ద్వితీయస్థానంలో నిలిచి భారీ ఓట్లు సాధించిన వసంతకుమార్‌ను ఈ సందర్భంగా సత్కరించారు.సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడుతూ, రాష్ట్ర, జిల్లా కమిటీ లు ఇటీవలే ఏర్పడినందున త్వరలో డివిజన్, నగర కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని, ఉత్సాహంగా పాల్గొనేవారికి జిల్లా స్థాయి పదవులను అప్పగిస్తామని చెప్పారు. పార్టీ బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు తెలిపారు. చిదంబరం వర్గం డుమ్మా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అంశమే ప్రధాన అజెండాగా ఏర్పాటు చేసుకు న్న సమావేశానికి మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం వర్గానికి చెందిన ఒక్క కార్యకర్తకూడా హాజరుకాలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే చిదంబ రం అనుచరులు జ్ఞానదేశికన్పై దుమ్మెత్తిపోశారు. పార్టీలో నేతలను కలుపుకుపోలేదు, భారీగా ప్రచారా లు నిర్వహించలేదు, ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ అధిష్టానం ఇచ్చిన సొమ్మును స్వాహా చేశారు వంటి అనే క ఆరోపణలను గుప్పించారు. టీఎన్‌సీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం నా టి సమావేశానికి రాష్ట్రఅగ్రనేతలు జీకే వాసన్, ఇళంగోవన్, తంగబాలు వ ర్గాలకుచెందిన వారు హాజరయ్యూరు. -
పనిచేయని జోరీగ మంత్రం
మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: చేతులు కాలాక.. ఆకులు పట్టుకు న్న చందంగా..ఓటమిపై కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టుమార్టం ప్రారంభించారు. తె లంగాణ రాష్ట్రాన్ని తామే ఇచ్చామని, అ ధికారం తమకే లభిస్తుందన్న అత్యాశ ఆ పార్టీ శ్రేణుల నమ్మకాన్ని వమ్ము చేసింది. పార్టీ ఓటమికి కారణం నరేంద్రమోడీ ప్రభావమని చెప్పుకుంటున్న నేతలు సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఘోర పరాజయానికి సాకులు వెతుకుతున్నారు. సోనియమ్మ చెవిలో జోరీగలాగ తెలంగాణ ఏర్పాటు అంశాన్ని జొప్పించానని, ఆమెకు కృతజ్ఞతగా కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించాలని కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి జపించిన మంత్రం ఫలించలేదు. పార్టీ గ్రూపు తగాదాలే పరాజయానికి ముఖ్య కారణాలన్న వాస్తవాలు తేలినప్పటికీ, తప్పంతా అధిష్టానానిదే అన్న ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు దాటిన తరువాత ఓటమిపై మేధోమదనం నిర్వహించేందుకు పూనుకున్నారు. అందులో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఆదివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం కేకే రెడ్డి నిలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి తాను ఓడిపోవడానికి కారణాలను అన్వేషించారు. మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక తన నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిందని, జిల్లా కేంద్రంలో మైనార్టీయేతరుడిని, నారాయణపేటలో మాజీ ఎంపీ విఠల్‌రావును, కొడంగల్‌లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డిని పోటీలో ఉంచినట్లయితే వారితో పాటు తన గెలుపు సులభమయ్యూదని జైపాల్‌రెడ్డి విశ్లేషించారు. దీనికితోడు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీలుగా వ్యవహరించిన దిగ్విజయ్‌సింగ్ తదితర నేతల దుందుడుకు స్వభావాల కారణంగా కూడా తెలంగాణలో పార్టీకి తీవ్రనష్టం కలిగించిందని, కేసీఆర్‌తో చర్చించి, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని తాను అధిష్టానానికి చేసిన సూచనను పెడచెవిన పెట్టడం కూడా పార్టీ పరాజయానికి మరో కారణమని అభిప్రాయపడ్డారు. జరిగిపోయిన దానికి చింతించకుండా మున్ముందు నష్ట నివారణకు కలిసి పని చేద్దామని పార్టీ శ్రేణులకు సూచించారు. సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు డాక్టర్ మల్లు రవి, ఒబేదుల్లా కొత్వాల్, సరాఫ్ కృష్ణ, డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి, మాజీమంత్రి పి.చంద్రశేఖర్, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు రుమాండ్ల రాంచంద్రయ్య, రావుల రవీంద్రనాథ్ రెడ్డి , నాయకులు భగవంతురావు, అన్వర్‌పాషా,కెఎస్ రవికుమార్, ప్రదీఫ్‌కుమార్ గౌడ్, సలీం తదితరులు పాల్గొన్నారు. -
అసలేం జరిగింది
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై పోస్ట్‌మార్టం మొదలైంది. పరాజయం పాలైన జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నేతలు ఓటమికి దారితీసిన కారణాలు వెతుక్కుంటున్నారు. కరీంనగర్, పెద్దపల్లి మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేక్ గురువారం ఢిల్లీకి వెళ్లారు. నేడో రేపో పార్టీ అధినేత్రి సోనియాను కలిసి ఓటమి కారణాలపై నివేదికను అందించనున్నారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఫలితాల అనంతరం హైదరాబాద్‌లో మకాం పెట్టారు. ఆయనతో పాటు మాజీ విప్ అరెపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్యేలు అల్గిరెడ్డి, సుద్దాల దేవయ్య, బొమ్మ వెంకటేశ్వర్లు, కొమిరెడ్డి రాములు, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, డీసీసీ మాజీ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కేతిరి సుదర్శన్‌రెడ్డి, బాబర్‌సలీం పాషా జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వీరందరి ఓటమికి కారణాలను అధిష్ఠానానికి నివేదించాలని టీపీసీసీ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా, ఘోర పరాజయం ఎదురుకావడంపై లోతుగా అధ్యయనం చేయడానికి జిల్లాల వారీగా సమీక్షలకు నడుం బిగించింది. ఈ నెల 24, 25 తేదీల్లో జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్ని డీసీసీలకు ఆదేశాలు జారీ చేసింది. సమీక్ష అనంతరం సమగ్ర నివేదిక అందజేయాలని సూచించింది. అభ్యర్థులతో పాటు సీనియర్ నేతలు, పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులతో సమావేశమై ఓటమిని సమీక్షించుకోనుంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన కాంగ్రెస్ నేతలకు సైతం చేదు ఫలితం ఎదురవటంతో జిల్లాలో ఓటమి సమీక్ష ప్రాధాన్యాన్ని సంతరించుకోనుంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు అలుపెరగని పోరాటం చేస్తూనే అభివ ృద్ధి పనులు చేశాం... ఇంకేం తక్కువ చేశామని ప్రజలు తమను తిరస్కరించారని మాజీ ఎంపీలు పొన్నం, వివేక్ ఆవేదన చెందుతున్నారు. పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమంతోనే ఢిల్లీ స్థాయిలో గుర్తింపు పొందారు. ఓ దశలో అధిష్ఠానాన్ని ధిక్కరించి, సొంత పార్టీ సీఎం కిరణ్‌ను వ్యతిరేకించి జైలుకు వెళ్లారు. సోనియా సమక్షంలో పార్టీ ప్లీనరీలో పొన్నం తెలంగాణ అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంట్లో జరిగిన పెప్పర్ స్ప్రే దాడిలోనూ తెగింపు ప్రదర్శించారు. ఉద్యమ సమయంలో స్వపక్ష నేతలతో పాటు విపక్ష నేతల నుంచి ఆయన ప్రశంసలు అందుకున్నారు. స్వయానా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కాంగ్రెస్‌ను తిడుతూనే ప్రభాకర్‌ను పొగిడిన సందర్భాలున్నాయి. మరోవైపు అభివ ృద్ధి పనులు సాధించి తెచ్చిన పొన్నంకు ఈ ఎన్నికలు గట్టి షాక్ ఇవ్వటం పార్టీ శ్రేణులు సైతం ఊహించలేకపోతున్నాయి. పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ సైతం తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అభివ ృద్ధిలోనూ తన ముద్ర వేసుకున్నారు. కానీ... ఉద్యమ సమయంలో టీఆర్ఎస్లోకి, ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్‌లో చేరటం... ఆయనకు చేదు ఫలితం తెచ్చిపెట్టిందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా ముందుగా వచ్చిన మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తమ కొంప ముంచాయని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు అంగీకరిస్తున్నారు. టిక్కెట్ల రేసులో భంగపడ్డ పార్టీ నేతలు, కార్యకర్తలు, గ్రూపు విభేదాలు, అంతర్గత వెన్నుపోట్లు తమకు చేటు తెచ్చాయని విశ్లేషించుకుంటున్నారు. అన్నింటికీ మించి టీఆర్ఎస్ ప్రభంజనంలోనే తాము ఓటమి పాలయ్యామని ఎమ్మెల్యే అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు టీఆర్ఎస్ మేనిఫెస్టోకు ప్రజాదరణ లభించిందని, ఆ స్థాయిలో కాంగ్రెస్‌కు మేనిఫెస్టో లేకపోవటం ప్రతికూలించిందని అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటమి సమీక్షలో ఏం తేలుతుందో.. వేచి చూడాల్సిందే. -
సిబ్బంది కొరతతో పోస్టుమార్టం నిలిపివేత
సాక్షి, ముంబై: డాక్టర్లు, సిబ్బంది కొరత కారణంగా రాజావాడి, జేజే, భగవతి, కూపర్ ఆస్పత్రుల్లో సోమవారం సాయంత్రం ఏడు గంటల తరువాత పోస్టుమార్టం నిలిపివేశారు. నగర పాలక సంస్థ (బీఎంసీ) ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ తీసుకున్న నిర్ణయంవల్ల మృతుల బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. దూరప్రాంతాలు, స్వగ్రామాలకు మృతదేహాలను తరలించేందుకు ఉదయం వరకు వేచిచూడాల్సి వ స్తోంది. లేదంటే మరో ఆస్పత్రిని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. గోరేగావ్‌లోని సిద్ధార్థ్ ఆస్పత్రిలో పోస్టుమార్టం కేంద్రాన్ని నిర్మించినప్పటికీ అక్కడ సిబ్బందిని నియమించకపోవడంతో పోస్టుమార్టం జరగడం లేదు. ఇక పరేల్‌లోని కేం, ముంబెసైంట్రల్‌లోని నాయర్ ఆస్పత్రుల్లో సాయంత్రం తరువాత పోస్టుమార్టం చేయడాన్ని గతంలోనే నిలిపివేశారు. రాజావాడి, జే.జే, భగవతి, కూపర్ ఆస్పత్రుల్లో మాత్రం జరిగేది. అయితే సిబ్బంది కొరత కారణంగా రెండు షిఫ్టుల్లోనూ పోస్టుమార్టం చేయడం సాధ్యపడడం లేదు. కేవలం ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోస్టుమార్టం చేస్తున్నారు. వాస్తవానికి వీటిని 24 గంటలు తెరిచే ఉంచాలంటూ ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది. అయితే తాజా పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అనేక కేంద్రాలు మూసివేయడంతో ఇప్పటికే భగవతి, రాజావాడి ఆస్పత్రులపై అదనపు భారం పడుతోంది. దీనికితోడు ఇక్కడ కూడా సాయంత్రం తర్వాత పోస్టుమార్టం నిలిపివేశారు. -
ఆశలు..ఆవిరి
నవ వసంతం వారిళ్లలో కొత్త దనం తేలేదు సరికదా.. తీరని విషాదాన్ని నింపి..కాలుని నిర్ణయం కఠినమని రుజువు చేసింది. భర్తా, పిల్లలతో కలిసి ఉగాది వేడుకను చేసుకుందామని ఎదురు చూస్తున్న ఆ ఇల్లాలికి గుండెనిండా శోకాన్ని నింపింది. దేవరకద్ర మండలం బస్వాయిపల్లికి చెందిన చంద్రమ్మకు ఎదురైన దుస్థితి. మాచన్ పల్లిలో ఆడపడుచు ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్న పిల్లలు యాదమ్మ (12), యశ్వంత్ (8)లను పండుగకు ఇంటికి తెస్తానని వెళ్లిన భర్త వెంకటయ్య (35) కొడుకు సహా అందని లోకాలకు వెళ్లిపోయాడు. కుమార్తె తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలైంది. ఇంటికి హుషారుగా బైక్‌పై బయలు దేరిన వారిని బస్సు మృత్యు దేవతై కబలిం చింది. ఈ విషయం తెలిసిన చంద్రమ్మకు కంటనీరు తప్పా మాట పెగలడం లేదు. కుటుం బంపై పెంచుకున్న ఆశలు..చెదిరిన స్వప్నమవ్వడాన్ని తట్టుకోలేక పోతోంది. ఇక భూత్పూ ర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు బొలెరో వాహనం బోల్తాపడి ప్రమాదంలో చిక్కుకోగా మాసన్న (50) అనే వ్యక్తి, గుర్తు తెలియని మరో ఇరువురు ప్రాణాలు కోల్పోయి ఆత్మీయులకు వేదనను మిగిల్చారు. పండగపూట పచ్చని తోరణాలతో కళకళలాడాల్సిన కుటుంబాల్లో రక్తం చిందింది. బంధువులు..స్నేహితులు..ఇరుగుపొరుగు వారితో ఆనందం నిండాల్సిన ఇళ్లల్లో కన్నీరు మిగిలింది. షడ్రుచులతో తయూరు చేసిన పచ్చడి తిందామని దూరప్రాంతాల నుంచి తమతమ ఇళ్లకు బయలు దేరిన వారు తిరిగిరాని లోకాలకు చేరి‘పోయూరు’.అరుున వారితో ఆప్యాయంగా గడుపుదామనుకున్న వారు విగతజీవులై తమవారిని శోకసంద్రంలో ముంచేశారు. దేవరకద్ర నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయలతో మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బొలెరో బోల్తా : ముగ్గురు మృతి భూత్పూర్ : వేగంగా వెళ్తున్న ఓ బొ లెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి కి తీవ్రగాయాలయ్యాయి. సోమవారం జాతీయ రహదారిపై గల శేర్పల్లి (బి) సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసు కుంది. హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు బండల లోడ్‌తో వెళ్తున్న వాహనం లో ఆరుగురు ప్రయాణికులు కూడా ఉన్నారు. వెనుక టైరు పంక్చర్ కావడంతో బోల్తాపడింది. పెబ్బేర్ మం డలం పెంచికలపాడుకు చెందిన హ రిజన్ మాసన్న (50) అక్కడికక్కడే మృ తిచెందాడు. అతని కుమారుడు బాలకృష్ణకు కాలు, చేయి విరిగింది. మ రో ఇద్దరు మృతుల ఆచూకీ తెలియాల్సి ఉంది. కర్నూలుకు చెందిన డ్రైవర్ సురేశ్‌కు కాలు విరగ్గా, తలకు తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన బాలకృష్ణ, సు రేశ్లను 108 ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బతికి బయటపడ్డ దంపతులు... మానవపాడు మండలం తక్కశిలకు చెందిన మద్దిలేటి, లక్ష్మి అనే దంపతులు డ్రైవర్ పక్కకు కూర్చొని ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ కాలు, చేయి విరి గినా మద్దిలేటి, లక్ష్మిలకు ఎలాంటి గా యాలు కాకుండా బతికి బయటపడ్డారు. ఈ సంఘటన నుంచి తేరుకున్న అనంతరం భగవంతుడు తమకు పునర్జన్మ ప్రసాదించాడని లక్ష్మమ్మ రో దిస్తూ తెలిపింది. మృతి చెందిన ముగ్గురి శవాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. జ డ్చర్ల రూరల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో భూత్పూర్ ఎస్సై లక్ష్మారెడ్డి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెంచికలపాడులో విషాదం పెంచికలపాడు(పెబ్బేరు) : పొట్ట చేత పట్టుకొని పనికోసం పట్నం వెళ్లిన తం డ్రీ కొడుకులపై విధి కక్ష గట్టింది. తన కుమారుడితో ఉగాది పండుగకు సొంత ఊరికి బయలు దేరి వస్తుండగా మార్గమధ్యంలో వారు ప్రయాణిస్తున్న వాహ నం ప్రమాదానికి గురై తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా.. కుమారుడికి తీ వ్ర గాయలయ్యాయి. తన భర్త , కుమారుడు పండుగకు వస్తున్నారని ఎదురు చూస్తున్న ఆ ఇల్లాలికి విషయం తెలిసేసరికి కుప్పకూలిపోయింది. పెంచికల పాడు ఎస్సీ కాలనీకి చెందిన కర్రె మశన్న(52), అక్కమ్మ దంపతులకు ఆరుగురు సంతానం. వారిలో ఐదుగురు ఆ డపిల్లలు కాగా ఒకే ఒక్క కుమారుడు. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో పని కోసం హైదరాబాద్ వె ళ్లి కూలీ చసి జీవనాన్ని గడుపుతున్నా రు. తన కుమారుడు బాలకష్ణతో కలిసికూలీ చేస్తూ ఐదుగురు కూతుళ్ల పెళ్లీలు చేశారు. ఖర్చుల నిమిత్తం హైదరాబాద్‌లో పని చేస్తుండేవారు. పండగపూట విషాదం నెలకొంది. బస్సు రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరిని బలిగొంది. తండ్రీ, కూతురు,కొడుకు కలిసి వస్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢికొట్టి ఇద్దరి ప్రాణాలు బలిగొంది. తండ్రీ కొడుకులు దుర్మరణం చెందగా..కూతురు తీవ్ర గాయూలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సోమవారం దేవరకద్ర-మహబూబ్‌నగర్ మార్గమధ్యంలోని కోటకదిర స్టేజీ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దేవరకద్ర మండలం బస్వాయిపల్లికి చెందిన హరిజన్ వెంకటయ్య, చంద్రమ్మ దంపతులకు ఇద్దరు ఆడ సంతానం, ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు. వెంకటయ్య (35) వడ్డెరపని చేస్తూ తన టుంబాన్ని పోషించుకుంటున్నాడు. కూతురు యాదమ్మ (12) యశ్వంత్ అలియాస్ చింటూ (8)లు కోటకదిర స్టేజీ సమీపంలోని కాకతీయ ప్రైవేట్ పాఠశాలలో ఒకరు 8వ తరగతి, ఒకరు ఒకటో తరగతి చదువుతున్నారు. వీరు మహబూబ్‌నగర్ మండలం మాచ న్పల్లిలోని తన మేనత్త వద్ద ఉంటూ ప్రతి రోజు పాఠశాలకు వెళ్లి విద్యనభ్యసిస్తున్నారు. అయితే పండగకు తన కూతురు, కొడుకును బైక్‌పై స్వగ్రామానికి తీసుకు వస్తుండగా కోటకదిర స్టేజీ వద్ద రాయచూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో వెంకటయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. యాదమ్మ, యశ్వంత్లకు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా యశ్వంత్ మార్గమధ్యంలోనే మృతి చెందాడు. యాదమ్మ తీవ్ర గాయాలపాలై ఎస్వీఎస్ ఆస్పత్రిలో కోలుకుంటోంది. కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలిచివేశారుు. మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులు ప్రమాద స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బస్వాయిపల్లిలో విషాదం... రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతిచెందడంతో వారి స్వగ్రామమైన బస్వాయిపల్లిలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో కలిసిమెలిసి ఉండే తండ్రి, కొడుకులు ఇద్దరు ఒకేసారి దుర్మరణం చెందడంతో గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
గుంటూరులో పరువు హత్యపై పోస్టుమార్టం
-
బలితీసుకున్న భూతం
తిరుచానూరు, న్యూస్‌లైన్: అమ్మవారి నామస్మరణతో మారుమోగే తిరుచానూరు పట్టణం శోకసంద్రమైంది. సాయినగర్‌లో తల్లీబిడ్డలు మృతిచెందడంతో ప్రతి ఒక్కరూ కన్నీళ్లు కార్చారు. మద్యానికి బానిసైన భర్తను భరించలేక క్షణికావేశంలో ఆమె ఈ పని చేసింది. చెడు సావాసాలు మానేయాలని కల్పన ఎంతగా చెప్పినా ఆమె భర్త కిశోర్ఆచారిలో మార్పు రాలేదు. నెల్లూరుకు కాపురం మార్చితే పుట్టింటివాళ్లు రూ.20లక్షలు ఇచ్చి సొంత వాహనం కొనిస్తారని ఆమె చెప్పినా అతను వినిపించుకోలేదు. దీంతో ఆమె మానసికంగా కృంగిపోయింది. ఆదివారం సాయంత్రం ఇంట్లో భర్తలేని సమయంలో పాయసం వండి అందులో పురుగులమందు కలిపి పిల్లలకు తినిపించింది. తాను ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుంది. చీకటిపడ్డా ఇంట్లో లైట్లు వెలగకపోవడంతో సమీపంలోని కిశోర్ఆచారి సోదరి అక్కడకు వచ్చింది. స్థానికుల సహాయంతో ముగ్గురినీ ఆస్పత్రికి తరలించింది. అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాలకు సోమవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
ఔను.. అతడిని హతమార్చారు
తాడేపల్లిగూడెం క్రైం, న్యూస్‌లైన్ : నిజం నిగ్గు తేలింది... 17 నెలలు తర్వాత పోస్టుమార్టం నివేదిక ఆధారంగా వ్యక్తి అనుమానాస్పద మృతిని హత్యకేసుగా నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. తాడేపల్లిగూడెంలో శుక్రవారం కొవ్వూరు డీఎస్పీ వి.రాజుగోపాల్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన సింగిరెడ్డి వెంకటేశ్వరరావు పాత సీసాలు వ్యాపారం చేస్తుంటాడు. 2011, ఆగస్టు 5 తేదీన పాత సీసాలను వ్యాన్‌పై విజయవాడ తీసుకువె ళ్లి వాటిని అక్కడ అమ్మి తిరిగి గ్రామానికి బయల్దేరాడు. మార్గంమధ్యలో అర్ధరాత్రి కావడంతో పెంటపాడు మండలం ప్రత్తిపాడు వై జంక్షన్ దుర్గగుడి వద్ద ఆగి విశ్రాంతి తీసుకున్నాడు. తెల్లవారుజామున నిద్రలేచి చూసుకునేసరికి అతని జేబులో ఉండాల్సిన రూ.లక్ష నగదులో రూ.72 వేలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. చుట్టుపక్కల వారిని ఆరా తీయగా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రావుపాలెంకు చెందిన దెయ్యూల శ్రీనును రాత్రి వ్యాన్‌కు దగ్గరలో చూశామని, అతనికి దొంగతనం చేసే అలవాటు ఉందని చెప్పారు. దాంతో 6వ తేదీ ఉదయం వ్యాన్ డ్రైవర్ దూనబోయిన రాముతో కలిసి వెంకటేశ్వరరావు దొంగలించిన వ్యక్తిని పట్టుకునేందుకు వెంకట్రావుపాలెం వెళ్లాడు. అతని ఆచూకీ లభించకపోవడంతో ఊరిలో కొందరికి చెప్పి వెనుదిరిగారు. అదేరోజు సాయంత్రం మర లా తిరిగి గ్రామానికి వెళ్లారు. అప్పటికే గ్రామంలో తమ సైకిల్‌ను దొంగలించాడంటూ దెయ్యాల శ్రీనును ముగ్గురు అన్నదమ్ములు దాసరి పాపారాావు, చిన్న వెంకటేశ్వరరావు, పరమకాంతుడు పట్టుకుని కొడుతున్నారు. అనంతరం అక్కడకు చేరుకున్న వ్యాన్ డ్రైవర్ రాము, సింగిరెడ్డి వెంకటేశ్వరరావులకు శ్రీనును అప్పగించారు. అందరూ కలిసి దొంగిలించిన డబ్బు ఎక్కడ పెట్టావం టూ అతనిని నిలదీశారు. ఊరిలో ఇద్దరి వ్యక్తులకు అప్పు తీర్చినట్లు తెలుసుకున్నారు. అనంతరం శ్రీనును ఆటోలో కూర్చొబె ట్టి గూడెం బస్టాండ్ సమీపంలోకి తీసుకువచ్చారు. మరలా అక్కడ కూడా కొట్టడంతో అతను మృతిచెం దాడు. దాంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి పట్టణ పోలీసుస్టేషన్లో దెయ్యా ల శ్రీను అతిగా మద్యం తాగి చనిపోయాడని వారే ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి న పోలీసులు సాధారణ మృతిగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చి కేసును పక్కన పెట్టారు. పోస్టుమార్టంఅనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పాత కేసుల ఫైళ్లు తిరగేస్తుంటే.. ఇటీవల పాత కేసుల ఫైళ్లను తిరగేస్తున్న పట్టణ సీఐ ఎంఆర్ఎల్ఎస్ మూర్తి దెయ్యూల శ్రీను మృతి కేసుకు సంబంధించి పోస్టుమార్టం నివేదికను క్షుణంగా పరిశీలించారు. మృతుని ఒంటిపై 8 చోట్లు గాయాలు ఉన్నట్లు తెలుసుకున్న సీఐ పట్టణ ఎస్సై కొండలరావుతో కలిసి కేసును ఛేదించారు. జనవరి 28, 2014న తిరిగి హత్యకేసుగా నమోదు చేశారు. మృతుడు శ్రీను ఎస్సీ కులానికి చెందినవాడు కావడంతో ఎస్సీ, ఎస్టీ కేసును కూడా నమోదు చేశారు. కేసులో నిందితులైన పాత సీసాల వ్యాపారి సింగిరెడ్డి వెంకటేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మల్లాయి పాలెంకు చెందిన వ్యాన్ డ్రైవర్ దూనబోయిన రాము, తాడేపల్లిగూడెం మండలం వెంకట్రావు పాలెంకు చెందిన దాసరి పాపారావు, చిన్న వెంకటేశ్వరరావు, పరమకాంతులను కొవ్వూరు డీఎస్పీ వి.రాజగోపాల్ శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరపర్చారు. కేసులో కీలకపాత్ర వహించిన సీఐ మూర్తి, ఎస్సై కొండలరావును డీఎస్పీ అభినందించారు. -
పాపం.. లయశ్రీ
అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి ఉసురు తీశాడు ఆ కర్కోటకుడు. కారణాలేమిటో కానీ ముక్కుపచ్చలారని చిన్నారిని కడతేర్చాడు. ముల్కనూర్‌కు చెందిన పందిపెల్లి రవి-రాజేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె లయశ్రీ(4)కి విషప్రయోగం చేసి ఆపై బావిలో పడేశాడు. చిగురుమామిడి, న్యూస్‌లైన్ : ఈ నెల 22న అంగన్వాడీ కేంద్రంలో ఉన్న లయశ్రీని ఇంటికి తీసుకొచ్చిన తండ్రి వ్యవసాయ పనులకు వెళ్తూ తన బిడ్డను చూడండని ఇంటి పక్కన ఉన్నవారికి చెప్పి వెళ్లాడు. రవి ఇంటి సమీపంలోనే తన అన్న కుమారుడు పందిపెల్లి అనిల్ ఉంటాడు. సమీపంలోనే ఉండే మేరి రమ సహాయంతో అనిల్ లయశ్రీని తమ ఇంటికి పిలిపించాడు. విషం కలిపిన వేరుశనగలు(పల్లీలు) ఆ చిన్నారికి ఇచ్చి తినిపించి, వెంటనే లయశ్రీని బయటకు తీసుకెళ్లారని, గ్రామ శివారుకు వెళ్లేప్పటికి విషప్రభావంతో చిన్నారి మరణించగా.. కరుణాకర్‌రెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో పడేసి ఇంటికి వచ్చినట్టు తెలిసింది. అనంతరం తమకేమీ తెలియనట్లుగా మిన్నకుండిపోయారు. వీరికి అనిల్ మేనమామ కొడుకు హుస్నాబాద్‌కు చెందిన గడిపె చందుతోపాటు మరొకరు, సుందరగిరికి చెందిన ఇంకొకరు సహకరించినట్లు సమాచారం. ఇంటి వద్దనే ఉండాల్సిన తమ చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల వెదికినా జాడలేకపోవడంతో గురువారం చిగురుమామిడి పోలీస్‌స్టేషన్‌లో అనుమానితులపై ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామంలో విచారించగా అనిల్, రమ కలిసి లయశ్రీని బయటకు తీసుకెళ్లినట్లు... అనంతరం ఇద్దరే తిరిగి వచ్చినట్లు తేలింది. అనిల్, రమ, చందులను అదుపులోకి తీసుకుని విచారించగా లయశ్రీని హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. వ్యవసాయ బావిలో పడేశామని చెప్పడంతో హుస్నాబాద్ సీఐ సదన్‌కుమార్, చిగురుమామిడి ఎస్సై జె.శంకర్రావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బావిలో లయశ్రీ మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో బయటకు తీయించారు. విగతజీవిగా మారిన బిడ్డను చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విచారణ సాగుతోందని, పోస్టుమార్టం నివేదిక వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని సీఐ చెప్పారు. హత్యకు దారితీసిన కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
పోస్ట్‌మార్టంలో ఏముంది
కరీంనగర్ హెల్త్, న్యూస్‌లైన్ : కోరుట్ల ఠాణాలో చనిపోయిన సాన చంద్రయ్యను పోలీసులు చిత్రహింసలు పెట్టిన అనుమానాలు బలపడుతున్నాయి. పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు అతని మృతదేహంపై కమిలిన గాయాలు ఉన్నట్లుగా గుర్తించారు. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ.. చంద్రయ్య శరీరంపై ఉన్న గాయాలకు పొంతన లేదని భావిస్తున్నారు. చంద్రయ్య తల నుదిటి భాగం పగిలి ఉంది. చాలా వరకు నుజ్జునుజ్జు అయింది. ముక్కులోని కండరాలు దెబ్బతిన్నాయి. మెదడుకు సంబంధించిన సన్నని నరాలు తెగిపోయాయి. తల కపాలంలో తీవ్ర రక్తస్రావమైంది. శరీరంలో ఎక్కడ కూడా ఎముకలు విరగలేదు. రెండు కాళ్లకు పిక్కలపై భాగం, తొడ, చేతి భుజాలపై కొట్టినట్లుగా కండరాలు కమిలిపోయి ఉన్నాయి. కమిలిన చోట వాపు వచ్చింది. గాయాలకు సంబంధించిన పూర్తి వివరాల సేకరణకు.. దెబ్బతిన్న భాగాల స్పెసిమెన్స్ను ల్యాబ్‌కు పంపించి నట్లు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారులు తెలిపారు. ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబ్‌కు పంపించామని, రిపోర్టు వచ్చేవరకు 20 రోజులు పడుతుందన్నారు. ప్రాణం లేని వస్తువును విసిరితే ఎలాంటి చర్యలు జరుగుతాయో... చంద్రయ్య మృతదేహం అదేవిధంగా కనిపిస్తున్నట్లు వైద్యనిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. భవనంపై నుంచి దూకినా, ప్రమాదవశాత్తూ కింద పడినా ఎముకలు విరుగుతాయి. కానీ.. శరీరంలో ఏ ఒక్క ఎముక విరుగకపోవటం సందేహానికి తావిస్తోంది. భవనంపై నుండి తనంతట తాను దూకితే ముందుగా కాళ్లు, చేతులు భూమికి తగులుతాయని.. ఈ కేసులో అలా జరుగలేదని నిపుణులు విస్మయం వ్యక్తం చేశారు. -
హత్యా..? ఆత్మహత్యా..?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇది ఆత్మహత్యా లేదా హత్యా అన్న కోణంలో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) అలోక్ శర్మ మంగళవారం పోలీసులను ఆదేశించారు. మోతాదుకు మించి మందులు తీసుకోవడం వల్ల అవి విషపూరితమై సునంద మరణించినట్లు ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన శవ పరీక్షలో తేలిన సంగతి తెలిసిందే. అలాగే ఆమె రెండు చేతులపై 12కు పైగా గాయాలున్నాయని, ఎడమ చెంపపై కమిలిన గాయం ఉందని పోస్ట్‌మార్టం నివేదికలో తెలిపారు. అయితే ఈ గాయాల వల్ల చనిపోయే అవకాశం లేదని వివరించారు. చేతులపై గాయాలున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎస్డీఎం.. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేదా హత్యకు గురైందా అన్న కోణంలో దర్యాప్తు చేయాలని పోలీసులకు సూచించారు. ‘‘ఆమె మరణానికి మూడు కారణాలు ఉండొచ్చు. ఒకటి హత్య.. రెండు ఆత్మహత్య.. మూడోది ప్రమాదవశాత్తూ చనిపోవడం. ఇందులో మరణానికి కచ్చితంగా ఏది కారణమైందో దర్యాప్తు చేయాలి’’ అని ఆయన తన ఆదేశాల్లో పేర్కొన్నారు. -
మోతాదుకు మించిన మందులే కారణం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ మరణానికి మోతాదుకు మించిన మందులే కారణమని శవపరీక్షలో తేలింది. మందులు మోతాదుకు మించినందున అంటే... మందులు విషపూరితం కావడం వల్ల ఆమె మరణించినట్లు శవపరీక్ష నివేదికలో పేర్కొన్నట్లు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) అలోక్ శర్మకు ఎయిమ్స్ వైద్యులు సోమవారం సాయంత్రం శవపరీక్ష నివేదికను సమర్పించారు. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ గదిలో శుక్రవారం సునందా పుష్కర్ అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. - ఈ సంఘటనపై విచారణ చేస్తున్న ఎస్డీఎం అలోక్ శర్మ, శవపరీక్ష నివేదికలోని వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. - మంత్రి థరూర్, సునంద సోదరుడు సహా పలువురి వాంగ్మూలాలు, ఇతర సాక్ష్యాలతో పాటు శవపరీక్ష నివేదికను పరిశీలించనున్నట్లు చెప్పారు. - ఆ తర్వాతే ఒక నిర్ధారణకు వస్తానని, దర్యాప్తు కొనసాగించాలా వద్దా అనే దానిపై పోలీసులకు నివేదిక సమర్పిస్తానని తెలిపారు. - కాగా, ఎస్డీఎం నివేదిక అందిన తర్వాతే తదుపరి చర్యలపై ఒక నిర్ణయానికి రాగలమని పోలీసులు తెలిపారు. - సునందా పుష్కర్ మృతదేహానికి తొలుత డాక్టర్ సుధీర్ కే గుప్తా నేతృత్వంలోని ముగ్గురు వైద్యుల బృందం శనివారం ప్రాథమిక శవపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. - సునంద మరణించిన హోటల్ గదిలో యాంటీ డిప్రెసంట్ ఔషధమైన ఆల్‌ప్రోజాలం మాత్రల ఖాళీ స్ట్రిప్‌లు రెండు పోలీసులకు లభించాయి. - వాటి ఆధారంగా ఆమె కనీసం 27 ట్యాబ్లెట్లు మింగి ఉండవచ్చని, దానివల్లే మరణించి ఉండవచ్చని చెబుతున్నారు. -
వీడని మరణాల మిస్టరీ
న్యూఢిల్లీ: కాకానగర్‌లో శుక్రవారం చోటుచేసుకున్న దంపతుల మరణాల మిస్టరీ ఇంకా వీడలేదు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేగానీ ఏదో ఒక నిర్ణయానికి రాలేమని పోలీసులు చెబుతున్నారు. హత్యా? లేక ఆత్మహత్యా? అనే విషయం తేలాలంటే పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సిందేనంటున్నారు. పౌరసరఫరాల విభాగంలో కాస్ట్ అడ్వయిజర్‌గా పనిచేస్తున్న కె. విజయ్ కుమార్(57), అతని భార్య సీతా(51) మృతదేహాలు కాకానగర్లోని వారి ఇంట్లో శుక్రవారం లభ్యమయ్యాయి. వారి కుమార్తె వరణ్య సాయంత్రం ఇంటికి తిరిగిరావడం, ఎంతకూ తల్లిదండ్రులు ఎంతకూ తలుపులు తెరవకపోవడంతో స్థానికులు వాటిని బద్దలు కొట్టడంతో విషయం బయటపడింది. కుమార్ మెడపై గాయంతో రక్తపుమడుగులో పడి ఉండగా, సీతా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ విషయమై జాయింట్ కమిషనర్ వివేక్ గోగియా మాట్లాడుతూ... ‘భర్తను హత్య చేసి, సీతా ఉరేసుకుందా? లేక ఎవరైనా భర్తను చంపడంతో భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక భర్త కుమార్ ఏదైనా దారుణానికి ఒడిగట్టాడా? వంటి విషయాల్లో ఓ నిర్ణయానికి రావాలంటే పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సి ఉంటుంది. అయితే వారి బంధువులు, స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నాం. హత్య జరిగిన ప్రాంతంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదు. కూతురు వరణ్య స్నేహితులతో కలిసి రాజస్థాన్‌కు వెళ్లిన సమయంలోనే ఈ ఘటన జరిగింది. దీంతో హత్యా? ఆత్మహత్యా? అనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాం. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేగానీ ఏదీ చెప్పలేమ’న్నారు. -
పాముకాటుకు రైతు మృతి
కంగ్టి, న్యూస్‌లైన్ : పాము కాటుకు మండల పరిధిలోని చౌకాన్‌పల్లికి చెందిన రైతు మచ్కూరీ జ్ఞానోభా (47) బుధవారం మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. చౌకాన్‌పల్లికి చెందిన మచ్కూరీ జ్ఞానోభా బుధవారం ఉదయం పశువులకు మేత తెచ్చేందుకు సిద్ధమయ్యాడు. గడ్డి కోసేందుకు అవసరైన కొడవలి, తాడు కోసం ఇంట్లోని ఓ గదిలో చేయి పెట్టాడు. అందులో ఉన్న పాము జ్ఞానోభా చేతికి కాటు వేసింది. దీంతో విషయాన్ని ఇంట్లో చెప్పగా అక్కడే ఉన్న సోదరుడు భార్య అతన్ని కంగ్టి ఆస్పత్రికి తరలించింది. కంగ్టిలో వైద్యులు అందుబాటులో లేక పోవడంతో కర్ణాటకలోని ఔరాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య దొండుబాయి, ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జ్ఞానోభా సోదరుడు వైజ్యనాథ్ ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కమలాకర్ మృతదేహాన్ని పంచనామా జరిపి ఔరాద్ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేయించారు. అనంతరం చౌకన్‌పల్లిలో జ్ఞానోభాకు అంత్యక్రియలు చేశారు. భార్య, పిల్లలు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికులు గూట్లో ఉన్న నాగు పామును బయటకు తీసి చంపేశారు.