వరకట్నం వేధింపులకు వివాహిత బలి
అమ్మా.. లేమ్మా..!
తండ్రి ఎక్కడున్నాడో తెలియుదు. తల్లి అకాల వురణంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. తల్లి మరణించిన విషయం తెలియని చిన్నారులు అవ్మూ లేమ్మా.. అంటూ తల్లి మృతదేహంపై వద్ద విలపించడం చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. ఇక నుంచి పిల్లలకు దిక్కెవరని బంధువులు బోరున విలపించారు.
శ్రీకాళహస్తి: ఎన్ని చట్టాలు చేసినా వరకట్నం వేధింపులు తగ్గడం లేదు. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట వివాహితలు కట్న పిశాచానికి బలి అవుతూనే ఉన్నారు. పోలీసులు నామమాత్రంగా చర్యలు తీసుకుంటుండడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన తిరుపతిలో ఒక వివాహిత వరకట్నం వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనను మరువక ముందే శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్‌టీఆర్ నగర్ కాలనీలో మరో యువతి బలవర్మణానికి పాల్పడింది. డీఎస్పీ వెంకట కిశోర్ కథనం మేరకు... ఎన్‌టీఆర్ నగర్‌కు చెందిన షేక్ చోతి అలియూన్ చిన్ని(24)కి అదే ప్రాంతంలో నివాసముంటున్న తన మేనవూవు కువూరుడు కాలేషాతో 2010లో పెద్దలు పెళ్లి చేశారు. కాలేషా పెరుుంటర్‌గా పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. వీరికి జాన్, బహుఉద్దీన్ పిల్లలు ఉన్నారు.
మూడేళ్ల క్రితం కాలేషా ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. అతని కోసం గాలించినా ఫలితం లేదు. చోతి అప్పటి నుంచి కాలేషా తల్లిదండ్రులు వుహబూబ్ బాష, రమిజాబితోనే ఉంటోంది. ఈ క్రమంలో వారు ఆమెను వూనసికంగా వేధిస్తున్నారు. అంతేగాక అదనపు కట్నం తీసుకురావాలని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారు. భర్త ఆచూకీ తెలియకపోవడం, ఇంట్లో అత్తామామల వేధింపులు ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెందిన చోతి శుక్రవారం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటకిశోర్, సీఐ అక్కడికి చేరుకుని వుృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఏరియూ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.