సిద్దిపేట అర్బన్ : జీవితాంతం తోడుంటానని ఏడడుగులు నడిచి మూడు ముళ్లు వేసిన భర్త భార్య పాలిట యముడయ్యాడు. గుట్టు చప్పుడు కాకుండా భార్యను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడో ప్రబుద్ధుడు. చివరు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హంతకుడైన భర్తను టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సిద్దిపేట మండలం నారాయణరావుపేట గ్రామానికి చెందిన పంది నర్సయ్య కుమార్తె లావణ్యకు సిద్దిపేటలోని బోయిగల్లికి చెందిన పెద్దపల్లి రాంచంద్రంతో 11 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా కొంత కాలంగా లావణ్యను అదనపు కట్నం కోసం భర్త రాంచంద్రం తరచూ వేధింపులకు గురిచేసేవాడు. ఇదే విషయమై పంచాయితీ నిర్వహించిన కుల పెద్దలు ఇరువురికీ నచ్చజెప్పారు. అయితే జూన్ ఒకటో తేదీ తెల్లవారుజామున లావణ్య అలియాస్ వరలక్ష్మి మృతి చెందింది.
మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తమ కూతురును అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు పంది నర్సయ్య, పోచవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోస్టుమార్టం రిపోర్ట్‌లో లావణ్యను గొంతు నులిమి చంపినట్లు వైద్యులు నివేదిక ఇచ్చారు. దీంతో పోలీసులు అనుమానంతో భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో టూటౌన్ సీఐ సైదులు, ఎస్‌ఐ వరప్రసాద్ సిబ్బంది ఉన్నారు.
తాళికట్టిన వాడే కడతేర్చాడు
Published Wed, Oct 8 2014 12:22 AM | Last Updated on Sat, Jul 6 2019 3:56 PM
Advertisement
Advertisement