ఆ పది గంటల్లో ఏం జరిగింది? | What was that for ten hours? | Sakshi
Sakshi News home page

ఆ పది గంటల్లో ఏం జరిగింది?

Published Sun, Oct 12 2014 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

కోరుట్ల: పది నెలల క్రితం కోరుట్ల ఠాణాలో సాన చంద్రయ్య అనుమానస్పద మృతి వ్యవహారం లో పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారింది.

కోరుట్ల:
 పది నెలల క్రితం కోరుట్ల ఠాణాలో సాన చంద్రయ్య అనుమానస్పద మృతి వ్యవహారం లో పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారింది. వారం రోజులుగా చంద్రయ్య మృతి ఉదంతం పై సీఐడీ అధికారులు విచారణ వేగవంతం చేశా రు. ఈక్రమంలో చంద్రయ్య పోస్టుమార్టం నిర్వహించిన కరీంనగర్ ప్రభుత్వ వైద్యులు ఇటీవల పోస్టుమార్టం నివేదిక అందజేసినట్లు సమాచా రం.

ఈ నివేదికలో ఏముందన్న విషయంలో పూర్తిస్థాయి స్పష్టత రాకున్నప్పటికీ.. చంద్రయ్య చనిపోయాడని పోలీసులు చెప్పిన సమయాని కి, వాస్తవంగా చ నిపోయిన సమయానికి మధ్య పదిగంటల తేడా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలి సింది. దీంతో చంద్రయ్య మృతి ఉదంతంలో మానవహక్కుల సంఘం ప్రతినిధులు వ్యక్తం చేసిన అనుమానాలు మరింత బలపడుతున్నా రు.

ఈ అనుమానాలు నిజమైతే.. ఈ సంఘటన కుబాధ్యులైన పోలీసు అధికారుల చుట్టూ ఉచ్చు బిగిసే అకాశముందనే వాదనలు వినవస్తున్నా యి. ధర్మపురి కో-ఆపరేటివ్ బ్యాంకు చోరీ కేసు లో నిందితుడైన సాన చంద్రయ్య జనవరి 19వ తేదీన రాత్రి 9.45 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ పైనుంచి దూకగా తీవ్రగాయ్యాయని పోలీసులు చెప్పారు. వెంటనే చంద్రయ్యను స్థానిక ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లామని, పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించామని చెప్పుకొచ్చారు.

కరీం నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించిన అనంత రం..అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలో చంద్ర య్య చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే పోలీసులు చెప్పిన సమయానికి, పోస్టుమార్టం పరీక్షల అనంతరం వైద్యులు నిర్ధారించి న సమయానికి మధ్య సుమారు పది గంటల తేడా ఉన్నట్లు సమాచారం. అంటే చంద్రయ్య జనవ రి 19న మధ్యాహ్నం 3గంటల సమయంలోనే మృతి చెందాడా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దీనికితోడు చంద్రయ్య మృతదేహంపై కొట్టిన దెబ్బలు ఉన్నట్లు వైద్యులు పోస్టుమార్టం సమయంలో వెల్లడించడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి.దీంతోపాటు పోలీసులు చెబుతున్న సమయానికి.. పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నట్లుగా చెప్పిన సమయానికి మధ్యకాలంలో ఏం జరిగి ఉం టుందన్న విషయంలో మిస్టరీ నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement