
సాక్షి, విశాఖపట్నం: స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. డెలివరీ ఇవ్వడానికి సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్ అపార్ట్‌మెంట్‌లోకి డెలివరీ బాయ్ అనిల్ (22) వెళ్లాడు. డెలివరీ ఇచ్చేటపుడు మర్యాదగా మేడం అని పిలవలేదని ఇంట్లో పని మనిషి చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సెక్యూరిటీ సిబ్బంది బట్టలు విప్పించి దాడి చేసినట్లు సమాచారం. అవమానం తట్టుకోలేక డెలివరీ బాయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. దీంతో అపార్ట్‌మెంట్ వద్ద నగరంలో డెలివరీ బాయ్స్‌గా విధులు నిర్వహిస్తున్న యువకులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment