తాడేపల్లిగూడెం క్రైం, న్యూస్‌లైన్ :
నిజం నిగ్గు తేలింది... 17 నెలలు తర్వాత పోస్టుమార్టం నివేదిక ఆధారంగా వ్యక్తి అనుమానాస్పద మృతిని హత్యకేసుగా నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. తాడేపల్లిగూడెంలో శుక్రవారం కొవ్వూరు డీఎస్పీ వి.రాజుగోపాల్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన సింగిరెడ్డి వెంకటేశ్వరరావు పాత సీసాలు వ్యాపారం చేస్తుంటాడు. 2011, ఆగస్టు 5 తేదీన పాత సీసాలను వ్యాన్‌పై విజయవాడ తీసుకువె ళ్లి వాటిని అక్కడ అమ్మి తిరిగి గ్రామానికి బయల్దేరాడు. మార్గంమధ్యలో అర్ధరాత్రి కావడంతో పెంటపాడు మండలం ప్రత్తిపాడు వై జంక్షన్ దుర్గగుడి వద్ద ఆగి విశ్రాంతి తీసుకున్నాడు.
తెల్లవారుజామున నిద్రలేచి చూసుకునేసరికి అతని జేబులో ఉండాల్సిన రూ.లక్ష నగదులో రూ.72 వేలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. చుట్టుపక్కల వారిని ఆరా తీయగా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రావుపాలెంకు చెందిన దెయ్యూల శ్రీనును రాత్రి వ్యాన్‌కు దగ్గరలో చూశామని, అతనికి దొంగతనం చేసే అలవాటు ఉందని చెప్పారు. దాంతో 6వ తేదీ ఉదయం వ్యాన్ డ్రైవర్ దూనబోయిన రాముతో కలిసి వెంకటేశ్వరరావు దొంగలించిన వ్యక్తిని పట్టుకునేందుకు వెంకట్రావుపాలెం వెళ్లాడు. అతని ఆచూకీ లభించకపోవడంతో ఊరిలో కొందరికి చెప్పి వెనుదిరిగారు. అదేరోజు సాయంత్రం మర లా తిరిగి గ్రామానికి వెళ్లారు. అప్పటికే గ్రామంలో తమ సైకిల్‌ను దొంగలించాడంటూ దెయ్యాల శ్రీనును ముగ్గురు అన్నదమ్ములు దాసరి పాపారాావు, చిన్న వెంకటేశ్వరరావు, పరమకాంతుడు పట్టుకుని కొడుతున్నారు. అనంతరం అక్కడకు చేరుకున్న వ్యాన్ డ్రైవర్ రాము, సింగిరెడ్డి వెంకటేశ్వరరావులకు శ్రీనును అప్పగించారు. అందరూ కలిసి దొంగిలించిన డబ్బు ఎక్కడ పెట్టావం టూ అతనిని నిలదీశారు. ఊరిలో ఇద్దరి వ్యక్తులకు అప్పు తీర్చినట్లు తెలుసుకున్నారు. అనంతరం శ్రీనును ఆటోలో కూర్చొబె ట్టి గూడెం బస్టాండ్ సమీపంలోకి తీసుకువచ్చారు. మరలా అక్కడ కూడా కొట్టడంతో అతను మృతిచెం దాడు. దాంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి పట్టణ పోలీసుస్టేషన్‌లో దెయ్యా ల శ్రీను అతిగా మద్యం తాగి చనిపోయాడని వారే ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి న పోలీసులు సాధారణ మృతిగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చి కేసును పక్కన పెట్టారు. పోస్టుమార్టంఅనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
పాత కేసుల ఫైళ్లు తిరగేస్తుంటే..
ఇటీవల పాత కేసుల ఫైళ్లను తిరగేస్తున్న పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్ మూర్తి దెయ్యూల శ్రీను మృతి కేసుకు సంబంధించి పోస్టుమార్టం నివేదికను క్షుణంగా పరిశీలించారు. మృతుని ఒంటిపై 8 చోట్లు గాయాలు ఉన్నట్లు తెలుసుకున్న సీఐ పట్టణ ఎస్సై కొండలరావుతో కలిసి కేసును ఛేదించారు. జనవరి 28, 2014న తిరిగి హత్యకేసుగా నమోదు చేశారు. మృతుడు శ్రీను ఎస్సీ కులానికి చెందినవాడు కావడంతో ఎస్సీ, ఎస్టీ కేసును కూడా నమోదు చేశారు. కేసులో నిందితులైన పాత సీసాల వ్యాపారి సింగిరెడ్డి వెంకటేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మల్లాయి పాలెంకు చెందిన వ్యాన్ డ్రైవర్ దూనబోయిన రాము, తాడేపల్లిగూడెం మండలం వెంకట్రావు పాలెంకు చెందిన దాసరి పాపారావు, చిన్న వెంకటేశ్వరరావు, పరమకాంతులను కొవ్వూరు డీఎస్పీ వి.రాజగోపాల్ శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరపర్చారు. కేసులో కీలకపాత్ర వహించిన సీఐ మూర్తి, ఎస్సై కొండలరావును డీఎస్పీ అభినందించారు.
ఔను.. అతడిని హతమార్చారు
Published Sat, Feb 8 2014 2:36 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement