
‘బుల్లితెర నటి దీప్తిది ఆత్మహత్యే’
హైదరాబాద్: బుల్లితెర నటి దీప్తి అలియాస్ రామలక్ష్మిది ఆత్మహత్యగా తేలింది. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసిన గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆమెది ఆత్మహత్యేనని ప్రాథమికంగా తేల్చినట్లు సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. హైదరాబాద్ ఫతేనగర్‌లోని ఠాకూర్ ఆర్‌డీ కాంప్లెక్స్‌లోని తన ప్లాట్‌లో దీప్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
అయితే పోస్టుమార్టం నివేదికలో ఆమె ఉరివేసుకొని చనిపోయినట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. వారం రోజుల కిందట దీప్తి ఫోన్ చేసి తాను ఇక్కడ ఉండలేకపోతున్నానని, ఇంటికి వచ్చేస్తానంటూ తమతో చెప్పిందని దీప్తి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.
కాగా, దీప్తి చనిపోయే ముందు వరకు లాప్‌టాప్ ఉపయోగించినట్లు తెలిసింది. దానికి పాస్‌వర్డ్ ఉండటంతో పోలీసులు ఓపెన్ చేయలేకపోయారు. లాప్‌టాప్ ద్వారా దీప్తికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.